ఇంటర్నెట్ వినియోగదారులకు శుభవార్త. త్వరలో దేశంలో శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే ప్రపంచంలోని పలు దేశాల్లో శాటిలైట్ ఇంటర్నెట్‌ను అందించే ఎలాన్ మస్క్ సంస్థ స్టార్‌లింక్‌కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే అందుకు సంబంధించిన అనుమతులపై కేంద్ర విభాగానికి చెందిన డిపార్ట్‌మెంట్ పర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (డీపీఐఐటీ) సంతృప్తిని వ్యక్తం చేసినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి.
శాటిలైట్ ఇంటర్నెట్‌ను అందించే విషయంలో స్టార్‌లింక్‌తో పాటు భారత్‌కు చెందిన రిలయన్స్ స్టార్‌లింక్ జియో శాటిలైట్ కమ్యూనికేషన్స్, ఎయిర్‌టెల్ వన్‌వెబ్‌లు అనుమతి కోసం కేంద్రానికి ధరఖాస్తు చేసుకున్నాయి. ఇక తాజాగా స్టార్‌లింక్‌కు డీపీఐఐటీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (DoT) స్టార్‌లింక్‌కి లెటర్ ఆఫ్ ఇంటెంట్ (LoI) జారీ చేయవచ్చని సంబంధిత వర్గాలు అభిపప్రాయం వ్యక్తం చేశాయి. అయితే దీనిపై ఎలాన్ మస్క్ స్పష్టత ఇవ్వాల్సి ఉంది.
టెలికాం సెక్రటరీ నీరజ్ మిట్టల్, కమ్యూనికేషన్ శాఖ మంత్రి అశ్వని వైష్ణవ్ ఆమోదం కోసం డాట్ ఒక నోట్‌ను సిద్ధం చేస్తుంది.వారి ఆమోదం పొందిన తర్వాత, డిపార్ట్‌మెంట్‌లోని శాటిలైట్ కమ్యూనికేషన్స్ వింగ్ (SCW) అధికారికంగా స్టార్‌లింక్‌కి అవసరమైన అనుమతులను మంజూరు చేస్తుంది. దీంతో స్టార్‌లింక్ భారత్‌లో తన సేవల్ని వినియోగదారులకు అందించేందుకు దోహదం చేస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment