ప్రపంచ కుబేరుల్లో అగ్రస్థానంలో ఉన్న ఎలాన్ మస్క్ ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉందా? ‘అవును. మస్క్ ప్రాణాలు ప్రమాదం ఉంద’ని ఆయన తండ్రి ఎర్రోల్ మస్క్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ది న్యూ యార్కర్ అనే మీడియా సంస్థ ‘ఎలాన్ మస్క్ షాడో రూల్’ పేరిట పత్రికా కథనాన్ని ప్రచురించింది. ఆ కథనంలో స్పేస్, ఉక్రెయిన్, సోషల్ మీడియా, ఎలక్ట్రిక్ వెహికల్స్‌తో సహా వివిధ రంగాల్లో ప్రభుత్వ నిర్ణయాలపై ఎలాన్ మస్క్ ప్రభావం వంటి అంశాలను ప్రస్తావించింది.
చదవండి👉 ఎలాన్ మస్క్‌కు భారీ ఝలక్!
ఉక్రెయిన్ - రష్యా ఘర్షణలో స్పేస్ ఎక్స్‌కు చెందిన స్టార్ లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ ఉక్రెయిన్‌లో ఎలా ఉపయోగపడిందో నొక్కి చెప్పింది. అంతేకాదు, ట్విటర్‌ను కొనుగోలు చేసిన తర్వాత మస్క్ అంతర్జాతీయ సంబంధాలపై అధ్యక్షుడు జో బైడెన్ చేసిన కీలక వ్యాఖ్యల్ని గుర్తు చేసింది. జాతీయ భద్రత కోణంలో మస్క్ సంబంధాలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. ఆ అంశాలపై అమెరికన్ మీడియా శీర్షికలో హైలెట్ చేసింది.
ఆ వార్తలపై ఎర్రోల్ మస్క్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎలాన్ మస్క్ షాడో రూల్ కథనాన్ని‘హిట్ జాబ్’ గా అభివర్ణించారు. మస్క్‌ను బలహీనపరిచే ‘షాడో గవర్నమెంట్’ ఇలాంటి కథనాలకు మద్దతు ఇస్తుందని ఆరోపించారు. దాడికి ముందు శత్రువు బలాల్ని నిర్విర్యం చేసేలా ప్రజల్ని ఉసిగొల్పిన చరిత్రను గుర్తు చేశారు. అదే తరహాలో మస్క్‌ను సైతం దెబ్బగొట్టే ప్రయత్నమే జరుగుతుందని పేర్కొన్నారు.
♦‘షాడో ప్రభుత్వం’ ఎలాన్ మస్క్‌ను చంపేందుకు ప్రయత్నిస్తుందని మీరు భావిస్తున్నారా? అని మీడియా ప్రతినిధులు ఆయనను ప్రశ్నించినప్పుడు ‘అవును’ అని బదులిచ్చారు.
♦ 44 బిలియన్ డాలర్లకు ట్విటర్‌ను కొనుగోలు చేసినప్పుడు మస్క్ తీవ్ర విమర్శలు ఎదురయ్యాయి. మస్క్ తీరు విద్వేషపూరిత ప్రసంగాలు, తప్పుడు సమాచారం పెంచేలా ఉన్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తాయి.
♦రష్యా అంతరిక్ష సంస్థ రోస్కోస్మోస్ చీఫ్ దిమిత్రి రోగోజిన్ గత ఏడాది మేలో ఉక్రెయిన్‌లో స్టార్‌లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ సేవల్ని అందించడంపై పరోక్షంగా బెదిరింపులకు పాల్పడ్డారు. స్టార్‌లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ సేవల సరఫరాకు సంబంధించి పరోక్షంగా బెదిరింపులు చేశారు.
♦అదే సమయంలో 'నేను అనుమానాస్పద పరిస్థితుల్లో చనిపోతే.. మీ అందరితో పరిచయం అయినందుకు సంతోషం అంటూ మస్క్ ట్వీట్ చేశారు.
♦ఎక్స్. కామ్‌లో విధులు నిర్వహిచే సమయంలో ఆయన నిఘూ నీడలో గడుపుతున్నారంటూ సంస్థ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేశారు. కంపెనీలో తొలగింపులు, మార్పుల తర్వాత భద్రతను నిర్వహించడం మరింత సవాలుగా మారింది.
ఇలా ఎలాన్ మస్క్ విషయంలో జరుగుతున్న ప్రతి అంశాన్ని ఎర్రోల్ మస్క్ ప్రస్తావిస్తూ తన కుమారుడు ఎలాన్ మస్క్‌కు ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉందని అంటున్నారు. మరి తండ్రంటే ఆమడ దూరం జరిగే ఎలాన్ మస్క్ తాజాగా వ్యాఖ్యాలపై ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాల్సి ఉంది.
చదవండి👉🏻 ఎలాన్ మస్క్ సంచలన నిర్ణయం!
Comments
Please login to add a commentAdd a comment