ఇజ్రాయెల్ దాడి కారణంగా అన్ని కమ్యూనికేషన్‌లు ఆగిపోయి యుద్ధంలో దెబ్బతిన్న గాజాకు బిలియనీర్ వ్యాపారవేత్త ఎలాన్ మస్క్ (elon musk) మద్దతుగా నిలిచారు. గాజాకు ఇంటర్నెట్ సపోర్ట్ అందించనున్నట్లు ప్రకటించారు.
హమాస్ నేతృత్వంలో ఉన్న గాజాను ఇజ్రాయెల్ బలగాలు పూర్తిగా చుట్టుముట్టేశాయి. అన్ని వైపుల నుంచి దాడులు ముమ్మరం చేశాయి. దీంతో ఆ ప్రాంతంలో కమ్యూకేషన్ పూర్తిగా స్తంభించింది. ఈ క్రమంలో ఎలాన్ మస్క్ కీలక ప్రకటన చేశారు. గాజాలోని యూఎన్, ఇతర అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన సహాయ సమూహాలకు కనెక్టివిటీని పునరుద్ధరించడంలో తన ‘స్టార్‌లింక్’ (starlink) సహాయపడుతుందని ‘ఎక్స్’ (ట్విటర్) ద్వారా ప్రకటించారు.
ఈ నేపథ్యంలో మస్క్ నేతృత్వంలోని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’ (ట్విటర్)లో #StarlinkForGaza అనే హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. స్పేస్‌ఎక్స్ (SpaceX) నిర్వహిస్తున్న కృత్రిమ ఉపగ్రహాల సముదాయాన్ని స్టార్‌లింక్ కలిగి ఉంది. ఇది మారుమూల ప్రాంతాలకు సైతం కనెక్టివిటీని అందించగలదు.
అక్టోబర్‌లో వెలువడిన బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం.. ఇజ్రాయెల్ యుద్ధకాల కమ్యూనికేషన్‌లను పెంచే ప్రయత్నంలో స్పేస్‌ఎక్స్‌తో చర్చలు కూడా ప్రారంభించింది. ఈ నెట్‌వర్క్ ఫ్రంట్‌లైన్‌లకు సమీపంలో ఉన్న ఇజ్రాయెల్ పట్టణాలకు నిరంతర ఇంటర్నెట్ సేవను కలిగి ఉండటానికి అనుమతిస్తుందని కమ్యూనికేషన్స్ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇజ్రాయెల్ ప్రతినిధిని ఉటంకిస్తూ, గాజాలో అన్ని ఇంటర్నెట్, ఫోన్ సేవలను ఇజ్రాయెల్ స్తంభింపజేసే అవకాశం ఉందని నివేదిక పేర్కొంది.
గాజాలో ప్రస్తుతం కమ్యూనికేషన్ పూర్తిగా స్తంభించింది. ఇంటర్నెట్, ఫోన్ సేవలు రోజంతా నిలిచిపోయాయి. ఇజ్రాయెల్ కమ్యూనికేషన్లను తొలగించిదని పాలస్తీనా రెడ్ క్రెసెంట్ తెలిపింది.
Starlink will support connectivity to internationally recognized aid organizations in Gaza.
— Elon Musk (@elonmusk) October 28, 2023
[ComStar]
Comments
Please login to add a commentAdd a comment