
స్టార్‌లింక్ శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ సేవలను భారత్ ప్రవేశపెట్టాలనే ఎలన్‌మస్క్ ప్రయత్నాలకు కేంద్ర ప్రభుత్వం అడ్డుపడింది. దీంతో స్టార్‌లింక్ సేవలు పూర్గిగా నిలిచిపోయాయి. ఇక స్టార్‌లింక్ శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ సేవలకు పోటీగా ప్రముఖ టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్ శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ సేవల విషయంలో దూకుడును ప్రదర్శిస్తోంది.
34 ఉపగ్రహాల ప్రయోగం విజయవంతం..!
భారతీ ఎయిర్‌టెల్‌కు చెందిన వన్‌వెబ్ ఫ్రెంచ్ గయానాలోని కౌర్ స్పేస్ సెంటర్ నుంచి ఏరియన్‌స్పేస్ రాకెట్ సహాయంతో 34 ఉపగ్రహాలను విజయవంతంగా ప్రయోగించినట్లు వన్‌వెబ్ శుక్రవారం ధృవీకరించింది. 2022లో కంపెనీ ప్రారంభించిన తొలి ప్రయోగం ఇది. ఇది 13 వ ప్రయోగం. వన్‌వెబ్ ఇప్పటివరకు 428 శాటిలైట్లను ప్రయోగించింది. శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ ప్రయోగంలో ఇప్పటివరకు 66 శాతం ఉపగ్రహాలను వన్ వెబ్ విజయవంతంగా పూర్తి చేసింది.
మరింత వేగంగా..!
వన్ వెబ్ శాటిలైట్ బ్రాడ్ బ్యాండ్ విషయంలో దూకుడును ప్రదర్శిస్తోంది. స్టార్‌లింక్ సేవలకు పోటీగా శాటిలైట్ బ్రాడ్ బ్యాండ్ సేవల ప్రయోగాలను ముమ్మురం చేసింది. కంపెనీకి భారతీ ఎయిర్‌టెల్ తోడవడంతో మరింత వేగంగా శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ సేవలను తెచ్చేందుకు సిద్దమైంది వన్ వెబ్. ఇటీవల హ్యూస్ నెట్‌వర్క్ సిస్టమ్స్, మార్లింక్ అండ్ ఫీల్డ్ సొల్యూషన్స్ హోల్డింగ్స్‌తో సహా పలు కంపెనీలతో వన్ వెబ్ గత నెలలో కీలక భాగస్వామ్య ఒప్పందాలపై సంతకం చేసింది.
చదవండి: గూగుల్ అనూహ్య నిర్ణయం..! ఆ సేవలు పూర్తిగా షట్‌డౌన్..!
Comments
Please login to add a commentAdd a comment