
స్పేస్ ఎక్స్ అధినేత ఎలన్ మస్క్ శాటిలైట్ ఇంటర్నెట్ సేవల విషయంలో మరో అడుగు ముందుకు వేశారు. స్టార్ లింక్ శాటిలైట్ సేవల్ని అందిస్తున్న మస్క్ ఇకపై అమెరికాకు చెందిన మొబైల్ యూజర్లకు శాటిలైట్ సాయంతో నేరుగా హై స్పీడ్ ఇంటర్నెట్‌ను వాడుకలోకి తేనున్నారు.
మస్క్ ప్రపంచవ్యాప్తంగా 2,600కు పైగా స్టార్ లింక్ శాటిలైట్ల సాయంతో శాటిలైట్ ఇంటర్నెట్‌ను అందిస్తున్నారు. ఇప్పుడు మొబైల్స్‌లో సైతం శాటిలైట్ ఇంటర్నెట్‌ను అందించనున్నారు.మొబైల్ యూజర్లకు శాటిలైట్ సర్వీస్ అందిస్తామని, ఇందుకోసం 2జీహెచ్‌జెడ్ స్పెక్ట్రమ్‌ను ఉపయోగించేలా అనుమతి ఇవ్వాలని కోరుతూ యూఎస్ ఫెడరల్ కమ్యూనికేషన్స్ కమీషన్ (ఎఫ్‌సీసీ)కి దరఖాస్తు చేసుకున్నారు.
తాజాగా ఎఫ్‌సీసీకి తమ సంస్థ మొబైల్ శాటిలైట్ సర్వీస్ ను సులభతరం చేయడానికి 2జీహెచ్‌జెడ్ రేడియో బ్యాండ్‌ని ఉపయోగించగల సామర్థ్యం ఉన్న స్టార్‌లింక్ ఉపగ్రహాలకు "మాడ్యులర్ పేలోడ్"ని జోడించేందుకు , ఉపయోగించేందుకు అనుమతిని కోరినట్ల స్పేస్ ఎక్స్ పేర్కొంది. తద్వారా అమెరికన్లు ఎప్పుడు, ఎక్కడ కావాలంటే అక్కడ హై స్పీడ్ ఇంటర్నెట్‌ను వినియోగించుకోవచ్చు' అని స్పేస్ ఎక్స్ తన ఎఫ్‌సీసీ ఫైలింగ్‌లో నివేదించింది.
Comments
Please login to add a commentAdd a comment