Satellite Broadband Service Could: భారత్ కార్ల మార్కెట్ పై కన్నేసిన టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ ‘స్టార్ లింక్’ శాటిలైట్ ఇంటర్నెట్ సేవల్ని భారత్‌కు విస్తరించే ప్రయత్నాలు మొదలుపెట్టాడు. ఇందుకోసం Department of Telecommunications అనుమతి కోసం ప్రయత్నిస్తున్నట్లు ఆయన ట్విటర్ ద్వారా వెల్లడించారు.
ట్విటర్ ఇంటరాక్షన్‌లో భాగంగా ఓ వ్యక్తి అడిగిన ప్రశ్నకు.. స్టార్ లింక్ సేవలు భారత్‌కు విస్తరిస్తామని సమాధానం వచ్చింది మస్క్ నుంచి. అదే జరిగితే భారత్‌లో ఇంటర్ నెట్‌కు వినియోగించే సెల్‌ఫోన్ టవర్లు, కేబుళ్లతో పాటు శాటిలైట్ ఇంటర్‌నెట్ వినియోగదారులకు అందనుంది. ఇందుకోసం ఇంటిమీద చిన్న యాంటెన్నాతో ఇంటర్‌నెట్‌ను వినియోగించుకోవచ్చు.
చదవండి: థర్మామీటర్ గడియారాలొస్తున్నాయ్!
Just figuring out the regulatory approval process
— Elon Musk (@elonmusk) August 31, 2021
స్పేస్‌ఎక్స్ యజమాని ఎలన్ మస్క్ శాటిలైట్ ఇంటర్‌నెట్ సేవల కోసం ‘స్టార్ లింక్’ పేరుతో ప్రాజెక్ట్ ప్రారంభించారు. ప్రాజెక్ట్ లో భాగంగా 2027 నాటికల్లా 4,425 శాటిలైట్లను అంతరిక్షంలోకి పంపాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటికే 1,800కుపైగా శాటిలైట్లను పంపారు. వాటి సాయంతో అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిల్యాండ్, యూరప్‌లోని 14 దేశాల్లో వంద డాలర్ల ప్రీ-ఆర్డర్ బుకింగ్(రిఫండబుల్) శాటిలైట్ సేవల్ని అందిస్తున్నారు. ఒకవేళ సిగ్నల్ వ్యవస్థ గనుక పని చేయకపోతే ఆ డబ్బును తిరిగి ఇచ్చేస్తారు. స్టార్‌లింక్స్‌తో పాటు ఎకోస్టార్, లియోశాట్, ఓ3బీ, టెలీస్టాట్, అప్‌స్టార్ట్ తో పాటు వర్జిన్ గెలాక్టిక్ ‘వన్‌వెబ్’ పేరుతో శాటిలైట్ ఇంటర్నెట్ సేవల్ని అందిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment