Broadband Services
-
ఎట్టకేలకు కాసింత స్వేచ్ఛ!
ఒకటి కాదు... రెండు కాదు... 143 రోజుల తర్వాత మోక్షం లభించింది. కల్లోలిత మణిపుర్‌లోని బీరేన్‌సింగ్ సర్కార్ ఎట్టకేలకు శనివారం నుంచి మొబైల్ ఇంటర్నెట్ సేవలను పునరుద్ధరించింది. అపరిమిత ఆలస్యం తరువాౖత అయితేనేం, పాలకులు ఇన్నాళ్ళకు ఒక అడుగు ముందుకు వేసినట్ట యింది. రాష్ట్రంలో సాధారణ స్థితి నెలకొల్పేందుకు తీసుకున్న చర్యగా ఇంటర్నెట్ సేవల పునరుద్ధరణ నిర్ణయం హర్షించదగ్గ విషయం. మే 3న రెండు ప్రధాన వర్గాల మధ్య ఘర్షణలు మొదలైనప్పుడే నెట్ సేవలపై రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ నిషేధం విధించింది. ఆ తరువాత జూన్ 25న బ్రాడ్‌బ్యాండ్ సేవలను అనేక షరతులతో పాక్షికంగా పునరుద్ధరించినా, మొబైల్లో నెట్‌పై ఇప్పటి దాకా నిషేధం కొనసాగింది. నూటికి 95 మంది మొబైల్‌తోనే నెట్ సేవలందుకొనే మన దేశంలో ఇప్పుడీ ఎత్తివేత నిర్ణయం మణిపుర్లో అందరికీ సాంత్వన. కుంటుపడ్డ ఆర్థిక వ్యవస్థకూ, జీవనోపాధికీ పెద్ద ఊపిరి. ‘‘రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి మెరుగైనందు వల్ల’’ ఇప్పుడు మొబైల్ నెట్ సేవల పునరుద్ధరణ నిర్ణయం తీసుకున్నామన్నది సర్కారు వారి మాట. మణిపుర్లో పరిస్థితిపై ప్రభుత్వ కథనంలో నిజానిజాలు ఎంత అన్నది చర్చనీయాంశమే. అయితే, నిర్ణయం ఎందుకు తీసుకున్న ప్పటికీ... జనజీవితాన్ని ప్రభావితం చేస్తూ, అసత్యాల వ్యాప్తికి కారణమవుతున్న నిషేధాన్ని ఎత్తి వేయడం కచ్చితంగా సమంజసం. అందులో మరో మాట లేదు. మణిపుర్లో పర్యటించిన ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా బృందం సైతం ఇంటర్నెట్ సేవల నిషేధం చెడు చేసిందని పేర్కొన్న సంగతి మర్చిపోలేం. ఇంటర్నెట్ లేక, నిజనిర్ధారణకు వీలు లేక మీడియా చివరకు ప్రభుత్వపు గూటి చిలకగా మారి, ఆ గూటి పలుకులే పలికే దుఃస్థితి తలెత్తిందని విమర్శలు వచ్చాయి. సత్యనిష్ఠ గల మీడియా లేకపోవడంతో, అదే సందుగా పుకార్లు షికార్లు చేశాయి. విద్వేషవ్యాప్తితో అగ్నికి ఆజ్యం పోశాయి. అలాంటి ఓ పుకారే చివరకు ఇద్దరు మహిళల్ని నగ్నంగా ఊరేగించిన హేయమైన ఘటనకు దారి తీసిందని ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే మణిపుర్ ఘర్షణల్లో 175 మందికి పైగా బలి కాగా, 60 వేల మంది నిరాశ్రయులయ్యారు. జీవితాలు చెల్లాచెదరయ్యాయి. పరిస్థితిని అదుపు చేయడంలో కేంద్ర, రాష్ట్ర పాలకులు కాల యాపన చేశాయి. ఫేక్ న్యూస్ ఆపుతామంటూ పెట్టిన నెట్ నిషేధం అసలు న్యూస్ ఏమిటో ప్రపంచానికి అందకుండా చేసింది. అసలు సమస్య ఎక్కడుందో ముందే కనిపెట్టి, బలగాలు త్వరితగతిన చర్యలు చేపట్టే అవకాశాన్ని చేజార్చుకుంది. ఇవాళ ప్రజలు పూర్తిగా రెండు శిబిరాలుగా చీలిపోయే పరిస్థితిని కొనితెచ్చింది. గతంలో కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత దాదాపు రెండేళ్ళ పాటు ఇంట ర్నెట్పై నిషేధం నడిచింది. ఆ తర్వాత మళ్ళీ ఇలా దాదాపు 5 నెలల దీర్ఘకాలం నెట్ సేవలపై కట్టడి కొనసాగింది మణిపుర్‌లోనే! గత అయిదేళ్ళలో ప్రపంచంలో మరే దేశమూ చేయనన్నిసార్లు భారత్ నెట్‌పై కట్టడి పెట్టింది. ఒక్క 2022లోనే 84 సార్లు నెట్ షట్డౌన్లు సాగాయి. ఏ కొద్ది నిరసన తలెత్తినా అణచివేసేందుకు నెట్ నిలిపివేత కొత్త రాజకీయ నియంత్రణ సాధనంగా మారడం విషాదం. రష్యా, సూడాన్, ఇరాన్, మయన్మార్, ఇథియోపియా సహా నిరంకుశ పాలన సాగే అనేక దేశాల్లో కన్నా మన ప్రజాస్వామ్య భారతంలోనే ఇంటర్నెట్ సేవల్ని తరచూ ఆపేయడం విడ్డూరం. నిజానికి, ఇంటర్నెట్ సేవలను నిరవధికంగా సస్పెండ్ చేయడం చట్టవిరుద్ధమని ‘అనురాధా భాసిన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా’ (2020) కేసులో సుప్రీమ్ కోర్ట్ స్పష్టం చేసింది. వాక్ స్వాతంత్య్రం,ఇంటర్నెట్ను ఉపయోగించి వాణిజ్య కార్యకలాపాలు నిర్వహించే స్వేచ్ఛ అనేవి ప్రాథమిక హక్కులనీ, నెట్‌పై నిషేధం వాటికి భంగం కలిగించడమేననీ కోర్ట్ అప్పుడే తేల్చింది. అత్యవసరమై నిషేధం పెట్టినా దాన్ని పొడిగిస్తూ పోరాదనీ చెప్పింది. ప్రభుత్వాలు ఆ స్ఫూర్తిని అర్థం చేసుకోవట్లేదు. శాంతి భద్రతల పరిరక్షణకు చర్యలు తీసుకోవడం మానేసి, దానికి ప్రత్యామ్నాయం నెట్‌పై నిషేధమే అన్నట్టు ప్రవర్తిస్తున్నాయి. ఇది పరిష్కారం కాదని సుప్రీమ్ తప్పుబట్టింది. కానీ, ఇప్పటి దాకా మణిపుర్ సర్కార్ చేసింది అదే. తాజాగా ఈ మార్చిలో పంజాబ్‌లో వేర్పాటువాద నేత పరారీ, జూలైలో హర్యానాలో మతఘర్షణల సమయంలో ఇతర ప్రభుత్వాలూ ఆ పనే చేశాయి. మణిపుర్లో మైతేయ్‌లకూ, కుకీలకూ మధ్య పేరుకున్న విద్వేషాన్ని పోగొట్టాలంటే పాలకులు చేయాల్సిన పని వేరు. ముందు సమన్యాయం పాటించాలి. అందరితోనూ సుహృద్భావ పూర్వక చర్చలు జరపాలి. తీవ్రవాద వర్గాన్ని ఏకాకిని చేయాలి. సమాజంలో సహనం, శాంతి, పరస్పర విశ్వాసం నెలకొనేలా ఒక్కొక్క అడుగూ వేయాలి. కానీ, ఒక వర్గానికే కొమ్ము కాస్తూ, సొంత సహచరుల నమ్మకమే కోల్పోయిన పాలకుడికి అది కష్టమే! ఇప్పటికీ మణిపుర్ సాధారణ స్థితికి రాలేదని వార్త. కానీ, అందుకు నెట్‌పై విరుచుకుపడడం సరికాదు. ఆ వివేకం ఇన్నాళ్ళకు మన పాలకులలో మేలుకొన్నట్టుంది. ‘డిజిటల్ ఇండియా’ స్వప్నంతో, నెలకు వెయ్యి కోట్ల సంఖ్యలో డిజిటల్ చెల్లింపులతో రొమ్ము విరుచుకుంటున్న దేశం తరచూ నెట్ ఆపేస్తే, అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో అది చెల్లదు. నెట్ నిషేధంతో మణిపుర్ 60 లక్షల డాలర్లు, దేశవ్యాప్తంగా 400 కోట్ల డాలర్లు నష్టం వచ్చిందని అంచనా. బ్రిటీషు కాలపు టెలిగ్రాఫ్ చట్టం–1885ను అడ్డం పెట్టుకొని కోర్టులకు చిక్కకుండా యథేచ్ఛగా నెట్‌పై నిషేధం పెట్టడం పాలకులకు శోభనివ్వదు. మణిపూర్ ఉదంతంతోనైనా మన ప్రభుత్వాలు పాఠాలు నేర్చుకొని, తీరు మార్చుకుంటే మనుషులకూ, మానవ హక్కులకూ మేలు. -
ఎయిర్టెల్ కొత్త బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్స్: అదిరే ఆఫర్
సాక్షి, ముంబై: ప్రముఖ టెలికాం సంస్థ భారతి ఎయిర్టెల్ మూడు కొత్త ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్లను ప్రకటించింది. ఎయిర్టెల్ రూ. 1599, రూ. 1,099, రూ. 699 ల విలువ చేసే బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్లను ప్రకటించింది. ఈ ప్లాన్లలో ఎయిర్టెల్ 4కే ఎక్స్‌స్ట్రీమ్ బాక్స్‌తో అపరిమిత డేటా, 350కి పైగా ఛానెళ్లను ఉచితంగా వీక్షించవచ్చు. అంతేకాదు 17 ప్రీమియం ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌తో మూడు ప్లాన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ప్లాన్లను సబ్‌స్క్రైప్ చేసుకోవాలనే వినియోగదారులు ఎయిర్టెల్ అధికారిక వెబ్సైట్లో వివరాలను చూడొచ్చు. ఎయిర్టెల్ రూ. 1,599 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ ఎయిర్టెల్ తాజా రూ. 1,599 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ ఇప్పటికే ఉన్న రూ. 1,498 ప్లాన్‌లాంటిదే. కానీ, 4కే ఎక్స్‌స్ట్రీమ్ బాక్స్‌తో 350కి పైగా ఛానెళ్లకు యాక్సెస్ లభిస్తుంది. అయితే దీని కోసం రూ. 2,000 చెల్లించాల్సి ఉంటుంది.ఇది వన్-టైమ్ ఛార్జ్. ఈ సెటప్ బాక్స్‌తో, వినియోగదారులు కేబుల్ టీవీతో పాటు ఓటీటీ కంటెంట్‌ను ఎంజాయ్ చేయొచ్చు. ఇందుల 300ఎంబీపీఎస్, ఇంటర్నెట్ వేగం, నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ , డిస్నీ+ హాట్‌స్టార్ లాంటి టాప్ ఓటీటీలు ఉచితం. అంతేకాదు ఈ ప్లాన్‌లో SonyLIV, ErosNow, Lionsgate Play, Hoichoi, ManoramaMax, Shemaroo, Ultra, HungamaPlay, EPICon, DivoTV, Klikk, Nammaflix, Dollywood, Shorts TVలాంటి 17 ఓటీటీలు ఉచితం. నెలకు 3.3టీబీ డేటా వాడుకోవచ్చు. రూ. 1099 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ ఇందులో నెలకు 200ఎంబీపీఎస్ వేగంతో 3.3 టీబీ డేటా లభ్యం. ఇందులోనూ అన్ని ఓటీటీలు ఉచితం. ఇక ఎయిర్టెల్ ఎక్స్‌స్ట్రీమ్ బాక్స్ ఆఫర్లో 350కి పైగా ఛానెల్స్ కూడా ఉచితం. రూ. 699 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ సరసమైన ఈ ప్లాన్‌లో 40ఎంబీపీఎస్ వేగంతో నెలకు 3.3టీబీ డేటా అందిస్తుంది. అయితే నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో మినహా పైన పేర్కొన్న అన్ని ఓటీటీలకు, టీవీ చానెల్స్‌కు యాక్సెస్ ఉంటుంది -
బీఎస్‌ఎన్‌ఎన్‌లో ఆ సంస్థ పూర్తిగా విలీనం..! మలుపు తిప్పే అవకాశం..!
ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్(బీఎస్ఎన్ఎల్)లో మరో ప్రభుత్వ రంగ సంస్థ భారత్ బ్రాడ్‌బ్యాండ్ నిగమ్ లిమిటెడ్(బీబీఎన్ఎల్)ను పూర్తిగా వీలినం చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఈ నెలలో వీలిన ప్రక్రియ పూర్తిగా ముగుస్తోందని సంబంధిత అధికారులు వెల్లడించారు. ఆల్ ఇండియా గ్రాడ్యుయేట్ ఇంజనీర్స్ అండ్ టెలికాం ఆఫీసర్స్ అసోసియేషన్ ఇటీవల నిర్వహించిన కార్యక్రమంలో బీఎస్ఎన్ఎల్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ పీకే పుర్వార్ మాట్లాడుతూ...బీబీఎన్ఎల్ వీలిన ప్రక్రియతో బీఎస్ఎన్ఎల్ను ఒక మలుపు తిప్పే అవకాశాన్ని కల్పిస్తోందని అన్నారు. బీబీఎన్ఎల్ పూర్తి బాధ్యతలు బీఎస్ఎన్ఎల్ పరిధిలోకి వస్తాయని తెలిపారు. ప్రైవేట్‌కు ధీటుగా..! ఇప్పటికే పలు దిగ్గజ ప్రైవేట్ టెలికాం సంస్థలు మొబైల్ నెట్‌వర్క్‌తో పాటుగా బ్రాడ్ బ్యాండ్ సేవలను అందిస్తున్నాయి. బీబీఎన్ఎల్ వీలిన ప్రక్రియతో బ్రాడ్‌బ్యాండ్ సెగ్మెంట్లో బీఎస్ఎన్ఎల్కు భారీగా లబ్థి చేకూరే అవకాశం ఉంది. బీఎస్ఎన్ఎల్ ఇప్పటికే 6.8 లక్షల కిలోమీటర్ల ఆప్టికల్ ఫైబర్ కేబుల్ (OFC) నెట్‌వర్క్‌ను కలిగి ఉంది. భారత్ నెట్ ప్రాజెక్ట్..! బ్రాడ్‌బ్యాండ్ సేవలను అందించేందుకు కేంద్ర ప్రభుత్వం భారత్‌నెట్ ప్రాజెక్ట్‌ను తెరపైకి తెచ్చింది. 2021 జూలైలో దేశ వ్యాప్తంగా 6 లక్షల గ్రామాలకు ఆప్టిక్ ఫైబర్‌తో అనుసంధానం చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ ప్రాజెక్ట్ అమలు బాధ్యతను పూర్తిగా బీబీఎన్ఎల్ చూసుకునేది. అందుకోసం సుమారు రూ. 24 వేల కోట్లను వెచ్చించారు. దేశంలోని 2.5 లక్షల గ్రామ పంచాయతీల్లో 1.71 లక్షల గ్రామ పంచాయతీలను భారత్ నెట్ ప్రాజెక్ట్ కింద అనుసంధానం చేశారు. చదవండి: క్రిప్టోకరెన్సీలపై కేంద్రం కీలక నిర్ణయం..! వాటి పరిధిలోకి -
బీఎస్ఎన్ఎల్ను దాటిన జియోఫైబర్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఫిక్స్డ్ లైన్ బ్రాడ్‌బ్యాండ్ సేవల రంగంలో ప్రభుత్వ రంగ బీఎస్ఎన్ఎల్ను వెనక్కి నెట్టి రిలయన్స్ జియో తొలి స్థానాన్ని కైవసం చేసుకుంది. వాణిజ్య పరంగా సేవలు అందుబాటులోకి తెచ్చిన రెండేళ్లలోనే జియోఫైబర్ ఈ ఘనతను సాధించింది. ఫిక్స్డ్ లైన్ బ్రాడ్‌బ్యాండ్ రంగంలో రెండు దశాబ్దాలుగా బీఎస్ఎన్ఎల్ ఆధిపత్య స్థానంలో కొనసాగింది. టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) ప్రకారం.. 2021 నవంబర్‌లో 43.4 లక్షల మంది కస్టమర్లతో జియో తొలి స్థానంలో ఉంది. అంత క్రితం నెలలో ఈ సంఖ్య 41.6 లక్షలు. బీఎస్ఎన్ఎల్ వినియోగదార్ల సంఖ్య 47.2 లక్షల నుంచి 42 లక్షలకు వచ్చి చేరింది. భారతి ఎయిర్‌టెల్‌కు 40.8 లక్షల మంది కస్టమర్లు ఉన్నారు. 2019 నవంబర్‌లో బీఎస్ఎన్ఎల్కు 86.9 లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. ఆ సమయంలో భారతి ఎయిర్టెల్ కస్టమర్ల సంఖ్య 24.1 లక్షలు. దేశవ్యాప్తంగా బ్రాడ్‌బ్యాండ్ సబ్స్క్రైబర్ల సంఖ్య అక్టోబర్‌లో 79.9 కోట్లు, నవంబర్‌లో 80.1 కోట్లకు చేరుకుంది. -
Work From Village: పల్లెల్లో వర్క్‌ఫ్రం హోం ? గ్రామీణ ప్రాంతాలపై స్టార్‌లింక్ దృష్టి
న్యూఢిల్లీ: పొలం గట్టున కూర్చునో.. మంచె మీద కంప్యూటర్ పెట్టుకునో.. పెరట్లో చెట్టు నీడన.. ఊరిపట్టున ఉంటూనే వర్క్‌ఫ్రం హోం పద్దతిలో ఉద్యోగం చేసే అవకాశం అతి త్వరలోనే రానుందా అంటే అవుననే సమాధానం వస్తోంది. గ్రామీణ ప్రాంతాలకు బ్రాడ్‌బ్యాండ్ సేవలు అందించేందుకు అంతర్జాతీయ సంస్థలు సిద్ధమవుతున్నాయి. ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నాయి. అన్ని కుదిరితే అతి త్వరలో వైర్‌సెల్ బ్రాడ్‌బ్యాండ్ సేవలు పల్లెలను పలకరించనున్నాయి. నీతి అయోగ్ నిర్ణయంతో అమెరికాకు చెందిన బ్రాడ్‌బ్యాండ్ సేవల సంస్థ స్టార్‌లింక్ తన కార్యకలాపాల్లో భాగంగా భారత్‌లో గ్రామీణ ప్రాంతాల్లో బ్రాడ్‌బ్యాండ్ సర్వీసులను మరింతగా విస్తరించడంపై దృష్టి పెడుతోంది. ఇందుకోసం దేశీ టెలికం కంపెనీలతో జట్టు కట్టాలని భావిస్తోంది. స్టార్‌లింక్ ఇండియా కంట్రీ డైరెక్టర్ సంజయ్ భార్గవ ఈ విషయాలు తెలిపారు. జిల్లాల్లో బ్రాడ్‌బ్యాండ్ కనెక్టివిటీ ప్రణాళికకు సంబంధించి నీతి ఆయోగ్ ఫేజ్–1లో గ్రామాలను ఎంపిక చేసిన తర్వాత తాము బ్రాడ్‌బ్యాండ్ సర్వీస్ ప్రొవైడర్స్‌తో చర్చలు ప్రారంభించనున్నట్లు ఆయన వివరించారు. టార్గెట్ రూరల్ గ్రామీణ జిల్లాల్లో 100 శాతం బ్రాడ్‌బ్యాండ్ సేవలు అందించడానికి ఇతర సంస్థలతో కూడా తాము కలిసి పని చేయాలనుకుంటున్నట్లు భార్గవ చెప్పారు. దేశీయంగా శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ సేవలు అందించేందుకు అవసరమయ్యే టెర్మినల్స్ ను కంపెనీ భారత్‌లో తయారు చేయబోతోందన్న వార్తలను ఆయన తోసిపుచ్చారు. స్థానికంగా వాటి ని ఉత్పత్తి చేసే యోచనేదీ ప్రస్తుతం లేదని పేర్కొ న్నారు. స్టార్‌లింక్ మెరికాకు చెందిన బిలియనీర్ ఎలాన్ మస్క్‌కు చెందిన రాకెట్ల తయారీ సంస్థ స్పేస్ఎక్స్కు స్టార్‌లింక్ అనుబంధ సంస్థ. ఇది ఇటీవలే భారత్‌లో కంపెనీ పేరు నమోదు చేసుకుంది. ఉపగ్రహ సాంకేతికత ద్వారా వేగవంతమైన ఇంటర్నెట్ సర్వీసులు అందించనుంది. ఇందుకోసం 99 డాలర్లు (సుమారు రూ. 7,350) డిపాజిట్‌గా కట్టాల్సి ఉంటుంది. ఇప్పటికే భారత్‌లో 5,000 పైచిలుకు ప్రీ–ఆర్డర్లు వచ్చినట్లు కంపెనీ వెల్లడించింది. వైర్లెస్ స్టార్‌లింక్ సంస్థ లో ఎర్త్ ఆర్బిట్ (లియో) మోడ్‌లో బ్రాడ్‌బ్యాండ్ సేవలు అందించేలా ప్రణాళిక రూపొందిస్తోంది. పోల్స్, వైర్లు, ఫిక్స్డ్ ఏరియా వంటి చిక్కులు లేకుండా లియో ద్వారా బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ పొందవచ్చు. కరోనా తర్వాత వర్క్‌ఫ్రం విధానం పాపులర్‌గా మారింఇ. అయితే గ్రామీణ ప్రాంతాల్లో బ్రాడ్‌బ్యాండ్ సేవలు ఎక్కువగా అందుబాటులో లేక చాలా మంది పట్టణ ప్రాంతాల్లోనే ఉంటూ వర్క్‌ఫ్రం హోం చేశారు. ఇక ఊర్లకు వైర్లెస్ బ్రాడ్‌బ్యాండ్ సేవలు వస్తే అక్కడ కూడా వర్క్‌ఫ్రం హోం కల్చర్ చేసుకునేందుకు వీలవుతుంది. -
4 నెలల పాటు ఉచిత ఇంటర్నెట్ సేవలు...! ఎలాగంటే...
నాలుగు నెలల పాటు ఉచిత ఇంటర్నెట్ సేవలు అవును.. మీరు చూసింది నిజమే...! ఇది కేవలం బీఎస్ఎన్ఎల్ బ్రాడ్‌బ్యాండ్, భారత్ ఫైబర్, డీఎస్ఎల్, బీఎస్ఎన్ఎల్ ల్యాండ్‌లైన్, బ్రాడ్ బ్యాండ్ ఓవర్ వైఫై కస్టమర్లకు మాత్రమే...! ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ సరికొత్త ఆఫర్‌తో ముందుకొచ్చింది. బీఎస్ఎన్ఎల్ కస్టమర్లకు నాలుగు నెలల పాటు ఉచిత బ్రాడ్‌బ్యాండ్ సేవలను అందించనుంది. చదవండి: మహీంద్రా థార్‌కు పోటీగా మారుతి నుంచి అదిరిపోయే కార్...! భారత్ ఫైబర్, డిజిటల్ సబ్స్రైబర్లైన్ కస్టమర్లకు, బీఎస్ఎన్ఎల్ ల్యాండ్‌లైన్, బ్రాడ్‌బ్యాండ్ ఓవర్ వైఫై సబ్స్క్రైబర్లకు ఈ ఆఫర్ అందుబాటులో ఉండనుంది. కాగా ఈ ఆఫర్‌ను పొందాలంటే బీఎస్ఎన్ఎల్ ఓ చిన్న మెలిక పెట్టింది..! అదేంటంటే.. ఈ ఆఫర్‌ను పొందాలంటే 36 నెలల ఇంటర్నెట్ ప్లాన్ సేవల కోసం ఒకేసారి పేమెంట్ చేస్తే అదనంగా మరో నాలుగు నెలలపాటు ఉచిత ఇంటర్నెట్ సేవలను పొందవచ్చునని బీఎస్ఎన్ఎల్ ఒక ప్రకటనలో పేర్కొంది. బీఎస్ఎన్ఎల్ బ్రాడ్ బ్యాండ్ వినియోగదారులు ఇంటర్నెట్ సేవల కోసం 24 నెలల ప్యాకేజ్‌కు ముందుగానే చెల్లిస్తే మరో మూడు నెలల ఉచిత ఇంటర్నెట్ సేవలను బీఎస్ఎన్ఎల్ అందిస్తోంది. బీఎస్ఎన్ఎల్ కస్టమర్లు 1800003451500 నెంబర్‌కు కాల్ చేసి ఈ ఆఫర్‌ను పొందవచ్చును. లేదా దగ్గర్లో ఉన్న బీఎస్ఎన్ఎన్ కస్టమర్ సేవా కేంద్రాన్ని సంప్రదించి కూడా ఆఫర్‌ను పొందవచ్చును. చదవండి: డీమార్ట్ జోరు..! లాభాల్లో హోరు...! -
2022కల్లా ప్రతి పల్లెకు బ్రాడ్‌బ్యాండ్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని పట్టణాలతో పాటు ప్రతి గ్రామానికీ మెరుగైన బ్రాడ్‌బ్యాండ్ సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ తెలిపారు. విజయవాడ సీఎస్ క్యాంపు కార్యాలయంలో సోమవారం స్టేట్ బ్రాడ్‌బ్యాండ్ కమిటీ రెండో సమావేశం సీఎస్ అధ్యక్షతన జరిగింది. ఆదిత్యనాథ్ దాస్ మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా 2022 నాటికి నేషనల్ బ్రాడ్‌బ్యాండ్ మిషన్ కింద ప్రతి గ్రామానికి హైస్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ సేవలను అందుబాటులోకి తీసుకురావాలన్న కేంద్ర ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా రాష్ట్రంలో అన్ని గ్రామాలకు దానిని త్వరితగతిన అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నూతన ఐటీ విధానం కూడా ఇందుకు ఎంతో దోహదపడుతుందని సీఎస్ చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న భూ రీసర్వే ప్రక్రియలో బ్రాడ్‌బ్యాండ్ సేవలు ఎంతో ఉపయోగపడతాయన్నారు. ఇక రాష్ట్రంలోని ప్రతి గ్రామాన్ని డిజిటలైజ్ చేసేందుకు ప్రభుత్వం పెద్దఎత్తున చర్యలు తీసుకుంటోందని ఆయన పేర్కొన్నారు. మారుమూల గిరిజన ప్రాంతాల్లో బ్రాడ్‌బ్యాండ్ సేవల విస్తరణకు అటవీ శాఖ క్లియరెన్సులు త్వరితగతిన వచ్చేలా చర్యలు తీసుకుంటామని సీఎస్ చెప్పారు. సమావేశంలో డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికం శాఖ డిప్యూటీ డైరెక్టర్ జనరల్‌లు రామకృష్ణ, రాఘవేంద్రరావు తదితరులు కూడా మాట్లాడారు. ఈ సమావేశంలో ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయలక్మి, పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ గిరిజా శంకర్ ఇతర అధికారులు పాల్గొన్నారు. -
భారత్‌లో శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు ఖాయం!
Satellite Broadband Service Could: భారత్ కార్ల మార్కెట్ పై కన్నేసిన టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ ‘స్టార్ లింక్’ శాటిలైట్ ఇంటర్నెట్ సేవల్ని భారత్‌కు విస్తరించే ప్రయత్నాలు మొదలుపెట్టాడు. ఇందుకోసం Department of Telecommunications అనుమతి కోసం ప్రయత్నిస్తున్నట్లు ఆయన ట్విటర్ ద్వారా వెల్లడించారు. ట్విటర్ ఇంటరాక్షన్‌లో భాగంగా ఓ వ్యక్తి అడిగిన ప్రశ్నకు.. స్టార్ లింక్ సేవలు భారత్‌కు విస్తరిస్తామని సమాధానం వచ్చింది మస్క్ నుంచి. అదే జరిగితే భారత్‌లో ఇంటర్ నెట్‌కు వినియోగించే సెల్‌ఫోన్ టవర్లు, కేబుళ్లతో పాటు శాటిలైట్ ఇంటర్నెట్ వినియోగదారులకు అందనుంది. ఇందుకోసం ఇంటిమీద చిన్న యాంటెన్నాతో ఇంటర్నెట్ను వినియోగించుకోవచ్చు. చదవండి: థర్మామీటర్ గడియారాలొస్తున్నాయ్! Just figuring out the regulatory approval process — Elon Musk (@elonmusk) August 31, 2021 స్పేస్ఎక్స్ యజమాని ఎలన్ మస్క్ శాటిలైట్ ఇంటర్నెట్ సేవల కోసం ‘స్టార్ లింక్’ పేరుతో ప్రాజెక్ట్ ప్రారంభించారు. ప్రాజెక్ట్ లో భాగంగా 2027 నాటికల్లా 4,425 శాటిలైట్లను అంతరిక్షంలోకి పంపాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటికే 1,800కుపైగా శాటిలైట్లను పంపారు. వాటి సాయంతో అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిల్యాండ్, యూరప్‌లోని 14 దేశాల్లో వంద డాలర్ల ప్రీ-ఆర్డర్ బుకింగ్(రిఫండబుల్) శాటిలైట్ సేవల్ని అందిస్తున్నారు. ఒకవేళ సిగ్నల్ వ్యవస్థ గనుక పని చేయకపోతే ఆ డబ్బును తిరిగి ఇచ్చేస్తారు. స్టార్లింక్స్తో పాటు ఎకోస్టార్, లియోశాట్, ఓ3బీ, టెలీస్టాట్, అప్స్టార్ట్ తో పాటు వర్జిన్ గెలాక్టిక్ ‘వన్‌వెబ్’ పేరుతో శాటిలైట్ ఇంటర్నెట్ సేవల్ని అందిస్తున్నారు. చదవండి: సెల్‌ఫోన్ టవర్లు, కేబుళ్లు కనుమరుగు కానున్నాయా..! -
ఆగస్ట్ 15న విడుదల కానున్న 5జీ నెట్ వర్క్ గురించి ఆసక్తికర విషయాలు?!
ఆగస్ట్ 15 సందర్భంగా ప్రధాని మోదీ 5జీ నెట్ వర్క్‌ను అధికారికంగా ప్రారంభిస్తారంటూ టెలికాం నిపుణులు అంచనా వేస్తున్నారు. అంతేకాదు 5జీ నెట్ వర్క్ వినియోగంతో భారత్ లో హార్డ్ వేర్, సాఫ్ట్ వేర్ రంగాలకు తిరుగుండదనే కథనాలు ప్రసారం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇంటర్నెట్ టెస్టింగ్‌లో గ్లోబల్ లీడర్ 'ఊక్లా' మనదేశంలో ఇంటర్నెట్ వినియోగంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 5జీ వినియోగంతో మనదేశంలో ఇంటర్నెట్ వేగం 10టైమ్ కంటే ఎక్కువగా ఉంటుందని తెలిపింది. ఇండియన్ టెక్నాలజీపై చైనా యాప్స్ ప్రభావం ఇండియా - చైనా సరిహద్దు వివాదం కారణంగా కేంద్రం డ్రాగన్ కంట్రీకి చెందిన సుమారు 200యాప్స్ పై బ్యాన్ విధించింది. దీంతో ఇండియన్ టెలికాం కంపెనీలు 5జీ నెట్ వర్క్ స్థాపించేందుకు సొంతంగా హార్డ్ వేర్, సాఫ్ట్ వేర్ లను తయారు చేసే పనిలో పడ్డాయి. అందుకోసం ఎరిక్సన్, నోకియా, శాంసంగ్, క్వాల్ కమ్ వంటి టెక్ కంపెనీలతో హార్డ్ వేర్ లను తయారు చేసుందుకు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. అయితే చైనాకు చెందిన హువావే, జెడ్‌టీఈ సంస్థలు భారత్‌లో 5జీ నెట్ వర్క్ ఏర్పాటు కోసం కేంద్రంతో ఒప్పందాలు కుదుర్చుకునేందుకు పోటీ పడ్డాయి. కానీ కేంద్రం సున్నితంగా తిరస్కరించి దేశీ పరిజ్ఞానంతో 5జీ నెట్ వర్క్ లను ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్రం సమాచార నిపుణుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి అజయ్ ప్రకాష్ సాహ్నీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇండియాలో 5జీ నెట్ వర్క్ వినియోగం ►2020 థాయిలాండ్, ఫిలిప్పిన్స్‌లో 5జీ నెట్ వర్క్ ప్రారంభమైంది. ఊక్లా అంచనా ప్రకారం..ప్రస్తుతం ఉన్న 4జీ ఎల్ టీఈ(Long-Term Evolution) నెట్ వర్క్ కంటే 5జీ స్పీడుగా ఉంటుందని, దాన్ని బేస్ చేసుకొని 2021 ఏప్రిల్ నాటికి దాని వేగం 9రెట్లు ఎక్కువగా ఉన్నట్లు గుర్తించినట్లు చెప్పింది. ఇదే సమయంలో భారత్ లో విడుదల కానున్న 5జీ నెట్ వర్క్ వేగం ఎక్కువగా ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేసింది. ►2021 మార్చిలో 52.9 శాతం నుండి జూన్ నాటికి 64.5 శాతం మంది 4G వినియోగదారులు 5ఎంబీపీఎస్ కంటే ఎక్కువగా వీడియోల్ని డౌన్లోడ్ చేస్తున్నారని, దీన్ని బట్టి ఇండియన్ ఇంటర్నెట్ యూజర్లు 5G నెట్ వర్క్‌ను ఎలా వినియోగిస్తారో చెప్పడం అసాధ్యం. అయితే దేశ వ్యాప్తంగా 5G నెట్ వర్క్ వినియోగం పెరిగిపోతుందని ఊక్లా ప్రతినిధులు వెల్లడించారు. ►మనదేశంలో జియో నెట్ వర్క్ వినియోగం అంతకంతకూ పెరిగిపోతుంది. ఆ జియో నెట్ వర్క్ డౌన్లోడ్ వేగం మార్చి 2021లో 5.96 Mbps నుండి జూన్‌లో 13.08 Mbps కి పెరిగింది. ►ప్రస్తుతం, యూకే,యూఎస్ వంటి దేశాల్లో 5 నెట్ వర్క్‌ను విస్తరించే పనిలోపడ్డారు. ఆ విషయంలో భారత్ వెనకబడినా.. ఇటీవల కాలంలో 5జీ నెట్ వర్క్ ఏర్పాటు కోసం గ్రౌండ్ వర్క్ చేస్తున్నట్లు ఊక్లా గుర్తించింది. ►5జీ నెట్ వర్క్ ఆలస్యం వల్ల ఆపరేటర్లకు లబ్ధి చేకూరుతుందని, తక్కువ ఖర్చుతో నెట్వర్క్ ఎక్విప్ మెంట్ కొనుగోలు చేయవచ్చు. ఇండియన్ ఆపరేట్లు ఓపెన్ ర్యాన్ నెట్ వర్క్ (open radio access network architecture) వల్ల 5జీ నెట్ వర్క్ ఏర్పాటుకు అయ్యే ఖర్చు తగ్గిపోతుందని ఓ ఇంటర్నెట్ టెస్టింగ్ గ్లోబల్ లీడర్ ఊక్లా అంచనా వేసింది. -
వారికోసం సరికొత్త ప్లాన్లను ప్రకటించిన ఎయిర్టెల్..!
ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్టెల్ పలు దిగ్గజ ఐటీ కంపెనీలతో జత కట్టనుంది. గూగుల్ క్లౌడ్, సిస్కో కంపెనీల భాగస్వామ్యంతో ‘ఎయిర్టెల్ ఆఫీస్ ఇంటర్నెట్’ బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ సేవలను ఎయిర్టెల్ లాంచ్ చేసింది. అభివృద్ధి చెందుతున్న చిన్న వ్యాపార సంస్థల కోసం, ప్రారంభ దశలో ఉన్న టెక్ స్టార్టప్ కంపెనీల డిజిటల్ కనెక్టివిటీ అవసరాల కోసం ఏకీకృత ఎంటర్ప్రైజ్ బ్రాడ్‌బ్యాండ్ సేవలను ప్రారంభిస్తున్నట్లు ఎయిర్టెల్ ప్రకటించింది. ఎయిర్టెల్ ఆఫీస్ ఇంటర్నెట్ ప్లాన్ ధరలు రూ. 999 నుంచి ప్రారంభమవ్వనున్నాయి. ఎయిర్టెల్ ఇంటర్నెట్ సేవల్లో భాగంగా అనేక రకాల యాడ్ ఆన్ సేవలను కూడా పొందవచ్చును. చిన్న వ్యాపార సంస్థలు డిజిటల్ ట్రాన్సఫర్మేషన్ అందిపుచ్చుకోవడానికి ఎయిర్టెల్ ఆఫీస్ ఇంటర్నెట్ ప్లాన్ ఎంతగానో ఉపయోగపడనుందని కంపెనీ చైర్మన్ సునీల్ మిట్టల్ పేర్కొన్నారు. ఎయిర్టెల్ ఆఫీస్ ఇంటర్నెట్ ప్లాన్లు ‘వన్ ప్లాన్, వన్ బిల్’తో ఏకీకృత పరిష్కారాలను చూపిస్తోందని వెల్లడించారు. ఎయిర్టెల్ ఆఫీస్ ఇంటర్నెట్ ప్లాన్ సేవలు... ఆఫీస్ ఇంటర్నెట్ ప్లాన్‌లో భాగంగా వ్యాపార సంస్థలకు, టెక్ స్టార్టప్ కంపెనీలకు అపరిమిత లోకల్/ఎస్టీడీ కాలింగ్‌తో పాటు 1జీబీపీఎస్ వరకు అధిక వేగంతో ఎఫ్టీటీహెచ్ బ్రాడ్‌బ్యాండ్ సేవలను ఇవ్వనుంది. ఎయిర్టెల్ ఆఫీస్ ఇంటర్నెట్ ప్లాన్‌లో భాగంగా గూగుల్ వర్క్‌స్పేస్ లైసెన్స్‌ను, డీఎన్ఎస్ సెక్యూరిటీ బై సిస్కో, ఫ్రీ ప్యారలల్ రింగింగ్ సర్వీసులను ఎయిర్టెల్ అందిస్తోంది. హానికరమైన, అవాంఛిత డొమైన్లు, వైరస్లు, సైబర్‌దాడుల నుంచి ఆయా వ్యాపార సంస్థలకు భద్రతను సిస్కో, కాస్పర్‌స్కై అందించనున్నాయి. ఎయిర్ తన కస్టమర్ల భద్రత కోసం కొద్ది రోజుల క్రితమే కాస్పర్స్కైతో చేతులను కలిపింది. ఎయిర్టెల్ ఆఫీస్ ఇంటర్నెట్ హెచ్డీ నాణ్యతతో అపరిమిత, సురక్షితమైన కాన్ఫరెన్సింగ్ వీడియో కాలింగ్ కోసం ఉచితంగా ఎయిర్టెల్ బ్లూజీన్స్ లైసెన్స్‌ను కూడా ఎయిర్టెల్ అందిస్తోంది. -
శాటిలైట్ కనెక్టివిటీతో పల్లెలకు టెలికం సేవలు
న్యూఢిల్లీ: టెలికం నెట్‌వర్క్స్‌లో శాటిలైట్ కనెక్టివిటీ వినియోగించేందుకు డిజిటల్ కమ్యూనికేషన్స్ కమిషన్ (డీసీసీ) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆప్టికల్ ఫైబర్ వేయలేని ప్రాంతాల్లో టెలికం సేవలు అందించేందుకు, కఠిన భూభాగాల్లో మొబైల్ టవర్ల అనుసంధానానికి శాటిలైట్ కనెక్టివిటీ ఉపయోగపడుతుంది. 16 రాష్ట్రాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో బ్రాడ్‌బ్యాండ్ సర్వీసులు అందించేందుకు ప్రతిపాదించిన భారత్‌నెట్ ప్రాజెక్ట్‌కు సైతం డీసీసీ ఆమోదం లభించింది. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో రూ.19,041 కోట్ల వయబిలిటీ గ్యాప్ ఫండింగ్‌తో ఈ ప్రాజెక్టుకు చేపట్టనున్నారు. దీని కోసం వారం రోజుల్లో టెండర్లను టెలికం శాఖ పిలవనుంది. భారతీ గ్రూప్ శాటిలైట్ కమ్యూనికేషన్స్ సంస్థ వన్‌వెబ్‌లో పెట్టుబడులు పెట్టినందున తాజా నిర్ణయం భారతి ఎయిర్‌టెల్‌కు ప్రయోజనకరంగా ఉంటుంది. -
స్పేస్ స్టార్టప్‌తో కీలక ఒప్పందం కుదుర్చుకున్న ఎయిర్టెల్
న్యూఢిల్లీ: శాటిలైట్ కమ్యూనికేషన్స్ కంపెనీ వన్‌వెబ్‌లో సునీల్ మిట్టల్‌కు చెందిన భారతీ గ్రూప్ మరిన్ని పెట్టుబడులకు సిద్ధపడుతోంది. తాజాగా 50 కోట్ల డాలర్లు(రూ. 3,700 కోట్లు) ఇన్వెస్ట్ చేయనుంది. తద్వారా వన్‌వెబ్‌లో భారతీ గ్రూప్ అతిపెద్ద వాటాదారుగా అవతరించనుంది. దివాలా పరిస్థితులకు చేరిన వన్వెబ్ను గతేడాది యూకే ప్రభుత్వం ఆదుకుంది. గ్లోబల్ ఎల్ఈవో శాటిలైట్ కమ్యూనికేషన్స్ సంస్థ వన్‌వెబ్‌లో కాల్ ఆప్షన్లో భాగంగా భారతీ గ్రూప్ తాజా పెట్టుబడులను చేపట్టనుంది. మరోవైపు యూటెల్సాట్ 55 కోట్ల డాలర్లను ఇన్వెస్ట్ చేయనుంది. ఈ లావాదేవీల తదుపరి భారతీకి వన్‌వెబ్‌లో 38.6 శాతం వాటా లభించనుంది. యూకే ప్రభుత్వం, యూటెల్సాట్, సాఫ్ట్‌బ్యాంక్ విడిగా 19.3 శాతం చొప్పున వాటాలు పొందనున్నాయి. చదవండి: SBI: ఎస్బీఐ ‘బేసిక్’ కస్టమర్లకు షాక్ -
వచ్చేస్తోంది..స్పేస్ఎక్స్ స్టార్ లింక్...త్వరలోనే..!
ప్రపంచవ్యాప్తంగా బ్రాడ్‌బ్యాండ్ సర్వీసులో ఎలన్ మస్క్ కంపెనీ స్పేస్ ఎక్స్ స్టార్ లింక్ ప్రోగ్రాం మరికొద్ది రోజుల్లోనే చరిత్ర సృష్టించనుంది. స్టార్‌లింక్ ప్రోగాంతో ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలను అందించడానికి స్టార్‌లింక్ కృషి చేస్తోంది. కాగా ప్రస్తుతం స్టార్ లింక్ సేవలు కేవలం 11 దేశాల్లో మాత్రమే అందుబాటులో ఉంది. స్టార్‌లింక్ కవరెజీని ప్రపంచవ్యాప్తంగా ఈ సంవత్సరం సెప్టెంబర్ నాటికి అందుబాటులోకి వస్తోందని మంగళవారం జరిగిన మాక్వేరీ గ్రూప్ టెక్నాలజీ కాన్ఫరెన్స్ లో స్పేస్ఎక్స్ ఛీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ గ్విన్ షాట్వెల్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పటివరకు స్పేస్ ఎక్స్ స్టార్ లిక్ ప్రోగ్రాం కోసం 18 వందల శాటిలైట్లను విజయవంతంగా నిర్ణీత కక్ష్యలోకి పంపించామని గ్విన్ షాట్వెల్ తెలిపారు. మిగిలిన శాటిలైట్లను సెప్టెంబరు లోపు పంపించి త్వరలోనే గ్లోబల్ కవరెజీ అందుబాటులోకి తెస్తామని పేర్కొంది. కాగా ప్రతి దేశంలో స్టార్‌లింక్ సేవలను అందుబాటులోకి తీసుకురావలంటే ఆయా దేశాల ఆమోదం పొందడానికి సమయం పడుతుందని అభిప్రాయపడింది. స్టార్‌లింక్ ప్రోగ్రాంలో భాగంగా తొలిదశలో సుమారు 12వేల ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపాలని స్పేస్ఎక్స్ చూస్తోంది. మొత్తంగా 42 వేల ఉపగ్రహాలను పంపనుంది. ఇప్పటికే 12 వేల ఉపగ్రహలను లోవర్ ఎర్త్ ఆర్బిట్‌లో ప్రవేశపెట్టడానికి యూఎస్ ఫెడరల్ కమ్యూనికేషన్ కమిషన్ ఆమోదం తెలిపింది. ఈ ప్రోగ్రాం కోసం సుమారు పది బిలియన్ డాలర్లను వెచ్చించనుంది. స్టార్‌లింక్ సేవలను పొందడానికి ఇప్పటికే సుమారు 5 లక్షల వరకు ఫ్రీ ఆర్డర్లు బుక్ అయ్యాయని స్పేస్ఎక్స్ కంపెనీ సీవోవో గ్విన్ షాట్వెల్ పేర్కొన్నారు. చదవండి: స్పేస్ ఎక్స్ స్టార్‌లింక్ ఇంటర్నెట్ షట్‌డౌన్.. సింపుల్‌గా పరిష్కరించిన యువకుడు..! -
భారత్‌లో శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్! రంగంలోకి అమెజాన్...
న్యూఢిల్లీ: అత్యంత వేగవంతమైన ఉపగ్రహ ఇంటర్నెట్ సర్వీసులను భారత్‌లో అందుబాటులోకి తేవడంపై ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్ కసరత్తు చేస్తోంది. దీనికి సంబంధించిన విధివిధానాలు, అనుమతులపై చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వంతో భేటీ అయ్యే యోచనలో కంపెనీ ఉన్నట్లు సమాచారం. ల్యాండింగ్ హక్కులు, శాటిలైట్ బ్యాండ్‌విడ్త్ లీజింగ్ వ్యయాలు తదితర అంశాలపై డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ (డీవోఎస్), టెలికం శాఖ (డాట్)లతో సమావేశాల్లో చర్చించే అవకాశాలు ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. క్విపర్ పేరిట చేపట్టిన శాటిలైట్ ఇంటర్నెట్ ప్రాజెక్టులో భాగంగా 3,236 పైచిలుకు ’లో ఎర్త్ ఆర్బిట్’ (ఎల్ఈవో) ఉపగ్రహాలపై అమెజాన్ దాదాపు 10 బిలియన్ డాలర్లు వెచ్చిస్తోంది. వీటి ద్వారా అంతర్జాతీయంగా ఈ తరహా వేగవంతమైన ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి తేవాలని యోచిస్తోంది. అయితే, అధికారికంగా ఇప్పటిదాకా భారత్ ప్రణాళికలను మాత్రం కంపెనీ వెల్లడించలేదు. కీలక మార్కెట్‌గా భారత్.. గణాంకాల ప్రకారం దేశీయంగా దాదాపు 75 శాతం మంది గ్రామీణ ప్రాంత ప్రజలకు బ్రాడ్‌బ్యాండ్ సర్వీసులు అందుబాటులో లేవు. చాలా మటుకు ప్రాంతాలకు సెల్యులార్ లేదా ఫైబర్ కనెక్టివిటీ లేకపోవడమే ఇందుకు కారణం. దీంతో ఎల్ఈవో శాటిలైట్ సిస్టమ్స్ ద్వారా ఇంటర్నెట్ సేవలు అందించే సంస్థలకు భారత మార్కెట్లో పుష్కలంగా అవకాశాలు ఉన్నాయని పరిశీలకులు తెలిపారు. గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లోని లక్షల మందికి ఈ తరహా సేవలు అందించడం ద్వారా సమీప భవిష్యత్తులో దాదాపు 500 మిలియన్ డాలర్ల మేర ఆదాయాల ఆర్జనకు అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో భారత మార్కెట్‌ను అమెజా న్ పక్కన పెట్టే పరిస్థితి ఉండబోదని తెలిపారు. ఒంటరిగానా లేదా జట్టుగానా.. మిగతా శాటిలైట్ ఇంటర్నెట్ కంపెనీల వైఖరి ఇప్పటికే స్పష్టం కావడంతో అమెజాన్ ఎలా ముందుకెళ్తుందన్న అంశంపై అందరి దృష్టి ఉంది. ఒంటరిగా రంగంలోకి దిగుతుందా లేదా ఇతరత్రా ఏదైనా సంస్థతో జట్టు కడుతుందా అన్నది ఆసక్తిగా మారింది. వన్‌వెబ్‌లో భారతి గ్రూప్ ఇప్పటికే భాగస్వామిగా ఉన్న నేపథ్యంలో ఇక మిగిలింది రెండు టెలికం సంస్థలు.. ఒకటి జియో కాగా రెండోది.. వొడాఫోన్ ఐడియా. అయితే, ఫ్యూచర్ గ్రూప్ రిటైల్ వ్యాపారాల కొనుగోలుపై రిలయన్స్‌తో అమెజాన్ న్యాయపోరాటం చేస్తోంది. కాబట్టి దానితో జట్టు కట్టే అవకాశాలపై సందేహాలు నెలకొన్నాయి. వన్‌వెబ్..స్పేస్ఎక్స్తో పోటీ అంతర్జాతీయంగా ఎల్ఈవో శాటిలైట్ ఇంటర్నెట్ సేవలందించడంలో ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం టెస్లా అధిపతి ఎలాన్ మస్క్‌కి చెందిన స్పేస్ఎక్స్తోను, దేశీ టెలికం దిగ్గజం భారతి గ్రూప్.. బ్రిటన్ ప్రభుత్వం కలిసి నెలకొల్పిన వన్వెబ్తోనూ అమెజాన్ పోటీపడాల్సి రానుంది. ఈ రెండు సంస్థలూ ఇప్పటికే భారత మార్కెట్‌పై తమ ప్రణాళికలను ప్రకటించేశాయి. వచ్చే ఏడాదే కార్యకలాపాలు ప్రారంభించేం దుకు కూడా సన్నాహాలు చేసుకుంటున్నాయి. ఇక అమెజాన్ కూడా రంగంలోకి దిగితే పోటీ మరింత పెరుగుతుందని పరిశ్రమవర్గాలు తెలిపాయి. దీనివల్ల రేట్లు కూడా తగ్గగలవని పేర్కొన్నాయి. ప్రస్తుతం 4జీ మొబైల్ బ్రాడ్‌బ్యాండ్‌తో పోలిస్తే శాటిలైట్ ఇంటర్నెట్ సేవల చార్జీలు చాలా అధికంగా ఉంటున్నాయి. మొబైల్ డేటా చార్జీ జీబీకి 0.68 డాలర్లుగా ఉంటే.. శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ చార్జీలు జీబీకీ 15–20 డాలర్ల దాకా ఉంటున్నాయి. వన్‌వెబ్, స్పేస్ఎక్స్, అమెజాన్‌ల రాకతో ఆరోగ్యవంతమైన పోటీ నెలకొనగలదని, సేవ లు మరింత చౌకగా లభించగలవని అంచనా. స్పేస్ఎక్స్ బీటా వెర్షన్.. స్పేస్ఎక్స్ ప్రస్తుతం భారత్‌లో యూజర్లకు తమ స్టార్‌లింక్ శాటిలైట్ సర్వీసును బీటా వెర్షన్లో అందించేందుకు ప్రీ–ఆర్డర్లు తీసుకుంటోంది. ఇందుకోసం రిఫండబుల్ డిపాజిట్ 99 డాలర్లు (సుమారు రూ. 7,200)గా ఉంది. వన్‌వెబ్ ప్రధానంగా మారుమూల ప్రాంతాలకు శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ సర్వీసులపై దృష్టి పెడుతుండగా.. స్టార్‌లింక్ ఇటు పట్టణ ప్రాంతాలకు కూడా మరింత వేగవంతమైన బ్రాడ్‌బ్యాండ్ సేవలు అందించాలని యోచిస్తోంది. తగినన్ని మొబైల్ టవర్లు, ఫైబర్ నెట్వర్క్ ఉండని గ్రామీణ ప్రాంతాల్లో బ్రాడ్‌బ్యాండ్ కవరేజీని పెంచేందుకు శాటిలైట్ సర్వీసులు తోడ్పడగలవని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. సరఫరా వ్యవస్థ, కోల్డ్ చెయిన్ల నిర్వహణ మొదలుకుని విద్యుత్ పంపిణీకి సంబంధించిన స్మార్ట్ గ్రిడ్స్ నిర్వహణ, వరదలు..సునామీల సమయంలో అత్యవసర హెచ్చరికల జారీ తదితర అవసరాలకు ఇవి ఉపయోగపడగలవని వివరించారు. -
నెలకు రూ. 500లోపు బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్స్
ముంబై, సాక్షి: నెలకు రూ. 500 లోపు ఖర్చులో నెట్ కనెక్షన్ తీసుకుందామనుకునే వినియోగదారులకు శుభవార్త. పలు కంపెనీలు రూ. 500లోపు అద్దెలో బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ అందించేందుకు ఆసక్తి చూపుతున్నాయి. జాబితాలో ఎయిర్టెల్, రిలయన్స్ జియోతోపాటు.. ప్రభుత్వ రంగ బీఎస్ఎన్ఎల్, ఎగ్జైటెల్ చేరాయి. పలు ఆఫర్లు రూ. 399తోనే ప్రారంభంకానున్నాయి. చదవండి: (బంగారు హెడ్‌ఫోన్స్ @ రూ. 80 లక్షలు) పలు ఆఫర్లు ఈ ఏడాది(2020) టెలికం కంపెనీలు బ్రాడ్‌బ్యాండ్ సర్వీసులకు సంబంధించి పలు ఆఫర్లు ప్రకటించాయి. పీఎస్‌యూ సంస్థ బీఎస్ఎన్ఎల్ ప్రమోషనల్ సమయంలో డేటా పెంచడం వంటి ఆఫర్లు ప్రకటించగా.. జియో ఫైబర్ రూ. 399 నుంచి ప్రారంభమయ్యే సర్వీసులకు శ్రీకారం చుట్టింది. దీనిలో భాగంగా అన్లిమిటెడ్ కాలింగ్ సౌకర్యాన్ని సమకూర్చింది. ఇక ఎగ్జైటెల్ కొన్ని ఎంపిక చేసిన ప్రాంతాలలో డేటా పరిమితిలేని ప్యాకేజీలు ప్రకటించింది. నెలకు రూ. 500లోపు చెల్లించే బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ల వివరాలివి.. ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ఫైబర్: నెలకు రూ. 499 ధరలో అన్లిమిటెడ్ బ్రాండ్‌బ్యాండ్ ప్లాన్ ఇది. 40 ఎంబీపీఎస్ స్పీడ్వరకూ లభించే ఈ ప్లాన్‌లో భాగంగా పరిమితిలేని ఇంటర్నెట్ను అందిస్తోంది. ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్కు సబ్స్క్రిన్సన్, వింక్ మ్యూజిక్, షా అకాడమీ తదితర సౌకర్యాలు సైతం లభిస్తున్నాయి. ఎక్స్ట్రీమ్ యాప్ ద్వారా వూట్ బేసిక్, ఈరోస్ నౌ, హాంగామా ప్లే, షెమారూ ఎం, అల్ట్రాను పొందవచ్చు. చదవండి: (హీరో ఈసైకిల్@ 49,000) బీఎస్ఎన్ఎల్ భారత్ ఫైబర్: 100 జీబీ సీయూఎల్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ను రూ. 499 ధరలో అందిస్తోంది. నెలకు 100 జీబీ హైస్పీడ్ డేటా లభిస్తుంది. నెలవారీ జీబీ తదుపరి 50 ఎంబీపీఎస్ బ్యాండ్‌విడ్త్‌లో 2 ఎంబీపీఎస్‌కు స్పీడ్ తగ్గనుంది. జియోఫైబర్ రూ. 399 బ్రాడ్‌బ్యాండ్: ఈ పథకంలో భాగంగా 30 ఎంబీపీఎస్ స్పీడ్‌తో అన్లిమిటెడ్ ఇంటర్నెట్ను అందిస్తోంది. ఈ పథకంలో ఎలాంటి ఓటీటీ సబ్స్క్రిప్షన్లనూ కంపెనీ ఆఫర్ చేయడంలేదు. అయితే అన్లిమిటెడ్ కాలింగ్ సౌకర్యాన్ని కల్పిస్తోంది. ఎగ్జైటెల్ రూ. 399 బ్రాడ్‌బ్యాండ్: ఈ పథకంలో భాగంగా వినియోగదారులు ఏడాది కాలానికి సబ్‌స్ర్కయిబ్ చేస్తే.. 100 ఎంబీపీఎస్ స్పీడ్‌తో అన్లిమిటెడ్ ఇంటర్నెట్ను అందిస్తోంది. ఇందుకు ఒకేసారి రూ. 4,788ను చెల్లించవలసి ఉంటుంది. అంతేకాకుండా హోమ్ బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్స్‌లో భాగంగా (నెలకు రూ. 449 అద్దె) ఏడాదికి రూ. 5,388, లేదా (రూ. 499 అద్దె) రూ. 5,988 ఒకేసారి చెల్లిస్తే 200 ఎంబీపీఎస్ లేదా 300ఎంబీపీఎస్ స్సీడ్‌తో సర్వీసులు అందించనుంది. ఇలా కాకుండా 9 నెలలకే కావాలనుకుంటే 100 ఎంబీపీఎస్ స్పీడ్‌తో రూ. 424 చొప్పున ఒకేసారి చెల్లించవలసి ఉంటుంది. ఇదే ఆఫర్లో 6 నెలల కోసం రూ. 490 చొప్పున ఒకేసారి చెల్లించవలసి ఉంటుంది. -
స్టార్‌లింక్ బ్రాడ్‌బ్యాండ్ సేవలు భారత్‌లో..
2021 ఏడాది మధ్యలో స్టార్‌లింక్ బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ సేవలను భారతదేశంలో ప్రవేశ పెట్టడానికి స్పేస్ఎక్స్ సీఈఓ ఎలోన్ మస్క్ యోచిస్తున్నారు. ప్రస్తుతం ఈ బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ సేవలు యుఎస్ మరియు కెనడాలోని కొన్ని ప్రాంతాల్లోని బీటా యూజర్స్ కు మాత్రమే అందుబాటులో ఉంది. ప్రపంచవ్యాప్తంగా గ్రామీణ మరియు ఇంటర్నెట్ తక్కువగా ఉన్న ప్రాంతాలకు 2021లో ఇంటర్నెట్ కనెక్షన్‌ను అందించడానికి కంపెనీ వైడ్స్కేల్ ప్రయోగం చేస్తున్నట్లు టెస్లా వ్యవస్థాపకుడు ఎలోన్ మస్క్ ట్విటర్లో తెలిపారు. 2021 ఏడాదిలో స్టార్‌లింక్ బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ సేవలను భారత్‌లోకి తీసుకురావడానికి ఇక్కడి నిబంధనలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. (చదవండి: వన్‌ప్లస్ 9 స్మార్ట్ ఫోన్ కెమెరా ఫీచర్స్ వైరల్) స్పేస్ఎక్స్ శాటిలైట్ గవెర్నమెంట్ అఫైర్స్ వైస్ ప్రెసిడెంట్ ప్యాట్రిసియా కూపర్, మెరుగైన బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ను భారత ప్రజలకు అందించడానికి రోడ్‌మ్యాప్‌లో భాగంగా టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(ట్రాయ్)తో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపారు. భారతదేశంలో ఉపగ్రహ - ఆధారిత బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ సాంకేతికత స్థాపన కోసం భారత ప్రభుత్వం తప్పక సాంకేతిక విధానాలను నవీకరించాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. -
నెట్వర్క్ కంపెనీలకు ప్రధాని మోడీ పుష్
బ్రాడ్‌బ్యాండ్, ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ తదితర పలు నెట్వర్క్ కంపెనీలకు ప్రధాని మోడీ ప్రసంగం జోష్‌నిస్తోంది. 74వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట వద్ద ప్రసంగించిన ప్రధాని మోడీ.. రానున్న 1,000 రోజుల్లో దేశంలోని ప్రతీ గ్రామాన్నీ ఆప్టికల్ ఫైబర్‌తో అనుసంధానం చేయనున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే ఐదేళ్లలో 1.5 లక్షల గ్రామ పంచాయితీలకు బ్రాడ్‌బ్యాండ్ సౌకర్యాలను కల్పించినట్లు తెలియజేశారు. భారత్‌నెట్ పేరుతో ప్రభుత్వం జాతీయ స్థాయిలో ఆప్ఠికల్ ఫైబర్ నెట్‌వర్క్‌కు శ్రీకారం చుట్టిన విషయం విదితమే. దీంతో నెట్వర్క్ సంబంధిత పలు లిస్టెండ్ కంపెనీల కౌంటర్లకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు క్యూకట్టడంతో భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం.. జోరుగా హుషారుగా బీఎస్ఈ, ఎన్ఎస్ఈలో ప్రస్తుతం పలు నెట్వర్క్ ఆధారిత కంపెనీల షేర్లు జోరు చూపుతున్నాయి. స్టెరిలైట్ టెక్నాలజీస్ 9 శాతం దూసుకెళ్లి రూ. 142ను తాకగా.. పాలీక్యాబ్ ఇండియా 3 శాతం ఎగసిరూ. 900కు చేరింది. ఈ బాటలో బిర్లా కేబుల్స్ 7.2 శాతం జంప్‌చేసి రూ. 57 వద్ద ట్రేడవుతోంది. ఇతర కౌంటర్లలో కార్డ్స్ కేబుల్ ఇండస్ట్రీస్, ఫినొలెక్స్ కేబుల్స్, అక్ష్ ఆప్టిఫైబర్, ఐటీఐ, కేఈఐ ఇండస్ట్రీస్, వింధ్యా టెలీలింక్స్, డెల్టన్ కేబుల్స్, పారామౌంట్ కమ్యూనికేషన్స్, యూనివర్శల్ కేబుల్స్ తదితరాలు 11-2 శాతం మధ్య లాభాలతో హల్చల్ చేస్తున్నాయి. -
ఇంటర్నెట్ వినియోగదారులకు శుభవార్త
ముంబై: దేశీయ ఇంటర్నెట్ వినియోగదారులకు త్వరలో ప్రభుత్వం శుభవార్త చెప్పనుంది. ప్రభుత్వం బ్రాండ్ బ్యాండ్ సర్వీసులకు లైసెన్స్ ఫీజులను తగ్గించబోతున్నట్లు ట్రాయ్(టెలికాం రెగ్యూలేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా) వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో వినియోగదారులకు తక్కువ ధరకే ఇంటర్నెట్ను అందుబాటులోకి రావచ్చు. ప్రస్తుతం దేశంలో 1.98కోట్ల మంది వినియోగదారులు బ్రాడ్‌బ్యాండ్ సేవలను ఉపయోగించుకుంటున్నారు. ఈ అంశాన్ని కేంద్ర ప్రభుత్వం సీరియస్‌గా పరిశీలిస్తుందని, ప్రస్తుతం లైసెన్స్ ఫీజులు తగ్గిస్తే ప్రభుత్వానికి రూ.592 కోట్ల నష్టం వస్తుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.కానీ, 10 శాతం బ్రాడ్ బ్యాండ్ కంపెనీల వృద్ధి రేటు పెరిగి వినియోగదారులకు మెరుగైన సేవలందించవచ్చని టెలికాం నిపుణులు సూచిస్తున్నారు. బీఎస్ఎన్ఎల్ 82.3 లక్షల మంది వినియోగదారులతో మెదటి స్థానంలో ఉండగా, ఎయిర్టెల్ 2వ స్థానంలో(24.3 లక్షలు), జియో ఫైబర్ (8.4 లక్షల) మంది వినియోగదారులతో దేశంలోని బ్రాడ్ బ్యాండ్ మార్కెట్లో ఐదవ స్థానంలో నిలిచింది. కాగా దేశంలోని ప్రతి ఒక్కరికి జ్ఞానసముపార్జనకు బ్రాండ్ బ్యాండ్ సేవలు విస్తరించడం ఎంతో ముఖ్యమని, అందులో భాగంగానే ట్రాయ్ వినియోగదారులకు మెరుగైన సేవలందించేందుకు అనేక చర్యలు చేపడుతన్నట్లు ట్రాయ్ ఉన్నతాధికారులు పేర్కొన్నారు. వినియోగదారులకు వేగంగా సేవలందించేందుకు ట్రాయ్ అనేక సంస్కరణలు చేపట్టిన విషయం తెలిసిందే. (చదవండి: వీరిలో సామాజిక ఒంటరితనం అధికం) -
నెలకు 25 జీబీ డేటా!!
న్యూఢిల్లీ: దేశీయంగా స్మార్ట్ఫోన్ల ద్వారా డేటా వినియోగం 2025 నాటికల్లా నెలకు 25 జీబీ స్థాయికి చేరనుంది. చౌక మొబైల్ బ్రాడ్‌బ్యాండ్ సర్వీసులు, అందుబాటు ధరల్లో స్మార్ట్ఫోన్లు, వీడియోల వీక్షణలో మారుతున్న అలవాట్లు ఇందుకు కారణం కానున్నాయి. టెలికం పరికరాల తయారీ దిగ్గజం ఎరిక్సన్ రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. 2019 గణాంకాల ప్రకారం భారతీయులు నెలకు సగటున 12 జీబీ డేటా వినియోగిస్తున్నారు. అంతర్జాతీయంగా చూస్తే ఇది అత్యధికం కావడం గమనార్హం. దేశీయంగా 2025 నాటికి కొత్తగా 41 కోట్ల పైచిలుకు స్మార్ట్‌ఫోన్ యూజర్లు పెరగవచ్చని అంచనా వేస్తున్నట్లు ఎరిక్సన్ మొబిలిటీ రిపోర్ట్ ఎడిటర్ ప్యాట్రిక్ సెర్వాల్ తెలిపారు. అప్పటికి భారత్‌లో 18 శాతం మంది 5జీ నెట్‌వర్క్‌ను, 64 శాతం మంది 4జీ నెట్వర్క్, మిగతా వారు 2జీ/3జీ నెట్వర్క్ వినియోగిస్తుంటారని వివరించారు. మరోవైపు, ప్రపంచవ్యాప్తంగా చూస్తే 2020 ఆఖరు నాటికి 5జీ యూజర్ల సంఖ్య 19 కోట్లుగా ఉండొచ్చని, 2025 ఆఖరు నాటికి ఇది 280 కోట్లకు చేరే అవకాశం ఉందని ఎరిక్సన్ అంచనా వేస్తోంది. ఈ అయిదేళ్ల వ్యవధిలో 4జీ ప్రధాన మొబైల్ యాక్సెస్ టెక్నాలజీగా ఉంటుందని పేర్కొంది. -
ట్రిపుల్‌ప్లే సేవలు: బీఎస్ఎన్ఎల్తో యప్ టీవీ జోడీ..
సాక్షి, న్యూఢిల్లీ : గ్రామీణ ప్రజలకు, బీఎస్ఎన్ఎల్ కస్టమర్లకు ట్రిపుల్ ప్లే సర్వీసులు అందించేందుకు ఓటీటీ కంటెంట్‌లో గ్లోబల్ లీడర్ యప్ టీవీ బీఎస్ఎన్ఎల్తో కలిసి పనిచేస్తుంది. ఈ ఏడాదిలో తెలంగాణ సర్కిల్‌తో పాటు సౌత్ జోన్లో సేవలు మొదలవనున్నాయి. ఈనెల 22న ఢిల్లీలోని ఇండియా హ్యాబిటాట్ సెంటర్లో టెమా ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో తెలంగాణలోని కరీంనగర్ జిల్లా వీణవంక గ్రామంలో భారత్ ఎయిర్‌ఫైబర్ సేవలను వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా బీఎస్ఎన్ఎల్ ప్రారంభించింది. భారత్ ఎయిర్‌ఫైబర్ బిజినెస్ మోడల్ గురించి బీఎస్ఎన్ఎల్ డైరెక్టర్ (సీఎఫ్ఏ) వివేక్ బంజల్ వివరిస్తూ గ్రామీణ ప్రాంత గృహాలకు హైస్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ సేవలను అందించే క్రమంలో ఈ భాగస్వామ్యం ఉపకరిస్తుందని చెప్పారు. గ్రామీణ గృహాలకు రేడియో ఆధారిత బ్రాడ్‌బ్యాండ్ సేవలను అందిచేందుకు గ్రామస్ధాయి వాణిజ్యవేత్తలు బీఎస్ఎన్ఎల్తో చేతులు కలిపే విధానాన్ని ప్రకటిస్తున్నామని చెప్పారు. యప్ టీవీ వ్యవస్ధాపక సీఈవో ఉదయ్ రెడ్డి మాట్లాడుతూ దేశంలో తదుపరి డిజిటలీకరణలో అత్యంత ప్రాధాన్యత కలిగిన ప్రతిష్టాత్మక ప్రాజెక్టును బీఎస్ఎన్ఎల్తో కలిసి తాము చేపట్టడం సంతోషకరమని అన్నారు. గ్రామీణ భారతానికి హైస్పీడ్ ఇంటర్నెట్ను బీఎస్ఎన్ఎల్ చేరువ చేస్తే తాము తమ యూజర్లకు వినోదభరితంగా వారిని చైతన్యపరిచేలా వైవిధ్యమైన కంటెంట్‌ను అందించే బాధ్యత తీసుకుంటామని అన్నారు. సౌత్ జోన్‌తో ప్రారంభమైన ఈ ప్రక్రియకు అద్భుత స్పందన వస్తుందని ఆశిస్తున్నామని చెప్పారు. కాగా బీఎస్ఎన్ఎల్ సబ్స్క్రైబర్లకు కంటెంట్‌ను అందించేలా గత ఏడాది బీఎస్ఎన్ఎల్తో యప్ టీవీ ఓ అవగాహనా ఒప్పందంపై సంతకం చేసిన క్రమంలో తదనుగుణంగా ఎంపిక చేసిన సర్కిళ్లలో ట్రిపుల్ ప్లే సర్వీసులను బీఎస్ఎన్ఎల్ ప్రారంభించింది. చదవండి : అసెట్స్ విక్రయంలో బీఎస్ఎన్ఎల్ చదవండి : యప్ టీవీ చేతికి బీసీసీఐ డిజిటల్ రైట్స్ -
జియో ఫైబర్ బ్రాడ్‌బాండ్ లాంచింగ్ రేపే: రిజిస్ట్రేషన్ ఎలా?
సాక్షి, న్యూఢిల్లీ: టెలికాం రంగంలో పలు సంచలనాలు నమోదు చేసిన రిలయన్స్ జియో తన ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ సేవలను రేపు (గురువారం, సెప్టెంబరు 5) ప్రతిష్టాత్మకంగా లాంచ్ చేయనుంది. రిలయన్స్ జియో జిగాఫైబర్ పేరుతో ఈ సేవలను దేశవ్యాప్తంగా తీసుకురానుంది. ఈ మేరకు జియో వెబ్సైట్ ద్వారా ఇప్పటికే ఆన్లైన్ రిజిస్ట్రేషన్లు ప్రారంభించింది. జియో ఫైబర్ సేవల కోసం జియో వెబ్ సైట్లో అడ్రస్ తెలిపి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి వుంటుంది. దేశంలోని 1600 పట్టణాల నుంచి 15 లక్షలకు పైగా రిజిస్ట్రేషన్లు పూర్తయినట్టు సమాచారం. జియో ఫైబర్ ప్లాన్స్ విషయానికి వస్తే.. ప్రీమియం వినియోగదారులకు ప్లాన్లు నెలకు రూ. 700 నుంచి రూ. 10వేల వరకు ఉండనున్నాయి. ప్రస్తుతం జియో ఫైబర్ సేవలను ప్రీపెయిడ్ రూపంలో అందిస్తామని, భవిష్యత్‌లో పోస్ట్ పెయిడ్ సేవలను కూడా అందుబాటులోకి తెస్తామని జియో ఇటీవల తెలిపింది. జియో ఫైబర్ వెల్ కమ్ ఆఫర్ కింద వార్షిక ప్లాన్‌ను ఎంచుకున్న వినియోగదారులకు ఫుల్ హెచ్డీ టీవీ లేదా 4కే టీవీ, 4కే సెట్ టాప్ బాక్సులను ఉచితంగా జియో అందించనుంది. అంతేకాదు జియో ఫైబర్ ‘జియో ఫస్ట్ డే ఫస్ట్ షో’ ప్లాన్ ను కూడా అందిస్తోంది. ఈ సదుపాయంతో జియో ఫైబర్ ప్రీమియం కస్టమర్లు కొత్త సినిమాలను థియేటర్ కు వెళ్లకుండానే, ఇంట్లో కూర్చొని వీక్షించవచ్చు. అయితే, ఈ సర్వీస్ 2020 మధ్యనాటికి అందుబాటులోకి రానుంది. జియో ఫైబర్ కనెక్షన్ కోసం ఎలా దరఖాస్తు చేయాలి రిలయన్స్ జియో ఫైబర్ లింక్‌కు వెళ్లండి. జియో ఫైబర్ కనెక్షన్‌ను యాక్సెస్ చేయదలిచిన చోట మీ చిరునామాను (ఇల్లు లేదా కార్యాలయం) పేర్కొనాలి. అనంతరం తరువాతి పేజీలో పేరు, మొబైల్ నంబర్ ఇమెయిల్ ఐడీ వంటి వివరాలను నమోదు చేయాలి. ఈ ప్రక్రియ ముగిసాక, మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కి ఓటీపీ వస్తుంది. దాన్ని సంబంధిత బాక్స్‌లో ఎంటర్ చేయాలి. ఓటీపీ నిర్ధారించబడిన తర్వాత, జియో సేల్స్ ప్రతినిధికి జియో ఫైబర్ కనెక్షన్ పొందడానికి అవసరమైన పత్రాన్ని (ఆధార్ కార్డు, ఓటరు ఐడి కార్డు, పాన్ కార్డు, పాస్‌పోర్టు, డ్రైవింగ్ లైసెన్స్ లలో ఏదో ఒకదాన్ని) అందచేస్తే సరిపోతుంది. ఇటీవల 42వ వార్షిక సర్వసభ్య సమావేశం(ఏజీఎం) సందర్భంగా జియో ఫైబర్ బ్రాడ్‌బాండ్ వాణిజ్య సేవలను సెప్టెంబర్ 5న ప్రారంభించనున్నామని ఆర్ఐఎల్ చైర్మన్ ముకేశ్ అంబానీ ప్రకటించిన సంగతి తెలిసిందే. చదవండి : ముకేశ్.. మెగా డీల్స్! జియో ఫైబర్ సంచలనం : బంపర్ ఆఫర్లు -
పెరుగుతున్న బ్రాడ్‌బ్యాండ్ వినియోగదారులు
న్యూఢిల్లీ: దేశంలో బ్రాడ్‌బ్యాండ్ వినియోగదారుల సంఖ్య జోరుగా పెరుగుతోంది. డేటా వినియోగం భారీగా వృద్ది చెందుతోందని, ఈ ఏడాది ఆగస్టులో బ్రాడ్‌బ్యాండ్ వినియోగదారుల సంఖ్య 46.36 కోట్లకు పెరిగిందని టెలికం డిపార్ట్మెంట్(డీఓటీ) తెలిపింది. అంతకు ముందటి నెల జూలైలో ఉన్న వినియోగదారుల సంఖ్య(46 కోట్లు)తో పోల్చితే 0.74 శాతం వృద్ధి నమోదైందని పేర్కొంది. డాట్ వెల్లడించిన గణాంకాల ప్రకారం.., ∙ఈ ఏడాది జూలైతో పోల్చితే ఆగస్టులో మొత్తం ఫోన్ వినియోగదారుల సంఖ్య 97.3 లక్షలు పెరిగి 118.9 కోట్లకు చేరింది. వీరిలో వైర్‌లైన్ ఫోన్ వినియోగదారుల వృద్ధి అంతంతమాత్రంగా ఉండగా, వైర్లెస్ వినియోగదారుల సంఖ్య 0.84 శాతం వృద్ధిచెంది 116.7 కోట్లకు ఎగసింది. ∙ఈ ఆగస్టులో మొత్తం ఫోన్ కనెక్షన్లు అధికంగా ముంబైలో పెరిగాయి. ముంబైలో 19.35 లక్షల ఫోన్ కనెక్షన్లు పెరిగాయి. -
టాటా స్కై బ్రాడ్‌బ్యాండ్ సేవలు: ఆఫర్లు, ప్లాన్లు ఇవే!
న్యూఢిల్లీ : రిలయన్స్ జియో గిగాఫైబర్ సేవలు ప్రజల్లోకి ఆవిష్కరిస్తున్న తరుణంలో, డీటీహెచ్ సర్వీసుల సంస్థ టాటా స్కై దానికి పోటీగా వచ్చేసింది. టాటా స్కై కూడా బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ సర్వీసులను దేశవ్యాప్తంగా ఉన్న 12 నగరాల్లో లాంచ్ చేసింది. న్యూఢిల్లీ, గుర్గావ్, నోయిడా, ఘజియాబాద్, ముంబై, థానే, పుణే, అహ్మదాబాద్, మిరా భాయందర్, భోపాల్, చెన్నై, బెంగళూరు ప్రాంతాల్లో టాటా స్కై బ్రాడ్‌బ్యాండ్ సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. ఒక నెల, మూడు నెలలు, ఐదు నెలలు, తొమ్మిది నెలలు, 12 నెలల పాటు వాలిడిటీతో ఈ సేవలు మార్కెట్లోకి వచ్చాయి. ఒక నెల టారిఫ్ ప్లాన్ 999 రూపాయలతో ప్రారంభమైంది. దీని కింద 5ఎంబీపీఎస్ స్పీడులో అపరిమిత డేటాను అందించనుంది. 5ఎంబీపీఎస్, 10ఎంబీపీఎస్, 30ఎంబీపీఎస్, 50ఎంబీపీఎస్ డేటా స్పీడులో సబ్స్క్రైబర్లకు ఇంటర్నెట్ అందుబాటులో ఉంటుంది. ఒక్కసారి యూజర్‌కు కేటాయించిన అలవెన్స్ పడిపోతే, స్పీడ్ 1ఎంబీపీఎస్‌కు పడిపోనుంది. టాటా స్కై ఒక నెల ప్లాన్.. ఒక నెల డేటా ప్లాన్ 5ఎంబీపీఎస్, 10ఎంబీపీఎస్, 30ఎంబీపీఎస్, 50ఎంబీపీఎస్, 100 ఎంబీపీఎస్ స్పీడులో 999 రూపాయలుకు, 1150 రూపాయలకు, 1,500 రూపాయలకు, 1,800 రూపాయలకు, 2,500 రూపాయలకు అందుబాటులో ఉంది. అన్ని ప్లాన్లు అపరిమిత డేటాను ఆఫర్ చేయనున్నాయి. అయితే ఇన్స్టాలేషన్ ఫీజు కింద సబ్స్క్రైబర్లు 1200 రూపాయలను చెల్లించాల్సి ఉంది. దీనిపై సబ్స్క్రైబర్లకు ఉచితంగా వై-ఫై రూటర్ లభించనుంది. 60జీబీ, 125జీబీ పరిమితిలో రూ.999కు, రూ.1,250కు రెండు ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి. టాటా స్కై మూడు నెలల ప్లాన్.. మూడు నెలల డేటా ప్లాన్ 5ఎంబీపీఎస్, 10ఎంబీపీఎస్, 30ఎంబీపీఎస్, 50ఎంబీపీఎస్, 100 ఎంబీపీఎస్ స్పీడులో 2,997 రూపాయలుకు, 3,450 రూపాయలకు, 4,500 రూపాయలకు, 5,400 రూపాయలకు, 7,500 రూపాయలకు అందుబాటులో ఉంది. అన్ని ప్లాన్లు అపరిమిత డేటాను ఆఫర్ చేయనున్నాయి. అయితే ఇన్స్టాలేషన్ ఫీజు కింద సబ్స్క్రైబర్లు 1200 రూపాయలను చెల్లించాల్సి ఉంది. దీనిపై సబ్స్క్రైబర్లకు ఉచితంగా వై-ఫై రూటర్ లభించనుంది. 60జీబీ, 125జీబీ పరిమితిలో రూ.2,997కు, రూ.3,750కు రెండు ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి. టాటా స్కై 12 నెలల ప్లాన్.. 12 నెలల డేటా ప్లాన్ 5ఎంబీపీఎస్, 10ఎంబీపీఎస్, 30ఎంబీపీఎస్, 50ఎంబీపీఎస్, 100 ఎంబీపీఎస్ స్పీడులో 11,988 రూపాయలుకు, 13,800 రూపాయలకు, 18,000 రూపాయలకు, 21,600 రూపాయలకు, 30,000 రూపాయలకు అందుబాటులో ఉంది. అన్ని ప్లాన్లు అపరిమిత డేటాను ఆఫర్ చేయనున్నాయి. అయితే ఇన్స్టాలేషన్ ఫీజు కింద సబ్స్క్రైబర్లు 1200 రూపాయలను చెల్లించాల్సి ఉంది. దీనిపై సబ్స్క్రైబర్లకు ఉచితంగా వై-ఫై రూటర్ లభించనుంది. 60జీబీ, 125జీబీ పరిమితిలో రూ.11,988కు, రూ.15,000కు రెండు ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి. ఐదు నెలలు, తొమ్మిది నెలల వాలిడిటీతో మరో రెండు ప్లాన్లు ఉన్నాయి. -
యూజర్లకు గుడ్‌న్యూస్ : జియోకు కౌంటర్
టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్టెల్, బ్రాడ్‌బ్యాండ్ మార్కెట్లోనూ రిలయన్స్ జియోకు కౌంటర్ ఇస్తోంది. రిలయన్స్ జియో తన గిగాఫైబర్ బ్యాండ్ సర్వీసులను దేశవ్యాప్తంగా ఆవిష్కరిస్తున్న క్రమంలో, భారతీ ఎయిర్టెల్ తన హోమ్ బ్రాడ్‌బ్యాండ్ యూజర్లకు గుడ్‌న్యూస్ చెప్పింది. కొన్ని బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్లపై అపరిమిత డేటాను వాడుకోవచ్చని ఎయిర్టెల్ పేర్కొంది. దీని కోసం ఫేర్ యూసేజ్ పాలసీ డేటా పరిమితిని ఎయిర్టెల్ తొలగించేస్తున్నట్టు పేర్కొంది. 20కి పైగా కీలక మార్కెట్లలో ఎంపిక చేసిన నెలవారీ హోమ్ బ్రాడ్‌బ్యాండ్ ప్యాక్‌లపై ఉన్న ఫేస్ యూసేజ్ పాలసీ డేటా పరిమితిని తొలగిస్తున్నట్టు ఎయిర్టెల్ ప్రకటించింది. దీంతో కస్టమర్లకు అపరిమిత డేటా లభించనుంది. ఇప్పటి వరకు కేవలం హైదరాబాద్‌కు మాత్రమే అపరిమిత హోమ్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్లను ఎయిర్టెల్ ఆఫర్ చేసేది. దీన్ని ఇతర మేజర్ మార్కెట్లకు కూడా విస్తరిస్తోంది. దీంతో తనకున్న 2.4 మిలియన్ యాక్టివ్ వైర్డ్ బ్రాడ్‌బ్యాండ్ యూజర్లను కాపాడుకోవాలని ఎయిర్టెల్ చూస్తోంది. గత నెలలో 300ఎంబీపీఎస్ వరకు స్పీడ్ ఉన్న హోమ్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్లను ఎంపిక చేసుకున్న వారికి ఆరు నెలలు, ఏడాది పాటు 15 శాతం, 20 శాతం డిస్కౌంట్లను ఎయిర్టెల్ ఆఫర్‌చేసింది. ఎయిర్టెల్ అపరిమిత హోమ్ బ్రాడ్‌బ్యాండ్ డేటా ప్లాన్లను, కరెక్ట్‌గా జియో గిగాఫైబర్ సర్వీసులు మార్కెట్లోకి వచ్చే సమయంలో ఆఫర్ చేస్తోంది. కాగ, ఆగస్టు 15 నుంచే రిలయన్స్ జియో తన అప్‌కమింగ్ గిగాఫైబర్ బ్యాండ్ సర్వీసుల రిజిస్ట్రేషన్లను ప్రారంభించింది. కేవలం రూ.500కే హై-స్పీడ్, వైర్డ్ బ్రాడ్‌బ్యాండ్ సర్వీసులను ఇంటర్నెట్ ఆధారిత టెలివిజన్ ప్రొగ్రామింగ్ ఆధారితంగా అందిస్తోంది. అపరిమిత ప్యాక్లుగా మారబోతున్న ఎయిర్టెల్ డేటా ప్లాన్లు... ముంబైలో 699 రూపాయలు, 1,999 రూపాయల ప్లాన్లు అహ్మదాబాద్, గాంధీనగర్, జమ్నాగర్‌లో 499 రూపాయలు, 599 రూపాయలు, 1,099 రూపాయల ప్లాన్లు చంఢీఘర్, ఢిల్లీ, గుర్గావ్, నోయిడా, ఘజియాబాద్, జైపూర్, ఇండోర్, కోల్‌కత్తాల్లో 1,999 ప్లాన్ ఆగ్రా, అంబాలా, కర్నల్‌ల్లో 499 రూపాయలు, 1,999 రూపాయల ప్లాన్లు ‘ఎయిర్టెల్ మొత్తం హోమ్ బ్రాండ్ నెట్వర్క్ ప్రస్తుతం వి-ఫైబర్ ఆఫర్ చేస్తుంది. దీని కింద 300 ఎంబీపీఎస్ స్పీడులో డేటా లభ్యవుతుంది. ఒకవేళ కస్టమర్లకు అవసరమైతే, 1 జీబీపీఎస్ స్పీడుకు అప్‌గ్రేడ్ చేస్తాం’ అని ఎయిర్టెల్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ చెప్పారు. ప్రస్తుతం 89 ప్రాంతాల్లో ఉన్న బ్రాడ్‌బ్యాండ్ నెట్‌వర్క్‌ను కనీసం 100 కీ నగరాలకు విస్తరించేందుకు ఆర్థిక సంవత్సరం 2019 కోసం రూ.24వేల కోట్లను పక్కన తీసి పెట్టినట్టు మరో సీనియర్ ఎయిర్టెల్ ఎగ్జిక్యూటివ్ చెప్పారు. 2021 వరకు మరో 10 మిలియన్ పైగా గృహాలకు తమ నెట్‌వర్క్‌ను కనెక్ట్ చేయాలని ఎయిర్టెల్ లక్ష్యంగా పెట్టుకుంది. -
హ్యాపీ అవర్స్! ముఖేష్ తర్వాత హిట్‌లిస్ట్ వారే!
బ్రాడ్‌బ్యాండ్ మార్కెట్లో రిలయన్స్ జియో హ్యాపీ అవర్స్ ప్రారంభం కాబోతున్నాయి. ముఖేష్ అంబానీ తర్వాత హిట్‌లిస్ట్‌గా కేబుల్ ఆపరేటర్స్ ఛార్జ్ చేసే దానికంటే సగం తక్కువగా ఇంటర్నెట్ ఆధారిత టెలివిజన్ ప్రొగ్రామింగ్ సర్వీసులను(జియోగిగాఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ సర్వీసులను) ఆఫర్ చేసేందుకు జియో సన్నద్ధమైంది. వీటి ప్రారంభ ధర 500 రూపాయలుగా కంపెనీ నిర్ణయించిందని సంబంధిత వర్గాలు చెప్పాయి. జియోగిగాఫైబర్‌ను దివాళి కంటే ముందస్తుగానే కమర్షియల్‌గా ఆవిష్కరించాలని కంపెనీ యోచిస్తోంది. ఈ సర్వీసుల అందుబాటు ఆగస్టు 15 నుంచే ప్రారంభమయ్యే వినియోగదారుల రిజిస్ట్రేషన్లను బట్టి ఉంటుంది. ఏ ప్రాంతంలో అయితే ఎక్కువ రిజిస్ట్రేషన్లు నమోదు అవుతాయో, అక్కడ తొలుత ఈ సర్వీసులను అందజేయనున్నారు. ఇలా దివాళి కల్లా కమర్షియల్‌గా ఆవిష్కరించడం పూర్తయి పోవాలని కంపెనీ చూస్తోంది. తొలుత మెట్రోల్లో, ఆ అనంతరం 80 టాప్ టైర్ 1, టైర్ 2 మార్కెట్లలో అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం హోమ్ బ్రాడ్‌బ్యాండ్ ప్యాక్స్‌ను కేబుల్ ఆపరేటర్స్ ఆఫర్ చేస్తున్నరు. నెలకు 700 రూపాయల నుంచి 1000 రూపాయల మధ్యలో 100 జీబీ డేటాను, 100 ఎంబీపీఎస్ స్పీడులో అందజేస్తున్నారు. అదనంగా టీవీ సర్వీసులకు ఒక్కో ఇంటికి 250 రూపాయల నుంచి 300 రూపాయలు తీసుకుంటున్నారు. జియో కూడా అదేరకమైన ఆఫర్‌ను అంటే 100జీబీ డేటాను 100 ఎంబీపీఎస్ స్పీడులో వాటికంటే 50 శాతం తక్కువ ధరకే అందజేయబోతుంది. కంపెనీ హోమ్ బ్రాడ్‌బ్యాండ్ సర్వీసుల ధరలు ప్రస్తుతమున్న 4జీ మొబైల్ డేటా రేట్లకు 25 శాతం నుంచి 30 శాతం డిస్కౌంట్లో లభించనున్నాయని విశ్లేషకులు అంచనావేస్తున్నారు. అంటే ఒక్క జీబీ డేటా కేవలం రూ.2.7 నుంచి రూ.5కే లభ్యం కానుందని హెచ్ఎస్బీసీ డైరెక్టర్, టెలికాం విశ్లేషకులు రాజీవ్ శర్మ చెప్పారు. టీవీ సర్వీసులతో వస్తున్న జియో హోమ్ బ్రాడ్‌బ్యాండ్ సేవలు, తన సొంత 4జీ మొబైల్ డేటా వ్యాపారాలను దెబ్బకొట్టవని విశ్లేషకులు చెప్పారు. ఫైబర్ ఆధారిత హోమ్ బ్రాడ్‌బ్యాండ్ సేవల వీడియో స్ట్రీమింగ్ నాణ్యత, 4జీ మొబైల్ బ్రాడ్‌బ్యాండ్ కంటే ఎక్కువ విశ్వసనీయతతో, స్థిరంగా ఉంటాయని ఫిలిప్‌క్యాపిటల్ టెలికాం విశ్లేషకుడు నవీన్ కులకర్ని తెలిపారు.