2021 ఏడాది మధ్యలో స్టార్‌లింక్ బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ సేవలను భారతదేశంలో ప్రవేశ పెట్టడానికి స్పేస్‌ఎక్స్ సీఈఓ ఎలోన్ మస్క్ యోచిస్తున్నారు. ప్రస్తుతం ఈ బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ సేవలు యుఎస్ మరియు కెనడాలోని కొన్ని ప్రాంతాల్లోని బీటా యూజర్స్ కు మాత్రమే అందుబాటులో ఉంది. ప్రపంచవ్యాప్తంగా గ్రామీణ మరియు ఇంటర్నెట్ తక్కువగా ఉన్న ప్రాంతాలకు 2021లో ఇంటర్నెట్ కనెక్షన్‌ను అందించడానికి కంపెనీ వైడ్‌స్కేల్ ప్రయోగం చేస్తున్నట్లు టెస్లా వ్యవస్థాపకుడు ఎలోన్ మస్క్ ట్విటర్లో తెలిపారు. 2021 ఏడాదిలో స్టార్‌లింక్ బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ సేవలను భారత్లోకి తీసుకురావడానికి ఇక్కడి నిబంధనలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. (చదవండి: వన్‌ప్లస్ 9 స్మార్ట్ ఫోన్ కెమెరా ఫీచర్స్ వైరల్)
స్పేస్‌ఎక్స్ శాటిలైట్ గవెర్నమెంట్ అఫైర్స్ వైస్ ప్రెసిడెంట్ ప్యాట్రిసియా కూపర్, మెరుగైన బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ను భారత ప్రజలకు అందించడానికి రోడ్‌మ్యాప్‌లో భాగంగా టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(ట్రాయ్)తో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపారు. భారతదేశంలో ఉపగ్రహ - ఆధారిత బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ సాంకేతికత స్థాపన కోసం భారత ప్రభుత్వం తప్పక సాంకేతిక విధానాలను నవీకరించాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment