broadband
-
ఫైబర్ టెక్‌లో లక్ష కొలువులు..
ముంబై: బ్రాడ్‌బ్యాండ్, 5జీ నెట్వర్క్ సహా డిజిటల్ రంగం వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో వచ్చే అయిదేళ్లలో ఫైబర్ టెక్నాలజీ విభాగంలో ఉపాధి అవకాశాలు గణనీయంగా పెరగనున్నాయి. ఫైబర్ ఇన్స్టాలేషన్, మెయింటెనెన్స్, రిపేర్ సెగ్మెంట్లలో కొత్తగా లక్ష ఉద్యోగాలు రానున్నాయి. టీమ్‌లీజ్ సర్వీసెస్ చీఫ్ స్ట్రాటెజీ ఆఫీసర్ పి. సుబ్బురత్నం ఈ విషయాలు వెల్లడించారు. 2024లో దేశీయంగా టెలికం మార్కెట్ 48.61 బిలియన్ డాలర్లుగా ఉండగా ఏటా 9.40 శాతం వార్షిక వృద్ధి రేటుతో 2029 నాటికి 76.16 బిలియన్ డాలర్లకు చేరే అవకాశాలున్నాయని ఆయన పేర్కొన్నారు. 2023 నాటికి దేశవ్యాప్తంగా 7 లక్షల కిలోమీటర్ల మేర ఆప్టికల్ ఫైబర్ కేబుల్ వేయడం పూర్తయిందని, డిజిటల్ మౌలిక సదుపాయాలు విస్తరించడానికి ఇది గణనీయంగా ఉపయోగపడిందని వివరించారు. అసాధారణమైన స్పీడ్, తక్కువ లేటెన్సీ, మరింత మెరుగైన కనెక్టివిటీని అందిస్తూ 2030 నాటికి 5జీ టెక్నాలజీ మరింతగా విస్తరించనుందని సుబ్బురత్నం చెప్పారు. ‘ప్రభుత్వం, టెలికం సంస్థలు ఫైబర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విస్తరణపై దృష్టి పెడుతుండటంతో ఫైబర్ టెక్నీషియన్లకు డిమాండ్ గణనీయంగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. దీంతో కొత్తగా సుమారు లక్ష ఉద్యోగావకాశాలు రానున్నాయి‘ అని సుబ్బురత్నం చెప్పారు. ప్రస్తుతం దేశీయంగా ఫైబర్ టెక్నీషియన్ల సంఖ్య సుమారు 5 లక్షల పైగా ఉన్నట్లు అంచనా. ఇంజనీర్లు, టెక్నీషియన్లకు డిమాండ్... పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో నెట్వర్క్ విస్తరణ, మౌలిక సదుపాయాల కల్పనపై ప్రధానంగా దృష్టి పెట్టే టెలికం, ఐటీ, నిర్మాణ, తయారీ తదితర రంగాల్లో ఫైబర్ సాంకేతిక నిపుణుల అవసరం ఉంటుంది. ఫైబర్ ఇంజనీర్లు, ఫైబర్ టెర్మినేషన్ ఎక్విప్మెంట్ టెక్నీషియన్లు, ఇన్స్టాలేషన్.. రిపేరు, ఫాల్ట్ రిజల్యూషన్ టీమ్, ఫైబర్ సెల్‌సైట్ ఇంజనీర్లు, ఫీల్డ్ టెక్నీషియన్లు మొదలైన వర్గాలకు డిమాండ్ నెలకొనవచ్చని సుబ్బురత్నం చెప్పారు. అయితే, అట్రిషన్ రేటు అధిక స్థాయిలో వార్షికంగా 35–40%గా ఉంటోందన్నారు. సుదీర్ఘ పనిగంటలు, వేతనాల పెంపు చాలా తక్కువగా ఉండటం, ఉద్యోగులను ఇతర సంస్థలను ఎగరేసుకు పోతుండటం తదితర అంశాలు కారణమని వివరించారు. -
ప్చ్.. ఇంటర్నెట్ సేవలు బాగుండలేదు!
సాక్షి, అమరావతి: బ్రాడ్‌బ్యాండ్, ఫైబర్, డిజిటల్ సబ్‌స్క్రైబ్ లైన్ (డీఎస్ఎల్) సేవలపై దేశవ్యాప్తంగా సగానికిపైగా వినియోగదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వివిధ బ్రాడ్‌బ్యాండ్, డీఎస్ఎల్ ఇంటర్నెట్ ప్రొవైడర్ సంస్థల నుంచి సేవలు పొందుతున్న వినియోగదారులు ఎదుర్కొంటున్న సమస్యలపై లోకల్ సర్కిల్ సంస్థ ఇటీవల దేశవ్యాప్తంగా నిర్వహించిన సర్వేలో ఈ అంశం వెల్లడైంది. 319 కంటే ఎక్కువ జిల్లాల్లో 33 వేల మంది వినియోగదారుల నుంచి ఈ సర్వేలో అభిప్రాయాలను సేకరించారు. సర్వేలో 64 శాతం మంది పురుషులు, 36 శాతం మహిళలు పాల్గొన్నారు. ప్రశ్నల రూపంలో వినియోగదారుల నుంచి సమాధానాలు రాబట్టడం ద్వారా సర్వే నిర్వహించారు. కాగా, తమ కనెక్షన్లో ప్రతి నెలా మూడు అంతకంటే ఎక్కువ సమస్యలు ఉత్పన్నం అవుతున్నట్టు 56 శాతం మంది వెల్లడించారు. వీటి పరిష్కారానికి 24 గంటల కంటే ఎక్కువ సమయాన్ని సర్వీస్ ప్రొవైడర్లు తీసుకుంటున్నాయని 53 శాతం మంది తెలిపారు. స్పీడ్ సరిపోవడం లేదుతాము ఎంచుకున్న ప్లాన్‌కు, ఇంటర్నెట్ స్పీడ్‌కు మధ్య చాలా వ్యత్యాసం ఉంటోందని చాలామంది వినియోగదారులు అభిప్రాయపడ్డారు. సర్వీస్ ప్రొవైడర్లు ముందుగా వాగ్దానం చేసిన దానికంటే తక్కువ స్పీడ్ ఇంటర్నెట్ అందిస్తున్నాయని 66 శాతం మంది వెల్లడించారు. ఇంటర్నెట్ స్పీడ్ అంశంపై 8,430 మంది నుంచి అభిప్రాయాలను సేకరించగా.. తాము చెల్లిస్తున్న దానికంటే ఇంటర్నెట్ స్పీడ్ చాలా తక్కువగా ఉంటోందని 33 శాతం మంది తెలిపారు.21 శాతం మంది ఎలాంటి సమస్యలు ఉండటం లేదన్నారు. ఎటువంటి సమస్యలు లేకుండా మీకు ఇంటర్నెట్ సరఫరా కొనసాగుతోందా? అని 8,430 మందిని సర్వేలో ఆరా తీయగా.. 25 శాతం మంది నెలలో ఒకటి, రెండుసార్లు అవాంతరాలు ఎదురవుతున్నట్టు వెల్లడించారు. మరో 19 శాతం మంది 3నుంచి 5సార్లు, 21 శాతం మంది 5–10 సార్లు, 16 శాతం మంది 10కి పైగా అవాంతరాలను ఎదుర్కొంటున్నట్టు వివరించారు. మిగిలిన 19 శాతం మంది మాత్రం తమకు ఎటువంటి అవాంతరాలు ఎదురవడం లేదని స్పష్టం చేశారు. తక్షణ స్పందన ఉండటం లేదుఇంటర్నెట్ సరఫరాలో సమస్యలు తలెత్తినప్పుడు ఫిర్యాదులు చేసిన సమయంలో సర్వీస్ ప్రొవైడర్ల నుంచి తక్షణ స్పందన ఉండటం లేదని ఎక్కువ మంది తెలిపారు. సర్వీస్ ప్రొవైడర్లు ఫిర్యాదులు నివృత్తి చేసే అంశంపై 7,885 మంది నుంచి సర్వీస్‌లో వివరాలు సేకరించారు. కాగా, 38 శాతం మంది 24 గంటల్లోపు తమ ఫిర్యాదులు నివృత్తి అవుతున్నట్టు వివరించారు. 30 శాతం మంది 1 నుంచి 3 రోజులు, 5 శాతం మంది 4–7 రోజులు, 11 శాతం మంది 7 రోజులకు పైగా సమయం పడుతోందన్నారు. 8 శాతం మంది ఏమీ చెప్పలేమన్నారు. -
బీఎస్ఎన్ఎల్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. మరింత మెరుగ్గా బ్రాడ్‌బ్యాండ్ సేవలు
ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ తమ బ్రాడ్‌బ్యాండ్ సేవలు మరింత మెరుగుపరిచేందుకు చర్యలు చేపట్టింది. భారత్‌ఫైబర్ పేరిట అందిస్తున్న బ్రాడ్‌బ్యాండ్ సేవలకు సంబంధించిన కస్టమర్ల కోసం నిరంతర టోల్‌ఫ్రీ హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపింది. భారత్‌ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ కస్టమర్ల కోసం 1800 4444 నెంబర్‌తో 24/7 నిరంతర హెల్ప్‌లైన్‌ను ప్రారంభించినట్లు ట్విటర్ ద్వారా బీఎస్ఎన్ఎల్ పేర్కొంది. బ్రాడ్‌బ్యాండ్‌కు సంబంధించి ఏ సమస్య ఉన్నా కస్టమర్లు ఈ హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేసి పరిష్కరించుకోవచ్చు. కాగా భారత్‌ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ ద్వారా జీ5, డిస్నీప్లస్ హాట్‌స్టార్, సోనీలివ్ వంటి ఓటీటీ సేవలు అందిస్తున్న విషయం తెలిసిందే. #BSNL has launched its 24/7 toll-free no. 1800-4444 for #BharatFibre Broadband customers.#G20India pic.twitter.com/T2yV1jyNpu — BSNL India (@BSNLCorporate) June 15, 2023 -
మొబైల్ స్పీడ్‌లో మెరుగుపడ్డ భారత్.. 5జీ రాకతో దూకుడు!
దేశంలో 5జీ సేవలు విస్తృతం కావడంతో మొబైల్ స్పీడ్‌లో భారత్ మెరుగుపడింది. ప్రపంచవ్యాప్తంగా సగటు మొబైల్ వేగంలో మన దేశం జనవరిలో 10 స్థానాలు ఎగబాకింది. డిసెంబర్లో 79వ స్థానంలో ఉన్న భారత్ జనవరిలో 69వ స్థానానికి చేరుకున్నట్లు ఊక్లా నివేదిక పేర్కొంది. ఫిక్స్డ్ బ్రాడ్‌బ్యాండ్ స్పీడ్‌లోనూ భారత్ తన ర్యాంకింగ్‌ను మెరుగుపరుచుకుంది. డిసెంబర్లో 81వ స్థానంలో ఉండగా జనవరిలో 79వ స్థానానికి చేరుకుందని నెట్వర్క్ ఇంటెలిజెన్స్, కనెక్టివిటీ ఇన్సైట్స్ ప్రొవైడర్ ఊక్లా నివేదించింది. ఫిక్స్డ్ మొబైల్ స్పీడ్ సగటు డిసెంబర్లో 49.14 ఎంబీపీఎస్ ఉండగా జనవరిలో 50.02 ఎంబీపీఎస్‌కి స్వల్పంగా పెరిగింది. కాగా ఓవరాల్ మొబైల్ స్పీడ్ సగటులో భారత్ నవంబర్‌లో 105వ స్థానంలో ఉండేది. ఈ ఓవరాల్ మొబైల్ స్పీడ్ సగటు గత డిసెంబర్లో 25.29 ఎంబీపీఎస్ ఉండగా జనవరిలో 29.85 ఎంబీపీఎస్‌కు మెరుగుపడింది. జనవరి స్పీడ్‌టెస్ట్ గ్లోబల్ ఇండెక్స్ ప్రకారం.. ప్రపంచ ఓవరాల్ సగటు మొబైల్ స్పీడ్ చార్ట్‌లో యూఏఈ అగ్రస్థానంలో ఉంది. ఇదే సమయంలో పపువా న్యూగినియా ర్యాంక్ ఏకంగా 24 స్థానాలు మెరుగుపడటం గమనార్హం. ఇక ఫిక్స్డ్ మొబైల్ స్పీడ్ సగటులో సింగపూర్ మొదటి స్థానంలో ఉండగా సైప్రస్ 20 స్థానాలను మెరుగుపరుచుకుంది. -
బ్రాడ్‌బ్యాండ్ నిర్వచనం మార్పు
న్యూఢిల్లీ: బ్రాడ్‌బ్యాండ్ కనెక్టివిటీ నిర్వచనాన్ని ప్రభుత్వం సవరించింది. కనీస డౌన్లోడ్ స్పీడ్‌ను 2 ఎంబీపీఎస్‌కు (మెగాబిట్స్ పర్ సెకండ్) పెంచింది. 2013 జూలై నాటి నిర్వచనం ప్రకారం ఇది 512 కేబీపీఎస్‌గా (కిలోబిట్స్ పర్ సెకండు) ఉండేది. తాజా మార్పులు తక్షణమే అమల్లోకి వచ్చేలా కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రధానంగా గ్రామీణ, సెమీ అర్బన్ ప్రాంత వినియోగదారులకు ఈ కొత్త నిర్వచనంతో ప్రయోజనం చేకూరగలదని బ్రాడ్‌బ్యాండ్ ఇండియా ఫోరం ప్రెసిడెంట్ టీవీ రామచంద్రన్ చెప్పారు. డౌన్లోడ్ స్పీడ్‌ను బట్టి ఫిక్సిడ్ బ్రాడ్‌బ్యాండ్‌ను బేసిక్, ఫాస్ట్, సూపర్ ఫాస్ట్ అని మూడు రకాలుగా వర్గీకరిస్తారు. ఊక్లా నిర్వహించే స్పీడ్‌టెస్ట్ గ్లోబల్ ఇండెక్స్ ప్రకారం గతేడాది డిసెంబర్లో భారత్‌లో సగటున మొబైల్ డౌన్లోడ్ స్పీడ్ 25.29 ఎంబీపీఎస్‌గా నమోదైంది. నవంబర్‌లో ఇది 18.26 ఎంబీపీఎస్‌గా ఉండేది. 2022 నవంబర్ 30 నాటికి దేశీయంగా 82.54 కోట్ల మంది బ్రాడ్‌బ్యాండ్ యూజర్లు ఉండగా, వీరిలో 79.35 కోట్ల మంది వైర్లెస్ బ్రాడ్‌బ్యాండ్ సబ్‌స్క్రయిబర్స్ ఉన్నారు. -
అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారు
న్యూఢిల్లీ: బడా టెక్ కంపెనీలు టెలికం రంగంలోకి దొడ్డిదారిన ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్నాయన్న వార్తలను బ్రాడ్‌బ్యాండ్ ఇండియా ఫోరం (బీఐఎఫ్) ఖండించింది. టెక్ కంపెనీలపై అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని ఆరోపించింది. సొంత అవసరాలకు ఉపయోగించుకునే క్యాప్టివ్ నెట్‌వర్క్‌లకు (సీఎన్‌పీఎన్) కావాల్సిన స్పెక్ట్రం కోసం కూడా వేలంలో పాల్గొనాలన్న వాదనలు పూర్తిగా అసంబద్ధమైనవని వ్యాఖ్యానించింది. రెండు వేర్వేరు రకాల సర్వీసులు, పబ్లిక్..ప్రైవేట్ నెట్‌వర్క్‌లను నిర్వహించే కంపెనీలకు ఒకే తరహాలో సమాన వ్యాపార అవకాశాలు కల్పించాలంటూ తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నారని బీఐఎఫ్ పేర్కొంది. టెక్ కంపెనీలు తమ సామర్థ్యాలను పెంచుకునేందుకు మాత్రమే క్యాప్టివ్ నెట్‌వర్క్‌లు ఉపయోగపడతాయి తప్ప ప్రజలకు సర్వీసులు అందించేందుకు కాదని స్పష్టం చేసింది. సీఎన్‌పీఎన్‌లకు స్పెక్ట్రం ఇచ్చేందుకు ప్రతిపాదించిన నాలుగు విధానాల్లోనూ టెల్కోల ప్రమేయం ఉంటుందని బీఐఎఫ్ తెలిపింది. వాస్తవానికి ఒక విధానంలో ప్రైవేట్ కంపెనీలతో పోలిస్తే టెల్కోల వైపే ఎక్కువ మొగ్గు కూడా ఉందని వివరించింది. ఈ నేపథ్యంలో టెల్కోలకు దీటుగా తమకే సమాన అవకాశాలు కల్పించాల్సి ఉంటుందని బీఐఎఫ్ పేర్కొంది. ప్రైవేట్ 5జీ నెట్‌వర్క్‌లకు స్పెక్ట్రంను కేటాయించడం సరికాదంటూ టెల్కోల సమాఖ్య సీవోఏఐ ఆక్షేపించిన నేపథ్యంలో బీఐఎఫ్ స్పందన ప్రాధాన్యం సంతరించుకుంది. క్యాప్టివ్ నెట్‌వర్క్‌ల కోసం స్పెక్ట్రం కేటాయించడమంటే టెక్ కంపెనీలకు దొడ్డిదారిన టెలికంలోకి ఎంట్రీ ఇచ్చినట్లే అవుతుందంటూ సీవోఏఐ ఆరోపించింది. -
టెల్కోలు, వైఫై సంస్థలు జట్టు కట్టాలి
న్యూఢిల్లీ: డిజిటల్ మౌలిక సదుపాయాలను మెరుగుపర్చే దిశగా కొత్త వ్యాపార విధానాలను అమలు చేసేందుకు టెల్కోలు, వైఫై సంస్థలు కలిసి పని చేయాలని టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాట్ చైర్మన్ పి.డి. వాఘేలా సూచించారు. మొబైల్, వైఫై సాంకేతికతల సామర్థ్యాలను వెలికితీయాలని పేర్కొన్నారు. బ్రాడ్‌బ్యాండ్ ఇండియా ఫోరం (బీఐఎఫ్) కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయాలు తెలిపారు. 5జీ సర్వీసులు అందుబాటులోకి వస్తే డేటా వినియోగం అనేక రెట్లు పెరుగుతుందని వాఘేలా చెప్పారు. ‘5జీ బ్రాడ్కాస్ట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ల మధ్య కమ్యూనికేషన్, రోబోటిక్స్ మొదలైన టెక్నాలజీలతో డేటా వినియోగం భారీగా పెరుగుతుంది‘ అని తెలిపారు. ప్రస్తుతం 5జీ సేవలు అందుబాటులో ఉన్న దక్షిణ కొరియా, బ్రిటన్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా, జర్మనీ తదితర దేశాల్లో స్మార్ట్‌ఫోన్ యూజర్లు 4జీతో పోలిస్తే 1.7–2.7 రెట్లు ఎక్కువగా మొబైల్ డేటా వినియోగిస్తున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయని వాఘేలా వివరించారు. బ్రాడ్‌బ్యాండ్ కనెక్టివిటీని పెంచేందుకు పబ్లిక్ వైఫై కూడా ఎంతగానో ఉపయోగపడగలదని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే 2022 నాటికి 1 కోటి పబ్లిక్ వైఫై హాట్‌స్పాట్స్‌ను ఏర్పాటు చేయాలని 2018 నేషనల్ డిజిటల్ కమ్యూనికేషన్స్ పాలసీలో నిర్దేశించుకున్నట్లు వాఘేలా చెప్పారు. భవిష్యత్తులో వైఫై7 కూడా రాబోతోందని, దీనితో డేటా డౌన్లోడ్ వేగం మరింత పెరుగుతుందని పేర్కొన్నారు. -
16 రాష్ట్రాల్లో పీపీపీ మోడల్లో భారత్‌నెట్
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కోవిడ్–19 ప్రభావిత రంగాలకు ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజీలోని పలు పలు ప్రతిపాదనలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేబినెట్ సమావేశ వివరాలను కేంద్ర మంత్రులు ప్రకాష్ జవదేకర్, రవిశంకర్ ప్రసాద్, ఆర్.కె.సింగ్ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఆత్మనిర్భర్ భారత్ రోజ్‌గార్ యోజన పొడిగింపు ఉద్యోగ కల్పనకు వీలుగా కొత్త నియామకాలకు యజమాని, ఉద్యోగుల చందాను కేంద్రం భరిస్తూ ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్)కు చెల్లించడానికి వీలుగా ఆత్మనిర్భర్ భారత్ రోజ్‌గార్ యోజనను మార్చి 2022 వరకు పొడిగింపునకు కేబినెట్ ఆమోదం తెలిపింది. భారత్‌నెట్ కోసం రూ .19,041 కోట్ల సాధ్యత గ్యాప్ నిధులు భారత్ నెట్ ద్వారా ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్య విధానం(పీపీపీ)లో రూ. 19,041 కోట్ల మేర వయబులిటీ గ్యాప్ ఫండ్‌తో 16 రాష్ట్రాల్లోని గ్రామాల్లో బ్రాడ్ బ్యాండ్ సేవలు అందించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపిందని టెలికం మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. 16 రాష్ట్రాల్లోని 3,60,000 గ్రామాలను కవర్ చేయడానికి మొత్తం రూ . 29,430 కోట్లు ఖర్చవుతుంది. దేశంలోని 6 లక్షల గ్రామాలను 1,000 రోజుల్లో బ్రాడ్‌బ్యాండ్‌తో అనుసంధానం చేస్తామని 2020 ఆగస్టు 15న ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన తరువాత ప్రైవేట్ భాగస్వాములను చేర్చుకునే నిర్ణయం తీసుకున్నట్లు రవిశంకర్‌ప్రసాద్ తెలిపారు. ఈ రోజు వరకు 2.5 లక్షల గ్రామ పంచాయతీలలో 1.56 లక్షల పంచాయతీలు బ్రాడ్‌బ్యాండ్‌తో అనుసంధానితమయ్యాయని ఆయన చెప్పారు. విద్యుత్తు డిస్కమ్‌ల బలోపేతానికి రూ. 3.03 లక్షల కోట్ల వ్యయం విద్యుత్తు సరఫరా వ్యవస్థ బలోపేతానికి సంస్కరణల ఆధారంగా, ఫలితాల ప్రాతిపదికన డిస్కమ్‌లకు ఆర్థికంగా చేయూత ఇచ్చేందుకు రూ. 3.03 లక్షల కోట్ల విలువైన పథకానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. విద్యుత్ శాఖ మంత్రి ఆర్.కె.సింగ్ సంబంధిత వివరాలు వెల్లడిస్తూ విద్యుత్ పంపిణీ వ్యవస్థను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని, దీనికి అనుగుణంగా రూ. 3.03 లక్షల కోట్ల విలువైన కొత్త పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపిందని, ఇందులో రూ. 97,631 కోట్ల మేర కేంద్రం ఖర్చు చేస్తుందని తెలిపారు. సంస్కరణ ఆధారిత, ఫలితాల ప్రాతిపదికన పునరుద్ధరించిన విద్యుత్ పంపిణీ పథకాన్ని ఈ సంవత్సరం బడ్జెట్లో ప్రకటించారు. మౌలిక సదుపాయాల కల్పన, వ్యవస్థ ఆధునీకరణ, సామర్థ్యం పెంపు, ప్రక్రియ మెరుగుదల కోసం డిస్కమ్‌లకు ఆర్థిక సహాయం అందిస్తుంది. ఒక్కో రాష్ట్ర పరిస్థితిని బట్టి వేర్వేరుగా రూపొందించిన కార్యచరణకు అనుగుణంగా ఆర్థిక సహాయం అందుతుంది. 25 కోట్ల ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు అమర్చడం, వ్యవసాయానికి పగటి పూట కూడా విద్యుత్తు అందేలా రూ. 20 వేల కోట్లతో సౌర విద్యుత్తు పంపిణీకి వీలుగా 10 వేల ఫీడర్లను ఏర్పాటు చేయడం వంటి అంశాలు ఇందులో ఉన్నాయి. లోన్ గ్యారంటీ స్కీమ్‌కు ఆమోదం కోవిడ్ –19 మహమ్మారి వల్ల దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థకు తోడ్పడే ప్యాకేజీలో భాగంగా చిన్న, మధ్య తరహా వ్యాపారాలకు రూ .1.5 లక్షల కోట్ల అదనపు రుణాలు ఇచ్చేలా ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారంటీ స్కీమ్‌కు కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే ఆరోగ్య సంరక్షణ రంగానికి రూ. 50 వేల కోట్ల మేర, పర్యాటక సంస్థలకు, గైడ్లకు, ఇతర కోవిడ్ ప్రభావిత రంగాలకు రూ. 60 వేల కోట్ల మేర రుణాలు ఇచ్చేందుకు ఆర్థిక మంత్రి ప్రకటించిన లోన్ గ్యారంటీ స్కీమ్‌కు కేబినెట్ ఆమోదం తెలిపింది. -
బీఎస్ఎన్ఎల్ ప్రియులకు గుడ్ న్యూస్!
బీఎస్ఎన్ఎల్ మరో శుభవార్త చెప్పింది. అన్ని రకాల ఫిక్స్డ్ లైన్ కనెక్షన్ల తీసుకునే ఇన్స్టాలేషన్ ఛార్జీలను మాఫీ చేయాలని భారత ప్రభుత్వ టెలికం ఆపరేటర్ భారత్ సంచార్ నిగం లిమిటెడ్(బీఎస్ఎన్ఎల్) ప్రకటించింది. టెలికాం పీఎస్‌యు ఫైబర్ ఆప్టిక్ బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్లు, డీఎస్ఎల్ బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్లు, ల్యాండ్‌లైన్ సేవలు వంటి అనేక టెలికాం సేవలను అందిస్తుంది. ఈ సేవలకు సంబంధించి ఏప్రిల్ 30, 2021 వరకు ఏదైనా కొత్త కనెక్షన్ కోసం తీసుకుంటే ఇన్స్టాలేషన్ ఛార్జీలు మాఫీ కానునున్నట్లు టెలికామ్‌టాక్ నివేదించింది. బీఎస్ఎన్ఎల్ 2021 ఏప్రిల్ 8న దీనికి సంబంధించి సమాచారాన్ని ఒక సర్క్యులర్ ద్వారా ప్రకటించింది. ఈ ఆఫర్ పాన్-ఇండియా మొత్తం అందుబాటులో ఉంటుంది. అంటే ఇది ఏ ప్రత్యేక సర్కిల్‌కు మాత్రమే పరిమితం కాదు. ఢిల్లీలోని బీఎస్ఎన్ఎల్ ప్రధాన కార్యాలయం ప్రతి ఇతర రాష్ట్రలోని, సర్కిల్లలోని వెబ్సైట్లో సమాచారాన్ని నవీకరించాలని పేర్కొంది. అంతేకాకుండా, నిబంధనలు వెంటనే అమలు చేయాలనీ సూచించింది. అంటే ఈ అఫర్ 2021 ఏప్రిల్ 30 వరకు మాత్రమే వర్తిస్తుంది అన్నమాట. కొత్త బ్రాడ్‌బ్యాండ్ లేదా ల్యాండ్‌లైన్ కనెక్షన్‌ను పొందాలనుకునే ఏ యూజర్ అయినా ఇన్స్టాలేషన్ ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. బీఎస్ఎన్ఎల్ సాధారణంగా బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ల తీసుకునేటప్పుడు వినియోగదారుల నుంచి ఇన్స్టాలేషన్ ఛార్జీగా రూ.250 వసూలు చేస్తుంది. చదవండి: 6జీ టెక్నాలజీ అభివృద్ధి దిశగా ఎల్జీ కంపెనీ! -
వైఫై బూత్‌లు వస్తున్నాయ్!
న్యూఢిల్లీ: దేశంలో బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ను మరింత అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పబ్లిక్ డేటా ఆఫీస్ (పీడీఓ)ల ద్వారా పబ్లిక్ వైఫై నెట్‌వర్క్‌లను నెలకొల్పే ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ‘పీఎం–వాణి’గా వ్యవహరించే ఈ పబ్లిక్ వైఫై యాక్సెస్ నెట్వర్క్ ఇంటర్ఫేజ్... దేశంలో భారీ వైఫై విప్లవానికి తెరతీయనుంది. పబ్లిక్ డేటా ఆఫీస్ (పీడీఓ), పబ్లిక్ డేటా ఆఫీస్ అగ్రిగేటర్లు(పీడీఓఏ), యాప్ డెవలపర్లు ఇలా వివిధ వర్గాల భాగస్వామ్యంతో ఈ పబ్లిక్ వైఫై నెట్‌వర్క్‌లను నెలకొల్పనున్నారు. ‘పీడీఓలకు లైసెన్స్, రిజిస్ట్రేషన్, అలాగే ఫీజు వంటివి ఏవీ వర్తించవు. చిన్న షాపులు లేదా కామన్ సర్వీస్ సెంటర్ల రూపంలో ఈ పీడీఓలు ఉంటాయి’ అని కేబినెట్ సమావేశం అనంతరం టెలికం మంత్రి రవి శంకర్ ప్రసాద్ విలేకరులకు తెలిపారు. ఎలా పనిచేస్తుందంటే... వైఫై యాక్సెస్ పాయింట్ల ఏర్పాటు, నిర్వహణ, అలాగే సబ్స్క్రయిబర్లకు బ్రాడ్‌బ్యాండ్ సేవలను అందించడం వంటివన్నీ పీడీఓ నిర్వర్తిస్తుంది. పీడీఓలకు అగ్రిగేటర్‌గా వ్యవహరించే పీడీఓఏ... పీడీఓలకు అవసరమైన అనుమతులు, అకౌంటింగ్ సంబంధిత అంశాలను చూస్తుంది. యూజర్లు రిజిస్టర్ చేసుకోవడం, దగ్గర్లో ఉన్న ‘వాణి’ సదుపాయం కలిగిన వైఫై హాట్స్పాట్లను గుర్తించి, డిస్ప్లే చేయడం వంటివన్నీ ఉండే విధంగా అప్లికేషన్‌ను యాప్ ప్రొవైడర్లు అభివృద్ధి చేస్తారు. యాప్ ప్రొవైడర్లు, పీడీఓఏలు, పీడీఓల వివరాలను పొందుపరిచేందుకు ఒక కేంద్రీయ రిజిస్ట్రీ ఉంటుంది. ప్రారంభంలో ఈ కేంద్రీయ రిజిస్ట్రీని సీ–డాట్ నిర్వహిస్తుందని అధికారిక ప్రకటన పేర్కొంది. పీడీఓలకు ఎలాంటి రిజిస్ట్రేషన్ అవసరం లేదు, అయితే, పీడీఓఏలు ఇంకా యాప్ డెవలపర్లు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ పోర్టల్ ద్వారా, ఎలాంటి ఫీజు లేకుండానే టెలికం శాఖ వద్ద నమోదు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకున్న ఏడు రోజుల్లోపు అనుమతి లభిస్తుంది. మొబైల్ ఫోన్లు వచ్చిన తర్వాత మాయమైపోయిన పబ్లిక్ టెలిఫోన్ బూత్‌లు.. మళ్లీ కొత్త రూట్లో ప్రజల ముందుకొచ్చేందుకు లైన్ క్లియర్ అయింది. సందు చివర కిరాణా షాపులు, చిన్నా చితకా టీ కొట్లు, పాన్ షాపుల్లో కూడా పబ్లిక్ వైఫై బూత్‌లు త్వరలో దర్శనమివ్వనున్నాయి. గతంలో పబ్లిక్ కాల్ ఆఫీస్ (పీసీఓ) స్థానంలో ఇప్పుడు పబ్లిక్ డేటా ఆఫీస్(పీడీఓ)లు కొలువుదీరనున్నాయి. మొబైల్ డేటాతో పనిలేకుండానే ఎప్పుడు కావాలంటే అప్పుడు... ఎక్కడ కావాలంటే అక్కడ... ఎంత కావాలంటే అంత డేటాను లోడ్ చేసుకొని, ఎంచక్కా ఇంటర్నెట్లో చక్కర్లు కొట్టేయొచ్చన్నమాట!! దేశంలో లక్షలాది వైఫై హాట్స్పాట్లను సృష్టించేందుకు ఈ ‘వాణి’ ప్రాజెక్టు వీలు కల్పిస్తుంది. కంటెంట్ పంపిణీలో సమానావకాశాలను అందించడంతో పాటు చౌకగా కోట్లాది మందికి బ్రాడ్‌బ్యాండ్‌ను అందుబాటులోకి తీసుకొస్తుంది. దీన్ని కనెక్టివిటీ సేవల్లో యూపీఐ(యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేజ్)గా చెప్పుకోవచ్చు. – ఆర్ఎస్ శర్మ, ట్రాయ్ మాజీ చైర్మన్ లైసెన్స్ రహిత సంస్థలు అట్టడుగు స్థాయిలో వైఫై సేవలను అందించేందుకు వీలు కల్పించే ఈ కీలక చర్యకు మేం ముందునుంచీ మద్దతిస్తున్నాం. దేశంలో బ్రాడ్‌బ్యాండ్ వ్యాప్తికి ఇది ఎంతగానో చేదోడు అందిస్తుంది. ప్రజలను డిజిటల్ పౌరులుగా మార్చేస్తుంది. అదే సమయంలో వ్యాపారాభివృద్ధితో పాటు కిరాణా స్టోర్లు, టీ షాపులు వంటి చిన్న స్థాయి వ్యాపారస్తులకు ఉపాధి అవకాశాలను కూడా కల్పిస్తుంది. మొత్తంమీద చూస్తే సామాజిక–ఆర్థికాభివృద్ధితో పాటు గ్రామీణ డిజిటల్ కనెక్టివిటీ దీని ద్వారా సాకారమవుతుంది. – టీవీ రామచంద్రన్, బ్రాడ్‌బ్యాండ్ ఇండియా ఫోరమ్ ప్రెసిడెంట్ కొత్త కొలువులు పెరుగుతాయ్... ‘వ్యాపారాన్ని మరింత సులభతరం చేసే విధంగా ఈ ప్రక్రియ మొత్తం ఉంటుందని భావిస్తున్నాం. కోవిడ్–19 మహమ్మారి నేపథ్యంలో దేశంలో స్థిరమైన, మరింత సమర్థవంతమైన హై–స్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ (డేటా) సేవలను కోరుకుంటున్న యూజర్ల సంఖ్య భారీగా పెరిగింది. 4జీ మొబైల్ కవరేజీ లేని ప్రాంతాల్లో దీని అవసరం మరింతగా ఉంది. పబ్లిక్ వైఫైను అందుబాటులోకి తీసుకురావడం ద్వారానే ఈ అవసరాలను తీర్చగలం’ అని ప్రభుత్వ ప్రకటన పేర్కొంది. అంతేకాకుండా ఈ సేవల ద్వారా ఉద్యోగాల కల్పనతో పాటు చిన్న, మధ్య తరహా సంస్థల ఆదాయాన్ని పెంచడం అలాగే స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) వృద్ధికి కూడా దోహదపడుతుందని వివరించింది. -
స్టార్‌లింక్ బ్రాడ్‌బ్యాండ్ సేవలు భారత్‌లో..
2021 ఏడాది మధ్యలో స్టార్‌లింక్ బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ సేవలను భారతదేశంలో ప్రవేశ పెట్టడానికి స్పేస్ఎక్స్ సీఈఓ ఎలోన్ మస్క్ యోచిస్తున్నారు. ప్రస్తుతం ఈ బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ సేవలు యుఎస్ మరియు కెనడాలోని కొన్ని ప్రాంతాల్లోని బీటా యూజర్స్ కు మాత్రమే అందుబాటులో ఉంది. ప్రపంచవ్యాప్తంగా గ్రామీణ మరియు ఇంటర్నెట్ తక్కువగా ఉన్న ప్రాంతాలకు 2021లో ఇంటర్నెట్ కనెక్షన్‌ను అందించడానికి కంపెనీ వైడ్స్కేల్ ప్రయోగం చేస్తున్నట్లు టెస్లా వ్యవస్థాపకుడు ఎలోన్ మస్క్ ట్విటర్లో తెలిపారు. 2021 ఏడాదిలో స్టార్‌లింక్ బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ సేవలను భారత్‌లోకి తీసుకురావడానికి ఇక్కడి నిబంధనలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. (చదవండి: వన్‌ప్లస్ 9 స్మార్ట్ ఫోన్ కెమెరా ఫీచర్స్ వైరల్) స్పేస్ఎక్స్ శాటిలైట్ గవెర్నమెంట్ అఫైర్స్ వైస్ ప్రెసిడెంట్ ప్యాట్రిసియా కూపర్, మెరుగైన బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ను భారత ప్రజలకు అందించడానికి రోడ్‌మ్యాప్‌లో భాగంగా టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(ట్రాయ్)తో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపారు. భారతదేశంలో ఉపగ్రహ - ఆధారిత బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ సాంకేతికత స్థాపన కోసం భారత ప్రభుత్వం తప్పక సాంకేతిక విధానాలను నవీకరించాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. -
‘పల్లె’కు ఓకే..!
ఆర్థిక మందగమనం నుంచి గ్రామీణ భారతాన్ని గట్టెక్కించేందుకు మోదీ సర్కారు తాజా బడ్జెట్లో దండిగానే నిధులను కేటాయించింది. ముఖ్యంగా మౌలిక సదుపాయాల కల్పనపై ఖర్చుకు వెనుకాడబోమని స్పష్టం చేసింది. గతేడాది సవరించిన అంచనాలతో పోలిస్తే కొన్ని పథకాలకు కేటాయింపులు తగ్గడం గమనార్హం. గ్రామీణ ఇళ్ల నిర్మాణం, రోడ్లపై అత్యధికంగా దృష్టిపెట్టింది. ఇప్పటికే కొన్ని పథకాల లక్ష్యాలు పూర్తవడంతో తదుపరి దశలను వేగంగా అమలు చేయనున్నట్లు బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. పల్లెల్లో 2022 మార్చినాటికి అదనంగా 1.95 కోట్ల ఇళ్లను నిర్మించేందుకు సుమారు రూ.1,56,634 కోట్లను వెచ్చించనున్నారు. మరో లక్ష గ్రామ పంచాయతీలకు (2020–21)లో బ్రాడ్‌బ్యాండ్(ఫైబర్ ఆప్టిక్ నెట్వర్క్)ను అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు. అటు వ్యవసాయంతో పాటు ఇటు గ్రామీణాభివృద్ధికి బడ్జెట్లో అత్యధిక ప్రాధాన్యం ఇచ్చినట్లు పరిశీలకులు భావిస్తున్నారు. గ్రామీణ సంక్షేమ పథకాలకు ఎంతంటే... 2020–21 కేటాయింపు: రూ.1,20,148 కోట్లు 2019–20 కేటాయింపు: రూ.1,17,647 కోట్లు (సవరించిన అంచనా(రూ.1.22 లక్షల కోట్లు) ‘ఉపాధి’కి హామీ... 2020–21 కేటాయింపు: రూ.61,500 కోట్లు 2019–20 కేటాయింపు: రూ. 60,000 కోట్లు (సవరించిన అంచనా రూ.71,001 కోట్లు) ► ఉపాధి హామీకి గతేడాది బడ్జెట్ అంచనాలతో పోలిస్తే ఈసారి స్వల్పంగా 2.5 శాతం పెరిగింది. సవరించిన అంచనాలతో పోలిస్తే భారీగా తగ్గింది. ► చాలా రాష్ట్రాల్లో లక్ష్యాలను మించి ఉపాధి పనులను కల్పించడంతో అధికమొత్తంలో కేంద్రం నిధులను అందించాల్సి వచ్చింది. ► ఏడాదిలో వందరోజుల పాటు కనీస ఉపాధి హామీని ఇవ్వడమే ఈ పథకం ప్రధానోద్దేశం. విద్యుత్తుకు మరింత ఊతం... (దీన్‌దయాళ్ ఉపాధ్యాయ గ్రామ్ జ్యోతి యోజన) 2020–21 కేటాయింపు: రూ.4,500 కోట్లు 2019–20 కేటాయింపు: రూ.4,066 కోట్లు ► వ్యవసాయ, వ్యవసాయేతర విద్యుత్ వినియోగదారులకు ప్రత్యేక ఫీడర్లు, డిస్కమ్‌లను అందుబాటులోకి తీసుకురావడం, విద్యుత్ సబ్–ట్రాన్స్మిషన్, పంపిణీ మౌలిక సదుపాయాల పెంపు... గ్రామీణ విద్యుదీకరణ కోసం ఈ పథకాన్ని రూపొందించారు. ► 2017లో సౌభాగ్య పథకం కింద 2.5 కోట్ల కుటుంబాలకు ఉచితంగా విద్యుత్ కనెక్షన్‌ను అందించారు. ► ఇంటిగ్రేటెడ్ పవర్ డెవలప్మెంట్ స్కీమ్‌కు కేటాయింపులు రూ. 3970 కోట్ల నుంచి రూ. 5280 కోట్లకు పెంచారు. ► ఉజాల స్కీమ్ కింద పేద, మధ్యతరహా కుటుంబాలకు ఉచితంగా 35 కోట్ల ఎల్ఈడీ బల్బులను ఇచ్చారు. ► ఎల్ఈడీ బల్బులతో ఏటా రూ.18,341 కోట్ల మేర విద్యుత్ బిల్లులు ఆదా అవుతున్నాయి. స్వచ్ఛ భారత్‌కు దన్ను... 2020–21 కేటాయింపు: రూ.12,300 కోట్లు 2019–20 కేటాయింపు (సవరించిన అంచనా): రూ. 9,638 కోట్లు. ► 2014 అక్టోబర్ 2న గాంధీ జయంతి రోజున మొదలైన ఈ పథకం కింద ఇప్పటివరకు దాదాపు 9.6 కోట్ల మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి చేశారు. ► బహిరంగ మలవిసర్జన(ఓడీఎఫ్) అలవాటు దాదాపు కనుమరుగైంది. ఓడీఎఫ్ రహిత గ్రామాల సంఖ్య 5.6 లక్షలకు చేరింది. ► గ్రామీణ ప్రాంతాల్లో దాదాపు 98 శాతం శానిటేషన్ కవరేజ్ కల్పన. ► పట్టణాల్లో 95 శాతం ఓడీఎఫ్ రహితంగా మారినట్లు అంచనా. ఇప్పుడు 100 శాతం లక్ష్యాన్ని సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ► దేశవ్యాప్తంగా 1,700 నగరాలు, పట్టణాల్లో 45,000 ప్రజా, కమ్యూనిటీ మరుగుదొడ్లను గుర్తించేందుకు వీలుగా గూగుల్ మ్యాప్స్‌కు అనుసంధానించారు. ► పూర్తిగా ఓడీఎఫ్ రహితంగా మారిన గ్రామాలు, పట్టణాల్లో దీన్ని కచ్చితంగా అమలయ్యేవిధంగా చూడటం కూడా ఈ పథకంలో భాగమే. ► ప్రతి గ్రామంలో ఘన వ్యర్థాల(చెత్త నిర్మూలన), జల వ్యర్థాల నిర్వహణను కూడా ఈ స్వచ్ఛ భారత్ పథకం కిందకు తీసుకొచ్చారు. పల్లె రోడ్లు పరుగులు 2020–21 కేటాయింపు: రూ.19,500 కోట్లు 2019–20 కేటాయింపు: రూ. 19,000 కోట్లు (సవరించిన అంచనా రూ.14,071 కోట్లు) ► దేశవ్యాప్తంగా ఇప్పటిదాకా 1,67,152 ప్రాంతాలకు రోడ్డు కనెక్టివిటీ కల్పించారు. ► పీఎంజీఎస్‌వై రెండో దశలో రోడ్లను మెరుగుపరడం, మావోయిస్టుల ప్రభావిత జిల్లాల్లో కల్వర్టులు, ఇతర సదుపాయాలు కల్పిస్తారు. ► 2019 డిసెంబర్ 31 నాటికి మొత్తం రెండు దశలకింద 6,08,899 కిలోమీటర్ల మేర రోడ్ల నిర్మాణం, అప్గ్రేడేషన్ను పూర్తి చేశారు. ► వచ్చే ఐదేళ్లలో 1,25,000 కిలోమీటర్ల రోడ్లను అప్‌గ్రేడ్ చేయనున్నారు. దీనికి రూ.80,250 కోట్లు వెచ్చించనున్నారు. 2019–20లో ఇందుకు 13 రాష్ట్రాలను ఎంపిక చేశారు. గ్రామీణ టెలిఫోనీ... 2020–21 కేటాయింపు: రూ.6,000 కోట్లు 2019–20 కేటాయింపు (సవరించిన అంచనా): రూ. 2,000 కోట్లు ► భారత్ నెట్ ఫేజ్1 కింద 1,21,652 గ్రామ పంచాయతీలకు హైస్పీడ్ ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ కనెక్టివిటీ పూర్తి. 1.16లక్షల పంచాయతీల్లో సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. ► దీంతో 2.5 లక్షల గ్రామాల్లోని దాదాపు 20 కోట్ల మంది గ్రామీణవాసులకు బ్రాడ్‌బ్యాండ్ యాక్సెస్ లభించింది. దీన్ని మరింత వేగవంతం చేసేందుకు ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యాన్ని(పీపీపీ) జోడించనున్నారు. ► ఐదు కోట్లమంది గ్రామీణులకు లబ్ధి చేకూరేలా 5 లక్షల వైఫై స్పాట్స్ ఏర్పాటు లక్ష్యం. ► 2020–21 ఆర్థిక సంవత్సరంలో మరో 1,00,000 గ్రామ పంచాయతీలకు ఫైబర్ ఆఫ్టిక్ నెట్‌వర్క్‌ను కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆర్థిక మంత్రి తాజా బడ్జెట్లో ప్రకటించారు. ‘జల్ జీవన్’తో స్వచ్ఛమైన నీరు.... 2020–21 కేటాయింపులు: రూ.11,500 కోట్లు 2019–20 కేటాయింపులు: రూ. 10,001 కోట్లు ► దేశంలో తాగునీటి సౌకర్యం లేని అన్ని మారుమూల గ్రామీణప్రాంతాలకూ సురక్షితమైన, తగినంత తాగునీటిని(హ్యాండ్ పంపులు, పైపులు ఇతరత్రా మార్గాల్లో) అందించాలనేది ఈ పథకం ప్రధానోద్దేశం. ► గతేడాది బడ్జెట్లో జల్ జీవన్ మిషన్ ను ప్రకటించారు. దీనిలోభాగంగా రూ.3.6 లక్షల కోట్ల నిధులను వెచ్చించేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లు సీతారామన్ బడ్జెట్లో తెలిపారు. ఈ ఏడాది రూ.11,500 కోట్లను కేటాయించినట్లు వివరించారు. ► స్థానిక స్థాయిలో సమీకృత డిమాండ్, సరఫరా నిర్వహణ యంత్రాంగం; వర్షపు నీటిని ఒడిసిపట్టేందుకు తగిన మౌలిక వసతుల కల్పన, భూగర్భజలాల పెంపు, సముద్రపునీటిని మంచినీరుగా మార్చడం(డీశాలినేషన్) కూడా జల్‌జీవన్ మిషన్‌లో భాగమే. ► 10 లక్షల జనాభా దాటిన నగరాలన్నింటినీ దీని అమలు కు ప్రోత్సహించనున్నట్లు ఆర్థిక మంత్రి చెప్పారు. ఇంటికి ఇంకాస్త ఆసరా... 2020–21 కేటాయింపులు: రూ.19,500 కోట్లు 2019–20 కేటాయింపులు (సవరించిన అంచనా): రూ. 18,475 కోట్లు ► ప్రధాన మంత్రి ఆవాస్ యోజన(పీఎంఏవై)లో భాగంగా 2022 కల్లా దేశవ్యాప్తంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఇళ్లు లేని బలహీనవర్గాలందరికీ పక్కా ఇళ్లను కట్టివ్వాలనేది కేంద్ర ప్రభుత్వ తాజా లక్ష్యం. ► పీఎంఏవై తొలి దశను 2016–17 నుంచి 2018–19 వరకూ మూడేళ్లపాటు అమలుచేశారు. గడిచిన ఐదేళ్లలో 1.54 కోట్ల ఇళ్లను నిర్మించారు. ► ఇప్పుడు రెండో దశ కింద 2019–20 నుంచి 2021–22 మధ్య 1.95 కోట్ల ఇళ్లను నిర్మించనున్నారు. ఇందుకోసం రూ.1,56,634 కోట్లను వెచ్చించనున్నారు. ► అంతేకాదు ఈ ఇళ్లకు మరుగుదొడ్లు, విద్యుత్, గ్యాస్ కనెక్షన్లు కూడా ఉచితంగా కల్పించనున్నారు. -
కేబుల్ టీవీ విప్లవం : జియో మరో సంచలనం
న్యూఢిల్లీ: టెలికం మార్కెట్లో విప్లవం సృష్టించిన రిలయన్స్ జియో... త్వరలోనే జియో గిగాఫైబర్‌తో మరో విప్లవానికి సిద్ధమవుతోంది. నెలకు కేవలం రూ.600కే గిగాఫైబర్ ద్వారా బ్రాడ్‌బ్యాండ్, ల్యాండ్‌ౖ లెన్ ఫోన్, టీవీ చానళ్ల ప్రసారాల సేవలను అందించ నుంది. ప్రస్తుతం జియో గిగాఫైబర్ సేవలను ఢిల్లీ, ముంబై తదితర ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా కంపెనీ పరీక్షిస్తోంది. వన్‌టైమ్ డిపాజిట్ కింద రూటర్ కోసం రూ.4,500 తీసుకుని, 100 గిగాబైట్స్ డేటాను 100 ఎంబీపీఎస్ వేగంతో ఉచితంగా వినియోగదారులకు అందిస్తూ వారి నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకుంటోంది. వచ్చే మూడు నెలల కాలంలో బ్రాండ్‌బ్యాండ్‌కు అనుసంధానంగా టెలిఫోన్, టెలివిజన్ సేవలను సైతం జోడించనుందని కంపెనీ వర్గాలు తెలిపాయి. అన్ని సేవలు కూడా ఏడాది పాటు ఉచితంగా లభిస్తాయి. కంపెనీ వాణిజ్య కార్యకలాపాలు ఆరంభించేంత వరకు ఈ ఉచిత ఆఫర్ కొనసాగుతుందని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వర్గాలు వెల్లడించాయి. ల్యాండ్‌లైన్ ఫోన్ అన్లిమిటెడ్ కాలింగ్ సదుపాయంతో ఉంటుందని, టెలివిజన్ చానళ్లను ఇంటర్నెట్ (ఐపీటీ) ద్వారా అందించనున్నట్టు తెలిపాయి. రూటర్‌తో 45 పరికరాల అనుసంధానం ‘‘ఈ మూడు రకాల సేవలు ఆప్టికల్ నెట్వర్క్ టెర్మినల్ (ఓఎన్టీ) బాక్స్ రూటర్ ద్వారా అందించడం జరుగుతుంది. మొబైల్ ఫోన్లు, స్మార్ట్ టీవీలు, ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్‌లు తదితర 45 పరికరాలను ఈ రూటర్‌తో అనుసంధానించు కోవచ్చు’’ అని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. రూ.600 నెలవారీ ప్లాన్‌లో 600 చానల్స్‌ను ఏడు రోజుల క్యాచర్ ఆప్షన్‌తో ఆఫర్ చేస్తామని తెలిపాయి. ప్లాన్ చార్జీ ఆ తర్వాత రూ.1,000 వరకు పెంచే అవకాశం ఉందని పేర్కొన్నాయి. తొలుత 100 ఎంబీపీఎస్ వేగంతో బ్రాండ్ బ్యాండ్ అందిస్తుండగా, తర్వాత ఈ వేగం 1 జీబీపీఎస్ వరకు పెంచే అవకాశం ఉందని తెలిపాయి. అలాగే, గిగాఫైబర్‌తో సీసీటీవీ సర్వేలెన్స్ వీడియోలను, ఇతర డేటాను క్లౌడ్‌లో సేవ్ చేసుకోవచ్చని కూడా తెలిపాయి. దేశవ్యాప్తంగా ఒకే సారి 1,100 పట్టణాల్లో జియో గిగాఫైబర్‌ను ఆరంభించనున్నట్టు గతేడాది జూన్‌లో రిలయన్స్ ఇండస్ట్రీస్ వార్షిక సాధారణ సమావేశంలో చైర్మన్ ముకేశ్ అంబానీ ప్రకటించిన విషయం తెలిసిందే. అతిపెద్ద గ్రీన్‌ఫీల్డ్ ఫిక్స్డ్ లైన్ బ్రాడ్‌బ్రాండ్ ప్రాజెక్టును అంతర్జాతీయంగా తీసుకురానున్నట్టు చెప్పారు. మరో పోటీ సంస్థ భారతీ ఎయిర్టెల్ మాత్రం జియోను కాపీ కొట్టకుండా దేశంలోని టాప్–100 పట్టణాల్లో ప్రీమియం కస్టమర్లపై దృష్టి పెట్టే ఆలోచనతో ఉందని మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి వైర్డ్ బ్రాడ్‌బ్యాండ్ కస్టమర్లు 1.82 కోట్లుగానే ఉండడం గమనార్హం. అదే సమయంలో మొబైల్ బ్రాడ్ బ్యాండ్ చందాదారుల సంఖ్య 53 కోట్లకు పైనే ఉంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ గతేడాది అక్టోబర్‌లో డెన్ నెట్వర్క్స్, హాత్వే కేబుల్ అండ్ డేటాకామ్‌లో మెజారిటీ వాటాను రూ.5,230 కోట్లతో కొనుగోలు చేయనున్నట్టు ప్రకటించిన విషయం గమనార్హం. ఈ కొనుగోళ్లు జియో గిగాఫైబర్కు ఊతమివ్వగలవని కంపెనీ భావిస్తోంది. -
స్మార్ట్ఫోన్లలో 500 ఎంబీపీఎస్ స్పీడ్
న్యూఢిల్లీ: కొత్త టెక్నాలజీతో స్మార్ట్ఫోన్లలో సెకనుకు 500 మెగాబిట్స్ (ఎంబీపీఎస్) బ్రాడ్‌బ్యాండ్ డౌన్లోడ్ స్పీడ్‌ను సాధించినట్లు దేశీ టెలికం దిగ్గజం భారతి ఎయిర్టెల్, స్వీడన్‌కి చెందిన ఎరిక్సన్ వెల్లడించాయి. ఢిల్లీ–నేషనల్ క్యాపిటల్ రీజియన్‌లో దీన్ని ప్రయోగాత్మకంగా పరీక్షించినట్లు తెలియజేశాయి. లైసెన్స్డ్ అసిస్టెడ్ యాక్సెస్(ఎల్ఏఏ) టెక్నాలజీ ఆధారంగా 4జీ లైవ్ నెట్‌వర్క్‌పై ఈ ప్రయోగం చేయడం దేశీయంగా ఇదే తొలిసారని ఈ సంస్థలు తెలిపాయి. లైసెన్సు ఉన్న స్పెక్ట్రంతో పాటు లైసె న్సులేని స్పెక్ట్రంనూ ఉపయోగించుకుని గిగాబిట్ స్పీడ్‌తో కూడా ఇంటర్నెట్ను అందించేందుకు ఈ టెక్నాలజీ ఉపయోగపడుతుంది. -
బ్రాడ్‌బ్యాండ్‌లో అగ్రగామి భారత్!
న్యూఢిల్లీ: బ్రాడ్‌బ్యాండ్ వినియోగంలో ప్రస్తుతం 135వ స్థానంలో ఉన్న భారత్ త్వరలో టాప్ 3 దేశాల్లో ఒకటిగా ఎదగగలదని రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ చెప్పారు. రిలయన్స్ జియో ఫైబర్ ఆధారిత బ్రాడ్‌బ్యాండ్ సర్వీసులు ఇందుకు తోడ్పడగలవని తెలిపారు. మొబైల్ బ్రాడ్‌బ్యాండ్ వినియోగంలో 155వ స్థానంలో ఉన్న భారత్‌ను కేవలం రెండేళ్ల వ్యవధిలోనే జియో అగ్రస్థానంలో నిలబెట్టిందని గురువారం ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ 2018 (ఐఎంసీ) ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ముకేశ్ అంబానీ చెప్పారు. ‘ప్రపంచంలో ఎక్కడా కూడా ఇంత వేగంగా 2జీ/3జీ నుంచి 4జీకి మారడం జరగలేదు. 2020 నాటికల్లా భారత్ పూర్తి స్థాయిలో 4జీ దేశంగా ఎదుగుతుంది. అప్పటికల్లా అన్ని ఫోన్లలోనూ 4జీ, ప్రతీ కస్టమర్‌కి 4జీ కనెక్టివిటీ ఉంటుంది. 5జీ టెక్నాలజీ సన్నద్ధతలో మిగతా దేశాలన్నింటికన్నా ముందు ఉంటుందని ధీమాగా చెప్పగలను‘ అని ఆయన పేర్కొన్నారు. 2016లో చౌక డేటా చార్జీలతో టెలికం రంగంలో సంచలనం సృష్టించిన రిలయన్స్ జియో తాజాగా అల్ట్రా–హై స్పీడ్ ఫైబర్ ఆధారిత బ్రాడ్‌బ్యాండ్ సర్వీసులను ప్రవేశపెడుతున్న సంగతి తెలిసిందే. ఫిక్స్డ్, మొబైల్ ఇంటర్నెట్ మధ్య హద్దులు చెరిపేసేలా జియోగిగాఫైబర్ సర్వీసులు ఉంటాయని ముకేశ్ అంబానీ తెలిపారు. ‘ఫిక్స్డ్ బ్రాడ్‌బ్యాండ్ విషయంలో ప్రస్తుతం 135వ స్థానంలో ఉన్న భారత్.. ప్రపంచం ఆశ్చర్యపోయేంత వేగంగా టాప్ 3 దేశాల్లో ఒకటిగా ఎదుగుతుందని నేను గట్టిగా విశ్వసిస్తున్నాను‘ అని ఆయన పేర్కొన్నారు. నాలుగో పారిశ్రామిక విప్లవానికి సారథ్యం.. విస్తృత కనెక్టివిటీ, అత్యంత చౌకైన ఇంటర్నెట్తో నాలుగో పారిశ్రామిక విప్లవానికి భారత్ సారథ్యం వహించగలదని ఆయన పేర్కొన్నారు. 15 కోట్ల మంది భారతీయ రైతుల ఆదాయాలను రెట్టింపు చేసేందుకు, ఆయుష్మాన్ భారత్ పథకం కింద 50 కోట్ల పైచిలుకు జనాభాకు మెరుగైన వైద్యం అందుబాటులోకి తెచ్చేందుకు, పాఠశాలలు.. కళాశాలల్లో 20 కోట్ల మంది విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధనకు ఈ విప్లవం దోహదపడగలదన్నారు. డేటా వినియోగంలో చాలా జాగరూకతతో వ్యవహరించాల్సిన అవసరం ఉందని ముకేశ్ అంబానీ హెచ్చరించారు. ‘నయా ప్రపంచంలో డేటా అన్నది చాలా ముఖ్యమైన వనరు అని గుర్తుపెట్టుకోవాలి. దేశీయంగా భారీ స్థాయిలో డేటా ఉత్పత్తి అవుతుంటుంది. తగు భద్రతా ప్రమాణాలతో ఈ సుసంపన్న వనరును దేశం, దేశ ప్రజల ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవడం ముఖ్యం‘ అని ఆయన పేర్కొన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, బ్లాక్‌చెయిన్ వంటి అనేక విప్లవాత్మకమైన డిజిటల్ టెక్నాలజీలను అందుబాటులోకి తెచ్చే టెలికం పరిశ్రమ.. రాబోయే రోజుల్లో భారీ స్థాయిలో ఉద్యోగ కల్పనకు, అధిక వృద్ధికి దోహదపడగలదని ముకేశ్ చెప్పారు. పొగాకు పరిశ్రమలా పన్నులు: ఎయిర్టెల్ చీఫ్ సునీల్ మిట్టల్ దేశ డిజిటల్ ఆకాంక్షల సాధనకు ఇతోధికంగా తోడ్పడుతున్న టెలికం రంగాన్ని పన్నుల భారం కుంగదీస్తోందని భారతీ ఎయిర్టెల్ చైర్మన్ సునీల్ మిట్టల్ వ్యాఖ్యానించారు. పొగాకు పరిశ్రమలా టెలికం రంగంపై భారీ స్థాయిలో పన్నులు ఉంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ‘భారత్‌లో మొబైల్ ఆపరేటర్లకి వచ్చే ప్రతి రూ. 100 ఆదాయంలో దాదాపు రూ. 37 ఏదో ఒక సుంకం చెల్లింపులకే పోతోంది. ఒకవైపేమో దేశం డిజిటల్ రంగంలో అగ్రగామిగా ఉండాలని ప్రధాని ఆకాంక్షిస్తారు. ఇందుకోసం భారీ మొత్తంలో పెట్టుబడులు కావాలి. మరోవైపేమో స్పెక్ట్రం ధరలు, లైసెన్సు ఫీజులు భారీ స్థాయిలో ఉంటాయి. దీనికి జీఎస్టీ కూడా తోడైంది. ఏకంగా 18 శాతం మేర ఉంటోంది. ఇలాంటి వైరుధ్యాలను ఏ విధంగా అర్థం చేసుకోవాలో తెలియడం లేదు. ఈ సమస్యలను సత్వరం పరిష్కరించాల్సిన అవసరం ఉంది‘ అని సునీల్ మిట్టల్ వ్యాఖ్యానించారు. దేశీ టెలికం మార్కెట్లో కన్సాలిడేషన్ అంత సులువుగా జరగలేదని మిట్టల్ పేర్కొన్నారు. గడిచిన కొన్నేళ్లలో టెలికం కంపెనీలు ఎన్నో కష్టనష్టాలు ఎదుర్కొనాల్సి వచ్చిందన్నారు. ఉద్యోగాల కోతలు, దాదాపు 50 బిలియన్ డాలర్ల మేర పెట్టుబడుల రైటాఫ్ సహా.. అనేక కష్టాలను అధిగమిస్తే గానీ ఈ రంగంలో కన్సాలిడేషన్ సాధ్యపడలేదని పేర్కొన్నారు. గడిచిన 24 ఏళ్లుగా పలు టెక్నాలజీలను విజయవంతంగా అమలు చేసినట్లుగానే 5జీ టెక్నాలజీ అమలుకు కూడా టెలికం పరిశ్రమ సన్నద్ధమవుతోందని ఆయన తెలిపారు. అయితే, స్పెక్ట్రం ధరలు, చార్జీలు సముచితంగా ఉండాలని, అధిక పన్నుల భారాన్ని సమీక్షించాల్సిన అవసరం ఉందని మిట్టల్ అభిప్రాయపడ్డారు. 5జీ టెక్నాలజీ కార్లు, డ్రోన్స్ ప్రదర్శన.. ఇండియా మొబైల్ కాంగ్రెస్ (ఐఎంసీ) తొలి రోజున రిలయన్స్ జియో కొంగొత్త ఉత్పత్తులను ఆవిష్కరించింది. ముంబైలో ఉన్న కారును దాదాపు 1,388 కిలోమీటర్ల దూరంలోని న్యూఢిల్లీ నుంచి నడపగలిగే 5జీ టెక్నాలజీ మొదలుకుని ఫేస్ రికగ్నిషన్ సామర్ధ్యం గల డ్రోన్స్ దాకా వీటిలో ఉన్నాయి. స్వయం చాలిత కార్లను మరింత సురక్షితంగా మార్చేందుకు 5జీ నెట్వర్క్ ఉపయోగపడగలదని జియో వర్గాలు పేర్కొన్నాయి. 5జీ అంటే కేవలం 4జీ నెట్వర్క్ నుంచి అప్‌గ్రేడ్‌గా మాత్రమే కనిపించినప్పటికీ, ఇది చాలా శక్తిమంతమైన టెక్నాలజీ అని, సెల్యులార్ నెట్‌వర్క్‌లో విప్లవాత్మక మార్పులు తేగలదని వివరించాయి. -
రిలయన్స్ ‘కేబుల్’ వేట!
న్యూఢిల్లీ: కేబుల్ టీవీ, హై స్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ సేవలను పెద్దయెత్తున విస్తరించే క్రమంలో రిలయన్స్ ఇండస్ట్రీస్.. ఇప్పటికే ఆయా రంగాల్లో ఉన్న కంపెనీల్లో వాటాలు కొనుగోలు చేయడంపై దృష్టి పెట్టింది. డెన్ నెట్వర్క్స్, హాథ్‌వే కేబుల్ అండ్ డేటాకామ్ సంస్థల్లో గణనీయ వాటాలు కొనే దిశగా చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఇవి తుది దశల్లో ఉన్నాయని, బుధవారం ఈ డీల్స్‌పై ప్రకటన వెలువడొచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. ‘హాథ్‌వే కేబుల్ అండ్ డేటాకామ్, డెన్ నెట్‌వర్క్స్‌లో వాటాల కొనుగోలు కోసం రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుబంధ సంస్థల ద్వారా జరుపుతున్న చర్చలు తుది దశల్లో ఉన్నాయి. బుధవారం వీటికి సంబంధించి డీల్స్‌ను ప్రకటించవచ్చు‘ అని వివరించాయి. మరోవైపు ఈక్విటీ షేర్ల జారీ ద్వారా నిధులు సమీకరించడంపై అక్టోబర్ 17న (బుధవారం) తమ తమ బోర్డులు సమావేశం కానున్నట్లు హాథ్‌వే, డెన్ నెట్వర్క్స్ సంస్థలు స్టాక్ ఎక్సే్చంజీలకు తెలియజేశాయి. హాథ్‌వే ప్రస్తుతం నాలుగు మెట్రోలు సహా 16 నగరాల్లో హై స్పీడ్ కేబుల్ బ్రాడ్‌బ్యాండ్ సేవలు అందిస్తోంది. కంపెనీకి సుమారు 35,000 కిలోమీటర్ల మేర ఫైబర్ కేబుల్ నెట్వర్క్ ఉండగా, 8 లక్షల మంది బ్రాడ్‌బ్యాండ్ కస్టమర్లు ఉన్నారు. ఇక 15 నగరాల్లో కార్యకలాపాలు విస్తరిస్తున్న డెన్ కేబుల్.. 2–3 ఏళ్లలో 500 నగరాల్లో సర్వీసులు అందిం చేందుకు ప్రణాళికలు రూపొందించుకుంటోంది. -
భారత్‌లో బ్రాడ్‌బాండ్ బాజా
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బ్రాడ్‌బ్యాండ్.. ప్రపంచ దిశను మార్చేసిన సాంకేతిక ఆయుధం. ఈ ఆయుధం ఇప్పుడు భారత్‌లో డేటా వినియోగం, స్మార్ట్ఫోన్ల విషయంలో అనూహ్య పరిణామాలకు కారణమవుతోంది. ప్రపంచంలో అత్యధికంగా డేటాను వాడుతున్న దేశంగా భారత్‌ను నిలుపుతోంది. దేశవ్యాప్తంగా నెలకు 2,360 పెటాబైట్స్ డేటాను వినియోగదార్లు ఖర్చు చేస్తున్నారట!!. అంటే ఈ డేటా 52.6 కోట్ల డీవీడీల నిడివితో సమానం. ఒక్కో కస్టమర్ సగటున రోజుకు 200 నిముషాలు స్మార్ట్‌ఫోన్‌తో గడుపుతున్నారంటే... ఈ ఫోన్లు డేటాను ఎలా నడిపిస్తున్నాయో వేరే చెప్పాల్సిన పనిలేదు. 2022 నాటికి బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ల సంఖ్య ప్రస్తుతమున్న 39.2 కోట్ల నుంచి 123.6 కోట్లకు చేరుతుందని అంచనా. సెకనుకు 4.8 మొబైల్ కనెక్షన్లు.. దేశంలో 2014లో 9.91 కోట్ల బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్లుండేవి. ఇందులో మొబైల్ 81.8 శాతం కాగా మిగిలింది ఫిక్స్డ్ బ్రాడ్‌బ్యాండ్. 2017 వచ్చేసరికి మొత్తం కనెక్షన్లు 4.2 రెట్లు అధికమై 39.2 కోట్లకు చేరుకున్నాయి. ఇందులో 95 శాతం మొబైల్ బ్రాడ్‌బ్యాండ్ కాగా, 5 శాతం ఫిక్స్డ్ (వైర్‌లైన్) బ్రాడ్‌బ్యాండ్‌లో ఉన్నాయి. 2022 నాటికి మొత్తం కనెక్షన్ల సంఖ్య 123.6 కోట్లకు చేరుతుంది. ఇందులో ఫిక్స్డ్ బ్రాడ్‌బ్యాండ్ 9 శాతం ఉంటుందని బ్రాడ్‌బ్యాండ్– 2022 పేరుతో ఈవై, సీఐఐ సంయుక్తంగా రూపొందించిన నివేదిక వెల్లడించింది. ఈ కాలంలో ప్రతి సెకనుకు 4.8 మొబైల్ కనెక్షన్లు జతకూడతాయని తెలిపింది. టెలికం రంగాన్ని 4జీ టెక్నాలజీయే ఎంతలా నడిపిస్తోందంటే... 2017లో అమ్ముడైన స్మార్ట్ఫోన్లలో 90 శాతం 4జీ మోడళ్లే. ప్రస్తుతం భారత్‌లో కస్టమర్ల వద్ద 45 కోట్ల స్మార్ట్ఫోన్లున్నాయి. సగటున 18 జీబీ.. డేటా వాడకంలో ప్రపంచంలోనే భారత్ నంబర్–1. చైనా, యూఎస్ఏ, జపాన్‌లు తరువాతి స్థానాల్లో ఉన్నాయి. స్మార్ట్‌ఫోన్ వినియోగదార్లలో 75 శాతం మంది ఆన్లైన్ వీడియోలను తమ మొబైల్ ఫోన్లలో వీక్షిస్తున్నారు. గత ఏడాది ఇక్కడి కస్టమర్లు 1.1 కోట్ల యాప్‌లు డౌన్లోడ్ చేశారు. డేటా టారిఫ్ ఏడాదిలో 97% తగ్గింది. మరోవైపు 2012తో పోలిస్తే సగటు స్మార్ట్‌ఫోన్ ధర 45 శాతం తగ్గి సుమారు రూ.7,500లకు రావడం కూడా బ్రాడ్‌బ్యాండ్ దూకుడుకు కారణం. ఆన్లైన్ షాపర్స్ 2015తో పోలిస్తే 2.3 రెట్లు అధికమై 9 కోట్లకు చేరుకున్నారు. 48 కోట్ల ఆన్లైన్ క్యాబ్ రైడ్స్ నమోదయ్యాయి. సుమారు 21 కోట్ల ఆన్లైన్ టికెట్స్ బుక్ అయ్యాయి. మొబైల్ వాలెట్ లావాదేవీలు రూ.2,100 కోట్లు నమోదయ్యాయి. స్మార్ట్‌ఫోన్ యూజర్ల సగటు ఇంటర్నెట్ నెల వాడకం అయిదేళ్లలో 5.1 రెట్లు పెరిగి 18 జీబీకి చేరనుందని ఈవై–సీఐఐ నివేదిక అంచనా వేసింది. -
బ్రాడ్‌బ్యాండ్‌తో కాల్స్ చేసుకోండిలా..
న్యూఢిల్లీ : సిగ్నల్స్ సరిగ్గా ఉండటం లేదా..? మొబైల్ నెట్వర్క్ పనిచేయడం లేదా..? అయితే ఇక నుంచి మీ ఆఫీసులో లేదా ఇంట్లో ఉన్న వై-ఫై బ్రాడ్‌బ్యాండ్‌తో ఈ సమస్యకు చెక్ పెట్టేయొచ్చట. బ్రాడ్‌బ్యాండ్‌తో మొబైల్ ఫోన్లకు, అదేవిధంగా ల్యాండ్లైన్లకు కాల్స్ చేసుకునేలా ప్రతిపాదనలు రూపొందాయి. దేశంలో ఇంటర్నెట్ టెలిఫోనీకి అనుమతించేందుకు రూపొందించిన ప్రతిపాదనలకు మంగళవారం ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ ప్రతిపాదనల ప్రకారం టెలిఫోనీ లైసెన్స్‌ను పొందే టెలికాం ఆపరేటర్లు, ఇతర కంపెనీలు సిమ్ అవసరం లేని కొత్త మొబైల్ నెంబర్‌ను ఆఫర్ చేయనున్నాయి. ఇంటర్నెట్ టెలిఫోనీ యాప్‌ను డౌన్లోడ్ చేసుకుని ఈ సర్వీసులను యాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది. గత అక్టోబర్‌లోనే టెలికాం రెగ్యులేటరీ ట్రాయ్ ఈ ప్రతిపాదనలను రూపొందించింది. కాల్ డ్రాప్స్ సమస్యతో బాధపడుతున్న వినియోగదారుల కోసం ఈ కొత్త కనెక్టివిటీ ఆప్షన్లను తీసుకొచ్చింది. అంతర్ మంత్రిత్వ టెలికాం కమీషన్ కూడా ఈ ప్రతిపాదనలను ఆమోదించింది. ఈ ఆమోదంతో ఇక రిలయన్స్జియో, బీఎస్ఎన్, ఎయిర్టెల్ లాంటి టెలికాం ఆపరేటర్లు ఇంటర్నెట్ టెలిఫోనీ సర్వీసులను ప్రారంభించుకోవచ్చు. ఈ కొత్త కనెక్టివిటీ ఆప్షన్లతో యూజర్లకు ఎంతో మేలు చేకూరనుందని ట్రాయ్ పేర్కొంది. టెలికాం సిగ్నల్స్ బలహీనంగా ఉన్నప్పటికీ, వై-ఫై అందుబాటు చాలా బలంగా ఉంటుందని అధికారులు తెలిపారు. అయితే ఈ సర్వీసుల కోసం యాక్టివేట్ చేసుకునే టెలిఫోనీ ఒక ఆఫరేటర్ది, మొబైల్ నెంబర్ మరో ఆపరేటర్‌ది అయితే, డౌన్లోడ్ చేసుకునే ఇంటర్నెట్ టెలిఫోనీ యాప్ ఆపరేటర్ నెంబర్‌నే యూజర్లు పొందాల్సి ఉంటుంది. డౌన్లోడ్ యాప్, సర్వీసు ప్రొవైడర్ ఒకే ఆపరేటర్‌ది అయితే నెంబర్ మార్చుకోవాల్సినవసరం లేదని ట్రాయ్ అధికారులు చెప్పారు. -
మొబైల్ ఇంటర్నెట్ ఓక్లా చెప్పిన శుభవార్త!
సాక్షి, న్యూడిల్లీ: ఇంటర్నెట్ స్పీడ్‌ను అంచనా వేసే సంస్థ ఓక్లా తాజా గణాంకాలను సోమవారం విడుదల చేసింది. ఈ సందర్భంగా నవంబరు మాసానికి సగటు మొబైల్ ఇంటర్నెట్వేగం దాదాపు రెట్టింపు అయిందని ఇది భారతీయ వినియోగదారులకు శుభవార్త అని వ్యాఖ్యానించింది. మొబైల్ ఇంటర్నెట్ స్పీడ్‌లో భారత్ 109వ స్థానంలో నిలిచింది. బ్రాండ్ బ్యాండ్ స్పీడ్‌లో 76వ స్థానంలో నిలిచింది. అలాగే సగటు బ్రాడ్ బ్యాండ్ వేగం 15శాతం పుంజుకుందని ఒక ప్రకటనలో తెలిపింది. ఇండియాలో మొబైల్ ఇంటర్నెట్ స్పీడ్, ఫిక్స్డ్ బ్రాడ్ బ్యాండ్ వేగం భారీగా పుంజుకుంటోందని పేర్కొంది. గ్లోబల్ ఇండెక్స్ స్పీడ్ టెస్ట్ నవంబర్ నెల గణాంకాలను ఓక్లా విడుదల చేసింది. దీని ప్రకారం సగటు మొబైల్ డోన్లోడ్ స్పీడ్ 7.65 ఎంబీపీఎస్ గా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా బ్రాడ్ బ్యాండ్ వేగం 76 వ స్థానంలో ఉంది. ఈ సగటు జనవరి నాటికి 12.12 పాయింట్లు ఉంటే, నవంబరులో 18.82 పాయింట్లుగా నిలిచిందని ఓక్లా తెలిపింది. మార్కెట్లో ఉన్న పోటీ, వివిధ ఆపరేటర్ల తారిఫ్ల దీనికి కారణమని ఇది సానుకూల దృక్పథమని ఓక్లా తెలిపింది. ఈ నూతన సంవత్సరానికి మార్కెట్ ఎలా వృద్ధి చెందుతుందో చూడడానికి తాము ఎదురుచూస్తున్నామని ఓక్లా సహ వ్యవస్థాపకుడు, జనరల్ మేనేజర్ డౌగ్ సూట్లేస్ వ్యాఖ్యానించారు. కాగా ప్రపంచవ్యాప్తంగా వేగంగా మొబైల్ ఇంటర్నెట్ సేవలందించడంలో నార్వే ఎప్పటిలాగానే మొదటి స్థానంలో నిలిచింది. సింగపూర్ ఫిక్స్డ్ బ్రాడ్‌బ్యాండ్‌లో టాప్ ప్లేస్ కొట్టేసింది. -
బీఎస్ఎన్ఎల్ పై మాలావేర్ ఎటాక్
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ టెలికాం సేవల సంస్థ బీఎస్ఎన్ఎల్ హ్యాకింగ్ బారిన పడింది. దీంతో వెంటనే పాస్‌వర్డ్‌లను మార్చుకోవాలంటూ తమ బ్రాడ్‌బ్యాండ్ వినియోగదారుకు సూచించింది. పలు బ్రాడ్‌బ్యాండ్ సిస్టమ్‌లపై ఇటీవల మాల్వేర్ దాడులు జరగడంతో డిఫాల్ట్ సిస్టమ్ పాస్‌వర్డులను తక్షణం మార్చుకోవాలని బీఎస్ఎన్ఎల్ సంస్థ కోరింది పిటిఐ నివేదిక ప్రకారం, దాదాపు 2,000 బ్రాడ్‌బ్యాండ్ మోడెమ్‌లు దాడికి గురయ్యాయి. వెంటనే వీటి డిఫాల్ట్ పాస్వర్డ్ ‘అడ్మిన్’ను మార్చుకోవాలని సంస్థ కస్టమర్లను కోరింది. బీఎస్ఎన్ఎల్ బ్రాడ్‌బాండ్ సిస్టంలోని కొంత భాగంగా మాల్వేర్ దాడికి గురైంది. దీంతో తమ సొంత బ్రాడ్ బాండ్ వినియోగదారులను అప్రమత్తం చేసింది. చందాదారులు డిఫాల్ట్ పాస్వర్డ్ మార్చకపోవడం మూలంగానే మాలావేర్ దాడికి గురయ్యాయని కంపెనీ ప్రతినిధులు ప్రకటించారు. అయితే పరిస్థితిని చాలావరకు చక్కదిద్దామని, కానీ వెంటనే పాస్‌వర్డ్‌లను మార్చకోవాలని బిఎస్ఎన్ఎల్ ఛైర్మన్ అనుపమ్ శ్రీవాత్సవ సలహా ఇచ్చారు. ఒక్కసారి పాస్‌వర్డ్‌ను మార్చితే ఇక ఎలాంటి సమస్య ఉండదు, ఆందోళన అవసరంలేదని చెప్పారు. అయితే తమ ప్రధాన నెట్ వర్క్, బిల్లింగ్ లేదా ఏ ఇతర వ్యవస్థను ప్రభావితం చేయలేదని తెలిపారు. -
అన్లిమిటెడ్ డేటా, కాల్స్..రోజుకు10జీబీ ఫ్రీ
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ టెలికం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) మరో ఆఫర్ ప్రకటించింది. బ్రాడ్‌బ్యాండ్ వినియోగదారులకు అపరిమిత కాల్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎక్స్పీరియన్స్అన్లిమిటెడ్ బీబీ 249 తో ఈ సరికొత్త ప్లాన్‌ను శుక్రవారం ప్రకటించింది. దీనికి అపరిమిత ఆన్లైన్ సేవలు. అలాగే రోజుకు 10 జీబీ డౌన్ లోడ్ ఫ్రీ అంటూ బీఎస్ఎన్ఎల్ ఒక మీడియా ప్రకటనలో తెలిపింది. రూ.249ల మంత్లీ ప్లాన్‌లో అపరిమిత బ్రాడ్‌బ్యాండ్ సేవలు అందిస్తోంది. 2ఎంబీపీఎస్ వేగం, ఉచిత ఇన్‌స్టలేషన్‌తో ‘ఎక్స్పీరియన్స్ అన్లిమిటెడ్ బీబీ’ పేరుతో తీసుకొచ్చిన ఈ పథకంలో వినియోగదారులు రోజుకు 10 జీబీ డేటాను డౌన్లోడ్ చేసుకోవచ్చు. అంతేకాదు ఏ నెట్‌వర్క్‌కు అయినా అపరిమితంగా కాల్స్ చేసుకోవచ్చు. వైర్‌లైన్ బ్రాడ్‌బ్యాండ్ సర్వీసుల కింద ఈ పథకాన్ని అందుబాటులోకి తెచ్చినట్టు బీఎస్ఎన్ఎల్ తెలిపింది. -
ఎయిర్టెల్ బ్రాడ్‌బ్యాండ్ @100 ఎంబీపీఎస్
• వేగవంతమైన ‘వి–ఫైబర్’ ఇంటర్నెట్ • భాగ్యనగరితోసహా ఏడు నగరాల్లో • కొత్త కస్టమర్లకు మూడు నెలలు ఫ్రీ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టెలికం వార్‌లో పోటీపడుతున్న దిగ్గజ కంపెనీ ఎయిర్టెల్ మరో అడుగు ముందుకేసింది. వి–ఫైబర్ పేరుతో వేగవంతమైన బ్రాడ్‌బ్యాండ్ సేవలను హైదరాబాద్‌లో ప్రారంభించింది. దీని ప్రత్యేకత ఏమంటే 100 ఎంబీపీఎస్ వరకు వేగాన్ని కస్టమర్లు ఎంజాయ్ చేయవచ్చు. ఇప్పటి వరకు 40 ఎంబీపీఎస్ వేగం వరకే కంపెనీ సేవలు అందించింది. పాత కస్టమర్లు ఎటువంటి అదనపు భారం లేకుండానే కొత్త టెక్నాలజీకి అప్‌గ్రేడ్ అవొచ్చు. మోడెమ్‌ను మార్చుకుంటే సరిపోతుంది. కొత్తగా వైర్లు వేయడం, తవ్వకాల అవసరం లేదు. యూరప్‌లో నంబర్–1 ఫిక్స్డ్ బ్రాడ్‌బ్యాండ్ టెక్నాలజీ అయిన వెక్టోరైజేషన్ ఆధారంగా వి–ఫైబర్ పనిచేస్తుందని భారతీ ఎయిర్టెల్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సర్కిల్ సీఈవో వెంకటేశ్ విజయ్ రాఘవన్ సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. భారత్‌లో ప్రస్తుతం ఎయిర్టెల్ మాత్రమే ఈ పరిజ్ఞానాన్ని పరిచయం చేసిందని చెప్పారు. 1 జీబీ స్పీడ్ అందించే సామర్థ్యం సైతం కంపెనీకి ఉందని పేర్కొన్నారు. మార్కెట్ సిద్ధం కాగానే అందుబాటులోకి తెస్తామన్నారు. అపరిమిత కాల్స్ సైతం.. కొత్తగా వి–ఫైబర్ కనెక్షన్ తీసుకుంటే మూడు నెలల పాటు సేవలు ఉచితం. వి–ఫైబర్ ప్లాన్స్ రూ.650 నుంచి ప్రారంభం. బ్రాడ్‌బ్యాండ్ కస్టమర్లందరూ ఏ టెలికం కంపెనీ వినియోగదార్లకైనా దేశవ్యాప్తంగా వాయిస్ కాల్స్ అపరిమితంగా చేసుకోవచ్చు. వినియోగదారు ఎయిర్టెల్ పోస్ట్‌పెయిడ్ మొబైల్ లేదా డిజిటల్ టీవీ (డీటీహెచ్) సైతం వాడినట్టయితే మై హోమ్ రివార్డ్స్ ప్రోగ్రాం కింద అదనపు డేటా పొందవచ్చు. ఉదాహరణకు కస్టమర్ కుటుంబంలో రెండు పోస్ట్‌పెయిడ్ మొబైల్, ఒక డిజిటల్ టీవీ కనెక్షన్ ఉంటే 15 జీబీ డేటా అదనం. ఎయిర్టెల్ వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబరుకు ఫోన్ చేసి కొత్త సేవలు పొందవచ్చు. వి–ఫైబర్‌కు అప్‌గ్రేడ్ అయ్యాక సర్వీసు నచ్చకపోతే నెల రోజుల్లోగా కస్టమర్ చెల్లించిన యాక్టివేషన్ చార్జీల మొత్తాన్ని కంపెనీ రిఫండ్ చేస్తుంది. ప్రాజెక్ట్ లీప్లో భాగంగా నెట్‌వర్క్‌ను పటిష్టం చేసే కార్యక్రమమిదని కంపెనీ తెలిపింది. హైదరాబాద్‌సహా ఏడు నగరాల్లో వి–ఫైబర్ అందుబాటులోకి వచ్చింది. హైదరాబాద్‌లో అన్ని కంపెనీలకు కలిపి సుమారు 6 లక్షల బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్లు ఉన్నాయి. ఇందులో ఎయిర్టెల్ వాటా 20 శాతం దాకా ఉంది. -
ఎయిర్టెల్ కొత్త ఎత్తుగడ - ట్రయల్ ఆఫర్ సూపర్
రిలయన్స్ జియో ఫ్రీ ఆఫర్ల హవా కొనసాగుతుండడంతో ఇతర టెలికం దిగ్గజాలలో గుబులుమరింత పెరుగుతోంది. ఎలాగైనా తమకస్టమర్లను నిలపుకోవాలనే యోచనతో ఆఫర్ల కురిపిస్తున్నాయి. తాజా మార్కెట్ లీడర్ భారతి ఎయిర్ టెల్ ఎయిర్టెల్ మరో కొత్త ఎత్తుగడ వేసింది. బ్రాడ్ బ్యాండ్ వినియోగదారులకు మూడు నెలలపాటు అన్లిమిటెడ్ డాటా ఫ్రీ ఆఫర్ ఇవ్వనున్నట్టు ప్రకటించింది. దీనికోసం బ్రాడ్ బ్యాండ్ టెక్నాలజీనిని 'వి ఫైబర్ 'టెక్నాలజీతో అప్ గ్రేడ్ చేస్తున్నట్టు గురువారం ప్రకటించింది. దీని ద్వారా ఇక సెకనుకి వరకు 100 మెగాబిట్ ఇంటర్నెట్ వేగాన్ని అందుకుంటుందని తెలిపింది. బ్రిటిష్ టెలికాం,ఫా స్ట్ వెబ్, టి. టెలికాం, టెలీ ఫోనికా మాత్రమే వాడుతున్న ఈ కొత్త టెక్నాలజీని ద్వారా వినియోగదారులు ఎలాంటి అదనపు ఖర్చు లేకుండానే అధిక వేగంతో పనిచేసే ఇంటర్నెట్ సేవలను అందించనున్నట్టు ఎయిర్ టెల్ తెలిపింది. ఇప్పటికే చెన్నైలో ఈ సేవలను ప్రారంభించామని, మరో రెండుమూడువారాల్లో దేశమంతా అమలు చేస్తామని భారతి ఎయిర్ టెల్ డైరెక్టర్ (ఆపరేషన్స్ ) అజయ్ పూరి ప్రకటించారు. ఎయిర్టెల్ 'వి-ఫైబర్ కొత్త వినియోగదారులకు మూడు నెలల ఉచిత ట్రయల్ ఆఫర్ అందిస్తోంది. అలాగే రూ 1,299 నుంచిమొదలయ్యే ప్లాన్ లో దేశమంతా ఉచిత వాయిస్ కాల్స్ అందిస్తున్నామని తెలిపింది. ముఖ్యంగా ఇన్ ఫ్రాస్ట్రక్చర్ లో ఎలాంటి భారీ మార్పులు లేకుండానే, కస్టమర్ ప్రాంగణంలో కొత్త వైరింగ్, డ్రిల్లింగ్ అవసరంలేకుండానే ఇంటర్నెట్ వేగాన్ని అప్ గ్రేడ్ చేస్తున్నామని ఎయిర్ టెల్ ఒక ప్రకటనలో తెలిపింది. అలాగే ప్రస్తుత వినియోగదారులు అధిక చార్జ్ తో, సేమ్ ప్లాన్ లో 'వి-ఫైబర్' వేగంతో అప్‌గ్రేడ్ చేసుకోవచ్చని ప్రకటించింది. దీనికోసం మోడెమ్ రూ 1,000 చెల్లించాల్సి ఉంటుందని , ఒక వేళ ఒక నెలలో ఈ సర్వీసులో వినియోగదారుడు సంతృప్తి చెందకపోతే మోడెం చార్జీలు వెనక్కి తిరిగి చెల్లించబడతాయని ఎయిర్టెల్ ప్రతినిధి చెప్పారు. తమ రూ 60,000 కోట్ల ప్రాజెక్ట్ అభివృద్ధిలో భాగంగా ఎయిర్టెల్ ప్రస్తుత బ్రాడ్ బ్యాండ్వేగాన్ని 100 ఎంబీపీఎస్ వేగాన్ని అందుకునేలా విక్టోరైజేషన్ టెక్నాలజీని అమలు చేస్తున్నట్టు అజయ్ పూరి స్పష్టం చేశారు. కార్బన్ ఉద్గారాలను తగ్గించడంతో పాటు, చాలా వేగవంతమైన అనుకూలమైన, అతి తక్కువ ధరకే అదనపు డేటా అందించటం తమ ధ్యేయమని పూరీ చెప్పారు. మరోవైపు ఇప్పటివరకు, ఈ రంగంలో ఈ ఐదు మిలియన్ల వినియోగదారులు ఎయిర్ టెల్ ఉన్నారనీ, ఇదే అతిపెద్ద టెక్నాలజీ అప్ గ్రేడ్ అని మార్కెట్ వర్గాల అంచనా. -
ఇంటర్నెట్ సేవలు మళ్లీ బంద్
► విగ్రహాన్ని ధ్వంసం చేసేందుకు కానిస్టేబుల్ ప్రయత్నం ► జమ్ములో తీవ్ర ఉద్రిక్తత.. నిందితుడి అరెస్టు జమ్మూలో పురాతన శివాలయాన్ని ధ్వంసం చేసిన ఘటనతో చెలరేగిన తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చల్లబడక ముందే మరోసారి ఉద్రిక్తత చోటు చేసుకుంది. రెండు రోజుల క్రితం ఓ సస్సెండ్ అయిన జమ్మూకాశ్మీర్ పోలీస్ కానిస్టేబుల్... స్థానిక ఆలయంలోని విగ్రహాన్ని ధ్వంసం చేసేందుకు ప్రయత్నించగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తాజాగా నానక్ నగర్ లోని శివాలయ ధ్వంసానికి ఓ వ్యక్తి ప్రయత్నించడం మరోసారి అలజడి రేగింది. దీంతో మూడు రోజులుగా ప్రభుత్వం మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేసింది. జమ్మూలో గురువారం జరిగిన పురాతన శివాలయ ధ్వంసం ఘటన మరువక ముందే మరో అలజడి రేగింది. సస్పెండెడ్ కానిస్టేబుల్ గుర్బచన్ సింగ్ నానక్ నగర్ లోని ఆలయంలోకి వెళ్ళి అక్కడి శివుడి విగ్రహాన్ని ధ్వంసం చేసేందుకు ప్రయత్నించడంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఆలయధ్వంసం ఘటన తెలియడంతో స్థానికులు నిరసనకు దిగారు. దీంతో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకోగా, పోలీసులు పరిస్థితుల్ని అదుపులోకి తెచ్చారు. అంతకు ముందు రూప్ నగర్ లో జరిగిన ఆలయ ధ్వంసానికి, తాజా ఘటనకు ఏదైనా సంబంధం ఉందా అన్నకోణంలో దర్యాప్తు చేస్తున్నారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో జమ్మూలో మొబైల్, ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. అయితే రెండు రోజులుగా ఆందోళనలతో ఉన్న జమ్మూలో నేడు కొంత ప్రశాంత వాతావరణం కనిపించింది. వ్యాపార సంస్థలు, దుకాణాలు తెరుచుకున్నాయి. రోడ్లపై ట్రాఫిక్ కూడా ఎప్పట్లాగే కనిపించింది. అయితే స్థానికంగా మొబైల్, ఇంటర్నెట్ సేవలు మాత్రం కొనసాగడం లేదు. మూడు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా సేవలు స్తంభించిపోయాయి. దక్షిణ కాశ్మీర్ లో అమరనాథ్ యాత్ర సందర్భంలోనే మత విద్వేషాలను రెచ్చగొట్టేందుకు ప్రణాళికా బద్ధంగా దేవాలయాలను ధ్వంసం చేసే కుట్ర జరుగుతోందన్న అనుమానంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం ఇంటర్నెట్ సేవలు నిలిపివేసింది. అయితే నిందితుడు నానక్ నగర్ ఆలయధ్వంసానికి పాల్పడే ముందు సెల్ ఫోన్ లో ఇతరులతో విషయాన్ని వివరించినట్లు జమ్ము డివిజినల్ కమిషనర్ పవన్ కొత్వాల్ తెలిపారు. నానక్ నగర్ ఆలయంలో శివుడి విగ్రహాన్ని ధ్వంసం చేసేందుకు ప్రయత్నించిన వ్యక్తిని సస్పెండ్ అయిన పోలీస్ కానిస్టేబుల్ గుర్బచన్ సింగ్ అలియాస్ మింటా గా గుర్తించామని, అతడు ఘటనకు ముందు మాట్లాడిన సెల్ ఫోన్ సంభాషణను బట్టి అతడ్ని ఆదుపులోకి తీసుకున్నట్లు వివరించారు. ఫోన్ లో అవతలి వ్యక్తితో సింగ్... చెప్పిన పని పూర్తయిందని, తన ఖాతాలో డబ్బు జమచేయమని చెప్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. అనంతరం సింగ్ ను పబ్లిక్ సేఫ్టీ యాక్ట్ కింద జమ్ము డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ సిమరన్ దీప్ ఆదేశాల మేరకు అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. కాగా రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలు పునరుద్ధరించిన ప్రభుత్వం జమ్మూలో మాత్రం మూడోరోజూ నిలిపివేతను కొనసాగిస్తోంది. అంతకుముందు జరిగిన నిరసన ప్రదర్శనలలో వేర్పాటువాదులు పాకిస్థాన్, ఐఎస్ఐఎస్ జెండాలను ఎగరేశారు. -
రాష్ట్రంలో ఇంటింటికీ ఇంటర్నెట్
-
టెలికంలో కొలువుల ట్రింగ్.. ట్రింగ్..
న్యూఢిల్లీ: భారత టెలికాం రంగంలో రానున్న ఐదేళ్లలో 40 లక్షల కొత్త కొలువులు రానున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో వినియోగదారులు పెరుగుతుండడం, ఇంటర్నెట్ విస్తరణ దీనికి ప్రధాన కారణాలని నిపుణులంటున్నారు. మరింత స్పెక్ట్రమ్ అందుబాటులోకి రానుండడం, టారిఫ్‌ల హేతుబద్ధీకరణ తదితర కారణాల వల్ల కూడా కొత్త కొలువులు భారీ సంఖ్యలో రానున్నాయని చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వం 2.5 లక్షల గ్రామ పంచాయతీలను అధిక వేగమున్న బ్రాడ్‌బాండ్ నెట్‌వర్క్‌తో అనుసంధానం చేయాలని ప్రయత్నాలు చేస్తోంది. ఫలితంగా నైపుణ్యమున్న టెక్నీషియన్లకు, ఇంజినీర్లకు, ఇన్స్టలేషన్, మెయింటనెన్స్ సేవలందించే ఉద్యోగులకు, అమ్మకాలు,మార్కెటింగ్, హెచ్ఆర్ రంగాల్లో డిమాండ్ పెరుగుతుందని అంచనా. గత పదేళ్లుగా భారత టెలికాం రంగం 35 శాతం వార్షిక వృద్ధిని సాధిస్తోందని ర్యాండ్‌స్టాడ్ ఇండియా సీఈఓ కె.ఉప్పలూరి పేర్కొన్నారు. గత దశాబ్దంలో అధికంగా ఉద్యోగాలు కల్పించిన రంగాల్లో ఒకటిగా టెలికం నిలిచిందని టీఈ కనెక్టివిటీ పేర్కొంది. 2015 కల్లా 2.75 లక్షల మంది కొత్త ఉద్యోగులు అవసరమవుతారని వివరించింది. సరైన నైపుణ్యాలున్న ఉద్యోగిని ఎంచుకోవడమే అసలైన సమస్యని పేర్కొంది. బ్యాండ్‌విడ్త్ లభ్యత డిజిటైజేషన్ ప్రక్రియ పూర్తికానుండడం వంటి కారణాల వల్ల టెలికంలో అపార ఉద్యోగవకాశాలుల అందుబాటులోకి వస్తాయని పేర్కొంది. -
పల్లె పల్లెకూ బ్రాడ్‌బ్యాండ్: కేటీఆర్
హైదరాబాద్: పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని ఐటీ, పంచాయతీరాజ్ మంత్రి కె.తారకరామారావు అన్నారు. కంటోన్మెంట్ బాలంరాయిలోని గీతాంజలి పాఠశాలలో మంగళవారం ఏపీ, తెలంగాణ ఐసీఎస్ఈ, ఐఎస్సీ పాఠశాలల సంఘం ఆధ్వర్యంలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల సెమినార్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ మెరుగైన విద్య కోసం అవసరమైన సాంకేతిక నైపుణ్యాన్ని అందుబాటులోకి తెస్తున్నామన్నారు. ఈ-లెర్నింగ్, ప్రతి గ్రామానికి ఇంటర్నెట్ సౌకర్యం కల్పించేందుకు కృషి చేస్తున్నామన్నారు. మొదటి విడతగా రాష్ట్రంలోని రెండు వేల గ్రామాల్లో బ్రాడ్‌బ్యాండ్ ఆప్టిక్ కేబుల్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. వచ్చే ఐదేళ్లలో తండాలు, పంచాయతీలు కలిపి 10 వేల గ్రామాలకు ఈ సౌకర్యం కల్పిస్తామన్నారు. విద్యాశాఖలోని అన్ని విభాగాలను ఒకే గొడుగు కిందకు తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. జగ్గారెడ్డికి ప్రజలే గుండు కొడతారు లక్ష మెజార్టీ రాకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని ప్రకటించిన సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి వేషంతోపాటు పార్టీని కూడా మార్చారని మంత్రి కేటీఆర్ విమర్శించారు. మెదక్ లోక్‌సభ ఉప ఎన్నికలో జగ్గారెడ్డిని ప్రజలు మరోసారి ఓడించి గుండుకొడతారని జోస్యం చెప్పారు. బీజేపీని బాబుగారి జగ్గారెడ్డి పార్టీగా ఆయన వ్యంగ్యంగా అన్నారు. కాంగ్రెస్ నుంచి వచ్చిన జగ్గారెడ్డికే బీజేపీ టికెట్ కేటాయించడం సిగ్గు చేటన్నారు. పొన్నాలా.. సిగ్గుందా: కేటీఆర్ ధ్వజం మెదక్: ‘పొన్నాలా నీకు సిగ్గుందా!.. కరెంట్ సమస్యకు కారణం కాంగ్రెస్ కాదా?.. బొగ్గు నిక్షేపాలున్నా తెలంగాణను కాదని ఆంధ్రలో, రాయలసీమలో విద్యుత్ కేంద్రాలు ఏర్పాటు చేసింది మీరు కాదా? కనీసం ఛత్తీస్‌గఢ్ నుంచి విద్యుత్ లైన్లు వేసేందుకు ఎప్పుడైనా ప్రయత్నించారా? వంద రోజులు కూడా నిండని టీఆర్ఎస్ ప్రభుత్వం చేయలేనిది ఏమిటి? తెలంగాణ ఉద్యమంలో కలసి నడిచారా? కనీసం పునర్నిర్మాణంలోనైనా కలిసిరండి’ అంటూ పంచాయతీరాజ్, ఐటీ శాఖ మంత్రి కె. తారకరామారావు కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు. మంగళవారం మెదక్‌లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కరెంట్ సమస్యకు టీఆర్ఎస్ కారణమని పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య విమర్శించడం తగదన్నారు. విద్యుత్ సమస్యను అధిగమించేందుకు సీఎం కేసీఆర్ అన్ని ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి విజయం ఖాయమైపోయిందని, అందరి మైండ్‌బ్లాక్ అయ్యేలా 5 లక్షలపై చిలుకు ఓట్లతో గెలిపించాలని ఆయన కోరారు. -
‘స్మార్ట్ సిటీ’లకు 4 లక్షల జనాభా
హైదరాబాద్: ‘స్మార్ట్ సిటీ’.. కేంద్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న ప్రాజెక్టు. దీనికి ఎంపికైతే, ఆ నగరాల్లో ఐ.టి.ఆధారిత పౌర సేవలందించడంతో పాటుబ్రాడ్బ్యాండ్ సేవలనూ విస్తృత పరుస్తారు. ఎంపికైన నగరంలో అభివృద్ధి పనులు చేపచేపట్టి తాగునీరు, రోడ్లు, మురుగు కాల్వలు తదితర మౌలిక వసతులను మెరుగు పరిచేందుకు భారీ స్థాయిలో నిధులను కేంద్రమే కేటాయిస్తుంది. దేశంలోని 100 నగరాలను ‘స్మార్ట్ సిటీ’ ప్రాజెక్టు కింద ఎంపికచేసి రూ.7 వేల కోట్లతో అభివృద్ధి చేస్తామని ప్రధాని మోడీ హామీ ఇవ్వడంతో ఈ ప్రాజెక్టుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే, ఈ ప్రాజెక్టుకు ఎంపికయ్యే పట్టణాలు కనీసం 4 లక్షల జనాభా కలిగి ఉండాలని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ఇటీవల రాష్ట్రాలకు రాసిన లేఖలో పేర్కొంది. పరిశీలనలో ఉన్నవి ఇవే..: సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ పట్టణంతోపాటు హైదరాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, మహబూబ్‌నగర్, సిద్దిపేటలను స్మార్ట్ సిటీ ప్రాజెక్టు కింద కేంద్రానికి ప్రతిపాదించేందుకు తెలంగాణ ప్రభుత్వం పరిశీలన జరిపినట్లు సమాచారం. అయితే, కేంద్రం విధించిన ‘4 లక్షల జనాభా’ నిబంధన వల్ల గజ్వేల్, సిద్దిపేట ఈ పథకం కింద ఎంపికయ్యే అవకాశం లేకుండాపోయింది. -
2400 గ్రామాల్లో ఇ-పంచాయతీలు
అన్ని సేవలూ ఆన్లైన్ ద్వారానే ఉపాధి చెల్లింపుల కోసం ‘వన్ స్టాప్ షాఫు’ అధికారులతో మంత్రి కేటీఆర్ సమీక్ష హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో 2,400 గ్రామ పంచాయతీలను ఇ- పంచాయతీలుగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం వాటిని కంప్యూటరీకరించి బ్రాడ్‌బ్యాండ్ సౌకర్యాన్ని కల్పించనున్నారు. పంచాయతీ పరిధిలో పన్నుల వసూలు, లే అవుట్ ఫీజులు, జనన, మరణ ధ్రువీకరణపత్రాల జారీ, మన ఊరు- మన ప్రణాళిక తయారీ, పంచాయతీలో చేపట్టే వివిధ పథకాల వ్యయ నిర్వహణతో సహా అన్ని వ్యవహారాలను ఆన్లైన్ ద్వారా చేపడతారు. గ్రామసచివాలయ స్థాయిలో ఇ- పంచాయతీల ఏర్పాటుపై పంచాయతీరాజ్, ఐటీ శాఖలమంత్రి కె.తారకరామారావు బుధవారం విస్తృతస్థాయిలో సమీక్షించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల ముఖ్య కార్యదర్శి రేమండ్ పీటర్, ఐటీ విభాగం, ఎన్ఐసీ, ఏపీటీఎస్ అధికారులు, పంచాయతీరాజ్ కమిషనర్ తదితరులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. తెలంగాణలో 8,778 పంచాయతీలుండగా తొలిదశలో 2,400 పంచాయతీలను కంప్యూటరీకరిస్తారు. ఇందులో ‘వన్ స్టాప్ షాపు’ ఏర్పాటు చేసి, దాని ద్వారానే ఉపాధి హామీ చెల్లింపులు, పెన్షన్లు, వాటర్‌షెడ్ తదితర అన్ని ప్రభుత్వ కార్యక్రమాలను నిర్వహించాలని భావిస్తున్నారు. ఈ చర్యలు స్థానిక ప్రభుత్వాలైన పంచాయతీల పాలనలో విప్లవాత్మకమార్పులు తెస్తాయని, పాలనలో పారదర్శకతను, జవాబుదారీతనాన్ని పెంచుతాయని ప్రభుత్వం విశ్వసిస్తుంది. వెంటనే ఇ- పంచాయతీలను ప్రారంభించేందుకు ఎన్ని పంచాయతీల పరిధిలో బ్రాడ్‌బ్యాండ్ సౌకర్యం అందుబాటులో ఉందోనన్న వివరాలను పంచాయతీరాజ్ అధికారులు అంచనా వేస్తున్నారు. -
పల్లెల్లో మొబైల్ కనెక్షన్ల జోరు
న్యూఢిల్లీ: మొబైల్ ఫోన్ కనెక్షన్లు జోరుగా పెరుగుతున్నాయి. ఈ ఏడాది మార్చినెలలో నికర మొబైల్ టెలిఫోన్ కనెక్షన్లు 11.5 లక్షలు పెరిగాయని టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(ట్రాయ్) వెల్లడించింది. దీంతో భారత్‌లో మొత్తం వెర్లైస్ వినియోగదారుల సంఖ్య 90.45 కోట్లకు, మొత్తం టెలిఫోన్ వినియోగదారుల సంఖ్య 93.3 కోట్లకు పెరిగాయని పేర్కొంది. ఇవీ వివరాలు... ఫిబ్రవరి చివరి నాటికి 93.1 కోట్లకుగా ఉన్న మొత్తం టెలిఫోన్ వినియోగదారుల సంఖ్య 0.11 శాతం వృద్ధితో 93.3 కోట్లకు చేరింది. పల్లె ప్రాంతాల్లో మొబైల్ వినియోగదారుల సంఖ్య జోరుగా పెరిగిపోతోంది. ఫిబ్రవరిలో 37.49 కోట్లుగా ఉన్న ఈ సంఖ్య మార్చిలో 37.77 కోట్లకు పెరిగింది. మరో వైపు పట్టణ ప్రాంతాల్లో వినియోగదారుల సంఖ్య తగ్గింది. ఈ సంఖ్య 55.69 కోట్ల నుంచి 55.52 కోట్లకు క్షీణించింది. మార్చిలో ఐడియా సెల్యులర్కు వరుసగా రెండో నెలలో అధికంగా కొత్త వినియోగదారులు లభించారు. కొత్తగా చేరిన 22 లక్షల మంది వినియోగదారులతో ఈ కంపెనీ మొత్తం వినియోగదారుల సంఖ్య 13.57 కోట్లకు పెరిగింది. ఐడియా తర్వాత వొడాఫోన్‌కు అధిక సంఖ్యలో వినియోగదారులు లభించారు. ఈ కంపెనీకి 22.1 లక్షల మంది కొత్త వినియోగదారులు లభించారు. ఎయిర్‌టెల్‌కు 18.9 లక్షల మంది, ఎయిర్‌సెల్‌కు 10 లక్షల మంది, యూనినార్‌కు 7.1 లక్షల మంది, వీడియోకాన్‌కు 3.2 లక్షల మంది, సిస్టమకు 2.4 లక్షల మంది కొత్త వినియోగదారులు లభించారు. ఆర్‌కామ్‌తో పాటు, బీఎస్ఎన్ఎల్, టాటా టెలి సర్వీసెస్, ఎంటీఎన్ఎల్, లూప్ కంపెనీల వినియోగదారుల సంఖ్య తగ్గింది. బీఎస్ఎన్ఎల్కు 1.8 లక్షల మంది, టాటా టెలి సర్వీసెస్‌కు 1.4 లక్షల మంది, ఎంటీఎన్ఎల్ 1.3 లక్షల మంది, లూప్ మొబైల్ 40 వేల మంది తగ్గారు. వాడుకలో లేని 70 లక్షల వినియోగదారుల నంబర్లను రిలయన్స్ కమ్యూనికేషన్స్ తొలగించింది. అయినప్పటికీ, 11 కోట్ల మంది వినియోగదారులతో ఆర్‌కామ్ నాలుగో పెద్ద టెలికాం కంపెనీగా తన స్థానాన్ని నిలుపుకుంది. ఫిబ్రవరిలో 5.8 కోట్లుగా ఉన్న బ్రాడ్‌బాండ్ విని యోగదారుల సంఖ్య మార్చిలో 28.7 లక్షల (5%) వృద్ధితో 6.08 కోట్లకు చేరింది. వీటిల్లో వెర్లైస్ బ్రాడ్‌బాండ్ కనెక్షన్ల సంఖ్య 4.56 కోట్లుగా, ల్యాండ్‌లైన్ బ్రాడ్‌బాండ్ కనెక్షన్ల సంఖ్య 1.48 కోట్లు. -
ఎయిర్‌సెల్ కస్టమర్లకు ఫేస్బుక్ ఉచితం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మొబైల్ కస్టమర్లకు మరింత చేరువ అయ్యేందుకు టెలికం రంగ కంపెనీ ఎయిర్‌సెల్ తాజాగా ఉచిత ఫేస్బుక్ ఆఫర్‌ను ప్రకటించింది. కొత్త కస్టమర్లకు 60 రోజుల కాల పరిమితితో నెలకు 50 ఎంబీ చొప్పున, పాత కస్టమర్లకు 30 రోజుల కాలపరిమితితో 50 ఎంబీ డేటాను ఉచితంగా అందిస్తోంది. 50 ఎంబీ పూర్తి అయితే 10 కేబీ డేటా వాడకానికి 2 పైసలు చార్జీ చేస్తారు. స్టార్121స్టార్999హ్యాష్ డయల్ చేసి కస్టమర్లు ఈ ఆఫర్‌ను పొందవచ్చు. ఫేస్బుక్ కోసం ప్రత్యేక టారిఫ్ ప్యాక్‌లను సైతం కంపెనీ ప్రవేశపెట్టింది. రూ.14 ప్యాక్‌తో 100 ఎంబీ 2జీ/3జీ డేటాను 28 రోజులపాటు వినియోగించుకోవచ్చు. 5 రోజుల వ్యాలిడిటీగల రూ.5 ప్యాక్‌తో 25 ఎంబీ డేటా ఉచితం. అలాగే రూ.5 రీచార్జ్ చేస్తే రూ.10, 20, 30 రీచార్జ్‌పై పూర్తి టాక్‌టైం అందిస్తున్నట్టు ఎయిర్‌సెల్ ఆంధ్రప్రదేశ్ సర్కిల్ బిజినెస్ హెడ్ తివానా బుధవారమిక్కడ మీడియాకు తెలిపారు.