న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ టెలికాం సేవల సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ హ్యాకింగ్ బారిన పడింది. దీంతో వెంటనే పాస్‌వర్డ్‌లను మార్చుకోవాలంటూ తమ బ్రాడ్‌బ్యాండ్ వినియోగదారుకు సూచించింది. పలు బ్రాడ్‌బ్యాండ్ సిస్టమ్‌లపై ఇటీవల మాల్‌వేర్ దాడులు జరగడంతో డిఫాల్ట్ సిస్టమ్ పాస్‌వర్డులను తక్షణం మార్చుకోవాలని బీఎస్‌ఎన్‌ఎల్ సంస్థ కోరింది
పిటిఐ నివేదిక ప్రకారం, దాదాపు 2,000 బ్రాడ్బ్యాండ్ మోడెమ్‌లు దాడికి గురయ్యాయి. వెంటనే వీటి డిఫాల్ట్ పాస్‌వర్డ్ ‘అడ్మిన్’ను మార్చుకోవాలని సంస్థ కస్టమర్లను కోరింది. బీఎస్‌ఎన్‌ఎల్ బ్రాడ్‌బాండ్ సిస్టంలోని కొంత భాగంగా మాల్వేర్ దాడికి గురైంది. దీంతో తమ సొంత బ్రాడ్ బాండ్ వినియోగదారులను అప్రమత్తం చేసింది. చందాదారులు డిఫాల్ట్ పాస్వర్డ్ మార్చకపోవడం మూలంగానే మాలావేర్ దాడికి గురయ్యాయని కంపెనీ ప్రతినిధులు ప్రకటించారు.
అయితే పరిస్థితిని చాలావరకు చక్కదిద్దామని, కానీ వెంటనే పాస్‌వర్డ్‌లను మార్చకోవాలని బిఎస్ఎన్ఎల్ ఛైర్మన్ అనుపమ్ శ్రీవాత్సవ సలహా ఇచ్చారు. ఒక్కసారి పాస్‌వర్డ్‌ను మార్చితే ఇక ఎలాంటి సమస్య ఉండదు, ఆందోళన అవసరంలేదని చెప్పారు. అయితే తమ ప్రధాన నెట్ వర్క్, బిల్లింగ్ లేదా ఏ ఇతర వ్యవస్థను ప్రభావితం చేయలేదని తెలిపారు.