బీఎస్ఎన్ఎల్ మరో శుభవార్త చెప్పింది. అన్ని రకాల ఫిక్స్‌డ్ లైన్ కనెక్షన్ల తీసుకునే ఇన్‌స్టాలేషన్ ఛార్జీలను మాఫీ చేయాలని భారత ప్రభుత్వ టెలికం ఆపరేటర్ భారత్ సంచార్ నిగం లిమిటెడ్(బీఎస్ఎన్ఎల్) ప్రకటించింది. టెలికాం పీఎస్‌యు ఫైబర్ ఆప్టిక్ బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్లు, డీఎస్ఎల్ బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్లు, ల్యాండ్‌లైన్ సేవలు వంటి అనేక టెలికాం సేవలను అందిస్తుంది. ఈ సేవలకు సంబంధించి ఏప్రిల్ 30, 2021 వరకు ఏదైనా కొత్త కనెక్షన్ కోసం తీసుకుంటే ఇన్‌స్టాలేషన్ ఛార్జీలు మాఫీ కానునున్నట్లు టెలికామ్‌టాక్ నివేదించింది.
బీఎస్ఎన్ఎల్ 2021 ఏప్రిల్ 8న దీనికి సంబంధించి సమాచారాన్ని ఒక సర్క్యులర్ ద్వారా ప్రకటించింది. ఈ ఆఫర్ పాన్-ఇండియా మొత్తం అందుబాటులో ఉంటుంది. అంటే ఇది ఏ ప్రత్యేక సర్కిల్‌కు మాత్రమే పరిమితం కాదు. ఢిల్లీలోని బీఎస్ఎన్ఎల్ ప్రధాన కార్యాలయం ప్రతి ఇతర రాష్ట్రలోని, సర్కిల్లలోని వెబ్‌సైట్‌లో సమాచారాన్ని నవీకరించాలని పేర్కొంది. అంతేకాకుండా, నిబంధనలు వెంటనే అమలు చేయాలనీ సూచించింది. అంటే ఈ అఫర్ 2021 ఏప్రిల్ 30 వరకు మాత్రమే వర్తిస్తుంది అన్నమాట. కొత్త బ్రాడ్‌బ్యాండ్ లేదా ల్యాండ్‌లైన్ కనెక్షన్‌ను పొందాలనుకునే ఏ యూజర్ అయినా ఇన్‌స్టాలేషన్ ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. బీఎస్ఎన్ఎల్ సాధారణంగా బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్‌ల తీసుకునేటప్పుడు వినియోగదారుల నుంచి ఇన్‌స్టాలేషన్ ఛార్జీగా రూ.250 వసూలు చేస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment