అన్‌లిమిటెడ్‌ డేటా, కాల్స్‌..రోజుకు10జీబీ ఫ్రీ | BSNL announces unlimited wireline broadband plan at Rs 249 per month; offers data download of 10GB per day & free calls | Sakshi
Sakshi News home page

అన్‌లిమిటెడ్‌ డేటా, కాల్స్‌..రోజుకు10జీబీ ఫ్రీ

Published Sat, Apr 1 2017 11:02 AM | Last Updated on Tue, Sep 5 2017 7:41 AM

అన్‌లిమిటెడ్‌ డేటా, కాల్స్‌..రోజుకు10జీబీ ఫ్రీ

అన్‌లిమిటెడ్‌ డేటా, కాల్స్‌..రోజుకు10జీబీ ఫ్రీ

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ టెలికం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) మరో ఆఫర్ ప్రకటించింది. బ్రాడ్‌బ్యాండ్‌ వినియోగదారులకు  అపరిమిత కాల్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.  ఎక్స్‌పీరియన్స్‌అన్‌లిమిటెడ్‌ బీబీ 249 తో   ఈ సరికొత్త ప్లాన్‌ను శుక్రవారం ప్రకటించింది.   దీనికి అపరిమిత ఆన్‌లైన్‌ సేవలు. అలాగే రోజుకు 10 జీబీ డౌన్‌ లోడ్‌ ఫ్రీ అంటూ  బీఎస్‌ఎన్‌ఎల్‌  ఒక మీడియా ప్రకటనలో తెలిపింది.
 
రూ.249ల మంత్లీ ‍  ప్లాన్లో  అపరిమిత బ్రాడ్బ్యాండ్ సేవలు  అందిస్తోంది. 2ఎంబీపీఎస్ వేగం, ఉచిత ఇన్‌‌స్టలేషన్‌తో ‘ఎక్స్‌పీరియన్స్ అన్‌లిమిటెడ్ బీబీ’ పేరుతో తీసుకొచ్చిన ఈ పథకంలో వినియోగదారులు రోజుకు 10 జీబీ డేటాను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.  అంతేకాదు  ఏ నెట్‌వర్క్‌కు అయినా అపరిమితంగా కాల్స్ చేసుకోవచ్చు. వైర్‌లైన్ బ్రాడ్‌బ్యాండ్ సర్వీసుల కింద ఈ పథకాన్ని అందుబాటులోకి తెచ్చినట్టు బీఎస్ఎన్ఎల్ తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement