unlimited
-
బీఎస్ఎన్ఎల్ స్పెషల్ ఆఫర్.. 425 రోజులు అన్లిమిటెడ్..
ప్రభుత్వ టెలికాం ఆపరేటర్ బీఎస్ఎన్ఎల్ (BSNL) ప్రత్యేక న్యూ ఇయర్ స్పెషల్ ఆఫర్‌ను ప్రకటించింది. ఈ ఆఫర్ కింద వినియోగదారులు వార్షిక ప్లాన్‌తో రీఛార్జ్ (Recharge Plan) చేసుకుంటే 425 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. ఇంతకుముందు ఈ ప్లాన్‌కి 395 రోజుల వ్యాలిడిటీ ఉండేది.బీఎస్ఎన్ఎల్ నూతన సంవత్సర ప్రత్యేక ఆఫర్ జనవరి 16 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఆ తర్వాత ఈ ప్లాన్‌తో రీఛార్జ్ చేస్తే డేటా, కాలింగ్ ప్రయోజనాలు మునుపటిలాగే 395 రోజుల చెల్లుబాటుతో అందుబాటులో ఉంటాయి. ఈ మేరకు బీఎస్ఎన్ఎల్ తన అధికారిక ‘ఎక్స్’ ఖాతా నుండి ఈ ఆఫర్ గురించి సమాచారాన్ని అందించింది.ఈ ప్రత్యేక ఆఫర్ కింద బీఎస్ఎన్ఎల్ రూ. 2,399 ప్లాన్‌పై వినియోగదారులకు 30 రోజుల అదనపు వ్యాలిడిటీని ఇస్తోంది. సాధారణంగా ఈ ప్లాన్‌కు 395 రోజులు వ్యాలిడిటీ ఉంటుంది. ఆఫర్ వ్యవధిలో అంటే జనవరి 16 లోపు రీఛార్జ్ చేసుకుంటే మొత్తం 425 రోజుల పాటు 2GB రోజువారీ డేటా, అపరిమిత కాలింగ్ ప్రయోజనం పొందుతారు. అంతేకాకుండా రోజుకు 100 SMS ప్రయోజనం కూడా అందుబాటులో ఉంది.ఇంత దీర్ఘకాలం చెల్లుబాటుతో రీఛార్జ్ ప్లాన్‌ను అందిస్తున్న ఏకైక టెలికాం కంపెనీ బీఎస్ఎన్ఎల్. అన్ని ఇతర కంపెనీలు గరిష్టంగా 365 రోజుల వ్యాలిడిటీతో వార్షిక ప్లాన్లను అందిస్తున్నాయి. ఇవి బీఎస్ఎన్ఎల్ ప్లాన్లతో పోలిస్తే ఖరీదైనవి. గత సంవత్సరం ద్వితీయార్థంలో బీఎస్ఎన్ఎల్ సేవలను పొందేందుకు లక్షలాది మంది వినియోగదారులు తమ నంబర్లను పోర్ట్ చేసుకున్నారు. గత ఏడాది ఇతర కంపెనీలు టారిఫ్‌లు పెంచేయడంతో బీఎస్ఎన్ఎల్ మంచి ఎంపికగా నిలిచింది.Get 2GB/Day Data & Unlimited Calls for 425 Days – all for just ₹2399/-! Hurry, offer valid till 16th Jan 2025 – don’t let this deal slip away! Stay ahead. Stay connected. Stay with BSNL!#BSNLIndia #UnlimitedCalls #2GBData #StayConnected pic.twitter.com/23lkFS3phH— BSNL India (@BSNLCorporate) January 2, 2025 -
‘అన్లిమిటెడ్’ ప్లాన్లు ఉంటాయా? కంపెనీల వైఖరి ఇదే..
టెలికాం రెగ్యులేటింగ్ అథారిటీ (TRAI) ప్రతిపాదనలతో అపరిమిత కాలింగ్, డేటా ప్లాన్ల భవిష్యత్తు ప్రమాదంలో పడింది. తమ ప్రియమైన అన్లిమిటెడ్ మొబైల్ రీచార్జ్ ప్యాకేజీలు ఆగిపోతాయేమోనని కోట్లాది మంది టెలికాం యూజర్లు ఆందోళన చెందుతున్నారు.అవసరం లేకపోయినా అన్ని కలిపి అందించే అన్లిమిటెడ్ ప్యాక్‌లు కాకుండా గతంలో మాదిరి కాలింగ్, ఎస్ఎంఎస్లకు విడివిడిగా ప్యాక్‌లు అందించే విషయంపై టెలికాం రెగ్యులేటింగ్ అథారిటీ (TRAI) ఇటీవల టెలికాం కంపెనీల స్పందన కోరింది. దీనికి ప్రధాన టెలికాం ఆపరేటర్లు జియో, ఎయిర్టెల్, వోడాఫోన్-ఐడియా తమ వైఖరిని తెలియజేశాయి. తమ రీఛార్జ్ ప్లాన్ల ప్రస్తుత నిర్మాణాన్ని సమర్థించుకున్నాయి.ఎయిర్టెల్ ఏం చెప్పిందంటే.. ఎయిర్టెల్ ట్రాయ్‌కి ఇచ్చిన స్టేట్మెంట్లో తమ ప్రస్తుత ప్లాన్లు సూటిగా, యూజర్ ఫ్రెండ్లీగా ఉన్నాయని పేర్కొంది. ఈ ప్లాన్లు ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండా వాయిస్, డేటా, ఎస్ఎంఎస్ సేవలను కలిపి అందిస్తున్నాయని చెప్పింది. ప్రత్యేక వాయిస్, ఎస్ఎంఎస్ ప్యాక్‌ల మోడల్‌కి తిరిగి వెళ్లడం పరిశ్రమను కాలం చెల్లిన సిస్టమ్‌గా మారుస్తుందని, విడివిడి రీఛార్జ్‌లతో వినియోగదారులకూ భారం పడుతుందని బదులిచ్చింది.జియోదీ అదే వైఖరిఎయిర్టెల్ వైఖరికి సమర్థిస్తూ జియో కూడా తమ సర్వే డేటాను సమర్పించింది. 91 శాతం మంది వినియోగరులు ప్రస్తుత టెలికాం ప్లాన్లను మోస్ట్ అఫర్డబుల్‌గా భావిస్తున్నారని, 93 శాతం తమకు మెరుగైన ప్రయోజనాలు లభిస్తున్నాయని నమ్ముతున్నారని పేర్కొంది. ఈ గణాంకాలు వినియోగదారులలో అపరిమిత మోడల్ విస్తృత ఆమోదాన్ని తెలియజేస్తున్నాయని జియో వివరించింది.ఆధునిక టెలికాం సేవలలో డేటా ప్రధాన అంశంగా మారిందని, అపరిమిత డేటా, కాలింగ్ మోడల్‌ను పే-యాజ్-యు-గో ప్రత్యామ్నాయం కంటే మెరుగైనదిగా టెలికాం కంపెనీలు నొక్కిచెప్పాయి. ఈ ప్లాన్లలో మార్పులు ప్రస్తుత వినియోగదారు అనుభవానికి అంతరాయం కలిగించవచ్చని పరిశ్రమ ఏకీకృత వైఖరి తెలియజేస్తోంది. ఇక దీనిపై ట్రాయ్ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. -
అన్లిమిటెడ్ ‘రెడ్ అలర్ట్ సేల్’
న్యూఢిల్లీ: అన్లిమిటెడ్ స్టోర్స్ ‘రెడ్ అలర్ట్ సేల్ ఆఫర్’ను ప్రకటించింది. అన్ని బ్రాండెడ్ వ్రస్తాలపై 50% ఫ్లాట్ డిస్కౌంట్ అందిస్తుంది. అలాగే రూ.3వేల షాపింగ్‌పై అంతే విలువైన ఉత్పత్తులు ఉచితంగా పొందవచ్చు. దేశవ్యాప్తంగా 87 స్టోర్లలో జనవరి 1 వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. ఫ్యాషన్ ఇష్టపడే ప్రతి ఒక్కరూ అవకాశాన్ని సది్వనియోగం చేసుకోవాలని కోరింది. -
HYD: అగ్ని ప్రమాదం.. అన్లిమిటెడ్ షోరూంలో ఎగిసిపడుతున్న మంటలు
సాక్షి, హైదరాబాద్: హబ్సిగూడలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. అన్లిమిటెడ్ షోరూంలో మంటలు చెలరేగాయి. మూడు ఫైర్ ఇంజిన్లతో ఫైర్ సిబ్బంది మంటలార్పుతున్నారు. రెండు ఫోర్లు పూర్తిగా కాలిబూడిదయ్యాయి. సమీపంలోనే పెట్రోల్ బంక్ ఉండటంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ముందు జాగ్రత్తగా పెట్రోల్ బంక్‌ను పైర్ సిబ్బంది మూయించివేశారు. -
అన్లిమిటెడ్ స్టోర్లలో 60% వరకు ఆఫర్లు
హైదరాబాద్: అరవింద్ లైఫ్‌స్టైల్ గ్రూప్ అనుబంధ సంస్థ అన్లిమిటెడ్ సోర్ట్ అన్ని రకాల బ్రాండెడ్ వస్త్రాలపై 60% వరకు ఆఫర్ ప్రకటించింది. దేశవ్యాప్తంగా అన్ని అన్లిమిటెడ్ స్టోర్లలో ఆగస్టు మూడో తేదీ వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. కస్టమర్లంతా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కంపెనీ కోరింది. అన్ని వయస్సుల వారికి సరిపడే సరికొత్త డిజైన్లు అందుబాటులో ఉంచినట్లు తెలిపింది. కొత్త డిజైన్లను కస్టమర్లు ఇష్టపడతారని, నాణ్యమైన ఉత్పత్తులు ఆకర్షిస్తాయని పేర్కొంది. -
50% డిస్కౌంట్: అన్లిమిటెడ్ స్టోర్స్‌లో ‘రెడ్ అలర్ట్ సేల్’
న్యూఢిల్లీ: వివిధ ఉత్పత్తులపై అత్యుత్తమ రాయితీలు, ఆఫర్లతో ‘రెడ్ అలర్ట్ సేల్’ ప్రారంభించినట్లు అన్లిమిటెడ్ స్టోర్స్ ప్రకటించింది. అన్ని బ్రాండెడ్ వస్త్రాలపై 50% ఫ్లాట్ ఆఫర్ అందిస్తుంది. అలాగే రూ. 3 వేల షాపింగ్‌పై అంతే విలువైన ఉత్పత్తులను ఉచితంగా పొందవచ్చు. దేశవ్యాప్తంగా అన్ని అన్లిమిటెడ్ స్టోర్లలో ఈ ఆఫర్ జూలై రెండో తేదీ వరకు అందుబాటులో ఉంటుంది. కస్టమర్లంతా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కంపెనీ కోరింది. -
అరవింద్ ‘అన్లిమిటెడ్’ ఇప్పుడు విజయవాడలో
హైదరాబాద్: కుటుంబ సభ్యులందరికీ ఫ్యాషన్ వస్త్రోత్పత్తులను ఒకే చోటే అందుబాటులో ఉంచే ‘అన్లిమిటెడ్’ 58వ షోరూమ్ విజయవాడలోని ఎంజీరోడ్డులో ఆరంభమైంది. అరవింద్ లైఫ్‌స్టయిల్ బ్రాండ్స్ లిమిటెడ్‌కు చెందిన అనుబంధ విభాగం ఇది. మహిళలు, పురుషులు, చిన్నారులకు సంబంధించి 30,000 ఆధునిక శ్రేణి వస్త్రాలను ఇక్కడ అందుబాటులో ఉంచినట్టు సంస్థ తెలిపింది. సంప్రదాయానికి భిన్నంగా ఈ సంస్థ కొత్త స్టోర్‌ను సమీపంలోని ఓ అనాథ శరణాలయానికి చెందిన చిన్నారులతో ప్రారంభించి ప్రత్యేకతను చాటుకుంది. ఈ సందర్భంగా సంస్థ సీఈవో శేఖర్ మాట్లాడుతూ... విజయవాడలో తమకు ఇది తొలి స్టోర్ అని, ఆంధ్రప్రదేశ్‌లో 5వ స్టోర్ అని చెప్పారు. హైదరాబాద్‌లో 6 స్టోర్లు, తెలంగాణ వ్యాప్తంగా 7 స్టోర్లు ఉన్నట్టు తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే 35 స్టోర్లను దేశవ్యాప్తంగా ప్రారంభించనున్నట్టు విస్తరణ ప్రణాళికల గురించి వివరించారు. -
జియో ఎఫెక్ట్: ఎయిర్టెల్ అన్లిమిటెడ్ డేటా
జియోతో పోటీకి అనుగుణంగా టెలికం దిగ్గజం భారతి ఎయిర్టెల్ తన ప్లాన్లను రివ్యూ చేస్తోంది. మై హోం పథకంలో మరో బంపర్ఆఫర్ తో ముందుకువవచ్చింది. మై హోం ప్రమోషనల్ ఆఫర్లో మునుపటి 5 జీబీ డేటా ఆఫర్‌ను రెట్టింపు చేసింది. ఎయిర్టెల్ బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ కనెక్షన్‌తో కలిపిన పోస్ట్‌పెయిడ్, డిటిహెచ్ సేవలపై నెలకు10 జీబీ డేటాను ఉచితంగా అందించనున్నట్టు శనివారం ప్రకటించింది. ఈ ప్రమోషనల్ ఆఫర్ ప్రకారం ఎయిర్టెల్ బ్రాడ్ బ్యాండ్ తోపాటు ప్రతి పోస్ట్ పెయిడ్ కనెక్షన్ , డిజిటల్టీవీ సేవల్లో దీన్ని ఆఫర్ చేస్తోంది. ప్రస్తుతం మై ఎయిర్టెల్ ఆప్‌లో మై హోమ్ ద్వారా ఈ ఆఫర్ లభ్యమవుతోందని కంపెనీ ప్రకటించింది. మై హోం యాప్‌లో ప్రస్తుతం అందుబాటులోఉందనీ, ఎయిర్టెల్ బ్రాడ్ బ్యాండ్ లేదా ఎయిర్టెల్ పోస్ట్‌పెయిడ్ కనెక్షన్ లేదా ఎయిర్టెల్ డిజిటల్ టీవీ సర్వీస్ కలిగిన వినియోగదారులు ఈ అవకాశాన్నివినియోగించుకోవచ్చని తెలిపింది. గతంలో 5 జీబీ డేటా ఫ్రీ ఆఫర్ ఎయిర్టెల్ బ్రాడ్‌బ్యాండ్ సర్వీసులను జులై 1, 2016కి ముందు ప్రారంభించిన వినియోగదారులకు మాత్రం అందుబాటులో ఉంది. అలాగే కొన్ని పరిమితులు కూడా ఉన్నాయి. ప్రస్తుత ఉచిత డేటాను రెట్టింపుచేయడంతోపాటు, బ్రాడ్ బ్యాండ్, పోస్ట్ పెయిడ్, డీటీహెచ్ సర్వీసుల (ఇప్పటివరకు 25 పోస్ట్‌పెయిడ్ కనెక్షన్లు, 25డీటీహెచ్ కనెక్షన్లకు పరిమితం) పరిమితులను కూడా తొలగించింది. కాగా మూడు నెలల ఉచిత ఆఫర్ తో జియో డీటీహెచ్ సేవల్లోకి ఎంట్రీ ఇవ్వనుందని ఇటీవల వార్తలొచ్చాయి. సెట్ టాప్ బాక్సుల సాయంతో 1 జీబీపీఎస్ వేగంతో బ్రాడ్ బ్యాండ్ సేవలనూ పొందవచ్చని సంస్థ ప్రతినిధులు వెల్లడించారనే పలు అంచనాలతో పాటు సెట్ టాప్ బాక్సుల ఫోటోలు వీటి స్పెసిఫికేషన్స్ ఆన్ లైన్లో హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే. -
అన్లిమిటెడ్ డేటా, కాల్స్..రోజుకు10జీబీ ఫ్రీ
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ టెలికం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) మరో ఆఫర్ ప్రకటించింది. బ్రాడ్‌బ్యాండ్ వినియోగదారులకు అపరిమిత కాల్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎక్స్పీరియన్స్అన్లిమిటెడ్ బీబీ 249 తో ఈ సరికొత్త ప్లాన్‌ను శుక్రవారం ప్రకటించింది. దీనికి అపరిమిత ఆన్లైన్ సేవలు. అలాగే రోజుకు 10 జీబీ డౌన్ లోడ్ ఫ్రీ అంటూ బీఎస్ఎన్ఎల్ ఒక మీడియా ప్రకటనలో తెలిపింది. రూ.249ల మంత్లీ ప్లాన్‌లో అపరిమిత బ్రాడ్‌బ్యాండ్ సేవలు అందిస్తోంది. 2ఎంబీపీఎస్ వేగం, ఉచిత ఇన్‌స్టలేషన్‌తో ‘ఎక్స్పీరియన్స్ అన్లిమిటెడ్ బీబీ’ పేరుతో తీసుకొచ్చిన ఈ పథకంలో వినియోగదారులు రోజుకు 10 జీబీ డేటాను డౌన్లోడ్ చేసుకోవచ్చు. అంతేకాదు ఏ నెట్‌వర్క్‌కు అయినా అపరిమితంగా కాల్స్ చేసుకోవచ్చు. వైర్‌లైన్ బ్రాడ్‌బ్యాండ్ సర్వీసుల కింద ఈ పథకాన్ని అందుబాటులోకి తెచ్చినట్టు బీఎస్ఎన్ఎల్ తెలిపింది. -
గంటకు ఏడు రూపాయలట!
ముంబై: ప్రముఖ టెలికాం మొబైల్ ఆపరేటర్ వొడాఫోన్ ఓ ఆసక్తికర పథకాలను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురానుంది. రియలన్స్ జియో, ఎయిర్ టెల్ లాంటి కంపెనీల ఉచిత ఆఫర్ల ధాటికి తట్టుకునేందుకు తమ ప్లాన్స్ లో వివిధ మార్పులు చేసుకుంటూ వస్తోంది. నిన్న వొడాఫోన్ రెడ్ లో మార్పులు చేసిన వొడాఫోన్ శుక్రవారం కొత్త ఆఫర్లను ప్రవేశపెట్టింది. ప్రీ పెయిడ్ వినియోగదారులకు 'సూపర్ అవర్ ' పథకం ప్రకటించింది. ఇందులో ఒకగంటలో 3జీలేదా 4జీ డేటా అందించే రూ 16 ల ప్రారంభ ధరలను వెల్లడించింది. మరో పథకంలో రూ.7కు అన్ లిమిటెడ్ లోకల్ కాల్స్ (వొడాఫోన్ టు వోడాఫోన్) ఒక గంట చెల్లుబాటయ్యేలా రూపొందించింది. అలాగే ఈ పథకం కింద 2 జి వినియోగదారులకు అన్ లిమిటెడ్ డాటా రూ.5 కు అందుబాటులో ఉండనుంది. ఒకరోజులో ఎన్నిసార్లయినా (రోజుకి 24 సార్లు) ఈ ప్లాన్స్ ను కొనుక్కొని అపరిమిత డాటాను పొందచ్చని కూడా తెలిపింది. ఈ కొత్త పథకాలను జనవరి 7న (శనివారం)లాంచ్ చేయనుంది. ఈ ఆఫర్ జనవరి9 నుంచి అన్ని సెక్టార్స్ లో అందుబాటులోకి రానుందని తెలిపారు. నామమాత్రపు ధర వద్ద ఒక గంటలో ఇష్టమైనంత ఎక్కువ డేటాను డౌన్లోడ్ చేసుకోవచ్చని వోడాఫోన్ ఇండియా చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ సందీప్ కటారియా చెప్పారు.సర్కిల్స్ బట్టి రేటు మారవచ్చు తెలిపారు. జమ్మూ-కాశ్మీర్ , ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ , బీహార్-జార్ఖండ్, మధ్యప్రదేశ్-ఛత్తీస్‌గఢ్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ లో ఈ కొత్త ఆఫర్ అందుబాటులో లేదు. మార్చి 31, 2017 వరకు ఉచితంగా అందుబాటులోఉన్న వోడాఫోన్ ప్లే సబ్ స్క్రిప్లన్ లో, అపరిమిత డేటా ఆఫర్ తో వీడియోలు, సినిమాలు డౌన్ లోడ్ చేసుకో్వచ్చని తెలిపింది -
బీఎస్ఎన్ఎల్ న్యూ ఇయర్ ఆఫర్ అదుర్స్!
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ ఎల్ మరో సరికొత్త ఆఫర్ తో నూతన సంవత్సరానికి స్వాగతం పలికింది. శనివారం వెల్లడించిన ఈ మంత్లీ ప్లాన్ తో వినియోగదారులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. జియో ఎఫెక్ట్ తో దాదాపు అన్ని టెలికం కంపెనీలో ఫ్రీ కాలింగ్ వార్ లోకి ఎంటర్ కావడంతో ఈ కోవలోకి బీఎస్ఎన్ఎల్ కూడా చేరిపోయింది. అన్ లిమిడెట్ కాలింగ్ అంటూ ఓ సరికొత్త ప్లాన్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రీ పెయిడ్, పోస్ట్ పెయిడ్ వినియోగదారులకు రూ.144 లకే అన్ లిమిటెడ్ కాలింగ్ సదుపాయాన్ని కల్పిస్తున్నట్టు భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బిఎస్ఎన్ఎల్) చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అనుపమ శ్రీ వాస్తవ తెలిపారు. రూ.144 ల మంత్లీ ప్లాన్ లో (లోకల్ అండ్ ఎస్టీడీ) ఏ నెట్ వర్క్ కైనా ఉచిత కాలింగ్ సౌకర్యంతోపాటు 300 ఎంబీ డాటాను ఫ్రీగా అందిస్తోంది. ఈ ప్లాన్ ఆరు నెలల వరకు చెల్లుబాటులో ఉంటుంది. మరోవైపు దేశ్యాప్తంగా 4400 వైఫై హాట్ స్పాట్లను లాంచ్ చేసింది చెన్నైలోని మహాబలిపురం కూడా త్వరలో లాంచ్ చేయనున్నట్టు తెలిపారు. హాట్ స్పాట్ ల విస్తరణే తమ తదుపరి లక్ష్యమన్నారు. మరుసటి సంవత్సరం నాటికి సుమారు 40 వేల హాట్ స్పాట్ లను నెలకొల్పనున్నట్టు అనపమ్ శ్రీవాప్తవ్ చెప్పారు. -
రిలయన్స్ జియో అందరికీ ఫ్రీ..!
♦ 4జీ స్మార్ట్‌ఫోన్ ఉంటే చాలు ♦ ఓపెన్ మార్కెట్లో ప్రివ్యూ ఆఫర్ ♦ 90 రోజులపాటు అన్లిమిటెడ్ ♦ టెలికం రంగంలో జియో సంచలనం హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : మీదగ్గర 4జీ స్మార్ట్‌ఫోన్ ఉందా? ఇంకేం ఎంచక్కా 90 రోజులపాటు అన్లిమిటెడ్ డేటా, కాల్స్ ఎంజాయ్ చేయండి. అదీ ఉచితంగా. నమ్మశక్యంగా లేదు కదూ. టెలికం మార్కెట్లో పెను సంచలనానికి రిలయన్స్ జియో తెరతీసింది. ఇప్పటి వరకు కొందరికే పరిమితమైన జియో ప్రివ్యూ ఆఫర్ ఇక నుంచి అందరికీ అందుబాటులోకి వచ్చింది. 4జీ స్మార్ట్‌ఫోన్ ఉన్న కస్టమర్లు ఎవరైనా జియో సిమ్‌ను ఉచితంగా తీసుకోవచ్చు. 90 రోజులపాటు అపరిమితంగా జియో సేవలను ఉచితంగా పొందవచ్చు. దేశవ్యాప్తంగా అన్ని నగరాల్లోనూ ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. ముకేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియో వాణిజ్యపర కార్యకలాపాలను ఇంకా ప్రకటించక ముందే తీసుకున్న తాజా నిర్ణయం టెలికం మార్కెట్‌ను షేక్ చేయనుంది. ఆకట్టే ప్రివ్యూ ఆఫర్.. రిలయన్స్ జియో ఆరు నెలల క్రితం ప్రివ్యూ ఆఫర్‌ను ప్రారంభించింది. దీని కింద 4జీ డేటా, వాయిస్ ఓవర్ ఎల్టీఈ కాల్స్, 10 రకాల జియో ప్రీమియం యాప్స్‌ను అపరిమితంగా వినియోగించుకోవచ్చు. తొలుత రిలయన్స్ ఉద్యోగులు, వారి బంధువులకు దీనిని అమలు చేసింది. ఆ తర్వాత లైఫ్ స్మార్ట్‌ఫోన్ కొన్న కస్టమర్లకు 90 రోజులపాటు ప్రివ్యూ ఆఫర్‌ను ప్రకటించింది. దేశవ్యాప్తంగా 8 లక్షల పైచిలుకు కార్పొరేట్ కంపెనీలను జియో సంప్రదించింది. ఈ కంపెనీల ఉద్యోగులకు ఇప్పటి వరకు ఏ టెలికం సంస్థా ఇవ్వనటువంటి అత్యుత్తమ సీయూజీ ప్యాక్‌ను ఇచ్చేందుకు హామీ ఇచ్చింది. అలాగే లైఫ్ బ్రాండ్ స్మార్ట్‌ఫోన్ కొనుక్కోకపోయినా కార్పొరేట్ కంపెనీల ఉద్యోగులందరికీ ప్రివ్యూ ఆఫర్‌ను అమలు చేస్తోంది. దీనినిశామ్సంగ్, హెచ్‌పీ వినియోగదార ్లకు విస్తరించింది. తాజాగా 4జీ స్మార్ట్‌ఫోన్ ఏ కంపెనీదైనా సరే. ప్రతి ఒక్క కస్టమర్‌కు ఈ పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది. కస్టమర్లు సమీపంలోని రిలయన్స్ డిజిటల్ లేదా అధీకృత స్టోర్‌ను సంప్రదించి ఉచిత సిమ్‌ను పొందవచ్చు. గణనీయంగా కస్టమర్లు.. ప్రివ్యూ ఆఫర్ ప్రారంభించిన కొద్ది రోజుల్లోనే దేశవ్యాప్తంగా 25 లక్షలపైచిలుకు కస్టమర్లను జియో సొంతం చేసుకుంది. వీరిలో ఒకట్రెండు లక్షలు మినహా మిగిలినవారంతా లైఫ్ స్మార్ట్‌ఫోన్ కస్టమర్లే. రూ.3 వేలకే 4జీ స్మార్ట్‌ఫోన్‌ను లైఫ్ బ్రాండ్ ప్రకటించడం సంచలనం సృష్టించింది. దీనికితోడు ప్రివ్యూ ఆఫర్ ఉండడంతో కస్టమర్ల సంఖ్య అనూహ్యంగా దూసుకెళ్తోంది. మరోవైపు జియోఫై వైఫై హాటాస్పాట్కు ఏకంగా 31 ఉపకరణాల ను అనుసంధానించవచ్చు. వైఫై ఫీచర్ ఉన్న ప్రతి ఉపకరణంలో 4జీ స్పీడ్ ఎంజాయ్ చేయవచ్చు. చేతిలో ఇమిడిపోయే ఈ గ్యాడ్జెట్‌ను ఎక్కడికైనా తీసుకెళ్లవచ్చు. ధర రూ.2,899. దీనిపైనా ప్రివ్యూ ఆఫర్ ఉంది. కస్టమర్ల వద్ద ఉన్న స్మార్ట్‌ఫోన్ వాయిస్ ఓవర్ ఎల్టీఈని సపోర్ట్ చేయకపోయినా సరే. జియో జాయిన్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకుంటే చాలు. దీనిద్వారా 2జీ, 3జీ ఫోన్లలో హెచ్డీ వాయిస్ కాల్స్, వీడియో కాల్స్, మెసేజింగ్ సౌకర్యం పొందవచ్చు. అంతా 4జీ మయం.. జియో కస్టమర్లు నెలకు సగటున 30 జీబీ డేటాను వినియోగిస్తున్నారు. పంజాబ్‌లో 100 జీబీ దాకా నమోదైంది. అంటే ఈ స్థాయిలో డేటాకు డిమాండ్ పెరుగుతోంది. లైఫ్ స్మార్ట్ఫోన్లు రూ.3 వేల నుంచి లభించడం, అపరిమిత ఉచిత డేటా.. వెరశి భారత్‌లో మొబైల్ వినియోగదార్లు జియో 4జీకి ఆకర్షితులు అవడం ఖాయంగా కనపడుతోంది. పైగా ప్రివ్యూ ఆఫర్ తర్వాత ఒక జీబీకి చార్జీ రూ.100 లోపే ఉండే అవకాశం ఉంది. ఇదే నిజమైతే టెలికం మార్కెట్ అంతా ఒకవైపుకు పోవడం ఖాయమని పరిశ్రమ నిపుణుడొకరు వ్యాఖ్యానించారు. 2003లో రిలయన్స్ ఇన్ఫోకామ్ మాన్సూన్ హంగామా పేరుతో రూ.501లకే సీడీఎంఏ ఫోన్లను ఇచ్చి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే జియో అమ లు చేస్తున్న వ్యూహం అటు మొబైల్ ఫోన్ మార్కెట్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకోనున్నాయి. కస్టమర్ జేబులో రూ.20 వేలు.. ప్రస్తుతం జియో కస్టమర్ సగటున రోజుకు 1 జీబీ డేటాను వినియోగిస్తున్నారు. మార్కెట్లో ఉన్న టెలికం కంపెనీల డేటా చార్జీలను పరిగణలోకి తీసుకుంటే ఒక్కో జీబీకి ఎంత కాదన్నా రూ.200 అవుతుంది. అంటే 30 రోజులకు రూ.6 వేలు. అలా 90 రోజులంటే రూ.18 వేలు. ఉచిత వాయిస్ కాల్స్ విలువ మూడు నెలలకు రూ.2 వేలు అవుతుందని అనుకుంటే.. మొత్తంగా ప్రివ్యూ ఆఫర్ కింద ఒక్కో కస్టమర్ రూ.20 వేల విలువ చేసే ప్యాకేజీని ఫ్రీగా ఎంజాయ్ చేస్తారన్న మాట. టెలికం కార్యదర్శితో ముకేశ్ అంబానీ భేటీ న్యూఢిల్లీ: పారిశ్రామిక దిగ్గజం ముకేశ్ అంబానీ శుక్రవారంనాడు టెలికం శాఖ కార్యదర్శి జేఎస్ దీపక్‌తో సమావేశమయ్యారు. తమ టెలికం వెంచర్ రిలయన్స్ జియో 4జీ ఆవిష్కరణ ప్రణాళికపై వీరిరువురు చర్చించినట్లు అత్యున్నత స్థాయి వర్గాలు తెలిపాయి. టెలికం ఆపరేటర్లు తమ ట్రయల్ సర్వీసులను అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నాయని జియో అందోళన వ్యక్తం చేస్తోంది. మరోవైపు ఎయిర్టెల్, ఐడియా, వొడాఫోన్ సహా పలు ఇతర టెలికం కంపెనీలతో కూడిన సీవోఏఐ ఇటీవల డాట్‌కి ఒక ఉత్తరం రాస్తూ... జియో నిబంధనలకు విరుద్ధంగా తన 15 లక్షల మంది యూజర్లకు ట్రయల్స్ చాటున పూర్తి స్థాయి సేవలను అందిస్తోందని ఆరోపించింది. తాజా పరిణామాల నేపథ్యంలో తాజా ముకేశ్ అంబానీ, దీపక్ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. ముకేశ్ వెంట ఆయన కుమారుడు ఆకాశ్ అంబానీ కూడా ఉన్నారు. ఇటీవలే టెలికం కార్యదర్శితో భారతీ ఎయిర్టెల్ చైర్మన్ సునీల్ మిట్టల్, రిలయన్స్ జియో ప్రతినిధి కూడా సమావేశం అయ్యారు. -
ఐశ్వర్యకు డూపు!
‘అన్లిమిటెడ్’ ఎంటర్టైన్మెంట్తో అభిమానులను ఊపేస్తున్న సెక్సీ తార సన్నీలియోన్... మరో ధూమ్‌ధామ్ ‘ఆట’తో రెడీఅయిపోయింది. అప్పుడెప్పుడో వచ్చిన ‘హమ్ దిల్ దే చుకే హై సనమ్’లో ఐశ్వర్య దుమ్ము లేపిన ‘ధోలీ తారో దోల్ బాజే..’ పాటకు నర్తించి మెరిపించింది. అందులో ఐశ్వర్య సరసన ఒకప్పటి ఆమె ప్రియుడు సల్మాన్‌ఖాన్ నటించాడు. సన్నీ చేస్తున్న తాజా మూవీ ‘లీలా’లో ఈ సాంగ్‌ను విభిన్నంగా తెరకెక్కించారు. నిర్మాత భూషణ్ కుమార్ పాట రైట్స్‌ను ఇప్పటికే దక్కించుకున్నారట. షూటింగ్ కోసం జైసల్మేర్‌లో ఓ భారీ సెట్టు వేశారట. ఐదొందల మంది డ్యాన్సర్లు పాల్గొన్న ఈ పాటను వారం రోజుల పాటు షూట్ చేశారట!