అరవింద్‌ ‘అన్‌లిమిటెడ్‌’ ఇప్పుడు విజయవాడలో | Arvind 'Unlimited' is now in Vijayawada | Sakshi
Sakshi News home page

అరవింద్‌ ‘అన్‌లిమిటెడ్‌’ ఇప్పుడు విజయవాడలో

Published Mon, Aug 21 2017 1:19 AM | Last Updated on Sun, Sep 17 2017 5:45 PM

అరవింద్‌ ‘అన్‌లిమిటెడ్‌’ ఇప్పుడు విజయవాడలో

అరవింద్‌ ‘అన్‌లిమిటెడ్‌’ ఇప్పుడు విజయవాడలో

హైదరాబాద్‌: కుటుంబ సభ్యులందరికీ ఫ్యాషన్‌ వస్త్రోత్పత్తులను ఒకే చోటే అందుబాటులో ఉంచే ‘అన్‌లిమిటెడ్‌’ 58వ షోరూమ్‌ విజయవాడలోని ఎంజీరోడ్డులో ఆరంభమైంది. అరవింద్‌ లైఫ్‌స్టయిల్‌ బ్రాండ్స్‌ లిమిటెడ్‌కు చెందిన అనుబంధ విభాగం ఇది. మహిళలు, పురుషులు, చిన్నారులకు సంబంధించి 30,000 ఆధునిక శ్రేణి వస్త్రాలను ఇక్కడ అందుబాటులో ఉంచినట్టు సంస్థ తెలిపింది.

 సంప్రదాయానికి భిన్నంగా ఈ సంస్థ కొత్త స్టోర్‌ను సమీపంలోని ఓ అనాథ శరణాలయానికి చెందిన చిన్నారులతో ప్రారంభించి ప్రత్యేకతను చాటుకుంది. ఈ సందర్భంగా సంస్థ సీఈవో శేఖర్‌ మాట్లాడుతూ... విజయవాడలో తమకు ఇది తొలి స్టోర్‌ అని, ఆంధ్రప్రదేశ్‌లో 5వ స్టోర్‌ అని చెప్పారు. హైదరాబాద్‌లో 6 స్టోర్లు, తెలంగాణ వ్యాప్తంగా 7 స్టోర్లు ఉన్నట్టు తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే 35 స్టోర్లను దేశవ్యాప్తంగా ప్రారంభించనున్నట్టు విస్తరణ ప్రణాళికల గురించి వివరించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement