బీఎస్ఎన్ఎల్ న్యూ ఇయర్ ఆఫర్ అదుర్స్! | BSNL launches unlimited local and STD calls at Rs 144 | Sakshi
Sakshi News home page

బీఎస్ఎన్ఎల్ న్యూ ఇయర్ ఆఫర్ అదుర్స్!

Published Sat, Dec 31 2016 6:45 PM | Last Updated on Tue, Sep 5 2017 12:03 AM

బీఎస్ఎన్ఎల్ న్యూ ఇయర్ ఆఫర్ అదుర్స్!

బీఎస్ఎన్ఎల్ న్యూ ఇయర్ ఆఫర్ అదుర్స్!

న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ టెలికాం  సంస్థ బీఎస్ఎన్ ఎల్  మరో సరికొత్త ఆఫర్ తో నూతన  సంవత్సరానికి స్వాగతం పలికింది. శనివారం  వెల్లడించిన ఈ మంత్లీ ప్లాన్ తో వినియోగదారులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది.  జియో ఎఫెక్ట్ తో  దాదాపు అన్ని టెలికం  కంపెనీలో ఫ్రీ కాలింగ్ వార్ లోకి ఎంటర్ కావడంతో ఈ కోవలోకి బీఎస్ఎన్ఎల్ కూడా చేరిపోయింది.  అన్ లిమిడెట్  కాలింగ్ అంటూ ఓ సరికొత్త ప్లాన్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
ప్రీ పెయిడ్,  పోస్ట్ పెయిడ్  వినియోగదారులకు రూ.144  లకే అన్ లిమిటెడ్  కాలింగ్ సదుపాయాన్ని కల్పిస్తున్నట్టు భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బిఎస్ఎన్ఎల్)   చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్  అనుపమ శ్రీ వాస్తవ తెలిపారు. రూ.144 ల మంత్లీ ప్లాన్ లో (లోకల్ అండ్  ఎస్టీడీ) ఏ నెట్ వర్క్ కైనా ఉచిత కాలింగ్  సౌకర్యంతోపాటు  300 ఎంబీ డాటాను ఫ్రీగా అందిస్తోంది.   ఈ ప్లాన్ ఆరు నెలల వరకు చెల్లుబాటులో ఉంటుంది.
మరోవైపు దేశ్యాప్తంగా  4400  వైఫై హాట్ స్పాట్లను  లాంచ్ చేసింది చెన్నైలోని మహాబలిపురం కూడా త్వరలో లాంచ్ చేయనున్నట్టు తెలిపారు. హాట్ స్పాట్ ల విస్తరణే తమ  తదుపరి లక్ష్యమన్నారు.  మరుసటి సంవత్సరం నాటికి సుమారు 40 వేల హాట్ స్పాట్ లను నెలకొల్పనున్నట్టు  అనపమ్   శ్రీవాప్తవ్ చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement