గంటకు ఏడు రూపాయలట! | Vodafone's Rs 16 recharge gives users unlimited hourly data, like truly unlimited | Sakshi
Sakshi News home page

గంటకు ఏడు రూపాయలట!

Published Sat, Jan 7 2017 9:05 AM | Last Updated on Tue, Sep 5 2017 12:41 AM

గంటకు ఏడు రూపాయలట!

గంటకు ఏడు రూపాయలట!

ముంబై: ప్రముఖ టెలికాం మొబైల్ ఆపరేటర్ వొడాఫోన్ ఓ ఆసక్తికర పథకాలను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురానుంది. రియలన్స్ జియో, ఎయిర్ టెల్ లాంటి  కంపెనీల  ఉచిత ఆఫర్ల ధాటికి తట్టుకునేందుకు తమ  ప్లాన్స్ లో వివిధ మార్పులు చేసుకుంటూ వస్తోంది. నిన్న వొడాఫోన్ రెడ్ లో మార్పులు చేసిన  వొడాఫోన్ శుక్రవారం కొత్త ఆఫర్లను ప్రవేశపెట్టింది.

ప్రీ పెయిడ్ వినియోగదారులకు  'సూపర్ అవర్ ' పథకం ప్రకటించింది. ఇందులో ఒకగంటలో 3జీలేదా 4జీ డేటా  అందించే  రూ 16 ల ప్రారంభ ధరలను వెల్లడించింది.  మరో పథకంలో రూ.7కు అన్ లిమిటెడ్ లోకల్ కాల్స్ (వొడాఫోన్ టు వోడాఫోన్) ఒక గంట చెల్లుబాటయ్యేలా రూపొందించింది.   అలాగే ఈ పథకం కింద 2 జి వినియోగదారులకు  అన్ లిమిటెడ్ డాటా  రూ.5 కు  అందుబాటులో ఉండనుంది. ఒకరోజులో ఎన్నిసార్లయినా  (రోజుకి 24 సార్లు) ఈ ప్లాన్స్ ను కొనుక్కొని  అపరిమిత డాటాను పొందచ్చని కూడా తెలిపింది. ఈ కొత్త పథకాలను జనవరి 7న (శనివారం)లాంచ్ చేయనుంది.  ఈ ఆఫర్  జనవరి9 నుంచి అన్ని సెక్టార్స్ లో అందుబాటులోకి రానుందని తెలిపారు. నామమాత్రపు ధర వద్ద ఒక గంటలో ఇష్టమైనంత ఎక్కువ డేటాను డౌన్లోడ్ చేసుకోవచ్చని వోడాఫోన్ ఇండియా  చీఫ్ కమర్షియల్ ఆఫీసర్  సందీప్ కటారియా   చెప్పారు.సర్కిల్స్ బట్టి రేటు మారవచ్చు తెలిపారు.

 జమ్మూ-కాశ్మీర్ , ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ ,  బీహార్-జార్ఖండ్, మధ్యప్రదేశ్-ఛత్తీస్గఢ్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ లో ఈ  కొత్త ఆఫర్  అందుబాటులో లేదు.  మార్చి 31, 2017 వరకు ఉచితంగా  అందుబాటులోఉన్న వోడాఫోన్ ప్లే సబ్ స్క్రిప్లన్  లో, అపరిమిత డేటా  ఆఫర్ తో వీడియోలు, సినిమాలు  డౌన్ లోడ్ చేసుకో్వచ్చని తెలిపింది

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement