
న్యూఢిల్లీ: కొత్త టెక్నాలజీతో స్మార్ట్‌ఫోన్లలో సెకనుకు 500 మెగాబిట్స్ (ఎంబీపీఎస్) బ్రాడ్‌బ్యాండ్ డౌన్‌లోడ్ స్పీడ్‌ను సాధించినట్లు దేశీ టెలికం దిగ్గజం భారతి ఎయిర్‌టెల్, స్వీడన్‌కి చెందిన ఎరిక్సన్ వెల్లడించాయి. ఢిల్లీ–నేషనల్ క్యాపిటల్ రీజియన్‌లో దీన్ని ప్రయోగాత్మకంగా పరీక్షించినట్లు తెలియజేశాయి. లైసెన్స్‌డ్ అసిస్టెడ్ యాక్సెస్(ఎల్‌ఏఏ) టెక్నాలజీ ఆధారంగా 4జీ లైవ్ నెట్‌వర్క్‌పై ఈ ప్రయోగం చేయడం దేశీయంగా ఇదే తొలిసారని ఈ సంస్థలు తెలిపాయి. లైసెన్సు ఉన్న స్పెక్ట్రంతో పాటు లైసె న్సులేని స్పెక్ట్రంనూ ఉపయోగించుకుని గిగాబిట్ స్పీడ్‌తో కూడా ఇంటర్నెట్‌ను అందించేందుకు ఈ టెక్నాలజీ ఉపయోగపడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment