హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టెలికం రంగంలో మరోసారి పోటీకి భారతీ ఎయిర్‌టెల్ తెరతీసింది. తాజాగా అన్‌లిమిటెడ్ డేటా పేరుతో పరిచయ ఆఫర్‌ను ప్రకటించింది. ప్రస్తుతం రూ.239, ఆపైన ఖరీదు చేసే డేటా ప్లాన్‌లో ఉన్న ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ 5జీ వినియోగదార్లు ఇక నుంచి అపరిమిత డేటాను ఆస్వాదించవచ్చు. ఈ కస్టమర్లకు ఎటువంటి డేటా పరిమితి లేదని ఎయిర్‌టెల్ సోమవారం వెల్లడించింది. దేశవ్యాప్తంగా 270కిపైగా నగరాలు, పట్టణాల్లో 5జీ సర్వీసులను అందిస్తున్నట్టు తెలిపింది. 2024 మార్చి నాటికి మారుమూలన ఉన్న ప్రధాన ప్రాంతాలను సైతం కవర్ చేయనున్నట్టు వివరించింది.
(ఇదీ చదవండి: మహీంద్రా చేతికి స్ప్రేయర్ల తయారీ కంపెనీ.. నెక్స్ట్ ప్లాన్ అదేనా?)
ఫ్యామిలీ ప్లాన్స్ సైతం..
ప్రీపెయిడ్ నుంచి పోస్ట్ పెయిడ్‌కు కస్టమర్లు మళ్లాలన్న లక్ష్యంతో ఫ్యామిలీ ప్యాక్స్‌ను ప్రవేశపెట్టింది. ఫ్యామిలీ ప్లాన్స్ నెలకు రూ.599– 1,499, డీటీహెచ్, ఫిక్స్‌డ్ బ్రాడ్‌బ్యాండ్‌తో కూడిన బ్లాక్ ఫ్యామిలీ ప్లాన్స్ రూ.799–2,299 మధ్య ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment