data limit
-
6జీ టెక్నాలజీపై పరిశోధనకు ప్రతిష్టాత్మక కంపెనీల జట్టు
టెక్నాలజీ పెరుగుతున్న నేపథ్యంలో సాంకేతిక పరికరాలను మరింత సమర్థంగా తయారుచేస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే వాటిలో చాలామార్పులు చేస్తున్నారు. భవిష్యత్తు అవసరాలను తీర్చేలా డేటాలోనూ, దాని వేగంలోనూ మరిన్ని పరిశోధనలు జరగాలని నిపుణులు భావిస్తున్నారు. ప్రస్తుతం వాడుతున్న 5జీకి బదులు 6జీపై ఎన్నో సంస్థలు ఇప్పటికీ పరిశోధనలు చేస్తున్నాయి. తాజాగా సమాజంపై నేరుగా ప్రభావం చూపనున్న 6జీ సాంకేతికత, 6జీ వినియోగంపై సంయుక్తంగా పరిశోధన చేసేందుకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ), నోకియా భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి. ఇందులో భాగంగా బెంగళూరులో 6జీ పరిశోధనలకు అవసరమయ్యే ల్యాబ్‌ను సైతం ప్రారంభించారు. రేడియో టెక్నాలజీస్, ఆర్కిటెక్చర్, ఎయిర్ ఇంటర్ఫేస్లో మెషీన్ లెర్నింగ్ యాప్ అప్లికేషన్.. ఈ మూడు విభాగాల్లో పరిశోధనలు చేస్తారని నోకియా తెలిపింది. ఐఐఎస్సీతో జట్టు కట్టడం ద్వారా భారత్‌లో 6జీ సాంకేతికతపై తాము ఇచ్చిన హామీని మరింత ముందుకు తీసుకెళ్లనున్నామని నోకియా పేర్కొంది. ప్రపంచాన్ని దృష్టిలో పెట్టుకునే ఈ పరిశోధనలు ఉంటాయని, అయితే భారత్‌లో సమస్యలకు పరిష్కారం చూపేందుకే ప్రాధాన్యం ఇస్తామని వివరించింది. ఇదీ చదవండి: 2024లో జీతం ఎంత పెరుగుతుందో తెలుసా..? ఇంధన సామర్థ్య కమ్యూనికేషన్ వ్యవస్థలు, నెట్‌వర్క్‌ల సామర్థ్యాన్ని మెరుగపర్చడం, ఏఐ వినియోగం, రవాణా భద్రతను మెరుగుపర్చడం, ఆరోగ్య సంరక్షణ, విద్య వ్యాప్తి విస్తరణ నిమిత్తం నెట్వర్క్ సెన్సార్ సాంకేతికతలను అభివృద్ధి చేయడం లాంటి వాటిపై ఈ పరిశోధనల సాగే అవకాశం ఉన్నట్లు తెలిసింది. -
ఆ కస్టమర్లకు డేటా లిమిట్ లేదు: ఎయిర్టెల్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టెలికం రంగంలో మరోసారి పోటీకి భారతీ ఎయిర్టెల్ తెరతీసింది. తాజాగా అన్లిమిటెడ్ డేటా పేరుతో పరిచయ ఆఫర్‌ను ప్రకటించింది. ప్రస్తుతం రూ.239, ఆపైన ఖరీదు చేసే డేటా ప్లాన్‌లో ఉన్న ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ 5జీ వినియోగదార్లు ఇక నుంచి అపరిమిత డేటాను ఆస్వాదించవచ్చు. ఈ కస్టమర్లకు ఎటువంటి డేటా పరిమితి లేదని ఎయిర్టెల్ సోమవారం వెల్లడించింది. దేశవ్యాప్తంగా 270కిపైగా నగరాలు, పట్టణాల్లో 5జీ సర్వీసులను అందిస్తున్నట్టు తెలిపింది. 2024 మార్చి నాటికి మారుమూలన ఉన్న ప్రధాన ప్రాంతాలను సైతం కవర్ చేయనున్నట్టు వివరించింది. (ఇదీ చదవండి: మహీంద్రా చేతికి స్ప్రేయర్ల తయారీ కంపెనీ.. నెక్స్ట్ ప్లాన్ అదేనా?) ఫ్యామిలీ ప్లాన్స్ సైతం.. ప్రీపెయిడ్ నుంచి పోస్ట్ పెయిడ్‌కు కస్టమర్లు మళ్లాలన్న లక్ష్యంతో ఫ్యామిలీ ప్యాక్స్‌ను ప్రవేశపెట్టింది. ఫ్యామిలీ ప్లాన్స్ నెలకు రూ.599– 1,499, డీటీహెచ్, ఫిక్స్డ్ బ్రాడ్‌బ్యాండ్‌తో కూడిన బ్లాక్ ఫ్యామిలీ ప్లాన్స్ రూ.799–2,299 మధ్య ఉన్నాయి. -
రిలయన్స్ జియో యూజర్లకు గుడ్‌న్యూస్!
గతేడాది నవంబర్‌లో దేశీయ టెలికాం కంపెనీలు రిలయన్స్ జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియాలు బెన్ఫిట్స్ తగ్గించి టారిఫ్ ధరల్ని భారీగా పెంచాయి. పెరిగిన టారిఫ్ ధరలతో కొన్ని ప్రీపెయిడ్ ప్లాన్స్ ధరలు డబుల్ అయ్యాయి. దీంతో యూజర్లు తమకు లాభదాయకంగా ఉన్న టెలికాం కంపెనీల వైపు మొగ్గు చూపడంతో ఆయా కంపెనీల మధ్య పోటీ నెలకొంది. ఈ పోటీని తట్టుకునేందుకు జియో బంపరాఫర్ ప్రకటించింది. రూ.200ల లోపు ఉన్న టారిఫ్ ప్లాన్లకు ప్రతి రోజు 1జీబీ డేటాను అందిస్తుంది. ఈఏడాది చివరి నాటికి దేశంలో వెయ్యి నగరాల్లో 5జీ సేవల్ని అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా 4జీ టారిఫ్ ధరల్ని పెంచి 5జీపై పెట్టుబడులు పెట్టింది. అయితే టారిఫ్ ధరలు పెరగడంతో జియో యూజర్లు కాస్తా ఎయిర్టెల్ నెట్‌వర్క్‌ను వినియోగించడం ప్రారంభించారు. ఈ నేపథ్యంలో జియో యూజర్లకు తక్కువ ధరలో అదిరిపోయే ప్లాన్లను అందుబాటులోకి తెచ్చింది. ఆ ప్లాన్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రత్యేకంగా జియో యుజర్లకు ►రూ.149 ప్రీపెయిడ్ ప్లాన్ కు ప్రతిరోజు 1జీబీ డేటా, అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్, ప్రతిరోజూ 100 ఎస్ఎంఎస్లను సెండ్ చేసుకోవచ్చు. 20రోజుల వ్యాలిడిటీతో జియో మూవీస్, జియో క్లౌడ్ సేవల్ని వినియోగించుకోవచ్చు. ►24రోజుల వ్యాలిడిటీతో రూ.179ప్లాన్‌ను అందుబాటులోకి తెచ్చిన జియో..ప్రతిరోజూ 1జీబీ డేటా,100ఎస్ఎంఎస్లు,అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. వ్యాలిడిటీని పెంచుకోవాలంటే అదనంగా రూ.149 రిఛార్జ్ చేసుకోవచ్చు. ►రూ.209తో రీఛార్జ్ చేసుకుంటే 28రోజుల వ్యాలిడిటీతో ప్రతిరోజు 100ఎస్ఎంఎస్లు, అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్, జియో మువీస్, జియో క్లౌడ్‌తో పాటు మరిన్ని సేవల్ని వినియోగించుకునే అవకాశం ఉంది. ఇక 28రోజుల వ్యాలిడిటీతో వొడాఫోన్ ఐడియా రూ.269 వసూలు చేస్తుంది. బేసిక్ లెవల్స్‌లో బెన్ఫిట్స్ ఉన్నాయి ►రూ.119చెల్లిస్తే ప్రతిరోజు 1.5జీబీ డేటాతో అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్,300 ఎస్ఎంఎస్లను పంపుకోవచ్చు. దీని వ్యాలిడిటీ 14రోజులు మాత్రమే. ►రూ.199కి రీఛార్జ్ చేసుకుంటే 23రోజుల వ్యాలిడిటీతో ప్రతిరోజు 1.5జీబీ డేటా,100ఎస్ఎంఎస్లు, అన్లిమిటెడ్ వాయిస్‌కాల్స్ మాట్లాడొచ్చు. చదవండి: రిలయన్స్ జియోకు దిమ్మతిరిగేలా షాక్..! దెబ్బ మామూలుగా లేదు -
కుర్రాళ్లోయ్ కుర్రాళ్లు.! నెలకు సగటున ఎంత డేటా వాడుతున్నారో తెలుసా?
న్యూఢిల్లీ: భారత్‌లో మొబైల్ బ్రాడ్‌బ్యాండ్ యూజర్లు గడిచిన ఐదేళ్ల కాలంలో రెట్టింపునకు పైగా పెరిగి 76.5 కోట్లకు చేరారని, 4జీ డేటా ట్రాఫిక్ 6.5 రెట్లు పెరిగిందని నోకియా తెలిపింది. భారత్‌లో మొత్తం డేటా వినియోగంలో 4జీ వాటా 99 శాతానికి చేరినట్టు పేర్కొంది. ఈ ఏడాది 5జీ సర్వీసులు మొదలవుతున్నా.. వచ్చే కొన్నేళ్లపాటు మొబైల్బ్రాడ్ బ్యాండ్ వృద్ధికి 4జీ టెక్నాలజీ సాయంగా నిలుస్తుందని నోకియా ఎంబిట్ పేరుతో విడుదలైన నివేదిక తెలిపింది. ‘‘మొబైల్ డేటా వినియోగం 2017 నుంచి 2021 మధ్య ఏటా 53 శాతం చొప్పున కాంపౌండెడ్ వార్షిక వృద్ధి రేటు (సీఏజీఆర్) నమోదు చేసింది. సగటు యూజర్ నెలవారీ డేటా వినియోగం మూడు రెట్లు పెరిగి 17జీబీకి చేరింది. మొబైల్ బ్రాడ్‌బ్యాండ్ యూజర్లు 2.2 రెట్లు అప్ గత ఐదేళ్లలో మొబైల్ బ్రాడ్‌బ్యాండ్ యూజర్లు 2.2 రెట్లు పెరిగారు. ఈ గణాంకాలన్నీ భారత్‌లో డేటా వినియోగం గణనీయంగా పెరిగినట్టు తెలియజేస్తున్నాయి’’ అని నోకియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్, భారత్ విభాగం హెడ్ సంజయ్ మాలిక్ తెలిపారు. మిలీనియల్స్ (23–38) రోజుకు 8 గంటల సమయాన్ని ఆన్లైన్లో గడుపుతున్నట్టు ఈ నివేదిక తెలిపింది. షార్ట్ వీడియో ఫార్మాట్, గ్రామీణ ప్రాంతాల్లో స్మార్ట్ఫోన్ల వినియోగం ఇవన్నీ భారత్‌లో డేటా వినియోగం వృద్ధికి మద్దతుగా నిలుస్తున్నట్టు పేర్కొంది. గతేడాది 16 కోట్లకు పైగా స్మార్ట్ఫోన్ల రవాణా జరిగిందని, ఇందులో 3 కోట్లు 5జీ ఫోన్లు ఉన్నట్టు తెలిపింది. -
జియో డేటా కుదింపు కూడా శుభవార్తేనట!
కోల్కత్తా : జియోపై వినియోగదారులకు అందిస్తున్న ఉచిత సేవలన్నింటిన్నీ వచ్చే ఏడాది మార్చి 31 వరకు పొడిగిస్తున్నట్టు రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ తన యూజర్లకు గుడ్ న్యూస్ చెప్పిన సంగతి తెలిసిందే. ఈ గుడ్న్యూస్లోనే మరో షాకింగ్ విషయం కూడా చెప్పారు. అదేమిటంటే ప్రస్తుతం డేటాపై అందిస్తున్న రోజుకు 4జీబీ పరిమితిని 1జీబీకి కుందించారు. హ్యాపీ న్యూయర్ ఆఫర్ కింద ఉచిత సేవలను మార్చి 31వరకు వినియోగించుకోవచ్చని, కానీ డేటా లిమిట్‌ను తగ్గిస్తున్నట్టు రిలయన్స్ అధినేత గురువారం వెల్లడించారు. ఇది కూడా వినియోగదారులకు గుడ్న్యూసేనట. ఎలానో తెలుసా? జియో డేటా వాడకంపై లోడ్ తగ్గి, మంచి 4జీ అనుభవాన్ని వినియోగదారులు పొందవచ్చట.పరిమితిని తగ్గించడంతో దారుణంగా ఉన్న జియో స్పీడ్‌ను మెరుగుపరుచుకోవచ్చని కంపెనీ భావిస్తోంది. జియో డేటా పరిమితిని తగ్గించడంతో తను చేధించదలుచుకున్న లక్ష్యాన్ని చేరుకుంటుందని, మార్చి చివరి వరకు 100 మిలియన్ యూజర్లను సొంతం చేసుకుంటుందని జేపీ మోర్గాన్ నిపుణులు కూడా పేర్కొంటున్నారు. నెట్వర్క్ వినియోగాన్ని తగ్గించి, మంచి క్వాలిటీ సర్వీసులను వినియోగదారులకు అందించాలని, దీంతో ఉచిత ఆఫర్ ముగిసినా ఈ సిమ్‌పైనే యూజర్లు కొనసాగుతారని క్రెడిట్ స్యూజ్ కూడ తెలిపింది. సంచలమైన ఆఫర్లతో ఎంత స్పీడుగా జియో మార్కెట్లోకి ప్రవేశించిందో అంత స్పీడుగా దాని ఇంటర్నెట్ లేదని పలువురు కస్టమర్లు వాపోయారు. అంతేకాక జియో డేటా సేవలు దారుణంగా ఉన్నాయంటూ, నెట్ స్పీడ్ మిగతా టెలికాం కంపెనీలతో పోటిస్తే స్లోగా ఉందంటూ టెలికాం రెగ్యులేటరీ ఆఫ్ ఇండియా(ట్రాయ్) కూడా గుట్టురట్టు చేసింది. దీంతో కస్టమర్లను పోగొట్టుకోకుండా ఉండటానికి, వారికి స్పీడ్ డేటాను అందించడానికి డేటా పరిమితిలో రిలయన్స్ జియో కోత విధించింది. ఈ నేపథ్యంలోనే హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్ కింద మరో మూడు నెలలు వినియోగదారులకు ఉచిత సేవలను ప్రకటించిన జియో, రోజువారీ డేటా పరిమితిని తగ్గిస్తున్నట్టు పేర్కొంది. వాయిస్ సేవలు జీవిత కాలంపాటు అందిస్తామని పేర్కొంది.