
దేశీయ టెలికాం ఆపరేటర్ ఎయిర్‌టెల్ తన అల్ట్రా ఫాస్ట్ 5జీ సేవలను మరింత విస్తరించింది. తాజాగా మరో 125 నగరాల్లో అల్ట్రా ఫాస్ట్ 5జీ సేవలను ప్రారంభించినట్లు ప్రకటించింది. దీంతో ఈ సేవలు దేశవ్యాప్తంగా 265 నగరాలకు చేరువయ్యాయి.
అత్యంత అభివృద్ధి చెందిన, ప్రపంచంలోనే విస్తృతంగా ఆమోదం పొందిన పర్యావరణ వ్యవస్థ ఆధారిత సాంకేతికతపై ఎయిర్‌టెల్ 5G సేవలు నడుస్తాయని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఎయిర్‌టెల్ 5జీ ప్లస్.. హై-డెఫినిషన్ వీడియో స్ట్రీమింగ్, గేమింగ్, మల్టిపుల్ చాటింగ్, ఫోటోల ఇన్‌స్టంట్ అప్‌లోడ్ వంటి వాటికి సూపర్‌ఫాస్ట్ యాక్సెస్ అందిస్తుందని పేర్కొంది.
ఇదీ చదవండి: హీరో-జీరో జట్టు.. ఎలక్ట్రిక్ బైక్‌ల ఉత్పత్తిలో ఇక తిరుగులేదు!
5జీ ఇంటర్నెట్ ప్రపంచాన్ని విప్లవాత్మకంగా మార్చిందని, కనెక్టివిటీ, కమ్యూనికేషన్లలో కొత్త శకానికి నాంది పలికిందని భారతీ ఎయిర్‌టెల్ సీటీవో రణదీప్ సెఖోన్ అన్నారు. దేశీయ దిగ్గజ టెలికం కంపెనీల్లో 'భారతీ ఎయిర్‌టెల్' ఒకటిగా కొనసాగుతూ వస్తోంది. దేశంలో అత్యధిక కస్టమర్లు ఎయిర్‌టెల్‌కు ఉన్నారు. అగ్ర స్థానంలో ఉన్న ఎయిర్‌టెల్.. మరిన్ని నగరాల్లో తమ కస్టమర్లకు 5జీ సేవలు విస్తరిస్తోంది.
ఇదీ చదవండి: ఎస్‌బీఐ కస్టమర్లకు అలర్ట్! రూ.295 కట్ అవుతోందా? ఎందుకో తెలుసుకోండి..
Comments
Please login to add a commentAdd a comment