హైదరాబాద్: ‘స్మార్ట్ సిటీ’.. కేంద్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న ప్రాజెక్టు. దీనికి ఎంపికైతే, ఆ నగరాల్లో ఐ.టి.ఆధారిత పౌర సేవలందించడంతో పాటుబ్రాడ్‌బ్యాండ్ సేవలనూ విస్తృత పరుస్తారు. ఎంపికైన నగరంలో అభివృద్ధి పనులు చేపచేపట్టి తాగునీరు, రోడ్లు, మురుగు కాల్వలు తదితర మౌలిక వసతులను మెరుగు పరిచేందుకు భారీ స్థాయిలో నిధులను కేంద్రమే కేటాయిస్తుంది. దేశంలోని 100 నగరాలను ‘స్మార్ట్ సిటీ’ ప్రాజెక్టు కింద ఎంపికచేసి రూ.7 వేల కోట్లతో అభివృద్ధి చేస్తామని ప్రధాని మోడీ హామీ ఇవ్వడంతో ఈ ప్రాజెక్టుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే, ఈ ప్రాజెక్టుకు ఎంపికయ్యే పట్టణాలు కనీసం 4 లక్షల జనాభా కలిగి ఉండాలని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ఇటీవల రాష్ట్రాలకు రాసిన లేఖలో పేర్కొంది.
పరిశీలనలో ఉన్నవి ఇవే..: సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ పట్టణంతోపాటు హైదరాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, మహబూబ్‌నగర్, సిద్దిపేటలను స్మార్ట్ సిటీ ప్రాజెక్టు కింద కేంద్రానికి ప్రతిపాదించేందుకు తెలంగాణ ప్రభుత్వం పరిశీలన జరిపినట్లు సమాచారం. అయితే, కేంద్రం విధించిన ‘4 లక్షల జనాభా’ నిబంధన వల్ల గజ్వేల్, సిద్దిపేట ఈ పథకం కింద ఎంపికయ్యే అవకాశం లేకుండాపోయింది.
‘స్మార్ట్ సిటీ’లకు 4 లక్షల జనాభా
Published Sun, Aug 17 2014 12:46 AM | Last Updated on Wed, Aug 15 2018 9:22 PM
Advertisement
Advertisement