కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు గురువారం లేఖ రాశారు.
హైదరాబాద్: కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు గురువారం లేఖ రాశారు. కేంద్రం ప్రకటించిన స్మార్ట్ సిటీల జాబితాలో హైదరాబాద్ స్థానంలో కరీంనగర్ను చేర్చాలని లేఖలో కేసీఆర్ కోరారు. స్మార్ట్ సిటీ పథకం కింద హైదరాబాద్కు కేవలం 100 కోట్లను కెటాయించడం ద్వారా ఎలాంటి ప్రయోజనం ఉండదని కేసీఆర్ పేర్కొన్నారు. అందువల్ల హైదరాబాద్ స్థానంలో కరీంనగర్ను ఈ జాబితాలో చేర్చి, హైదరాబాద్కు విడిగా నిధులు మంజూరు చేయాలని వెంకయ్యనాయుడుని కేసీఆర్ కోరారు.