న్యూఢిల్లీ: భారత టెలికాం రంగంలో రానున్న ఐదేళ్లలో 40 లక్షల కొత్త కొలువులు రానున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో వినియోగదారులు పెరుగుతుండడం, ఇంటర్నెట్ విస్తరణ దీనికి ప్రధాన కారణాలని నిపుణులంటున్నారు. మరింత స్పెక్ట్రమ్ అందుబాటులోకి రానుండడం, టారిఫ్‌ల హేతుబద్ధీకరణ తదితర కారణాల వల్ల కూడా కొత్త కొలువులు భారీ సంఖ్యలో రానున్నాయని చెబుతున్నారు.
కేంద్ర ప్రభుత్వం 2.5 లక్షల గ్రామ పంచాయతీలను అధిక వేగమున్న బ్రాడ్‌బాండ్ నెట్‌వర్క్‌తో అనుసంధానం చేయాలని ప్రయత్నాలు చేస్తోంది. ఫలితంగా నైపుణ్యమున్న టెక్నీషియన్లకు, ఇంజినీర్లకు, ఇన్‌స్టలేషన్, మెయింటనెన్స్ సేవలందించే ఉద్యోగులకు, అమ్మకాలు,మార్కెటింగ్, హెచ్‌ఆర్ రంగాల్లో డిమాండ్ పెరుగుతుందని అంచనా. గత పదేళ్లుగా భారత టెలికాం రంగం 35 శాతం వార్షిక వృద్ధిని సాధిస్తోందని ర్యాండ్‌స్టాడ్ ఇండియా సీఈఓ కె.ఉప్పలూరి పేర్కొన్నారు.
గత దశాబ్దంలో అధికంగా ఉద్యోగాలు కల్పించిన రంగాల్లో ఒకటిగా టెలికం నిలిచిందని టీఈ కనెక్టివిటీ పేర్కొంది. 2015 కల్లా 2.75 లక్షల మంది కొత్త ఉద్యోగులు అవసరమవుతారని వివరించింది. సరైన నైపుణ్యాలున్న ఉద్యోగిని ఎంచుకోవడమే అసలైన సమస్యని పేర్కొంది. బ్యాండ్‌విడ్త్ లభ్యత డిజిటైజేషన్ ప్రక్రియ పూర్తికానుండడం వంటి కారణాల వల్ల టెలికంలో అపార ఉద్యోగవకాశాలుల అందుబాటులోకి వస్తాయని పేర్కొంది.
టెలికంలో కొలువుల ట్రింగ్.. ట్రింగ్..
Published Fri, Oct 3 2014 12:21 AM | Last Updated on Sat, Sep 2 2017 2:17 PM
Advertisement