సాక్షి,హైదరాబాద్ : ఏఐ ఆధారిత రంగాల్లోని నిపుణులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు సిద్ధంగా ఉన్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
హైదరాబాద్ హెచ్‌ఐసీసీలో రెండ్రోజుల పాటు జరుగుతున్న అంతర్జాతీయ కృత్రిమ మేధ (ఏఐ) సదస్సును రేవంత్ రెడ్డి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..రైల్ ఇంజిన్, ఫోటో కెమెరా మొదలు కొని ఇప్పుడు ఏఐ టెక్నాలజీలో అడుగుపెట్టాం. క్రమంగా టెక్నాలజీ పెరుగుతోంది. ఎన్నికల ముందు డిక్లరేషన్‌లో చెప్పినట్టే ఏఐకి మొదటి ప్రాధాన్యత ఇస్తున్నాం. ఏఐతో పాటు ఇతర టెక్నాలజీల్లో నిష్ణాతులైన నిపుణులకు అవకాశాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేలా అందరికి అవకాశం ఇస్తున్నాం’ అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
ఐటీ రంగంలో ప్రపంచంలో అందరి దృష్టిని ఆకర్షించేలా అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈసదస్సు నిర్వహిస్తున్నామని తెలిపారు. హైదరాబాద్‌లో నిర్మించనున్న ఫోర్త్ సిటీలో 200 ఎకరాల విస్తీర్ణంలో ప్రతిష్టాత్మకంగా ఏఐ సిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించామని అన్నారు.
రెండ్రోజుల ఏఐ సదస్సు
ఇంటర్నేషనల్ ఏఐ గ్లోబల్ సమ్మిట్‌కు ప్రపంచ దేశాలకు చెందిన జాతీయ, అంతర్జాతీయ టెక్నాలజీ కంపెనీ ప్రతినిధులు హాజరయ్యారు. ప్రతి ఒక్కరికీ కృత్రిమ మేథస్సుని అందుబాటులోకి తేవాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏఐ సదస్సును ఇవాళ, రేపు హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహిస్తోంది.
Hon'ble Chief Minister Sri.A.Revanth Reddy participates in the Inauguration of AI Global Summit 2024 at HICC, Hyderabad https://t.co/QNTBD3RqRf
— Telangana CMO (@TelanganaCMO) September 5, 2024
Comments
Please login to add a commentAdd a comment