hicc
-
రేపటి నుంచి బయో ఏషియా
సాక్షి, హైదరాబాద్: బయో ఏషియా సదస్సుకు హైదరాబాద్ ముస్తాబైంది. మంగళవారం నుంచి రెండు రోజులపాటు నగరంలోని ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ (హెచ్ఐసీసీ)లో జరగనున్న బయో ఏషియా 22వ ఎడిషన్ సదస్సుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. దాదాపు 50 దేశాలకు చెందిన 3 వేల మంది ప్రతి నిధులు హాజరుకానున్నారు. ఈసారి బయో ఏషియా సదస్సుకు ‘క్యాటలిస్ట్ ఆఫ్ ఛేంజ్..ఎక్స్‌పాండింగ్ గ్లోబల్ హెల్త్‌కేర్ ఫ్రాంటియర్స్’(మార్పు సాధిద్దాం..ఆరోగ్య సంరక్షణలో హద్దులు చెరిపేద్దాం) అనే ఇతివృత్తాన్ని ఎంచుకున్నారు. సదస్సు ప్రారంబోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, క్వీన్స్‌ల్యాండ్ గవర్నర్ డాక్టర్ జీనెట్యంగ్, కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పియూష్ గోయల్, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు, జీ20 షెర్పా అమితాబ్‌కాంత్‌లు పాల్గొంటారు. లైఫ్‌సైన్సెస్ రంగంలో ప్రపంచవ్యాప్తంగా పేరొందిన సంస్థల అధిపతులు, సంబంధిత రంగాల్లో నిపుణులు, ఆవిష్కర్తలు ఈ వేదికపై జరిగే చర్చలు, సమావేశాల్లో పాలుపంచుకుంటారు. లైఫ్‌సైన్సెస్ రంగంలో వస్తున్న అధునాతన మార్పులు, శాస్త్ర పురోగతిపై చర్చిస్తారు. హెల్త్‌కేర్ రంగంలో ఏఐతో వచ్చిన మార్పులు, లైఫ్‌సైన్సెస్ భవిష్యత్‌ను నిర్దేశించే కొత్త ఆవిష్కరణలు, గ్లోబల్ బయో ఎకానమీని బలోపేతం చేయడం, ఇంటిగ్రేటెడ్ హెల్త్‌కేర్ మోడల్స్ తదితరాలను ఎజెండా అంశాలుగా నిర్ణయించారు. బయో ఫార్మాస్యూటికల్స్, డిజిటల్ హెల్త్, వైద్య పరికరాలు, అధునాతన చికిత్స విధానాలు, అత్యాధునిక వైద్యం, ఆరోగ్య సంరక్షణ విధానాలపై చర్చించనున్నారు. ప్రపంచస్థాయిలో హెల్త్‌కేర్ ఇన్నోవేషన్ హబ్‌గా తెలంగాణకు ప్రత్యేక గుర్తింపు ఉంది. వైద్య పరిశోధనలు, బయో టెక్నాలజీ, ఫార్మాస్యూటికల్ ఎక్సలెన్స్‌లో తెలంగాణ కీలకపాత్ర పోషిస్తోంది. ఈ నేపథ్యంలో బయో ఏషియా–2025 సదస్సు లైఫ్‌సైన్సెస్, హెల్త్‌కేర్ రంగంలో మరో మైలురాయిగా నిలవనుంది. ఇన్నోవేషన్ జోన్ ప్రత్యేకం ఈ సదస్సులో ప్రత్యేకంగా ఇన్నోవేషన్ జోన్‌ను ఏర్పాటు చేస్తున్నారు. కొత్త ఆలోచనలు, కొత్త ఆవిష్కరణలతో రూపొందించిన దాదాపు 700 స్టార్టప్‌లు దీనికి దరఖాస్తు చేసుకున్నాయి. వీటిలో ఎంపిక చేసిన 80 స్టార్టప్‌లను ఈ సదస్సులో ప్రదర్శించేందుకు అవకాశం కల్పించారు. హెల్త్‌కేర్ రంగంలో మెడికల్ టెక్నాలజీ, బయో టెక్నాలజీ, డిజిటల్ హెల్త్ రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చే లక్ష్యానికి అనుగుణంగా వీటిని ఎంపిక చేశారు. కొత్త స్టార్టప్‌లకు ప్రపంచస్థాయి గుర్తింపుతోపాటు, అద్భుతమైన అవకాశాలను ఈ సదస్సు అందించనుంది. పరిశ్రమల వృద్ధి, సహకారం, అత్యాధునిక పరిశోధనలను ప్రోత్సహించేందుకు బయో ఏషియా సదస్సు సరికొత్త మార్గదర్శనం అందించనుంది. ఇది అత్యంత ప్రభావంతమైన సదస్సుగా నిలుస్తుంది : మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు చరిత్రలోనే ఇది అత్యంత ప్రభావవంతమైన సదస్సుగా నిలుస్తుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఆకాంక్షించారు. ప్రపంచస్థాయి ఆవిష్కరణలు, ఆలోచనలన్నీ ఒకే వేదికపై పంచుకునే అరుదైన అవకాశాన్ని బయో ఏషియా అందిస్తుందన్నారు. – ఈ సదస్సుకు కొత్త సార్టప్‌ల నుంచి అంచనాలకు మించిన స్పందన వచ్చిందని పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్‌రంజన్ తెలిపారు. పేరొందిన కంపెనీలు, ప్రముఖ సంస్థలు ఈ సదస్సులో భాగస్వామ్యం పంచుకోవటం ఉత్సాహంగా ఉందన్నారు. – లైఫ్‌సైన్సెస్ రంగంలో తెలంగాణ ఇప్పటికే ముందంజలో ఉందని బయో ఏషియా– 2025 సీఈఓ, తెలంగాణ లైఫ్ సైన్సెస్ డైరెక్టర్ శక్తి నాగప్పన్ తెలిపారు. ఈసారి సదస్సు ల్యాండ్‌మార్క్ ఎడిషన్ ఉండబోతుందని చెప్పారు. -
ఏఐ నిపుణులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం : సీఎం రేవంత్ రెడ్డి
సాక్షి,హైదరాబాద్ : ఏఐ ఆధారిత రంగాల్లోని నిపుణులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు సిద్ధంగా ఉన్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.హైదరాబాద్ హెచ్ఐసీసీలో రెండ్రోజుల పాటు జరుగుతున్న అంతర్జాతీయ కృత్రిమ మేధ (ఏఐ) సదస్సును రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..రైల్ ఇంజిన్, ఫోటో కెమెరా మొదలు కొని ఇప్పుడు ఏఐ టెక్నాలజీలో అడుగుపెట్టాం. క్రమంగా టెక్నాలజీ పెరుగుతోంది. ఎన్నికల ముందు డిక్లరేషన్‌లో చెప్పినట్టే ఏఐకి మొదటి ప్రాధాన్యత ఇస్తున్నాం. ఏఐతో పాటు ఇతర టెక్నాలజీల్లో నిష్ణాతులైన నిపుణులకు అవకాశాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేలా అందరికి అవకాశం ఇస్తున్నాం’ అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.ఐటీ రంగంలో ప్రపంచంలో అందరి దృష్టిని ఆకర్షించేలా అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈసదస్సు నిర్వహిస్తున్నామని తెలిపారు. హైదరాబాద్‌లో నిర్మించనున్న ఫోర్త్ సిటీలో 200 ఎకరాల విస్తీర్ణంలో ప్రతిష్టాత్మకంగా ఏఐ సిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించామని అన్నారు.రెండ్రోజుల ఏఐ సదస్సుఇంటర్నేషనల్ ఏఐ గ్లోబల్ సమ్మిట్‌కు ప్రపంచ దేశాలకు చెందిన జాతీయ, అంతర్జాతీయ టెక్నాలజీ కంపెనీ ప్రతినిధులు హాజరయ్యారు. ప్రతి ఒక్కరికీ కృత్రిమ మేథస్సుని అందుబాటులోకి తేవాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏఐ సదస్సును ఇవాళ, రేపు హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహిస్తోంది.Hon'ble Chief Minister Sri.A.Revanth Reddy participates in the Inauguration of AI Global Summit 2024 at HICC, Hyderabad https://t.co/QNTBD3RqRf— Telangana CMO (@TelanganaCMO) September 5, 2024 -
హెచ్ఐసిసి లో జరిగిన హైలైఫ్ ఎగ్జిబిషన్ లో ముద్దుగుమ్మల సందడి (ఫొటోలు)
-
గాంధీ మార్గంలోనే తెలంగాణ సాధించా: సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: స్వతంత్ర భారత వజ్రోత్సవాల ముగింపు వేడుకలను శుక్రవారం హెచ్ఐసీసీలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఎం కేసీఆర్ హాజరై.. జాతీయ జెండా ఎగురవేశారు. అనంతరం సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. గాంధీ సిద్ధాంతం ప్రపంచానికి ఆదర్శమని పేర్కొన్నారు. గాంధీ సూచనలతో భారత రాజ్యాంగం రూపకల్పన జరిగిందని తెలిపారు. గాంధీ మతోన్మాద శక్తుల చేతిలో దుర్మరణం చెందడం ఎంతో బాధాకరమని సీఎం అన్నారు. ఆయన మార్గంలోనే తాను తెలంగాణ రాష్ట్రాన్ని సాధించానని తెలిపారు. అహింసా మార్గంలో భాగంగా ఆమరణ నిరాహార దీక్ష చేపట్టానని చెప్పారు. తెలంగాణకు సహకరించని వాళ్ళు నేడు తెలంగాణ ఉద్యమ పాఠాలు చెప్తున్నారని విమర్శించారు. చదవండి: బీఆర్ఎస్లో రసవత్తర రాజకీయం.. కందులకు కవిత అభయహస్తం! -
ప్రగతిలో తెలంగాణ ప్రతిభ
సాక్షి, హైదరాబాద్: పారిశ్రామికంగా శరవేగంగా ముందుకు సాగుతూ తక్కువ కాలంలోనే తెలంగాణ ప్రగతిశీల రాష్ట్రాల సరసన నిలబడే స్థాయికి చేరిందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు అన్నారు. రాష్ట్ర పురోగతి లక్ష్యంగా సీఎం కేసీఆర్ అవలంబిస్తున్న పారిశ్రామిక అనుకూల విధానాలే ఇందుకు కారణమని చెప్పారు. తెలంగాణ పారిశ్రామిక, వాణిజ్య మండళ్ల సమాఖ్య (ఎఫ్‌టీసీసీఐ) ఆధ్వర్యంలో వివిధ అంశాల్లో ప్రతిభ కనబరిచిన పరిశ్రమలకు సోమవారం హెచ్ఐసీసీలో ఎక్సలెన్స్ అవార్డులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌తోపాటు ఇతర రంగాల్లోనూ దూసుకుపోతుందని అన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా టీఎస్ ఐపాస్ చట్టం ద్వారా 15 రోజుల్లో పరిశ్రమలకు డీమ్డ్ అప్రూవల్ విధానాన్ని అమలుచేస్తున్నట్లు చెప్పారు. దేశంలో కొన్ని ప్రాంతాల్లో పెట్టుబడిదారులకు ఆశించిన గౌరవం లభించడం లేదని, కానీ తెలంగాణలో పారిశ్రామికవేత్తలను సంపద సృష్టికర్తలుగా, ఉద్యోగాల సృష్టికర్తలుగా గుర్తిస్తున్నామని అన్నారు. ఒక్కటీ లాకౌట్ పడలేదు.. అందరి అంచనాలను, సందేహాలను పటాపంచలు చేస్తూ ఎవరూ ఊహించని విధంగా దేశంలోనే 24 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణ ఎదిగిందన్నారు. గుజరాత్లో సైతం ఈ ఏడాది వేసవిలో పవర్ హాలిడే ప్రకటించారని, ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి వల్లనే తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. గతంలో అగ్రశ్రేణి రాష్ట్రాల్లో గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు ఉండగా, ప్రస్తుతం ఈ జాబితాలో తెలంగాణ కూడా చేరిందన్నారు. పరిశ్రమల శాఖలో ప్రభుత్వ జోక్యాన్ని సాధ్యమైనంతవరకు తగ్గించినట్లు చెప్పారు. రాష్ట్రంలో గత ఎనిమిదేళ్లుగా ఒక్క పరిశ్రమ కూడా లాకౌట్ పడిన దాఖలాలు లేవన్నారు. రాష్ట్రంలో వ్యాపారులు, పెట్టుబడిదారులు సంతృప్తిగా ఉన్నారనేందుకు రాష్ట్రంలో రిపీట్ పెట్టుబడులు 24 శాతం ఉండటమే నిదర్శనమన్నారు. రాష్ట్రంలో ద్వితీయ శ్రేణి నగరాల్లో సైతం పరిశ్రమలను ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు. నాలుగేళ్లలోనే కాళేశ్వరం రికార్డుస్థాయిలో కేవలం నాలుగేళ్లలో కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తిచేసినట్లు కేటీఆర్ చెప్పారు. దీనిద్వారా 45 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని, ఈ నీటితో వివిధ ప్రాంతాల్లో మొత్తం 184 టీఎంసీల సామర్థ్యం గల జలాశయాలను నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. పాలమూరు రంగారెడ్డి, సీతారామ ప్రాజెక్టులు కూడా త్వరలోనే పూర్తవుతాయన్నారు. భవిష్యత్తులో వ్యవసాయం, మత్స్య పరిశ్రమ, డెయిరీ పరిశ్రమ, మాంసం ఉత్పత్తులు, వంట నూనెల ఉత్పత్తి తదితర రంగాలు అభివద్ధి చెందనున్నట్లు చెప్పారు. కోవిడ్ కారణంగా ఎంఎస్ఎంఈలకు ప్రోత్సాహకాల విడుదలలో కొంత జాప్యం జరిగిందని, ప్రస్తుతం పరిస్థితులు కుదుటపడినందున త్వరలోనే విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్‌తోపాటు ఎఫ్‌టీసీసీఐకి చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు. కాకతీయ వైభవ సప్తాహంపై సమీక్ష కాకతీయ వైభవ సప్తాహం కార్యక్రమాల్లో అన్ని పార్టీలు, అన్ని రంగాలకు చెందిన వారు పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించారు. ఈనెల ఏడు నుంచి వారంపాటు జరిగే ఈ కార్యక్రమాలపై ఆయన సోమవారం సమీక్షించారు. -
క్యాన్సర్‌ను జయించిన పిల్లలతో సెలబ్రిటీల 'మైరా' ర్యాంప్ వాక్
-
జియో ఫేషియల్ టెక్నాలజీలో యువతను ప్రోత్సహించాలి
మాదాపూర్: మ్యాపింగ్, సర్వే, సెర్చింగ్లలో జియో ఫేషియల్ టెక్నాలజీ కీలకపాత్ర పోషిస్తుందని.. ఈ టెక్నాలజీలో యువతను, పరిశోధకులను ప్రోత్సహించాలని గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ చెప్పారు. మాదాపూర్‌లోని హెచ్ఐసీసీలో మూడ్రోజుల పాటు నిర్వహించనున్న జియో స్మార్ట్ ఇండియా–2021ను మంగళవారం గవర్నర్ ప్రారంభించి మాట్లాడారు. ప్రపంచ స్థాయి కంపెనీల్లో భారతీయులే ఎక్కువగా ప్రధాన పాత్ర పోషిస్తున్నారని అన్నారు. కేంద్రం డిజిటల్ ఇండియా లక్ష్యంగా పనిచేస్తోందని చెప్పారు. స్టార్టప్ కంపెనీలకు హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా నిలుస్తోందన్నారు. సాంకేతిక పరిజ్ఞానం దేశాభివృద్ధిలో ముఖ్యపాత్ర పోషిస్తోందని అన్నారు. కార్యక్రమంలో ఇస్రి ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ అగేంద్రకుమార్ తదితరులు పాల్గొన్నారు. -
మహాభారతంలోనూ మధ్యవర్తిత్వం
సాక్షి, హైదరాబాద్: మధ్యవర్తిత్వంతో వివాదాలను సామరస్యంగా పరిష్కరించుకోవాలని, చిట్టచివరి ప్రత్యామ్నాయంగానే న్యాయస్థానాలను ఆశ్రయించాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ సూచించారు. ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్ (ఐఏఎంసీ)ను ఈ నెల 18న హైదరాబాద్‌లో ప్రారంభించనున్న సందర్భంగా శనివారం నగరంలోని హెచ్ఐసీసీలో భాగస్వామ్యపక్షాలతో ఏర్పాటు చేసిన ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్ సదస్సుకు జస్టిస్ ఎన్వీ రమణ ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. నంబర్ వన్ నగరం హైదరాబాద్... భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు పెట్టుబడిదారులు సిద్ధంగా ఉన్నా ఇక్కడ వివాదాల పరిష్కారానికి ఎంత సమయం పడుతుందన్న ప్రశ్నకు సమాధానం చెప్పడానికి ఇబ్బంది పడాల్సి వస్తోందని సీజేఐ ఎన్వీ రమణ ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘అంతర్జాతీయ ఆర్టిట్రేషన్ అండ్ మీడియేషన్ కేంద్రాలు పారిస్, సింగపూర్, లండన్, హాంకాంగ్‌లలో ఉన్నాయి. హైదరాబాద్‌లో ఈ సెంటర్‌ను ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ కేంద్రం ఏర్పాటుకు అనేక కారణాలున్నాయి. అభివృద్ధి చెందుతున్న నగరాల్లో హైదరాబాద్ నంబర్ వన్‌గా ఉంది. ఇక్కడ వాతావరణ పరిస్థితులతోపాటు అంతర్జాతీయ విమానాశ్రయం, రైల్వే, రోడ్డు రవాణా మార్గాలు, అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన హోటళ్లు అందుబాటులో ఉన్నాయి. హైదరాబాద్‌లో ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్ ఏర్పాటుకు సహకరించాలని ఈ ఏడాది జూన్‌లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావును కోరా. ఆరు నెలల వ్యవధిలోనే అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ సెంటర్ ఏర్పాటుకు కేసీఆర్‌తోపాటు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకరించింది. ఆర్బిట్రేషన్ కేంద్రం ఏర్పాటుకు సహకరించిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి (అప్పటి తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి) జస్టిస్ హిమాకోహ్లి, కేంద్రం శాశ్వత భవన నిర్మాణం కోసం భూమి కేటాయించిన కేసీఆర్‌కు ధన్యవాదాలు’’ అని జస్టిస్ ఎన్వీ రమణ పేర్కొన్నారు. ఆర్థిక సంస్కరణల రూపకర్త పీవీ ‘‘ఈ దేశంలో అనేక ఆర్థిక సంస్కరణలు తెచ్చిన తెలంగాణ బిడ్డ మాజీ ప్రధాని పీవీ నరసింహారావు. ఆర్థిక సంస్కరణల ఫలితంగా చట్టాల్లోనూ అనేక మార్పులు వచ్చాయి. తీర్పులు చెప్పడానికి కోర్టులే అవసరం లేదు. లా పట్టాలు తీసుకొని న్యాయం చెప్పాల్సిన అవసరం లేదు. ప్రభుత్వాలు కూడా న్యాయం చేయొచ్చు. తప్పొప్పులు తెలుసుకొని ఎవరైనా తీర్పు చెప్పొచ్చు. సామాన్యులకు సైతం ఆర్బిట్రేషన్ కేంద్రాలతో న్యాయం జరగాలి. సమస్యను అర్థం చేసుకొనే శక్తి ఉన్నవాళ్లు, విశ్వసనీయత ఉన్నవాళ్లు తీర్పులు చెప్పొచ్చు. గరికపాటి లాంటి అవధానులు, గుర్తింపు పొందిన వక్తలు ఆర్బిట్రేషన్ కేంద్రం ప్యానల్లో భాగస్వాములు కావాలని ఆశిస్తున్నా. అలాగే పెద్దలు, విజ్ఞులు పాల్గొని అనేక సమస్యలు పరిష్కారం చేయొచ్చు’’ అని జస్టిస్ ఎన్వీ రమణ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఎల్.నాగేశ్వరరావు, జస్టిస్ హిమాకోహ్లీ, జస్టిస్ ఆర్.సుభాష్‌రెడ్డి, జస్టిస్ పీఎస్ నరసింహ, తెలంగాణ, ఏపీ హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు జస్టిస్ సతీష్‌చంద్రశర్మ, జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, ఇరురాష్ట్రాల హైకోర్టు న్యాయమూర్తులు, మంత్రులు మహమూద్ అలీ, కేటీఆర్, తలసాని, ఇంద్రకరణ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రచ్చబండలాంటిదే: సీఎం కేసీఆర్ దేశంలో రచ్చబండ వంటి రూపాల్లో మధ్యవర్తిత్వం ఎప్పటి నుంచో ఉంది. వివిధ కారణాల వల్ల పరిశ్రమలు వివాదాలు ఎదుర్కొంటున్నాయి. ఆలస్యమైనా హైదరాబాద్‌లో అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ కేంద్రం రావడం సంతోషం. ఆర్బిట్రేషన్ కేంద్రానికి హైదరాబాద్ అన్ని విధాలా అనువైన ప్రాంతం. ఈ కేంద్రంలో వ్యాపారుల మధ్య వివాదాలకు సత్వర పరిష్కారం లభించే అవకాశం ఉంది. ఏఐఎంసీ కోసం తాత్కాలికంగా 25 వేల చదరపు అడుగులు కేటాయించాం. శాశ్వత భవనం కోసం పుప్పాలగూడలో భూమి కేటాయించాం’ అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ఉత్తమ ఇండస్ట్రియల్ పాలసీ తెచ్చాం: మంత్రి కేటీఆర్ ‘‘ప్రపంచంలోనే ఉత్తమ పారిశ్రామిక పాలసీని రాష్ట్రంలో తీసుకొచ్చాం. దీని ద్వారా 15 రోజుల్లోనే ఏకగవాక్ష పద్ధతిలో అనుమతులు లభిస్తాయి. పరిశ్రమలకు ఆ గడువులోగా అనుమతులు రాకపోతే అనుమతి వచ్చినట్లు భావించవచ్చు. అనుమతి ఇవ్వడంలో జాప్యం చేస్తే ఐఏఎస్ అధికారులకూ జరిమానా విధించేలా మార్గదర్శకాలను రూపొందించాం. ఈ విధానం ద్వారా 17,500 పరిశ్రమలకు అనుమతులు ఇచ్చాం. తద్వారా రూ. 2.30 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. 16 లక్షల మందికి ప్రత్యక్షంగా ఉపాధి దొరికింది. పరోక్షంగా అంతకు రెండింతల మందికి ఉపాధి లభించింది. ఆర్బిట్రేషన్ కేంద్రం ఏర్పాటు ద్వారా మరిన్ని పెట్టుబడులు, పరిశ్రమలు వచ్చే అవకాశం ఉంది. చిన్న, మధ్యతరహా పరిశ్రమల వివాదాల పరిష్కారానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నిపుణులను ఏర్పాటు చేస్తుంది’’ అని ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కె.తారక రామారావు పేర్కొన్నారు. చరిత్రాత్మక ఘట్టం: ఒవైసీ ‘హైదరాబాద్‌లో అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ కేంద్రం ఏర్పాటు ఓ చరిత్రాత్మక ఘట్టం. దేశంలోని కోర్టుల్లో పెద్ద ఎత్తున పెండింగ్ కేసుల్లా కాకుండా మధ్యవర్తిత్వం, మీడియేషన్లో అంతర్జాతీయ రాజధానిగా హైదరాబాద్ గుర్తింపు పొందుతుందని ఆశిస్తున్నా’ అని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ పేర్కొన్నారు. -
హైదరాబాద్ బ్రాండ్ ఏ పార్టీది కాదు: కేటీఆర్
-
హైదరాబాద్‌లో ప్రైడో క్యాబ్ సేవలు ప్రారంభం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: భాగ్యనగరవాసులకు నూతనంగా మరో క్యాబ్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. హైదరాబాద్‌కు చెందిన స్టార్టప్ వెంకట ప్రణీత్ టెక్నాలజీస్.. ప్రైడో బ్రాండ్ పేరిట క్యాబ్స్ రంగంలోకి ప్రవేశించింది. ఆదివారం మాదాపూర్‌లోని హెచ్ఐసీసీలో జరిగిన కార్యక్రమంలో ప్రైడో యాప్, లోగోలను తెలంగాణ రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్ కేంద్రంగా 2007లో రియల్టీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన ప్రణీత్ గ్రూప్.. ఆ తర్వాత ఎడ్యుకేషన్, ఫార్మా, కో–వర్కింగ్ రంగాల్లో కూడా సత్తా చూపిందని, తాజాగా ప్రైడో పేరిట క్యాబ్స్ సేవల్లోకి రావటం ఆనందంగా ఉందని తెలిపారు. అసంఘటిత రంగమైన క్యాబ్స్ పరిశ్రమలో డ్రైవర్లకు, రైడర్లకు విశ్వసనీయత కల్పించినప్పుడే నిలదొక్కుకుంటాం. డ్రైవర్లు బాగుంటేనే కస్టమర్లు బాగుంటారు. అప్పుడే కంపెనీ ముందుకెళుతుంది’’ అని పేర్కొన్నారు. కేవలం జంట నగరాలకే పరిమితం కాకుండా దేశవ్యాప్తంగా విస్తరించాలని ఆయన ఆశించారు. అనంతరం ప్రైడో ఫౌండర్ అండ్ ఎండీ నరేంద్రకుమార్ కామరాజు మాట్లాడుతూ.. క్యాబ్స్ పరిశ్రమలో డ్రైవర్లను కేవలం లాభార్జన కోసం వినియోగించుకుంటున్న ఈ రోజుల్లో వారిని లాభాల్లో కూడా వారిని భాగస్వాములను చేయాలనే ఉద్దేశంతో ప్రైడోను ప్రారంభించామని చెప్పారు. ఇప్పటివరకు డ్రైవర్ల నమోదు, టెక్నాలజీ అభివృద్ధి మీద దృష్టి సారించామని, ఇక నుంచి రైడర్లను ఆకర్షించడం మీద ఫోకస్ చేస్తామని పేర్కొన్నారు. సరికొత్త ఫీచర్లు, రాయితీలు, ఆఫర్లతో ఆకర్షిస్తామన్నారు. తొలి రెండు రైడ్లకు ఒక్కో రైడ్ మీద రూ.50 రాయితీ ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద, ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, కూర్మయ్యగారి నవీన్ రావు, ప్రణీత్ గ్రూప్ డైరెక్టర్లు నర్సింగరావు, ఆంజనేయ రాజు, నర్సిరెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, ఆదిత్య కామరాజు, దినేష్ రెడ్డి, సందీప్ రావు, ప్రైడో డైరెక్టర్ శ్రీకాంత్ చింతలపాటి తదితరులు పాల్గొన్నారు. -
ఊరెళ్దాం.. పల్లెటూరెళ్దాం!
సాక్షి, హైదరాబాద్: ఇటీవల ఫ్లోరిడాకు చెందిన దంపతులు హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీలో అంతర్జాతీయ సెమినార్‌కు హాజరయ్యారు. వారి పదేళ్ల కూతురుని అక్కడి ఓ దృశ్యం విపరీతంగా ఆకర్షించింది. ఎంతగా అంటే, ఆ దృశ్యాన్ని మరోసారి చూసేందుకు హైదరాబాద్‌కు వచ్చేంతగా.. ఇంతకూ ఆకట్టుకున్న ఆ దృశ్యమేంటో తెలుసా.. కుండల తయారీ. దీంతో విదేశీ పర్యాటకులను ఆకట్టుకునేలా తెలంగాణ పల్లెలను ముస్తాబు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. విలేజ్ టూరిజం... కొత్త కాన్సెప్ట్ కానప్పటికీ, మనకున్న విదేశీ పర్యాటకులను ఆకట్టుకునేవి అవే. రెండేళ్ల గణాంకాలను పరిశీలించిన ప్రభుత్వం దాన్ని ఖరారు చేసుకుని ఆ దిశగా అడుగులేస్తోంది. రెండేళ్లలో మన పల్లెలను చూసేందుకు వచ్చిన పర్యాటకుల్లో 21% పెరుగుదల నమోదైంది. దీంతో విదేశీ టూరిస్టుల సంఖ్యను ఏడాది కాలంలో 30 శాతానికి పెంచాలని పర్యాటకాభివృద్ధి సంస్థ నిర్ణయించింది. 2014లో తెలంగాణను సందర్శించిన విదేశీ పర్యాటకుల సంఖ్య కేవలం 75 వేలు. అదే సమయంలో మన పొరుగున ఉన్న కర్ణాటకను సందర్శించినవారి సంఖ్య 6 లక్షలు. 2017లో తెలంగాణకు వచ్చిన విదేశీ పర్యాటకుల సంఖ్య 2.51 లక్షలు, 2018కి ఈ సంఖ్య 3.18 లక్షలకు చేరుకుంది. ఈ ఏడాది ఇప్పటికీ ఆ సంఖ్య దాదాపు 2 లక్షలుగా ఉంది. కేవలం ఏడాది కాలంలో పెరుగుదల రేటు 21 శాతంగా ఉండటం ప్రభుత్వంలో కొత్త ఆశలు చిగురించాయి. ఏమిటా కసరత్తు.. నగరాల్లో మగ్గే జనానికి పల్లె వాతావరణం కొత్తగా అనిపిస్తుంది. అక్కడి గాలి, ఉదయం–సాయంత్రం వేళ కనిపించే ప్రకృతి రమణీయత, వ్యవసాయం, చేతివృత్తులు, జంతుజాలం.. ఒకటేమిటి, గ్రామీణ సౌందర్యం ఆహ్లాదపరుస్తుంది. అందుకే గ్రామీణ ప్రాంతాలను పర్యాటకంలో చేర్చటం ద్వారా వారిని ఆకట్టుకోవాలని పర్యాటక శాఖ నిర్ణయించింది. - నగర శివారులోని శామీర్‌పేటలో పల్లె వాతావరణంతో కూడిన ఓ కృత్రిమ గ్రామాన్ని నిర్మించబోతున్నారు. తెలంగాణ వల్లె వాతావరణం ప్రతిబింబించేలా ఉండటంతోపాటు కులవృత్తులను కళ్లముందుంచనున్నారు. తెలంగాణ రుచులను కూడా అందుబాటులో ఉంచుతారు. - దేశంలోనే కవ్వాల్ అభయారణ్యానికి ప్రత్యేక స్థానం ఉంది. ఆదిలాబాద్ జిల్లాల్లో మహారాష్ట్రతో అనుసంధానమై ఉన్న ఈ ప్రాంతం పులులు, జింకలు, అడవి దున్నలు, ఇతర జంతువులు, పక్షులకు పెట్టింది పేరు. అభయారణ్యాన్ని ఆనుకుని పలు గ్రామాలున్నాయి. ఈ మొత్తాన్ని విదేశీయులకు చూపే విధంగా అటవీ శాఖతో పర్యాటకాభివృద్ధి సంస్థ ఒప్పందం చేసుకోబోతోంది. ట్రెక్కింగ్, బోటింగ్, బంగీ జంపింగ్‌లాంటి క్రీడలను, గ్రామీణ రెస్టారెంట్లను ఏర్పాటు చేయనుంది. - కవ్వాల్ అభయారణ్యం విస్తరించిన జన్నారం నుంచి కడెం రిజర్వాయర్ వరకు పర్యాటక ప్లాన్‌ను రూపొందిస్తున్నారు. - శ్రీశైలం నల్లమల అడవుల్లోని మన్ననూరు, అక్క మహాదేవి గుహలు, ఉమామహేశ్వరం, ఫరాబాద్, మల్లెల తీర్థం ప్రాంతాల్లో కూడా విదేశీయు లను ఆకట్టుకునే ఏర్పాటుకు ప్లాన్ చేస్తున్నారు. - గోదావరి తీరంలో ఉన్న ఏటూరునాగారం, తాడ్వాయి, జంపన్నవాగు.. ఆ ప్రాంతంలోని ప్రపంచంలోనే ఎక్కువ పరిధిలో విస్తరించిన ఆదిమానవుల జాడలతో కూడిన ప్రాంతాన్ని చేర్చి ప్రత్యేక ప్యాకేజీ ఏర్పాటు చేస్తున్నారు. ఇదే తోవలో ఉండే లక్నవరం, రామప్ప సరస్సుల వద్ద కూడా రూరల్ టూరిజాన్ని అభివృద్ధి చేయనున్నారు. - ఇప్పటివరకు తెలంగాణలో యునెస్కో గుర్తించిన ప్రాంతాలు లేవు. తాజాగా రామప్ప దేవాలయాన్ని యునెస్కో పరిశీలిస్తోంది. ప్రపంచ పర్యాటక పటంలో దానికి చోటు దక్కితే అక్కడికి వచ్చే విదేశీయుల సంఖ్య వేలల్లో ఉండనుంది. ఆ మేరకు ఆ ప్రాంతాన్ని గ్రామీణ పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు నిర్ణయించారు. హైదరాబాద్ టు అడవులు... టీహబ్ లాంటి చర్యలతో ఇప్పుడు హైదరాబాద్‌కు వచ్చే విదేశీయుల సంఖ్య బాగా పెరుగుతోంది. ఇక్కడి ఐటీ పరిశ్రమకు అనుబంధంగా నగరంలో రకరకాల ఇతివృత్తాలతో వందకుపైగా ఎగ్జిబిషన్లు, అంతర్జాతీయ సదస్సులు జరుగుతున్నాయి. ఇలాంటి కార్యక్రమాలకు హాజరయ్యేవారు వీలు చిక్కితే పర్యాటక ప్రాంతాలను సందర్శిస్తారు. విదేశీయులను ఆకట్టుకునే ఏర్పాట్లు మన వద్ద అంతగా లేకపోవటం, తెలంగాణ పర్యాటకానికి ప్రపంచపటంలో పెద్దగా చోటు దక్కకపోవటంతో వాటిపై ముందస్తు ప్రణాళికలను వారు సిద్ధం చేసుకోవటం లేదు. ఇప్పుడు దీన్ని అధిగమించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. -
అందరికీ అందుబాటులోకి వైద్యం
సాక్షి, హైదరాబాద్: సాంకేతికంగా ఎంత ఎదుగు తున్నా, ఆరోగ్య వ్యవస్థలను ఆధునికీకరించుకుంటున్నా.. ప్రపంచీకరణ పుణ్యమా అని ఇటీవలి కాలంలో సాంక్రమిక వ్యాధులు విచ్చలవిడిగా విస్తరిస్తున్నాయని తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ వ్యాఖ్యానించారు. వీటిని ఎంత మేరకు అరికట్టగలిగామో శాస్త్రవేత్తలు పరిశీలించాలని పిలుపునిచ్చారు. రవాణా సౌకర్యాలు మెరుగుపడటం, నగరీకరణ, అడవుల నాశనం, వాతావరణ మార్పు లు తదితర కారణాల వల్ల సాంక్రమిక వ్యాధులు పెచ్చరిల్లుతున్నాయని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీలో సోమవారం ప్రారంభమైన 16వ బయో ఆసియా సదస్సుకు గవర్నర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచ ఆరోగ్య సంస్థ భవిష్యత్‌లో పెనుముప్పుగా పరిణమించగల వ్యాధుల జాబితాను సిద్ధం చేసిందని, ఏటా దీన్ని సవరిస్తుందన్నారు. ఇది ప్రజల్లో ఆందోళన పెంచేందుకు కాకుండా ఏఏ అంశాలపై పరిశోధనలను ఎక్కువ చేయాలో సూచించేందుకు మాత్రమేనని తెలిపారు. ఆరోగ్య పరిరక్షణ, వైద్యసేవలు అందరికీ అందుబాటులో ఉండేలా చేయాల్సిన బాధ్యత శాస్త్రవేత్తలకు ఉందని స్పష్టం చేశారు. ఆరోగ్య రంగానికీ కొన్ని నైతిక సూత్రాలు ఉండాలని సూచించారు. సామాన్యులకు అందుబాటులో లేనంతగా వైద్యానికి ఖర్చు ఉండటం సరికాదన్నారు. సామాన్యుడి సమస్యలు కేంద్రంగా పరిశోధనలు సాగాలని పిలుపునిచ్చారు. సంప్రదాయ వైద్య పద్ధతులు, చిట్కాలను అందు బాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. డాక్టర్ డాన్‌క్లీవ్‌ల్యాండ్‌కు అవార్డు.. కేన్సర్ జెనెటిక్స్‌తోపాటు నాడీ సంబంధిత వ్యాధులపై విస్తృత పరిశోధనలు చేసిన లడ్విగ్ కేన్సర్ ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్త డాక్టర్ డాన్ క్లీవ్‌ల్యాండ్‌కు బయో ఆసియా–2019 ‘జినోమ్‌వ్యాలీ ఎక్సలెన్సీ అవార్డు’దక్కింది. గవర్నర్ నరసింహన్ చేతుల మీదుగా ఆయన ఈ అవార్డు అందుకున్నారు. జినోమ్‌వ్యాలీ ఎక్సలెన్సీ అవార్డును స్వీకరించడంపై క్లీవ్‌ల్యాండ్ హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బయో ఆసియా సీఈవో శక్తి నాగప్పన్, రెడ్డీస్ లేబొరేటరీస్ చైర్మన్ సతీశ్‌రెడ్డి, దక్షిణ కొరియా కాన్సులేట్ జనరల్ సురేశ్ చుక్కపల్లి, అమెరికన్ కాన్సులేట్ జనరల్ కేథరీన్ హడ్డా తదితరులు పాల్గొన్నారు. త్వరలో లైఫ్ సైన్సెస్ గ్రిడ్ ఏర్పాటు.. జీవశాస్త్ర రంగంలో తెలంగాణను ప్రపంచంలోనే అత్యున్నత కేంద్రంగా మార్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ అన్నారు. దీనిలో భాగంగానే జినోమ్ వ్యాలీ 2.0 ఏర్పాటుకు సిద్ధమవుతున్నామని చెప్పారు. ఫార్మా సిటీ, వైద్య పరికరాల తయారీ పార్క్, బయోటెక్నాలజీ రంగంలో స్టార్టప్‌లను ప్రోత్సహించేందుకు బీ–హబ్ ఏర్పాటు ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయని తెలిపారు. జీవశాస్త్ర రంగంలోని అన్ని వర్గాల వారికి వేదికగా పనిచేసేందుకు త్వరలోనే లైఫ్ సైన్సెస్ గ్రిడ్‌ను ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు. నైపుణ్యాభివృద్ధితోపాటు, ఉద్యోగ కల్పన, పెట్టుబడుల విషయంలో సహాయం అందించడం ఈ గ్రిడ్ ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. -
బ్యూటీస్ సెల్ఫీ
-
జూన్, జూలై నెలల్లో ఇస్టా కాంగ్రెస్
సాక్షి, హైదరాబాద్: జూన్ 26 నుంచి జూలై 3 వరకు హైదరాబాద్ హెచ్ఐసీసీలో జరిగే 32వ అంతర్జాతీయ విత్తన పరీక్షల సంఘం (ఇస్టా) సభలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి ఆదేశించారు. ఇస్టా కాంగ్రెస్ నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లపై మంగళవారం సచివాలయంలో సీఎస్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో అంతర్జాతీయ విత్తన ఎగ్జిబిషన్‌పై రూపొందించిన బ్రోచర్‌ను సీఎస్ ఆవిష్కరించారు. జూన్ 26న ప్రారంభోత్సవ కార్యక్రమం, 26 నుంచి 28 వరకు విత్తన సింపోజియం, అంతర్జాతీయ విత్తన ప్రదర్శ న, 28న విత్తన వ్యవసాయదారుల సమావేశం, జూన్ 29 నుంచి జూలై 3 వరకు ఇస్టా వార్షిక సమావేశాలు జరుగుతాయని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో 400 మంది విదేశీ ప్రతినిధులు పాల్గొంటారన్నారు. వీరికి వసతి, భద్రత, రవాణా సదుపాయాలు కల్పించాల ని అధికారులను ఆదేశించారు. ప్రపంచ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి 200 విత్తన కంపెనీలు పాల్గొంటాయన్నారు. కొత్త ఉత్పత్తులు, సీడ్ ప్రాసెసింగ్, ప్యాకింగ్ ఎక్విప్మెంట్స్, సీడ్ ట్రీట్మెంట్, నూతన టెక్నాలజీపై ప్రదర్శన ఉంటుందని చెప్పారు. విత్తన ఉత్పత్తి, నాణ్యతపై సింపోజియం ఉంటుందన్నారు. ప్రపంచ వ్యవసాయ ఆహార సంస్థ సహకారంతో ఈ కాంగ్రెస్ జరుగుతుందన్నారు. రైతులకు అవగాహన సమావేశాలు.. రైతులకు విత్తన ఉత్పత్తిలో అమలవుతున్న నూతన పద్ధతులు, నాణ్యతపై అవగాహన కల్పించడానికి ఈ సమావేశాలు జరుగుతాయని సీఎస్ తెలిపారు. ఇస్టా కాంగ్రెస్‌కు ప్రచారాన్ని నిర్వహించాలని ఆదేశించారు. విదేశీ ప్రతినిధులు తెలంగాణలో పర్యాటక ప్రాంతాలను సందర్శించే ప్యా కేజీ వివరాలను వారికి తెలపాలన్నారు. ఈ సమా వేశంలో ఇస్టా సెక్రటరీ జనరల్ డాక్టర్ ఆండ్రియాస్ వియాస్, స్విట్జర్లాండ్‌కు చెందిన ఇస్టా ప్రతినిధి ఓల్గా స్టోకీ, ఇక్రిసాట్ డైరెక్టర్ జనరల్ పీటర్ కార్ బెర్రీ, వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారథి, టూరిజం శాఖ కార్యదర్శి బి. వెంకటేశం తదితరులు పాల్గొన్నారు. -
తరలి వచ్చిన అతిరథ మహారధులు
-
రాష్ట్రపతిని కలిసిన కేటీఆర్
సాక్షి, ఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ శుక్రవారం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఈ నెల 19 నుంచి 21 వరకు జరుగనున్న వరల్డ్ ఐటీ కాంగ్రెస్ 2018 సదస్సు ముగింపు వేడుకలకు రావాలని రాష్ట్రపతిని కేటీఆర్ ఆహ్వానించారు. కాగా, నాస్కామ్ ఆధ్వర్యంలో జరుగనున్న ఐటీ కాంగ్రెస్ సదస్సును ప్రధాని నరేంద్ర మోదీ వీడియో లింక్ ద్వారా ప్రారంభించనున్నారు. ప్రపంచ వ్యాప్తంగా 150 మంది పారిశ్రామిక వేత్తలు ఈ సదస్సులో పాల్గొననున్నారు. మొత్తం 50 సెషన్లు జరగనున్నాయి. 30 దేశాల నుంచి ప్రతినిధులు రానున్న ఈ సదస్సులో మొత్తం 50 సెషన్లు జరుగుతాయి. -
అప్పుడే సిటీ వదిలెళ్లాలని లేదు
-
వావ్.. హైదరాబాద్..!
సాక్షి, హైదరాబాద్: ‘వావ్.. హైదరాబాద్..’‘భాగ్యనగరాన్ని అప్పుడే వదిలి వెళ్లాలని లేదు..’ఈ మాటలు అన్నది ఎవరో కాదు.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్. నగర పర్యటన ముగింపు సందర్భంగా ఆమె చేసిన వ్యాఖ్యలివీ.. మంగళవారం తెల్లవారుజామున శంషాబాద్ విమానాశ్రయంలో విమానం దిగిన ఇవాంకా తన కాన్వాయ్‌లో ట్రైడెంట్ హోటల్ వరకు ప్రయాణిస్తూ హైదరాబాద్ అందాలను తిలకించారు.. ఆపై హెచ్ఐసీసీకి వెళ్లిన ఆమె.. అక్కడి ఆధునిక అంశాలను పరిశీలించారు.. మంగళవారం రాత్రి తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్ అందాలను వీక్షించి.. బిర్యానీ, స్థానిక రుచుల్నీ ఆస్వాదించారు.. బుధవారం మధ్యాహ్నం గోల్కొండ కోటను సందర్శించిన ఆమె.. నగర చరిత్రను తెలుసుకున్నారు.. ఈ రెండు రోజుల పర్యటనలో అమెరికా అధ్యక్షుడి కుమార్తెను నగరం కట్టిపడేసింది. తనకు ఈ వాతావరం ఎంతో నచ్చిందని.. అప్పుడే హైదరాబాద్ వదిలి వెళ్లాలని లేదని.. మరికొన్ని రోజులు ఉండాలని అనిపిస్తున్నప్పటికీ సమయాభావం వల్ల బుధవారం రాత్రికే తిరుగు ప్రయాణమవ్వాల్సి వస్తోందని ఇవాంకా వ్యాఖ్యానించారు. గోల్కొండలో ఇవాంకా పర్యటన విధుల్లో భాగం పంచుకున్న నగర అదనపు పోలీస్ కమిషనర్ స్వాతిలక్రాతో ఇవాంకా తన భావాలను పంచుకున్నారు. దాదాపు గంట సేపు గోల్కొండ కోటలో గడిపిన ఇవాంకాకు స్వాతిలక్రాను అమెరికా రా యబార కార్యాలయం అధికారి పరిచయం చేశారు. అమెరికా ప్రభుత్వ విభాగం ఇటీవల ప్రకటించిన ప్రతిష్టాత్మక హ్యాంపేరీ లీడర్షిప్ అవార్డును 2 రోజుల క్రితం స్వాతిలక్రా అమెరికాలో అందుకున్నారని ఆ అధికారి ఇవాంకాకి వివరించారు. యూనైటెడ్ స్టేట్స్ బ్యూరో అఫ్ ఎడ్యుకేషన్ అండ్ కల్చరల్ అఫైర్స్, ఇన్స్టిట్యూట్ అఫ్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్(ఐఐఈ) విభాగం నిర్వహించిన కార్యక్రమంలోనూ పాల్గొన్నారని ఆమెకు వివరించారు. సిటీ టెక్నాలజీకి కితాబు.. ఈ నేపథ్యంలో స్వాతిలక్రాతో కాసేపు సంభాషించిన ఇవాంకా నగర పోలీసు విభాగం అంశాలు అడిగి తెలుసుకున్నారు. హైదరాబాద్ పోలీసులు అభివృద్ధి చేసి, వినియోగిస్తున్న హాక్–ఐ, హైదరాబాద్ కాప్, హైదరాబాద్ ట్రాఫిక్ లైవ్ యాప్స్‌తోపాటు బాధితులకు సత్వర న్యాయం చేయడం, నేరగాళ్లకు చెక్ చెప్పడానికి వాడుతున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వివరాలను స్వాతిలక్రా ఇవాంకాకు వివరించారు. మహిళలు, యువతులకు అన్ని రకాల సహాయసహకారాలు అందించడానికి సిటీ పోలీసు విభాగం సాంకేతిక పరిజ్ఞానం వినియోగిస్తున్న విధానాన్ని తెలిపారు. న్యూయార్క్ పోలీసు డిపార్ట్మెంట్(ఎన్‌వైపీడీ) తరహాలోనే తమ వద్దా అత్యాధునిక డయల్ 100 వ్యవస్థ ఉన్నట్లు స్వాతిలక్రా.. ఇవాంకాకు తెలిపారు. దాదాపు 10 నిమిషాల పాటు నగర పోలీసులకు సంబంధించిన వివరాలు తెలుసుకున్న ఇవాంకా.. అద్భుతమంటూ కితాబిచ్చారని తెలిసింది. పోలీసింగ్‌లోనూ మహిళలకు ప్రాధాన్యం ఇవ్వడాన్ని ఇవాంకా అభినందించారు. -
ప్రధాని నరేంద్ర మోదీ ఇవాంక ట్రంప్ భేటీ
-
హెచ్ఐసీసీలో మోదీ-ఇవాంక భేటీ
సాక్షి, హైదరాబాద్ : జీఈ సదస్సు 2017 ప్రారంభానికి ముందు ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడి సలహాదారు ఇవాంక ట్రంప్ భేటీ అయ్యారు. ఈ భేటీకి ఇరుదేశాల విదేశాంగ ప్రతినిధులు కూడా హాజయ్యారు. తమ బృందంలోని సభ్యులను ఈ సందర్భంగా ఆమె మోదీకి పరిచయం చేశారు. భారత్‌తో ద్వైపాక్షిక ఒప్పందాలు, పెట్టుబడి అవకాశాలపై వీరిద్దరూ చర్చించినట్లు తెలుస్తోంది. అంతకు ముందు విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌తో ఇవాంకతో భేటీ అయ్యారు. మహిళా సాధికారికతపైనే వీరిద్దరు చర్చించినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. -
దోమ.. ఈగల వేట
సిటీవాసులకు దోమలు, ఈగలతో జీవనం సర్వసాధారణమే. కానీ అగ్రదేశాల నుంచి వచ్చే ప్రతినిధులకు దోమలంటే మహా భయం. విష ప్రాణులు, క్రూర జంతువుల దాడిలో మరణించే వారికంటే ప్రపంచ వ్యాప్తంగా దోమకాటు మరణాలే ఎక్కువ. దీంతో వారు ఈ చిన్న ప్రాణి అంటే ఆయా దేశాలవారు వణికి పోతారు. ఈ నేపథ్యంలో విదేశీ ప్రతినిధులను దోమ కుట్టకుండా జీహెచ్ఎంసీ రేయింబళ్లు వేట సాగిస్తోంది. సదస్సు జరుగనున్న హెచ్ఐసీసీ, విందు ఇచ్చే గోల్కొండ కోట, ఫలక్‌నుమా ప్యాలెస్ పరిసరాల్లో పెద్ద ఎత్తున ఫాగింగ్ చేస్తున్నారు. చెరువుల్లో గుర్రపుడెక్కను తొలగిస్తున్నారు. దోమల ఉనికి లేకుండా పనులు చేస్తున్నారు. సాక్షి, సిటీబ్యూరో: విదేశీ ప్రతినిధులకు 28వ తేదీ రాత్రి విందు జరుగనున్న ఫలక్‌నుమా ప్యాలెస్ పరిసరాల్లో ఐఆర్ఎస్ స్ప్రే చేస్తున్నారు. స్రేయింగ్కు అల్ఫా సైపర్ మెథ్రిన్, ఫాగింగ్‌కు సిఫనోథ్రిన్తో పాటు ఆలౌట్ మాదిరిగా పనిచేసే పొగ రాకుండా ఏరియల్ స్ప్రే కోసం ఫైరిథ్రమ్ను ప్రత్యేకంగా వినియోగిస్తున్నారు. గోల్కొండ కోట మొత్తం ఏసీఎం పౌడర్‌తో నాలుగు రోజులుగా ముమ్మరంగా దోమల వేట సాగిస్తున్నారు. శక్తివంతమైన నాలుగు భారీ స్ప్రేయర్లతో ఫైరిథ్రమ్ను చల్లుతున్నారు. కోట పరిసరాల్లోని శాతం తలాబ్, హుడా పార్కు పరిసరాల్లో భారీ సిబ్బందితో నాలుగు రోజులుగా గుర్రపుడెక్క తొలగిస్తున్నారు. ఫలక్‌నుమా, హెచ్ఐసీసీ పరిసర ప్రాంతాల్లోని చెరువుల్లోనూ గుర్రపు డెక్క తొలగింపుతో పాటు ఐదేసి భారీ వాహనాలు, 15 పోర్టబుల్ యంత్రాలతో నిరంతరం ఫాగింగ్ చేస్తున్నారు. అతిథులు ఉండే మూడు రాత్రులు దోమల బెడద లేకుండా చేసేందుకు మహా యుద్ధం చేస్తున్నారు. గోల్కొండ కోట వద్ద 150 మంది, ఫలక్‌నుమా వద్ద 54 మంది, హెచ్ఐసీసీ వద్ద 36 మంది సిబ్బంది 24్ఠ7గా దోమల నిర్మూలనలో నిమగ్నమయ్యారు. వీరితోపాటు ఐదుగురు అసిస్టెంట్ ఎంటమాలజిస్టులు, 10 మంది సూపర్వైజర్లు ఇవే పనుల్లో ఉన్నారు. గత నాలుగైదు రోజుల్లో మూడెకరాల పరిధిలోని శాతం చెరువులో గుర్రపుడెక్క పనులు పూర్తయ్యాయని జీహెచ్ఎంసీ చీఫ్ ఎంటమాలజిస్ట్ వెంకటేశ్ తెలిపారు. అతిథులు పర్యటించే ప్రాంతాల్లోని నాలాలు, చెరువుల్లోనూ గుర్రడపుడెక్క తొలగింపు పనులు ముమ్మరంగా చేస్తున్నారు. నిలోఫర్‌లో 24 గంటల ఫార్మసీ నాంపల్లి: నవ జాత శిశువుల సంరక్షణా కేంద్రం నిలోఫర్ ఆస్పత్రిలో 24 గంటల ఫార్మసీని ప్రారంభించాలని డీఎంఈ డాక్టర్ రమేష్‌రెడ్డి ఆదేశించారు. దీనిని 27 నుంచి అందుబాటులోకి తేవాలని నిలోఫర్ సూపరింటెండెంట్ డాక్టర్ మురళీకృష్ణకు సూచించారు. గురువారం రెడ్‌హిల్స్‌లోని ఆస్పత్రిని సందర్శించిన డాక్టర్ రమేష్‌రెడ్డి వైద్యాధికారులతో సమావేశమై పలు సమస్యలపై సమీక్షించారు. నర్సుల పోస్టుల భర్తీని త్వరలోనే పూర్తి చేస్తామన్నారు. రాజీవ్ ఇంటెన్సివ్ కేర్ బ్లాక్‌లో 24 గంటల ఫార్మసీ అందుబాటులోకి వస్తుందన్నారు. ఆర్ఎంఓ డాక్టర్ నరహరి, ఇతర వైద్యాధికారులు పాల్గొన్నారు. రొటేషన్ పద్ధతిలో టెక్నిషియన్ల విధులు నిలోఫర్ రేడియాలజీ, పాథాలజీ, మైక్రో బయాలజీ విభాగాల్లో సుమారు 40 మంది టెక్నిషియన్లు పని చేస్తున్నారు. వీరంతా ఏళ్ల తరబడి ఒకేచోట పాతుకపోయి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఇదే అంశంపై ఇటీవల 13 మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను విధుల నుంచి తొలగించిన విషయం తెలిసిందే. రొటేషన్ పద్ధతిలో టెక్నిషియన్లకు విధులు అప్పగించడం వల్ల వారి పనితీరు మెరుగుపడే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే వైద్యులు సహా నాలుగో తరగతి ఉద్యోగులు రొటేషన్ పద్థతిలో పని చేస్తున్నారు. టెక్నిషియన్లను కూడా అలా పని చేయించడం వల్ల మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. -
పర్యాటక సంబురం.. స్కాల్ వరల్డ్ కాంగ్రెస్
-
నేటి నుంచి బయో ఏషియా సదస్సు
ప్రారంభించనున్న గవర్నర్ నరసింహన్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా బయో ఏషియా – 2017 సదస్సుకు ఏర్పాట్లు చేస్తోంది. హెచ్ఐసీసీలో సోమవారం నుంచి 8వ తేదీ వరకు జరిగే ఈ సదస్సులో ఆరోగ్యం, ఫార్మా తదితర రంగాల్లో జరుగుతున్న అభివృద్ధిని చర్చిస్తారు. ఈ కార్యక్రమాన్ని గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ప్రారంభిస్తారని నిర్వాహకులు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. 50 దేశాలకు చెందిన 1,500 మంది ప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరవుతారు. ప్రారంభ కార్యక్రమం సందర్భంగా నోబెల్ బహుమతి గ్రహీత ప్రొఫెసర్ కుర్త్ ఉత్రిచంద్, డాక్టర్ పాల్ స్టోఫెల్స్‌లకు జీనోమ్‌వ్యాలీ ఎక్స్‌లెన్సీ అవార్డును గవర్నర్ అందజేస్తారు. అంతకుముందు షామీర్పేటలోని జీనోమ్‌వ్యాలీలో కొన్ని ప్రాజెక్టులను రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కె.తారకరామారావు ఆవిష్కరిస్తారు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన నేషనల్ యానిమల్ రిసోర్స్ ఫెసిలిటీ ఫర్ బయో మెడికల్ రీసెర్చ్ తమ లేబరేటరీని జీనోమ్‌వ్యాలీలో నెలకొల్పనుంది. ఈ రీసెర్చ్ ప్రాజెక్టు శంకుస్థాపన కార్యక్రమాన్ని వచ్చే నెల నిర్వహించనున్నారు. దీనికి ప్రధాని మోదీని ఆహ్వానించాలని నిర్ణయించారు. ఈ ప్రాజెక్టు కోసం రాష్ట్ర ప్రభుత్వం 100 ఎకరాలు కేటాయించింది. మొదటి విడతలో కేంద్రం రూ. 350 కోట్లు ఖర్చు చేయనుంది. ఈ సదస్సుకు ఫార్మాసూటికల్స్ అంతర్జాతీయ చైర్మన్ డాక్టర్ పాల్ స్టోఫెల్స్ కీలకోపన్యాసం చేస్తారు. ఇక్కడ నిర్వహించే ఎగ్జిబిషన్లో 100 స్టాళ్లను ఏర్పాటు చేస్తారు. ఆరోగ్యం, లైఫ్ సైన్సెస్ ఉత్పత్తులను ప్రదర్శిస్తారు. హెల్త్‌కేర్ స్టార్టప్‌లనూ ఏర్పాటు చేసి డయాగ్నోస్టిక్ మొబైల్ యాప్, రోగుల ఆరోగ్య రికార్డుల నిర్వహణ, త్రీడీ బయో ప్రింటింగ్‌లను ప్రదర్శిస్తారు. -
కొత్త రంగాలతోనే ఉపాధి
సాక్షి, హైదరాబాద్: పెరుగుతున్న యాంత్రీకరణ వల్ల ఉపాధి అవకాశాలు సన్నగిల్లుతున్నాయని.. ఈ నేపథ్యంలో కొత్త రంగాలపై దృష్టి సారించి నిరుద్యోగ సమస్యను అధిగమించాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు అన్నారు. హైదరాబాద్ హెచ్ఐసీసీలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐటీ) పాలసీకి అనుబంధంగా సైబర్ సెక్యూరిటీ, డేటా అనాలిసిస్, డేటా సెంటర్స్, ఓపెన్ డేటాపై 4 సెక్టొరల్ పాలసీలను కేటీఆర్ గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆయా రంగాలకు చెందిన నిపుణులు, సంస్థల నుంచి సూచనలు స్వీకరించి కొత్త పాలసీలు రూపొందించామన్నారు. అనేక ఐటీ కంపెనీలు నూతన సాంకేతికతను హైదరాబాద్‌కు పరిచయం చేస్తూ.. రెండున్నరేళ్లలో రాష్ట్రాన్ని ఐటీలో ప్రపంచ స్థాయిలో నిలబెట్టాయన్నారు. 5 ఐటీ దిగ్గజ కంపెనీలకుగానూ 4 కంపెనీలు గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్, ఫేస్బుక్ 24 నెలల వ్యవధిలోనే రాష్ట్రంలో తమ కార్యకలాపాలు ప్రారంభించాయని చెప్పారు. అనేక పెద్ద కంపెనీలు రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు సృష్టిస్తున్నాయని, ప్రస్తుతం ఆవిష్కరించిన పాలసీలను ఐటీ రంగం అభివృద్ధికి సోపానాలుగా వినియోగించుకోవాలని సూచించారు. డేటా సెంటర్ల ఏర్పాటు నేపథ్యంలో కంప్యూటర్ సర్వర్ల తయారీ ద్వారా ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. సైబర్ సెక్యూరిటీ సవాలుగా మారిందని.. దీనిని ఎదుర్కొంటూ ఉద్యోగాల కల్పనపై దృష్టి సారించాల్సి ఉందన్నారు. ఓపెన్ డేటా పాలసీ ద్వారా మిలియన్ల కొద్దీ పేజీల సమాచారాన్ని ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు వీలవుతుందన్నారు. ఐటీ అనుబంధ పాలసీల ద్వారా రాష్ట్రంలో లక్షలాది కొత్త ఉద్యోగాలు వస్తాయని కేటీఆర్ వెల్లడించారు. ఐటీ రంగానికి అనుబంధంగా పది సెక్టొరల్ పాలసీలకుగానూ.. ఇప్పటి వరకు ఎనిమిది పాలసీలను రూపొందించినట్లు ఐటీ శాఖ కార్యదర్శి జయేశ్ రంజన్ వెల్లడించారు. తొలి విడతలో ఆవిష్కరించిన 4 సెక్టొరల్ పాలసీల ద్వారా 29 సంస్థలు.. రాష్ట్ర ప్రభుత్వంతో ఉపాధి కల్పన దిశగా ఒప్పందం కుదుర్చుకున్నాయన్నారు. 250 మంది ప్రైవేటు భాగస్వాములతో సంప్రదింపులు జరిపి సెక్టొరల్ పాలసీలు రూపొందించామని.. పాలసీలు ఆచరణలోకి వస్తే అద్భుత ఫలితాలు వస్తాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో నల్సార్ వర్సిటీ వైస్ చాన్స్‌లర్ ఫైజాన్ ముస్తాఫా, జెఎన్టీయూ వీసీ వేణుగోపాల్‌రెడ్డి, సైబరాబాద్ కమిషనర్ సందీప్ శాండిల్య, ఐటీ సంస్థల ప్రతినిధులు బీవీఆర్ మోహన్‌రెడ్డి, శ్రీధర్‌రెడ్డి, కేఎస్విశ్వనాథ్, ఆనంద్ రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు. పలు ఒప్పందాలపై సంతకాలు సెక్టొరల్ పాలసీల ఆవిష్కరణ సందర్భం గా రాష్ట్ర ప్రభుత్వం పలు సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. ఈ మేరకు కేటీఆర్ సమక్షంలో జయేశ్ రంజన్ ఆయా సంస్థల ప్రతినిధులు సంతకాలు చేశారు. సిస్కో, ఫాక్ట్లీ, డీఎస్‌సీఐ, కంట్రో ల్ ఎస్, ఎస్సీఎస్సీ, నాస్కామ్, క్రాప్ డేటా టెక్నాలజీస్ తదితర సంస్థలు ఒప్పందం కుదుర్చుకున్న జాబితాలో ఉన్నాయి. సిటీ డిజిటల్ ప్లాట్‌ఫాంలు, వీడియో ఆధారిత తరగతి గదులు, హైదరాబాద్‌కు చెందిన చారిత్రక కట్టడాల డిజిటలైజేషన్, జాయింట్ సైబర్ సెక్యూరిటీ చార్టర్ అభివృద్ధి, డేటా సెంటర్ల ఏర్పాటు, సైబర్ సెక్యూరిటీ రెస్పాన్స్ సెంటర్, మాల్వేర్ రీసెర్చ్ సెంటర్, క్రిప్టోగ్రఫీలపై ఆయా సంస్థలు రాష్ట్రంతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. సైబర్ సెక్యూరిటీ పాలసీ.. రక్తపాత రహిత యుద్ధాలుగా పరిగణిస్తున్న సైబర్ వార్స్ ప్రపంచానికి వెలకట్టలేని నష్టాన్ని కలిగిస్తున్నాయి. తెలంగాణలోని పెద్ద కంపెనీలూ సైబర్ దాడులకు గురవుతున్నా.. ఎదుర్కొనేందుకు శిక్షణ, నైపుణ్యం కలిగిన మానవ వనరుల కొరత ఉంది. ఈ నేపథ్యంలో అవసరమైన మానవ వనరులను తయారు చేయడంతో పాటు.. సైబర్ దాడులను ఎదుర్కొనేలా సైబర్ సెక్యూరిటీపై అవగాహన కల్పించాల్సి ఉంది. ఈ పాలసీ ద్వారా సైబర్ సెక్యూరిటీపై అవగాహన, సైబర్ నేరాల నిరోధానికి అవసరమైన సంస్థలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. సైబర్ సెక్యూరిటీ ఉత్పత్తులు తయారు చేసే స్టార్టప్‌లను ప్రోత్సహిస్తుంది. సైబర్ సెక్యూరిటీపై జరిగే పరిశోధనలను సంస్థలు, రాష్ట్రాలు పరస్పరం మార్పిడి చేసుకునేలా చూస్తారు. ఐటీ అనుబంధ పాలసీల ప్రత్యేకతలివే.. త్వరలో మరో రెండు అనుబంధ పాలసీల ఆవిష్కరణ రాష్ట్ర అభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తున్న ఐటీ రంగానికి మరింత ఊతమిచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్‌లో ‘ఐటీ పాలసీ’ని ఆవిష్కరించింది. ఐటీ రంగానికున్న విస్తృతిని దృష్టిలో పెట్టుకుని ఒక్కో అనుబంధ రంగానికి ఒక్కో సెక్టొరల్ పాలసీ రూపొందిస్తామని ప్రకటించింది. ఇందులో భాగంగా ఏప్రిల్‌లో 4 ఐటీ అనుబంధ పాలసీలను ఆవిష్కరించగా.. గురువారం మరో నాలుగు పాలసీలను విడుదల చేసింది. ఐఓటీ, స్మార్ట్ టెక్నాలజీస్, ఈ-వేస్ట్ మేనేజ్మెంట్కు సంబంధించిన మరో రెండు అనుబంధ పాలసీలను త్వరలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. తాజాగా విడుదల చేసిన 4 పాలసీల్లోని ప్రత్యేకతలు ఇవీ.. - సాక్షి, హైదరాబాద్ ఓపెన్ డేటా పాలసీ.. ప్రభుత్వ పాలనలో పారదర్శకత లక్ష్యంగా రూపొందించిన ఈ పాలసీ ద్వారా ప్రజలు, విధాన నిర్ణేతలు, సమాచార వినియోగదారులు, స్టార్టప్‌లు, ప్రైవేటు సంస్థలకు ఉపయోగకరంగా ఉంటుంది. ప్రభుత్వ విభాగాల వారీగా డేటా నిర్వహణకు అవసరమైన అన్ని మౌలిక సౌకర్యాలను ప్రభుత్వం కల్పిస్తుంది. పాలసీ విడుదలైన ఆరు నెలల్లోగా ఆచరణకు అవసరమైన మార్గదర్శకాలను ఐటీ విభాగం రూపొందిస్తుంది. పాలసీ అమలు తీరును పర్యవేక్షించేందుకు వివిధ ప్రభుత్వ విభాగాల అధికారులతో కూడిన ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తారు. డేటా సెంటర్స్ పాలసీ.. భౌగోళికంగా రాష్ట్రానికున్న అనుకూలతల దృష్ట్యా హైదరాబాద్‌లో డేటా సెంటర్ల ఏర్పాటును ప్రోత్సహించేందుకు ఈ పాలసీ దోహదం చేస్తుంది. డేటా సెంటర్స్ క్యాంపస్‌లో ప్రైవేటు సంస్థలు తమ డేటా సెంటర్లు ఏర్పాటు చేసుకోవచ్చు. మౌలిక సౌకర్యాలను క్యాంపస్‌లో ప్రభుత్వం కల్పిస్తుంది. నిరంతర విద్యుత్ సరఫరా చేయడంతో పాటు క్యాంపస్‌లో ఏర్పాటయ్యే డేటా సెంటర్లకు కనీసం 10 శాతం వ్యాపారానికి ప్రభుత్వం హామీ ఇస్తోంది. ప్రభుత్వం సొంతంగా స్టార్టప్ డేటా సెంటర్‌ను ఏర్పాటు చేస్తుంది. డేటా సెంటర్ల ఏర్పాటుకు ముందుకు వచ్చే వారికి ప్రత్యేక రాయితీలిస్తుంది. డేటా అనెలిటిక్స్ పాలసీ.. సాంకేతికత ద్వారా ప్రజల ముంగిట్లోకి పాలన తీసుకెళ్లేందుకు ఈ విధానం దోహదం చేయనుంది. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్‌లోని టెక్నాలజీ బిజినెస్ సెంటర్లో డేటా అనలిటికల్ పార్కును ఏర్పాటు చేస్తారు. సమాచార విశ్లేషకులు, పారిశ్రామిక, వాణిజ్యవేత్తలకు డేటా సెంటర్‌తో సమగ్ర సమాచారం అందుబాటులో ఉంటుంది. ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లోనూ డేటా అనలిటికల్ సెంటర్లను విస్తరించే యోచనలో ప్రభుత్వం ఉంది. డేటా అనలిస్టులు, డేటా సైంటిస్టులు, డేటా మైనిం గ్ నిపుణులు తదితరులకు శిక్షణ ఇచ్చేం దుకు టాస్క్ ద్వారా.. ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలు, గ్రామాల్లో నైపుణ్య శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. ప్రభుత్వ సమాచారాన్ని ఈ కేంద్రాల ద్వారా అందుబాటులోకి తెస్తారు. టీ హబ్‌కు అనుబంధంగా డేటా అనలిటిక్స్ స్టార్టప్‌ల కోసం ప్రత్యేక సెల్ ఏర్పాటు చేస్తారు. -
హైలైఫ్ ఫ్యాషన్
-
విజయవంతంగా ఎనిమిదో విత్తన సదస్సు
-
రైతు ఆత్మహత్యలు కొత్తకాదు
సాక్షి, హైదరాబాద్: రాష్ర్టంలో రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం కొత్తేమీ కాదని మంత్రులు పోచారం శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వర్రావు వ్యాఖ్యానించారు. గత పాలకుల నిర్వాకం వల్లే ఆత్మహత్యలు కొనసాగుతున్నాయని.. దీన్ని మరిచి ప్రతిపక్షాలు అనవసర రాద్దాంతం చేస్తున్నాయని ఆరోపించారు. సచివాలయంలో శుక్రవారం పోచారం, తుమ్మల విలేకరులతో మాట్లాడారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన ఏడాది కాలంలో రైతులను ఆత్మహత్య చేసుకునేంత దుస్థితికి తీసుకురాలేదని, గత పాలకుల నిర్వాకం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రతిపక్షాలు రైతులను ఆత్మహత్యల వైపు ప్రేరేపిస్తున్నాయని చెప్పారు. శాశ్వత సాగునీటి వనరులు కల్పించేంత వరకు ఆత్మహత్యలు ఆపలేమని, నాలుగేళ్లలో సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తామని అన్నారు. వాణిజ్య పంటలు వేసి అధిక పెట్టుబడులు పెట్టి అప్పుల పాలుకావడం వల్ల రైతు ఆత్మహత్యలు పెరుగుతున్నాయన్నారు. ‘ప్రభుత్వం మీ వెనుక ఉంది. ధైర్యంగా ఉండండి. భార్యా బిడ్డలను అనాధలను చేయకండి’ అంటూ వారు రైతులకు విజ్ఞప్తి చేశారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 409 మంది ఆత్మహత్య చేసుకున్నారని... వారిలో 141 మందికి ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ప్రకటించిందన్నారు. ఆత్మహత్యల పరిహారం పెంపుపై ప్రభుత్వం సానుకూలంగా ఉందని... ముఖ్యమంత్రి విదేశాల నుంచి రాగానే నిర్ణయం తీసుకుంటామన్నారు. హైదరాబాద్‌లో ఆత్మహత్య చేసుకున్న లింబయ్యకు ఒక్క పైసా అప్పు లేదన్నారు. పంటలు ఎండలేదు.. ఆగస్టుతోపాటు, ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు పంటలకు ఎంతో మేలుచేస్తాయని, అయితే... అంతకుముందు వర్షాభావ పరిస్థితుల కారణంగా దిగుబడి మాత్రం తగ్గుతుందని పోచారం పేర్కొన్నారు. సచివాలయంలో శుక్రవారం జిల్లా వ్యవసాయాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పంటల పరిస్థితిని వివరించారు. మహబూబ్‌నగర్, నిజామాబాద్, మెదక్, రంగారెడ్డి జిల్లాల్లో కొంతమేర పంట నష్టం జరిగిందని అంగీకరించారు. ప్రత్యామ్నాయంగా సబ్సిడీ విత్తనం ఎంత అవసరమో గ్రామాల వారీగా వివరాలు ఇవ్వాల్సిందిగా కోరామన్నారు. రైతుల నుంచి వడ్డీ వసూలు చేయకూడదని బ్యాంకులు కిందిస్థాయి వరకు ఆదేశాలు ఇచ్చాయన్నారు. ఈ ఏడాది పంట నష్టపోయిన రైతులకు పరిహారం ఇచ్చే విషయంపై ప్రతిపాదనలు సిద్ధంగా ఉన్నాయన్నారు. లక్ష మంది డ్వాక్రా మహిళలకు రెండు గేదెలు ఇవ్వాలని నిర్ణయించామన్నారు. అక్టోబర్ 27 నుంచి జాతీయ విత్తన సభ... అక్టోబర్ 27 నుంచి 29వ తేదీ వరకు హైదరాబాద్ హెచ్ఐసీసీలో జాతీయ విత్తనసభ జరుగనుందని పోచారం వెల్లడించారు. దీనికి దేశవ్యాప్తంగా విత్తన కంపెనీలు, శాస్త్రవేత్తలు, విత్తన రైతులు, విత్తన రూపకర్తలు 600 మంది వరకు హాజరవుతారని చెప్పారు. -
అమ్మ బాధను చూసి తట్టుకోలేకపోయా!
- అనారోగ్యంతో బాధపడేవారికి పాలియేటీవ్ కేర్ గొప్ప వరం - పాలియేటీవ్ కేర్ సదస్సులో సినీనటుడు నాగార్జున సాక్షి, హైదరాబాద్: ‘అమ్మ అనారోగ్యానికి గురైనప్పుడు ఆమె పడుతున్న బాధను చూసి నేను తట్టుకోలేక పోయాను. అప్పుడు పెయిన్ అండ్ పాలియేటీవ్ కేర్ గురించి మాకు తెలియలేదు. దీంతో ఆమెకు ఈ సర్వీసును అందించలేకపోయాం. నాన్నకు అరోగ్యం క్షీణించిన తరువాత డాక్టర్ సలహా మేరకు ఈ పద్ధతిని అనుసరించాం. దీంతో ఆయన తుదిశ్వాస విడిచేవరకు నొప్పి తెలియకుండానే సంతోషంగా గడిపారు.’అని సినీనటుడు అక్కినేని నాగార్జున చెప్పారు. ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ పాలియేటీవ్ కేర్ 22వ అంతర్జాతీయ సదస్సు హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీలో శుక్రవారం ప్రారంభమైంది. సదస్సుకు దేశవిదేశాల నుంచి సుమారు 600 మంది ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనారోగ్యంతో బాధపడుతూ ఆఖరిదశలో ఉన్నవారి పాలిట ఈ పాలియేటీవ్ కేర్ చికిత్స ఓ గొప్ప వరం లాంటిదని కొనియాడారు. ఈ చికిత్సపై ప్రజల్లో విస్తృతమైన అవగాహన కల్పించాలని సూచించారు. ఆరోగ్యం, కుటుంబ సంక్షేమశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ చందా మాట్లాడుతూ పాలియేటీవ్ కేర్ సెంటర్లకు నొప్పి నివారణ మందులను అందించాలని కోరారు. దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్నవారితోపాటు కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్ ఇవ్వడం ద్వారా సుఖమయమైన జీవితాన్ని ప్రసాదించవచ్చన్నారు. సదస్సులో ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ పాలేటీవ్ కేర్ అధ్యక్షుడు డాక్టర్ నాగేశ్ సింహ, హైదరాబాద్ ఐఏపీసీ అధ్యక్షులు డాక్టర్ మంజుల, ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ గాయత్రి తదితరులు పాల్గొన్నారు. -
రాక్‌బ్యాండ్
సాఫ్ట్వేర్ నిపుణులు సల్సాకు సలాం చేశారు. యాప్స్ ట్రెండ్ సెట్ చేసే టెకీలు... రాక్‌బ్యాండ్ బజాయించారు. మాదాపూర్‌లోని హెచ్ఐసీసీలో నిర్వహించిన ఫ్యాక్ట్‌సెట్ యాన్యువల్ డే ఐటీ ఉద్యోగుల మల్టీ టాలెంట్‌కి ఐడెంటిటీగా నిలిచింది. ఈ డిఫరెంట్ కల్చరల్ ఈవెంట్... సాంగ్స్, డ్యాన్స్, మ్యూజిక్, ఫ్యాషన్... ఇలా విభిన్న రకాల ‘షో’లకు వేదికైంది. హుదూద్ తుఫాను బాధితులకు చేయూత అనే మానవతా కోణాన్ని నేపథ్యంగా తీసుకుని సాగిన ఈ షోలో బాలీవుడ్ సింగర్లు సందీప్ హల్దిపుర్,అంబిలి మీనన్‌లు ప్రధాన ఆకర్షణగా నిలిచారు. -
లైట్ అండ్ షేడ్స్
రంగురంగుల ఎల్ఈడీ లైట్లలో మాదాపూర్ హెచ్ఐసీసీ వెలుగులు విరజిమ్మింది. ఇక్కడ మంగళవారం ప్రారంభమైన ఇండియన్ సొసైటీ ఆఫ్ లైటింగ్ ఇంజనీర్స్ ఎగ్జిబిషన్ విభిన్నంగా ఉంది. గృహ, పారిశ్రామిక అవసరాలకు ఉపయోగించే లైటింగ్ పోల్స్, సోలార్ లైటింగ్ సిస్టమ్, ఆర్కిటెక్చరల్ లైటింగ్, ఫ్లడ్ లైట్స్, డౌన్ లైట్స్ వంటివెన్నో వెరైటీలు దాదాపు వంద స్టాల్స్‌లో కాంతులీనుతున్నాయి. జపాన్ టెక్నాలజీతో రూపొందిన ఈ లైట్స్ వల్ల కరెంటు ఆదాతో పాటు ఎక్కువ కాలం మన్నికగా ఉంటాయని నిర్వాహకులు చెబుతున్నారు. - మాదాపూర్ -
నాలుగు నెలల్లో ఆర్టీసీ విభజన
రవాణామంత్రి మహేందర్‌రెడ్డి వెల్లడి సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర రోడ్డు రవాణ సంస్థ(ఆర్టీసీ)ను నాలుగు నెలల్లోగా విభజిస్తామని రవాణామంత్రి మహేందర్‌రెడ్డి చెప్పారు. శనివారం హెచ్ఐసీసీలో జరిగిన మహిళా పారిశ్రామిక వేత్తల అంతర్జాతీయ సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన ఆయన కొద్దిసేపు విలేకరులతో విడిగా మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో బస్సులు వెళ్లని గ్రామాలు 1300 వరకున్నాయని, త్వరలోనే వాటికి బస్సు సదుపాయం కల్పిస్తామన్నారు. తెలంగాణ ఆర్టీసీ బస్సులు ఆహ్లాదకరంగా కనిపించేలా ప్రత్యేక రంగు వేయించాలని నిర్ణయించామన్నారు. పలు డిజైన్లను ఎంపిక చేశామని, అంతిమనిర్ణయం సీఎం కేసీఆర్ తీసుకోవాల్సి ఉందన్నారు. హైదరాబాద్‌లో పనిచేసే సాఫ్ట్వేర్ ఉద్యోగులకోసం ప్రత్యేకంగా ఏసీ బస్సులను నడపనున్నట్టు మంత్రి చెప్పారు. సొంత కార్ల కన్నా ఆర్టీసీ బస్సుల్లోనే మహిళా ఉద్యోగులకు భద్రత ఉంటుందన్నారు. మరో 20 ఏళ్లు మా ప్రభుత్వమే.. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో ప్రజల మేలు కోసం సీఎం కేసీఆర్ చేస్తున్న ఎన్నో కార్యక్రమాలను చూసే ఇతర పార్టీల నుంచి నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్లోకి వస్తున్నారని ఆయన తెలిపారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో మరో 20ఏళ్లపాటు టీఆర్ఎస్ ప్రభుత్వమే తెలంగాణలో ఉంటుందన్నారు. టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు కొద్దిరోజుల్లోనే ఖాళీ అవుతాయన్నారు. -
ఉల్లాసభరితం..
-
నవంబర్ 29న ‘గులాబీ’ ఫెస్టివల్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో నవంబర్ 29న హైటెక్స్ కన్వెన్షన్ సెంటర్ (హెచ్ఐసీసీ)లో ‘అంతర్జాతీయ గులాబీ పూల ప్రదర్శన’నిర్వహించనున్నారు. తెలంగాణ ప్రభుత్వం, వరల్డ్ ఫెడరేషన్ ఫర్ రోజ్ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో ఈ ప్రదర్శన ఏర్పాటు కానుం ది. ఈ ప్రదర్శన ఏర్పాట్లను సీఎం కె.చంద్రశేఖర్ రావు గురువారం రాష్ట్ర సచివాలయంలో సమీక్షించారు. ప్రపంచ వ్యాప్తంగా మంచి డిమాండ్ ఉన్న కట్ ఫ్లవర్స్‌ను 98 శాతం ఇజ్రాయిల్ దేశమే ఎగుమతి చేస్తున్నదని, తెలంగాణ రాష్ట్రం కూడా పువ్వుల పెంపకానికి అనువైన ప్రాంతమని కేసీఆర్ పేర్కొన్నారు. ఈ ప్రదర్శన ద్వారా గులాబీ పూల పెంపకంపై ప్రజల్లో అవగాహన, ఆసక్తి పెరుగుతుందని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు. రోజ్ సొసైటీ ప్రపంచ ఉపాధ్యక్షుడు, జాతీయ అధ్యక్షుడు అహమ్మద్ ఆలం ఖాన్, వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి, కమిషనర్లు పూనం మాలకొండయ్య, బి.జనార్దన్‌రెడ్డి తదితరులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. అంతర్జాతీయ స్థాయిలో పూల ప్రదర్శనను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయుడం ఇదే ప్రథవుం. ప్రదర్శనకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను కేసీఆర్ ఆదేశించారు. సువూరు 80 దేశాలకు చెందిన ప్రతి నిధులు వివిధ రకాల గులాబీ పూలతో ఈ ప్రదర్శనలో పాల్గొంటా రు. కేవలం పూల ప్రదర్శనే కాకుండా పూల తోటలు సాగు చేసేవారికి అవసరమైన సాంకేతిక శిక్షణ కూడా ఇందులో ఉంటుంది. మేలు రకం సాగు పద్ధతులు, గులాబీ పూల రకాలు, వాటి ప్రత్యేకతలు, మార్కెటింగ్ అవకాశాలు, అధిక దిగుబడికి అనుసరించాల్సిన పద్ధతులు తదితర విషయాలను పరస్పరం పంచుకోవడానికి ఈ ప్రదర్శన వేదిక అవుతుందని కేసీఆర్ పేర్కొన్నారు. -
వచ్చే ఉగాదికి మెట్రో పరుగులు: ఎన్వీఎస్రెడ్డి
మాదాపూర్: నగరంలో మెట్రో రైళ్లు వచ్చే ఉగాదికి (మార్చి 21, 2015) పరుగులు తీయనున్నాయని హైదరాబాద్ మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. మాదాపూర్ హెచ్ఐసీసీలో నిర్వహిస్తున్న ‘ఆగస్ట్ ఫెస్ట్’ ముగింపు కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. ఇందులో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. ప్రపంచంలో 200 మహా నగరాల్లో మెట్రో వ్యవస్థ ఉందని, వాటికి భిన్నంగా హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టును తీర్చి దిద్దుతున్నట్టు చెప్పారు. ఎన్నో అవాంతరాలను అధిగమించినగర మెట్రో రైలు ప్రాజెక్ట్ ప్రపంచంలో మౌలిక వసతుల రంగంలో విశిష్టమైన ‘గ్లోబల్ ఇంజినీరింగ్ ఆఫ్ ద ఇయర్’ అవార్డును సొంతం చేసుకుందని ఆయన గర్తు చేశారు. మెట్రో రైలు ప్రాజెక్ట్ సామాన్య, మధ్య తరగతి, వేతన జీవులును దృష్టిలో పెట్టుకుని రూపకల్పన చేశామన్నారు. స్టేషన్లలో సంగీత విభావరి, ఆర్ట్ ఎగ్జిబిషన్లు నిర్వహించే వీలుంటుందని తెలిపారు. వికలాంగులకు ఇబ్బందులు లేకుండా స్టేషన్లను ఉంటాయన్నారు. అన్ని వేళలా మహిళలు నిర్భయంగా ప్రయాణం చేయవచ్చన్నారు. చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. పెద్ద దేశాలలో కొత్త సంస్థలు నెలకొల్పితేనే ఉద్యోగ అవకాశాలు ఉంటాయని తెలిపారు. కార్యక్రమంలో పర్యావరణ వేత్త సాద్ బిన్ జంగ్, హైదరాబాద్ మెట్రో స్టేషన్ డిజైనర్, ఆర్కిటెక్ సుశీల్‌వర్మ, నిర్వాహకులు రమేశ్ లోకనాథన్ తదితరులు పాల్గొన్నారు. -
ఒకే వేదికపై 2,000 మంది పారిశ్రామికవేత్తలు..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఏడు దేశాలు. రెండు వేల మందికిపైగా పారిశ్రామికవేత్తలు. అందరిదీ ఒకే సంకల్పం. కొత్త ఆలోచనలు (ఐడియా) మొదలుకొని పారిశ్రామికవేత్తలుగా ఎదగడం. నూతన ఆలోచనలు, విస్తరణ, పెట్టుబడి, వ్యాపార అవకాశాలు. ఇవే వారి లక్ష్యాలు. లక్ష్య సాధనకు ఇప్పుడు ఒకే వేదికపైకి రానున్నారు. ద ఇండస్ ఎంట్రప్రెన్యూర్స్(టై) ఆధ్వర్యంలో ఇక్కడి హెచ్ఐసీసీలో డిసెంబర్ 18 నుంచి 20 వరకు టై ఎంట్రప్రెన్యూరియల్ సమ్మిట్-2013 జరగనుంది. ఆసియాలో అతి పెద్దదైన ఈ సదస్సుకు తొలిసారి హైదరాబాద్ వేదికవుతోంది. ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి, హెచ్‌సీఎల్ వ్యవస్థాపకుడు శివ్ నాడార్, మైక్రోసాఫ్ట్ ఇండియా చైర్మన్ భాస్కర్ ప్రామాణిక్, నాసా వ్యోమగామి బెర్నార్డ్ ఆంటోని హ్యారిస్ జూనియర్ తదితరులు కార్యక్రమానికి రానున్నారు. మొత్తం 5,000 మంది సదస్సుకు హాజరవుతారని సదస్సు కో-చైర్ జె.ఏ.చౌదరి సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. -
చిన్న రైతుల పేరు.. పెద్ద కంపెనీల జోరు
-
చిన్న రైతుల పేరు.. పెద్ద కంపెనీల జోరు
చిన్న, సన్నకారు రైతులకుఉపయోగపడే చర్చలు శూన్యం బహుళజాతి కంపెనీల వ్యాపార అభివృద్ధికే చర్చల్లో ప్రాధాన్యం సాక్షి, హైదరాబాద్: చిన్న, సన్నకారు రైతుల పేరిట జరుగుతున్న ప్రపంచ వ్యవసాయ సదస్సులో చర్చలు మాత్రం బహుళజాతి కంపెనీల ప్రయోజనాలను నెరవేర్చుకునే దిశగా కొనసాగుతున్నాయి. రైతులకు సంబంధించిన సమస్యలు, వాటి పరిష్కారాలపై చర్చకు ఇస్తున్న ప్రాధాన్యం నామమాత్రమే. వ్యవసాయ రంగంలో గణనీయంగా మార్పులు రావాలని కోరుతున్న కంపెనీలు.. ఆ మార్పులు కూడా తమ వ్యాపారాభివృద్ధికి అనుగుణంగా ఉండే వాదనలను సదస్సు ద్వారా ప్రచారంలోకి తెస్తున్నాయి. ఈ ప్రచారంలో ప్రభుత్వ అధికారులు, వ్యవసాయ వర్సిటీల శాస్త్రవేత్తలు కూడా పాలుపంచుకుంటున్నారు. నగరంలోని హైటెక్స్‌లో జరుగుతున్న ప్రపంచ వ్యవసాయ సదస్సు తీరును పరిశీలిస్తే.. ఇది రైతుల కంటే బహుళ జాతి కంపెనీల ప్రయోజనాలకే పరిమితం అయిన విషయం ఇట్టే అర్థమవుతుంది. ముఖ్యంగా దేశంలో, మన రాష్ట్రంలోని చిన్న, సన్న కారు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కారం దిశగా చర్చలు జరగడం లేదు. పెపైచ్చు ఈ బడుగు రైతుల ద్వారా కంపెనీలు తమ వ్యాపారాన్ని పెంపొందించుకునే మార్గాన్వేషణ దిశగా చర్చలు సాగుతున్నాయి. బుధవారం ఉదయం డిఎస్ఎం ఇన్నొవేషన్ డెరైక్టర్ మురళి శాస్త్రి ‘జీవ ఆధారిత ఆర్థికవ్యవస్థ అభివద్ధిలో వ్యవసాయరంగం పాత్ర’ అనే అంశంపై చేసిన ప్రసంగమే ఇందుకు ఉదాహరణ. మొక్కజొన్న, జొన్న, వరి వంటి పంటల నూర్పిళ్లు జరిగినప్పుడు వ్యవసాయోత్పత్తులతో పాటు గడ్డి, పొట్టు వంటి ఉప ఉత్పత్తులు కూడా లభిస్తాయి. వీటితో ‘బయో బేస్డ్’ ఉత్పత్తులను తయారు చేయడానికి అవసరమయ్యే యంత్రాలను ప్రభుత్వం ప్రొత్సహించాలని అభిప్రాయపడ్డారు. ఉపన్యాసంలో ఆసాంతమూ ఆయన తమ జీవ ఇంధన కంపెనీ తరఫున ప్రచారానికే ప్రాధాన్యం ఇచ్చారు. జీవ ఇంధన రంగానికి ప్రభుత్వం పోత్సాహకాలిస్తే తాము పెద్దఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధం అన్న ధోరణిలో ఆయన ప్రసంగించారు. చర్చలో పాల్గొన్న మిగతా వారు కూడా అదే విషయాన్ని ‘ఆవు కథ’ మాదిరిగా కొనసాగించారు. తమ కంపెనీల గురించి చెప్పుకోవడం, ఈ రంగంలో కషి చేయడం ద్వారా చిన్న, సన్న కారు రైతులకు ఉపయోగకరంగా ఉంటుందని చివరలో ఓ మాట అనడం మినహా.. క్షేత్ర స్థాయిలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకు అర్థవంతమైన సూచనలు చేసే దిశగా చర్చలు జరగలేదు. అలాగే మంగళవారం జరిగిన చర్చల్లో బేయర్ కంపెనీ సీఈవో లియాం కండోన్, జై న్ ఇరిగేషన్ సీఈవో అనిల్‌జైన్ వంటి వారు కూడా తమ కంపెనీ ఉత్పత్తులకు ప్రాచుర్యం పెంచుకునేందుకు అవసరమైన చర్యలనే ప్రతిపాదించారు. మన దేశంలో ముఖ్యంగా సన్న, చిన్న కారు రైతులు పలు పంటలకు సొంత విత్తనాలనే వాడుకుంటారు లేదా తోటి రైతుల నుంచి దేశవాళీ విత్తనాలు కొంటారు. వీటి ఖర్చు తక్కువగా ఉంటుంది. అయితే, బేయర్ వంటి కంపెనీల ప్రతినిధులు మాత్రం బీటీ (జన్యుమార్పిడి) విత్తనాలను ప్రొత్సహించేలా విధానాలను రూపొందించాలని ప్రభుత్వాన్ని కోరారు. చర్చల్లో, రౌండ్ టేబుల్ సమావేశాల్లో పాల్గొంటున్న ప్రతినిధులు సైతం ఇలాంటి ప్రతిపాదనలే చేస్తున్నారు. అంటే.. చర్చల్లో ఎవరు పాల్గొనాలో కూడా బడా కంపెనీలే ముందే ఎంపిక చేశాయన్నమాట. సదస్సుకు హాజరయిన ప్రతినిధుల్లో వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వ శాఖల ఉద్యోగులు పోగా.. మిగిలిన వారిలో ఎక్కువ మంది బడా కంపెనీల ప్రతినిధులే. 25 మంది రైతు సంఘాల ప్రతినిధులకు ప్రభుత్వం ఆహ్వానం పంపినా దాదాపుగా వారందరూ సదస్సును బహిష్కరించారు. పేలవంగా రెండోరోజు.. ప్రపంచ వ్యవసాయ సదస్సు రెండోరోజు పేలవంగా సాగింది. తొలి రోజు ముఖ్యమంత్రి, ఇతర మంత్రుల హాజరుతో కాస్త హడావుడి కనిపించింది. వివిధ రాష్ట్రాల వ్యవసాయ విశ్వవిద్యాలయాల వైస్ చాన్సలర్లు పాల్గొనడంతో చర్చా గోష్టులు కాస్త అర్థవంతంగా సాగాయి. వ్యవసాయ వర్సిటీ శాస్త్రవేత్తలు, వివిధ వ్యవసాయ అనుబంధ శాఖల ఉద్యోగుల్లో చాలా మంది రెండో రోజు హాజరు కాలేదు. కర్నాటక వ్యవసాయ శాఖ మంత్రి క్రిష్ణ బైరె గౌడ కీలకోపన్యాసం అనంతరం సభ్యులు మరింత పలుచబడ్డారు. పాడి అభివద్ధిపై చర్చఓ మోస్తరుగా సాగింది. ఒకటి, రెండు చర్చాగోష్టులు రద్దయ్యాయి. సదస్సు గురువారంతో ముగుస్తుంది. ‘రైతులకు ఆదాయ భద్రత ద్వారానే ఆహార భద్రత’ రైతులకు స్థిరమైన ఆదాయం వచ్చే పరిస్థితులు కల్పించినప్పుడే ఆహార భద్రత సాధ్యమవుతుందని బెరైగౌడ అభిప్రాయపడ్డారు. సదస్సులో రెండో రోజు ఆయన ప్రధాన వక్తగా పాల్గొన్నారు. రాష్ట్ర పశుసంవర్ధక శాఖ డెరైక్టర్ డి. వెంకటేశ్వర్లు, కేంద్రీయ మెట్ట వ్యవసాయ పరిశోధనా కేంద్రం డెరైక్టర్ బి. వెంకటేశ్వర్లు కూడా ప్రసంగించారు. -
యువతను పల్లెకు మళ్లించాలి: సీఎం కిరణ్
‘స్వాతంత్య్రానికి పూర్వం చదువుకున్నవారు ఉద్యోగాల వైపు కాకుండా వ్యవసాయం వైపే మొగ్గు చూపేవారు. ఒకరి కింద పనిచేయాల్సిన అవసరం లేని స్వతంత్రత, గౌరవం, గిట్టుబాటు వ్యవసాయంలో ఉండేవి. కానీ ఇప్పుడు పరిస్థితి తలకిందులైంది. పదో తరగతి చదువుకున్నవారు కూడా వేరే వృత్తుల్లో అవకాశాల కోసం పరుగులు తీస్తున్నారు కానీ వ్యవసాయం చేయాలనుకోవడం లేదు. ఈ పరిస్థితి మారాలి. ప్రపంచ వ్యవసాయ సదస్సులోని చర్చలు యువత పల్లెలకు వెళ్లి వ్యవసాయం చేసేందుకు దోహదం చేయాలి’ అని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్ హెచ్ఐసీసీలో జరుగుతున్న ప్రపంచ వ్యవసాయ సదస్సులో మంగళవారం సీఎం ప్రసంగించారు. ప్రస్తుతం రాష్ట్రంలో, దేశంలో వ్యవసాయ పురోభివృద్ధికి ‘చిన్న కమతాలు’ పెద్ద సవాలుగా మారాయన్నారు. ఇదే సమయంలో సాగు ఖర్చులు బాగా పెరిగాయని చెప్పారు. ప్రభుత్వాలు కూడా రైతుకు కనీస మద్దతు ధర గురించే అలోచిస్తున్నాయి కానీ గిట్టుబాటు ధర గురించి ఆలోచించే పరిస్థితి లేదన్నారు. రైతు తన సరకును పూర్తిగా మార్కెట్ చేసుకోగల్గుతున్నాడా? గిట్టుబాటు ధర పొందుతున్నాడా? ధాన్యం నిల్వ గోదాముల సమస్య ఎలా ఉంది? ఫుడ్ ప్రాసెసింగ్ ద్వారా రైతు తన ఉత్పత్తులకు అదనపు విలువను జోడించడం ఎలా? అనే సమస్యలపై సదస్సు చర్చలు నిర్వహించి సలహాలు, సూచనలను ఇవ్వాలని కోరారు. ప్రతినిధులకు విందు వ్యవసాయ సదస్సులో పాల్గొనడానికి వచ్చిన ప్రతినిధులకు సీఎం మంగళవారం రాత్రి విందును ఏర్పాటు చేశారు. శిల్పారామంలో జరిగిన ఈ కార్యక్రమానికి వేదిక ప్రతినిధులతో పాటు శాసనమండలి చైర్మన్ చక్రపాణి, మంత్రులు కన్నా లక్ష్మీనారాయణ, జానారెడ్డి, టీజీ వెంకటేశ్, కాసు వెంకట కృష్ణారెడ్డి, రాంరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు హాజరయ్యారు. భాగస్వామ్యంతోనే అభివృద్ధి:జేమ్స్ బోల్గర్ పెరుగుతున్న జనాభా, ప్రతికూల వాతావరణ మార్పుల నేపథ్యంలో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతోనే వ్యవసాయంలో సవాళ్లను అధిగమించగలమని ‘వరల్డ్ అగ్రికల్చర్ ఫోరం’(డబ్ల్యుఏఎఫ్) సలహా సంఘం అధ్యక్షులు, న్యూజీలాండ్ మాజీ ప్రధాని జేమ్స్ బోల్గర్ పేర్కొన్నారు. ఆయన మంగళవారం ‘ప్రపంచ వ్యవసాయ సదస్సు-2013’ ప్రారంభోపన్యాసం చేశారు. జన్యుమార్పిడి పంటలపై శాస్త్రీయ దృక్పథం అవసరమని, వాటిని గుడ్డిగా వ్యతిరేకించవద్దని కేంద్ర వ్యవసాయ శాఖ సహాయమంత్రి తారిఖ్ అన్వర్ అన్నారు. కాగా కొత్త టెక్నాలజీని వినియోగించుకోకుండా వ్యవసాయ రంగంలో అభివృద్ధి సాధించలేమని ‘బేయర్’ కంపెనీ సీఈవో లియామ్ కండన్ పేర్కొన్నారు. సదస్సులో ‘ద ఛాలెంజ్ ఆఫ్ ఫీడింగ్ 10 బిలియన్ పీపుల్- వై వియ్ నీడ్ న్యూ రెవల్యూషన్ ఇన్ అగ్రికల్చర్’ అన్న అంశంపై ఆయన మాట్లాడారు. ‘గ్రీనింగ్ అగ్రికల్చర్ టు వర్డ్స్ ఎవర్గ్రీన్ ఎకానమీ’ అన్న అంశంపై ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ మాజీ డెరైక్టర్ ఆర్పీసింగ్ మాట్లాడు తూ.. దేశంలో వృద్ధిరేటు పెరుగుదలతోపాటు దారిద్య్రమూ పెరుగుతోందన్నారు. దేశంలో ఒక హెక్టారుకన్నా తక్కువ భూమి ఉన్నవారు 86 మిలియన్ల మంది ఉన్నారన్నారు. వీరి భాగస్వామ్యం తోనే వ్యవసాయంలో నూతన పోకడల అమలు సాధ్యమవుతుందన్నారు. చిన్న, సన్నకారు రైతుల్ని ఆదుకోవడానికి ప్రభుత్వాలు రూపొం దించిన విధానాలు విఫలమయ్యాయని భారత క్రిషక్ సమాజ్ చైర్మన్ అజయ్ జాకర్ అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు, ప్రైవేట్ సంస్థలు క్షేత్ర స్థాయిలో వాస్తవ పరిస్థితి అంచనా వేసి అందుకనుగుణంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. వైఎస్సార్సీపీ నేత నాగిరెడ్డిని అడ్డుకున్న పోలీసులు ప్రపంచ వ్యవసాయ సదస్సులో రైతులకు భాగస్వామ్యం కల్పించనందుకు పాలకుల తీరును ప్రశ్నించిన పాపానికి వైఎస్సార్సీపీ వ్యవసాయ విభాగం కన్వీనర్ ఎంవీఎస్ నాగిరెడ్డిని సదస్సులో పాల్గొనేందుకు అనుమతించలేదు. సదస్సు ప్రతినిధిగా సోమవారమే ఆయన తన పేరు నమోదు చేసుకున్నప్పటికీ పోలీసులు అడ్డుకున్నారు. మంగళవారం సదస్సుకు హాజరయ్యేందుకు వెళ్లగా, కిలోమీటరు దూరంలోనే ఆపేశారు. తొలుత కారు పాస్ లేదని అభ్యంతరం చెప్పారు. కారు పాస్ తెప్పించుకున్నాక కూడా అనుమతించలేదు. దీంతో నాగిరెడ్డి సదస్సులో పాల్గొనకుండానే వెనుదిరిగారు. సోమవారం జిల్లాల నుంచి వచ్చిన రైతులకు సభ్యత్వ రుసుం లేకుండా అనుమతించాలని వ్యవసాయ మంత్రి కన్నా లక్ష్మీనారాయణను నాగిరెడ్డి డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో మంగళవారం నాగిరెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. మంత్రి ఆదేశాల మేరకే తన ను అడ్డుకున్నారని నాగిరెడ్డి ఆరోపించారు. బహుళజాతి సంస్థల మేలు కోసమే: రైతు సంఘాల విమర్శ ప్రభుత్వ మద్దతుతో జరుగుతున్న వ్యవసాయ సదస్సు వల్ల బహుళజాతి సంస్థలకే మేలు జరుగుతుందని రైతు సంఘాల ప్రతినిధులు విమర్శించారు. తమ ఉత్పత్తుల అమ్మకాలను పెంచుకునేందుకే బహుళజాతి సంస్థలు ఇలాంటి వేదికలను సృష్టించాయన్నారు. కోదండరెడ్డి (కిసాన్ కాంగ్రెస్), పశ్యపద్మ (రైతుసంఘం), ఎన్.వెంకటేశ్వర్లు (తెలుగురైతు), ఎస్.మల్లారెడ్డి (రైతుసంఘం), గొల్లమారి శౌరి (భారతీయ కిసాన్ మోర్చా), విస్సా కిరణ్‌కుమార్ (రైతు స్వరాజ్య వేదిక), రామాంజనేయులు (రైతు స్వరాజ్యవేదిక) తదితరులు ఈ సదస్సుకు వ్యతిరేకంగా రూపొందించిన కరపత్రాన్ని విడుదల చేశారు.