నేటి నుంచి బయో ఏషియా సదస్సు | bioasia-2017 conference to be held at HICC | Sakshi
Sakshi News home page

నేటి నుంచి బయో ఏషియా సదస్సు

Published Mon, Feb 6 2017 2:14 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

నేటి నుంచి బయో ఏషియా సదస్సు - Sakshi

నేటి నుంచి బయో ఏషియా సదస్సు

ప్రారంభించనున్న గవర్నర్‌ నరసింహన్‌  
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా బయో ఏషియా – 2017 సదస్సుకు ఏర్పాట్లు చేస్తోంది. హెచ్‌ఐసీసీలో సోమవారం నుంచి 8వ తేదీ వరకు జరిగే ఈ సదస్సులో ఆరోగ్యం, ఫార్మా తదితర రంగాల్లో జరుగుతున్న అభివృద్ధిని చర్చిస్తారు. ఈ కార్యక్రమాన్ని గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ ప్రారంభిస్తారని నిర్వాహకులు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. 50 దేశాలకు చెందిన 1,500 మంది ప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరవుతారు. ప్రారంభ కార్యక్రమం సందర్భంగా నోబెల్‌ బహుమతి గ్రహీత ప్రొఫెసర్‌ కుర్త్‌ ఉత్రిచంద్, డాక్టర్‌ పాల్‌ స్టోఫెల్స్‌లకు జీనోమ్‌వ్యాలీ ఎక్స్‌లెన్సీ అవార్డును గవర్నర్‌ అందజేస్తారు. అంతకుముందు షామీర్‌పేటలోని జీనోమ్‌వ్యాలీలో కొన్ని ప్రాజెక్టులను రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కె.తారకరామారావు ఆవిష్కరిస్తారు.

కేంద్ర ప్రభుత్వానికి చెందిన నేషనల్‌ యానిమల్‌ రిసోర్స్‌ ఫెసిలిటీ ఫర్‌ బయో మెడికల్‌ రీసెర్చ్‌ తమ లేబరేటరీని జీనోమ్‌వ్యాలీలో నెలకొల్పనుంది.  ఈ రీసెర్చ్‌ ప్రాజెక్టు శంకుస్థాపన కార్యక్రమాన్ని వచ్చే నెల నిర్వహించనున్నారు. దీనికి ప్రధాని మోదీని ఆహ్వానించాలని నిర్ణయించారు. ఈ ప్రాజెక్టు కోసం రాష్ట్ర ప్రభుత్వం 100 ఎకరాలు కేటాయించింది. మొదటి విడతలో కేంద్రం రూ. 350 కోట్లు ఖర్చు చేయనుంది. ఈ సదస్సుకు ఫార్మాసూటికల్స్‌ అంతర్జాతీయ చైర్మన్‌ డాక్టర్‌ పాల్‌ స్టోఫెల్స్‌ కీలకోపన్యాసం చేస్తారు. ఇక్కడ నిర్వహించే ఎగ్జిబిషన్‌లో 100 స్టాళ్లను ఏర్పాటు చేస్తారు. ఆరోగ్యం, లైఫ్‌ సైన్సెస్‌ ఉత్పత్తులను ప్రదర్శిస్తారు. హెల్త్‌కేర్‌ స్టార్టప్‌లనూ ఏర్పాటు చేసి డయాగ్నోస్టిక్‌ మొబైల్‌ యాప్, రోగుల ఆరోగ్య రికార్డుల నిర్వహణ, త్రీడీ బయో ప్రింటింగ్‌లను ప్రదర్శిస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement