
సాక్షి, హైదరాబాద్ : జీఈ సదస్సు 2017 ప్రారంభానికి ముందు ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడి సలహాదారు ఇవాంక ట్రంప్ భేటీ అయ్యారు. ఈ భేటీకి ఇరుదేశాల విదేశాంగ ప్రతినిధులు కూడా హాజయ్యారు. తమ బృందంలోని సభ్యులను ఈ సందర్భంగా ఆమె మోదీకి పరిచయం చేశారు. భారత్‌తో ద్వైపాక్షిక ఒప్పందాలు, పెట్టుబడి అవకాశాలపై వీరిద్దరూ చర్చించినట్లు తెలుస్తోంది. అంతకు ముందు విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌తో ఇవాంకతో భేటీ అయ్యారు. మహిళా సాధికారికతపైనే వీరిద్దరు చర్చించినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది.