GES2017
-
భారత పర్యటనపై ఇవాంక మరో ట్వీట్
అమెరికా అధ్యక్షుని సలహాదారు, డోనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంక ట్రంప్ మరోసారి భారతీయులను కొనియాడారు. నవంబర్‌లో మూడురోజుల పాటు హైదరాబాద్‌లో ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు( GES 2017) జరిగిన విషయం తెలిసిందే. ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఈ సదస్సులో ఇవాంక విశిష్ట అతిథిగా పాల్గొన్నారు. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ.. జీఈఎస్ సదస్సులో పాల్గొనడం గర్వకారణమని ఇవాంక ట్వీట్ చేశారు. ' ప్రపంచ వ్యాప్తంగా 1200 మంది ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు, అందులో 350 అమెరికా ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొన్నారు. వివిధ దేశాల నుంచి అతిధులకు అద్భుతమైన ఆతిథ్యం ఇచ్చిన భారత ప్రజలకు, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ధన్యవాదాలు' అని ఆమె ట్విట్టర్ లో పేర్కొన్నారు. అంతేకాకుండా ట్వీట్ లో ఇవాంక 'ధన్యవాద్' అని ప్రత్యేకంగా హిందీపదం చేర్చడం విశేషం. పారిశ్రామికవేత్తల సదస్సు (జీఈఎస్)లో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన ఇవాంక ఇక్కడ రెండురోజులు గడిపారు. హెచ్ఐసీసీలో జరిగిన జీఈఎస్ సదస్సులో పాల్గొనడంతో పాటు.. ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ఇచ్చిన విందుకు హాజరై.. నగరంలోని చారిత్రక గోల్కొండ కోటను సందర్శించారు. జీఈఎస్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ఇవాంక తన పర్యటనపై సంతృప్తి వ్యక్తం చేస్తూ అమెరికా వెళ్లాక ట్వీట్ చేశారు. హైదరాబాద్ నుంచి తిరిగి బయలుదేరే ముందు అమెరికా ప్రతినిధులతో కలిసి గోల్కొండ కోటను సందర్శించాను. అద్భుతమైన ఈ పర్యటనకు పరిపూర్ణ ముగింపు ఇది (ద పర్ఫెక్ట్ ఎండ్ టు ఏ రిమార్కబుల్ విజిట్)’ అని ఇవాంక ట్విట్టర్లో తెలిపిన విషయం తెలిసిందే. అయితే జీఈఎస్ ముగిసిన 15 రోజులు తర్వాత కూడా ఇవాంక భారత పర్యటనను గుర్తు చేసుకోవడం విశేషం. కాగా, ఇవాంక చేసిన ట్వీట్‌ను ఎక్కువ మంది షేర్ చేయడమే కాకుండా రీ ట్వీట్లు చేశారు. It was an honor to participate in @GES2017 in Hyderabad, India with 1,200 brilliant and passionate entrepreneurs from around the world, including our delegation of 350 Americans! Thank you Prime Minister Modi and the people of India for the warm hospitality. धन्यवाद! #GES2017 pic.twitter.com/3pbKylMaeQ — Ivanka Trump (@IvankaTrump) December 12, 2017 -
భారతీయులకు ధన్యవాదాలు: ఇవాంక
-
పేదలుంటే పెట్టుబడులు రావా?
మెట్రో పనులైనా, పోలవరం ప్రాజెక్ట్ పనులైనా డాక్టర్ వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే మొదలయ్యాయన్న వాస్తవం ఎట్లా మరచిపోతారు? రాజకీయ పార్టీలు వస్తాయి, పోతాయి. ప్రభుత్వాలు కొనసాగుతూనే ఉంటాయి. ఒక కల సాకారమైన సమయంలో మేము అధికారంలో ఉన్నాం కాబట్టి అది మా గొప్పే అనుకుంటే ఎట్లా? మరింత ఆలస్యం జరగకుండా ఆ మిగిలిన పనులు సత్వరం పూర్తి అయ్యేటట్టు చూసి మెట్రోను పరుగులు పెట్టిస్తే కార్పొరేషన్లో గెలిపించినందుకు వారి రుణం తీర్చుకున్నట్టయినా ఉంటుంది. ప్రపంచ ఔత్సాహిక పారిశ్రామికవేత్తల శిఖరాగ్ర సభలు (గ్లోబల్ ఎంట్రప్రెన్యూర్షిప్ సమ్మిట్–జీఈఎస్) ముగిశాయి. హైదరాబాద్ సౌందర్యానికీ, తెలంగాణ ప్రభుత్వ ఆతిథ్యానికీ విదేశీ ప్రతినిధులంతా మురిసిపోయారు. ఆ జ్ఞాపకాలను మూటగట్టుకుని తిరిగివెళ్లారు. ఏ మహా నగరానికైనా కొంచెం మరమ్మతు కావాలనుకుంటే అప్పుడప్పుడు ఇటువంటి ప్రపంచ స్థాయి సంబ రాలు అవసరమే. ఇప్పుడు జరిగింది పెట్టుబడులను ఆకర్షించడానికి ఉద్దేశించిన సదస్సు కాదు. దీని కారణంగా నూతన తెలంగాణ రాష్ట్రానికి కొత్తగా పెట్టుబడులు వచ్చిపడవు కూడా. ఆయా దేశాలకు చెందిన ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఒకరి అనుభవాల నుంచి మరొకరు నేర్చుకుని, తాము లాభం పొందేందుకు అవకాశం కలిగించే వేదికగా ఈ సదస్సును నిర్దేశించారు. ఏదయితే ఏమి, ఎనిమిదవ జీఈఎస్‌కు దక్షిణ ఆసియా ఖండంలోనే మొట్టమొదటిసారిగా హైదరాబాద్ వేదిక కావడం తెలంగాణ వాసులందరికీ సంతోషం కలిగించే విషయమే. ఇది అమెరికన్ ప్రభుత్వం భారత ప్రభుత్వంతో కలసి ఏర్పాటు చేసిన సదస్సు. ఈ మూడురోజుల సదస్సు ఏర్పాట్లకు తెలంగాణ ప్రభుత్వం కూడా కొంత బాధ్యత వహించవలసి రావడం అనివార్యం. అందునా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సలహాదారు, ఆయన కూతురు ఇవాంక ముఖ్య అతిథిగా హాజరైన సభలకు మనం హైదరాబాద్‌ను వీలయినంత అందంగా తయారు చెయ్యడం అవసరమే. ఇవాంక పర్యటించే అవకాశం ఉన్న ప్రాంతాలను మరింత అందంగా తీర్చిదిద్దడానికి రాష్ట్ర ప్రభుత్వం గట్టి ప్రయత్నమే చేసింది. బిచ్చగాళ్లందరినీ ఆ మూడురోజులూ ఎవరికంటా, ముఖ్యంగా ఇవాంక తదితర విదేశీ అతిథుల కంట పడకుండా దాచెయ్యగలిగాం. నగరాన్ని సుందరంగా అలంకరించాం. ఈ సభలు ఆశించిన ఫలితాలు సాధిం చాయా లేదా అన్నది ముందు ముందు తెలుస్తుందేమో కానీ తక్షణ ఫలితం, అందునా తెలంగాణ రాష్ట్రానికి ఒనగూడింది మాత్రం మన రాష్ట్ర యువ మంత్రి కేటీ రామారావుకు అమెరికా సందర్శన కోసం స్వయంగా ఇవాంక నుంచి ఆహ్వానం అందడం. సదస్సులో ఒక గోష్టికి ఆయన సంధానకర్తగా వ్యవహరించి అందరి చేతా శభాష్ అనిపించుకోవడం. ఐటీ అంటేనే ఇవాంకా ట్రంప్ అని మన యువ ఐటీ మంత్రిగారు కొత్త నిర్వచనం చెప్పిన తరువాత అమెరికా సందర్శనకు ఆయనకు ఆ మాత్రం ఆహ్వానం రాకుండా ఎట్లా ఉంటుంది? ఈ సదస్సు వల్ల తెలంగాణ రాష్ట్రానికి ఇంతకు మించి ఏమైనా లాభం జరిగి ఉంటే ప్రభుత్వం వారో, ఈ రంగంలో నైపుణ్యం కలవారో చెప్తే అర్థం చేసుకుని రాష్ట్ర ప్రజలు కూడా ఆనందిస్తారు. చాలాకాలం బ్రిటిష్ వారి ఏలుబడిలో ఉన్నందుకేనేమో మనలో ఇంకా బానిస మనస్తత్వం అంతరించలేదు. అతిథి మర్యాదలకు లోటు చెయ్యని సంస్కారం, సంప్రదాయం మన సొంతమైనా ఆ అతి«థి మర్యాదలు అతిగా మారి మన బానిసత్వ లక్షణాలను బయట పెడుతుంటాయి. మొన్న ముగి సిన ఈ అంతర్జాతీయ సదస్సులో అమెరికా అధ్యక్షుడి కూతురికి మనం చేసిన మర్యాదలు ఆ కోవలోకే వస్తాయి. పేదరికాన్ని దాచగలిగామా! సరే, సభలు ముగిశాయి. మన పేదరికాన్ని దాచిపెట్టడానికి చేసిన ప్రయత్నంలో భాగంగా మాయమైన బిచ్చగాళ్లు ఎక్కడున్నారో వెతుక్కోవాలి ఇప్పుడు. బహుశా ఇప్పటికే మళ్లీ రోడ్ల మీదకు వచ్చేసి ఉంటారు. విదేశీ అతి థుల ముందు మన పేదరికాన్ని తాత్కాలికంగా దాచిపెట్టుకునే ప్రయత్నానికి బదులు దాన్ని నిర్మూలించేందుకు కృషి చేస్తే ఎవరైనా ప్రభుత్వాన్ని మెచ్చుకుంటారు. అది జరగదు. మన ప్రయత్నాలు బిచ్చగాళ్లను నిర్మూలిం చడం కాకుండా, భిక్షాటనను నిర్మూలించే దిశగా సాగాలి. చివరి మనిషి కూడా పేదరికం నుంచి బయటపడ్డ నాడు బంగారు తెలంగాణ సాధించామని చెబితే ఆ ప్రభుత్వాలు చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతాయి. హైదరాబాద్ నగరంలో భిక్షాటన ఒక వ్యాపారంగా మారిందని, దిక్కూ మొక్కూ లేనివాళ్లను, ఎందరో పసివాళ్లను తెచ్చి రోజంతా రోడ్ల మీద అడుక్కునేటట్టు చేసి, వాళ్లు సంపాదించినదంతా దోచుకుపోతున్న ఒక మాఫియా పని చేస్తున్న విషయం ప్రభుత్వం దృష్టికి రాలేదంటే ఆశ్చర్యమే. అద్భుతంగా పని చేసిందని అమెరికా పోలీసుల ప్రశంసలు అందుకున్న హైదరాబాద్ పోలీసుల దృష్టి ఇటువంటి నేర సామ్రాజ్యాల మీద పడకపోవడాన్ని ఎట్లా చూడాలి? పోలీసులు అత్యుత్సాహం కొలువుల కొట్లాట కోసం కలిసి మాట్లాడుకుంటామని కోర్టుల అనుమతి కూడా పొందిన వారిని సభలకు పోకుండా అడ్డుకోవడానికి అరెస్టులు చెయ్యడం, తోటి విద్యార్థి ఆత్మహత్య చేసుకుంటే ఆవేదన చెందుతున్న యువకులను ఉస్మానియా హాస్టల్ గదుల తలుపులు బద్దలు కొట్టుకుని వెళ్లి చావగొట్టి అరెస్టులు చెయ్యడం, కవరేజీకి పోయిన విలేకరులను అరెస్ట్ చేసి ఠాణాలో గంటల తరబడి కూర్చోబెట్టడం వంటి పనుల్లో తీరిక లేకుండా ఉన్న మన పోలీసులకు రోడ్ల మీద అడుక్కునే వాళ్ల వెనుక ఉన్న మాఫియాను పసిగట్టే సమయం ఎక్కడుంది? ఇవాంక పర్యటన తరువాత అయినా మన ప్రభుత్వం, పోలీసు పెద్దలూ ఈ మాఫియాను ఛేదించి, ఆ పేదలకు విముక్తి కలి గించి పునరావాసం కల్పించే ఆలోచన చేస్తే బాగుంటుంది. పేదరికాన్ని పారదోలుతాం, రాష్ట్రాన్ని బంగారం చేస్తామని పదే పదే ప్రకటించుకునే పాలకులు ఈ వైపు ఆలోచించాలి. అదెట్లా కుదురుతుంది? భిక్షాటన నిర్మూలిం చడం అయ్యే పనేనా అని ఎవరయినా అంటే మన ప్రభుత్వంలోనే ప్రస్తుతం కార్యదర్శి స్థాయిలో పనిచేస్తున్న ఐఏఎస్ అధికారి బుర్రా వెంకటేశం సలహా తీసుకోవచ్చు. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెదక్ జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన రోజుల్లో స్వచ్ఛంద సంస్థలు, దాతల సహాయం తీసుకుని ఎక్కడికక్కడ షెల్టర్లు ఏర్పాటు చేసి రోడ్ల మీద బిచ్చగాళ్లు కనిపించకుండా చేశారు. అన్ని జిల్లాల్లో ఇటువంటి ప్రయత్నం జరగాలి. జిల్లాల అధికారులకు వదిలేయకుండా ప్రభుత్వమే తన పాలనలో భాగంగా గట్టి నిర్ణయాలు చేస్తే తప్ప ఇటువంటివి సాధ్యం కావు. ఒక్క మనిషి ఆకలితో అలమటిస్తున్నా, ఒక్క మనిషికి శరీరం నిండా కప్పుకోడానికి బట్టలు లేకపోయినా అది సంక్షేమ రాజ్యం అనిపించుకోదు. ఈ నెలలోనే భాషను ఉద్ధరించేందుకు ప్రభుత్వం తలపెట్టిన ప్రపంచ తెలుగు మహాసభలకు కూడా చాలామంది విదేశీ ప్రతినిధులు వస్తున్నట్టున్నారు. మన ప్రతిష్ట నిలుపుకోడానికి మళ్లీ మన వీధుల్లో బిచ్చగాళ్లు మాయమవుతారేమో!అంతర్జాతీయ స్థాయిలో మనకు ప్రతిష్ట తెచ్చే సభలు, మన భాష ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పే సమావేశాలు ప్రభుత్వాలు పూనుకుని నిర్వహించడం తప్పుకాదు. మానవీయ కోణం లోపించిన ఇటువంటి కార్యక్రమాలన్నీ సువాసన లేని ప్లాస్టిక్ పువ్వుల వంటివే. ఇంతకీ మెట్రో ఘనత ఎవరిది? జీఈఎస్ సభల పుణ్యమా అని హైదరాబాద్ మెట్రో రైల్ 30 కిలోమీటర్ల పరుగుకూడా ప్రారంభం అయింది. అంతర్జాతీయ సభలకు హైదరాబాద్ వచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటనను ఉపయోగించుకుని తెలంగాణ ప్రభుత్వం మియాపూర్ నుంచి నాగోల్ దాకా మొదటి దశ మెట్రో రైల్ సౌకర్యాన్ని ఆయన చేత ప్రారంభింప చేసింది. ఈ ప్రాజెక్ట్ పూర్తి కావడంలో తీవ్రమైన జాప్యానికీ, వేల కోట్ల అదనపు వ్యయానికీ కారణమైన తెలంగాణ రాష్ట్ర సమితి, దాని నాయకుడు చంద్రశేఖరరావు ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న కారణంగా ఆ ఘనత తమదేనని చెప్పుకోవడం హాస్యాస్పదం. మెట్రో రైల్ మార్గం శాసనసభ ముందు నుంచి పోతే ఆ భవన సముదాయం అందం పోతుందన్న ఉద్యమకారుడు చంద్రశేఖరరావు ముఖ్యమంత్రిగా ఇప్పుడు మెట్రో రైల్ కల సాకారం చేసిన ఘనత తనకే దక్కాలంటున్నారు. సుల్తాన్‌బజార్ మీదుగా మెట్రో వెళితే రక్తాలు పారుతాయన్న ఉద్యమకారుడు కేసీఆర్ ఇప్పుడు ముఖ్యమంత్రిగా తాము తెలంగాణలో అధికారంలోకి వచ్చినందునే అది సాధ్యపడిందని అంటున్నారు. ఇక్కడ మెట్రో పనులైనా, ఆంధ్రప్రదేశ్‌లో పోలవరం ప్రాజెక్ట్ పనులైనా డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే మొదలయ్యాయన్న వాస్తవం ఎవరైనా ఎట్లా మరచిపోతారు? రాజకీయ పార్టీలు వస్తాయి, పోతాయి. ప్రభుత్వాలు కొనసాగుతూనే ఉంటాయి. ఒక కల సాకారమైన సమయంలో మేము అధికారంలో ఉన్నాం కాబట్టి అది మా గొప్పే అనుకుంటే ఎట్లా? మరింత ఆలస్యం జరగకుండా ఆ మిగిలిన మార్గాల్లో కూడా పనులు సత్వరం పూర్తి అయ్యేటట్టు చూసి మెట్రోను పరుగులు పెట్టిస్తే హైదరాబాద్ నగరవాసులు కార్పొరేషన్లో 99 సీట్లలో గెలిపించినందుకు వారి రుణం తీర్చుకున్నట్టయినా ఉంటుంది. కొంచెం రాజకీయ సందడి ఈ సందడిలో కొంచెం రాజకీయం కూడా నడిచింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నగర పర్యటన సందర్భంగా బేగంపేట విమానాశ్రయంలో భారతీయ జనతా పార్టీశ్రేణులను ఉద్దేశించి కొద్దిసేపు మాట్లాడారు. అక్కడ ఆయన హైదరాబాద్‌ను విముక్తం చేసినందుకు సర్దార్ పటేల్‌ను, తెలంగాణ సాయుధ పోరాట అమరవీరులను జ్ఞాపకం చేసుకున్నారు. ఉద్యమ కాలం నుంచి, మొన్నటికి మొన్న శాసనసభ వేదిక మీద మాట్లాడే వరకూ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు నిజాం రాజును కీర్తిస్తున్న తీరుకు జవాబుగా మోదీ అన్న మాటలు చాలా మందికి అర్థమయ్యాయి. ప్రొటోకాల్‌తో సంబంధం లేకుండా బీజేపీ నేతలు లక్ష్మణ్, కిషన్‌రెడ్డిలను ప్రధానమంత్రి తన వెంట తీసుకుపోయిన తీరు కూడా చర్చనీయాంశమైంది. కార్యకర్తల సమావేశంలో మోదీ మాటలు తెలుగు రాష్ట్రాల్లో సమీప భవిష్యత్తులో బీజేపీ అధికారంలోకి వచ్చే ఆశలను వదులుకున్నట్టు స్పష్టం చేశాయి. - దేవులపల్లి అమర్ datelinehyderabad@gmail.com -
‘జీఈఎస్’ పూలకుండీలు మాయం
హైదరాబాద్: ప్రపంచ వ్యాపారవేత్తల సదస్సు (జీఈఎస్)లో భాగంగా రోడ్లపై ఏర్పాటుచేసిన అందమైన పూల మొక్కల కుండీలు మాయమయ్యాయి. ఈ మేరకు గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ఏనుగు, హంస, గుడ్లగూబ, జింక రూపంలో ఉన్న మొత్తం 58 ఫైబర్ పూల కుండీలు చోరీకి గురయ్యాయని ఎస్ఐ రాజేంద్ర తెలిపారు. హెచ్ఐసీసీ గేట్ వద్ద వర్టికల్ గార్డెన్స్‌లో ఉంచిన 80 వేల చిన్న సైజు పూల కుండీల్లో 5 వేల పూల కుండీలు కూడా మాయమైనట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. -
పెట్టుబడుల మత్తులో పెద్దలు
ఇక్కడ బిచ్చగాళ్లు, సామాన్య జనాభా, నిరుద్యోగులు, అన్నార్తులు లేరనీ, పేదవాళ్ల గుడిసెలు లేవనీ చాటుకోవాలన్న తాపత్రయం పాలకులలో కనిపించింది. ఇవాంక కళ్లు కప్పేందుకు చేసిన ఈ పనులన్నీ ప్రజలను అవమానించేవే. ఎవరి రాకకోసమో బిచ్చగాళ్లను ఎక్కడికో తరలించడమే కాదు. పలు రకాల పేర్లతో పన్నులు వసూలు చేస్తున్నా హైదరాబాద్ రోడ్ల సంగతే పట్టని నేతలు, ఇవాంక రాకతో ఆగమేఘాల మీద కోట్ల రూపాయలు వెదజల్లి వాటికి మరమ్మతులు చేయించారు. ‘రకరకాల విదేశీ వస్తు సముదాయాన్నీ, సర్వీసులనూ దేశంలోకి దింపేసి, అవి కరువైతే జనజీవితం ఒట్టిపోతుందని నమ్ముతున్న పాలకులు ప్రజలను తలవంచుకుని సరిపెట్టుకునే గొర్రెల్లా భావిస్తున్నారు. అంతేతప్ప ఈ దేశంలో చిన్నారులు, కుటుంబాలు, సమాజం లేదా ప్రపంచం ఏ దిశలో ప్రయాణిస్తున్నదో ఆలోచించేందుకు మెదడుకు పనిచెప్పగల స్థితిలో లేకుండా చేశాం. ఎందుకని? మన సామాజిక సంబంధాలన్నింటినీ లాభాల వేటలో ఉన్న మార్కెట్ శక్తులకు అప్పచెప్పాం. ఇక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దేనికున్నాయంటే, వస్తు దాహపు మహమ్మారిని సాకడానికి ఎదురుచూస్తున్నాయి. నయా ఉదారవాద సామ్రాజ్యవాద శకం ప్రతిచోట నిర్బంధ పాలనా వ్యవస్థలను, భయానక వాతావరణాన్ని నెలకొల్పుతున్నది. ఈ దుష్పరిణామం కుటుంబ జీవితాలలోకీ, తల్లీబిడ్డల ఆత్మీయ బంధాలలోకీ ప్రవేశించి చిందరవందర చేస్తోంది. వ్యాపారం పేరిట వచ్చి వ్యవహారం చక్కబెట్టిన చందంగా ఈ మకిలి అందరినీ కాలుష్యం పాల్జేస్తున్నది.’ - (సుప్రసిద్ధ స్త్రీవాద రచయిత్రి యశోధరా బాగ్చీ గ్రంథం ‘ఇంటరాగేటింగ్ మదర్‌హుడ్’ను సమీక్షిస్తూ మిహిర్ భట్టాచార్య రాసిన వాక్యాలు, 10.11.17) ఇటీవల హైదరాబాద్‌లో మూడురోజుల పాటు జీఈఎస్ (గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సమ్మిట్, ప్రపంచ ఔత్సాహిక పారిశ్రామికవేత్తల శిఖరాగ్ర సమావేశం) జరిగింది. ఈ సదస్సు తీరు, చర్చల సరళిలతో పాటు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆర్థిక సలహాదారు హోదాలో హాజరైన ఆయన కుమార్తె ఇవాంకకు లభించిన స్వాగత సత్కారాలు గమనిస్తే ఒక చారిత్రక అంశం గుర్తుకొస్తుంది. ఇండియా సంపదను కొల్లగొట్టడానికి వచ్చిన ఈస్టిం డియా కంపెనీ తీరుతెన్నులు తలపుకొస్తాయి. అమెరికా గుత్త పారిశ్రామికవేత్తలకు, బహుళజాతి సంస్థలకు దేశ సంపదను దోచుకోవడానికి దారులు విస్తృతమవుతున్నాయని భావించవలసి వస్తున్నది. సాక్షాత్తు డొనాల్డ్ ట్రంప్ సదస్సుకు హాజరైనట్టే ఆయన కుమార్తె ఇవాంకకు స్థానిక ప్రభుత్వాలు స్వాగతసత్కారాలు లభించాయి. గతంలో నాటి అధ్యక్షుడు క్లింటన్ పర్యటించినప్పుడు చంద్రబాబునాయుడి ప్రభుత్వం ప్రవర్తించిన తీరు, నేడు చంద్రశేఖరరావు ప్రభుత్వం వ్యవహరించిన తీరు ఒక్క మాదిరిగానే ఉన్నాయి. పెట్టుబడులను ఆశించవచ్చు. కానీ అమెరికా అధ్యక్షునికీ, ఆయన సలహాదారుకీ(ఇవాంక అమెరికా అధ్యక్షుని సలహాదారు అన్న సంగతి ఇటీవలి వరకు తెలియదు) తేడా లేని రీతిలో మైమరిచిపోవడమే ఎబ్బెట్టుగా ఉంది. స్వతంత్ర పాలకుల తీరు ఇదేనా! ఇక్కడ బిచ్చగాళ్లు, సామాన్య జనాభా, నిరుద్యోగులు, అన్నార్తులు లేరనీ, పేదవాళ్ల గుడిసెలు లేవనీ చాటుకోవాలన్న తాపత్రయం పాలకులలో కనిపిం చింది. ఇవాంక కళ్లు కప్పేందుకు చేసిన ఈ పనులన్నీ ప్రజలను అవమానించేవే. ఎవరి రాకకోసమో బిచ్చగాళ్లను ఎక్కడికో తరలించడమే కాదు. పలు రకాల పేర్లతో పన్నులు వసూలు చేస్తున్నా హైదరాబాద్ రోడ్ల సంగతే పట్టని నేతలు, ఇవాంక రాకతో ఆగమేఘాల మీద కోట్ల రూపాయలు వెదజల్లి వాటికి మరమ్మతులు చేయించారు. గోల్కొండ సాక్షిగా జరిగిన మరొక తంతు–అక్కడ ఏర్పాటైన విందులు. అంతర్జాతీయ అతిథుల కోసం గోల్కొండ చుట్టుపక్కల ఉండే సామాన్య కుటుంబాల వారినీ, గుడిసె వాసులనీ రెండురోజుల పాటు బయటకు రానివ్వలేదు. ఇలాంటి నిర్బంధం మన పరువును బజారుకు ఈడ్చుకోవడమేనని పాలకులు భావించడం లేదు. ఈ విందుల కోసమే అక్కడి చిన్న చిన్న దుకాణాల షట్టర్లు తెరుచుకోలేదని కూడా చానళ్లు వెల్లడించాయి. ఇంతకు మించి తెలుగువారికి తలవంపులు తెచ్చిన పరిణామం కూడా ఉంది. ‘అమ్మా! ఇవాంకా! నీవు మా పేటలకు, వీధులకు పర్యటనకు వస్తే అయినా, వసతులు, రోడ్లు మెరుగుపడతాయేమోనని ఆహ్వానిస్తున్నాం!’ అని మొర పెట్టుకోవలసి వచ్చిందంటే ఒక స్వతంత్ర దేశ, రాష్ట్రాల పాలకులు సిగ్గు పడవద్దా! ఇందుకు ఇవాంక ట్వీట్ ద్వారా స్పందిం చిన తీరు ఏలా ఉంది? ‘మీ రోడ్ల గురించి నేను ప్రధాని మోదీతో మాట్లాడతా’నని. తీరుమారని నరేంద్ర మోదీ సదస్సుకు 150 దేశాల ప్రతినిధులు వస్తారని ప్రచారం జరిగింది. కానీ ప్రధానంగా కనిపించినవారు అమెరికా, ఇండియా పారిశ్రామికవేత్తలే. సదస్సులో ప్రసంగించిన మోదీ, ‘ఆర్థిక సంస్కరణలలో విధానాలు పారదర్శకంగా ఉండాలనీ, చట్టబద్ధంగా ఉండాలనీ చెప్పారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు వెలుగొందాలంటే ‘సరిసమాన ప్రతిపత్తి’లో వ్యవహరించాల్సి ఉంటుందని అన్నారు. కానీ అందుకు ఆయన సూచించిన మార్గం మాత్రం అస్పష్టం. పైగా రెండర్థాలకు తావిచ్చే నినాదాలిచ్చారు– ‘రండి, ఇండియాలో తయారు’ (మేకిన్ ఇండియా) చేయండి అని ఒకమాట, ‘ఇండియాలో పెట్టుబడులు పెట్టండి’ అని మరో మాట చెప్పారు. మోదీ పదవీ స్వీకారం చేసిన తరువాత జరిపిన తొలి విదేశీ పర్యటనలో ఇచ్చిన పిలుపు ‘వాస్కోడిగామాలై తరలి రండి’ అనే. దానికీ, హైదరాబాద్ సదస్సులో చేసిన తాజా ప్రకటనకూ తేడా లేదు. హైదరాబాద్ సదస్సులోనే గమనించదగిన విధాన ప్రకటన కూడా మోదీ చేశారు– ‘విదేశీ పెట్టుబడుల కోసం మా ప్రభుత్వం అన్ని నియంత్రణలను (రెగ్యులేషన్స్) సడలిస్తుంది, ఔత్సాహికుల కోసం (స్టార్టప్స్) ఊతం ఇచ్చే విధానంపై దృష్టి కేంద్రీకరిస్తుంది’ అన్నారు. ‘21 రంగాలలో విదేశీ గుత్త పెట్టుబడులకు ఆటంకంగా ఉన్న 87 శాతం నిబంధనలను, అంటే 1,200 రకాల చట్టాలను రద్దు చేస్తున్నాం’’ అంటూ మొదటిసారి బయటపడ్డారు. ఈ బాగోతాన్ని ప్రపంచ ప్రసిద్ధ పాత్రికేయురాలు చిత్రా సుబ్రహ్మణ్యం (గతంలో దిహిందూలో పనిచేశారు) 1997 నాటికే ‘అమ్మకానికి ఇండియా’– ‘ఇండియా ఫర్ సేల్’ అన్న గ్రంథంలో ఎండగట్టారు. అలా చెప్పడమంటే, నీ వర్తమానం నీ కళ్లముందే బుగ్గిపాలవుతుండగా నీ గతం గురించి వేదాల్ని అడిగి తెలుసుకోమన్నట్టూ, నీ భవిష్యత్తు గురించి ప్రపంచబ్యాంకును జోస్యం చెప్పమని కోరినట్టూ ఉంటుందని ఆమె వ్యంగ్యంగా చెప్పారు. అమెరికా అయితే అన్ని షరతులను భారత ప్రభుత్వం అంగీకరిస్తేనే విదేశీ ప్రత్యక్ష గుత్త పెట్టుబడులను ఇండియాలోకి అనుమతిస్తామని పట్టుబడుతోంది. ఇందుకు కారణం ఉంది. రేపోమాపో అమెరికాను తోసిరాజనబోతున్న దేశం చైనా. దక్షిణాసియాలో భారత ఇరుగు పొరుగుతో సంబంధాలకు విఘాతంగా సోషలిస్టు చైనాకు వ్యతిరేకంగా పన్నిన ‘వ్యూహాత్మక కూటమి’లోకి ఇండియాను లాగడానికి అమెరికా ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ఈ ఉచ్చులో ఇరికిం చడానికి అమెరికా చేస్తున్న ప్రయత్నానికి మన పాలకులు పరోక్షంగా తోడ్పడటం ఆత్మహత్యాసదృశమవుతుంది. ఆసియావాసుల్ని ఆసియావాసులపైకే ఉసిగొల్పాలని అమెరికా పాలకులు చాలాకాలంగా ఎత్తుగడలు వేస్తున్నారు. తెలిసో, తెలియకో ఉపాధి కోసం అమెరికాకు వలస వెళ్లిన భారతీయ సంతతివారు కొందరు వర్తక–వ్యాపార ప్రయోజనాల పేరిట ట్రంప్ విధానాలకు కొమ్ముకాస్తూ ‘వ్యూహాత్మకంగా భారత్–అమెరికాలు సన్నిహిత సంబంధాలను కొనసాగించాల్సిందే’నని కోరుకుంటున్నారు. భారతదేశం సహా అనేక ఆసియా, ఆఫ్రికా బడుగు దేశాలన్నీ అమెరికాకు ఇవ్వదేలిన రుణాలన్నీ చెల్లిపోయినా సరే, చెల్లనట్టుగా అమెరికా వ్యవహరించడం విశేషం. మన ఆర్థిక వ్యవస్థల పెరుగుదలకు, తగ్గుదలకు అంతర్జాతీయ రేటింగ్ గుత్త సంస్థలు ‘మదింపు’లు వేస్తూ మనల్ని రుణగ్రస్థులంగానే చిత్రిస్తున్నది. అమెరికా ఆర్థిక వ్యవస్థను ‘సైనిక–పారిశ్రామిక ఆర్థిక వ్యవస్థ’గా మార్చినట్టుగానే, భారత ఆర్థిక వ్యవస్థను కూడా కార్పొరేట్–పారిశ్రామిక సైనిక రక్షణ వ్యవస్థగా మలచాలని అమెరికా వ్యూహ రచన చేస్తోందని మరవరాదు. అమెరికా పెట్టుబడులే శరణ్యమా! ఆసియాలో అమెరికా రక్షణ వ్యూహంలోకి ఇండియాను గుంజే వ్యూహం ఉంది. ఇందులో భాగంగానే ‘అమెరికా–ఇండియా వ్యూహాత్మక భాగస్వామ్య సంస్థ’ అధ్యక్షుడు ముఖేష్ ఆఘీ ‘అమెరికా ప్రత్యక్ష భాగస్వామ్యం వల్లనే ఇండియాలో ఔత్సాహిక పారిశ్రామికులు కంపెనీలు పెట్టుకోగలుగుతారు, నడుపుకోగలుగుతారని’ బాహాటంగా ప్రకటించారు. ఆ సడలింపులు అమలులోనికి రానంతకాలం అమెరికా ప్రత్యక్ష పెట్టుబడులు భారీ స్థాయిలో రావని కూడా చెప్పారాయన. చివరికి అమెరికాతో చెట్టాపట్టాలు కట్టి సాగుతున్న మోదీ స్నేహితులు అంబానీ, ఆదానీల చర్యలు కొన్ని ఆఫ్రికా దేశాల్లో ఎలాంటి ఏవగింపులకు, నిరసనలకు గురికావలసి వచ్చిందో మరచిపోకూడదు. అన్నింటికన్నా విషాదం మరొకటి ఉంది. స్వతంత్ర ఆర్థిక వ్యవస్థలుగా వర్ధమాన దేశాలు అవతరించి, నిలదొక్కుకోవడానికి తగిన బ్లూప్రింట్‌ను సుప్రసిద్ధ ‘సౌత్ కమిషన్’ తయారుచేసింది. ఈ నివేదికకు పురుడు పోయడంలో టాంజానియా అధ్యక్షుడు జూలియస్ నైరేరికి చేదోడు వాదోడుగా నిలిచినవారు డాక్టర్ మన్మోహన్ సింగ్. ఆ తరువాత పీవీ నరసింహారావు ప్రధానిగా ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంలో డాక్టర్ సింగ్ ఆర్థికమంత్రి అయిన తరువాత సౌత్ కమిషన్ నివేదికను ‘గంగ’లో కలిపారు. పీవీ మంత్రివర్గంలో ఆర్థిక మంత్రి అయిన తరువాతనే ఆ ఇద్దరు కలసి ప్రపంచబ్యాంకు ‘సంస్కరణ’లకు బేషరతుగా 1991లో తలలూపారు. ఈ పరిణామాన్ని ఆహ్లాదంగా చూసినవారు బీజేపీ పాలకులు. ఆ సంస్కరణలను ‘భగవద్గీత’గా భావించి దేశాన్ని మరింతగా ముంచడానికి ఈ పార్టీ పాలకులు సయితం వెనుకాడక పోవడమే గొప్ప వైచిత్రి. సరిగ్గా ఈ సమయంలోనే ప్రపంచబ్యాంకు సంస్థలకు వైస్ ప్రెసిడెం టుగా 20 ఏళ్లుగా పనిచేసి, దాని చర్యలతో మొహం మొత్తిన డాక్టర్ డేవిడ్సన్ బుదూ పదవికి రాజీనామా చేశారు. ఇన్నాళ్లూ బ్యాంకు షరతుల భారాన్ని మోసి బ్యాంకు సంస్కరణలను ఆఫ్రికా దేశాల్లో అమలు జరుపుతూ తనకు చూపించిన దారుణ మనో వేదనను ఆ రాజీనామా లేఖలో ఇలా కన్నీళ్లతో ప్రపంచ ప్రజలకు నివేదించాడు: ‘ఈ సంస్కరణలను దేశాలపై రుద్దడంలో నా చేతులు రక్తసిక్తమయ్యాయి, ఈ సంస్కరణలవల్ల ప్రజలు అనుభవించిన దారుణ ఫలితాలను కళ్లారా చూశాను, ఈ నా మలినమైన చేతుల్ని కడుక్కోడానికి దేశాల నదీజలాలు చాలవుగాక చాలవు’ అన్నాడు. అప్పుడు నాకు గుర్తుకొచ్చింది మన అలిశెట్టి వేసిన ఆర్ద్రమైన ప్రశ్న: ‘‘అన్నంమెతుకునీ/ఆగర్భ శ్రీమంతుణ్ణీ/వేరుచేస్తే శ్రమ విలువేదో తేలిపోదూ?!’’ - ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
ఇవాంకం
ప్రధాని మందులేని విందు ఇచ్చారు. మొరార్జీ విందు అన్నారు. దేశమంతా హాయిగా తూగే వేళ ఇలా అతిథులని ఎండగట్టడం అన్యాయమన్నారు కొందరు. ‘‘అన్ని వంటలా? తినడానికి ఎక్కువ–చూడ్డానికి తక్కువ’’ అన్నారు. నెలరోజుల్నించి సందడి.. సందడి, పండుగ.. పండుగ వాతావరణం భాగ్యనగరంలో. రెండు పెద్ద సందర్భాలు కలిసొచ్చాయ్–దసరా, దీపావళి లాగా. మెట్రో పట్టాలెక్కడం, ప్రపంచ పారిశ్రామికవేత్తల సమాలోచనలు– రెండూ కలసి నగరం రంగు మార్చాయి. ఇవాంకా ట్రంప్ రాక మొత్తం దృశ్యాన్ని ముంచెత్తింది. ఓ పక్కన మోదీకి, ఓ మూల కేసీఆర్‌కి చోటు దక్కింది. ఇవాంక కదిలే మార్గాలన్నీ రంగులు పులుముకున్నాయి. పాత చెట్లకి కొత్త రంగులు పడ్డాయ్. ఈతచెట్లు అసహజంగా కనిపిస్తూ కనువిందు చేశాయ్. గోడల మీది బొమ్మలు గాడీగా కనిపిస్తూ వచ్చేపోయే వారి దృష్టిని లాగేశాయి. ఇవాంక కోసం వచ్చిన అత్యాధునిక కార్ల టైర్లు కుదుపుకి లోనుకాకుండా రోడ్లని నునుపు చేశారు. దారికిరువైపులా పచ్చని తెరలు కట్టారు. గోల్కొండ శిథిలాల్లో ఎగిరే ఈగల్ని దోమల్ని వేటాడారు. ఇవాంక తిరిగే హద్దుల్లో వీధి కుక్కలు లేకుండా మోసేశారు. బిచ్చగాళ్లని ఏరేశారు. పనిలేని వారు వీధుల్లోకి రావద్దని పోలీసులు సలహాల్లాంటి హెచ్చరికలు జారీ చేశారు. ఇవాంక అంటే అమెరికా అధ్యక్షుని గారాల పట్టి. పైపెచ్చు సలహాదారు. అసలు రెండుమూడు వారాల పాటు మీడియాలో ఇవాంక ముచ్చట్లు తప్ప వేరే వార్తలు లేవు. కారాలు మిరియాలు కూడా వైట్‌హౌస్‌లోనే నూరుకు తెచ్చారట! వంటవారు, నీళ్లవారు, ముందస్తుగానే తినేవారు, తిని పించేవారు అంతా అక్కణ్ణించే దిగారట. ఆవిడ చార్మినార్ తిలకిస్తారట. అక్కడ రంగురంగుల గాజులు చూస్తారట... ఇలా ఇవాంక రాక నగర చరిత్రలో సువర్ణాంకమైపోయింది. ప్రధాని మోదీ విమానం దిగుతూనే పాలక వర్గానికి ఝలక్ ఇచ్చారు. హైదరాబాద్ పేరు చెబితే సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ గుర్తొస్తారని తొలి విసురు విసిరారు. ఆనాటి సాయుధ పోరాటంలో వీర మరణం చెందిన వారికి శ్రద్ధాంజలి ఘటించి, నాటి పీడకలని గుర్తుకు తెచ్చారు. కేసీఆర్ నిజాం గారికి నిత్య భజనలు చేస్తున్నారు. మెట్రోకి ‘నిజ్’ అన్నది ముద్దుపేరు. అక్కడి బీజేపీ శ్రేణులు తెగ సంబరపడి నేత ప్రసంగానికి చప్పట్లు కొట్టారు. తర్వాత మోదీ గబగబా పైలాన్‌ని, చకచకా రైలుని ఆవిష్కరించేశారు. ఇంతపెద్ద సందర్భమైనా ఒక్కమాట మాట్లాడలేదు. ఏ ఒక్కరినీ అభినందించలేదు. ఆఖరికి గొప్ప సౌకర్యం పొందిన నగరవాసులని కూడా. ప్రపంచ పారిశ్రామికవేత్తల సభలో మోదీ గళం విప్పారు. గార్గి నుంచి ఆధునికకాలం దాకా మహిళలని ప్రస్తుతించారు. తర్వాత తన పాలనలో తను చేపట్టిన అద్భుతాలను ఏకరువు పెట్టారు. ఇదే కొంచెం ఎక్స్ట్రా అయిందని విశ్లేషకులన్నారు. ఇవాంక స్పీచ్ ఒక ప్రదర్శనలా వీక్షకులని ఆకట్టుకుంది. ఫలక్‌నుమాలో ప్రధాని మందులేని విందు ఇచ్చారు. మొరార్జీ విందు అన్నారు. దేశమంతా హాయిగా తూగే వేళ ఇలా అతిథులని ఎండగట్టడం అన్యాయమన్నారు కొందరు. ‘‘అన్ని వంటలా? అన్ని వంటకాలా! తినడానికి ఎక్కువ–చూడ్డానికి తక్కువ’’ అన్నారు టీవీక్షకులు. క్షీరసాగర మథనం స్థాయిలో మేధో మథనం జరిగింది హైటెక్స్‌లో. ఇంతకీ కవ్వానికి వెన్న పడిందా? కుండలోనే కరిగిపోయిందా? ఈ నిజాలు మనదాకా రావు. ఈ ఇవాంకం నేపథ్యంలో ప్రజలొకటే కోరుకుంటున్నారు. ఇదే స్ఫూర్తితో దోమలు, వీధికుక్కల విషయంలో ఉండండి! తిరిగి జన జీవన స్రవంతిలోకి బిచ్చగాళ్లని ప్రవేశపెట్టండి, పాపం! ఏదో రకంగా అందరం బిచ్చగాళ్లమే కదా! - శ్రీరమణ (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) -
ఇవాంకకు లేఖ రాశా.. జీఈఎస్ ఖర్చు ఎంత..?
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ పారశ్రామిక వేత్తల సదస్సు కేటీఆర్ షో గా నడిచిందని కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు విమర్శించారు. కీలకమైన సదస్సులో నేతలను భాగస్వామ్యం చేయకుండా అవమానించరన్నారు. కనీసం నగర మేయర్‌నుకూడా పట్టించుకోలేదని మండిపడ్డారు. ఆ పదవికి ఇచ్చే గౌరవం ఇదేనా అని ప్రశ్నించారు. సదస్సుకు ప్రత్యేక అతిథిగా విచ్చేసిన అమెరికా అద్యక్ష సలహాదారు ఇవాంకాకు హైదరాబాద్‌లో అన్నీ అవాస్తవాలే చెప్పారన్నారు. వాస్తవాలు తెలుసుకోవాలని ఆమెకు లేఖ రాసినట్టు వీహెచ్ తెలిపారు. జీఈఎస్‌పై శ్వేతపత్రం విడుదల చేయాలి :షబ్బీర్ అలీ డిమాండ్ ప్రపంచ పారిశ్రామిక వేత్తల సదస్సుకు ప్రభు త్వం పెట్టిన ఖర్చు ఎంత, రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు ఎన్ని, కొత్తగా ఎంతమందికి ఉపాధి అవకాశాలు వస్తాయో శ్వేతపత్రం విడుదల చేయాలని శాసనమండలిలో ప్రతిపక్షనేత షబ్బీర్ అలీ డిమాండ్ చేశారు. టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క, సీఎల్పీ ఉపనేత పొంగులేటి సుధాకర్‌రెడ్డితో కలిసి గాంధీభవన్‌లో శుక్రవారం విలేకరులతో ఆయన మాట్లాడారు. ప్రపం చ పారిశ్రామికవేత్తలు హైదరాబా ద్ కు వచ్చిన సందర్భంగా తెలంగాణలో పెట్టుబడులకోసం ఆకర్షించడంలో, హామీలను సాధించుకోవడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ స్వంత ప్రచారం తప్ప పెట్టుబడులను సాధించుకోవాలని, తెలంగాణ నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలను పెంచాలనే చిత్తశుద్ధి లేదని షబ్బీర్ అలీ ఆరోపించారు. -
'ఇవాంకకు లేఖ రాశా'
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ పారశ్రామిక వేత్తల సదస్సు కేటీఆర్ షో గా నడిచిందని కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు విమర్శించారు. కీలకమైన సదస్సులో నేతలను భాగస్వామ్యం చేయకుండా అవమానించరన్నారు. కనీసం నగర మేయర్‌నుకూడా పట్టించుకోలేదని మండిపడ్డారు. ఆ పదవికి ఇచ్చే గౌరవం ఇదేనా అని ప్రశ్నించారు. సదస్సుకు ప్రత్యేక అతిథిగా విచ్చేసిన అమెరికా అద్యక్ష సలహాదారు ఇవాంక కు హైదరాబాద్‌లో అన్నీ అవాస్తవాలే చెప్పారన్నారు. వాస్తవాలు తెలుసుకోవాలని ఆమెకు లేఖ రాసినట్టు వీహెచ్ తెలిపారు. -
గ్లోబల్... సక్సెస్ఫుల్
అతివకు అందలం..ఆవిష్కరణలకు ప్రోత్సాహం...స్టార్టప్స్‌కు సహాయం...ఇవే ప్రధాన ఇతివృత్తంగా సాగిన ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు (జీఈఎస్) సక్సెస్‌ఫుల్‌గా ముగిసింది. మూడురోజుల సందడికి గురువారం తెరపడింది. భాగ్యనగరి అందాలు, దేశీయ ఆవిష్కరణలను చూసి అబ్బురపోయిన విదేశీ ప్రతినిధులు... భారంగా బై..బై.. చెప్పారు. మెట్రో నగరికి మళ్లీ వస్తామంటూ దేశవిదేశీయులు వీడ్కోలు పలికారు. అవకాశాలు పుష్కలం.. అందుకోవాలి ‘నైపుణ్యానికి అద్దం పడుతూ ఎందరో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు నూతన ఆవిష్కరణలు చేస్తున్నారు. స్టార్టప్స్‌తో అసామాన్య ఫలితాలు సామాన్యులకు చేరువవుతాయి. వీటికి పెట్టుబడులతో ప్రోత్సాహం అందిస్తే విజయం సొంతమవుతుంది. ఉద్యోగం చేయడం కంటే.. పది మందికి ఉపాధి కల్పించడంలోనే సంతృప్తి ఉంటుంది. వ్యవసాయం, వైద్యం తదితర రంగాల్లో నూతన స్టార్టప్‌లకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. వాటిని అందిపుచ్చుకోవాల’ని జీఈఎస్‌కు హాజరైన పారిశ్రామికవేత్తలు అభిప్రాయపడ్డారు. తమ ఆవిష్కరణలపై ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. డిజిటల్ అగ్రికల్చర్ వ్యవసాయానికి ఐటీని తోడు చేయాలనే సంకల్పంతో రెండేళ్ల క్రితం ఓ ప్రత్యేక యాప్ రూపొందించాం. సీజన్‌కు అనుగుణంగా ఏయే పంటలు వేయాలి? చీడపీడలకు ఏయే క్రిమిసంహార మందులు వాడాలి? తదితర సమాచారం ఇందులో ఉంటుంది. రైతులు, కంపెనీలు వివరాలూ ఉంటాయి. త్వరలోనే మార్కెటింగ్ అవకాశాలనూ చేర్చనున్నాం. పెట్టుబడి దొరికితే మా యాప్‌ను సామాన్యులకు చేరువ చేస్తాం. – జయ వల్లపు, ఫౌండర్, స్టాంప్ ఐటీ సొల్యూషన్స్ బొమ్మల తయారీ.. అత్యున్నత నాణ్యతా ప్రమాణాలతో పిల్లలు ఆడుకునే చెక్క బొమ్మలు తయారు చేస్తాం. ఏ చెక్కతో ఏ బొమ్మలు తయారు చేయాలో తెలియజేస్తాం. 3–13 ఏళ్ల పిల్లలు ఆడుకునే బొమ్మలు తయారు చేసేందుకు వీలుంటుంది. ఇప్పటికే ఒక మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టాం. – అశ్విని కుమార్, కో–ఫౌండర్, స్మార్టివిటీ ఇవాంకా స్ఫూర్తి... జీఈఎస్ సద్సులో ఇవాంకా ప్రసంగం నాకెంతో స్ఫూర్తినిచ్చింది. ఈ సదస్సులో చాలా నేర్చుకున్నాను. వ్యాపార రంగంలో మహిళలు రాణించేందుకు ఇది ఎంతగానో దోహదం చేస్తుంది. – అబ్బిగేల్ లాంక్, గయానా టెలీ మెడిసిన్.. స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లవుతున్నా డాక్టర్ల వివరాలు సామాన్యులకు ఇప్పటికీ అందుబాటులో లేవు. ఆస్పత్రులు ఎక్కడుంటాయో? ఏ జబ్బుకు ఎక్కడికి వెళ్లాలో? తెలియని పరిస్థితి ఉంది. సామాన్యులకు వైద్య సమాచారం అందించేందుకు ‘ఇంటెలె హెల్త్’ పేరుతో టెలీ మెడిసిన్ సర్వీస్‌ను ఒడిశాలో ప్రారంభించాం. పెట్టుబడుల కోసం ఎదురు చూస్తున్నాం. – నేహా గోయల్, సీఈఓ, ఇంటెలె హెల్త్ అవకాశాలెన్నో... వ్యాపార రంగంలో మహిళలకు ఎన్ని అవకాశాలున్నాయో జీఈఎస్ సదస్సులో స్పష్టంగా అర్థమైంది. వివిధ దేశాల బృందాలు తమ అనుభవాలు పంచుకున్నాయి. గోల్కొండ విందు బాగుంది. సదస్సుకు ప్రభుత్వం చేసిన ఏర్పాట్లు సూపర్. – ప్రభా రాఘవ, యూఎస్ఏ నైపుణ్యానికి కొదవలేదు ఇండియాలో నైపుణ్యానికి కొదవలేదు. ఎందరో ఇండియాలో ఇప్పుడిప్పుడే స్టార్టప్‌లపై దృష్టిసారిస్తున్నారు. యువత స్టార్టప్‌లపై ఉత్సా హం చూపుతోంది. అయితే ప్రభుత్వాలు, కంపెనీల ప్రోత్సాహం ఉంటేనే స్టార్టప్‌లు నిలబడతాయి. – కార్ల్ బిజ్లాండ్, స్వీడన్ గ్రీన్ టీ ఫ్లేవర్స్.. వివిధ ఫ్లేవర్లలో గ్రీన్ టీ తయారు చేసే విధానాన్ని వివరిస్తాం. గ్రీన్ టీ అంటే.. చేదు, వగరు అనుకుంటారు. కానీ దీన్ని వివిధ ఫ్లేవర్లలో అందించొచ్చు. మెక్సికో, అమెరికా దేశాలకు చెందిన ప్రతినిధులకు టీ ఫ్లేవర్లను వివరించాం. – నీలిమా చౌదరి, ఫౌండర్, ఎగ్జాటిక్ బ్లూమింగ్ టీస్ -
స్టార్టప్స్ కోసం ‘నయా వెంచర్స్ యాక్సిలరేటర్’
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: స్టార్టప్ సంస్థలకు ప్రారంభ దశ నుంచి తోడ్పాటు అందించే క్రమంలో వెంచర్ క్యాపిటల్ సంస్థ నయా వెంచర్స్ తాజాగా గ్లోబల్ యాక్సిలరేటర్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. గ్లోబల్ ఎంట్రప్రెన్యూర్షిప్ సదస్సు సందర్భంగా సంస్థ ఎండీ దయాకర్ పుస్కూర్ దీన్ని ఆవిష్కరించారు. బూట్ అప్ వెంచర్స్, జెడ్ నేషన్ ల్యాబ్‌తో కలిసి దీన్ని ఏర్పాటు చేసినట్లు ఆయన తెలియజేశారు. అంతర్జాతీయ స్థాయికి ఎదగాలనుకునే స్టార్టప్‌లకు ఇది అనువైనదిగా దయాకర్ చెప్పారు. ఈ ప్రోగ్రాం ప్రారంభ దశలో.. స్టార్టప్స్‌కి కావాల్సిన నైపుణ్యాలపై జెడ్ నేషన్ ల్యాబ్స్ శిక్షణనిస్తుందని చెప్పారాయన. తర్వాత కొన్నాళ్ల పాటు అమెరికాలోని కాలిఫోర్నియా, డల్లాస్‌లలో నైపుణ్యాలను మెరుగుపర్చుకునే అవకాశం లభించగలదని వివరించారు. ‘‘స్టార్టప్‌లు ఆయా దశలను బట్టి రెండు లక్షల డాలర్ల నుంచి ఇరవై లక్షల డాలర్ల దాకా ఫండింగ్ కూడా పొందే అవకాశం ఉంది. పెట్టుబడులతో పాటు కస్టమర్లు, మెంటార్ల తోడ్పాటు కూడా ఈ గ్లోబల్ యాక్సిలరేటర్ ద్వారా పొందవచ్చు’’ అని దయాకర్ చెప్పారు. మరోవైపు, మొదటి ఫండ్ విలువ సుమారు 50 మిలియన్ డాలర్లుగా ఉండగా.. త్వరలో రెండో ఫండ్ కూడా ప్రారంభించాలని, దాదాపు 75–100 మిలియన్ డాలర్ల దాకా సమీకరించాలని భావిస్తున్నట్లు ఆయన తెలియజేశారు. నయావెంచర్స్ సుమారు పదిహేడు స్టార్టప్స్‌లో ఇన్వెస్ట్ చేసిందని, ఇవి దాదాపు 80 మిలియన్ డాలర్ల దాకా సమీకరించాయని దయాకర్ వివరించారు. స్టార్టప్‌లు లింగ వైవిధ్యాన్ని పాటించాలి సిస్కో ఎగ్జిక్యూటివ్ చైర్మన్ జాన్ చాంబర్స్ న్యూఢిల్లీ: స్టార్టప్‌లు పని ప్రదేశాల్లో స్త్రీ, పురుష వైవిధ్యాన్ని పాటించాలని, మరింత మంది మహిళలను భిన్న రకాల పనుల్లో నియమించుకోవడం ద్వారా ఉత్పత్తిని పెంచాలని సిస్కో ఎగ్జిక్యూటివ్ చైర్మన్ జాన్ చాంబర్స్ అభిలషించారు. భారత్‌లో స్టార్టప్ ఎకో సిస్టమ్ బూమ్ మీద ఉండటంతో ఈ దేశం ప్రపంచ స్టార్టప్ ఇంజన్‌గా నిలిచేందుకు సామర్థ్యాలున్నా యని పేర్కొన్నారు. అమెరికా–భారత్ వ్యూహాత్మక భాగస్వామ్య ఫోరం చైర్మన్‌గానూ చాంబర్స్ పనిచేస్తున్నారు. ‘‘భారత్ అద్భుతమైన పని చేసింది. ప్రభుత్వంలోనూ, వ్యాపారాల్లోనూ గొప్ప మహిళా నేతలున్నారు. కానీ, ఉపాధిలో మరింత కిందకు పడిపోతున్నందున స్టార్టప్‌లలో లింగ వైవిధ్యాన్ని పరిష్కరించాల్సి ఉంది’’ అని పేర్కొన్నారు. అమెరికాలో ఇది 24 శాతంగా ఉందని, అయినా ఇరు దేశాలూ ఈ విషయంలో మరిన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. మార్కెటింగ్ కీలకం షహనాజ్ హుసేన్ గ్రూప్ సీఎండీ షహనాజ్ హుసేన్ హైదరాబాద్: మార్కెటింగ్, పెట్టుబడుల కోసం నిధుల సమీకరణ మార్గాలపై అవగాహన పెంచుకోవడం ఔత్సాహిక వ్యాపారవేత్తలకు అత్యంత కీలకమని సౌందర్య సాధనాల ఉత్పత్తుల సంస్థ షహనాజ్ హుసేన్ గ్రూప్ సీఎండీ షహనాజ్ హుసేన్ తెలిపారు. అడ్డంకులను అధిగమించి వ్యాపార రంగంలోకి ప్రవేశించినా.. మహిళా ఎంట్రప్రెన్యూర్స్ ఈ విషయాల్లో కొంత వెనకబడుతున్నారని ఆమె పేర్కొన్నారు. మహిళా ఎంట్రప్రెన్యూర్స్ తమ నైపుణ్యాలను, నెట్వర్కింగ్ మెరుగుపర్చుకునేందుకు జీఈఎస్ వంటి వేదికలు ఉపయోగపడతాయని తెలిపారు. ప్రస్తుతం దేశీయంగా సౌందర్య సాధనాల మార్కెట్ దాదాపు రూ.5,000 కోట్లకు పైగా, బ్యూటీ సెలూన్ సర్వీసుల పరిశ్రమ రూ.10,000 కోట్ల స్థాయిలో ఉందని ఆమె చెప్పారు. స్వల్పకాలంలో తక్కువ ఖర్చులోనే శిక్షణ కూడా పొందగలిగే సౌలభ్యం ఉన్నందున మహిళలు ఈ రంగంపై దృష్టి సారించవచ్చన్నారు. వ్యాపారవేత్తలకు జీఈఎస్ ఊతం ఓలా సీఈవో భవీశ్ అగర్వాల్ వ్యాఖ్య హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన గ్లోబల్ ఎంట్రప్రెన్యూర్ షిప్ సదస్సు ఔత్సాహిక వ్యాపారవేత్తల్లో స్ఫూర్తి నింపిందని ట్యాక్సీ సేవల సంస్థ ఓలా సహ వ్యవస్థాపకుడు, సీఈవో భవీశ్ అగర్వాల్ అభిప్రాయపడ్డారు. దేశీయంగా ఎంట్రప్రెన్యూర్ షిప్ పెరిగేందుకు ఇది మరింతగా తోడ్పడగలదని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. స్టార్టప్‌లు, వ్యాపార మెలకువలు, ప్రమాణాలు, అత్యుత్తమ విధానాలు తదితర అంశాలపై చర్చించేందుకు ప్రపంచం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో ఎంట్రప్రెన్యూర్లు, ఇన్వెస్టర్లు, నూతన ఆవిష్కర్తలు, ప్రభుత్వ వర్గాలు ఇందులో పాల్గొనడం హర్షణీయ మని చెప్పారాయన. స్టార్టప్ సంస్థలకు క్రమశిక్షణ, ఓర్పు ముఖ్యమన్నారు. ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా స్టార్టప్ సంస్థలు నిరాశ చెందకుండా, నిరంతరం శ్రమిస్తేనే నిలదొక్కుకోగలమన్నది గు ర్తుంచుకో వాలని సూచించారు. కొత్త ఐడియా ఊతంతో యువత ప్రారంభించే స్టార్టప్ లకు.. అనుభవజ్ఞులైన సీనియర్ల తోడ్పాటు ఉంటే పురోగతి ఉంటుందని చెప్పారు. -
‘మిత్ర’ మనోడే..
సాక్షి, వరంగల్ రూరల్: ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు (జీఈఎస్)ను ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా దేశాధ్యక్షుడు ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్.. మిత్ర రోబో ద్వారా ప్రారంభించిన విషయం మనందరికీ తెలిసిందే. మరి ఆ రోబోను తయారుచేసింది ఎవరో తెలుసా.. వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండ సమీపంలోని గోపాలపూర్‌కు చెందిన భరత్ దండు. ప్రస్తుతం ఆయన ఇన్వెంటో టెక్నాలజీ సంస్థ సీటీఓ (చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్)గా పనిచేస్తున్నారు. జీఈఎస్ సదస్సులో పాల్గొన్న అనంతరం వరంగల్‌కు వచ్చిన సందర్భంగా భరత్‌ను ‘సాక్షి’ పలకరించింది. ఈ సందర్భంగా రోబో గురించి భరత్ చెప్పిన విషయాలు ఆయన మాటల్లోనే.. మా టీమ్‌లో 14 మంది.. బెంగళూరుకు చెందిన ఇన్వెంటో టెక్నాలజీ సంస్థను బాలాజీ విశ్వనాథన్, మహాలక్ష్మీ ప్రారంభించారు. నేను ఏడాదిన్నర క్రితం సంస్థలో చేరాను. ప్రస్తుతం చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ (సీటీఓ)గా బాధ్యతలు నిర్వహిస్తున్నాను. మిత్ర రోబోకు సంబంధించి మెకానికల్ ఎలక్ట్రానిక్స్ చూసుకుంటున్నాను. మా బృందంలో 14 మంది సభ్యులు. అందులో తెలుగువాళ్లు ఐదుగురు. జీఈఎస్‌కు తొలుత మేమే దరఖాస్తు చేసుకున్నాం. మిత్రతో సదస్సు ప్రారంభించాలన్న మా ఆలోచన నచ్చి నిర్వాహకులు అంగీకరించారు. ఇది ఎనిమిదో రోబో జీఈఎస్ ప్రారంభ కార్యక్రమంలో వినియోగించిన రోబో ఎనిమిదవది. మొదట 3 ఫీట్ల రోబోను తయారు చేశాం. తొలుత మనం చెబితే వినేది.. తర్వాత మనం చెప్పింది చేసేది.. ఆ తర్వాత ఒక రూంలో నుంచి మరో రూంలోకి వెళ్లేది.. ఇలా తయారు చేస్తూనే ఉన్నాం. ఈ రోబో ధర రూ.7 లక్షల వరకు ఉంటుంది. ఇందులోని లిథియం బ్యాటరీని ఒక్కసారి చార్జ్ చేస్తే 2 రోజులు ఉంటుంది. మొదట కెనరా బ్యాంక్‌లో.. మిత్ర రోబోను తొలుత కెనరా బ్యాంక్, బెంగళూరు వారు కొనుగోలు చేశారు. ఆ బ్యాంక్ వినియోగదారులు రోబో ముందు నిల్చుంటే ఖాతా వివరాలు తెలుపుతుంది. ఖాతాదారుడు బ్యాంక్ లోన్‌కు దరఖాస్తు చేసుకుంటే ఆ ప్రాసెస్ ఎక్కడి వరకు వచ్చిందో కూడా తెలుపుతుంది. కస్టమర్ ఇంటరాక్షన్‌కు.. మేము తయారు చేసిన రోబో ముఖం, ధ్వనిని సైతం గుర్తుపడుతుంది. మనం అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబుతుంది. ఇండోర్ నావిగేషన్ ద్వారా తానెక్కడ ఉన్నదీ రోబో తెలుసుకుంటుంది. షాపింగ్ కాంప్లెక్స్‌లలో ఒక ప్రాంతంలోంచి మరో ప్రాంతంలోకి వెళ్తుంది. ప్రపంచంలో ఇది ఒక్కటే రోబో. కస్టమర్ ఇంటరాక్షన్‌కు రోబో ఎంతగానో దోహదపడుతుంది. ప్రభుత్వం సహకరిస్తే.. ప్రస్తుతానికి బెంగళూరులో అద్దె భవనంలో సంస్థను నడిపిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తే మరింత మెరుగైన రోబోలు తయారు చేసేందుకు మా టీం సిద్ధంగా ఉంది. ఇప్పటి వరకు చెప్పింది వినడం.. సమాచారం చెప్పేలా రోబోలు రూపొందించా. త్వరలో వస్తువులను తీసుకెళ్లే రోబోలనూ తయారు చేస్తాం. పుట్టి పెరిగింది హన్మకొండలోనే నేను పుట్టి పెరిగింది హన్మకొండలోనే. పదో తరగతి వరకు సెయింట్ గాబ్రియల్ పాఠశాలలో, ఇంటర్ ఎస్ఆర్ కళాశాలలో, ఇంజనీరింగ్ కిట్స్‌లో, ఎంటెక్ ఐఐటీ మద్రాసులో చేశాను. ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడి కుమార్తె ఇవాంకాలకు రోబో నచ్చడం ఎంతో సంతోషాన్నిచ్చింది. మిత్ర రోబో బాగుందని మోదీ ట్వీట్ చేశారు. మా అమ్మ శకుంతల రిటైర్డ్ ఆధ్యాపకురాలు. నాన్న రాజశేఖర్ ఎయిర్ ఫోర్స్‌లో పని చేసేవారు. నా భార్య సింధు ఎన్ఐటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పని చేస్తోంది. స్కాలర్షిప్లతోనే చదివా మాది ఆంధ్రప్రదేశ్ లోని వైఎస్సార్ కడప జిల్లా లో ఉన్న కమలమర్రి గ్రామం. మాది వ్యవసా య కుటుంబం. నా చదువంతా స్కాలర్షిప్ తోనే పూర్తి చేశా. మా ఊళ్లో ఉండి చదువుకోవడం ఇబ్బందిగా ఉండటంతో రాయచోటికి వచ్చి చదువుకున్నా. ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ చదివేందుకు ఓ సార్ సహకరించారు. రోబో హార్డ్‌వేర్ కంట్రోల్ చేసేందుకు సాఫ్ట్వేర్ రాశా. ఆ సాఫ్ట్వేర్ రాయడం కొంత కష్టమైంది. మా రోబో బాగుందని ప్రధాని అభినందించడం ఆనందాన్నిచ్చింది. మా కష్టానికి ఫలితం దక్కింది. – ఆనంద్‌రెడ్డి, రోబో సాఫ్ట్వేర్ ప్రోగ్రామర్ -
బైబై.. జీఈఎస్!
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ పారిశ్రామికవేత్తల సదస్సు (జీఈఎస్) ఘనంగా ముగిసింది. ప్రధాని మోదీ, అమెరికా సలహాదారు ఇవాంక, దేశ విదేశాలకు చెందిన ప్రతినిధులు, అతిరథ మహారథులు పాల్గొన్న సద స్సు మూడ్రోజులపాటు కన్నుల పండువగా జరిగింది. గురువారం సదస్సు ముగింపు సందర్భంగా అమెరికా ప్రభుత్వం గచ్చిబౌలిలోని నోవాటెల్ హోటల్లో ప్రత్యేకంగా విందు ఏర్పాటు చేసింది. సదస్సు మొదటి రోజు ఫలక్‌నుమా ప్యాలెస్‌లో కేంద్రం విందు ఏర్పాటు చేయగా, రెండోరోజు తెలంగాణ రుచులతో గోల్కొండ కోటలో రాష్ట్ర సర్కారు విందు ఇచ్చింది. మూడోరోజు అమెరికా ప్రభుత్వం ఏర్పాటు చేసిన విందులో వివిధ దేశాలకు చెందిన వంటకాలు, వెరైటీ రుచులు అతిథుల నోరూరించాయి. 150 దేశాలకు చెందిన 1,500 మందికిపైగా ప్రతినిధులు, ప్రముఖులు హాజరయ్యారు. ఈ విందును అమెరికాకు చెందిన ఈవెంట్ మేనేజర్లే నిర్వహించారు. పిజ్జా, బర్గర్‌లతోపాటు చైనీస్, ఫ్రెంచ్, గ్రీక్, ఇటాలియన్, కరీబియన్ వంటి వందలాది రకాల వంటకాలు వడ్డించారు. చికెన్, మటన్‌లో రకరకాల వెరైటీలు చేశారు. బ్రెడ్‌లో బట్టర్, నాన్ బట్టర్ తదితర పలు రకాలను రుచి చూపించారు. చికెన్ ఫ్రెంచ్, చికెన్ ఫ్రైడ్ బేకన్, చికెన్ ఫ్రైడ్ స్టీక్స్, క్లేమ్ కేక్, క్రాజ్ కేక్, ఎగ్ బెనెడిక్ట్, ఫ్రైడ్ ఫిష్, మకరాని సలాడ్, మెక్సికన్ గ్రిల్డ్ కార్న్, ఆవోకాడో మెలాన్, పాస్తా సలాడ్, పిజ్జా స్టిప్స్, రోల్డ్ ఓయిస్టర్, శాండ్విచ్ బ్రెడ్, వంటివి అతిథులను ఆకట్టుకున్నాయి. హైదరాబాద్ బిరియానీ కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. మొదటి రోజు ఫలక్‌నుమా ప్యాలెస్‌లో మొఘలాయి, నిజాం రుచులు ఘుమఘుమలాడగా, రెండో రోజు గోల్కొండ కోటలో తెలంగాణ రుచులు నోరూరించాయి. చివరిరోజు విదేశీ రుచులు అతిథులను మైమరిపించాయి. -
‘పిచ్’ విజేత అజైతా షా
ప్రపంచ పారిశ్రామిక సదస్సులో ఉత్కంఠ రేపిన స్టార్టప్‌ల ‘పిచ్’ కాంపిటీషన్లో భారత్‌కు చెందిన అజైతా షా తుది విజేత (గ్రాండ్ చాంపియన్)గా నిలిచారు. జీఈఎస్‌ను పురస్కరించుకుని స్టార్టప్ కంపెనీలకు ‘గ్లోబల్ ఇన్నోవేషన్ త్రూ సైన్స్ అండ్ టెక్నాలజీ (జిస్ట్)’ఆధ్వర్యంలో పిచ్ కాంపిటీషన్‌ను నిర్వహించిన విషయం తెలిసిందే. రెండు విభాగాలకు విజేతలను బుధవారమే ప్రకటించగా గురువారం మరో రెండు విభాగాల్లో విజేతలను ఎంపిక చేశారు. అనంతరం సదస్సు ముగింపు వేడుకల్లో తుది విజేతను ప్రకటించారు. నాలుగు విభాగాల విజేతల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన అజైతా షాను తుది విజేతగా ఎంపిక చేశారు. – సాక్షి, హైదరాబాద్ 4 లక్షల డాలర్ల బహుమతులు భారత్‌కు చెందిన అజైతా షా రాజస్థాన్‌లో ‘ఫ్రాంటియర్ మార్కెట్స్’స్టార్టప్‌ను నిర్వహిస్తున్నారు. జీఈఎస్ దృష్టి సారించిన నాలుగు రంగాల్లో ఒకటైన ‘ఇంధనం, మౌలిక వసతుల’విభాగం నుంచి ఈ స్టార్టప్ గ్రాండ్ ఫైనల్‌కు చేరింది. సౌరశక్తి వినియోగం, సౌరశక్తి ఆధారిత ఉత్పత్తులను తయారు చేయటంతో పాటు మహిళలకు వ్యాపార అవకాశాలను పెంపొందించేందుకు ఆమె చేస్తున్న కృషిని.. పోటీ న్యాయ నిర్ణేతలు అభినందించారు. ఆమెకు దాదాపు 4 లక్షల డాలర్ల విలువైన బహుమతులను అందజేశారు. ఇందులో 50 వేల డాలర్ల అమెజాన్ వెబ్‌సర్వీస్ క్రెడిట్స్‌తో పాటు డెల్ లాప్టాప్, లక్ష డాలర్ల గూగుల్ క్లౌడ్ క్రెడిట్‌ను అందించారు. కాగ్నిజెంట్ కంపెనీ ఆమెను ‘జెన్సిస్ అవార్డు’గ్రహీతగా ప్రకటించటంతో పాటు రెండు వేల డాలర్ల నగదు బహుమతిని అందించింది. ఐఎన్‌సీ మేగజైన్లో ఆమె ఇంటర్వ్యూను ప్రచురించనున్నారు. ఇక తుది పోటీలో నిలిచిన నలుగురు విజేతలకు వచ్చే ఏడాది మార్చిలో వాషింగ్టన్లో జరిగే అలైస్ సర్క్యులర్ సమ్మిట్‌లో పాల్గొనేందుకు అవకాశం కల్పించారు. మొల్లీ మోర్స్కు ‘విమెన్ ఫస్ట్’ అవార్డు జీఈఎస్ ముగింపు వేడుకల్లో అమెరికాకు చెందిన మ్యాంగో మెటీరియల్స్ స్టార్టప్ నిర్వాహకురాలు మొల్లీ మోర్స్కు ‘విమెన్ ఫస్ట్’ అవార్డును ప్రకటించారు. పోటీలో పాల్గొన్న తొలి మహిళగా ఆమెను దీనికి ఎంపిక చేశారు. బహుమతిగా 50 వేల డాలర్ల అమెజాన్ వెబ్‌సర్వీస్ క్రెడిట్, డెల్ ల్యాప్‌టాప్‌ను అందించారు. తర్వాతి స్థానాల్లో నిలిచిన పలువురికి కూడా వివిధ బహుమతులు అందించారు. ముగ్గురికి గూగుల్ బహుమతి పోటీల్లో ప్రతిభ ఆధారంగా ముగ్గురు మహిళలకు గూగుల్ కంపెనీ ప్రత్యేకంగా బహుమతులను అందించింది. ఎవలిన్ చిలోమో (లూపియా సర్కిస్ సంస్థ–జాంబియా), క్రిస్టి గొరెనాస్ (డిపెండబుల్ సంస్థ–అమెరికా), వైశాలి నియోటియో (మెరిక్సియస్ సాఫ్ట్వేర్–భారత్)లు గూగుల్ కంపెనీ నుంచి 20 వేల డాలర్ల క్లౌడ్క్రెడిట్ను అందుకున్నారు. గ్రాండ్ ఫైనల్ పోరులో నలుగురు జిస్ట్ పిచ్ కాంపిటీషన్లో వివిధ దేశాలకు చెందిన 75 మంది స్టార్టప్‌ల నిర్వాహకులు పోటీ పడ్డారు. సెమీఫైనల్‌కు చేరిన 24 మందికి జీఈఎస్‌లో పిచ్ కాంపిటీషన్లో తలపడే అవకాశం కల్పించారు. జీఈఎస్ ప్రాధాన్యంగా ఎంచుకున్న ఇంధనం–మౌలిక వసతులు, హెల్త్‌కేర్–లైఫ్ సైన్సెస్, డిజిటల్ ఎకానమీ–ఫైనాన్షియల్ టెక్నాలజీ, మీడియా–ఎంటర్టైన్మెంట్... ఈ నాలుగు విభాగాల్లో ఒక్కొక్కరిని విజేతలుగా ఎంపిక చేశారు. ఈ నలుగురిలో ముగ్గురు భారతీయులే ఉండటం విశేషం. అజైతా షాతో పాటు ఇతర రంగాల నుంచి జైనేష్ సిన్హా (జ్ఞాన్‌ధన్ వ్యవస్థాపకుడు), వైశాలి నియోటియా (మెర్క్సియస్ సాఫ్ట్వేర్), ఫియోనా ఎడ్వర్డ్స్ మర్ఫీ (ఎపిస్ ప్రొటెక్ట్–ఐర్లాండ్)లు తమ విభాగాల్లో విజేతలుగా నిలిచి గ్రాండ్ ఫైనల్లో పోటీపడ్డారు. వీరందరికీ 10 వేల డాలర్ల అమెజాన్ వెబ్‌సర్వీస్ క్రెడిట్స్, డెల్ ల్యాప్‌టాప్, అలైస్ సర్క్యులర్ సమ్మిట్ స్కాలర్షిప్, లక్ష డాలర్ల విలువైన గూగుల్ క్లౌడ్ క్రెడిట్స్‌ను అందించారు. -
హైదరాబాద్ ప్రతిష్ట పెరిగింది
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు(జీఈఎస్)తో అంతర్జాతీయంగా హైదరా బాద్ ప్రతిష్ట మరింత పెరిగిందని సీఎం కేసీఆర్ అభిప్రాయపడ్డారు. జీఈఎస్తోపాటు మెట్రోరైలు ప్రారంభోత్సవం, ఇతర కార్యక్రమాలు దిగ్వి జయం కావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్, డీజీపీ మహేందర్‌రెడ్డితో పాటు అధికార యంత్రాం గానికి, పోలీసు శాఖకు అభినందనలు తెలిపారు. అన్ని ప్రభుత్వ శాఖలు పూర్తి సమన్వయంతో పని చేసి రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిం చిన కార్యక్రమాలను దిగ్విజయం చేశారని కొని యాడారు. భద్రతా ఏర్పాట్లు బాగున్నాయని పోలీస్ శాఖను ప్రత్యేకంగా అభినందించారు. పోలీసుల పనిని ప్రశంసిస్తూ కేంద్ర ప్రభుత్వం నుంచి తనకు సందేశం వచ్చిందని చెప్పారు. రాష్ట్ర పోలీసులకు అమెరికా సీక్రెట్ ఏజెన్సీ, కేంద్ర హోం శాఖ, నీతి ఆయోగ్, వివిధ దేశాల ప్రముఖుల నుంచి కూడా ప్రశంసలు లభించాయి. ఇవాంకా పర్యటన అంతా రహస్యమే ఇవాంకా పర్యటన షెడ్యూల్‌ను అమెరికా అధికారులు చాలా గోప్యంగా ఉంచారు. సీక్రెట్ సర్వీస్ సిబ్బంది ఆమె కదలికలపై చివరి క్షణంలోనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ముందుగా ఆమె ప్రత్యేక విమానంలో వస్తారని చెప్పారు. చివరికి సాధారణ ప్యాసింజర్ విమానంలోనే వచ్చారు. వెస్టిన్ హోటల్లో బస చేస్తారని ముందు చెప్పారు. కానీ చివరికి ట్రైడెంట్‌కు మారింది. గోల్కొండ కోట సందర్శించే విషయాన్ని కూడా చివరి క్షణం దాకా గోప్యంగా ఉంచారు. అమెరికన్ సీక్రెట్ ఏజెన్సీ భద్రతా వ్యూహాలకు అనుగుణంగా రాష్ట్ర పోలీసులు కూడా ప్లాన్ ఏ, ప్లాన్ బీ రూపొందించుకుని సిద్ధంగా ఉన్నారు. ఇవాంక పర్యటన ముగించుకుని వెళ్లిపోయే సందర్భంగా అమెరికా సీక్రెట్ సర్వీస్ అధికారులు డీజీపీ మహేందర్ రెడ్డిని ప్రత్యేకంగా అభినందించారు. మహిళలను అన్ని రంగాల్లో ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది రాష్ట్ర పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళలను అన్ని రంగాల్లో ప్రోత్సహిస్తోందని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ పేర్కొన్నారు. గురువారం ఉదయం నీతి ఆయోగ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ఫిక్కీ, ఫిక్కీ ఫ్లో, ఇండియన్ స్కూల్ బిజినెస్ (ఐఎస్బీ) సంయుక్త ఆధ్వర్యంలో గచ్చిబౌలిలోని ఐఎస్బీ ప్రాంగణంలో వివిధ రంగాలకు చెందిన మహిళా ప్రతినిధులు, ఎంటర్‌ప్రెన్యూర్స్‌తో బ్రేక్‌ఫాస్ట్ సమావేశం జరిగింది. జీఈఎస్ సదస్సులో భాగంగా నిర్వహించిన ఈ సమావేశంలో జయేశ్ రంజన్ మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో విశేష ప్రతిభ చాటు తూ కీలకపాత్ర పోషిస్తున్నారన్నారు. తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన టీఎస్ఐపాస్, పారిశ్రామిక విధానం దేశవ్యాప్తంగా అందరినీ ఆలోచనలో పడేస్తోందన్నారు. విదేశీయులు సైతం దీన్ని పరిశీలిస్తూ పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ముందుకు వస్తున్నారన్నారు. హైదరాబాద్ నగరం స్టార్టప్‌లకు నిలయం గా మారిందన్నారు. కేటీఆర్‌కు వైట్‌హౌస్ నుంచి ఆహ్వానం సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావుకు అమెరికా అధ్యక్షుడి భవనం వైట్‌హౌస్ నుంచి ప్రత్యేక ఆహ్వానం అందిందని జయేశ్ రంజన్ తెలిపారు. ఫిబ్రవరి 12న హార్వర్డ్ వర్సిటీ సందర్శనలో భాగంగా ఈ టూర్ ఉంటుందన్నారు. ఇవాంకా ట్రంప్ స్వయంగా కేటీఆర్‌ను వైట్‌హౌస్‌కు ఆహ్వానించారన్నారు. ‘రోడ్ టూ గెస్’ పేరిట 50 సదస్సులు నీతి ఆయోగ్ సలహాదారు అన్నారాయ్ హైదరాబాద్: జీఈఎస్ సదస్సు అనేది అమెరికా సహకారంతో నిర్వహించిన అంతర్జాతీయ సదస్సు. కేంద్ర ప్రభుత్వం వినూత్న ఆలోచనలకు, స్టార్టప్‌లకు పూర్తి స్థాయి ప్రోత్సాహాన్ని ఇస్తుందని నీతి ఆయోగ్ సలహాదారు అన్నారాయ్ పేర్కొన్నారు. గత రెండు నెలలుగా ‘రోడ్ టూ గెస్’పేరిట 50 సదస్సులను దేశవ్యాప్తంగా నిర్వహించామన్నారు. ఎంటర్ప్రెన్యూర్ డెవలప్ స్కిల్స్, అటల్ ఇన్నోవేషన్ మిషన్, స్టార్టప్, ముద్రా, స్టాండప్ వంటి కార్యక్రమాల ద్వారా అన్ని రకాలుగా ప్రజా సమస్యల పరిష్కారానికి, స్టార్టప్‌ల రూపకల్పనకు ప్రోత్సహిస్తామన్నారు. నీతి ఆయోగ్, ఫిక్కీతో కలసి పనిచేయడం ద్వారా స్టార్టప్‌లకు, మహిళా ఎంటర్‌ప్రెన్యూర్స్‌కు మరింతగా సహకరిస్తామన్నారు. అనంతరం ఈ సమావేశంలో పాల్గొన్న ఫిక్కీ హైదరాబాద్ చాప్టర్ చైర్పర్సన్ కామిని సరాఫ్, సినీనటి మంచు లక్ష్మి, సైలవెంట్ అడ్వైజర్స్ ప్రైవేట్ లిమిటెడ్ వ్యవస్థాపక డైరెక్టర్ ఆనంద సుదర్శన్, అపోలో ఆస్పత్రుల జేఎండీ డా. సంగీతారెడ్డి, ఐఎస్బీ ఐఈ సెంటర్ అకడమిక్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఆనంద్ నందకుమార్, ఐఎస్బీ ప్రొఫెసర్ సమ్యా సింద్రాని, సైఫెర్ హెల్త్‌కేర్ ఎండీ సొనాలీ స్రుంగరామ్, ఫ్య్రాంకోఫెర్ ఇండియా హెడ్ ఆనంది అయ్యర్ ప్రసంగించారు. మహిళా పారిశ్రామికవేత్తలను ఫిక్కీ ప్రోత్సహిస్తుంది ఫిక్కీ ప్రధాన కార్యదర్శి సంజయ్ బారువా భారతీయ పారిశ్రామిక వేత్తలను ప్రత్యేకించి మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తున్నట్లు ఫిక్కీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సంజయ్ బారువా పేర్కొన్నారు. డీఎస్టీ లాక్షెడ్ మార్టిన్ ఇండియా ఇన్నోవేషన్ గ్రోత్ ప్రోగ్రామ్ ద్వారా వ్యవస్థాపకులకు అవసరమైన కల్పన, వ్యాపారాభివృద్ధి మద్దతుతో 800 మిలియన్ డాలర్ల సంపదను సృష్టించిందన్నారు. ఇప్పటి వరకు 500 మంది వ్యవస్థాపకులకు మద్దతు అందిందన్నారు. ఏపీ ప్రభుత్వం, యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్, ఫిక్కీ భాగస్వామ్యంతో తిరుపతిలో ప్రపంచ స్థాయి ఇంక్యుబేటర్ స్థాపనకు ఒప్పందం జరిగిందన్నారు. ఇప్పటి వరకు 85కు పైగా ఇంక్యుబేటర్లు ప్రారంభించేందుకు తోడ్పాటు ఇచ్చామన్నారు. ఫిక్కీ ఎఫ్ఎల్ఓను ఫిక్కీ విమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఆర్గనైజేషన్‌గా మార్చాలని బావిస్తున్నామన్నారు. -
5 దశాబ్దాల్లో వేల ఏళ్ల అభివృద్ధి
సాక్షి, హైదరాబాద్: భారత్ వేగంగా అభివృద్ధి చెందుతోందని, రానున్న ఐదు దశాబ్దాల కాలంలో గత ఐదు వేల సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి జరగబోతోందని నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ అన్నారు. పట్టణీకరణ ప్రధానాంశంగా అభివృద్ధి కార్యక్రమాలు ఉంటాయని చెప్పారు. వినూత్న, స్థిర పట్టణాభివృద్ధి కోసం కార్యాచరణ రూపొందిస్తున్నామని తెలిపారు. మంగళవారం హైదరాబాద్‌లో ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు (జీఈఎస్) ముగింపు సెషన్‌కు ఆయన మోడరేటర్‌గా వ్యవహరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘‘అమెరికా, యూరోప్ దేశాల్లో పట్టణీకరణ పూర్తయింది. చైనాలో పూర్తయ్యే దశకు చేరుకుంది. కానీ భారత్‌లో ఇప్పుడే ప్రారంభమైంది. ఇది శుభపరిణామం. రాబోయే 50 ఏళ్లలో భారత్ మరో స్థితిలో ఉంటుంది’’ అని పేర్కొన్నారు. సమతుల అభివృద్ధి సాధించేందుకు 7 రాష్ట్రాల్లోని 201 జిల్లాల్లో విద్య, వైద్య, పోషకాహార సౌకర్యాల కల్పన కోసం ప్రయత్నిస్తున్నట్టు వివరించారు. ‘ఉమెన్ ఫస్ట్.. ప్రాస్పరిటీ ఆల్’ నినాదంతో జరిగిన ఈ సదస్సు ప్రపంచంలోని మహిళా పారిశ్రామికవేత్తలు, ఔత్సాహికులకు స్ఫూర్తిగా నిలిచిందన్నారు. చివరి సెషన్లో వెల్స్పన్ ఇండియా లిమిటెడ్ సీఈవో దీపాలీ గోయెం కా, ఐయూరోప్ క్యాపిటల్ ఫౌండర్ క్రిస్టినా డేవిసన్, దక్షిణాఫ్రికాకు చెందిన పెట్రోలింక్ ఫౌండర్ లెరొటో సెలీనా ముత్సుమయి, టీంలీస్ సర్వీసెస్ చైర్మన్ మనీశ్ సభర్వాల్, యూఎస్ఏఐడీ అడ్మినిస్ట్రేటర్ మార్క్ గ్రీన్‌లతో కూడిన ప్యానెల్ ‘మహిళా సాధికారత’పై చర్చాగోష్ఠి నిర్వహించారు. ఇందులో ఎవరేమన్నారంటే.. ఫ్రాన్స్‌లో ప్రతి కంపెనీలో 40 శాతం మహిళా డైరెక్టర్లు: క్రిస్టినా మహిళలు ఎదగాలంటే మరో మహిళ సహకారం చాలా అవసరం. పెట్టుబడిదారుగా నేను కూడా మంచి ఆలోచనలున్న మహిళలకు మద్దతిచ్చేందుకు సిద్ధంగా ఉన్నా. అయితే మహిళా సాధికారత కోసం మార్పు పైస్థాయి నుంచి రావాలి. కంపెనీల స్థాపనలోనే మహిళల భాగస్వామ్యం ఉండాలి. ఫ్రాన్స్‌లో ఏ కంపెనీ పెట్టినా ఆ కంపెనీ బోర్డులో 40 శాతం మంది మహిళలే సభ్యులుగా ఉంటారు. ఆ మేరకు అక్కడ చట్టం చేశారు. అమెరికాలో అది 20 శాతమే ఉంది. దాన్ని పెంచేందుకు ప్రయత్నిస్తున్నాం. అమెరికాలోని అడ్వెంచర్ క్యాపిటల్ ఫండ్స్‌లో 72 శాతం పెట్టుబడిదారులు పురుషులే. యూరోప్‌లో పరిస్థితి మరీ దారుణం. మహిళలకు పెట్టుబడులు కావాలంటే ముందు వారు విజయాలు సాధించాలి. విజయవంతమైన పారిశ్రామికవేత్తలుగా నిరూపించుకున్నప్పుడే మిమ్మల్ని నమ్మి ఎవరైనా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తారు. అగ్నిభద్రా అందరికీ ఆదర్శం: దీపాలి గ్రామీణ భారతం అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది. గుజరాత్‌కు చెందిన అగ్నిభద్రా అనే గ్రామీణ యువతిని వాల్‌మార్ట్ కంపెనీ ఎంచుకుంది. వాస్తీ అనే ఎన్జీవో నిర్వహించిన నైపుణ్య ప్రదర్శన పోటీలో విజేతగా నిలిచి ఆమె ఈ అవకాశాన్ని దక్కించుకుంది. గ్రామీణ యువతులు ఆమెను ఆదర్శంగా తీసుకోవాలి. దేశంలోని మహిళా శక్తిని సక్రమంగా వినియోగించుకుంటే 2.9 ట్రిలియన్ డాలర్ల ఆదాయాన్ని సముపార్జించవచ్చు. 2025 కల్లా దేశంలోని 6.8 కోట్ల మంది మహిళలు పనిలో కొత్తగా భాగస్వామ్యం కాబోతున్నారు. ఇది భారత ఆర్థిక వ్యవస్థనే మార్చేస్తుంది. మహిళలు గణితంలో నైపుణ్యం సాధించాలి: లొరెటో మహిళలకు విద్య అవకాశాలు మెరుగుపడినప్పుడే సామాజిక మార్పు వస్తుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత మహిళలు, యువతులు, చిన్నారులు గణితంలో నైపుణ్యం సాధించాలి. గణితం లేకుండా 21వ శతాబ్దపు విద్య ఉపయోగం లేదు. మహిళలకు తగిన అవకాశాలు కల్పిస్తే వ్యాపారాలు కాదు జాతిని నిర్మిస్తారు. ఈ సదస్సులో పాల్గొనడం మంచి అనుభూతిని కలిగించింది. కేవలం మ్యాపులు, టీవీల్లో మాత్రమే చూసే అవకాశం ఉన్న అనేక దేశాల మహిళలు, పారిశ్రామికవేత్తలతో అనుభవాలను పంచుకోవడం నిజంగా అద్భుతమే. మహిళల్లోని వాస్తవికతకు ప్రతిబింబం: మార్క్ గ్రీన్ ఈ సదస్సులో నేను మహిళా పారిశ్రామికవేత్తల్లోని ప్రతిభను చూశాను. వారికి సహజంగానే ఉండే వాస్తవికత, శక్తికి ఈ సదస్సు ప్రతిబింబంగా నిలిచింది. మహిళా సాధికారతలో భాగంగా వారికున్న అడ్డంకులను తొలగించే ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా ఐటీని వారికి దగ్గర చేయాలి. ఆరోగ్య సమస్యలను పరిష్కరించాలి. భారత్‌లో మహిళలకు టీబీ పెద్ద అడ్డంకిగా మారింది. ఇలాంటివి గుర్తించి వాటిపై పనిచేయాలి. సరైన విద్య అందించాలి. అప్పుడే మహిళా సాధికారత సాధ్యమవుతుంది. వేర్వేరు వేతనాలు చట్ట విరుద్ధం: మనీశ్ పని ప్రాంతాల్లో పురుషులకు, మహిళలకు వేర్వేరుగా వేతనాలివ్వడం చట్ట విరుద్ధం. దీన్ని నియంత్రించాలి. దేశాభివృద్ధిలో మహిళల భాగస్వామ్యం 30 నుంచి 18 శాతానికి పడిపోయింది. దీన్ని అధిగమించడం అనివార్యం. ప్రస్తుతానికి దేశంలో ఉద్యోగాల సమస్యేమీ లేదు. వేతనాలు కోరినంత సాధించుకునే అవకాశాలున్నాయి. కానీ భవిష్యత్తులో ఉద్యోగాల కల్పన అనుకున్నంత సులువుగా ఉండకపోవచ్చు. అందుకే పట్టణీకరణ, పారిశ్రామికీకరణ ద్వారా మానవ పెట్టుబడులను తయారు చేసుకోవాల్సి ఉంది. చివరి సెషన్లో అంతా మహిళలే మహిళా సాధికారత ప్రధానాంశంగా జరిగిన మూడ్రోజుల ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు ముగింపు సెషన్‌ను తనదైన శైలిలో ముగించారు నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్. దీనికి మోడరేటర్‌గా ఉన్న ఆయన.. ప్యానెల్ సభ్యులను ప్రశ్నలు అడిగేందుకు పురుషులను అనుమతించలేదు. తొలుత లేడీస్ ఫస్ట్ అంటూ కొందరు మహిళలకు అవకాశమిచ్చినా ఓ పురుష పారిశ్రామికవేత్త ప్రశ్న అడిగేందుకు ప్రయత్నించగా.. ‘మీ వెనుక ఆమెను ముందు అడగనీయండి.’ అని వారించారు. ఆ తర్వాత ఆయన ఈ సెషన్లో కేవలం మహిళలే ప్రశ్నించాలని, పురుషులకు అవకాశం లేదన్నారు. దీంతో సభికుల్లో హర్షధ్వా నాలు వ్యక్తమయ్యాయి. చివరి సెషన్‌ను ఆయన ఓ మహిళా పారిశ్రామికవేత్త ప్రశ్నతో ముగించడం, ఈ సెషన్‌లోని ఐదుగురు ప్యానెల్ స్పీకర్లలో ముగ్గురు మహిళలే కావడం విశేషం. -
ప్రచార కార్యక్రమంగా జీఈఎస్: పొంగులేటి
సాక్షి, హైదరాబాద్: పారిశ్రామికవేత్తల సదస్సు(జీఈఎస్)ను టీఆర్ఎస్ ప్రచార కార్యక్రమంగా, సీఎం కేసీఆర్ కుటుంబసభ్యుల వ్యక్తిగత కార్యక్రమంగా నిర్వహించారని శాసనమండలిలో కాంగ్రెస్ ఉపనేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి విమర్శించారు. గురువారమిక్కడ విలేకరులతో మాట్లాడుతూ.. కీలకమైన సదస్సులో రాజకీయాలకు అతీతంగా ప్రజాప్రతినిధులను భాగస్వా మ్యం చేయకుండా అవమానించారని అన్నారు. టీఆర్ఎస్ రాజకీయ ప్రయోజ నాల కోసం, వ్యక్తిగత ప్రచారం కోసం ప్రజాప్రతినిధులను అవమానించడం దారుణమన్నారు. నగర మేయర్‌ను అవమానించారని, ఆ పదవికి ఇచ్చే గౌరవం ఇదేనా అని ప్రశ్నించారు. మెట్రో శిలాఫలకంపై మేయర్ పేరు లేకపోవడం విచారకరమని అన్నారు. మెట్రో ప్రారంభానికి ప్రతిపక్షాన్ని ఆహ్వానించకపోవడం సరికాదన్నారు. ప్రొటోకాల్ ఉల్లంఘనపై విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
జీఈఎస్ సదస్సులో ఆకట్టుకున్న కేటీఆర్
-
విశ్వవిజ్ఞానఖనిలా కనిపించారు!
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు (జీఈఎస్)లో అద్భుతంగా ప్రసంగించి.. చక్కని సమన్వయకర్తగా వ్యవహరించిన యువనాయకుడు, తెలంగాణ మంత్రి కే తారకరామారావుపై ప్రశంసల జల్లు కురుస్తోంది. జీఈఎస్ వేదికపై ఆయన ప్రసంగం మంత్రముగ్ధుల్ని చేసిందని పలువురు నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ప్రముఖ సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ కూడా ట్విట్టర్లో కేటీఆర్‌ను ప్రశంసించారు. ‘ కేటీఆర్‌గారు, ఇన్నాళ్లూ రాజకీయ పోరాట యోధునిగా, యువ నాయకునిగా తెలిసిన మీరు, నిన్న ప్రపంచ వ్యాపారసదస్సు (జీఈఎస్)లో విశ్వవిజ్ఞానఖనిలా కనిపించారు! అభినందనలండి! మీ భాషణం అనితరసాధ్యం’అని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌ను రీట్వీట్ చేస్తూ కేటీఆర్ థ్యాంక్స్ చెప్పారు. Thanks Sir 🙏 https://t.co/B7u1FfkSNp — KTR (@KTRTRS) 30 November 2017 మన మెట్రో.. మన గౌరవం! బుధవారం నుంచి నగరప్రజలకు అందుబాటులోకి వచ్చిన హైదరాబాద్ మెట్రో గురించి కూడా కేటీఆర్ ట్వీట్ చేశారు. ‘తొలిరోజు హైదరాబాద్ మెట్రో అన్ని రికార్డులు బద్దలు కొడుతుందని, రెండోరోజు నుంచి ప్రయాణికుల సంఖ్య పెరుగుతుందని నాకు చెప్పారు. కాబట్టి హైదరాబాద్ పోలీసులు, హైదరాబాద్ మెట్రో సంస్థ, ఎల్అండ్ కంపెనీ అప్రమత్తంగా ఉంటూ రద్దీని నియంత్రించాలి. పిల్లలు, వృద్ధులు, సాటి ప్రయాణికుల పట్ల ధ్యాస కనబర్చాలని హైదరాబాదీలను కోరుతున్నా. మన మెట్రో, మన గౌరవం’ అని కేటీఆర్ ట్వీట్ చేశారు. హైదరాబాద్ మెట్రో తొలిరోజే 2 లక్షలమంది ప్రయాణికులతో రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. -
హైదరాబాద్ టూర్: ఇవాంక అమెరికా వెళ్లాక ఏమన్నారంటే
అమెరికా నెలవంక ఇవాంకా ట్రంప్ హైదరాబాద్ పర్యటన ముగిసింది. నగరంలో జరుగుతున్న ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు (జీఈఎస్)లో పాల్గొనేందుకు నగరానికి వచ్చిన ఇవాంక.. ఇక్కడ రెండురోజులు గడిపారు. హెచ్ఐసీసీలో జరిగిన జీఈఎస్ సదస్సులో పాల్గొనడంతోపాటు.. ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ఇచ్చిన విందుకు హాజరై.. నగరంలోని చారిత్రక గోల్కొండ కోటను సందర్శించారు. మొత్తానికి తన నడక, నడవడి ప్రపంచ పారిశ్రామిక సదస్సులో అందరినీ ఆకట్టుకున్నారు. ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉన్నట్టుగా నిరాడంబర స్వభావంతో ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు (జీఈఎస్)లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆద్యంతం ఉల్లాసంగా, అద్భుతంగా సాగిన హైదరాబాద్ పర్యటనపై ఇవాంక... అమెరికాకు తిరిగి వెళ్లగానే ట్వీట్‌చేశారు. ‘హైదరాబాద్ నుంచి తిరిగి బయలుదేరేముందు అమెరికా ప్రతినిధులతో కలిసి గోల్కొండ కోటను సందర్శించాను. అద్భుతమైన ఈ పర్యటనకు పరిపూర్ణ ముగింపు ఇది (ద పర్ఫెక్ట్ ఎండ్ టు ఏ రిమార్కబుల్ విజిట్)’ ఇవాంక ట్వీట్ చేశారు. Tour of Golkonda Fort with members of the US delegation prior to departing Hyderabad. The perfect end to a remarkable visit. #GES2017 pic.twitter.com/HNYeBe4FdB — Ivanka Trump (@IvankaTrump) 29 November 2017 -
జీఈఎస్‌లో అద్బుత ఆవిష్కరణ
-
హైదరాబాద్..గ్రేట్ విజిట్..!
-
అప్పుడే సిటీ వదిలెళ్లాలని లేదు
-
వావ్.. హైదరాబాద్..!
సాక్షి, హైదరాబాద్: ‘వావ్.. హైదరాబాద్..’‘భాగ్యనగరాన్ని అప్పుడే వదిలి వెళ్లాలని లేదు..’ఈ మాటలు అన్నది ఎవరో కాదు.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్. నగర పర్యటన ముగింపు సందర్భంగా ఆమె చేసిన వ్యాఖ్యలివీ.. మంగళవారం తెల్లవారుజామున శంషాబాద్ విమానాశ్రయంలో విమానం దిగిన ఇవాంకా తన కాన్వాయ్‌లో ట్రైడెంట్ హోటల్ వరకు ప్రయాణిస్తూ హైదరాబాద్ అందాలను తిలకించారు.. ఆపై హెచ్ఐసీసీకి వెళ్లిన ఆమె.. అక్కడి ఆధునిక అంశాలను పరిశీలించారు.. మంగళవారం రాత్రి తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్ అందాలను వీక్షించి.. బిర్యానీ, స్థానిక రుచుల్నీ ఆస్వాదించారు.. బుధవారం మధ్యాహ్నం గోల్కొండ కోటను సందర్శించిన ఆమె.. నగర చరిత్రను తెలుసుకున్నారు.. ఈ రెండు రోజుల పర్యటనలో అమెరికా అధ్యక్షుడి కుమార్తెను నగరం కట్టిపడేసింది. తనకు ఈ వాతావరం ఎంతో నచ్చిందని.. అప్పుడే హైదరాబాద్ వదిలి వెళ్లాలని లేదని.. మరికొన్ని రోజులు ఉండాలని అనిపిస్తున్నప్పటికీ సమయాభావం వల్ల బుధవారం రాత్రికే తిరుగు ప్రయాణమవ్వాల్సి వస్తోందని ఇవాంకా వ్యాఖ్యానించారు. గోల్కొండలో ఇవాంకా పర్యటన విధుల్లో భాగం పంచుకున్న నగర అదనపు పోలీస్ కమిషనర్ స్వాతిలక్రాతో ఇవాంకా తన భావాలను పంచుకున్నారు. దాదాపు గంట సేపు గోల్కొండ కోటలో గడిపిన ఇవాంకాకు స్వాతిలక్రాను అమెరికా రా యబార కార్యాలయం అధికారి పరిచయం చేశారు. అమెరికా ప్రభుత్వ విభాగం ఇటీవల ప్రకటించిన ప్రతిష్టాత్మక హ్యాంపేరీ లీడర్షిప్ అవార్డును 2 రోజుల క్రితం స్వాతిలక్రా అమెరికాలో అందుకున్నారని ఆ అధికారి ఇవాంకాకి వివరించారు. యూనైటెడ్ స్టేట్స్ బ్యూరో అఫ్ ఎడ్యుకేషన్ అండ్ కల్చరల్ అఫైర్స్, ఇన్స్టిట్యూట్ అఫ్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్(ఐఐఈ) విభాగం నిర్వహించిన కార్యక్రమంలోనూ పాల్గొన్నారని ఆమెకు వివరించారు. సిటీ టెక్నాలజీకి కితాబు.. ఈ నేపథ్యంలో స్వాతిలక్రాతో కాసేపు సంభాషించిన ఇవాంకా నగర పోలీసు విభాగం అంశాలు అడిగి తెలుసుకున్నారు. హైదరాబాద్ పోలీసులు అభివృద్ధి చేసి, వినియోగిస్తున్న హాక్–ఐ, హైదరాబాద్ కాప్, హైదరాబాద్ ట్రాఫిక్ లైవ్ యాప్స్‌తోపాటు బాధితులకు సత్వర న్యాయం చేయడం, నేరగాళ్లకు చెక్ చెప్పడానికి వాడుతున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వివరాలను స్వాతిలక్రా ఇవాంకాకు వివరించారు. మహిళలు, యువతులకు అన్ని రకాల సహాయసహకారాలు అందించడానికి సిటీ పోలీసు విభాగం సాంకేతిక పరిజ్ఞానం వినియోగిస్తున్న విధానాన్ని తెలిపారు. న్యూయార్క్ పోలీసు డిపార్ట్మెంట్(ఎన్‌వైపీడీ) తరహాలోనే తమ వద్దా అత్యాధునిక డయల్ 100 వ్యవస్థ ఉన్నట్లు స్వాతిలక్రా.. ఇవాంకాకు తెలిపారు. దాదాపు 10 నిమిషాల పాటు నగర పోలీసులకు సంబంధించిన వివరాలు తెలుసుకున్న ఇవాంకా.. అద్భుతమంటూ కితాబిచ్చారని తెలిసింది. పోలీసింగ్‌లోనూ మహిళలకు ప్రాధాన్యం ఇవ్వడాన్ని ఇవాంకా అభినందించారు. -
ముందు భార్యను.. తల్లిని.. బిడ్డను..
సాక్షి, హైదరాబాద్: ‘నేనొక భార్యను.. తల్లిని.. చెల్లిని.. బిడ్డను.. ఆ తర్వాతే ఔత్సాహిక పారిశ్రామికవేత్తను, ప్రభుత్వ సలహాదారును..’.. ఇవాంకా ట్రంప్ ట్వీటర్, ఫేస్‌బుక్‌లలో తనకు తానుగా చేసుకున్న పరిచయం ఇది. అచ్చంగా తన పరిచయానికి తగినట్లుగానే ఉన్న ఇవాంకా నడక, నడవడి ప్రపంచ పారిశ్రామిక సదస్సులో అందరినీ ఆకట్టుకున్నాయి. ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉన్నట్లుగానే ఆమె తీరు కనిపించింది. మొత్తంగా ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు (జీఈఎస్)లో ఇవాంకా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వేదిక మీద అగ్రరాజ్య మహిళా దిగ్గజంలా కాకుండా.. అందరినీ కలుపుకొని పోతూ, సాధారణ మహిళగానే కనిపించింది. మోముపై చెదరని చిరునవ్వుతో అతిథులను పలకరించటంతోపాటు వేదికపై ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్ మాట్లాడినప్పుడు అందరి కంటే ముందుగా ఆమెనే చప్పట్లు కొట్టడం కనిపించింది. తను ప్రసంగిస్తున్నప్పుడు సైతం తనకు తానుగా సంబరపడిపోవటం, చప్పట్లు కొడుతూ ఆనందపడటం వంటివాటితో ఆమె ప్రసంగం ‘బోల్డ్ లైక్ ఏ చైల్డ్ (తన శక్తికి మించిన పనిచేసి.. పెద్దవాళ్ల మెప్పుకోసం చూసే చిన్న పిల్లల మాదిరి..)’లా సాగిందని సదస్సుకు హాజరైన పారిశ్రామిక దిగ్గజాలు పేర్కొనడం గమనార్హం. అమెరికాతో మన దౌత్య సంబంధాల గురించి ప్రస్తావించినా.. మహిళలకు సంబంధించి స్ఫూర్తి కలిగించే మాటలు చెప్పినా.. ఆగి మరీ ప్రేక్షకుల నుంచి స్పందన కోరుకోవడం, చప్పట్ల రూపంలో అభినందనలు అందితే మురిసిపోవడం వంటివన్నీ ఇవాంకా ప్రసంగంలో ఆకట్టుకున్నాయి. మచ్చుకైనా కనిపించని ఆడంబరం.. ‘మిత్ర’రోబోతో మీట నొక్కి సదస్సును ప్రారంభించిన సందర్భంలోనూ ఇవాంకా మురిసిపోయింది. ‘భలే బాగుందం’టూ పిల్లలు ఆనందపడ్డట్లుగా అనిపించింది. జీఈఎస్‌కు సంబంధించిన నృత్య ప్రదర్శన, జయహో పాటతో ప్రదర్శించిన థీమ్ సాంగ్, లేజర్ డ్యాన్స్‌ను చూసినంత సేపూ అదే ఆనందం. ప్రపంచ సదస్సుకు అమెరికా ప్రతినిధిగా వచ్చిన ఆడంబరం కంటే.. సాదాసీదాగా సభకు వచ్చిన మహిళా పారిశ్రామికవేత్తగానే ఇవాంకా వ్యవహరించినట్లు అనిపించింది. కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్‌ను కలసినప్పుడుగానీ, ఇతర మహిళా పారిశ్రామికవేత్తలతో మాట్లాడుతున్నప్పుడుగానీ ఆమె ఆహార్యం, మాటతీరు ఎవరో స్నేహితులు, బంధువులతో వ్యవహరించినంత సాదాగా కనిపించింది. మర్యాదగా, గౌరవంగా, అన్నింటికీ మించి స్నేహపూర్వకంగా.. వ్యవహరించింది. అందుకే ‘షీ ఈజ్ మోర్ లైక్ ఎ చైల్డ్’.. ట్వీటర్, ఫేస్బుక్లో తనకు తానుగా చెప్పుకున్న పరిచయాన్ని సదస్సులో కళ్లకు కట్టినట్లుగా చూపారనే చెప్పొచ్చు. రాయల్ గ్రీన్.. వైబ్రెంట్ వైలెట్.. రేడియంట్ రెడ్.. జీఈఎస్‌లో ఇవాంకా ధరించిన వస్త్రాలు అందరినీ ఆకర్షించాయి. హైదరాబాద్ విమానాశ్రయంలో దిగిన సమయంలో నలుపు రంగు డ్రెస్‌లో చాలా సింపుల్‌గా కనిపించారు. జీఈఎస్ సమావేశం ప్రారంభానికి రాయల్ గ్రీన్ రంగు సిల్క్ డ్రెస్‌లో దర్శనమిచ్చింది. దాని మీద పసుపు, గులాబీ రంగుల్లో ఉన్న పూల డిజైన్లతో పూర్తి విభిన్నమైన లుక్ వచ్చింది. ఈ డ్రెస్ జపాన్ మహిళలు సాంప్రదాయంగా వేసుకునే ‘కిమోనో’డ్రెస్‌ను గుర్తుకుతేవడం గమనార్హం. ఇక ఫలక్‌నుమాలో విందుకు హాజరైన సమయంలో ఇవాంకా ఉదారంగు (వైబ్రెంట్ వయోలెట్)లో ప్రకాశవంతమైన గౌన్ వేసుకున్నారు. హైనెక్, ఫుల్ స్లీవ్స్‌కు తోడు ముడుచుకున్న సిగతో హుందాగా కనిపించారు. రెండో రోజున జీఈఎస్ సమావేశానికి ఆకర్షణీయంగా ఉన్న ఎరుపు రంగు (రేడియంట్ రెడ్) డ్రెస్ వేసుకున్నారు. మొదటి రోజుకన్నా రెట్టింపు ఉత్సాహంతో ఉన్నానని చెప్పడానికి ఆ రంగును ఎంచుకున్నారో.. మరేమోగానీ మొదటి రోజుకన్నా బాగా ఉత్సాహంగా కనిపించారు. కేటీఆర్, చందా కొచ్చర్, చెర్రీ బ్లెయిర్‌లతో చర్చాగోష్టిలో ఉత్సాహం కనిపించింది. ఫలక్‌నుమా విందుకు హాజరైనప్పుడు మినహా మిగతా స మయంలో ఇవాంకా జుట్టును లూజుగా వదిలేసే ఉన్నారు. విందులో మాత్రం సిగ ముడుచుకున్నారు. ఇవాంకా ఆభరణాలకు అంత ప్రాధాన్యమేమీ ఇవ్వకపోవడం గమనార్హం. -
అతివకు అండగా నిలవాలి
సమాజంలో సగ భాగమైన మహిళలు అన్ని రంగాల్లో ఎదిగేందుకు ప్రభుత్వాలు విధానాలు రూపొందిస్తేనే సరిపోదని.. పురుషులూ తమ వంతు పాత్ర పోషించడం కూడా అవసరమేనని బుధవారం గ్లోబల్ ఎంట్రప్రెన్యూర్స్ సమ్మిట్ (జీఈఎస్)లో భాగంగా జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ప్రపంచ దిగ్గజ మహిళలు అభిప్రాయపడ్డారు. ఉద్యోగులుగా, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా మహిళలు మరింత ఎక్కువ మంది భాగమవడం ఆర్థిక అభివృద్ధిని పెంచే విషయమన్నారు. ఈ దిశగా మహిళలకు పెట్టుబడులను అందుబాటులో ఉంచడంతోపాటు తగిన నైపుణ్యాలు అందించడం, విద్యా, ఉపాధి, మార్గదర్శక అవకాశాలు కల్పించడం తప్పనిసరని, ఈ బాధ్యత ప్రభుత్వాలదే కాకుండా.. కుటుంబాల్లోని పురుషులపైనా ఉందన్నారు. ‘ఇన్నొవేషన్స్ ఇన్ వర్క్‌ఫోర్స్ డెవలప్మెంట్ అండ్ స్కిల్స్ ట్రైనింగ్’ అంశంపై జరిగిన చర్చలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సలహాదారు ఇవాంకా ట్రంప్‌తోపాటు బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ సతీమణి చెర్రీ బ్లెయిర్, డెల్ కంప్యూటర్స్ చీఫ్ కన్సూ్యమర్ ఆఫీసర్ కెరెన్ క్వింటాస్, ఐసీఐసీఐ బ్యాంకు చైర్ పర్సన్ చందా కొచ్చర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ ఐటీశాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు సమన్వయకర్తగా వ్యవహరించారు. – సాక్షి, హైదరాబాద్ స్త్రీలకు సమాన అవకాశాలివ్వాలి:ఇవాంకా పురుషులు, మహిళలకు సమాన ఉద్యోగ అవకాశాలివ్వడం కంపెనీల సామాజిక బాధ్యత మాత్రమే కాదని, ఆర్థికంగానూ ప్రయోజనకరమని ఇవాంకా ట్రంప్ తెలిపారు. కేటీఆర్ అడిగిన ఒక ప్రశ్నకు ఆమె సమాధానమిస్తూ మహిళలు నడుపుతున్న చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు పెట్టుబడుల లభ్యత అమెరికాలో కేవలం 3 శాతం మాత్రమే ఉందన్నారు. వచ్చే ఏడాది నుంచి ప్రత్యేక పథకం ద్వారా ఈ లోపాన్ని సవరించేందుకు ట్రంప్ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని వివరించారు. ‘‘కుటుంబ బాధ్యతల్లో పురుషులు చురుకుగా పాల్గొనరన్నది పాత తరానికి చెందింది. కొత్త తరం పురుషులు, మహిళల్లోనూ మార్పు కనిపిస్తోంది. ఉద్యోగాలు చేసేందుకు, పరిశ్రమల ఏర్పాటుకు మహిళలూ ఉత్సాహం చూపుతుండగా.. ప్రపంచవ్యాప్తంగా కుటుంబ బాధ్యతలు చూసుకునే పురుషుల సంఖ్య కూడా పెరుగుతోంది’’అని ఇవాంకా ట్రంప్ తెలిపారు. భాగస్వామ్యం పెరుగుతోంది: చందా కొచ్చర్ మహిళలకు పనిలో భాగస్వామ్యం కల్పించే విషయంలో భారత్ మిగిలిన వాటి కంటే మెరుగైన స్థితిలో ఉందని ఐసీఐసీఐ బ్యాంకు చైర్పర్సన్ చందా కొచ్చర్ తెలిపారు. పది కోట్ల మంది మహిళా స్వయం సేవక సంఘాల సభ్యులే ఇందుకు నిదర్శనమన్నారు. మహిళలు వంటింటికే పరిమితమన్న భావన తొలగి అనేక రంగాల్లో వారు ప్రతిభ చాటుకుంటున్నారని చెప్పారు. ఒక దేశ బ్యాంకింగ్ రంగంలో 40 శాతం మంది మహిళలు ఉండటం ఒక్క భారతదేశానికి మాత్రమే చెల్లిందని కొచ్చర్ చెప్పారు. పురుషులు, మహిళల మధ్య అంతరాన్ని మరింత తగ్గిస్తే దేశ స్థూల జాతీయోత్పత్తికి మరో 7,000 కోట్ల డాలర్లు చేర్చవచ్చునని మెకిన్సే అధ్యయనం చెప్పడాన్ని కొచ్చర్ గుర్తుచేశారు. సగం మందికి ఇల్లే ఆఫీసు: కెరెన్ క్వింటాస్ డెల్ కంప్యూటర్స్‌లో పని చేసే మహిళల్లో సగం మంది ఇళ్ల నుంచే విధులు నిర్వహిస్తున్నారని, కుటుంబ బాధ్యతలను సమర్థంగా నిర్వహించేందుకు వీలుగా కంపెనీ వారికి ఈ అవకాశం కల్పిస్తోందని సంస్థ చీఫ్ కన్సూ్యమర్ ఆఫీసర్ కెరెన్ క్వింటాస్ తెలిపారు. మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు డెల్ అనేక చర్యలు చేపట్టిందని, పెట్టుబడులతోపాటు మార్గదర్శకత్వం వహించేందుకు, బిగ్ డేటా, ఆర్టి్టఫిషియల్ ఇంటెలిజెన్స్‌లతో వారికి సాయపడేందుకు చర్యలు చేపడుతోందన్నారు. ఉద్యోగాల్లో, పరిశ్రమల స్థాపనలో పురుషులు, మహిళల మధ్య ఉన్న అంతరం తగ్గితే ఆ యా దేశాల స్థూలజాతీయోత్పత్తి గణనీయంగా పెరుగుతుందని అంతర్జాతీయ సంస్థ మెకెంజీ అధ్యయనం స్పష్టం చేసిన విషయాన్ని కెరెన్ ఈ సందర్భంగా గుర్తుచేశారు. మహిళల సామర్థ్యం వృథా అవుతోంది: చెర్రీ బ్లెయిర్ భారత్‌లో ఉద్యోగాలు చేస్తున్న మహిళలు తక్కువగా ఉన్నారని, వారిలోనూ చాలా మంది పెళ్లిళ్ల తరువాత ఉద్యోగాలు మానేస్తున్నారని, ఈ పరిణామాన్ని మహిళలు వారి సామర్థ్యాన్ని వృథా చేస్తున్నట్లుగానే చూడాలని బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ సతీమణి చెర్రీ బ్లెయిర్ ఆవేదన వ్యక్తం చేశారు. చిన్న వయసులోనే పెళ్లిళ్లు అయిన యువతులతోపాటు లేటు వయసులో మళ్లీ ఉద్యోగాలు, వ్యాపారాలు చేసుకునేలా చెర్రీ బ్లెయిర్ ఫౌండేషన్ తరఫున శిక్షణ ఇస్తున్నామన్నారు. మరో పదేళ్ల తర్వాత... మరో దశాబ్దం తరువాత మహిళలు ఎలా ఉండా లని కోరుకుంటున్నారంటూ కేటీఆర్ ప్రశ్నించగా ఆంక్షలు పెట్టే సమాజం ఉండకూడదని ఆడపిల్లల తల్లులుగా తాము కోరుకుంటున్నామని ఇవాంకా ట్రంప్ బదులిచ్చారు. మహిళలు చేసే పనులు పురుషులు చేయడం, పురుషులకే పరిమితమైన పనులను మహిళలు చేయడం మరింత పెరగాలని ఆకాంక్షించారు. మహిళలకు విద్య, ప్రోత్సాహం, సాధికారత అందాలన్నది తన ఆకాంక్ష అని చందా కొచ్చర్ పేర్కొనగా ఆడపిల్లలు తమకు తగిన వారిని జీవిత భాగస్వామిగా ఎంచుకునే స్వేచ్ఛ అందాలని కోరుకుంటున్నట్లు చెర్రీ బ్లెయిర్ తెలిపారు. గ్రామాలకు స్వచ్ఛ ఇంధనం: అజైతా షా ఇంధనం, మౌలిక రంగ విభాగానికి సంబంధించిన పిచ్ కాంపిటీషన్లో స్టార్టప్ సంస్థ ‘ఫ్రాంటియర్ మార్కెట్స్’విజేతగా నిలిచింది. సోలార్ టెక్నాలజీ ఉత్పత్తుల ద్వారా స్వచ్ఛమైన ఇంధన వనరులను గ్రామీణ ప్రాంతాల మహిళలకు అందుబాటులోకి తెచ్చే ఉద్దేశంతో ఫ్రాంటియర్ మార్కెట్స్‌ని ప్రారంభించినట్లు సంస్థ వ్యవస్థాపకురాలు అజైతా షా ‘సాక్షి’బిజినెస్ బ్యూరోతో చెప్పారు. మహిళా ఎంట్రప్రెన్యూర్స్ సాయంతో వాటిని అందజేస్తున్నట్లు తెలిపారు. రాజస్తాన్‌లో దాదాపు నాలుగు వేల మంది మహిళలకు సోలార్ టెక్నాలజీ ఉత్పత్తులను అందుబాటులోకి తెచ్చామని, తద్వారా వెయ్యి మంది ఔత్సాహిక వ్యాపారవేత్తలకు ఆదాయ మార్గాలు కూడా చూపించగలిగామని వెల్లడించారు. ‘‘మహిళలపై నమ్మకం ఉంచి పెట్టుబడి పెట్టడం వల్ల కలిగే లాభాలను నేను చూశా. దీనిని అందరికీ చూపొ చ్చని జీఈఎస్‌కు వచ్చి.. పిచ్ కాంపిటీషన్లో పాల్గొన్నాను. నా లక్ష్యం అందరికీ నచ్చి, నేను గెలవటం సంతోషం కలిగించింది. ప్రస్తుతం రాజస్థాన్‌కే పరిమితమైనా.. త్వరలో మరో 6 రాష్ట్రాలకు కార్యకలాపాలు విస్తరించేందుకు ప్రయత్నిస్తున్నాం. ఎంట్రప్రెన్యూర్స్ సంఖ్యను వెయ్యి నుంచి పదివేలకు పెంచాలని భావిస్తున్నాం’’అని అజైతాషా వివరించారు. తమ సంస్థను ప్రారంభించి ఆరేళ్లవుతోందని, గతంలో కొంత పెట్టుబడులు సమీకరించామని తెలిపారు. సంస్థ అభివృద్ధికి ఇప్పటిదాకా ఒకటిన్నర మిలియన్ డాలర్ల దాకా సమీకరించామని.. 2020 నాటికల్లా 26 మిలియన్ డాలర్ల ఆదాయ లక్ష్యాన్ని చేరుకునేలా మరో 2 మిలియన్ డాలర్లు సమీకరించనున్నామన్నారు. ‘పిచ్’ విజేతలు అజైతా, జైనేశ్! హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: జీఈఎస్‌లో భాగంగా నిర్వహిస్తున్న ‘గ్లోబల్ ఇన్నోవేషన్ త్రూ సైన్స్ అండ్ టెక్నాలజీ (జిస్ట్) పిచ్’కాంపిటీషన్లో బుధవా రం రెండు విభాగాల్లో తుది విజేతలను ప్రకటించారు. ఫిన్‌టె క్–డిజిటల్ ఎకానమీ, ఎనర్జీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విభాగాల్లో ఆరు చొప్పున 12 స్టార్టప్ సంస్థలు పోటీపడ్డాయి. వాటిల్లో ఫిన్‌టెక్ విభాగంలో విద్యా రుణాల సదుపాయం కల్పించే జ్ఞాన్‌ధన్ సంస్థ, ఎనర్జీ విభాగంలో ఫ్రాంటియర్ మార్కె ట్స్ సంస్థ విజేతలుగా నిలిచాయి. గురువారం మరో రెండు (హెల్త్‌కేర్–లైఫ్‌సైన్సెస్, మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్) విభాగాల్లో తుది విజేతలను ప్రకటిస్తారు. అనంతరం ఈ 4 విభాగాల్లో ఎంపికైన వారి నుంచి తుది విజేతను ఎంపిక చేస్తారు. విభాగాల వారీ విజేతలకు సుమారు రెండు లక్షల డాలర్ల మేర బహుమతి అందజేస్తారు. తుది విజేతకు నాలుగు లక్షల డాలర్లు ఇస్తారు. బుధవారం రెండు విభాగాల్లో విజేతలు ఫ్రాంటియర్ మార్కెట్స్ వ్యవస్థాపకులు అజైతాషా, జ్ఞాన్‌ధన్ వ్యవస్థాపకులు జైనేశ్ సిన్హా ‘సాక్షి’ బిజినెస్ బ్యూరోతో మాట్లాడారు. రెండు రోజుల్లో రుణాలు: జైనేశ్ సిన్హా ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న జ్ఞాన్‌ధన్ స్టార్టప్ సంస్థ ఫిన్‌టెక్ విభాగంలో విజేతగా నిలిచింది. ఈ సందర్భంగా జ్ఞాన్‌ధన్ సంస్థ వ్యవస్థాపకులు జైనేష్ సిన్హా ‘సాక్షి’ బిజినెస్ బ్యూరోతో మాట్లాడారు. ‘‘మంచి చదువు, మంచి కాలేజీ, మంచి ఉద్యోగం.. ఏ విద్యార్థిౖ కెనా ఇదే కల. విదేశాల్లో అందులోనూ టాప్ వర్సిటీల్లో చదవాలని అనుకుంటారు. కానీ చాలా మందికి ఇది కలగానే మిగిలిపోతుంది. కారణం డబ్బు సమస్య. బ్యాంకులు విద్యా రుణాలు ఇస్తున్నా.. అంత సులువేమీ కాదు. తనఖా నుంచి మొదలు పెడితే వడ్డీ రేట్ల వరకూ ప్రతీది సమస్యే. దీనికి మేం ‘జ్ఞాన్‌ధన్’తో పరిష్కారం చూపిస్తున్నాం. ఐఐటీ చదివే రోజుల్లో డబ్బు కోసం మాకు ఎదురైన ఇబ్బందులే ఈ స్టార్టప్ ప్రారంభానికి పునాది వేశాయి. అంకిత్ మెహ్రాతో కలసి దీన్ని ప్రారంభించా. రుణాల కోసం ఎస్బీఐ, బీఓబీ, యాక్సిస్ బ్యాంకులతోపాటు ఒక ఎన్బీఎఫ్సీ సంస్థతో ఒప్పందం చేసుకున్నాం. జ్ఞాన్ధన్లో తనఖాతో, తనఖా లేకుండా రెండు రకాల విద్యా రుణాలుంటాయి. రూ.10 లక్షల నుంచి రూ.1.5 కోట్ల వరకు రుణాలు అందిస్తాం. తనఖాతో కూడిన రుణానికైతే 2–3 వారాలు, తనఖా లేకుండా అయితే 2 రోజుల్లో రుణం అందిస్తాం. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా సుమారు 600 మంది విద్యార్థులకు రూ.160 కోట్ల రుణాలను అందించాం. ఇందులో ఏపీ, తెలంగాణ నుంచి 100 మంది విద్యార్థులున్నారు’’అని జైనేశ్ సిన్హా వివరించారు. -
జీఈఎస్.. గోల్కొండ.. శంషాబాద్..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె, సలహాదారు ఇవాంకా ట్రంప్ హైదరాబాద్ పర్యటన ప్రశాంతంగా ముగిసింది. ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు(జీఈఎస్) కోసం నగరానికి వచ్చిన ఆమె రెండో రోజూ బిజీబిజీగా గడిపారు. బుధవారం ఉదయం అమెరికా బృందంతో కలసి ట్రైడెంట్ హోటల్లోనే ఇవాంకా బ్రేక్‌ఫాస్ట్ చేశారు. పది గంటలకు హెచ్ఐసీసీకి చేరుకుని.. జీఈఎస్‌లో భాగంగా ఏర్పాటు చేసిన ‘వి కెన్ డూ ఇట్’అనే అంశంపై చర్చాగోష్టిలో పాల్గొన్నారు. 11.15 గంటలకు చర్చాగోష్టి ముగియగానే తిరిగి బస చేసిన హోటల్‌కు చేరుకున్నారు. గంటన్నర పాటు విశ్రాంతి తీసుకున్న ఇవాంకా 12.50 గంటల ప్రాంతంలో మధ్యాహ్న భోజనం చేశారు. అనంతరం పలువురు మహిళా పారిశ్రామికవేత్తలతో ఇవాంకా హోటల్లోనే ముఖాముఖిలో పాల్గొన్నారు. – సాక్షి, హైదరాబాద్ మధ్యాహ్నం గోల్కొండ ఖిల్లాకు.. ఇవాంకా గోల్కొండ పర్యటనపై బుధవారం మధ్యాహ్నం వరకు ఉత్కంఠ కొనసాగింది. ఇవాంకా భద్రతాధికారులు ప్రభుత్వానికి ఇచ్చిన షెడ్యూల్లో గోల్కొండ పర్యటన వివరాలు లేవు. అయితే రాష్ట్ర ప్రభుత్వం గోల్కొండలో విందుకు భారీ ఏర్పాట్లు చేసింది. ట్రాఫిక్ అధికారులు ముందస్తుగానే ఏర్పాటు చేసుకున్నారు. మధ్యాహ్నం 2.15 గంటల సమయంలో ఇవాంకా గోల్కొండకు వస్తున్నట్టు ఆమె భద్రతాధికారులు రాష్ట్ర పోలీస్ శాఖకు సమాచారం ఇచ్చారు. దీంతో అప్పటికప్పుడు గ్రీన్‌చానల్ ద్వారా ఇవాంకా 2.35 గంటల ప్రాంతంలో ట్రైడెంట్ నుంచి గోల్కొండ కోటకు చేరుకున్నారు. గంట పాటు గోల్కొండ విశేషాలు తెలుసుకుని 3.35 ప్రాంతంలో తిరుగు పయనమైన ఇవాంకా 3.55 గంటలకు ట్రైడెంట్‌కు చేరుకున్నారు. ఎస్పీజీ అసంతృప్తి.. ప్రధాని మోదీ భద్రతా వ్యవహారాలు పర్యవేక్షించే స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూపు (ఎస్పీజీ) రాష్ట్ర పోలీస్ అధికారులపై కాస్త అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఒకవైపు ఫలక్‌నుమాలో విందు జరుగుతుంటే టీవీ చానళ్లు సీసీఫుటేజ్ ఆధారంగా ప్రత్యక్ష ప్రసారం చేయడం భద్రతకు ఇబ్బందిగా మారిందని, ఇలాంటి ప్రతిష్టాత్మక సదస్సుకు హాజరైన వారి భద్రత విషయంలో ఇలా వ్యవహరిం చడం మంచిది కాదని రాష్ట్ర పోలీస్ అధికారులను కాస్త ఘాటుగానే హెచ్చరించినట్టు తెలిసింది. అయి తే అప్పటికప్పుడు రాష్ట్ర పోలీస్ ఉన్నతాధికారులు సీసీటీవీ ఫుటేజ్ ప్రసారం ఆపాలని అన్ని మీడియా చానళ్లను కోరడంతో టీవీ చానళ్లు ప్రసారాలు ఆపేశా యి. ఈ ఒక్క విషయం తప్పా భద్రతా పరంగా రాష్ట్ర పోలీస్ శాఖ సక్సెస్ అవడంతో ఉన్నతాధికారులను రాష్ట్ర ప్రభుత్వం అభినందించింది. సాయంత్రమే డిన్నర్.. తిరుగు ప్రయాణం.. తిరుగు ప్రయాణాన్ని దృష్టిలో పెట్టుకుని సాయంత్రం 5.30 సమయంలోనే అధికార బృందంతో కలసి ఇవాంకా ట్రైడెంట్‌లో డిన్నర్ పూర్తిచేశారు. 7.25 సమయంలో బస చేసిన హోటల్ నుంచి బయలు దేరి రాత్రి 7.50 గంటలకు శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. నీతిఆయోగ్ అధికారులు, రాష్ట్ర ఉన్నతాధికారులు, రాష్ట్ర పోలీస్ ఉన్నతా ధికారులు ఇవాంకాకు వీడ్కోలు పలికారు. 9.20 ప్రాంతంలో దుబాయి వెళ్లే ఎమిరేట్స్(ఈకే 529) విమానంలో తిరుగు పయనమయ్యారు. ఎంతో హడావుడి.. కానీ సాదాసీదాగా.. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఇవాంకా పర్యటనకు ఎంతో హడావుడి చేశాయి. అయితే ఇవాంకా అమెరికా నుంచి సాధారణ ప్రయాణికురాలిగా అందరితో కలసి కమర్షియల్ విమానంలో హైదరాబాద్ చేరుకున్నారు. అలాగే భారీ ఎత్తున ఏర్పాటు చేసిన కాన్వాయ్ వాహనాలను సైతం కాదని అందుబాటులో పెట్టుకున్న రెండో వాహన శ్రేణిలో తాను బస చేసిన హోటల్‌కు వెళ్లారు. హెచ్ఐసీసీలోనూ అందరితో తాను అంటూ సదస్సులో పాల్గొని ఆకట్టుకున్నారు. -
నేడు 21 సదస్సులు
జీఈఎస్‌లో ఆఖరి రోజైన గురువారం 21 కీలక సదస్సులు జరగనున్నాయి. పెట్టుబడులు విజయాలు, ఔత్సాహిక పెట్టుబడిదారులనే అంశంపై ఉదయం 9 గంటలకు చర్చాగోష్ఠితో సదస్సు ప్రారంభం కానుంది. సాయంత్రం 4 గంటలకు ‘మహిళలు విజయం సాధిస్తే.. అందరూ విజయం సాధించినట్లే’ అనే ఇతివృత్తంపై ముగింపు చర్చ జరుగుతుంది. ‘మహిళా ఔత్సాహిక వ్యాపారవేత్తలకు అవకాశాలు, అనువైన వాతావరణం కల్పించేందుకు ప్రోత్సాహం’ అనే అంశంపై చర్చిస్తారు. కేంద్రమంత్రి సురేశ్ ప్రభు ఈ చర్చకు మోడరేటర్‌గా వ్యవహరిస్తారు. ఐయూరప్ కాపిటల్ సహ వ్యవస్థాపకులు క్రిస్టినా పెర్కిన్ డెవీసన్, వెల్స్పన్ ఇండియా జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ దీపాలీ గోయంకా, యూఎస్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవెలప్మెంట్ అడ్మినిస్ట్రేటర్ మార్క్ గ్రీన్,పెట్రోలింక్ సీఈవో లెరాటో మోత్సమయి, టీమ్ లీజ్ చైర్మన్ మనీష్ సభర్వాల్ పాల్గొంటారు. నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్‌కాంత్, టీ హబ్ సీఈవో జయదీప్ కృష్ణన్, అపోలో హాస్పిటల్స్ గ్రూప్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సంగీతారెడ్డి, ఇంటెల్ ఇండియా కంట్రీ హెడ్ నివృతి రాయ్, ఇండియా టుడే గ్రూప్ వైస్ చైర్పర్సన్ కలైపురి, మేక్‌మై ట్రిప్.కామ్ సీఈవో దీప్ కల్రా, ఓయో రూమ్స్ సీఈవో రితేష్ అగర్వాల్ వివిధ సదస్సుల్లో పాల్గొంటారు. స్టార్టప్‌ల ఫైనల్ పోటీ.. విజేతల ప్రకటన జీఈఎస్‌ను పురస్కరించుకొని స్టార్టప్‌లకు నిర్వహించిన కాంపిటేషన్‌కు సంబంధించిన ఫైనల్ పోటీ ఉత్కంఠ రేపనుంది. సెమీ ఫైనల్‌కు చేరిన 24 మంది స్టార్టప్ కంపెనీ యజమానుల నుంచి నాలుగు ప్రాధాన్య రంగాల్లో ఒక్కొక్కరిని ఫైనలిస్టులుగా ఎంపిక చేస్తారు. ఈ నలుగురిలో తుది పోటీలో ప్రతిభ కనబరిచిన ఒక్కరిని న్యాయ నిర్ణేతలు గ్రాండ్ ఛాంపియన్‌గా ప్రకటిస్తారు. గురువారం సాయంత్రం జరిగే ముగింపు వేడుకపై విజేతలకు బహుమతులను అందజేస్తారు. గ్రాండ్ ఛాంపియన్‌గా నిలిచిన స్టార్టప్‌కు దాదాపు 4 లక్షల డాలర్ల బహుమతులు అందిస్తారు. నోవాటెల్‌లో అమెరికా విందు ప్రపంచ సదస్సులో ఆఖరి చర్చాగోష్ఠి ముగిసిన వెంటనే స్టార్టప్‌ల పోటీలో విజేతలుగా నిలిచిన వారికి బహుమతులు అందిస్తారు. ఇదే వేదికపై సదస్సు ముగిసినట్లు ప్రకటిస్తారు. అనంతరం సాయంత్రం 5.30 నుంచి రాత్రి 8 గంటల వరకు దేశ విదేశాల నుంచి వచ్చిన ప్రతినిధులందరికీ అమెరికా ప్రభుత్వం విందుకు ఏర్పాట్లు చేసింది. నోవాటెల్ లాన్స్‌లో ఈ ఆతిథ్యం ఇవ్వనుంది. అతిథుల నోరూరించేలా వివిధ దేశాలకు చెందిన ప్రఖ్యాత వంటకాలను ఏర్పాటు చేయనున్నారు. -
మగాళ్ల నుంచే మార్పు రావాలి
సాక్షి, హైదరాబాద్: మోముపై చిరునవ్వు.. మాటల్లో చెక్కుచెదరని ఆత్మవిశ్వాసం.. ఎలాంటి ప్రశ్నకైనా ఠక్కున సమాధానం చెప్పే నేర్పరితనం.. అందర్నీ కట్టిపడేసే అందం.. ఆమెవరో కాదు.. 20 ఏళ్లకే ప్రపంచ సుందరి కిరీటాన్ని సొంతం చేసుకున్న మానుషీ ఛిల్లర్! 17 ఏళ్ల తర్వాత మన దేశానికి ప్రపంచ సుందరి కిరీటాన్ని తెచ్చిపెట్టిన ఈ హరియాణా అందాల సుందరి బుధవారం ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు (జీఈఎస్)లో ‘సెంటర్ ఆఫ్ అట్రాక్షన్’గా నిలిచింది. బంగారు వన్నె దుస్తులతో హెచ్ఐసీసీ ప్రాంగణంలోకి అడుగుపెట్టిన ఛిల్లర్.. మహిళా సాధికారతపై జరిగిన చర్చాగోష్టిలో పాల్గొంది. ఎలాంటి ప్రశ్న అడిగినా ఫటాఫట్ సమాధానమిస్తూ అందర్నీ ఆకట్టుకుంది! ‘మీరు మిస్ వరల్డ్ టైటిల్ గెలిచారు కదా.. గెలవడమే అంతిమమా...’ అని కార్యక్రమ నిర్వాహకుడు ప్రశ్నించగా.. ‘మార్పు అంతిమం (చేంజ్ ఈజ్ ఎవ్రీథింగ్)’ అని సమాధానమిచ్చింది. ‘ముందు డాక్టర్, ఆ తర్వాత మిస్‌వరల్డ్ కదా. మీ జీవితంలో దేన్ని ప్రాధాన్యంగా ఎంచుకుంటారని అడగ్గా.. ‘నా జీవితంలో అవి రెండూ ఒకటే. ముందు డాక్టర్ని. తర్వాత అందాల సుందరిని. భవిష్యత్‌లోనూ డాక్టర్నే..’ అని పేర్కొంది. వివిధ అంశాలపై ఆమె అంతరంగం ఇదీ.. ఈ కిరీటం.. సేవకు అవకాశం మిస్‌వరల్డ్ అనేది సమాజానికి నేను కొంత తిరిగి ఇచ్చేందుకు సేవ చేసే అవకాశంగా భావిస్తా. అది నాకు గౌరవం కూడా. నాలాంటి యువతులకు ఈ హోదా చాలా నేర్పుతుంది. ఎన్నో చోట్ల తిరగాల్సి వస్తుంది. సెలబ్రిటీల నుంచి చిన్నపిల్లల వరకు అందరితో మమేకం అవ్వాల్సి వస్తుంది. అప్పుడు ఎన్నో నేర్చుకుంటాం. సమాజానికి ఎంతో కొంత తిరిగి ఇవ్వడం నా బాధ్యత. చిరునవ్వుతోనూ మార్పు ఏ పనయినా నాతో కాదు అన్న భావన రాకూడదు. ప్రతి ఒక్కరూ మార్పు తీసుకురాగలరు. ఓ చిరు నవ్వు కూడా పరిస్థితిలో మార్పు తెస్తుంది. గుడ్ మార్నింగ్ అంటూ పలకరించడం కూడా ఎదుటి వారిలో మనపై అభిప్రాయాన్ని మారుస్తుంది. ఎదుటివారిని సంతోషపరిస్తే మనల్ని కూడా వారు సంతోషపరిచేందుకు ప్రయత్నిస్తారు. ప్రతి ఒక్కరికీ సమాజంలో మార్పు తెచ్చే అవకాశం ఉంది. మార్పు తెచ్చేందుకు మిస్ వరల్డే కానక్కర్లేదు. ఉన్నదంతా మీ తలలోనే.. ప్రతి ఒక్కరికీ జీవితంలో సవాళ్లు ఎదురవుతుం టాయి. అయితే వాటిని ఎలా ఎదుర్కొంటారనేదే సమస్య. ఓ మహిళ వ్యాపారవేత్తగా ఎదగాలంటే అంతా మీ మైండ్‌సెట్ మీద, అందులోని ఆలోచనల మీద ఆధారపడి ఉంటుంది. డాక్టర్.. యాక్టర్ కూడా.. నాపై కుటుంబ ప్రభావం ఉంది. మాది డాక్టర్ల ఫ్యామిలీ కావడంతో ఆ ప్రభావం నాపై పడటం వల్లే నేను కూడా డాక్టర్ని అయ్యాననుకుంటా. ఆదివారం పూట నా తల్లి వ్యవహరించే తీరును నిశితంగా గమనించేదాన్ని. డాక్టర్ డాక్టరే కాదు.. యాక్టర్ కూడా అని నాన్న చెప్పేవారు. ఎందుకంటే.. ఏమీ కాదంటూ రోగి ముందు నటించినా ఆ రోగి చాలా వరకు కోలుకుంటాడు. పనిని ప్రేమిస్తా.. వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఒకటైన భారత్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించడం నిజంగా పెద్ద బాధ్యతే. కానీ నేను చేస్తున్న పనిని ప్రేమిస్తాను. చేసే పనిని మీరు ప్రేమించినప్పుడు ఒత్తిడి అనిపించదు. అందుకే ఆ హోదా నాకు బాధ్యతే కానీ.. ఒత్తిడి ఏ మాత్రం కాదు. మహిళకు మహిళ తోడుండాలి ఒక మహిళ ఎదిగేందుకు మరో మహిళ తోడ్పాటు నివ్వాలి. మహిళల్లో అవగాహన లేమితో పాటు అను కూలతలు లేకపోవడం వల్ల కూడా రాణించలే కపోతున్నారు. అందుకే కొన్ని అవకాశాలను వారికి కల్పించాలి. ఆ కోణంలోనే రుతుక్రమంలో పాటిం చాల్సిన శుభ్రత గురించి ఆలోచించి ఓ కంపెనీ ఏర్పాటు చేశా. స్థానిక వ్యాపారులతోపాటు వాల్‌మా ర్ట్ లాంటి సంస్థతో కూడా అనుసంధానమయ్యాం. దాదాపు ఉత్తర భారతదేశమంతా శానిటరీ నాప్కిన్స్ ను మా కంపెనీ అందిస్తుంది. దీంతో 20 గ్రామా ల్లోని మహిళలు ఉపాధి పొందుతున్నారు. వారు కూడా పారిశ్రామికవేత్తలవుతున్నారు. చాలా దేశాల్లో 50 శాతానికిపైగా పౌరులు పేదరికంలో బతుకుతు న్నారు. వారికి ఆరోగ్య సదుపాయాలు అందడం లేదు. అందరికీ ఆరోగ్య సదుపాయాలు కల్పించ డమే ధ్యేయంగా పనిచేయాలని నిర్ణయించుకున్నా. ఏమో...అవుతానేమో..? నేను మిస్‌వరల్డ్ అయిన తర్వాత చాలా ప్రాంతాల్లో పర్యటిస్తున్నా. దేనిపైనా దృష్టి పెట్టలేదు. సినిమా అవకాశమనేది చాలా ఆసక్తి కలిగిస్తుంది. సినీ జీవితం నా జీవితంలో కూడా ఉండొచ్చేమో. ఇప్పటికైతే అది నా ప్రాధాన్యతల్లో లేదు. ‘అమ్మ’ భావనే అద్భుతం అమ్మతనం చాలా అందమైంది. ఆ అనుభవం అమ్మ అయిన ప్రతి మహిళకూ సంతోషమే. ఓ జీవితానికి రూపం ఇవ్వడం.. ఓ స్నేహితుడిని సంపాదించుకునే అవకాశం గొప్ప ది. తల్లీబిడ్డల మధ్య సంబంధం ఇవ్వడం, తీసు కోవడమే కాదు. అదో మ్యాజిక్. అద్భుతం. అమ్మ ఎప్పుడూ నన్ను ప్రేమిస్తుంది. నేను స్టేజీ మీద ఉండి ఆమె ప్రేక్షకుల్లో ఉన్నప్పుడు ఆమె కళ్లలో గర్వం నాకు కనిపించింది. అదో అద్భుత అనుభూతి. అమ్మకు రుణపడి ఉంటా. భారతీయురాలిని కాబట్టే.. భావ వ్యక్తీకరణ నైపుణ్యం చాలా ముఖ్యం. నేను డాక్టర్ని కాబట్టి పేషెంట్లతో కమ్యూనికేషన్ బాగుండాలి. అప్పుడే విషయం సులువవుతుంది. మనం ఏం మాట్లాడుతున్నామనే దాన్ని మనం నమ్మాలి. ఫీలవ్వాలి. అందుకే భాషా అడ్డంకులను అధిగమించి ప్రపంచ పోటీల్లో 118 మంది అందాల యువతులను ఓడించగలిగాను. భావోద్వేగం అనేది భావవ్యక్తీకరణకు ముఖ్యం. నేను భారతీయ కుటుంబం నుంచి వచ్చాను కాబట్టి ఆ వేదికపై భావోద్వేగంతో నా భావాలను వ్యక్తపర్చగలిగా. మగాళ్లతోనే ప్రారంభం కావాలి ఇది సమాన ప్రపంచం. ఇక్కడ పురుషులు, స్త్రీలు అందరూ సమానమే. వేతనాల్లోనూ, అవకాశాల్లోనూ ఇద్దరికీ తగిన అవకాశాలుండాలి. పురుషాధిక్య సమాజంలో మార్పు రావాలంటే ముందు పురుషుడి ఆలోచనలో మార్పు రావాలి. స్త్రీలు తమకంటే ఎందులోనూ తక్కువ కాదని పురుషులు ఆలోచిస్తే అప్పుడు తాము తక్కువ కాదని స్త్రీలు ఆలోచించడం మొదలు పెడతారు. నాకెప్పుడూ అసమానత ఎదురుకాలేదు. క్రీడలకు స్టార్టప్‌లు సాహసోపేతమే క్రీడలు, ఐటీ పరిశ్రమలకు హైదరాబాద్ మారు పేరు. నగరంలో అందుబాటులో ఉన్న వ్యవస్థ, సదుపాయాలు, ప్రభుత్వ ప్రోత్సాహంతో క్రికెట్, టెన్నిస్, బ్యాట్మింటన్లాంటి క్రీడల్లో హైదరాబాదీలు అంతర్జాతీయ స్థాయికి ఆడుతున్నారు. నగరంలో ఈ మెగా ఈవెంట్ జరగడం మనందరికీ గర్వకారణం. క్రీడలను ప్రోత్సహించడంలో మీడియా పాత్ర, యువ క్రీడాకారులు కెరీర్ ప్రారంభంలో ఎదుర్కొనే సమస్యలు, స్పాన్సర్‌షిప్‌లపై చర్చాగోష్టిలో మాట్లాడాం. క్రీడా రంగానికి సంబంధించిన స్టార్టప్‌ల ఏర్పాటు అత్యంత సాహసోపేతమైన చర్య. కచ్చితత్వం ఉండదు. క్రీడారంగంలో వ్యాపారం ఓ జూదం లాంటిది. – మిథాలీరాజ్, భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ -
తగిన సంఖ్యలో మహిళా సభ్యుల్లేకే..
సాక్షి, హైదరాబాద్: ‘‘రాష్ట్ర మంత్రివర్గంలో మహిళలకు ప్రాతినిధ్యం లేని మాట వాస్తవమే. శాసనసభలో సరైన సంఖ్యలో మహిళా శాసనసభ్యులు లేకపోవడం దీనికి ప్రాథమిక కారణమని భావిస్తున్నా. రెండోది రాజకీయ సర్దుబాట్ల వల్ల కూడా సాధ్యం కాలేదు. ఈ విషయమై సీఎం కేసీఆర్ కచ్చితంగా సరైన సమయంలో చర్యలు తీసుకుంటారని భావిస్తున్నా..’’అని మంత్రి కె.తారకరామారావు పేర్కొన్నారు. ఈ విషయం గురించి అడిగే ముందు రాష్ట్రంలో ఆరుగురు మాత్రమే మహిళా ఎమ్మెల్యేలు ఉన్నారన్న విషయాన్ని గుర్తు చేసుకోవాలని చెప్పారు. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లకు టీఆర్ఎస్ గట్టిగా మద్దతు ఇస్తోందని.. మహిళా బిల్లుకు మద్దతుగా అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించామని తెలిపారు. పార్లమెంట్లో ఎప్పుడు బిల్లు పెట్టినా.. మద్దతిస్తామని తమ పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ ఇప్పటికే ప్రకటించారని గుర్తుచేశారు. బుధవారం ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు (జీఈఎస్)లో ‘శ్రామిక శక్తి తయారీ, నైపుణ్యాభివృద్ధి శిక్షణలో కొత్త పోకడలు’అనే అంశంపై చర్చకు మంత్రి కేటీఆర్ సమన్వయకర్తగా వ్యవహరించారు. ఇవాంకా ట్రంప్, చెర్రీ బ్లెయిర్, చందా కొచ్చర్, కరెన్ క్వింటోస్‌లతో చర్చాగోష్టి నిర్వహించారు. అనంతరం కేటీఆర్ విలేకరులతో మాట్లాడారు. ఇవాంకా ట్రంప్, చెర్రీ బ్లెయిర్ వంటి శక్తిమంతమైన మహిళలతో చర్చాగోష్టి నిర్వహించడం ద్వారా నేర్చుకోవడానికి ఎంతో లభించిందని, ఇది తనకు గొప్ప అవకాశమన్నారు. చర్చను వారే స్వయంగా నిర్వహించుకోగలరని, వేదికపై తన అవసరం లేకపోయినా తనకు అవకాశం కల్పించారని చెప్పారు. ఇలా ఎప్పుడూ చర్చాగోష్టికి సమన్వయకర్తగా వ్యవహరించలేదన్నారు. మార్గనిర్దేశం చేశారు.. చర్చలో పాల్గొన్న మహిళలు తమ అభిప్రాయాలు, తీర్మానాలను బలంగా వ్యక్తం చేశారని కేటీఆర్ కొనియాడారు. మార్పును కోరుకుంటున్న ఈ మహిళలు తమను భవిష్యత్తు వైపునకు మార్గనిర్దేశం చేశారని చెప్పారు. చర్చలో మహిళల సామర్థ్యం, ఆత్మవిశ్వాసం, నైపుణ్యాభివృద్ధి, మార్గనిర్దేశకత్వం, పెట్టుబడులు, శ్రమశక్తి, ప్రైవేటు రంగంలో ప్రాతినిధ్యం తదితర అంశాలపై విస్తృతంగా మాట్లాడినట్లు తెలిపారు. ఇవాంకా ట్రంప్ చెప్పినట్లు శ్రమశక్తి విషయంలో మహిళల సమస్యలపై ప్రపంచ దేశాలు కలసి పనిచేయాల్సిన అవసరముందన్నారు. ఇందుకు అమెరికా ప్రభుత్వం ఇప్పటికే 14 దేశాలతో కలసి పనిచేస్తోందని, ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వ బాధ్యత అధికంగా ఉందని పేర్కొన్నారు. నాలోనూ వివక్ష ఉంది "రాష్ట్రంలో మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు ప్రత్యేక రాయితీలు, విధానాలు అమలు చేస్తున్నాం. అయినా అవి సరిపోవు. ఒక కుమార్తె, ఒక కుమారుడికి తండ్రిని. నా లోపల కూడా వివక్ష ఉందని ఈ చర్చ అనంతరం తెలుసుకున్నా... స్వేచ్ఛా ప్రపంచ ప్రతినిధిగా మాట్లాడిన ఇవాంకా కూడా మహిళగా తనలో పాతుకుపోయిన వివక్ష గురించి చెప్పారు. ప్రభుత్వాలు, సంస్థలు ఏం చేస్తున్నాయని ప్రశ్నించడానికి ముందు ఈ విషయంలో మనమందరం ఆత్మపరిశీలన జరుపుకోవాలి..’’ – కేటీఆర్ -
అవకాశాలకు జీఈఎస్
(రమణమూర్తి మంథా) అవును! ఇక్కడ పెట్టుబడులకు తగిన అవకాశాలు ఉంటాయేమోనని వచ్చాం. తగిన సామర్థ్యమున్న పారిశ్రామికవేత్తలను చూశాం. కొందరితో మాట్లాడుతున్నాం. వాతావరణమైతే బాగుంది.. – ఇది పెట్టుబడిదారుల మాట. మా ఆలోచనలను కంపెనీలుగా మార్చాం. మాకు ఎదగటానికి మరిన్ని నిధులు, కాస్త మద్దతు కావాలి. ఇక్కడికొచ్చి ఇతర సంస్థలను చూసి, ఇన్వెస్టర్లతో మా ఆలోచనలు పంచుకున్నాక ఆశలు పెరిగాయి.. – ఇది ఔత్సాహిక పారిశ్రామికవేత్తల మాట ...ఈ రెండు వర్గాలను ఒకచోటికి చేర్చడానికే ఈ వేదికను సృష్టించామని, ఇది మున్ముందు దేశంలో పారిశ్రామికవేత్తల సంఖ్యను భారీగా పెంచి, మరింత మందికి ఉపాధినిచ్చే దిశగా వెళుతుందనేది నిర్వాహకుల మాట. మొత్తంగా హైదరాబాద్‌లో జరుగుతున్న జీఈఎస్–2017పై అటు నిర్వాహకులు, ఇటు డెలిగేట్లు అందరూ సంతృప్తితో కూడిన ఆశలనే వ్యక్తం చేశారు. నిజానికి జీఈఎస్ సదస్సు ఏ లక్ష కోట్లో, వేల కోట్లో పెట్టుబడులను కుమ్మరిస్తున్నట్లుగా బడా కంపెనీలు ప్రకటించేసి.. ఎంఓయూలు కుదుర్చుకుని మరిచిపోయే ఫక్తు వ్యాపార సదస్సు కాదు. పెద్ద పెద్ద పరిశ్రమలేవీ ఈ వేదికపై భారీ విస్తరణ ప్రణాళికలను ప్రకటించే అవకాశమూ లేదు. ఒక రకంగా చెప్పాలంటే ఇది పూర్తిగా స్టార్టప్‌ల వ్యవహారం. కొత్త ఆలోచనలతో సంస్థలు ప్రారంభించి, తగిన మార్గదర్శకత్వం కోసం, అవసరమైన నిధుల కోసం చూస్తున్న స్టార్టప్‌లకు తగిన వనరులు వెతుక్కునే వేదిక ఇది. భారీ ఇన్వెస్ట్మెంట్ సంస్థలతో పాటు చిన్న మొత్తాల్లో పెట్టుబడులు పెట్టే వ్యక్తిగత ఇన్వెస్టర్లూ ఇందులో పాల్గొన్నారు. వచ్చినందుకు ప్రయోజనం దక్కుతోందని ఆశాభావమూ వ్యక్తం చేస్తున్నారు. ‘‘నేను మా దేశంలో రియల్ ఎస్టేట్‌లో, మైక్రోఫైనాన్స్‌లో పెట్టుబడులు పెట్టా. అమెరికాలోనూ కొంత పెట్టుబడులు పెట్టా. ఇక్కడ పారిశ్రామిక వాతావరణం ఎలా ఉంటుందో, కొత్త ఆవిష్కరణలు ఏం వస్తున్నాయో, ఏ రంగాలైతే మంచివో చూడటానికి వచ్చా. నా శ్రమ వృథా పోలేదు. చాలా మందిని కలుసుకున్నా.. చాలా తెలుసుకున్నా..’’ అని కంబోడియా మహిళ నందా పోక్ ‘సాక్షి’తో పేర్కొనడం గమనార్హం. తమ దేశంలో మంచి నాణ్యమైన మిరియాలు పండుతాయని, వాటిని దిగుమతి చేసుకోవటానికి కొందరు తనతో మాట్లాడారని.. ఆ చర్చలు కొనసాగుతున్నాయని ఆమె చెప్పారు. ఈమె కంబోడియా విమెన్ బిజినెస్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షురాలు కూడా. వాతావరణం బాగుందన్న ఇన్వెస్టర్లు నిజానికి ఏ పరిశ్రమకైనా పెట్టుబడులే కీలకం. ఈ సదస్సులో ‘ఓవర్సీస్ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్’తో పాటు టీవీఎస్ క్యాపిటల్, వెంచర్ ఈస్ట్, కలారి క్యాపిటల్, కార్లైల్ ఇండియా అడ్వయిజర్స్, లెట్స్ వెంచర్, ఐవీక్యాప్ వెంచర్స్, విలేజ్ క్యాపిటల్, ఎండియా పార్ట్నర్స్, స్పార్క్‌రైజ్.. ఇలా పెద్ద సంఖ్యలో ఇన్వెస్ట్మెంట్, క్రౌడ్ ఫండింగ్ కంపెనీలు పాల్గొన్నాయి. వివిధ దేశాల నుంచి చిన్న ఇన్వెస్ట్మెంట్ కంపెనీలు, వ్యక్తిగత ఇన్వెస్టర్లు కూడా పాల్గొన్నారు. ‘‘మాకైతే ఇప్పుడు పెట్టుబడులు పెట్టే ఉద్దేశం లేదు. కానీ ఇక్కడి వాతావరణాన్ని చూడటానికి, కొన్ని నెట్వర్కింగ్ పరిచయాల కోసం వచ్చాం. ఫండింగ్ కోసం చాలా మంది నాకు ఫోన్లు చేశారు. వారు మిగతా వారితో కూడా మాట్లాడుతున్నట్లు చెప్పారు. మొత్తంగా చూస్తే ఇక్కడ ఆశావహ వాతావరణమే ఉంది..’’ అని వెంచర్ ఈస్ట్ క్యాపిటల్‌కు చెందిన సనా అన్సారీ చెప్పారు. అంచనాలు తగ్గట్లే ఉందన్న పారిశ్రామికవేత్తలు సదస్సుకు ఇక్కడి సంస్థలతో పాటు దేశవ్యాప్తంగా, ఆ మాటకొస్తే ప్రపంచవ్యాప్తంగా స్టార్టప్ యజమానులు హాజరయ్యారు. తమ చుట్టుపక్కల ఉన్న అవకాశాలనూ వారు ఈ వేదికపై తెలుసుకోగలిగారు. మునగ రైతులతో కలసి పనిచేసే బెలీజ్ దేశ సంస్థ మెరింగా బెలీజ్ది ఇలాంటి కథే. మునగాకు, విత్తనాలు విక్రయించే ఈ సంస్థ ఐదు వేల బెలీజ్ డాలర్లతో మొదలై ప్రభుత్వ ఫండింగ్‌తో యంత్రాలు కొని విదేశాలకు ఎగుమతి చేసే స్థాయికి చేరింది. ‘‘జీఈఎస్‌లో మెంటార్స్‌ను, విదేశీ ప్రతినిధులను కలిసే అవకాశం దక్కింది. మునగ ఉత్పత్తులకు డిమాండ్ ఎక్కువగా ఉండే బ్రిటన్ వాసులతో పరిచయాలు కలిగాయి. త్వరలోనే బ్రిటన్‌కి కూడా ఎగుమతులు ప్రారంభిస్తాం. ఆ రకంగా జీఈఎస్‌తో నేను హ్యాపీ..’’ అని మెరింగా బెలీజ్ వ్యవస్థాపకురాలు ఆండ్రియా చెప్పారు. అమెరికాలో ఇన్వెస్టర్లు, ఎంట్రప్రెన్యూర్స్‌ని ఒకే వేదికపైకి తెచ్చేందుకు ప్రారంభమైన బ్లాక్ గర్ల్ వెంచర్స్ సంస్థ కూడా జీఈఎస్ సదస్సు ద్వారా ఇన్వెస్టర్లు పరిచయమయ్యారని, నిధులు లభిస్తాయని ఆశాభావం వ్యక్తం చేసింది. మరిన్ని కార్యక్రమాలు కూడా.. స్టార్టప్‌లు ఎదగటానికి తగిన ‘అనుకూల వ్యవస్థ’ను సృష్టించాలన్న లక్ష్యానికి జీఈఎస్ సదస్సు ఉపయోగపడుతోందని అటు నీతీ ఆయోగ్, ఇటు అమెరికా ప్రభుత్వం అభిప్రాయపడ్డాయి. ‘‘తగిన అనుకూల వ్యవస్థ ఇక్కడ ఉంది. అది అద్భుతంగా పనిచేస్తోంది. కొన్ని సమస్యలున్నా వాటిని పరిష్కరించటానికి నిరంతరం మా కాన్సులేట్లతో కలసి పలు కార్యక్రమాలు నిర్వహిస్తాం..’’ అని అమెరికా యువజన వ్యవహారాల గ్లోబల్ అడ్వైజర్ ఆండీ రబెన్స్ అభిప్రాయపడ్డారు. ఇక ‘‘పారిశ్రామికవేత్తలుగా ఎదగాలంటే చదువుకునే దశ నుంచీ కొత్త ఆవిష్కరణల పట్ల ఆసక్తి ఉండాలి. అందుకే నీతి ఆయోగ్ ఆధ్వరంలో అటల్ ఇన్నోవేషన్ మిషన్ ద్వారా స్కూళ్లు, యూనివర్సిటీల్లో ల్యాబ్స్ ఏర్పాటు చేస్తున్నాం. స్టార్టప్‌ల మధ్య ఛాలెంజ్‌లు నిర్వహించి సమాజానికి ఉపయోగపడే ఆవిష్కరణలకు భారీ బహుమతులిస్తున్నాం. ఇది ఇంకా ముందుకెళుతుంది..’’ అని నీతి ఆయోగ్ అదనపు కార్యదర్శి ఆర్.రమణన్ చెప్పారు. ఈ వేదిక కల్పించిన అవకాశాలు ఎంతవరకు సఫలీకృతం అవుతాయన్నది వ్యక్తుల సామర్థ్యం మీదే ఆధారపడి ఉంటుందనే విషయంలో మాత్రం ఇద్దరిదీ ఏకాభిప్రాయమే. కొంత పెట్టుబడులు రావచ్చు : షెల్లీ బెల్, బ్లాక్ గర్ల్ వెంచర్స్, అమెరికా ‘‘బ్లాక్గర్ల్ వెంచర్స్‌తో ఇటు పెట్టుబడిదారులు, అటు ఎంట్రప్రెన్యూర్స్‌ని ఒకే వేదికపైకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం. ప్రధానంగా నల్లజాతి మహిళా ఎంట్రప్రెన్యూర్స్ తమ ఐడియాలను బాస్ అప్ పేరిట నిర్వహించే పిచ్ కాంపిటీషన్లో బీజీవీ సభ్యుల ముందుంచుతారు. కమ్యూనిటీ ఓటింగ్‌లో విజేతలైన వారికి వ్యాపారాన్ని ప్రారంభించుకునేందుకు సీడ్ ఫండింగ్‌తో పాటు అకౌంటింగ్, లీగల్ కన్సల్టేషన్ మొదలైన వాటిపరంగా కూడా తోడ్పాటు లభిస్తుంది. ఇదీ మా సంస్థ నేపథ్యం. మా కార్యకలాపాలు విస్తరించే క్రమంలో విదేశీ ఎంట్రప్రెన్యూర్లు, ఇన్వెస్టర్లతో నెట్వర్కింగ్ అవకాశాలు లభిస్తాయని ఈ జీఈఎస్‌కు వచ్చా. మా సంస్థ సీడ్ ఫండింగ్ స్థాయిలో ఉంది. ఆశించిన ప్రయోజనాలు కొంత కనిపించాయి. కొందరు ఇన్వెస్టర్లతో పరిచయమైంది. పెట్టుబడులు రాగలవని ఆశిస్తున్నా..’’ ఇన్వెస్టర్లను కలిసే అవకాశం వచ్చింది : నిషిత మన్నె, సీఈవో, వీవ్స్మార్ట్ ‘‘మేం ప్రధానంగా చేనేతకారులకు డిజిటల్ ప్లాట్‌ఫాం కల్పిస్తున్నాం. వారికి ఆన్లైన్ మార్కెటింగ్ సదుపాయం కల్పించే దిశగా వీవ్స్మార్ట్ పోర్టల్‌ని ఏర్పాటు చేశాం. దేశవ్యాప్తంగా 4,000 మంది పైచిలుకు వీవర్స్‌తో చేతులు కలిపాం. వీరిలో సుమారు 1,500 మంది తెలుగు రాష్ట్రాల నుంచే ఉన్నారు. మూడేళ్ల క్రితం మా సొంత నిధులతోనే ప్రారంభించాం. ప్రభుత్వం కూడా మా సేవలను గుర్తించి ప్రోత్సహిస్తోంది. జీఈఎస్‌లో ప్రధానంగా ఇతర ఇన్వెస్టర్లు, ఎంట్రప్రెన్యూర్లతో పరిచయాలు లభిస్తాయనే ఉద్దేశంతో హాజరయ్యాను. అనుకున్నట్లే కొందరితో కలిసే అవకాశం లభించింది..’’ కొత్త అవకాశాలను చూస్తున్నాం : బిభూటి న్యూపాన్, అంతర్పేరన (నేపాల్) ‘‘నేపాల్‌లో మేం దాదాపు 10 సంస్థల్లో ఇన్వెస్ట్ చేశాం. భారత్‌లో ఇంకా నేరుగా పెట్టుబడులు పెట్టలేదు. కానీ వేరే సంస్థలతో కలసి కొన్ని పెట్టుబడులున్నాయి. ఇక్కడ ఎలాంటి అవకాశాలున్నాయో తెలుసుకోవటానికి సదస్సు ఉపకరిస్తుందని భావించి వచ్చా. వచ్చినందుకు చాలా అవకాశాలు కనిపించాయి. ఇక రాబోయేది ఆవిష్కరణల శకం. కొత్త ఆవిష్కరణలతో వచ్చే సంస్థల హవా కొనసాగుతుంది. పెట్టుబడులు అవసరమైన ముగ్గురు పారిశ్రామికవేత్తలు నాతో మాట్లాడారు. కాకపోతే పెట్టుబడి అనేది ఒకరోజులో అప్పటికప్పుడు తీసుకునే నిర్ణయం కాదు. అన్నీ పరిశీలించాల్సి ఉంది..’’ ‘ఏఐ’ సంస్థలపై దృష్టి పెట్టాం : సారా విట్లీబ్, మ్యునిక్ ఎయిర్‌పోర్టు సంస్థ ‘‘మేం ప్రధానంగా ఎయిర్పోర్ట్, ఏవియేషన్ రంగాల్లోనే పెట్టుబడులు పెడుతున్నాం. అలాంటి అవకాశాల కోసం ఇక్కడకు వచ్చాం. అయితే ఇక్కడ కొత్త టెక్నాలజీలను చూశాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి రంగాలకు చెందిన నాలుగైదు సంస్థల ప్రతినిధులు మాతో మాట్లాడారు. ఇంకా అవకాశాలను పరిశీలిస్తున్నాం. వీటన్నిటినీ తదుపరి దశలకు తీసుకెళ్లటానికి చర్చలు కొనసాగిస్తాం..’’ నవభారత నిర్మాణం దిశగా ప్రభుత్వం కృషి : నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు డాక్టర్ రాజీవ్ కుమార్ సాక్షి, హైదరాబాద్: పేదరికం, అవినీతి, ఉగ్రవాదం, కులం, మతతత్వ ప్రభావం లేని నవభారతాన్ని నిర్మించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు డాక్టర్ రాజీవ్ కుమార్ తెలిపారు. హైదరాబాద్‌లోని డాక్టర్ మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో బుధవారం జరిగిన ‘న్యూ ఇండియా ఎట్ ది రేట్ ఆఫ్ 2022’కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజర య్యారు. 92వ ఫౌండేషన్ కోర్సు శిక్షణలో ఉన్న అఖిల భారత సర్వీస్, కేంద్ర సర్వీసు లకు చెందిన అధికారు లనుద్ధేశించి ఆయన మాట్లాడా రు. అభివృద్ధి పథంలో దేశాన్ని ఉన్నత శిఖరాల్లో నిలిపేందుకు సివిల్ సర్వెంట్లు ముందుం డాలని పిలుపునిచ్చారు. -
యువతకు ఇలాంటి వేదికలు అవసరం
దేశ విదేశాల్లోని యువ పారిశ్రామికవేత్తలకు, ఇన్వెస్టర్లకు జీఈఎస్ అనేది ఒక వేదిక మాత్రమేనని.. దీనిని ఉపయోగించుకుని ఏ స్థాయికి వెళతారన్నది వారి సమర్థతపై ఆధారపడి ఉంటుందని అమెరికా ప్రభుత్వ యువజన వ్యవహారాల గ్లోబల్ అడ్వైజర్ ఆండీ రబెన్స్ పేర్కొన్నారు. భారతీయుల పారిశ్రామికతత్వం అద్భుతమని.. టీ–హబ్ ద్వారా యువతకు భారీగా అవకాశాలు వస్తున్నాయని కొనియాడారు. పదేళ్లుగా అమెరికా ప్రభుత్వ యువజన వ్యవహారాల సలహాదారుగా వివిధ ఖండాల్లో పనిచేసిన రబెన్స్.. జీఈఎస్ కోసం హైదరాబాద్ వచ్చిన సందర్భంగా ‘సాక్షి’బిజినెస్ బ్యూరో ప్రతినిధితో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆ ఇంటర్వ్యూ ముఖ్యాంశాలివీ.. –సాక్షి, బిజినెస్ బ్యూరో సాక్షి: ఈ పారిశ్రామిక సదస్సు వల్ల యువతకు కొత్త అవకాశాలేమైనా వస్తాయా? రబెన్స్: తప్పకుండా వస్తాయి. నేను ఇండియాకు ఇంతకుముందు కూడా కొన్నిసార్లు వచ్చా. యువత సమస్యలేంటి..? ఎలా పరిష్కరించగలమన్నది అర్థం చేసుకోవటానికి ప్రయత్నించా. ఇక్కడి (భారత) యువతకు పారిశ్రామికవేత్తలవ్వాలనే ఆసక్తి అధికం. కానీ సొంత వ్యాపారాలు సృష్టించుకోవాలన్నా, ఉన్న వ్యాపారాల్ని వృద్ధి చేసుకోవాలన్నా.. నిధుల సమీకరణ, తగిన మార్గదర్శకత్వం, అవసరమైన వారితో సంబంధాల వంటివి అవసరం. అవి అంది పరిశ్రమలు సాకారమైతే మరింత మంది యువతకు ఉపాధి అవకాశాలు కూడా వస్తాయి. భారీగా పెట్టుబడులు రావటానికి, ఎంవోయూలు జరగటానికి ఇది బిజినెస్ సదస్సు కాదు. దీని ద్వారా మీరేం సాధించాలనుకున్నారు? అనుకున్నది జరుగుతోందా? రబెన్స్: అక్షరాలా జరుగుతోంది. అసలు మేం సాధించాలనుకున్నదల్లా.. పారిశ్రామికవేత్తలకు, ప్రత్యేకించి మహిళలకు కావాల్సిన వేదికను, వారి పరిశ్రమలకు తగిన అనుకూల వ్యవస్థను (ఎకో సిస్టమ్) సృష్టించటమే. ఈ సదస్సులో పాల్గొన్న వారిలో మెజారిటీ మహిళా పారిశ్రామికవేత్తలే. వారి వ్యాపారాల విస్తరణకు కావాల్సిన నిధులను సమీకరించడానికి, వారి ఆలోచనలతో మరిన్ని సాధించటానికి.. వారిని పెట్టుబడిదారులతో అనుసంధానించాలనుకున్నాం. అది జరుగుతోంది. మరి ఇండియాలో పరిశ్రమల అనుకూల వ్యవస్థ ఉందని భావిస్తున్నారా? రబెన్స్: తప్పకుండా! అద్భుతమైన స్థాయిలో ఉంది. హైదరాబాద్‌లో టీ–హబ్‌ను చూశాను. ఈ ఇంక్యుబేటర్‌ను ప్రపంచంలోనే అతిపెద్ద స్థాయికి విస్తరిస్తున్నారు. ఇది తప్పకుండా త్వరలోనే సాకారమవుతుంది. నాకు అమెరికాలోను, ఇక్కడ చాలామంది భారతీయ మిత్రులున్నారు. వారిలో దూసుకుపోయే తత్వం, పారిశ్రామిక ఆకాంక్షలు నాకు అద్భుతంలా కనిపిస్తుంటాయి. కాకపోతే కొన్ని సందర్భాల్లో కొంత మార్గదర్శకత్వం అవసరమని అనిపిస్తుంది. అమెరికన్ల తరహాలో ‘అనుకున్న పనులు అనుకున్నట్లు జరిగేలా చేయటమెలా..?’అనే రీతిలో ఆలోచించాల్సిన అవసరం ఉంది. చేస్తున్న పనిలో లోటుపాట్లను గుర్తించి, దిద్దుకునే మార్గాలను అన్వేషించటం, మనకున్న పరిమితమైన, విశ్వసనీయమైన వనరులతోనే ఇవన్నీ చేయటం వంటి విషయాల్లో కొంత మార్గదర్శకత్వం కావాలి. సదస్సుకు వచ్చిన పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారుల్లో చాలామంది ఇక్కడి పరిస్థితుల్ని చూడటానికి వచ్చామని.. కావాల్సిన వనరులను గుర్తించి, సంబంధీకులతో సంప్రదిస్తున్నామని చెప్పారు. మరి ఈ సంబంధాలు తదుపరి దశకు వెళతాయా? ఎంత సమయం పట్టొచ్చు? రబెన్స్: తదుపరి దశకు వెళతాయా..? వెళితే ఎప్పుడనేది నిజంగా వాళ్ల సమర్థత మీదే ఆధారపడి ఉంటుంది. ఇక్కడ అలాంటి సంబంధాలు ఏర్పర్చుకోవటానికి కావాల్సిన వాతావరణాన్ని మేం సృష్టించాం. వేదికను ఏర్పాటు చేశాం. ఎంతమంది పారిశ్రామికవేత్తలు పెట్టుబడుల్ని సాధిస్తారు.. ఎంత మంది పెట్టుబడిదారులు తమకు తగ్గ వెంచర్లను వెతుక్కుని పెట్టుబడులు పెడతారనేది వారు చేసే కృషిపైనే ఆధారపడి ఉంటుంది. గతంలో అమెరికా, కెన్యా, టర్కీ, యూఏఈ, మొరాకో తదితర దేశాల్లో గ్లోబల్ సదస్సులు నిర్వహించాం. అక్కడి పారిశ్రామికవేత్తలు పెట్టుబడుల కోసం ఆయా సదస్సుల వేదికపై ప్రయత్నించారు. చాలామంది విజయం సాధించారు. అమెరికాగానీ, అమెరికన్ ఇన్వెస్టర్లు గానీ ఇండియాలో ఏయే రంగాలపై ఆసక్తి చూపిస్తున్నారు? రబెన్స్: ఈ సదస్సుకు చాలా మంది అమెరికన్ ఇన్వెస్టర్లు హాజరయ్యారు. ఇక్కడ చాలా అమెరికన్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీలూ ఉన్నాయి. సదస్సు కోసం ఎంచుకున్న ప్రాధాన్య రంగాలు.. హెల్త్‌కేర్– లైఫ్ సైన్సెస్, డిజిటల్ ఎకానమీ – ఫైనాన్షియల్ టెక్నాలజీ, ఎనర్జీ – ఇన్ఫ్రాస్ట్రక్చర్, మీడియా–ఎంటర్టైన్మెంట్.. ఈ నాలుగింటిపైనా వారు ఆసక్తి చూపిస్తున్నారు. భారత్‌లో 130 కోట్ల జనాభా ఉన్నారు. అమెరికాలో ఇందులో 25 శాతం జనాభా ఉంది. ఎన్నెన్నో కొత్త ఆలోచనలు, అవకాశాలు ఇద్దరికీ ఉన్నాయి. ఇండియన్లు అటు అమెరికా సంస్థలతో బంధాలేర్పరచుకుని అక్కడ పెట్టుబడులు పెడుతున్నారు. ఇటు అమెరికా సంస్థల నుంచి పెట్టుబడులు పెడుతున్నారు. వచ్చే కొన్నేళ్ల పాటు యువతకు ఏ రంగాలు బాగుండొచ్చు? రబెన్స్: నా ఉద్దేశం ప్రకారం యువత పారిశ్రామికవేత్తలుగా ఎదగటానికి ఇష్టపడుతున్నారు. ఇక ఏ రంగమనేది వారి అర్హతలు, ఫోకస్‌పైనే ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా వారికి నచ్చిన రంగాన్ని ఎంచుకుంటేనే రాణించగలుగుతారు. అందులో కొన్ని లోపాలుండొచ్చు. వాటిని దిద్దుకుంటూ ముందుకెళ్లాలి. పారిశ్రామికవేత్తల్ని ప్రోత్సహించే విషయంలో సదస్సుతోనే సరిపెడతారా? తదుపరి చర్యలేమైనా ఉంటాయా? రబెన్స్: ఈ సదస్సు చాలా చిన్నది. ఎందుకంటే 130 కోట్ల మంది జనాభా ఉన్న ఇండియాలో ఇక్కడకు వచ్చింది కేవలం 500 మంది పారిశ్రామికవేత్తలు. భారత పారిశ్రామికవేత్తల్లో సాధికారత తేవటానికి పెను ప్రయత్నాలు జరగాల్సి ఉంది. వారిని తగిన గురువులతో అనుసంధానించటం, నిధుల లభ్యత కల్పించటం, భాగస్వామ్యాలు ఏర్పాటు చేయటం వంటివి అవసరం. ఆ దిశగా ప్రయత్నాలు చేస్తాం. ఇందు కోసం ప్రత్యేక కార్యక్రమాలేమైనా చేపడుతున్నారా? రబెన్స్: మా ఎంబసీ దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న అమెరికన్ కాన్సులేట్ల ద్వారా పలు కార్యక్రమాలు చేపడుతోంది. ఎప్పటికప్పుడు నిపుణుల్ని పిలిపించి మార్గదర్శకత్వం అందిస్తోంది. ప్రత్యేక అవకాశాలు కల్పించటం, పలువురితో నెట్వర్కింగ్ ఏర్పాటు చేయటం వంటివి జరుగుతున్నాయి. నా ఉద్దేశం ప్రకారం అమెరికాకు వచ్చిన భారత పారిశ్రామికవేత్తలైతే నిజంగా ఇక్కడ కింది స్థాయిలో ఏం జరుగుతోందనేది చెప్పగలరు. అసలు అమెరికాలో, ఇక్కడ ఒకే రకమైన సవాళ్లు ఉండవకపోవచ్చు. ఇక్కడున్న కొన్ని సమస్యలు ప్రత్యేకమైనవి కావచ్చు. కాకపోతే పరస్పర సహకారం, నెట్వర్కింగ్ ద్వారా అనుకున్నది సాధించొచ్చు. -
గోల్కొండ కోటలో 'నెలవంక'
సాక్షి, హైదరాబాద్: అమెరికా నెలవంక ఇవాంకా.. చారిత్రక గోల్కొండ కోటలో సందడి చేసింది. వైభవోపేతమైన కోట చరిత్ర తెలుసుకొని మంత్రముగ్ధురాలైంది. నాలుగు వందల ఏళ్ల నాటి భాగ్యనగర చారిత్రక విశేషాలను ఎంతో ఆసక్తిగా ఆలకించింది. హైదరాబాద్ నగరాన్ని స్థాపించిన కుతుబ్‌షాహీల ప్రస్థానం, శత్రుదుర్భేద్యమైన కోటలు, ప్రాకారాలు, దర్వాజాలు తదితర కట్టడాల నిర్మాణం చూసి అబ్బురపడింది. ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు రెండోరోజు కార్యక్రమంలో భాగంగా ఇవాంకా బుధవారం మధ్యాహ్నం 3.05 గంటల నుంచి 3.56 వరకు సుమారు 45 నిమిషాలకు పైగా గోల్కొండ కోటలో పర్యటించారు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ఆమె పర్యటన కొనసాగింది. కోట ప్రధాన ద్వారంలోకి ప్రవేశించింది మొదలు.. తిరిగి బయటకు వచ్చేవరకు ప్రతి విషయాన్ని ఎంతో ఆసక్తిగా తెలుసుకున్నారు. చప్పట్లు ప్రతిధ్వనించే క్లాప్పోర్టికో వద్ద చప్పట్లు తిరిగి వినిపించే తీరుపై అమితాసక్తిని ప్రదర్శించారు. కుతుబ్‌షాహీల రెండంతస్థుల ఆయాధాగారం, బ్యారక్‌లు, పచ్చటి పచ్చిక బయళ్లు, పూలతో ఎంతో అందంగా కనిపించే నగీనాబాగ్, కుతుబ్‌షాహీల అంతఃపురం రాణీమహల్, తారామతి మసీదు, రామదాసు బందీఖానా తదితర ప్రాంతాలను ఇవాంకా కాలినడనే సందర్శించారు. పర్యాటక, ఆర్కియాలజీ విభాగాలకు చెందిన ఉన్నతాధికారులు ఆమెకు గోల్కొండ కోట విశేషాలను వివరించారు. కుతుబ్‌షాహీల చారిత్రక, సాంస్కృతిక విశేషాలను తెలిపే లఘుచిత్రాన్ని ప్రదర్శించారు. హస్తకళల ప్రదర్శన గోల్కొండ మార్గంలో ఏర్పాటు చేసిన హస్తకళల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ప్రత్యేకంగా తయారయ్యే బొమ్మలు ఇవాంకాను ఆకట్టుకున్నాయి. నిర్మల్, కొండపల్లి, ఏటికొప్పాక, లేపాక్షి, గోల్కొండ తదితర హస్తకళా వస్తువులు, చేనేత, ఖాదీ వస్త్రాలు వంటి 12 స్టాళ్లను ఇవాంక రాక సందర్భంగా ఏర్పాటు చేశారు. తెలంగాణ సాంస్కృతిక జీవితాన్ని ప్రతిబింబించే హస్తకళల ప్రదర్శనను ఆసక్తిగా తిలకించారు. ఆతిథ్యం అదరహో.. ఫలక్‌నుమాలో మొఘలాయీల వంటకాలు ఆరగించిన విదేశీ అతిథులు.. బుధవారం గోల్కొండ కోటలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన విందులో తెలంగాణ వంటకాలను రుచి చూశారు. ప్రపంచంలో మరెక్కడా లభించని అద్భుతమైన రుచులు తెలంగాణ సొంతమని పలువురు ప్రతినిధులు కితాబునిచ్చారు. తెలంగాణ ప్రజలు వండుకొనే అన్ని రకాల వంటకాలను ఈ విందులో రుచి చూపించారు. జొన్నరొట్టె, సజ్జ రొట్టె, సర్వపిండి, అంబలి, జొన్నగట్క మొదలుకొని హైదరాబాద్ మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, ఎగ్ బిర్యానీ, ఫిష్ బిర్యానీ, బగారా రైస్, పులావ్, తలకాయ మాంసం, మటన్, కాళ్ల షోరువా, బోటి కూర, చికెన్ ఫ్రై, చికెన్ కర్రీ, పచ్చిపులుసు, రొయ్యల పులుసు, కోరమీను చేపల పులుసు, ఫిష్ ఫ్రై, బాయిల్డ్ ఎగ్, ఎగ్ కర్రీ, ఎగ్పులుసు, పప్పు, సాంబారు వివిధ రకాల కూరగాయలతో చేసిన నాన్ వెజ్ వెరైటీలు, సకినాలు, గర్జెలు, లడ్డూలు, గారెలు, పకోడీ, మలీద ముద్ద తదితర వంటకాలను అతిథులకు వడ్డించారు. సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు గోల్కొండ కోటలో విందు కొనసాగింది. సుమారు 1,500 మంది ప్రతినిధులు, వివిధ విభాగాలకు చెందిన ప్రభుత్వ ఉన్నతాధికారులు ఈ విందులో పాల్గొన్నారు. ఆర్టీసీ, పర్యాటకశాఖ ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సుల్లో ఈ ప్రతినిధులంతా గోల్కొండ కోటకు చేరుకున్నారు. ఆకట్టుకున్న సాంస్కృతిక ప్రదర్శనలు ప్రముఖ నృత్యకారిణి డాక్టర్ ఆనంద శంకర్ జయంత్ నేతృత్వంలో సుమారు 200 మంది కళాకారులతో గోల్కొండ కోటలో ఏర్పాటు చేసిన తెలంగాణ కళలు, సాంస్కృతిక ప్రదర్శన కార్యక్రమంలో హైలెట్‌గా నిలిచింది. శాస్త్రీయ, జానపద, గిరిజన కళారూపాలు విదేశీ అతిథులను అబ్బురపరిచాయి. తెలంగాణ బతుకమ్మ, బోనాలు, తెలంగాణ తల్లి, రాణీ రుద్రమ తదితర నృత్య ప్రదర్శనలు, డప్పు దరువు, పేరిణీ నృత్యం, కథక్, సూఫీ తదితర నృత్య ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ప్రముఖ నర్తకీమణి డాక్టర్ అలేఖ్య పుంజాల రాణీరుద్రమ నృత్య ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. దీపికారెడ్డి తెలంగాణ తల్లి కూచిపూడి నృత్యరూపకాన్ని ప్రదర్శించారు. మంగళ్‌భట్ కథక్, కళాకృష్ణ పేరిణి, స్నేహ మంగాపు భరతనాట్యం, రాఘవరాజ్ భట్ సూఫీ, షేక్ హనీఫ్ అహ్మద్ మార్షల్ ఆర్ట్స్, ప్రమోద్‌రెడ్డి రామదాసు ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వివిధ దేశాల నుంచి ప్రతినిధులు ఈ ప్రదర్శనను ఎంతో ఆసక్తిగా తిలకించారు. మళ్లీ మళ్లీ హైదరాబాద్ రావాలనిపిస్తోంది హైదరాబాద్ చాలా బాగుంది. గోల్కొండ కోట, ఫలక్‌నుమా ప్యాలెస్, చార్మినార్ వంటి గొప్ప కట్టడాలను చూస్తోంటే మళ్లీ మళ్లీ హైదరాబాద్‌కు రావాలనిపిస్తోంది. ఫూడ్స్ చాలా బాగున్నాయి. బిర్యానీ టేస్టీగా ఉంది. ఈ వంటకం తినడం ఇదే మొదటిసారి. –గోంజా, టాంజానియా అతిథి మర్యాదలు బాగున్నాయి ఆతిథ్యం చాలా బాగుంది. రకరకాల వంటలు రుచి చూశాం. హైదరాబాద్ ప్రజల టేస్ట్ తెలిసింది. మటన్, చికెన్, స్వీట్స్, ఒకటేమిటీ అన్నీ బాగున్నాయి. బిర్యానీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిందేముంది. చాలా బాగుంది. రుచికరమైన వంటల్లో హైదరాబాద్ చాలా ఫేమస్ అని తెలిసిపోయింది. – మెరీనా, ఇటలీ గ్రేట్ వర్క్ ఇవాంకా.. జీఈఎస్‌లో మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహమిచ్చావ్ కుమార్తె ఇవాంకాపై ట్వీటర్లో డొనాల్డ్ ట్రంప్ ప్రశంసలు వాషింగ్టన్: హైదరాబాద్‌లో జరుగుతున్న ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు(జీఈఎస్) సందర్భంగా మహిళా పారిశ్రామికవేత్తలకు అద్భుతమైన ప్రోత్సాహం ఇస్తోందంటూ తన కుమార్తె, సలహాదారు ఇవాంకాపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రశంసలు కురిపించారు. ‘గ్రేట్ వర్క్ ఇవాంకా’అంటూ డొనాల్డ్ ట్రంప్ ట్వీటర్లో మంగళవారం అర్ధరాత్రి ట్వీట్ చేశారు. అమెరికన్ల కలలను నిజం చేసేలా పారిశ్రామికవేత్తల కోసం అమెరికా తీసుకుంటున్న చర్యలపై జీఈఎస్‌లో ఇవాంకా చేసిన వ్యాఖ్యలను అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ ట్వీటర్లో పోస్ట్ చేసింది. దీనిని రీట్వీట్ చేసిన సందర్భంగా ట్రంప్ పై వ్యాఖ్యలు చేశారు. ఐక్యరాజ్యసమితిలో అమెరికా రాయబారి నిక్కీహేలీ కూడా ఇవాంకాపై పొగడ్తలు కురిపించారు. మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు ఇవాంకా భారత్‌లో పర్యటించడం ఉద్విగ్నంగా ఉందన్నారు. ప్రపంచవ్యాప్తంగా మహిళలను పెట్టుబడిదారులుగా.. మెంటార్లుగా అవకాశంతో పాటు వారికి అనుకూలమైన వాతావరణం కల్పిస్తే అద్భుతమైన విజయాలు సాధిస్తారని ఆమె మంగళవారం ట్వీట్ చేశారు. వేల దిగ్గజాలు.. లక్షల ఆలోచనలు ఉత్సాహంగా రెండోరోజు సదస్సు సాక్షి, హైదరాబాద్: ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు రెండోరోజున విజయవంతంగా సాగింది. దాదాపు 20కు పైగా చర్చాగోష్ఠులు, సామూహిక సమావేశాల్లో వివిధ రంగాల ప్రముఖులు, పారిశ్రామిక దిగ్గజాలు పాల్గొన్నారు. ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన వేలాది మంది పారిశ్రామికవేత్తలు, ఔత్సాహిక వ్యాపారవేత్తలు, పెట్టుబడిదారులు తమ ఆలోచనలు పంచుకున్నారు. బుధవారం ఉదయం 9.30 గంటలకు ప్లీనరీ సెషన్‌తో సదస్సు ప్రారంభమైంది. మహిళలకు ఉపాధి అవకాశాలు పెంచడం, పని ప్రదేశాల్లో అవకాశాలు కల్పించడం, నాణ్యమైన విద్య, నైపుణ్య శిక్షణ అంశాలపై చర్చించారు. ఇవాంకాతో పాటు బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయర్ సతీమణి చెర్రీ బ్లెయిర్, ఐసీఐసీఐ బ్యాంక్ సీఈవో చందా కొచ్చర్, డెల్ ఈఎంసీ సీసీవో కరేన్ క్వింటోస్ ఈ చర్చలో పాల్గొన్నారు. మంత్రి కేటీఆర్ సమన్వయకర్తగా వ్యవహరించిన ఈ సెషన్ అందరినీ ఆకట్టుకుంది. తొలి ప్లీనరీకి ఇవాంకా హాజరవటంతో రెండోరోజు సదస్సు ఉత్సాహంగా ఆరంభమైంది. ఈ చర్చ ముగియగానే ఇవాంకా వివిధ దేశాల నుంచి వచ్చిన పారిశ్రామిక దిగ్గజాలతో గ్రూప్ ఫొటోలు దిగారు. అనంతరం సదస్సు నుంచి ఆమె తిరుగుపయనమయ్యారు. ఆ తర్వాత సాయంత్రం వరకు మహిళా సాధికారత, వ్యవసాయం, పెట్టుబడులు, వ్యాపార మెలకువలు, ఆరోగ్యరంగం, క్రీడలు, మీడియా వినోద రంగాలపై చర్చాగోష్ఠులు సాగాయి. -
ఫలక్‌నుమా బాంబు..ఎల్లయ్య మానసిక రోగి
హైదరాబాద్: ఫలక్‌నుమా ప్యాలెస్ లో బాంబు ఉందంటూ 108కి డయల్ చేసిన వ్యక్తి ఆచూకీని దక్షిణ మండలం పోలీసులు గుర్తించారు. సదరు వ్యక్తి మానసిక రుగ్మతతో బాధ పడుతూ ఈ కాల్ చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. దక్షిణ మండలం డీసీపీ వి.సత్యనారా యణ బుధవారం తన కార్యాల యంలో మీడియాకు వివరాలు వెల్లడించారు. మంగళవారం జీఈ సదస్సులో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ రాత్రి 8.45కు, అమెరికా అ«ధ్యక్షుడి కుమార్తె ఇవాంక ట్రంప్ 8.54కు ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ప్రవేశించారు. సరిగ్గా రాత్రి 8.43కు ఓ గుర్తు తెలియని వ్యక్తి 108ృఈఎంఆర్ఐ అంబులెన్స్‌కు కాల్ చేసి ప్యాలెస్‌లో బాంబు పెట్టారంటూ భయపడుతూ... వణుకుతున్న స్వరంతో సమాచారం ఇచ్చాడు. దీంతో అప్రమత్తమైన సిబ్బంది ఈ వివరాలను 100 డయల్‌తో పాటు పోలీస్ సెక్యూరిటీ విభాగాలకు సమాచారం అందించారు. పోలీసులు ఎలాంటి ఆందోళనలు చెందకుండా ప్యాలెస్‌లో గట్టి బందోబస్తు కొనసాగిస్తూ కాల్ చేసిన వ్యక్తిపై ఆరా తీసేందుకు పోలీస్ బృందాలు రంగంలోకి దిగాయి. ఈ క్రమంలో సదరు వ్యక్తి మల్కాజ్‌గిరికి చెందిన బొంత ఎల్లయ్య(60)గా గుర్తించారు. మానసిక వ్యాధితో బాధపడుతున్న ఈయనను ఎర్రగడ్డ ఆస్పత్రిలో చేర్పించారు. కోర్టు ఆదేశానుసారం చికిత్స అనంతరం ఈ నెల 24న ఇంటికి తీసుకొచ్చారు. అతడు బయటికి వచ్చిన వెంటనే ఎక్కడ చూసినా జీఈ సదస్సు విషయమే మారుమోగుతుండటంతో బాంబు ఉందంటూ ఫోన్ చేసి బెదిరించాలనుకున్నాడు. ఈ క్రమంలోనే 27న ఫోన్ కొనుగోలు చేశాడు. మంగళవారం రాత్రి 108కి ఫోన్ చేసి బాంబు అంటూ కాల్ చేశాడు. కాల్ డేటా ఆధారంగా పోలీసులు సమాచారం సేకరించారు. సైబరాబాద్ పరిధిలో తన కొడుకుతో ఆటోలో వెళుతుండగా పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే మానసిక స్థితి బాగోలేని ఎల్లయ్యను ఎర్రగడ్డ మానసిక వైద్యశాలకు తరలిస్తామని డీసీపీ వెల్లడించారు. -
రెండో రోజు ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు
-
'అది కూడా నా ఘనతే' అన్న చంద్రబాబు
సాక్షి, అమరావతి : అవకాశం దొరికినప్పుడల్లా హైటెక్ సిటీ నుంచి... అన్నీ నేనే కట్టించాననే చెప్పుకునే చంద్రబాబు నాయుడు హైదరాబాద్ మెట్రో రైలు ఘనత కూడా తనదేనని చెప్పుకొచ్చారు. హైదరాబాద్ మెట్రో రైలు కోసం తన హయంలో పోరాటం చేశానని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఆయన బుధవారం అసెంబ్లీ లాబీలో మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్ చేశారు. ‘మెట్రోను బెంగళూరు, అహ్మదాబాద్ నగరాలకే పరిమితం చేస్తే... నేను పోరాడి హైదరాబాద్‌ను ఆ జాబితాలో చేర్పించా. దానివల్లే మెట్రో రైలు హైదరాబాద్ రాగలిగింది. కర్ణాటక, గుజరాత్ ప్రభుత్వాలు మెట్రోను వేగంగా పూర్తి చేశాయి. నా తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి మెట్రోను ఆలస్యం చేశారు. అందుకే ఇంతకాలం పట్టింది. అప్పట్లోనే నేను ఉన్నప్పుడే ఢిల్లీ మెట్రో శ్రీధరన్‌తో హైదరాబాద్ మెట్రోపై అధ్యయనం చేయించాం. హైదరాబాద్ అభివృద్ధిలో మా ముద్ర పోయేది కాదు. మెట్రోతో పాటు జీఈఎస్ జరుగుతున్న హెచ్ఐసీసీ, శంషాబాద్ ఎయిర్‌పోర్టు... ఇవన్నీ టీడీపీ హయాంలో వచ్చినవే. నేను ప్రారంభించినా...ప్రారంభించకున్నా...హైదరాబాద్‌ను అభివృద్ధి చేశామన్న సంతృప్తి నాకుంది. విద్యార్థుల ఆత్మహత్యలపై గట్టిగా ఉన్నాం. కళాశాలలు తప్పు చేస్తే సహించేది లేదు. ఈ విషయం చెప్పడానికే సభలోకి వెళ్లి మాట్లాడా.’ అని అన్నారు. -
అలా అంటే ఒప్పుకోను.!
సాక్షి, హైదరాబాద్ : భారత్‌లో బాలీవుడ్ నటులతోనే క్రీడలు ప్రాచుర్యం పొందాయన్న వాదనను ఒప్పుకోనని భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా స్పష్టం చేశారు. నగరంలో జరగుతున్న ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు (జీఈఎస్)లో భాగంగా బుధవారం ‘క్రీడా రంగంలో వ్యాపార విజయం’ అంశంపై మాస్టర్‌క్లాస్ సెషన్ జరిగింది. ఈ చర్చ కార్యక్రమానికి సమన్వయకర్తగా హర్షబోగ్లే వ్యవహరించగా.. టెన్నిస్ స్టార్ సానియ మీర్జా, బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపిచంద్, మహిళా క్రికెట్ కెప్టెన్ మిథాలీ రాజ్, వన్ చాంపియన్‌షిప్ ఉపాధ్యక్షులు చాత్రి సిత్యోంద్టాంగ్‌లు పాల్గొన్నారు. బాలీవుడ్ నటుల ప్రచారంతో క్రీడలు ప్రాచుర్యం పొందాయన్న వాదనను సానియా మీర్జా తప్పుబట్టారు. క్రీడాకారులు రాణించడం వల్లనే ఆదరణ లభిస్తోందని స్పష్టంచేశారు. క్రీడల్లో మహిళలు కూడా రాణిస్తున్నారని, టెన్నిస్ క్రికెట్ లాంటి క్రీడల్లో మహిళలను మరింత ప్రోత్సాహించాలన్నారు. రాత్రికి రాత్రే ఎవరూ గొప్ప క్రీడాకారులు కాలేరని, పట్టుదల, కృషి ఎంతో అవసరమన్నారు. నిరంతర శ్రమ, పట్టుదలతోనే విజయాలు సాధ్యమవుతాయని, కొత్త క్రీడాకారులకు ప్రోత్సాహకం అందజేయాలని సానియా సూచించారు. ఆర్థికంగా బాగా ఉన్నవారే క్రీడలవైపు వస్తున్నారని, చాలా మంది గ్రామీణ క్రీడాకారులు వసతులు, ఆర్థిక లేమితో అక్కడే ఉండిపోతున్నారని మిథాలీ రాజ్ తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో మంచి క్రీడా నైపుణ్యాలున్న వారున్నారని వారందరికీ చేయుతనివ్వాలని మిథాలీ సూచించారు. దేశ ప్రజలు క్రికెట్ నుంచి అన్ని క్రీడలవైపు మొగ్గు చూపుతున్నారని కోచ్ గోపిచంద్ అభిప్రాయపడ్డారు. టెన్నిస్, రెజ్లింగ్, బ్యాడ్మింటన్ ఇలా అన్ని క్రీడలపై ఆసక్తి కనబరుస్తున్నారని, ముఖ్యంగా క్రీడల్లోకి రావడానికి మహిళలు ప్రత్యేక ఆసక్తి కనబరుస్తున్నారని తెలిపారు. బ్యాడ్మింటన్‌లో క్రీడాకారులు బాగా రాణిస్తున్నారు. క్రీడాకారుడి నుంచి కామెంటేటర్ వరకు క్రీడారంగంలో చాలా అవకాశాలున్నాయని గోపిచంద్ పేర్కొన్నారు. -
మహిళలు అద్భుతంగా రాణిస్తున్నారు
-
ఇవాంక సదస్సులో కేసీఆర్ ఉండగా.. మోదీ ఎందుకు?
న్యూఢిల్లీ: హైదరాబాద్‌లో జరుగుతున్న ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు (జీఈఎస్)కు ప్రధానమంత్రి నరేంద్రమోదీ హాజరుకావడాన్ని కాంగ్రెస్ పార్టీ టార్గెట్ చేసింది. అమెరికా అధ్యక్షుడి కూతురు ఇవాంకా ట్రంప్ పాల్గొంటున్న ఈ సదస్సులో తెలంగాణ ముఖ్యమంత్రి హాజరవుతుండగా.. మోదీ వెళ్లాల్సిన అవసరం ఏముందని కాంగ్రెస్ సీనియర్ నేత ఆనంద్ శర్మ ప్రశ్నించారు. ‘ఇవాంకా ట్రంప్ పాల్గొంటున్న కార్యక్రమానికి హాజరవ్వడం ద్వారా నరేంద్రమోదీ ప్రధానమంత్రి పదవిని చులకన చేశారు. ఈ సదస్సులో తెలంగాణ ముఖ్యమంత్రి పాల్గొంటున్నారు. ప్రధానికి విదేశీయులు, విదేశీ రేటింగ్ ఏజెన్సీల సర్టిఫికెట్ తీసుకోవాల్సిన అవసరం ఏముంది? తన పాలనపై సర్టిఫికెట్ ఇవ్వాల్సిందిగా ఆయన గుజరాత్ ప్రజలను అడగాలి’ అని ఆనంద్‌శర్మ అన్నారు. జీఈఎస్ సదస్సులో ప్రధాని మోదీ పాల్గొనడాన్ని తప్పుబడుతూ ఆనంద్ శర్మ చేసిన విమర్శలపై నెటిజన్లు తప్పుబడుతున్నారు. -
కళకళ..వెలవెల
సాక్షి,సిటీబ్యూరో/గచ్చిబౌలి: వందలాది మంది జాతీయ, అంతర్జాతీయ ప్రతినిధులు. వేలకొద్దీ వాహనాల రాకపోకలు ,ప్రభుత్వ ప్రతినిధులు, ఉన్నతాధికారులు, ఎక్కడికక్కడ భారీగా మోహరించిన పోలీసు బలగాలతో నగరంలో మంగళవారం హడావిడి నెలకొంది. అంతర్జాతీయ పారిశ్రామికవేత్తల శిఖరాగ్ర సదస్సు జరుగనున్న హెచ్ఐసీసీ, హైటెక్‌సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, మియాపూర్ మెట్రో స్టేషన్, తదితర ప్రాంతాలు అతిథులు, సందర్శకులతో కళకళలాడాయి. మరోవైపు మిగతా నగరమంతా వెలవెలపోయింది. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యకలాపాలు స్తంభించాయి. నగరమంతటా ఇవాంక రాక, మెట్రో రైలు ప్రారంభోత్సవ అంశాలే చర్చనీయాంశమయ్యాయి. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కుమార్తె, ఆ దేశ సలహాదారు ఇవాంక ట్రంప్‌ను నగరానికి స్వాగతిస్తూ అక్కడక్కడా బ్యానర్లు ఏర్పాటు చేశారు. ప్రధాని మోదీకి స్వాగతం పలుకుతూ బీజేపీ పలుచోట్ల ప్రత్యేక స్వాగత ఏర్పాట్లు చేసింది. అతిథుల భద్రత దృష్ట్యా మోహరించిన ప్రత్యేక భద్రతా బలగాలతో రహదారులు నిండిపోయాయి. హెచ్ఐసీసీ ప్రాంగణానికి నలువైపులా భారీ బందోబస్తు కనిపించింది. నిత్యం ఐటీ సంస్థల కార్యకలాపాలతో, ఐటీ నిపుణులతో సందడిగా ఉండే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ మంగళవారం భద్రతా వలయంలోకి వెళ్లిపోయింది.సైబరాబాద్‌లోని విదేశీ అతిథులు బస చేసిన 18 హోటళ్ల వద్ద కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. సుమారు 150 దేశాలకు చెందిన వందలాది మంది ప్రతినిధులు, అధికారులతో సందడిగా కనిపించింది.హెచ్ఐసీసీ ప్రాంతంలో కారు పాస్‌లు ఉన్నవాళ్లను మాత్రమే లోపలికి అనుమతించారు. పాస్‌లు లేని వారు కాలినడకనే హెచ్ఐసీసీకి వెళ్లారు. స్కూళ్లు, ఐటీ సంస్థలకు సెలవు సదస్సు నేపథ్యంలో ప్రముఖుల రాకపోకలను దృష్టిలో ఉంచుకొని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ప్రాంతాల్లోని ఐటీ సంస్థలు వర్క్ టూ హోమ్‌కు అవకాశం కల్పించడంతో ఐటీ ఉద్యోగులు తమ ఇళ్ల వద్ద నుంచే విధులు నిర్వహించారు. మరి కొన్ని సంస్థల్లో ఉదయం 8 గంటలకే వచ్చి విధుల్లో చేరారు. మొదటి షిఫ్టు విధులను మధ్యాహ్నం 2 గంటలలోపే ముగించారు. ప్రధాని మోదీ, ఇవాంకల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు పోలీసుల సూచన మేరకు కొన్ని సంస్థలు సాయంత్రం విధులను రద్దు చేశాయి. అలాగే హైటెక్‌సిటీ, మాదాపూర్, కొండాపూర్, తదితర ప్రాంతాల్లోని ప్రైవేట్ స్కూళ్లు చాలా వరకు మూతపడ్డాయి. కొన్ని స్కూళ్లు ఒక్క పూటకే పరిమితమయ్యాయి. శేరిలింగంపల్లి, తదితర చోట్ల ప్రభుత్వ స్కూళ్లు మాత్రం యథావిధిగా పని చేశాయి. దుకాణాలు బంద్ .. జీఈఎస్ సదస్సు, ప్రధాని, ఇవాంకా ట్రంప్ పర్యటన నేపథ్యంలో న్యాక్ నుంచి హైటెక్స్ వరకు ఉన్న రోడ్డుకు ఇరువైపుల అన్ని దుకాణాలను ముసివేయించారు. హైటెక్స్ నుంచి ఫలక్నామా వెళ్లే మార్గంలో హైటెక్స్, చార్మినార్ మెటల్ కమాన్, కొత్తగూడ, గచ్చిబౌలి మార్గంలో కూడా దుకాణాలను మూసివేయించారు. కనిపించని జనసంచారం ఒకవైపు అతిథుల రాకతో హెచ్ఐసీసీ పరిసర ప్రాంతాలు కళకళలాడగా నగరంలోని మిగతా ప్రాంతాలు వెలవెలాబోయాయి. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, అమీర్‌పేట్, ఖైరతాబాద్, పంజగుట్ట, బాలానగర్, సికింద్రాబాద్, కోఠీ, ఆబిడ్స్, దిల్సుఖ్నగర్, తదితర ప్రాంతాల్లో ప్రభుత్వ ,ప్రైవేట్ కార్యకలాపాలు స్తంభించాయి. జనం సైతం అవసరమైతే తప్ప రోడ్లపైకి రాలేదు. దీంతో సాధారణ ట్రాఫిక్ రద్దీకి భిన్నంగా పలు ప్రాంతాల్లో జనసంచారం సైతం చాలా తక్కువగా ఉంది. స్తంభించిన జనజీవనం.. జీఈఎస్ ప్రతినిధులకు కేంద్రం విందు ఏర్పాటు చేసిన ఫలక్‌నుమా ప్యాలెస్ మార్గంలోనూ కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.ఎక్కడా పెద్ద సంఖ్యలో జనం గుమిగూడకుండా జాగ్రత్తలు పాటించారు. షాపింగ్‌కాంప్లెక్స్‌లు, ఫంక్షన్‌హాళ్లు మూసి ఉంచారు. రోడ్లకు ఇరువైపులా జనం రద్దీ లేకుండా తగిన చర్యలు తీసుకున్నారు. దీంతో సాధారణ జనజీవనానికి భిన్నమైన వాతావరణం నెలకొంది. నేడు గోల్కొండ ప్రాంతంలో ట్రాఫిక్ ఆంక్షలు సాక్షి, సిటీబ్యూరో: జీఈఎస్‌లో పాల్గొన్న అతిథులకు తెలంగాణ సర్కారు బుధవారం రాత్రి గోల్కొండ కోటలో విందు ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో బుధవారం మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 10 గంటల వరకు ఆ ప్రాంతంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. నార్సింగి, రామ్‌దేవ్‌గూడ వైపుల నుంచి గోల్కొండ కోట వైపు వచ్చే వాహనాలను బాపూఘాట్ నుంచి లంగర్‌హౌస్ ఫ్లైఓవర్ కింది భాగం, ఫతేదర్వాజా మీదుగా పంపిస్తారు. షేక్‌పేట్‌నాలా వైపు నుంచి గోల్కొండ కోట వైపు వచ్చే వాహనాలను గోల్కొండ గోల్ఫ్ క్లబ్ నుంచి జమాలీ దర్వాజా మీదుగా పంపిస్తారు. -
'చంద్రబాబును ఆహ్వానించరా..?'
సాక్షి,సిటీబ్యూరో:ఉమ్మడి రాష్ట్రానికి తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబునాయుడిని ప్రతిష్టాత్మకమైన జీఈఎస్ సదస్సుకు ఆహ్వానించకపోవడం దారుణమని టీడీపీ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెన్ శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం పార్టీ కార్యాలయంలో మహాత్మ జ్యోతిరావు పూలే వర్ధంతిని పురస్కరించుకొని పలువురు నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ప్రధాని మోదీ, ఇవాంకా ట్రంప్‌తో సహా దేశ,విదేశీ ప్రతినిధులు హాజరవుతున్న సదస్సుకు ఆయనున్న పిలవక పోవడం.. తెంగాణ ప్రభుత్వానికి ఏపీ ప్రజలపై ఎంత ద్వేషముం దో వెల్లడవుతోందన్నారు. అంతకుముందు కార్యక్రమంలో పార్టీ నాయకులు వనం రమేశ్, బద్రినాథ్ యాదవ్, శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. పూలే చిత్రపటానికి పూలమాల వేస్తున్న టీడీపీ నేతలు -
పురుషులు ఈ విషయాన్ని గుర్తించాలి: ఇవాంక
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు (జీఈఎస్)లో భాగంగా బుధవారం మహిళా పారిశ్రామికవేత్తల నైపుణ్యాభివృద్ధి అంశంపై ప్లీనర్ జరిగింది. ఈ చర్చ కార్యక్రమానికి మంత్రి కేటీఆర్ సమన్వయకర్తగా వ్యవహరించగా.. ముఖ్య అతిథి ఇవాంకా ట్రంప్‌తోపాటు బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ సతీమణి చెర్రీ బ్లెయిర్, ఐసీఐసీఐ బ్యాంక్ ఎండీ చందా కొచ్చార్, డెల్ సీఈవో క్వింటోస్ తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీలో జరుగుతున్న ఈ ప్లీనరీలో ఇవాంక మాట్లాడుతూ.. మహిళలు విభిన్న రంగాల్లో అద్భుతంగా రాణిస్తున్నారని అన్నారు. మహిళలు ఉద్యోగాలు చేస్తూ.. కుటుంబసభ్యులకు ఆర్థికంగా అండగా ఉంటున్నారని గుర్తుచేశారు. సాంకేతిక రంగంలో అనేక అవకాశాలు ఉన్నాయని, ఈ అవకాశాలను మహిళలు అందిపుచ్చుకోవాలని సూచించారు. కొత్త ఆవిష్కరణలన్నీ ప్రైవేటు రంగంలోనే వస్తున్నాయని, ఏ రంగంలోనైనా సేవలు బాగుంటేనే ఆదరణ లభిస్తుందని అన్నారు. వ్యాపారాల్లో మహిళల భాగస్వామ్యం ఎంతో అవసరమని గుర్తుచేశారు. నైపుణ్యాభివృద్ధికి శిక్షణ ఇవ్వడం ఎంతో ముఖ్యమని అన్నారు. అమెరికన్ వర్సిటీల్లో మహిళలకు సాంకేతిక విద్యను అందించడంపై ఎక్కువ శ్రద్ధా పెట్టామని తెలిపారు. మహిళలకు ప్రధానంగా నమ్మకం, సామర్థ్యం, మూలధనం ఉండాలని చెప్పారు. మహిళలు తమతో ఏ విషయంలో తీసిపోరని పురుషులు గుర్తించాలన్నారు. మహిళలను ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోందని మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. సిస్కో, మైక్రోసాఫ్ట్‌తో కలిసి మహిళాభివృద్ధికి తోడ్పడుతున్నామని తెలిపారు. భారత దేశంలో మహిళల భాగస్వామ్యం చాలా పెరిగిందని చందా కొచ్చర్ అన్నారు. భారతదేశం నుంచి మంచి క్రీడాకారిణులు అన్ని విభాగాల్లో ఉన్నారని తెలిపారు. నేడు భారత దేశ రక్షణమంత్రిగా మహిళ ఉన్న విషయాన్ని గుర్తుచేశారు. దేశంలోని బ్యాకింగ్ రంగంలో 40శాతం మంది మహిళలు పనిచేస్తున్నారని చెప్పారు. ఆత్మస్థైర్యం నింపినప్పుడే మహిళలు రాణించగలరని చెప్పారు. తన పిల్లలే తనకు స్ఫూర్తి అని చెప్పారు. మహిళల సాధికారిత కోసం తమ ఫౌండేషన్ ప్రధానంగా కృషి చేస్తున్నదని చెర్రీ బ్లెయిర్ తెలిపారు. -
సిటీ షాన్‌దార్
ఒకేరోజు మహత్తర ఘట్టాలు.. ఓవైపు కలల మెట్రో పట్టాలెక్కితే.. మరోవైపు అంతర్జాతీయ పారిశ్రామిక సదస్సు ప్రపంచం దృష్టిని ఆకర్షించింది! మధ్యాహ్నం వేళ మియాపూర్‌లో మెట్రో పరుగులు పెడితే.. సాయంత్రం వేళ హైటెక్స్‌లో జరిగిన జీఈఎస్‌లో భావి ప్రపంచ స్వాప్నికుల కొత్త ఆలోచనలు ఆవిష్కృతమయ్యాయి!! ఇక రాత్రి ఫలక్‌నుమా ప్యాలెస్‌లో హైదరాబాదీ ఘుమఘుమలు అతిథుల నోరూరించాయి. మొత్తంగా మంగళవారం నగరమంతా వీవీఐపీలు, విదేశీ ప్రతినిధులతో కళకళలాడింది. మెట్రో రైలును ప్రధాని మోదీ ప్రారంభించగా.. జీఈఎస్‌లో అమెరికా అధ్యక్షుడి తనయ ఇవాంక తళుక్కుమంది!! మహిళతోనే మార్పు : ఇవాంకా (పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి) మహిళతోనే మార్పు సాధ్యమని అమెరికా అధ్యక్షుడి సలహాదారు ఇవాంకా ట్రంప్ ఉద్ఘాటించారు. మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదిగితే ఎక్కువ మందికి లాభం చేకూరుతుందని, సమాజంపై దాని ప్రభావం ఎన్నో రెట్లు ఉంటుందని చెప్పారు. మహిళలు తమ సంపాదనను తిరిగి తమ కుటుంబాలు, సంబంధీకులపైనే ఇన్వెస్ట్ చేస్తారని పేర్కొన్నారు. మహిళ మాకు ఆది'శక్తి' : ప్రధాని మోదీ (ఇక్కడ క్లిక్) భారతీయ పురాణాల్లో మహిళను శక్తి అవతారంగా అభివర్ణించారని, సమాజాభివృద్ధికి మహిళా సాధికారత అత్యంత కీలకమని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టంచేశారు. దేశంలోని నాలుగు అత్యంత పురాతనమైన హైకోర్టులకుగాను మూడింటికి మహిళలే నేతృత్వం వహిస్తున్నారని, అంగారకుడిపైకి రోవర్‌ను పంపిన యాత్రలోనూ మహిళల పాత్రే ప్రధానమని, క్రీడల్లోనూ మహిళలే గర్వకారణంగా నిలుస్తున్నారని ప్రశంసించారు. మంగళ వారమిక్కడ అంతర్జాతీయ పారిశ్రామికవేత్తల సదస్సులో ఆయన ప్రసంగించారు. పెట్టుబడులకు స్వర్గధామం : సీఎం కేసీఆర్ (క్లిక్ హియర్) కొత్తగా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రం పెట్టుబడులకు స్వర్గధామమని.. ప్రపంచస్థాయి సదస్సు నిర్వహించి, ఈ విషయాన్ని చాటి చెప్పడం ఎంతో ఆనందంగా ఉందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. హైదరాబాద్‌లో మంగళవారం ప్రారంభమైన ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు (జీఈఎస్–2017) ప్రారంభోత్సవంలో ఆయన స్వాగతోపన్యాసం చేశారు. అందమైన హైదరాబాద్ ఆతిథ్యాన్ని స్వీకరించాలని.. ఇక్కడి బిర్యానీ రుచిని ఆస్వాదించాలని కోరారు. ఫలక్‌నుమ ప్యాలెస్‌లో గ్రాండ్ డిన్నర్ (క్లిక్ చేయండి) జీఈఎస్ సదస్సుకు హాజరైన విశిష్ట అతిథి ఇవాంకా ట్రంప్‌తో పాటు ఇతర ప్రముఖులు, పారిశ్రామికవేత్తలకు మంగళవారం రాత్రి ఫలక్‌నుమా ప్యాలెస్‌లో పసందైన విందు ఇచ్చారు. ఇందులో ప్రధాని మోదీతోపాటు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, సదస్సుకు వచ్చిన అమెరికన్ డెలిగేట్లు, రతన్ టాటా, ముఖేశ్ అంబానీ, కుమార మంగళం బిర్లా, ఆది గోద్రెజ్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు. -
ఒకరికి ఒకరు..!
పారిశ్రామిక యవనికపై మహిళలు నిలదొక్కుకోవాలంటే పరస్పర సహకారం అవసరమని ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు (జీఈఎస్) తొలి సెషన్లో వక్తలు అభిప్రాయపడ్డారు. మహిళా పారిశ్రామికవేత్తలు ఒకరికొకరు తోడుగా ఉండి తదుపరి జీఈఎస్‌కు మరో మహిళా పారిశ్రామికవేత్తను తీసుకురావాలని, ఇందుకు పురుషుల ప్రోత్సాహమూ ఉండాలని ఆకాంక్షించారు. ప్రపంచంలో మార్పునకు అనుగుణంగా మహిళా పారిశ్రామికవేత్తలు ముందుకొస్తున్నారని, వారి ప్రతిభను గుర్తించి ప్రోత్సహిస్తే అద్భుతాలు సృష్టిస్తారన్నారు. జీఈఎస్‌లో భాగంగా మంగళవారం ‘మహిళా సాధికారత–వివిధ దేశాల్లో మహిళల అవకాశాలు’ అంశంపై చర్చాగోష్టి జరిగింది. సిస్కో సంస్థ చైర్మన్ జాన్ చాంబర్స్ దీనికి ప్యానెల్ స్పీకర్‌గా వ్యవహరించగా.. భారత్ తరఫున రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్, అమెరికా తరఫున ఇవాంకా, ఎస్ఆర్ఎస్ ఏవియేషన్ అండ్ ఎస్ఆర్ఎస్ పెట్రోలియం సంస్థ ఎండీ సిబోంగిల్ సాంబూ (దక్షిణాఫ్రికా), స్కాండిన్ విస్కా ఎన్స్కిడ్లా బ్యాంకెన్ (సెబ్) చైర్మన్ మార్కస్ వాలెన్బర్గ్లు పాల్గొని మాట్లాడారు. – సాక్షి, హైదరాబాద్ జస్ట్ డూ ఇట్..: ఇవాంకా ‘‘వ్యాపార రంగంలో ఎంతో మంది విఫలమయ్యారు. మరెందరో విజయం సాధించారు. కొత్త పరిశ్రమలు నెలకొల్పాలనుకునేవారిని నేను కోరేది ఒక్కటే.. ప్రతి ఒక్కరిలో తమ వ్యాపారం విజయవంతం అవుతుందని 100 శాతం నమ్మకం, ఆత్మవిశ్వాసం ఉండాలి. వ్యాపార ఆలోచనల పట్ల ఉత్సాహం, వాటి ద్వారా మార్పు తీసుకురావాలనే బలమైన సంకల్పం ఉంటే పరిశ్రమలు స్థాపించండి. జస్ట్ డూ ఇట్..’’ అని ఇవాంకా సూచించారు. ఆవిష్కరణలకు కేంద్రమైన హైదరాబాద్‌కు వచ్చినందుకు చాలా ఆనందంగా ఉందని పేర్కొన్నారు. పెట్టుబడులు, మార్గనిర్దేశకత్వం పొందడంతోపాటు కొన్ని దేశాల్లో సరైన చట్టాలు లేక మహిళా పారిశ్రామికవేత్తలు ఇబ్బంది పడుతున్నారని... శాస్త్ర, సాంకేతిక విద్యను అందిపుచ్చుకునే విషయంలో మహిళలు వెనుకబడ్డారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పుడు శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానం ఏ ఒక్కరి సొత్తూ కాదని, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ప్రతి పరిశ్రమపై ప్రభావం చూపుతోందని పేర్కొన్నారు. తన తండ్రి డొనాల్డ్ ట్రంప్ పాలనలో అప్పుడే 11 నెలలు పూర్తి చేసుకోవడం నమ్మశక్యంగా లేదని వ్యాఖ్యానించారు. అమెరికాలో విద్య, నైపుణ్యాభివృద్ధిని విస్తృతం చేసేందుకు కేజీ నుంచి 12 వరకు విద్య ప్రైవేటీకరణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు. అమెరికాలో పనిచేసేవారిలో 47 శాతం మహిళలుండగా.. ఐటీ రంగంలో పనిచేసేవారిలో 21 శాతమే ఉండడం ఆందోళన కలిగించే అంశమన్నారు. ఇంజనీరింగ్ రంగంలోనూ మహిళల ప్రాతినిధ్యం 13 శాతమే ఉందని చెప్పారు. ఉద్యోగాల విషయంలో మహిళల వెనుకబాటు ఇలా కొనసాగితే తిరోగమనం దశగా పయనిస్తామని.. అందుకే విద్య ప్రైవేటీకరణకు నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. అమెరికా ప్రభుత్వం ఏటా విద్యకు 200 మిలియన్ డాలర్లను ఖర్చు చేస్తుందన్నారు. అంత తేలికేం కాదు: సిబొంగిల్ సాంబు సవాళ్లు ఎదురైనప్పుడు వేగంగా స్పందించే తత్వమే మన విజయావకాశాలను నిర్దేశిస్తుందని దక్షిణాఫ్రికాకు చెందిన ఎస్ఆర్ఎస్ ఏవియేషన్స్ అండ్ పెట్రోలియం కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ సిబొంగిల్ సాంబు స్పష్టం చేశారు. పారిశ్రామికవేత్తగా ముందుకు సాగడం తేలికైన పనికాదని, దక్షిణాఫ్రికాలో ఓ మహిళగా విమానరంగ వ్యాపారాన్ని నెలకొల్పి విజయవంతంగా నడపడం అంత సులువుగా జరగలేదని ఆమె చెప్పారు. ‘‘ఆఫ్రికాలో విమానాలు, హెలికాప్టర్లు నడిపేందుకు ఈ మహిళకు ఎవరు రుణాలిచ్చి ఉంటారని మీకు ఆలోచన రావచ్చు.. విమానాలు నడిపేందుకు స్థానిక ప్రభుత్వం నుంచి తొలి ఆర్డర్ సంపాదించినా.. విమాన రంగం నష్టాలతో కూడిన వ్యాపారమంటూ నాకు రుణాలిచ్చేందుకు ఎవరూ ముందుకు రాలేదు. నా దగ్గర తనఖా పెట్టేందుకూ ఏమీ లేదు. దీంతో బంధువుల నుంచి డబ్బులు తీసుకుని వ్యాపారం ప్రారంభించాను..’’ అని సాంబు వివరించారు. ఎన్నో త్యాగాలు చేయాలి: మార్కస్ వాలెన్‌బర్గ్ (స్వీడన్) ప్రపంచంలోనే అత్యంత వైవిధ్య ప్రాంతానికి తాను ప్రాతినిధ్యం వహిస్తున్నానని, మహిళలు వ్యాపారాలు చేయాలంటే ఎన్నో త్యాగాలు చేయాల్సి ఉంటుందని స్వీడన్‌కు చెందిన సెబ్ సంస్థ చైర్మన్ మార్కస్ వాలెన్‌బర్గ్ పేర్కొన్నారు. కొన్నేళ్లుగా మహిళలకు పారిశ్రామిక రంగంలో ద్వారాలు తెరుచుకుంటున్నాయని, ఇలాంటి సమయంలో వారికి మద్దతు చాలా ముఖ్యమని స్పష్టం చేశారు. ‘‘మహిళలకు తోడుండి నడిపించే గురువులు అవసరం. ఎన్నో అనుభూతులు, ఆలోచనలు వారి మెదళ్లను తొలిచేస్తుంటాయి. వారిని ప్రోత్సహిస్తే కచ్చితంగా రాణిస్తారు. వారికి మద్దతివ్వండి.. పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దండి. వచ్చే జీఈఎస్ సమావేశానికి కనీసం మరో మహిళా పారిశ్రామికవేత్తకు సాయం చేయాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకోండి..’’ అని సూచించారు. కష్టాలకు వెరవొద్దు: నిర్మలా సీతారామన్ భారత మహిళల్లో కష్టపడే లక్షణం ఉందని, 60 ఏళ్లుగా ఈ దేశం అలవరుచుకున్న అభివృద్ధి నమూనా ఎంతోమంది మహిళలను అభివృద్ధి పథంలోకి తీసుకొచ్చిందని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. మహిళలు వ్యాపార రంగంలోనే కాకుండా విద్యా రంగంలోనూ రాణిస్తూ సమాజానికి ప్రేరణగా నిలుస్తున్నారని చెప్పారు. ‘‘అసలు భారత రాజ్యాంగ నిర్మాతల్లో 15 మంది మహిళలు ఉన్నారన్న విషయం అందరూ గ్రహించాలి. అందులో అత్యంత నిమ్న వర్గాల నుంచి వచ్చిన దాక్షాయణి అనే మహిళ కూడా ఉన్నారు. మహిళలు ఏ రంగంలోనైనా రాణిస్తారనేందుకు ఆమే ఉదాహరణ. అంతరిక్ష రంగంలో దేశాన్ని ముందుకు నడిపిస్తోన్న టెస్సీ థామస్ కూడా మహిళే..’’ అని పేర్కొన్నారు. దేశంలో మహిళలకు విద్యావకాశాలు విస్తృతంగా లేవని, దీనిపై మోదీ ప్రభుత్వం దృష్టి సారించిందని చెప్పారు. మహిళలు వ్యాపారం చేసేందుకు రుణం కోసం బ్యాంకులకెళితే పూచీకత్తు అడుగుతారని, కుటుంబ భాగస్వామిగా పురుషుడి సహకారం లేకుండా చాలా మంది మహిళలు పూచీకత్తు ఇవ్వలేరని పేర్కొన్నారు. అందుకే దేశంలోని మహిళలందరికీ తానే పూచీకత్తుగా ఉంటానని మోదీ బ్యాంకులకు హామీ ఇచ్చారని... ప్రతి జిల్లాలోని ఒక్కో షెడ్యూల్ బ్యాంకు నుంచి కనీసం ఒక్క మహిళకు స్టార్టప్ కంపెనీ కోసం రుణాలు ఇప్పించాలనేది ప్రభుత్వ ఆలోచన అని వివరించారు. ప్రభుత్వాలు ప్రజలకు కావాల్సినన్ని ఉద్యోగాలను దీర్ఘకాలం సృష్టించలేవని... యువత వ్యాపారాలు ప్రారంభించి మరికొందరికి ఉపాధి చూపాలన్నారు. ఆ కోణంలోనే స్టార్టప్‌లకు ప్రోత్సాహమిస్తున్నావన్నారు. డిసెంబర్ 4న దేశంలోని పారిశ్రామిక దిగ్గజాలు, చాంబర్ ఆఫ్ కామర్స్లతో సమావేశం అవుతున్నామని, రక్షణ శాఖలోకి పెట్టుబడులకు ఆహ్వానిస్తామని చెప్పారు. జర్మనీ వెళ్లినప్పుడు ఆ దేశ చాన్సలర్ ఏంజెలా మార్కెల్ కూడా భారత్‌లో స్టార్టప్‌లకు ప్రోత్సాహం ఇస్తామని చెప్పారని, ఇజ్రాయెల్ కూడా ఆ బాటలోనే ఉందని తెలిపారు. మహిళల్లో స్వయం చొరవ రావాలని, తమకున్న ప్రతి అవకాశం తలుపు తట్టాలని, కష్టాలకు వెరవకుండా ముందుకెళ్లాలని సూచించారు. -
‘ఇవాంకా’ వ్యతిరేక ఆందోళన..
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ పారిశ్రామిక వేత్తల సదస్సుకు హాజరైన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సలహాదారు, ఆయన కుమారై ఇవాంకా పర్యటనను నిరసిస్తూ తెలంగాణ ప్రజా ఫ్రంట్ (టీపీఎఫ్) చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. మంగళవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద ఇవాంక రాకను వ్యతిరేకిస్తూ టీపీఎఫ్ ప్రదర్శన చేపట్టింది. సదస్సు పేరుతో రూ.వందల కోట్లు ప్రజా ధనం వృథా చేస్తున్నారని ఈ సందర్భంగా ఆందోళనకారులు విమర్శించారు. పెట్టుబడులు, పరిశ్రమలు వస్తాయని అబద్ధపు ప్రచారం చేస్తున్నారని, విదేశీ పెట్టుబడిదారుల చేతుల్లో మన పాలకులు కీలుబొమ్మల్లా మారారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆందోళన సందర్భంగా పోలీసులు, ఆందోళనకారుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. టీపీఎఫ్ నేతలు నలమాస కృష్ణ, రవిచంద్ర, మమత, రాణి, సంధ్య తదితరులను పోలీసులు ముందస్తుగానే అరెస్ట్ చేసి గాంధీనగర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ‘జీఈఎస్’ ఎంట్రీపాస్ల గందరగోళం సదస్సుకు హాజరుకాకుండానే వెనుదిరిగిన అనేక మంది విదేశీ డెలిగేట్లు నగరంలో జరుగుతున్న గ్లోబల్ ఎంటర్ప్రెన్యూర్ సదస్సులో పాల్గొనేందుకు విదేశాల నుంచి వచ్చిన వందలాది మంది డెలిగేట్లు నిర్వాహకుల అత్యుత్సాహం కారణంగా మంగళవారం తొలిరోజున ఎంట్రీ పాసులు లభించక గంటల తరబడి హైటెక్స్ ఆవరణలో పడిగాపులు పడ్డారు. ఈ సదస్సులో పాల్గొనేందుకు అమెరికా తదితర దేశాల నుంచి వందలాది డెలిగేట్లు తరలివచ్చారు. వీరందరూ హైటెక్స్‌లోని జీఈఎస్ సమ్మిట్ జరిగే హాలు లోనికి ప్రవేశించేందుకు అవసరమైన పాస్‌ల జారీ విషయంలో నిర్వాహకులు పలు రకాల ప్రశ్నలతో డెలిగేట్లను వేధించారని..ఇప్పటికే రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకున్నవారు తమ మొబైల్లో ఆ వివరాలు చూపినా లోనికి అనుమతించలేదని నగరానికి చెందిన ఓ డెలిగేట్ ‘సాక్షి’తో ఆవేదన పంచుకున్నారు. ఒకసారి ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకొని ఆహ్వానం అందినవారిని భద్రతా కారణాల నెపంతో హైటెక్స్ ఆవరణలో భద్రతా విధుల్లో పాల్గొన్న సిబ్బందితోపాటు నీతిఆయోగ్ అధికారులు ఎంట్రీపాస్‌లు లేవంటూ లోనికి అనుమతించకుండా అమర్యాదగా ప్రవర్తించారని అసహనం వ్యక్తం చేశారు. కాగా రెండోరోజు సదస్సు నాటికి ఈ సమస్యను పరిష్కరిస్తామని అధికారులు తెలిపారు. కాగా తొలిరోజు సదస్సుకు లోనికి అనుమతి లేకపోవడంతో విదేశీ అతిథుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బస్సుల్లో తాము బస చేసిన హోటల్‌కు వెళ్లిపోవడం కనిపించింది. -
పెట్టుబడులకు స్వర్గధామం
కొత్తగా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రం పెట్టుబడులకు స్వర్గధామమని.. ప్రపంచస్థాయి సదస్సు నిర్వహించి, ఈ విషయాన్ని చాటి చెప్పడం ఎంతో ఆనందంగా ఉందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. హైదరాబాద్‌లో మంగళవారం ప్రారంభమైన ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు (జీఈఎస్–2017) ప్రారంభోత్సవంలో ఆయన స్వాగతోపన్యాసం చేశారు. అందమైన హైదరాబాద్ ఆతిథ్యాన్ని స్వీకరించాలని.. ఇక్కడి బిర్యానీ రుచిని ఆస్వాదించాలని కోరారు. సీఎం ప్రసంగం ఆయన మాటల్లోనే.. – సాక్షి, హైదరాబాద్ హైదరాబాదీ మజా ఆస్వాదించండి ‘‘వివిధ దేశాల నుంచి తరలివచ్చిన వారందరినీ స్వాగతించటం నాకెంతో సంతోషంగా ఉంది. తెలంగాణ రాష్ట్రానికి, చారిత్రక హైదరాబాద్ నగరానికి మిమ్మల్ని సాదరంగా ఆహ్వానిస్తున్నాను. ప్రపంచ స్థాయిలో ప్రతిష్టాత్మకమైన ఈ కార్యక్రమాన్ని నిర్వహించటం, ఆతిథ్యమిచ్చే అవకాశం దొరకటం మాకెంతో గర్వంగా ఉంది. అన్ని రంగాల్లో శరవేగంగా వృద్ధి సాధించిన హైదరాబాద్ ఆకర్షణీయమైన ఆతిథ్య నగరంగా ప్రపంచ స్థాయిలో అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. మీరు (డెలిగేట్లు, పారిశ్రామికవేత్తలు) ఇక్కడ ఉండే కొద్ది సమయంలోనే.. తప్పకుండా హైదరాబాదీ మజాను ఆస్వాదిస్తారు. అద్భుత రీతిలో పారిశ్రామిక విధానం కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నవ రాష్ట్రం. టీఎస్–ఐపాస్ పేరుతో రాష్ట్రంలో అమల్లోకి తెచ్చిన పారిశ్రామిక ప్రోత్సాహక విధానంలో భాగంగా పరిశ్రమలకు అవసరమైన అనుమతులన్నీ 15 రోజుల వ్యవధిలోనే ఇచ్చేలా చట్టం తెచ్చాం. నిర్ణీత వ్యవధిలో అనుమతులు ఇవ్వకపోతే.. మంజూరైనట్లుగానే పరిగణించటం ఇందులో ఉన్న విశేషం. ఈ విధానం ఇప్పటికే అద్భుతమైన ఫలితాలను సాధించింది. గత మూడేళ్లలో 5,469 పరిశ్రమల స్థాపనకు అనుమతులిచ్చాం. 17.5 బిలియన్ డాలర్ల (సుమారు రూ.లక్షా పదివేల కోట్లు) పెట్టుబడులతో పాటు నాలుగు లక్షల మంది ఉపాధికి అవకాశాలు లభించాయి. పెట్టుబడిదారులకు ఎక్కడ కూడా ఇబ్బంది లేని పరిస్థితులున్నందుకే ఈ విజయం సాధించగలిగాం. ప్రపంచ బ్యాంకుతో పాటు భారత ప్రభుత్వం సంయుక్తంగా వెల్లడించే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకుల్లో తెలంగాణ దేశంలోనే నంబర్ వన్ స్థానంలో ఉంది. ప్రస్తుతం విదేశాలతో పాటు దేశంలోని పెట్టుబడిదారులందరికీ తెలంగాణ ఆకర్షణీయమైన గమ్యస్థానంగా ఎదిగింది. ప్రపంచ ప్రఖ్యాతి పొందిన ఐదు కంపెనీలు అమెరికా తర్వాత రెండో ప్రధాన వ్యాపార కేంద్రంగా హైదరాబాద్‌ను ఎంచుకున్నాయి. ఆపిల్, మైక్రోసాఫ్ట్, గూగుల్, ఫేస్బుక్, అమెజాన్ కంపెనీలు ఇక్కడ కార్యకలాపాలు ప్రారంభించాయి. వినూత్న ఆవిష్కరణలకు ప్రోత్సాహం యువ పారిశ్రామికవేత్తలందరినీ తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. దేశంలోనే పెద్దదైన టెక్నాలజీ ఇంక్యుబేటర్ టీ–హబ్‌ను స్థాపించింది. నూతన ఆవిష్కరణలు, వినూత్న ఆలోచనలకు ఊతమిచ్చేందుకు విద్యాసంస్థలు, కార్పొరేట్ సంస్థలను సమ్మిళితం చేయడంలో ప్రభుత్వం క్రియాశీల పాత్రను పోషిస్తోంది. ‘నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా (నీతి ఆయోగ్)’కూడా టీ–హబ్‌ను జాతీయ స్థాయిలో రోల్ మోడల్‌గా గుర్తించింది. పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలకు సానుకూలంగా, స్నేహపూర్వకంగా ఉన్న ఇక్కడి వాతావరణాన్ని ప్రపంచానికి చాటిచెప్పేందుకు ఈ అరుదైన వేదిక లభించటం ఎంతో ఆనందంగా ఉంది. ప్రపంచం నలుమూలలా ఈ దిశగా జరిగే కృషిని, ప్రయత్నాలను తెలుసుకునేందుకు ఎంతో ఆసక్తితో ఉన్నాను. సదస్సులో జరిగే చర్చలన్నీ కొత్త ఆలోచనలు, ప్రణాళికలకు దోహదపడతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. అందమైన హైదరాబాద్ ఆతిథ్యాన్ని స్వీకరించండి.. ప్రపంచ ప్రఖ్యాతి పొందిన హైదరాబాద్ బిర్యానీ రుచిని ఆస్వాదించండి..’’అని కేసీఆర్ పేర్కొన్నారు. ఔత్సాహికులకు మంచి అవకాశం సదస్సులో అంతర్జాతీయ ప్రతినిధులతో అనుభవాలను పంచుకోవడం మాలాంటి ఔత్సాహికులకు, ముఖ్యంగా మహిళలకు ఎంతో ఉపయోగకరం. ఇవాంకా ట్రంప్ లాంటి పారిశ్రామికవేత్తలను కలవడం కూడా స్ఫూర్తిదాయకం. ఉమెన్ ఫస్ట్ స్ఫూర్తితో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం బాగుంది. – అర్చన మోరపాక, కలాష్ ఎడ్యుటెక్ డైరెక్టర్ మహిళల నాయకత్వం మరింత పెరగాలి ప్రపంచవ్యాప్తంగా విజయవంతమైన మహిళా పారిశ్రామికవేత్తల శాతం చాలా తక్కువ. పనిచేసే మహిళల్లో 5 శాతం మంది మాత్రమే విజయవంతమవుతున్నారు. వెంచర్ క్యాపిటల్ రంగంలోనూ మహిళలు నాయకత్వం వహించే కంపెనీల సంఖ్యా తక్కువే. ప్రపంచవ్యాప్తంగా పరిశీలిస్తే 15–20 శాతం స్టార్టప్ కంపెనీలే మహిళల చేతిలో నడుస్తున్నాయి. ఈ సంఖ్య మరింత పెరగాలి. పారిశ్రామిక రంగంలో మహిళల నాయకత్వం ప్రపంచాన్ని ముందుకు నడిపిస్తోంది. ఇందుకు ఈ సదస్సు దోహదపడుతుంది. రెండు తెలుగు రాష్ట్రాలకు ఈ సదస్సు పెట్టుబడుల రూపంలో మేలు చేకూరుస్తుందని ఆశిస్తున్నా. ఇవాంకా ట్రంప్ ఓ విజయవంతమైన మహిళా పారిశ్రామికవేత్త. సదస్సులో ‘ఉమెన్ ఫస్ట్’ నినాదాన్ని తీసుకురావడం శుభపరిణామం. – నారా బ్రాహ్మణి, హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నాడు ఒక్కదాన్నే... నేడు చాలా మంది... అమెరికా అధ్యక్షుడిగా బిల్ క్లింటన్ గతంలో చేపట్టిన హైదరాబాద్ పర్యటనలో ఆయన వెంట వచ్చిన పారిశ్రామికవేత్తల బృందంలో నేను ఒక్కదాన్నే మహిళను. ప్రస్తుతం జరుగుతున్న జీఈఎస్‌లో ఎక్కువగా మహిళలే పాల్గొంటున్నారు. అమెరికాలో ఉమెన్ ఇన్వెస్ట్ ఇన్... ఉమెన్ డిజిటల్ పేరిట మీడియా సంస్థను నిర్వహిస్తున్నా. నా సంస్థ ఫేస్బుక్ పేజీలో ప్రముఖుల ఇంటర్వ్యూలను చదవొచ్చు. – అనుపమ భరద్వాజ్, పారిశ్రామికవేత్త, అమెరికా సాయం కోసం నిరీక్షణ వద్దు మనం ఏదైనా సాధించాలనుకుంటే ఇతరుల సాయం కోసం ఎదురు చూడకుండా మనలోని శక్తిసామర్థ్యాలతో ఆ పనిని ప్రారంభించాలి. నా సోదరితో కలసి నేను డిజిటల్ టెక్నాలజీ రంగంలో స్టార్టప్‌ను పెట్టినప్పుడు దేశంలో టీ–హబ్ లాంటి సౌకర్యం లేదు. అయినా స్టార్టప్‌ను నెలకొల్పి విజయవంతంగా నడుపుతున్నాం. భారత్, అమెరికాలలో మాకు 51 మందికిపైగా క్లయింట్లు ఉన్నారు. పెట్టుబడులు, వ్యాపార భాగస్వాముల కోసం ఎదురుచూస్తున్న వారికి ఈ సదస్సు మంచి అవకాశం. – స్నేహరాజ్, శ్రీయల్ టెక్నాలజీస్, హైదరాబాద్ ప్రతిభకు ప్రోత్సాహం అంతర్జాతీయ స్థాయి కార్యక్రమం హైదరాబాద్‌లో నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి సదస్సులు ప్రతిభకు ఎంతో ప్రోత్సాహాన్ని, బలాన్ని ఇస్తాయి. మహిళల భాగస్వామ్యాన్ని మరింత పెంచేందుకు ఉపయోగపడతాయి. – ఉపాసన, అపోలో ఫౌండేషన్ వైస్ చైర్పర్సన్, అపోలో లైఫ్ ఎండీ దేశాభివృద్ధికి మహిళల భాగస్వామ్యం అవసరం అమెరికాలో స్థిరపడిన నేను పుట్టి పెరిగింది మాత్రం హైదరాబాద్‌లోనే. 50 ఏళ్ల క్రితం భారత్‌లో మహిళలు చదువుకోవడమే ఘనంగా ఉండేది. కానీ నేడు పైలట్లు, కంపెనీల సీఈవోలుగా మహిళలు వివిధ రంగాల్లో రాణిస్తున్నారు. నేను ఫౌండర్‌గా ఉన్న మిషన్ స్మార్ట్ రైడ్ కంపెనీలో ఆరుగురు డైరెక్టర్లున్నారు. అందులో ఇద్దరు మహిళలు. నా భార్య కూడా కో ఫౌండర్. వాళ్ల గౌరవాన్ని, ఔన్నత్యాన్ని కాపాడేందుకు మహిళలను ప్రోత్సహించాలి. అది నేను చేస్తున్నా. దేశాభివృద్ధికి మహిళల భాగస్వామ్యం చాలా అవసరం. – నందా భాగి, మిషన్ స్మార్ట్ రైడ్ ఫౌండర్ మహిళా నాయకత్వానికి ఊతం జీఈఎస్‌పై మహిళా పారిశ్రామికవేత్తల ధీమా గ్లోబల్ ఎంట్రప్రెన్యూర్షిప్ సమ్మిట్ (జీఈఎస్) భవిష్యత్ పారిశ్రామిక రంగంలో మహిళల నాయకత్వానికి మరింత ఊతమిస్తుందని సదస్సుకు హాజరైన మహిళా పారిశ్రామికవేత్తలు ధీమా వ్యక్తం చేశారు. ‘ఉమెన్ ఫస్ట్’ నినాదంతో నిర్వహిస్తున్న సదస్సు ద్వారా ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలు ఎంతో స్ఫూర్తి పొందొచ్చని, మహిళల నాయకత్వం పెరిగితేనే అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ఈ అంశంపై ‘సాక్షి’తో పంచుకున్న అభిప్రాయాలు వారి మాటల్లోనే... – సాక్షి, హైదరాబాద్ -
ఆ ముగ్గురూ..
(హైదరాబాద్, సాక్షి బిజినెస్ బ్యూరో): జీఈఎస్ సదస్సులో ప్రసంగించినప్పుడు ఇవాంకా ట్రంప్ ముగ్గురు మహిళల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. వారు ఎదుర్కొన్న కష్టాలు, అనుభవాల నుంచి అవకాశాలను అందిపుచ్చుకుని ఎలా ఎదిగారన్నది వివరించారు. వారు మన ఆకాంక్షలకు ప్రతిరూపమని చెప్పారు. ‘‘సమస్యలకు వెరవకుండా ధైర్యంగా ముందుకు సాగే మీ లాంటి ఎంట్రప్రెన్యూర్ల ఆకాంక్షలు, దార్శనికతకు వీరంతా ప్రతీకలు. వారు అనేక జీవితాలను నిలబెడుతున్నారు. ఉపాధి కల్పిస్తున్నారు. ఆశాజ్యోతులుగా నిలుస్తున్నారు. మహిళలు, పురుషులనే భేదం లేకుండా అంతా కలసి.. ఏకమై సమున్నత లక్ష్యాన్ని నిర్దేశించుకుని.. ఆ దిశగా పాటుపడదాం. అలా చేస్తే మెరుగైన భవిష్యత్తు మనదే అనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. మన భవిష్యత్‌ను సమైక్యంగా తీర్చిదిద్దుకోగలిగే సత్తా మనలో ఉంది.’’అని ఇవాంకా స్పష్టం చేశారు. ఆమె చెప్పిన ముగ్గురిలో బెంగళూరుకు చెందిన మహిళ కూడా ఉండడం గమనార్హం. ఆ ముగ్గురి గురించీ ఇవాంకా మాటల్లోనే.. దారా డోట్జ్.. శాన్ఫ్రాన్సిస్కో (అమెరికా) దారా దశాబ్దకాలంపైగా ప్రపంచవ్యాప్తంగా బలహీనవర్గాల అభివృద్ధికి పాటుపడుతున్నారు. వారు ఎదుర్కొనే చిన్న చిన్న కష్టాలను ఆమె దగ్గర్నుంచి చూశారు. నీళ్లు తెచ్చుకునేందుకు అవసరమైన వస్తువులు లేకపోవడం దగ్గరి నుంచి.. దెబ్బతగిలితే కనీసం కట్టుకట్టేందుకు సరైన సాధనం లేకపోవడం దాకా అనేక సమస్యలను దగ్గరి నుంచి పరిశీలించారు. ఈ క్రమంలోనే ప్రాణాధారమైన అనేక ఉత్పత్తులను త్రీడీ ప్రింటింగ్ ద్వారా రూపొందించే ఫీల్డ్ రెడీ సంస్థను ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఎక్కడ ఏ విపత్తు ముంచుకొచ్చినా.. ఫీల్డ్ రెడీ సంస్థ వెంటనే రంగంలోకి దిగుతుంది. అత్యాధునిక టెక్నాలజీ తోడ్పాటుతో సహాయక చర్యలు అందిస్తుంది. వినూత్న ఆవిష్కరణల ద్వారా దారా డోట్జ్ అనేకమంది జీవితాలను నిలబెడుతున్నారు. అందరికీ ఆశాజ్యోతిగా నిలుస్తున్నారు. రాజ్యలక్ష్మి బొర్థాకుర్, బెంగళూరు చిన్న వయసులోనే కుమారుడు ఫిట్స్ బారిన పడటం రాజ్యలక్ష్మిని కలచివేసింది. కుమారుడి ఆరోగ్యాన్ని చక్కదిద్దేందుకు ఉపయోగపడే పరిష్కార మార్గాన్ని సొంతంగానే కనుగొనాలని ఆమె నిర్ణయించు కున్నారు. ఆ క్రమంలోనే ఆమె ‘స్మార్ట్ గ్లోవ్స్’ను రూపొందించారు. కృత్రిమ మేధస్సు (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) ద్వారా వివిధ రకాల వ్యాధులను, రుగ్మతలను ఈ పరికరం ముందస్తుగానే అంచనా వేస్తుంది. రోగులను హెచ్చరిస్తుంది కూడా. ప్రస్తుతం రాజ్యలక్ష్మి నెలకొల్పిన ‘టెరా బ్లూ’సంస్థ.. దేశంలోని మారుమూల ప్రాంతాల్లో కూడా స్పెషాలిటీ హెల్త్‌కేర్‌ను అందుబాటులోకి తెచ్చే దిశగా కృషి చేస్తోంది. రేహాన్ కెమలోవా, అజర్బైజాన్ రేహాన్ వయసు కేవలం పదిహేనేళ్లే. కానీ వర్షపునీటి నుంచి విద్యుత్ తయారు చేసే సంస్థను ఏర్పాటు చేసిన ఘటికురాలు ఆమె. ఒక్కొక్కటిగా మొదలుపెట్టి ప్రపంచంలోని ప్రతి ఇంట్లో విద్యుత్ కాంతులు నింపాలన్నది రేహాన్ లక్ష్యం. -
మహిళతోనే మార్పు
హైదరాబాద్, సాక్షి బిజినెస్ బ్యూరో :మహిళతోనే మార్పు సాధ్యమని అమెరికా అధ్యక్షుడి సలహాదారు ఇవాంకా ట్రంప్ ఉద్ఘాటించారు. మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదిగితే ఎక్కువ మందికి లాభం చేకూరుతుందని, సమాజంపై దాని ప్రభావం ఎన్నో రెట్లు ఉంటుందని చెప్పారు. మహిళలు తమ సంపాదనను తిరిగి తమ కుటుంబాలు, సంబంధీకులపైనే ఇన్వెస్ట్ చేస్తారని పేర్కొన్నారు. ‘మహిళలకు సాధికారత కల్పించని మానవ పురోగతి అసంపూర్ణమేనని నమ్ముతున్న ప్రధాని మోదీని మనస్పూర్తిగా అభినందిస్తున్నా’ అంటూ కొనియాడారు. మంగళవారమిక్కడ ‘అంతర్జాతీయ పారిశ్రామికవేత్తల సదస్సు– జీఈఎస్ 2017’ను ప్రారంభిస్తూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్‌ను అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా అభివర్ణించారు. ‘‘తమ సొంత పరిశ్రమ, పనితనంతో భారతీయులు 13 కోట్ల మందికిపైగా ప్రజల్ని పేదరికం నుంచి బయటకు తెచ్చారు. ఇది చరిత్రాత్మకం. మోదీ సారథ్యంలో ఇది మరింత ముందుకెళుతుందని ఆశిస్తున్నా. 2030 నాటికి 50 కోట్ల మంది మధ్య తరగతికి చేరాలన్న లక్ష్యానికి తగ్గట్టు భారతదేశమంతటా కొత్త యూనివర్సిటీలు ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడి వైద్యులు, శాస్త్రవేత్తలు కొత్త పుంతలు తొక్కుతున్నారు. ఇంజనీర్లు ఆధునిక అద్భుతాలు సృష్టిస్తున్నారు. భారతీయ అంతరిక్ష నౌకలు చంద్రుణ్ణి, అంగారకుడిని చేరుతున్నాయి. అందుకే భారతీయులు మాకు స్ఫూర్తిదాయకం’’ అని ఉద్వేగంగా అన్నారు. అందుకే.. మీరు పారిశ్రామికవేత్తలు ‘‘మీరొక ఆలోచనతో ఆరంభిస్తారు. తదుపరి రోబోను సృష్టించడానికో, మరో యాప్‌ను ఆవిష్కరించడానికో, మరో మందు కనిపెట్టడానికో రేయింబవళ్లు పనిచేస్తారు. ఆ సమయంలో కొందరు మిమ్మల్ని భయపెడతారు. మీరు అతిపెద్ద రిస్కు తీసుకుంటున్నారని, దానివల్ల వచ్చే లాభం మాత్రం చిన్నదని చెబుతారు. కానీ మీరు వైఫల్యానికి భయపడరు. మీ భవిష్యత్తును మీరు సొంతం చేసుకోవాలనుకుంటారు. అందుకే మీరు ఈ రోజు ఇక్కడున్నారు. అందుకే మీ అందరికీ నా శుభాభినందనలు’’ అని ఇవాంకా వివరించారు. భారత్‌లో పని విషయంలో మగ– ఆడ మధ్య తారతమ్యాలు లేకుండా సమానత్వం వస్తే వచ్చే మూడేళ్లలో భారత ఆర్థిక వ్యవస్థ 150 బిలియన్ డాలర్ల మేర పెరుగుతుందని అంచనా వేశారు. తొలిసారి.. మహిళల మెజారిటీ ‘మహిళకు ప్రాధాన్యం.. అందరికీ పురోగతి’ పేరిట ఇక్కడ జరుగుతున్న సదస్సులో 1,500 మంది పారిశ్రామిక వేత్తలు పాల్గొన్నారని, తొలిసారి మహిళలు మెజారిటీ సంఖ్యలో హాజరవటం ఇదే తొలిసారి అని ఇవాంక అన్నారు. ‘‘పురుషుల ఆధి పత్యం ఉన్న పరిశ్రమలో నేను గతంలో పారిశ్రామికవేత్తగా, ఎగ్జిక్యూటివ్‌గా దగ్గర్నుంచి అన్నీ చూశా. పనిలో తమను తాము నిరూపించు కోవాలంటే మహిళలు మగవారి కన్నా ఎక్కువ పనిచేయాలి. మా నాన్న అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక నేను మహిళలతో సహా అమెరికన్ల కోసం పనిచేసే అవకాశం వచ్చింది. అందుకే వ్యాపారాల్ని వదిలిపెట్టా. మహిళలు తమ కుటుంబాలకు ప్రాధాన్యమిస్తూనే కెరీర్‌ను కూడా చూసు కునేలా మేం పాలసీలు రూపొందిస్తున్నాం. ప్రపంచ వ్యాప్తంగా 2014–16 మధ్య మహిళా పారిశ్రామిక వేత్తల సంఖ్య 10% పెరిగింది. అమెరికాలో మహిళలు నడిపించే సంస్థల సంఖ్య 45% పెరిగింది. ఇంకా చెప్పాలంటే వాటిలో 8–10% మైనారిటీ మహిళలవే’’ అని వివరించారు. ప్రస్తుతం అమెరికాలో 1.1 కోట్ల మందికిపైగా మహిళలకు సొంత వ్యాపారాలున్నా యని, వారు 90 లక్షల మందికి పని కల్పించారని వివరించారు. ప్రపంచ వ్యాప్తంగా మహిళా పారిశ్రామిక వేత్తలు, మగవారి మధ్య సమానత్వం వస్తే జీడీపీ 2% పెరిగే అవకాశం ఉందని చెప్పారు. మహిళలు ఇప్పటికీ పరిశ్రమలు ఆరంభించడానికి, నిధులు పొందటానికి నానా తిప్పలూ పడుతున్నారని అంగీకరించారు. ‘‘అభివృద్ధి చెందుతున్న దేశాల్లో 70% మహిళలు చిన్న, మధ్య స్థాయి వ్యాపారాలే నడుపుతున్నారు. వారికి నిధుల్లేవు. హార్వర్డ్ బిజినెస్ రివ్యూ ప్రకారం అమెరికాలోనూ చిత్రమైన పద్ధతి నడుస్తోంది. ఇన్వెస్టర్లు మగవారికైతే వారెలా లాభపడతారో చెబుతున్నారు. మహిళలకైతే వారెలా నష్టపోతారో వివరిస్తున్నారు. అందుకే గతేడాది ఫండింగ్‌లో మహిళలకు 3% మాత్రమే దక్కింది’’ అని వివరించారు. మార్పు అంటే... ప్రధాని, హైదరాబాద్ టీ అమ్మే స్థాయి నుంచి ప్రధానిగా ఎదిగిన నరేంద్రమోదీ.. మార్పు సాధ్యమేనని నిరూపించారని ఇవాంక అన్నారు. హైదరాబాద్ అధునాతన టెక్నాలజీని సంతరించుకుందని, ఇప్పుడిక్కడి టెక్నాలజీ కేంద్రాలు సిటీకి మారుపేరైన బిర్యానీని కూడా మరిపిస్తున్నాయని చమత్కరించారు. ‘‘మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల ఇక్కడే చదివారు. ఇక్కడికి కొన్ని కిలోమీటర్ల దూరంలోని టి–హబ్ వచ్చే ఏడాది కొత్త కేంద్రాన్ని ఆరంభిస్తోంది. ఈ ముత్యాల నగరానికి గొప్ప నిధి ఇక్కడి ప్రజలే. తమ ఆశలు, ఆకాంక్షల్ని ఎన్నడూ వదిలిపెట్టకుండా మెరుగైన భవిష్యత్తు కోసం శ్రమించే స్వాప్నికులు, ఆవిష్కర్తలు, పారిశ్రామికవేత్తలు, నాయకులు ఉన్నారిక్కడ. ఇప్పుడు ఆర్థిక వ్యవస్థల్లో పారిశ్రామికవేత్తల విప్లవం కొనసాగుతోంది. ఇక్కడే కాదు.. అమెరికాలో, మొత్తం ప్రపంచమంతటా ఇదే ఉంది. అందుకే ఈ ఉత్సవాలు. పారిశ్రామికవేత్తలిప్పుడు నియమాల్ని తిరగరాస్తున్నారు. వారు ఆరంభించిన ప్రాజెక్టులు, నిర్మించిన వ్యాపారాలు సమాజాల్ని ముందుకు నడిపిస్తున్నాయి’’ అని అన్నారు. చట్టాలు ఇంకా మారాలి.. మహిళలు, పురుషుల విషయంలో చట్టాలు ఒకేలా లేవని ఇవాంక పేర్కొన్నారు. ఈ విష యంలో అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాలు చాలా వరకూ మార్పులు చేశాయని, అయినా ఇంకా జరగాల్సింది చాలా ఉందన్నారు. ‘‘కొన్ని దేశాల్లో మహిళలు భర్తల అనుమతి లేకుండా పనిచేయలేరు. మహిళలు బయట పనిచేసేందుకు వారి కుటుంబ కట్టుబాట్లు, సంప్రదాయాలు అడ్డొస్తున్నాయి’’ అని అన్నారు. మహిళా పారిశ్రామికవేత్తల ఆర్థిక సహకారం (వెఫి) పేరిట ప్రపంచ బ్యాంకుతో కలిసి ఈ ఏడాది బిలియన్ డాలర్ల నిధిని ఏర్పాటు చేసినట్లు ఇవాంక తెలిపారు. గడిచిన దశాబ్దంలో యూఎస్ ఎయిడ్ సంస్థ మహిళా పారిశ్రామికవేత్తల్ని ప్రోత్సహించిందన్నారు. -
జీఈఎస్ సదస్సు.. రెండో రోజు షెడ్యూల్
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు రెండో రోజు ఉదయం పది గంటలకు ప్రారంభమవుతుంది. ‘ఇన్నోవేషన్స్ ఆన్ వర్క్‌ఫోర్స్ డెవలప్మెంట్ అండ్ స్కిల్స్ ట్రైనింగ్’ అనే అంశంపై చర్చాగోష్ఠితో ప్లీనరీ సెషన్ మొదలవుతుంది. ఈ చర్చలో ఇవాంకా ట్రంప్ పాల్గొంటారు. రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ మంత్రి కె.తారకరామారావు మోడరేటర్‌గా వ్యవహరిస్తారు. చెర్రీ బ్లెయిర్, ఐసీఐసీఐ బ్యాంక్ సీఈవో చందా కొచ్చర్, డెల్ సీసీవో కరెన్ క్వింటోస్ ప్యానెల్ స్పీకర్లుగా వేదికపై ఉంటారు. చర్చ అనంతరం ఇవాంకా హోటల్‌కు వెళ్తారు. బ్రేక్ ఔట్ సెషన్లు, మాస్టర్ క్లాసులు, వర్క్ షాపులు సాయంత్రం 5.15 గంటల వరకు కొనసాగుతాయి. సినీ నటులు రామ్‌చరణ్, ఆదితి రావు, ఐబీఎం ఇండియా చైర్మన్ వనితా నారాయణన్, క్రికెట్ కామెంటేటర్ హర్షాభోగ్లే, టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా, భారత మహిళా క్రికెట్ కెప్టెన్ మిథాలీ రాజ్, రమణ గోగుల, ఫ్లిప్‌కార్ట్ కో ఫౌండర్ సచిన్ బన్సాల్, భారత క్రికెట్ మాజీ కెప్టెన్ సునీల్ గావస్కర్‌తోపాటు వివిధ దేశాల నుంచి పారిశ్రామిక దిగ్గజాలు పాల్గొంటారు. మిస్ వరల్డ్ మానుషీ ఛిల్లర్తో హర్షాభోగ్లే ఫైర్ సైడ్ చాట్‌తో రెండో రోజు సెషన్ ముగుస్తుంది. రెండో రోజు కార్యక్రమాలివీ 10.15–11.15 స్టార్టప్‌ల పిచ్ కాంపిటీషన్ 11.15–12.30 బ్రేక్ ఔట్ సెషన్స్, మాస్టర్ క్లాసులు, వర్క్‌షాపులు 12.30–1.30 భోజన విరామం 1.30–2.45 బ్రేక్ ఔట్ సెషన్స్, మాస్టర్ క్లాసులు 2.45–3.45 స్టార్టప్‌ల పిచ్ కాంపిటీషన్ 3.45–4.30 బ్రేక్ ఔట్ సెషన్స్, మాస్టర్ క్లాసులు 4.30–5.15 ఫైర్ సైడ్ చాట్ విత్ మిస్ వరల్డ్ మానుషీ ఛిల్లర్ -
మహిళ మాకు ఆది'శక్తి'
భారత్‌లో, ఆ మాటకొస్తే దక్షిణాసియాలోనే తొలిసారిగా జరుగుతున్న అంతర్జాతీయ పారిశ్రామికవేత్తల సదస్సు హైదరాబాద్‌లో మంగళవారం అట్టహాసంగా ఆరంభమయింది. హైదరాబాద్ హెచ్ఐసీసీలో గురువారం వరకు జరగనున్న ఈ మూడు రోజుల సదస్సును ప్రధాని నరేంద్రమోదీ, అమెరికా అధ్యక్షుడి సలహాదారు ఇవాంకా ట్రంప్ కలిసి ప్రారంభించారు. బెంగళూరుకు చెందిన కంపెనీ తయారు చేసిన ‘మిత్ర’ రోబో వేదికపైకి నడుచుకుంటూ రాగా, ఆ రోబో తాలూకు కంప్యూటర్‌పై భారత, అమెరికా చిహ్నాల్ని మోదీ, ఇవాంకా టచ్ చేశారు. దీంతో సదస్సు ప్రారంభమైనట్లు రోబో ప్రకటించింది. అనుకున్న సమయానికి కాస్త ఆలస్యంగా సాయంత్రం 4.45గంటల ప్రాంతంలో ఆరంభమైన సదస్సులో కాసేపు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు. హైదరాబాద్ ప్రాశస్త్యాన్ని తెలిపే వీడియోలతో పాటు భారత ఔన్నత్యాన్ని, మేకిన్ ఇండియా లక్ష్యాలను తెలిపే వీడియోలను ప్రదర్శించారు. చివరిగా, సదస్సులో చర్చించే ముఖ్యాంశాలైన హెల్త్‌కేర్–లైఫ్ సైన్సెస్, డిజిటల్ ఎకానమీ–ఫైనాన్షియల్ టెక్నాలజీ, ఎనర్జీ–ఇన్ఫ్రాస్ట్రక్చర్, మీడియా–ఎంటర్టైన్మెంట్... ఈ నాలుగింటి విశేషాలనూ తెలియజేస్తూ చేసిన నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది. అనంతరం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు స్వాగతోపన్యాసం చేయగా మోదీ, ఇవాంకా సదస్సును ఆరంభించి మాట్లాడారు. చివరిగా విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ వందన సమర్పణతో ఆరంభ కార్యక్రమం ముగిసింది. అనంతరం ‘బీ ద చేంజ్.. విమెన్స్ ఎంట్రప్రెన్యురల్ లీడర్షిప్’ అంశంపై జరిగిన చర్చాగోష్ఠిలో ఇవాంకా, జాన్ చాంబర్స్ (సిస్కో), మార్కస్ వాలెన్‌బర్గ్ (సెబ్), రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్, ఎస్ఆర్ఎస్ ఏవియేషన్ వ్యవస్థాపకురాలు షిబోంగ్లీ రిజోయ్స్ పాల్గొన్నారు. సాక్షి, బిజినెస్ బ్యూరో ప్రతినిధి: భారతీయ పురాణాల్లో మహిళను శక్తి అవతారంగా అభివర్ణించారని, సమాజాభివృద్ధికి మహిళా సాధికారత అత్యంత కీలకమని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టంచేశారు. దేశంలోని నాలుగు అత్యంత పురాతనమైన హైకోర్టులకుగాను మూడింటికి మహిళలే నేతృత్వం వహిస్తున్నారని, అంగారకుడిపైకి రోవర్‌ను పంపిన యాత్రలోనూ మహిళల పాత్రే ప్రధానమని, క్రీడల్లోనూ మహిళలే గర్వకారణంగా నిలుస్తున్నారని ప్రశంసించారు. మంగళ వారమిక్కడ అంతర్జాతీయ పారిశ్రామికవేత్తల సదస్సులో ఆయన ప్రసంగించారు. దక్షిణాసియాలో తొలిసారి జరుగుతున్న ఈ సదస్సు.. ఇన్వెస్టర్లు, పారిశ్రామికవేత్తలు, విద్యా వేత్తలు, మేధావులు, ఇతర ముఖ్యుల్ని ఒకచోటికి చేర్చి, పరిశ్రమలకు కావాల్సిన వ్యవస్థను ఏర్పాటు చేయటానికి ఉపయోగపడుతుందని అన్నారు. ఇది సిలికాన్ వ్యాలీని, హైదరాబాద్‌ను కలపటమే కాకుండా.. భారత్–అమెరికా బంధాల్ని మరింత దృఢతరం చేస్తుందని వ్యాఖ్యానించారు. భారత చరిత్రలో చెరగని చోటు భారతదేశ చరిత్రలో మహిళలకు చెరిగిపోని చోటుందని ప్రధాని అన్నారు. ‘‘క్రీస్తు పూర్వం 7వ శతాబ్దంలోనే వేద విద్యావంతురాలైన గార్గి ఓ మహా మునిని వేదవిద్యలో సవాల్ చేసింది. ఆ కాలంలో ఇది ఊహలకు కూడా అందని విషయం. ఇక రాణి అహల్యాబాయి, రాణి లక్ష్మీబాయి వారి సామ్రాజ్యాల రక్షణకు ప్రాణాలొడ్డి పోరాడారు. భారత స్వాతంత్య్ర సంగ్రామంలోనూ మహిళలది కాదనలేని పాత్ర. కల్పనా చావ్లా, సునీతా విలియమ్స్ వంటి భారతీయ సంతతి మహిళలు అమెరికా అంతరిక్ష కార్యక్రమంలోనూ భాగమయ్యారు. ఈ హైదరాబాద్ నుంచి సైనా నెహ్వాల్, పీవీ సింధు, సానియా మీర్జా వంటి క్రీడారత్నాలు భారత్‌కు వన్నెతెచ్చారు. మహిళలకు అట్టడుగు స్థాయి నుంచీ విధాన నిర్ణయాల్లో భాగమివ్వాలనే ఉద్దేశంతో గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థల్లో మహిళలకు మూడోవంతు స్థానాలు రిజర్వు చేశాం’’ అని వివరించారు. దేశంలో వ్యవసాయ, అనుబంధ పరిశ్రమల్లో 60 శాతానికి పైగా మహిళలేనంటూ.. గుజరాత్లో సహకార ఉద్యమానికి ఊపిరులూదిన లిజ్జత్ పాపడ్ కథ వినిపించారు. అనాదిగా పారిశ్రామికతత్వం భారతదేశం పురాతన కాలం నుంచీ ఆవిష్కరణలకు కేంద్రమని, పారిశ్రామికవేత్తల్ని ప్రోత్సహించిందని మోదీ చెప్పారు. ‘‘ప్రపంచానికి ఆయుర్వేదాన్ని పరిచయం చేసింది చరక సంహిత. యోగా మరో ఆవిష్కరణ. ఇప్పుడు ఎందరో పారిశ్రామికవేత్తలు యోగాను, ఆయుర్వేదాన్ని ప్రమోట్ చేస్తున్నారు. ఈ డిజిటల్ యుగానికి ఆధారం బైనరీ సిస్టమే. ఈ బైనరీకి సున్నాతోనే పునాది పడింది. దాన్ని కనుగొన్నది ఆర్యభట్ట. పన్ను వ్యవస్థలకు మూలం కౌటిల్యుడి అర్థ శాస్త్రం’’ అని వివరించారు. పారిశ్రామికవేత్తలకు ఉండాల్సిన లక్షణాలను వివరిస్తూ.. ‘‘తన ఆలోచనను సాకారం చేసుకునే నైపుణ్యం, విజ్ఞానంతో పాటు ప్రతికూలంలోనూ అవకాశాల్ని వెదుక్కోవాలి. అంతిమంగా వినియోగదారుడికి మరింత సులువైన పరిష్కారాన్ని అందించాలి’’ అంటూ స్వామి వివేకానందను ఉదహరించారు. భారత్‌లో ఇప్పుడు 80 కోట్ల మందికి పారిశ్రామికవేత్తలుగా మారే సత్తా ఉందని... వీరంతా కలిసి ప్రపంచాన్ని మరింత మెరుగ్గా తీర్చిదిద్దగలరని చెప్పారాయన. మొబైల్ యూజర్ల సంఖ్య పెరుగుతోందంటూ... ఇది ఉద్యోగాల కల్పనకు సహకరిస్తుందన్నారు. డిజిటల్‌కు మూలం... ఆధార్ ప్రపంచంలో అతిపెద్ద బయోమెట్రిక్ ఆధారిత డేటాబేస్‌గా నిలుస్తున్న ఆధార్‌ను ప్రధాని ప్రస్తావించారు. ‘‘దీంట్లో ఇపుడు 115 కోట్ల మంది చేరారు. రోజుకు దీని ఆధారంగా 4 కోట్ల లావాదేవీలు జరుగుతున్నాయి. ఆధార్ సాయంతో కేంద్ర పథకాల్ని నేరుగా లబ్ధిదారుకే అందిస్తున్నాం. జన్‌ధన్ ఖాతాలతో 68,500 కోట్ల రూపాయలు డిపాజిట్ అయ్యాయి. వీటిలో 53 శాతం ఖాతాలు మహిళలవే’’ అని మోదీ వివరించారు. భీమ్ యాప్ గురించి ప్రస్తావిస్తూ.. మెల్లగా తక్కువ నగదున్న వ్యవస్థలోకి వెళుతున్నామని, ఇపుడు భీమ్‌తో రోజుకు 28 లక్షల లావాదేవీలు సాగుతున్నాయని వివరించారు. గ్రామాలకు విద్యుత్ కనెక్షన్లిచ్చే సౌభాగ్య పథకాన్ని, హైస్పీడ్ ఇంటర్నెట్ లక్ష్యాలను, స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఆవిష్కరణల కోసమే స్టార్టప్ ఇండియా... పారిశ్రామికవేత్తల ఆవిష్కరణల్ని ప్రోత్సహించడానికే స్టార్టప్ ఇండియాను ఆరంభించామని ప్రధాని మోదీ చెప్పారు. దీనికోసం 1200 కాలం చెల్లిన చట్టాలను రద్దు చేశామని, 21 రంగాల్లో ఎఫ్‌డీఐ నిబంధనల్ని సడలించి ఆన్లైన్ అనుమతుల్ని ప్రవేశపెట్టామని వివరించారు. ప్రపంచబ్యాంకు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ర్యాంకింగ్ మెరుగుపడి 100కు చేరటాన్ని ప్రధాని గుర్తు చేశారు. దీంతో సంతృప్తి చెందడం లేదని, 50వ ర్యాంకుకు చేరుకోవటానికి శ్రమిస్తామన్నారు. ముద్రా రుణాల పథకాన్ని ప్రారంభించాక ఇప్పటిదాకా 4.28 లక్షల కోట్ల రూపాయల్ని 9 కోట్ల మందికి ఇచ్చామని, వారిలో 7 కోట్ల మంది మహిళలేనని ప్రధాని వివరించారు. పెట్టుబడుల కోసమే సంస్కరణలు పారదర్శక పాలసీలు, చట్టం దృష్టిలో అందరూ సమానమేనని చెప్పడం ద్వారా పారిశ్రామికవేత్తల్ని పెంచవచ్చనేది తమ ప్రభుత్వం గుర్తించిందని, అందుకే పన్నుల వ్యవస్థను ప్రక్షాళించేందుకు జీఎస్టీని తెచ్చామని, దివాలా చట్టాన్ని అమలు చేస్తున్నామని ప్రధాని వివరించారు. నల్లధనాన్ని అడ్డుకునేందుకు చేపట్టిన చర్యల్ని వివరించారు. ఇవన్నీ గుర్తించే మూడీస్ సంస్థ రేటింగ్‌ను పెంచిందని గుర్తుచేశారు. ‘‘చివరిగా భారతీయ యువ పారిశ్రామికవేత్తలకు నేను చెప్పేదొక్కటే. 2022 నాటికి కొత్త భారతాన్ని సృష్టించాలి. దానికి మీలో ప్రతి ఒక్కరూ ఏదో ఒకటి చేయగలరు. భారత మార్పునకు మీరే సారథులు. రండి!! భారత్‌లో తయారీ చేపట్టండి. ఇక్కడ పెట్టుబడి పెట్టండి. భారత వృద్ధిలో భాగస్వాములు కావాలంటూ మీలో ప్రతి ఒక్కరినీ ఆహ్వానిస్తున్నా. దీనికి మా మద్దతుంటుందని మనస్ఫూర్తిగా హామీ ఇస్తున్నా’’ అంటూ మోదీ తన ప్రసంగాన్ని ముగించారు. -
4 లక్షల డాలర్లు ఎవరివో?
సాక్షి, హైదరాబాద్: స్టార్టప్‌ల కోసం నిర్వహించిన పిచ్ కాంపిటీషన్లో ఎవరు విజేతగా నిలుస్తారు..? 4 లక్షల డాలర్ల(దాదాపు రూ.2.57 కోట్లు) ప్రైజ్ మనీని అందుకునే ఔత్సాహిక పారిశ్రామికవేత్త ఎవరో రేపు(30న) సాయంత్రానికి తేలిపోనుంది. జీఈఎస్ ముగింపు వేడుకల్లో ఈ విజేతను ప్రకటించనున్నారు. పలు దేశాల నుంచి 90 మంది ఔత్సాహిక వ్యాపార వేత్తలు ఈ పోటీలో పాల్గొన్నారు. తమ ఆలోచనలు, వ్యాపారాలను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు జీఈఎస్ ఈ పోటీని నిర్వహించింది. గ్లోబల్ ఇన్నోవేషన్ త్రూ సైన్స్ అండ్ టెక్నాలజీ(జీఐఎస్‌టీ) అధ్వర్యంలో అక్టోబర్ 20న పోటీ ప్రారంభమైంది.జీఈఎస్‌లో ఎంచుకున్న ఇంధనం–మౌలిక వసతు లు, హెల్త్ అండ్ లైఫ్ సైన్సెస్, డిజిటల్ ఎకానమీ, మీడియా–ఎంటర్టైన్మెంట్ రంగాల్లో కొత్త ఆలోచన లను ఆవిష్కరించిన స్టార్టప్‌ల నుంచి దరఖాస్తులను స్వీకరించింది. ఈ నెల 8 నుంచి 24 వరకు వచ్చిన దరఖాస్తుల్లో స్కోర్ ఆధారంగా ఒక్కో రంగంలో ఆరుగురు చొప్పున 24 మందిని సెమీ ఫైనలిస్టులుగా ప్రకటించింది. వీరికి జీఈఎస్‌లో పాలుపంచుకునే అవకాశం కల్పించింది. సెమీ ఫైనల్లో స్టార్టప్‌లపై 3 నిమిషాల పిచ్, 5 నిమిషాల పాటు ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుంది. తమ వినూత్న ఆలోచనతో పాటు ప్రతిభతో న్యాయ నిర్ణేతలను ఆకట్టుకున్న వారు ఫైనల్‌కు చేరుకుంటారు.ఒక్కో రంగంలో ఒకరిని.. మొత్తం నలుగురిని ఫైనలిస్టులుగా పరిగణిస్తారు. వారికి తుది ఫైనల్ పోటీ ఉంటుంది. ఒక్కొక్కరు ఒకటిన్నర నిమిషాల్లో (90 సెకన్లు) ప్రదర్శన ఇవ్వటంతో పాటు 2 నిమిషాల్లోనే ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఇందులో నెగ్గిన వారిని ‘జిస్ట్ కాటలిస్ట్ పిచ్ కాంపిటీషన్ గ్రాండ్ చాంపియన్’గా ప్రకటిస్తారు. విజేతకు దాదాపు 4 లక్షల డాలర్ల పెట్టుబడి సాయం అందుతుంది. ఫైనల్‌కు చేరుకున్న నలుగురికి దాదాపు రెండు లక్షల డాలర్ల విలువైన బహుమతులు అందిస్తారు. జిస్ట్ పోటీలో సెమీ ఫైనల్‌కు చేరిన 24 మందిలో 8 మంది భారతీయులున్నారు. వీరిలో ఐదుగురు మహిళలే. హైదరాబాద్‌కు చెందిన మార్క్సియస్ సాఫ్ట్వేర్ కంపెనీ నిర్వాహకురాలు వైశాలి నియోటియాతో పాటు తదితరులు ఉన్నారు. -
‘టెక్’ సాయం!
కలుపు తీసే రోబోలు.. వ్యవసాయంలో రైతులకు ఖర్చు పెంచే కార్యక్రమాల్లో కలుపుతీత ఒకటి. కూలీల కు డిమాండ్ పెరిగిపో తున్న తరుణంలో పలు సంస్థలు కలుపుతీతకు యంత్రాలను అభివృద్ధి చేసే పనిలో ఉన్నాయి. రూంబా పేరు తో కొన్నేళ్ల క్రితం కృత్రిమ మేధస్సు(ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్) ఆధారంగా పనిచేసే వ్యాక్యూమ్ క్లీనర్‌ను తయారు చేసిన కంపెనీ... తాజాగా టెట్రిల్ పేరుతో కలుపుతీత యంత్రాన్ని అభివృద్ధి చేసింది. ఆప్టికల్ సెన్సర్ల సాయంతో కలుపు మొక్కలను గుర్తించి నాశనం చేసే ఈ యంత్రం ప్రస్తుతానికి పెరటి పంటలకు పనికొస్తుంది. మరోవైపు బాష్ లాంటి అంతర్జాతీయ సంస్థలు పొలాల్లో పనిచేయగల కలుపుతీత రోబోలను సిద్ధం చేస్తున్నాయి. ఈ యంత్రాలు కలుపు మొక్కలను గుర్తించి.. అక్కడికక్కడే భూమిలో కలిపేస్తాయి. మరికొన్ని కంపెనీలు కేవలం కలుపు మొక్కలపై మాత్రమే రసాయన మందులను చల్లే యంత్రాలను తయారు చేసే ప్రయత్నాల్లో ఉన్నాయి. దుక్కిదున్నే ట్రాక్టర్.. డ్రైవర్ అవసరం లేని కార్ల గురించి వినే ఉంటాం. అదే టెక్నాలజీ ద్వారా వ్యవసాయానికి సాయం చేసే ప్రయత్నాల్లో ఉన్నాయి పలు కంపెనీలు. నిజానికి డ్రైవర్ల అవసరం లేని ట్రాక్టర్లు ఇప్పటికే అందుబాటులో ఉన్నా.. వాటిని రిమోట్ కంట్రోల్లో నడపాల్సి ఉండేది. ఇప్పుడా పని కూడా తప్పిపోయింది. కృత్రిమ మేధ సాఫ్ట్వేర్ సెన్సర్ల సాయంతో పొలం తీరుతెన్నులు, వాతావరణం వంటి విషయాలను పరిశీలిస్తే.. ట్రాక్టర్ తన పని తాను చేసుకుపోతుంది. దుక్కి దున్నడంతోపాటు విత్తనాలు వేయడం, ఎరువులు చల్లడం వంటి అన్ని పనులు చేసేస్తుంది. ఒకే పనిని మళ్లీ మళ్లీ చేయడం, వనరుల వృథాను అరికట్టడం ద్వారా డ్రైవర్‌లెస్ ట్రాక్టర్లు రైతులకు ఎంతో లాభం చేకూరుస్తాయని ట్రాక్టర్ల తయారీ రంగంలో అగ్రగామి అయిన జాన్ డీర్ సంస్థ చెబుతోంది. పంటల నిర్వహణకు డ్రోన్లు మానవరహిత విమానాలు లేదా క్లుప్తంగా డ్రోన్లు విదేశాల్లో వ్యవసాయంలోనూ కీలక పోషిస్తున్నాయి. పంట ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు గమనించేందుకు, చీడపీడలు వస్తే వెంటనే గుర్తించి.. తగిన నివారణ చర్యలు తీసుకునేందుకు ఉపయోగపడుతున్నాయి. పొలంలోని ప్రతి ప్రాంతాన్ని నిశితంగా పరిశీలించి చీడపీడలు, పోషక లోపాలను గుర్తించేందుకు వీలుగా సెన్సర్లు, ఇతర టెక్నాలజీలు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి. న్యూజిలాండ్‌లో ఎరువులు చల్లే డ్రోన్లకు ఇటీవలే అక్కడి ప్రభుత్వం అనుమతులు కూడా ఇచ్చేసింది. చైనా అభివృద్ధి చేసిన ‘ద ఆగ్రాస్ ఎంజీ–1’డ్రోన్ కేవలం పది నిమిషాల్లో ఎకరా పొలంపై మందులు చల్లేయగలదు. భూసార పరీక్షలకు కూడా.. అందుబాటులో ఉండే వనరులను వీలైనంత సమర్థంగా వాడుకోవడమన్నది ఏ రైతుకైనా మేలు చేసేదే. కాకపోతే అది ఎలా సాధ్యమన్నదే ప్రశ్న. ఈ లోటును పూరించేందుకు ప్రత్యేకమైన సెన్సర్లు అందుబాటులోకి వస్తున్నాయి. పొలంలోని నిర్దిష్ట ప్రాంతాల్లో వాటిని ఏర్పాటు చేసుకుంటే చాలు.. నేలలో తేమ ఎంత ఉంది? పోషకాల పరిస్థితి ఏమిటి? ఎక్కడ ఎరువులు ఎక్కువ వేయాలి? ఎక్కడ తక్కువేసినా సరిపోతుంది? వంటి విషయాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. ఈ సెన్సర్లు ఇచ్చే సమాచారాన్ని హైటెక్ డ్రోన్లు, ట్రాక్టర్లకు అనుసంధానించుకుంటే రైతు పని మరింత సులువైపోతుంది. కాయలెప్పుడు కోయాలో రోబోలు చూసుకుంటాయి పత్తి సాగు చేసే ఏ రైతునైనా అడగండి.. పత్తి ఏరడానికయ్యే ఖర్చు, శ్రమ చాలా ఎక్కువని అంటారు. పత్తిని సకాలంలో తీయడం, తిరిగి పెరగగానే మళ్లీ తీయడం దీనికి కారణం. మరిన్ని పంటల్లోనూ ఇదే తరహా పరిస్థితి ఉంటుంది. ఉత్పత్తిని తీయడంలో ఆలస్యమైతే.. దిగుబడి దెబ్బతింటుంది. ఈ నేపథ్యంలో కాయల్ని నిత్యం పరిశీలిస్తూ.. సరైన సమయంలో వాటిని కోసేందుకు కూడా రోబోలు సిద్ధమవుతున్నాయి. విదేశాల్లో ఇప్పటికే స్టాబెర్రీలు, కివీలు వంటి చాలా పంటలకు ఇలాంటి రోబోలు అందుబాటులో ఉన్నాయి. వ్యవసాయం ఎప్పుడూ ఆశల జూదమే.. కురవని చినుకు.. పెరిగిపోతున్న కూలీల ఖర్చులు.. ఎరువులు, విత్తనాలు సరిగా వేయలేని నైపుణ్య లేమి.. తద్వారా తగ్గే దిగుబడి.. కానీ ఆధునిక టెక్నాలజీ పుణ్యమా అని వ్యవసాయం కొత్త పుంతలు తొక్కనుంది. రానున్న కాలంలో వ్యవసాయానికి ‘టెక్’సాయం అందనుంది.. ఆ సంగతులేమిటో చూద్దామా.. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
13 ఏళ్లకే.. ప్రపంచస్థాయి సదస్సులో..
సాక్షి, హైదరాబాద్: వయసు 13 ఏళ్లు.. చదువుతున్నది ఏడో తరగతి.. కానీ ప్రపంచ స్థాయి పారిశ్రామికవేత్తల మధ్య ప్రత్యేక ఆకర్షణ గా నిలిచాడు. చెక్కుచెదరని ఆత్మవిశ్వాసంతో కనిపించే ఈ బుడతడి పేరు హామిష్ ఫిన్లేసన్. ఆస్ట్రేలియాకు చెందిన మూన్‌షాట్ ఇండస్ట్రీ గ్లోబల్ లిమిటెడ్ సంస్థ తరఫున ప్రపంచ ఔత్సా హిక పారిశ్రామికవేత్తల సదస్సు (జీఈఎస్)లో పాల్గొంటున్నాడు. పదో ఏటనే స్మార్ట్‌ఫోన్ యాప్ తయారుచేసి.. ప్రపంచవ్యాప్తంగా పేరుపొందాడు. ఇప్పటివరకు ఆరు యాప్‌లు తయారు చేశాడు. ప్రపంచస్థాయి సమస్యలను పరిష్కరించడమే తన ధ్యేయమని.. సొంతంగా ఓ వీడియోగేమ్ తయారు చేయాలనేది లక్ష్యమని చెబుతున్నాడు. జీఈఎస్‌కు హాజరైనవారిలో అతిచిన్న వయస్కుడిగా గుర్తింపు పొందిన హామిష్ ఫిన్లేసన్ ‘సాక్షి’కి ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆ విశేషాలివి.. సాక్షి: హాయ్.. యంగ్‌బాయ్! హామిష్: హాయ్.. సాక్షి: ఇంత పెద్ద సదస్సుకు హాజరైన చిన్న వయస్కుడిగా ఎలా ఫీలవుతున్నారు? హామిష్: నాకు చాలా సంతోషంగా ఉంది. జీఈఎస్‌కు హాజరుకావడం ఇది రెండోసారి. సాక్షి: ఇంత చిన్నవయసులో ఆహ్వానం ఎలా వచ్చింది? అసలు మీరేం చేస్తున్నారు? హామిష్: నేను సముద్ర వాతావరణ పరిరక్షణ కోసం యాప్‌లు తయారుచేశాను. సముద్ర తాబేళ్ల పరిరక్షణ కోసం టెక్నాలజీ సాయంతో పోరాటం చేస్తున్నా. ఇప్పటికి అయిదు యాప్‌లు తయారు చేశాను. ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన పెంచేందుకు ఉపయోగపడే ఆరో యాప్ ఇంకా తయారీ దశలో ఉంది. సాక్షి: మీ యాప్‌ల ద్వారా ఏం సాధించదలచుకున్నారు? హామిష్: నేను తయారు చేసిన వాటిలో ఎదుగుదల లోపాలకు సంబంధించిన ఆటిజంపై అవగాహన కల్పించే యాప్ కూడా ఉంది. నేనూ, మా నాన్న కూడా ఆటిజం సమస్య ఎదుర్కొంటున్న వారమే కావడంతో ప్రత్యేకంగా దీన్ని రూపొందించాను. ఇక, సముద్ర జలాలు, అక్కడి వాతావరణం ప్రపంచ సామరస్యానికి ఎంత అవసరమో మీకు తెలుసు. ప్రపంచస్థాయి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలనుకుంటున్నా. నా పదో యేటే సముద్ర తాబేళ్ల కోసం ట్రిపుల్–టీ అనే యాప్ రూపొందించా. నా ఐదు యాప్‌లను 54 దేశాల్లో వినియోగిస్తున్నారు. సాక్షి: మీకు స్ఫూర్తి ఎవరు? హామిష్: చిన్నప్పుడు ఓ కాంపిటీషన్లో పాల్గొన్నప్పుడు.. ఏదైనా పెద్దగా తయారుచేయాలని అనిపించింది. ఐఓఎక్స్, మూన్‌షాట్ టెక్నాలజీలంటే నాకు చాలా ఇష్టం. మా నాన్న గ్రేమ్ ఫిన్లేసన్ ఇచ్చే ప్రోత్సాహం కూడా నన్ను ముందుకు నడిపిస్తోంది. నాకు సీ ఓషన్ ఎన్విరాన్‌మెంట్‌తో పాటు అంతరిక్ష శాస్త్రమంటే కూడా ఇష్టం. పెద్దయిన తర్వాత దానిపై దృష్టి పెడతా. సాక్షి: చదువును, వృత్తిని ఎలా సమన్వయపరచుకుంటున్నారు? హామిష్: నేను స్కూల్ నుంచి ఇంటికి వెళ్లగానే ముందు హోమ్‌వర్క్ చేసేస్తాను. తర్వాతే నా ఇతర పనులపై దృష్టి పెడతా.. సాక్షి: ఇప్పటికి ఎంత సంపాదించారు? హామిష్: ఇప్పటివరకు 10 వేల డాలర్ల కన్నా ఎక్కువే సంపాదించి ఉంటాను. అయినా డబ్బు ముఖ్యం కాదు. నా యాప్‌లకు వచ్చే లైక్‌లే నాకు తృప్తినిస్తాయి. సాక్షి: మీ లక్ష్యం ఏమిటి? హామిష్: నాకు సొంతంగా వీడియోగేమ్ తయారు చేయాలని ఉంది. అది నా లక్ష్యం. సాక్షి: భారత్‌కు రావడం ఎలా ఉంది? హామిష్: ఇక్కడకు రావడం నాకు చాలా ఉత్తేజకరంగా అనిపిస్తోంది. -
‘ఆహా’ర్యం.. మాటే మంత్రం..
సాక్షి, హైదరాబాద్: అందం, ఆహార్యంతోనే కాదు.. మాట్లాడే తీరులోనూ ఇవాంకా ట్రంప్ అదరహో అనిపించింది. ఆత్మ విశ్వాసాన్ని ప్రతి బింబిస్తున్న నడకతో, ముఖ్యంగా మోముపై చెరగని చిరునవ్వుతో ఆకట్టుకుంది. దీంతో సదస్సుకు వచ్చినవారంతా ఆమెకు అభిమాను లైపోయారు. ఈ నేపథ్యంలో ఇవాంకా మాట తీరు, సంతకం, వస్త్రధారణలను హైదరాబాద్‌కు చెందిన పలువురు నిపుణులు విశ్లేషించారు. ఆ మాటే మంత్రం... ‘‘చెప్పే విషయాన్ని సరిగా ప్రారంభిస్తే సగం పని పూర్తయినట్టే అనేది పబ్లిక్ స్పీకింగ్‌లో ఒక ప్రాథమిక సూత్రం. ఇవాంకా తన ప్రసంగం ప్రారంభంలోనే అందరి మనసులనూ హత్తుకున్నారు. అంతే అద్భుతంగా చివరి వరకూ ప్రసంగాన్ని కొనసాగించారు. ‘హలో ఎవ్రీవన్.. థాంక్యూ బీయింగ్ హియర్ అండ్ ఫర్ ఇన్క్రెడిబుల్లీ వార్మ్ వెల్కమ్ (అందరికీ నమస్కారం.. సుస్వాగతం. ఇక్కడ కలుసుకున్నందుకు ఆనందంగా ఉంది)’ అంటూ ఇవాంకా పలకరించిన తీరు ఆకట్టుకుంది. భారత్ శక్తి సామర్థ్యాలను ప్రస్తుతిస్తూ.. ఇరు దేశాల మధ్య అనుబంధాలను వివరిస్తూ ప్రతీ పదం స్పష్టంగా పలికారు. చెరగని చిరునవ్వుతో సరైన పదాలను వినియోగిస్తూ అందరికీ కనెక్టయ్యారు. సత్య నాదెళ్ల వంటి తెలుగువారిని, టీ–హబ్, సిటీ ఆఫ్ పెరల్స్‌ను ప్రస్తావిం చారు. ఆమె ఆహార్యం, నేరుగా అందరి వైపూ చూస్తూ మాట్లాడిన తీరు అందరినీ ఆకట్టుకున్నాయి. ఆమె ఒక మంచి వక్త అనిపించింది. అవసరాలకు అనుగుణంగా పదాల మధ్య ఇచ్చిన విరామాలు, మధ్య మధ్యలో ‘థాంక్యూ’లు ఆహూతులను కట్టిపడేస్తాయి. ‘దిస్ ఈజ్ ది ఫ్యూచర్.. వి కెన్, విల్ అండ్ మస్ట్ బిల్డ్ టుగెదర్ అండ్ దిస్ ప్రామిస్’ అనే వాక్యంతో ఇవాంకా ప్రసంగాన్ని ముగించారు.’’ – డి.రామచంద్రం, వ్యక్తిత్వ వికాస నిపుణుడు అది విజయానికి ‘సంతకం’.. ‘‘ఇవాంకాది అసాధారణ వ్యక్తిత్వం. దీనికి ప్రతీక ఆమె సంతకమే. ఆ సంతకం యాంగిల్ అండ్ రౌండెడ్ (ఓ వైపు వంగినట్లుగా ఉండి గుండ్రంగా)గా ఉంది. ఆమెలో బిజినెస్ సెన్స్ అద్భుతమని దీని అర్థం. అలాగే సంతకంలో ‘కంటిన్యూయస్ ఫ్లో, కనెక్టింగ్ లెటర్స్ (ఒకదానిని ఒకటి తాకుతూ అక్షరం వెంటే అక్షరం ఉండటం)’ విశ్లేషణాత్మక ఆలోచనా ధోరణిని పట్టిస్తుంది. సంతకంలో లోయర్ జోన్ అక్షరాలు మానసికంగా, శారీరకంగా సమర్థవం తమైన స్థాయిని (హైఎనర్జీ లెవల్స్‌ను) సూచిస్తున్నాయి. చివరి అక్షరం రాసిన తీరు ఆమె స్వతంత్ర భావాలకు నిదర్శనం. సంతకంలో ఫ్రీఫ్లో ఆఫ్ స్ట్రోక్స్ వ్యాపారంలో దూరదృష్టికి, సంతకం కింద ఉన్న పెద్ద సర్కిల్ భావోద్వేగాలకు, సెంటిమెంట్స్‌కు, సంతకంలో పొడవాటి స్ట్రోక్స్ (అక్షరాలు) సృజనాత్మకతకు, స్ఫూర్తిదాయక లక్షణాలకు, కొత్త విషయాల పట్ల చూపే ఉత్సాహానికి నిదర్శనాలు. ఆమె ప్రేమాస్పదురాలు కూడా. అప్పుడప్పుడు తొం దరగా స్పందించడం, వేగంగా మూడ్ మారి పోయే లక్షణం ఉండే అవకాశముంది. – రణధీర్ కుమార్, సిగ్నేచర్ అనలిస్ట్ వైవిధ్యాన్ని గుర్తు చేసేలా.. ‘‘విమానాశ్రయంలో దిగిన ప్పుడు ఇవాంకా ధరించిన దుస్తులు సెమీ ఫార్మల్. రౌండ్‌నెక్ టీషర్ట్‌పై నలుపురంగు ట్రౌజర్‌ను కాంబినేషన్‌గా ధరించారు. దానిపై బ్లాక్ అండ్ వైట్ బ్లేజర్ వేసుకున్నారు. దానిపై ఏకరూపత కలిగిన డిజైన్లు (సిమ్మెట్రికల్ ప్యాట్రన్స్) ఉన్నాయి. తన కన్నా ఉన్నత స్థాయి వారిని, సీనియర్లను కలవడానికి వెళ్లినప్పుడుగానీ.. లంచ్ లేదా తేనీటి విందు వంటి సందర్భాల్లో వీటిని ధరిస్తారు. ఇక ఇవాంకా హెచ్ఐసీసీలో సదస్సు జరుగుతున్న ప్రాంతానికి వచ్చినప్పుడు.. విభిన్న ప్రాంతాల నుంచి వచ్చేవారికి కలుస్తున్న విషయాన్ని గుర్తు చేసేలా వస్త్రాలను ధరించారు. పూల డిజైన్లను ముద్రించిన కూల్ కలర్ గౌన్‌ను వేసుకున్నారు. (సాధారణంగా గ్రీన్, లెమన్ ఎల్లో, లైట్ పింక్ తదితర వాటర్ కలర్స్‌ను ఫ్యాషన్ పరిభాషలో కూల్ కలర్స్ అంటారు). అంతేగాకుండా ఈ డ్రెస్‌లో హైదరాబాదీలకు బాగా నచ్చే ఆకుపచ్చ, పసుపు రంగులకు ఆమె ప్రాధాన్యత ఇచ్చినట్టుగా అనిపిస్తోంది..’’ – సంతోష్‌కుమార్, ఫ్యాషన్ డిజైనర్ రావమ్మా.. ఇవాంకా! సాక్షి, హైదరాబాద్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ మంగళవారం తెల్లవారుజామున 2.51 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఎతిహాత్ ఎయిర్‌లైన్స్‌లో వచ్చిన ఆమె వెంట 13 మంది అమెరికా సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు, ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ) అధికారులు, సాధారణ ప్రయాణికులు ఉన్నారు. ఈ విమానం శంషాబాద్ చేరుకోవడానికి మూడు గంటల ముందే 96 మంది అమెరికా ప్రతినిధులతో కూడిన మరో విమానం వచ్చింది. ఇవాంకకు ఎయిర్‌పోర్టులో అదనపు డీజీ (శాంతిభద్రతలు) అంజనీకుమార్, జీఈఎస్ ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ ఇన్చార్జ్గా విధులు నిర్వర్తిస్తున్న సీఐడీ ఐజీ షికాగోయల్, శంషాబాద్ డీసీపీ పద్మజారెడ్డి తదితరులు స్వాగతం పలికారు. అనంతరం అమెరికా నుంచి తెచ్చిన ప్రత్యేక వాహనంలో 15 వాహనాలతో కూడిన కాన్వాయ్‌లో వీవీఐపీ రూట్ ద్వారా 3.14 గంటలకు ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చిన ఆమె... నేరుగా ట్రైడెంట్ హోటల్‌కు వెళ్లారు. దాదాపు 34 కి.మీ. ఉన్న ఈ దూరాన్ని ఇవాంక కాన్వాయ్ 23 నిమిషాల్లో చేరుకుంది. మధ్యాహ్నం వరకు ట్రైడెంట్‌లో ఉన్న ఇవాంక 2.50 గంటలకు ట్రైడెంట్ నుంచి బయల్దేరి 2.3 కిమీ దూరంలో ఉన్న హెచ్ఐసీసీ చేరుకున్నారు. -
గాల్లోంచి స్వచ్ఛ జలం
యంత్రంతో నీళ్లు పుట్టిస్తారా..? అయ్యే పనేనని.. అనుకుంటున్నారా? ఆలోచన ఉండాలిగానీ.. సాధ్యం కానిదేమీ లేదంటున్నారు ఇజ్రాయెల్‌కు చెందిన వాటర్ జెన్ వ్యవస్థాపకుడు మాక్సిమ్ పాసిక్! తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు వాటర్ జెన్ కంపెనీ ఓ వినూత్నమైన యంత్రాన్ని సృష్టించింది. ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు (జీఈఎస్)లో భాగంగా బుధవారం జరిగే ఓ కార్యక్రమంలో పాసిక్ పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో వాటర్ జెన్ అవసరం, ప్రత్యేకతల గురించి ‘సాక్షి’ కథనం.. గాల్లోని తేమను ఒడిసిపట్టి.. తాగునీటి సమస్య పరిష్కారానికి చాలా కంపెనీలు సముద్రపు నీటిని మంచినీటిగా మార్చేందుకు, లేదంటే కలుషితమైన నీటిని శుభ్రం చేసేందుకు కొత్త కొత్త టెక్నాలజీలు అభివృద్ధి చేస్తున్నాయి. వాటర్‌జెన్ మాత్రం అన్నింటికంటే భిన్నంగా.. వినూత్నంగా గాల్లోంచే నీటిని పుట్టించే యంత్రాన్ని అభివృద్ధి చేసింది. గాల్లో రకరకాల వాయువులతోపాటు నీటి ఆవిరి కూడా ఉంటుందన్నది తెలిసిందే. వాటర్ జెన్ యంత్రాలు ఈ తేమను ఒడిసిపట్టి, శుభ్రం చేసి అందిస్తాయి. కొద్దిపాటి కరెంటుతో గాలిని పీల్చుకుని.. అందులోని మలినాలు, ఉష్ణాన్ని తీసేయడం ద్వారా ఈ యంత్రం నీళ్లను సృష్టిస్తుంది. ‘కలుషితమైన నీటిని శుభ్రం చేయడం కంటే.. గాలిని శుభ్రం చేయడం చౌక. అందుకే మేం ఈ టెక్నాలజీని ఎన్నుకున్నాం’ అని మాక్సిమ్ పాసిక్ చెబుతున్నారు. ఉత్పత్తి ఖర్చు చాలా తక్కువ.. వాటర్ జెన్ యంత్రాలు మన అవసరాలకు తగ్గట్టుగా మూడు రకాల సైజుల్లో లభిస్తాయి. కుటుంబ అవసరాల కోసం రోజుకు 20 లీటర్ల నీటిని ఉత్పత్తి చేయగల యంత్రంతోపాటు రోజుకు 600, 4,500–6 వేల లీటర్ల నీటిని తయారు చేయగల యంత్రాలను సిద్ధం చేసినట్లు పాసిక్ తెలిపారు. గాల్లోని తేమశాతాన్ని బట్టి ఒక్కో లీటర్ నీరు ఉత్పత్తి చేసేందుకు అయ్యే ఖర్చు రూ.2 మించదని అంచనా. ఉదాహరణకు 30 డిగ్రీల ఉష్ణోగ్రత.. గాల్లో తేమశాతం 70 శాతం వరకూ ఉన్న ప్రాంతాల్లో నీటి ఉత్పత్తి ఖర్చు లీటర్‌కు రూపాయికి మించదు. అంతేకాదు.. గాల్లోని ధూళి, ఇతర కాలుష్యాలను మొత్తం తొలగించేందుకు అత్యాధునిక ఏర్పాట్లు ఉన్న కారణంగా ఈ యంత్రం ద్వారా ఇళ్లలో స్వచ్ఛమైన గాలిని కూడా పొందవచ్చు. ఓజోన్ వాయువుతో శుద్ధి చేయడం ద్వారా నీళ్లు మరింత ఎక్కువ కాలం తాజాగా ఉండటంతోపాటు వ్యాధికారక బ్యాక్టీరియా, వైరస్ల సమస్య ఉండదు. యంత్రం నిర్వహణకు అయ్యే ఖర్చు నెలకు రూ.300 వరకూ ఉంటుందని అంచనా. వరదలు, భూకంపాల వంటి ప్రకృతి విపత్తుల సమయంలో జనాన్ని ఆదుకునేందుకు లారీలోనూ ఒద్దికగా అమరిపోతుంది వాటర్ జెన్ యంత్రం. వీటితోపాటు మిలటరీ అవసరాల కోసం మొబైల్ యంత్రాన్ని, ఎయిర్ కండీషనర్ల నుంచి విడుదలయ్యే నీటిని శుద్ధి చేసేందుకు, గాల్లోని తేమను తొలగించడం ద్వారా పదార్థాలు మరింత ఎక్కువకాలం నిల్వ ఉండేలా చేసేందుకు కూడా ఈ కంపెనీ ప్రత్యేకంగా యంత్రాలను తయారు చేసింది. భారత్‌లోని చెన్నైతోపాటు అనేక ఇతర దేశాల్లో ప్రస్తుతం వాటర్‌జెన్ యంత్రాలు దాదాపు పది వేలు పనిచేస్తున్నాయి. రానున్న ఐదేళ్లలో ప్రపంచంలోని సగం మందికి వాటర్ జెన్ ద్వారా తాగునీరు అందించేందుకు వాటర్‌జెన్ ప్రయత్నిస్తోంది. ఈ యంత్రాల కోసం భారత్‌తోపాటు అనేక ఇతర దేశాల నుంచి డిమాండ్ ఉంది. అతితక్కువ ఖర్చుతో స్వచ్ఛమైన తాగునీరు అందించడం ద్వారా సామాన్యుల ప్రాణాలు కాపాడాలన్నది మా లక్ష్యం. – మాక్సిమ్ పాసిక్ – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
మహిళ మాకు ఆది'శక్తి'
-
‘అమెరికా చూపిస్తున్న ఆసక్తి ప్రశంసదాయకం’
-
నేను తెలంగాణకు చిన్నమ్మను : సుష్మ
సాక్షి, హైదరాబాద్ : భారతదేశం ఎన్నో అవకాశాలకు కేంద్రమని విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ అన్నారు. ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సులో ఆమె మంగళవారం ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ...‘ ప్రధాని మోదీ నాయకత్వంలో ఎంతో అభివృద్ధి జరిగింది. మహిళా సాధికారత కోసం ఎన్నో చర్యలు చేపట్టాం. అమెరికా చూపిస్తున్న ఆసక్తి ప్రశంసదాయకం. మోదీ నాయకత్వంలో ఇరుదేశాల మైత్రీ మరింత బలపడుతుంది.’ అని ఆకాంక్షించారు. తాను తెలంగాణకు చిన్నమ్మనంటూ సుష్మా వ్యాఖ్యానించారు. అంతకు ముందు తెలంగాణ సీఎం కేసీఆర్, ఇవాంక ట్రంప్, ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. -
మహిళలు మన స్ఫూర్తిప్రదాతలు
సాక్షి,హైదరాబాద్: జీఈఎస్ వేదికపై ప్రధాని నరేంద్ర మోదీ కీలకోపన్యాసం చేశారు. ఈ సదస్సు సిలికాన్ వ్యాలీతో హైదరాబాద్‌ను కలపడమే కాదు భారత్ అమెరికా బంధాన్ని బలోపేతం చేస్తుందని చెప్పారు. మహిళలే ప్రథమం అన్న సదస్సు థీమ్ వినూత్నమైందన్నారు. అమెరికాతో కలిసి సదస్సును దక్షిణాసియాలో తొలిసారిగా నిర్వహించడం సంతోషకరమన్నారు. భారత పురాణాల ప్రకారం మహిళ ఒక శక్తి.. మహిళలు మనకు స్ఫూర్తి ఇస్తున్నారని కొనియాడారు. మానవజాతి అభివృద్ధి, ఎదుగుదలకు సంబంధించిన అన్ని రంగాలకు సంబంధించి సదస్సులో చర్చలు జరుగుతాయన్నారు. సైనా నెహ్వాల్, పీవీ సింధు, సానియా మీర్జాలకు హైదరాబాద్ పుట్టిల్లు అని అభివర్ణించారు. కల్పనా చావ్లా, సునీతా విలియమ్స్ వంటి భారత మహిళలు అంతరిక్ష ప్రయోగాల్లో కీలక పాత్ర పోషించారని ప్రస్తుతించారు. రాణీ అహల్యాబాయి, హోల్కర్, రాణి లక్ష్మిభాయి వంటి మహిళలు మనకు స్ఫూర్తినిస్తున్నారని అన్నారు.గుజురాత్లో లిజ్జత్ పాపడ్ వంటి సంస్థలను మహిళలే ముందుండి నడిపిస్తున్నారు...యోగాకు భారత్ మూలమైతే నేడు యావత్ ప్రపంచం యోగాను గుర్తిస్తోందన్నారు. సున్నాను ఆవిష్కరించిన ఆర్యభట్ట భారతీయుడేనని, నేడు సున్నా మీదే డిజిటల్ ప్రపంచం నడుస్తున్నదన్నారు. చరక సంహింత ప్రపంచానికి ఆయుర్వేదాన్ని అందించిందన్నారు. కౌటిల్యుడు అర్థశాస్ర్తానికి ఆద్యుడని గుర్తుచేశారు. 21 రంగాల్లో విదేశీ పెట్టుబడులకు సంబంధించి పలు చట్టాలను భారత్ సవరించిందని చెప్పారు. ప్రపంచ బ్యాంక్ రేటింగ్‌ల్లో 180 నుంచి 100వ స్ధానానికి వచ్చామన్నారు. దేశంలో 8 కోట్ల మంది చిన్నా, పెద్ద పారిశ్రామికవేత్తలున్నారని చెప్పారు. ముద్ర పథకం ద్వారా రూ 4.82 లక్షల కోట్ల రుణాలు ఇచ్చామని అన్నారు. సులభతర వాణిజ్యంలో భారత్ ర్యాంకు భారీగా మెరుగుపడిందని చెప్పుకొచ్చారు. మెంటార్ ఇండవియా పథకం ద్వారా పారిశ్రామికవేత్తలను తయారు చేస్తున్నామని చెప్పారు. ఇంక్యుబేషన్ సెంటర్ల ద్వారా స్టార్టప్‌లను ప్రోత్సహిస్తామనన్నారు. ఆధార్ ద్వారా ప్రస్తుతం కోట్లాది లావాదేవీలు జరుగుతున్నాయన్నారు. జన్‌థన్ యోజన ద్వారా కోట్లాది మందికి బ్యాంకు ఖాతాలు సమకూరాయన్నారు. -
మహిళతోనే మార్పు సాధ్యం
-
జీఈఎస్‌లో ఇవాంకా ఏమన్నారంటే...
సాక్షి,హైదరాబాద్: ఇన్నోవేషన్ హబ్‌గా ఎదుగుతున్న హైదరాబాద్‌లో గ్లోబల్ ఎంట్రప్రెన్యూర్ సదస్సు(జీఈఎస్)లో పాల్గొనడం సంతోషకరమని ఇవాంక ట్రంప్ అన్నారు. అమెరికాకు భారత్ అసలైన మిత్ర దేశమని, భారత్‌కు ఎంతో చరిత్ర, ప్రాశస్త్యం ఉన్నాయని అన్నారు. ముత్యాల నగరంలో యువతే గొప్ప సంపదని, ఇక్కడి పారిశ్రామికవేత్తలు సరికొత్త విప్లవం సృష్టిస్తున్నారని కొనియాడారు. మీరంతా రాత్రింబవళ్లు కష్టపడి రోబోలు, యాప్‌లు రూపొందిస్తున్నారని ఇవాంక ప్రశంసించారు. భారతీయ నిపుణులు తమకు స్ఫూర్తిదాయకమని, టీ అమ్మే స్ధాయి నుంచి ప్రధాని కాగలడం మీ ప్రధాని గొప్పతనమని ఆమె ప్రస్తుతించారు. ‘ఆసియాలోనే అతిపెద్ద ఇంక్యుబేటర్‌గా టీహబ్ రూపొందింది. ఈ సదస్సులో 52 దేశాలకు పైగా మహిళలు పాల్గొనడం ఆనందంగా ఉంది. పురుషాదిక్య సమాజంలో మహిళలు రాణించడం గొప్ప విషయం. ఓ పారిశ్రామికవేత్తగా మహిళ ఎదగడం ఎంత కష్టమో నాకు తెలుసు. మహిళలు మరింత కష్టపడాలని తెలుసుకున్నా’అంటూ ఉద్వేగంగా ప్రసంగించారు. గత పదేళ్లలో మహిళా పారిశ్రామికవేత్తల సంఖ్య పది శాతం పెరిగిందని చెప్పారు. టెక్నాలజీతో పాటు రుచికరమైన బిర్యానీకి భారత్ అడ్డా అన్నారు. మహిళా పారిశ్రామికవేత్తలను ప్రత్యేకంగా అభినందిస్తున్నానని..గత దశాబ్ధకాలంగా మహిళలు ఎంతో ఎత్తుకు ఎదిగారని చెప్పారు. కష్టపడితే మహిళలు వారి భవిష్యత్‌ను వారే తీర్చిదిద్దుకోగలరన్నారు. ఇవాంక ఇంకా ఏమన్నారంటే... మాకు ఆతిథ్యం ఇచ్చినందకు కృతజ్ఞతలు హైదరాబాద్ ఇన్నోవేషన్ హబ్‌గా ఎదుగుతోంది ఆసియాలో అతిపెద్ద ఇంక్యుబేటర్‌గా టీ హబ్ ఆవిర్భవించింది ప్రపంచంలో వేగంగా పురోగతి సాధిస్తోన్న దేశాల్లో భారత్ ఒకటి ఇక్కడి ప్రజల విజయాలు అందరికీ స్ఫూర్తిదాయకం అమెరికాకు భారత్ అత్యంత సన్నిహిత దేశం టెక్నాలజీనే కాదు...బిర్యానీకి హైదరాబాద్ ఫేమస్ మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రత్యేక అభినందనలు పురుషాధిక్య సమాజంలో మహిళలు రాణించడం గొప్ప విషయం మహిళలు ఎదగాలంటే ఎన్ని సమస్యలుంటాయో నాకు తెలుసు గత దశాబ్ధ కాలంలో మహిళలు చాలా ఎత్తుకు ఎదిగారు మహిళలు రాణిస్తే కుటుంబాలు బాగుపడతాయి మోదీ నాయకత్ంలో భారత్ అద్భుత పురోగతి సాధిస్తోంది టీ అమ్ముకునే వ్యక్తి ప్రధాని అయ్యారు ప్రధాని మోదీ జీవితాన్ని చూసి చాలా నేర్చుకోవచ్చు -
మూడు నిమిషాల్లో ముగిసిన కేసీఆర్ ప్రసంగం
సాక్షి, హైదరాబాద్ : టీఎస్- ఐపాస్ (నూతన పారిశ్రామిక విధానం)తో 15 రోజుల్లోనే పరిశ్రమలకు అనుమతులు ఇస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. నగరంలోని హెచ్ఐసీసీలో జరుగుతున్న ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సులో ఆయన మంగళవారం ప్రసంగించారు. జీఈఎస్ సదస్సుకు హైదరాబాద్ వేదిక కావడం సంతోషంగా ఉందన్నారు. హైదరాబాద్ వేగంగా అభివృద్ధి చెందుతోందని కేసీఆర్ పేర్కొన్నారు. టీఎస్-ఐపాస్ ద్వారా ఇప్పటివరకూ 5,469 యూనిట్లకు అనుమతి ఇచ్చామని తెలిపారు. ‘ఈజ్ ఆఫ్ డుయింగ్ బిజినెస్’లో తెలంగాణకు ఫస్ట్ ర్యాంక్ వచ్చిందన్నారు. తెలంగాణ పారిశ్రామికంగా పుంజుకుంటోందని, టీ హబ్ ద్వారా ఔత్సాహికులను ప్రోత్సహిస్తున్నామని ఆయన తెలిపారు. పెట్టుబడులకు హైదరాబాద్ అన్నిరకాల అనుకూలమైన ప్రాంతం అని అన్నారు. అమెరికాలో అయిదు ముఖ్యమైన కంపెనీల బ్రాంచ్‌లు హైదరాబాద్‌లో ఉన్నాయని కేసీఆర్ తెలిపారు. జీఈఎస్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ కేవలం మూడు నిమిషాల్లోనే తన ప్రసంగాన్ని ముగించారు. -
జీఈఎస్ వేదిక పై సీఎం కేసీఆర్ ప్రసంగం
-
హెచ్ఐసీసీలో జీఈఎస్-2017
సాక్షి, హైదరాబాద్ : హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్(హెచ్ఐసీసీ) వేదికగా ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు-2017 ప్రారంభం అయ్యింది. మంగళవారం సాయంత్రం ప్రధాని నరేంద్ర మోదీ-అతిథి ఇవాంక ట్రంప్ చేతుల మీదుగా రోబో మిత్రా ద్వారా సదస్సును ప్రారంభించారు. అనంతరం సదస్సు లోగోను ఆవిష్కరించారు. ఇక మూడు రోజులపాటు కొనసాగే ఈ సమ్మిట్ కోసం సుమారు 150 దేశాలకు చెందిన 1500 మంది ప్రతినిధులు, 300 మంది పెట్టుబడిదారులు హాజరయ్యారు. అమెరికా, భారత్ నీతి ఆయోగ్‌లు సంయుక్తంగా ఈ సదస్సును నిర్వహిస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సలహాదారు హోదాలో ఆయన కుమార్తె ఇవాంక ట్రంప్ సదస్సుకు హాజరయ్యారు. నేడు, రేపు సదస్సులో పాల్గొననున్న ఇవాంక.. వ్యాపారరంగంలో మహిళలకు అవకాశాలు పెంచటం అనే అంశంపై ప్రసంగించనున్నారు. భారత్ లో స్టార్టప్స్‌కు సువర్ణావకాశంగా గ్లోబల్ ఎంటర్ప్రెన్యూర్ 8వ సదస్సును పేర్కొంటున్నారు. ఇక ‘ఉమెన్ ఫస్ట్’ థీమ్‌తో మహిళా శక్తికి అగ్రపీఠం వేస్తూ ఈసారి సదస్సును నిర్వహించనున్నారు. ఈసారి ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సులో 52 శాతం మంది మహిళా డెలిగెట్స్ పాల్గొంటుండటం విశేషం. ఉపాసన కొణిదెల, నారా బ్రహ్మిణి, సానియా మీర్జా , మంచు లక్ష్మీ, మరికొందరు సెలబ్రిటీలు కూడా ఈ సదస్సులో పాల్గొంటున్నారు. బ్రేక్ ఔట్లు, మాస్టర్ క్లాసులు, వర్క్ షాపులతో సమ్మిట్ సందడిగా సాగనుంది. 52 అంశాలపై చర్చ.. విశిష్ట అతిథుల అమూల్యమైన సందేశాలు... ప్రపంచ ప్రఖ్యాతి పారిశ్రామికవేత్తలు తమ ఆలోచనలను పంచుకోనున్నారు. -
జీఈఎస్ సదస్సుకు ఉపాసన, బ్రాహ్మణి
-
జీఈఎస్‌లో ఉపాసన, బ్రాహ్మణి
సాక్షి,హైదరాబాద్: హైదరాబాద్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న గ్లోబల్ ఎంట్రపెన్యూర్ సమ్మిట్(జీఈఎస్)కు పలువురు పారిశ్రామికవేత్తలు, ప్రముఖులు తరలివచ్చారు. అపోలో ఫౌండేషన్ వైస్ చైర్పర్సన్ ఉపాసన హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నారా బ్రాహ్మణి సదస్సుకు హాజరయ్యారు. ప్రపంచవ్యాప్తంగా మహిళా పారిశ్రామికవేత్తలు సదస్సుకు హాజరవ్వడం హర్షణీయమని బ్రాహ్మణి అన్నారు. బ్రాండ్ హైదరాబాద్ పురోగతికి సదస్సు ఉపకరిస్తుందని ఆకాంక్షించారు. మహిళల్లో వ్యాపారవేత్తలు మరింతగా పెరగాల్సిన అవసరం ఉందని బ్రాహ్మణి అభిప్రాయపడ్డారు. తను వెంచర్ కాపిటలిస్టుగా ఉన్నానని, ఎన్నో కంపెనీలకు నిధులు అందిస్తున్నానని చెప్పారు. అన్నింటిల్లోను మహిళదే ప్రధానపాత్ర అన్నారు. హైదరాబాద్ జీఈఎస్‌కు ఆతిథ్యం ఇవ్వడం స్వాగతించదగినదని అపోలో ఫౌండేషన్ వైస్ చైర్పర్సన్ ఉపాసనా అన్నారు. పారిశ్రామికవేత్తలుగా మహిళలు రాణించేందుకు సదస్సు మార్గనిర్ధేశం చేస్తుందన్నారు. -
ప్రధాని నరేంద్ర మోదీ ఇవాంక ట్రంప్ భేటీ
-
హెచ్ఐసీసీలో మోదీ-ఇవాంక భేటీ
సాక్షి, హైదరాబాద్ : జీఈ సదస్సు 2017 ప్రారంభానికి ముందు ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడి సలహాదారు ఇవాంక ట్రంప్ భేటీ అయ్యారు. ఈ భేటీకి ఇరుదేశాల విదేశాంగ ప్రతినిధులు కూడా హాజయ్యారు. తమ బృందంలోని సభ్యులను ఈ సందర్భంగా ఆమె మోదీకి పరిచయం చేశారు. భారత్‌తో ద్వైపాక్షిక ఒప్పందాలు, పెట్టుబడి అవకాశాలపై వీరిద్దరూ చర్చించినట్లు తెలుస్తోంది. అంతకు ముందు విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌తో ఇవాంకతో భేటీ అయ్యారు. మహిళా సాధికారికతపైనే వీరిద్దరు చర్చించినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. -
జీఈఎస్‌లో స్పెషల్ ఎట్రాక్షన్ ఈ బుడతడు
సాక్షి,హైదరాబాద్: హైదరాబాదు హెచ్ఐసీసీలో జరుగుతున్న గ్లోబల్ ఎంట్రప్రెన్యూర్షిప్ సమ్మిట్‌లో హమీష్ ఫిన్లేసన్ (13) అతిచిన్న పారిశ్రామిక వేత్తగా క్రెడిట్ దక్కించుకున్నాడు. 7వ తరగతి చదువుతున్న ఆస్ట్రేలియన్-ఆధారిత ఎంట్రపెన్యూర్ అతిచిన్న డెలిగేట్‌గా తన ప్రత్యేకతను చాటనున్నారు. గేమింగ్ అండ్ అవేర్నెస్పై తాను రూపొందించిన యాప్‌లను ప్రదర్శించనున్నారు. ముఖ్యంగా తాబేళ్లను రక్షించే ప్రాజెక్టులో ఇప్పటివరకు ఐదు యాప్‌లను హమీష్ అభివృద్ధి చేశాడు. ప్రస్తుతం ట్రాఫిక్ నియమాల గురించి అవగాహన కల్పించేందుకు గాను ఆరవ యాప్‌ను పనిచేసే పనిలో ఉన్నాడు. తాను భారతదేశం రావడం చాలా సంతోషంగా ఉందని ఫిన్లేసన్ తెలిపారు. టెక్నాలజీ అంటే తనకు ఎనలేని ప్రేమ అని, యాప్‌లు..టెక్నాలజీ అదే ఫస్ట్ లవ్..అయినా చదువుమీద కూడా దృష్టి పెడుతున్నట్టు చెప్పాడు. స్కూలు హోం వర్క్ పూర్తి చేసుకొని ఖాళీ సమయంలో మాత్రమే యాప్‌ల తయారీన పని చూసుకుంటానన్నాడు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు ఎదుర్కొంటున్న పెద్ద సమస్యలను పరిష్కరించడానికి టెక్నాలజీద్వారా పని చేయాలని కోరుకుంటున్నాడని హమీష్ తండ్రి గ్రేమే చెప్పారు. దాదాపు 54దేశాలలో వినియోగ దారులను సంపాదించుకున్న హమీష్ జీఈఎస్- 2017 ద్వారా సముద్ర తాబేళ్ల, ఆటిజం ప్రభావం గురించి అవగాహన పెంచాలని కోరుకుంటున్నారని తెలిపారు. కాగా భాగ్యనగరంలో మంగళవారంనుంచి మూడు రోజులపాటు జరగనున్న గ్లోబల్ ఎంట్రపెన్యూర్ షిప్ సమ్మిట్-2017మరికొద్ది సేపట్లో ప్రారంభం కానుంది. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సమ్మిట్‌ను ప్రారంభిస్తారు అలాగే మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రాధాన్యతనిస్తున్న ఈ సమ్మిట్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ముఖ్య అతిధిగా హాజరవుతున్న సంగతి తెలిసిందే. -
నమస్తే మోదీజీ, ఇవాంకా.. ఎవరు స్వాగతం చెప్తారో తెలుసా?
సాక్షి, హైదరాబాద్: ‘నమస్తే నరేంద్రమోదీజీ.. నమస్తే ఇవాంకా ట్రంప్’ అంటూ ప్రపంచ పారిశ్రామిక శిఖరాగ్ర సదస్సు (జీఈఎస్)కు హాజరుకాబోతున్న ప్రధాని మోదీని, ఇవాంకలకు ‘మిత్ర’ స్వాగతం పలుకబోతుంది. నగరంలోని హెచ్ఐసీసీ ప్రాంగణానికి మోదీ, ఇవాంక చేరుకోగానే వారిని మిత్ర పలుకరిస్తుంది. ఇంతకు మిత్ర ఎవరంటే.. ఒక బోట్ (రోబో). బెంగళూరుకు చెందిన బాలాజీ విశ్వనాథన్ పూర్తి స్వదేశీ విజ్ఞానంతో ఈ బోట్‌ను రూపొందించారు. హైదరాబాద్‌లో జరగనున్న జీఈఎస్ సదస్సు నేపథ్యంలో ఇక్కడ రెండు ‘మేడిన్ ఇండియా’ బోట్లను విశ్వనాథన్ బృందం ప్రదర్శనకు పెట్టింది. ఈ రెండు బోట్లలో ఒకటి వేదిక మీద ఉండి.. విదేశీ పారిశ్రామిక ప్రముఖులతో ముచ్చటిస్తుంది. మరొక బోట్ వేదిక బయట ఉండి.. ప్రేక్షకులతో ముచ్చటిస్తుంది. ‘మా ‘మేడిన్ ఇండియా’ రోబోట్లను ప్రదర్శించడానికి జీఈఎస్‌ను ఆదర్శ వేదికగా మేం భావిస్తున్నాం. ఈ సదస్సుకు అత్యంత ప్రముఖులు వస్తుండటం, కట్టుదిట్టమైన భద్రత నేపథ్యంలో మిత్ర వేదిక మీద కొద్దిసేపు మాత్రమే ముచ్చటిస్తుంది. ప్రధాని మోదీ, ఇవాంక వేదిక మీదకు రాగానే మిత్ర వారి వద్దకు వెళ్లి.. వారితో సంభాషిస్తుంది. వాళ్లు ఒక బటన్ ప్రెస్ చేస్తారు. దీంతో మిత్ర పాట పాడుతుంది. శిఖరాగ్ర సదస్సు ప్రారంభమైనట్టు డిక్లేర్ అవుతుంది’ అని విశ్వనాథన్ తెలిపారు. ఇప్పటికే ఈ రోబోలకు 1000-1500 శిక్షణ ప్రక్రియలను నిర్వహించామని, ఈ రోబోలు వేదికపైన, సదస్సు జరిగే ప్రాంగణంలో ఉండి.. ప్రతినిధులు, ప్రేక్షకులతో ముచ్చటిస్తాయని చెప్పారు. -
అంతా ఆమె..
సాక్షి,సిటీబ్యూరో: అన్ని రంగాల్లోనూ మహిళల ప్రాధాన్యత పెరుగుతోంది. సమాజ అభివృద్ధిలో ఒక నిర్ణాయక భాగస్వామిగా మహిళలు ఎదుగుతున్నారు. పారిశ్రామిక రంగంలోనూ ప్రధాన భూమికను పోషిస్తున్న మహిళలకు మరింత ప్రోత్సాహాన్ని అందజేసేందుకు, ఔత్సాహిక పారిశ్రామిక, వ్యాపార మహిళలకు ఒక వేదికను కల్పించే దిశగా ఈ ఏడా ది గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్స్ సమ్మిట్ (జీఈఎస్ –2017) ‘మహిళలే ముందు సంపద అందరికీ (విమెన్ ఫస్ట్ ప్రాస్పరిటీ ఫర్ ఆల్)’ అనే ఉన్నతమైన ఆశయంతో నిర్వహిం చనున్నారు. అనేక దేశాల నుంచి వందలాది మంది మహిళా పారిశ్రామిక వేత్తలు పాల్గొననున్న ఈ ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ సదస్సుకు హైదరాబాద్ వేదిక కావడం విశేషం. ‘విమెన్ ఫస్ట్’ అనే స్ఫూర్తిని అందజేస్తున్న మన విశ్వనగరంలో ఆ స్ఫూర్తికి తగిన విధంగానే వివిధ రంగాల్లో మహిళల భాగస్వామ్యం ఉంది. కొన్ని రంగాల్లో మహిళల భాగస్వామ్యం తక్కువగా ఉన్నా మరి కొన్ని రంగాల్లో నిర్ణాయకమైన బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అన్నింటా పురుషులతో సమానంగా ‘సగం’వాటాకు ఇంకా చేరుకోలేకపోయినా ఆ దిశగా పురోగమనం కనిపిస్తోంది. అసంఘటిత, కార్మిక వర్గాల్లో మహిళలు పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో వివిధ కేడర్లలో పని చేస్తున్న వాళ్ల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఐటీ రంగంలో .. నగరంలో ఐటీ రంగం అనూహ్యంగా విస్తరిస్తోంది. వేలాది సాఫ్ట్వేర్ సంస్థలు వెలిశాయి. కొన్ని సార్టప్ సంస్థలు ఇప్పుడిప్పుడే పురోగమిస్తున్నాయి. హైటెక్‌సిటీ, కొండాపూర్, మాదాపూర్, గచ్చిబౌలి, తదితర ప్రాంతాల్లోని సాఫ్ట్వేర్ సంస్థల్లో మహిళా ఉద్యోగుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. సైబరాబాద్ ప్రాంతంలో మహిళల భద్రత కోసం ప్రభుత్వం తీసుకున్న అనేక చర్యలు వారిలో భరోసాను కలిగిస్తున్నాయి. మూడేళ్ల క్రితం కేవలం 20 శాతం ఉన్న మహిళా ఉద్యోగులు ఇప్పుడు 35 శాతానికి పెరిగారు. ఈ భాగస్వామ్యం ఇంకా పెరగాల్సి ఉంది. కానీ షీటీమ్స్ వంటి పోలీసు బృందాలు, షీ షటిల్స్ వంటి రవాణా సదుపాయాలు, సుమారు 200 మహిళల వసతి గృహాల్లో పెరిగిన భద్రతా ఏర్పాట్లు, సీసీటీవీల నిఘా వంటివి సత్ఫలితాలనిస్తున్నాయి. దీంతో నిర్భయ చట్టం అమల్లోకి వచ్చిన అనంతరం ధైర్యంగా పని చేసేందుకు మహిళలు ముందుకు వస్తున్నట్లు ఐటీ వర్గాలు పేర్కొంటున్నాయి. కంపెనీ ఉపాధ్యక్షులు, సీఈవోలు వంటి కీలకమైన స్థానాల్లో మాత్రం ఇంకా 3 శాతం మహిళలే ఉన్నారు. ప్రోగ్రామర్స్‌గా, ప్రాజెక్టు అధికారులుగా మహిళలు ఎక్కువ సంఖ్యలో పని చేస్తున్నారు. ప్రభుత్వంలో... అలాగే నగరంలోని వివిధ ప్రభుత్వ విభాగాల్లోనూ మహిళల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఒకప్పటితో పోల్చితే ఎంతో మెరుగ్గానే ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. విద్య,వైద్య రంగాల్లో, జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, జలమండలి, ఆర్టీసీ వంటి వివిధ విభాగాల్లో మహిళల భాగస్వామ్యం కీలకంగా నిలిచింది. స్త్రీ సమానత్వానికి సమ్మిట్ ఓ సదవకాశం యూఎస్ అంబాసిడర్ కెన్నెత్ ఐ జస్టర్ సాక్షి, హైదరాబాద్: పారిశ్రామిక రంగంలో స్త్రీలు సమాన అవకాశాలను అందింపుచ్చుకునేందుకు ప్రపంచ పారిశ్రామిక వేత్తల సదస్సు ఒక సదవకాశంగా భావించాలని, తక్షణావసరాలు కాకుండా పారిశ్రామిక రంగంలో ఇరుదేశాల దీర్ఘకాలిక ప్రయోజనాలు ఈ సదస్సు లక్ష్యంలో ఉమిడి ఉన్నాయని అమెరికా రాయబారి కెన్నెత్ ఐ జస్టర్ అభిప్రాయపడ్డారు.ఇదిఎనిమిదవ ప్రపంచస్థాయి పారిశ్రామిక వేత్తల సదస్సు అని, ఇంతవరకు ఇంత భారీ స్థాయిలో మహిళా పారిశ్రామిక వేత్తలు పాల్గొనడం ఇదే తొలిసారి అని అన్నారు. గ్లోబల్ ఎంటర్ప్రెన్యూర్ సదస్సు వివరాలను వెల్లడించేందుకు గచ్చిబౌలిలోని రహేజా ఐటీ పార్క్, వెస్టిన్‌లో నీతి ఆయోగ్ నేతృత్వంలో జరిగిన విలేకరుల సమావేశంలో కెన్నెత్ ఐ జస్టర్ మాట్లాడారు. మహిళలు ఆర్థికంగా సాధికారత సాధించగలిగితేనే సమాజం పురోగమిస్తుందన్నది ఇరుదేశాల విధానమని అన్నారు. మహిళా పారిశ్రామిక వేత్తలకు ఈ సదస్సు ద్వారా సమాన అవకాశాలు, ప్రోత్సాహం, కొత్త పెట్టుబడులు, నూతన పరిశ్రమలకు అవకాశం లభిస్తుందని అన్నారు. కార్యక్రమంలో నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్ మాట్లాడుతూ మొత్తం 150 దేశాల నుంచి 1500 మంది పారిశ్రామిక వేత్తలు, పెట్టుబడిదారులు పాల్గొంటున్న ఈ సదస్సులో సగానికిపైగా మహిళలే కావడం విశేషం అన్నారు. ప్రపంచ పారిశ్రామిక వేత్తల సదస్సులో 52.5 శాతం మంది ప్రపంచ దేశాల మహిళా పారిశ్రామిక వేత్తలు హాజరవుతున్నట్టు వెల్లడించారు.ప్రధానంగా ఆఫ్ఘనిస్తాన్, సౌదీ అరేబియా, ఇస్రాయిల్ సహా మొత్తం పది దేశాలనుంచి ప్రతినిధులంతా మహిళలే కావడం విశేషం. నగరపాలనలో ప్రత్యేక ముద్ర సాక్షి,సిటీ బ్యూరో: సాక్షాత్తు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ జిల్లా పాలనా యంత్రాంగంలో ఉన్నతాధికారులంతా మహిళలే. జిల్లా కలెక్టర్ నుంచి వీఆర్వోల వరకు మహిళలు సమర్థవంతమైన సేవలందిస్తూ ప్రజల మన్ననలను పొందుతున్నారు.అధికార యంత్రాంగానికి గుండెకాయలాంటి రెవెన్యూతోపాటు సంక్షేమ, వైద్య శాఖలో కూడా మహిళా ఉద్యోగులదే పైచేయి. హైదరాబాద్ జిల్లా కలెక్టర్‌గా యోగితా రాణా కొనసాగుతున్నారు. ♦ మూడు నెలల క్రితం పాలన పగ్గాలు చేపట్టిన మరుక్షణం నుంచే కలెక్టర్ యోగితా రాణా అధికార యంత్రాంగాన్ని ఉరుకులు పరుగులు పెట్టిస్తూ పలు సంస్కరణలతో ముందుకు సాగుతున్నారు. ♦ జాయింట్ కలెక్టర్‌గా ప్రశాంతి గతేడాదినుంచి కొనసాగుతున్నారు. ♦ జిల్లా రెవెన్యూ అధికారి పోస్టులో భూ సేకణ విభాగం స్పెషల్ కలెక్టర్ సరళా వందనం ఇంచార్జి డీఆర్వోగా కొనసాగుతున్నారు. ♦ కలెక్టరేట్ పరిపాలనాధికారి పోస్టులో స్పెషల్ కలెక్టర్ రాధిక రమణి ఇంచార్జిగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ భూముల పరిరక్షణ విభాగానికి కూడా ఆమెనే బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ♦ ప్రభుత్వ భూముల న్యాయ విభాగం అధికారిగా స్పెషల్ కలెక్టర్ సంగీత సేవలందిస్తున్నారు. ♦ హైదరాబాద్ రెవెన్యూ డివిజన్ పోస్టు ఖాళీగా ఉండటంతో సికింద్రాబాద్ ఆర్డీఓ చంద్రకళ అదనపు బాధ్యతలతో కొనసాగుతున్నారు. ♦ జిల్లా రేషనింగ్ అధికారిగా బాలమాంబ, జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి పద్మజా, అదనపు డీఎంహెచ్‌వో సరళా కుమారి, ఈ–డిస్ట్రిక్ మేనేజర్‌గా సరోజ. హైదరాబాద్ ఎస్టేట్ అధికారి నిఖిల విధులు నిర్వర్తిస్తూ పాలనలో తమదైన ముద్ర వేస్తున్నారు. అతిథుల సేవలో నిథమ్ విద్యార్థులు రాయదుర్గం: గ్లోబల్ ఎంటర్ ప్రెన్యూర్షిప్ సమ్మిట్ నేపథ్యంలో ఆతిథ్య సేవలు అందిం చడంలో గచ్చిబౌలిలోని డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజమ్ అండ్ హస్పిటాలిటీ మేనేజ్మెంట్ (డాక్టర్ వైఎస్సార్నిథమ్)కు పెద్దపీట వేశారు. పర్యాటక, ఆతిథ్యరంగంలో విద్యా, శిక్షణాసంస్థల్లో జాతీయస్థాయిలో ప్రాముఖ్యతను సాధించిన నిథమ్ నుండి గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సమ్మిట్‌లో ఆతిథ్య సేవలందించేందుకు 150 మంది విద్యార్థులకు అవకాశం కల్పించారు. ♦ నిథమ్ నుంచి బీబీఏ, ఎంబీఏ చదువుతున్న 80 మంది బాలికలు, 70 మంది బాలురు ఉన్నారు. ఎంపిక చేసిన వారు ఎయిర్‌పోర్టు, హోటళ్ళు, హెచ్ఐసీసీల వద్ద ఒక్కో విద్యార్థికి రోజుకు ఎనిమిది గంటల చొప్పున మూడు షిఫ్టుల్లో విధులు నిర్వహించడం ప్రారంభించారు. ♦ అయిదు విడతల్లో శిక్షణ... ♦ గెస్ సదస్సులో ఆతిథ్య సేవలందించే నిథమ్ విద్యార్థులకు అయిదు విడతల్లో శిక్షణ ఇచ్చారు. మూడేసి గంటల చొప్పున రెండుమార్లు నిథమ్ ప్రాంగణంలో, ఒక్కోసారి నిఫ్ట్, హెచ్ఐసీసీ, తారామతి బారాదారిలో శిక్షణ ఇచ్చారు. తారామతిబారాదారిలో ఇచ్చిన శిక్షణలో కేంద్ర,రాష్ట్ర అధికారులే కాకుండా అమెరికా అధికారులు కూడా పాల్గొన్నారు. ముఖ్యంగా విదేశాల నుంచి వచ్చే అతిథులకు సాంప్రదాయబద్దంగా స్వాగతం పలుకడం, ఆతర్వాత వారి బస ఏర్పాటు చేసిన చోటుకు చేర్చడం వంటి సేవలను అందిస్తారు. రోజుకు ప్రభుత్వం ఒక్కో విద్యార్థికి వెయ్యి రూపాయల చొప్పున నాలుగు రోజులు నాలుగు వేల రూపాయలను పారితోషికంగా అందిస్తుంది. -
ఇవాంక ఇంకెక్కడికి వెళ్లరా?
దేశ విదేశీ అతిథులకు స్వాగతం పలికేందుకు నగరవాసులు సిద్ధమయ్యారు. ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా ప్రెసిడెంట్ కుమార్తె ఇవాంకా ట్రంప్ మంగళవారం నగరానికి రానున్న నేపథ్యంలో అంతటా సందడి వాతావరణం నెలకొంది. అటు మెట్రో రైలు ప్రారంభం..ఇటు ప్రపంచ పారిశ్రామిక సదస్సు నిర్వహణతో సిటీ కొత్త కళ సంతరించుకుంది. మియాపూర్‌లో ప్రధాని మోదీ మెట్రో రైలును ప్రారంభిస్తారు. ఇక హైటెక్స్‌లో జరగనున్న జీఈఎస్ సమ్మిట్‌లో ఆయన ఇవాంకా ట్రంప్‌తో కలిసి పాల్గొంటారు. వీరి కోసం ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ప్రత్యేక విందు సైతం ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో నగరమంతా హై అలర్ట్ ప్రకటించారు. పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. సాక్షి, సిటీబ్యూరో: అమెరికా అధ్యక్షుడి కుమార్తె ఇవాంక ట్రంప్, ప్రధాని నరేంద్ర మోదీల పర్యటన నేపథ్యంలో సిటీ పోలీసులు అప్రమత్తమయ్యారు. అంతర్జాతీయ సదస్సు, మెట్రో రైలు ప్రారంభం నేపథ్యంలో భారీ భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. కాగా ఇవాంకా ట్రంప్ మంగళవారం తెల్లవారుజామున శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ నుంచి వెస్టిన్ హోటల్‌కు వెళ్ళడంతో పాటు హెచ్ఐసీసీలో జరుగనున్న జీఈఎస్ సదస్సులో పాల్గొంటారు. అక్కడ నుంచి తాజ్ ఫలక్‌నుమాలో విందుకు హాజరవుతారు. ప్రధాని మోదీ మంగళవారం మధ్యాహ్నం బేగంపేట విమానాశ్రయంలో దిగుతారు. అక్కడ బీజేపీ నేతలకు సంబంధించిన కార్యక్రమంలో పాల్గొని మియాపూర్‌లో మెట్రో రైలును ప్రారంభిస్తారు. అక్కడ నుంచి హెచ్ఐసీసీ, ఆపై తాజ్ ఫలక్‌నుమాలకు వెళ్తారు. విందు ముగిసిన తర్వాత ప్రధాని మోదీ శంషాబాద్ విమానాశ్రయం నుంచి తిరిగి వెళ్ళనున్నారు. ఇవాంక మాత్రం బుధవారం సాయత్రం వరకు ఇక్కడే ఉంటారు. ఈ మూడు రోజుల్లోనూ మొత్తం మూడు విందులు జరుగనున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న విందు తాజ్ ఫలక్‌నుమాలో, రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న విందు గోల్కొండ కోటలో, అమెరికా ప్రభుత్వం ఇస్తున్న విందు హెచ్ఐసీసీ నోవాటెల్ హోటల్లో జరుగనున్నాయి. ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ఈ కార్యక్రమాలకు పోలీసు విభాగం పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేసింది. భద్రత, బందోబస్తు విధుల కోసం వివిధ విభాగాల నుంచి 10,400 మంది పోలీసుల్ని కేటాయించారు. వీరు మూడు షిఫ్టుల్లోనూ విధులు నిర్వర్తించనున్నారు. శంషాబాద్, బేగంపేట విమానాశ్రయాలు, వెస్టిన్ హోటల్, హెచ్ఐసీసీ, మియాపూర్, తాజ్ ఫలక్‌నుమా, గోల్కొండ కోటల్లో ఎక్కడికక్కడ చర్యలు తీసుకుంటున్నారు. వీటితో పాటు జీఈఎస్‌కు హాజరయ్యే విదేశీ అతి«థులు బస చేస్తున్న 21 హోటళ్ల వద్దా బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ప్రముఖులతో పాటు అతిథులు ప్రయాణించే మార్గాల్లోనూ భద్రతా చర్యలు తీసుకుంటున్నారు. హైదరాబాద్, సైబరాబాద్, రాష్ట్ర పోలీసులు, నీతి ఆయోగ్, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు యూఎస్ సీక్రెట్ సర్వీస్, ఎస్పీజీ అధికారులు సంయుక్తంగా చర్యలు తీసుకుంటున్నారు. ప్రతి ప్రాంతంలోనూ యాక్సిస్ కంట్రోల్, రోడ్ ఓపెనింగ్, బాంబు నిర్వీర్య తనిఖీలు జరుగుతున్నాయి. హెచ్ఐసీసీ–తాజ్ ఫలక్‌నుమా మధ్య ఉన్న రహదారి పరిస్థితులు, ప్యాలెస్ వద్ద పార్కింగ్ సమస్యల నేపథ్యంలో మంగళవారం సాయంత్రం 6 గంటల నుంచి అతిథుల తరలింపు ప్రారంభిస్తారు. ఈ ప్రక్రియ ముగిసిన తర్వాతే ప్రధాని, ఇవాంక అక్కడకు చేరుకునేలా ప్రణాళిక సిద్ధం చేశారు. ఈ సదస్సు, ప్రముఖుల పర్యటనల నేపథ్యంలో వీలున్నంత వరకు సామాన్యులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకూడదనే ఉద్దేశంలో పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్‌వేతో పాటు ఔటర్ రింగ్ రోడ్‌ను ఎక్కువగా వినియోగిస్తున్నారు. అయినప్పటికీ కొన్ని చోట్ల ట్రాఫిక్ మళ్ళింపులు తప్పనిసరి. ప్రధానికి సంబంధించి తాజ్ ఫలక్‌నుమా, శంషాబాద్ విమానాశ్రయం తప్ప మిగతా టూర్ మొత్తం హెలీకాప్టర్‌లో జరుగుతుంది. అయినప్పటికీ ఆయా చోట్లకు రోడ్డు మార్గంలో వెళ్లే ప్రముఖులూ ఉండనున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ట్రాఫిక్‌కు సంబంధించి నోటిఫికేషన్లు జారీ చేశారు. ఆయా ప్రాంతాలకు వెళ్లే వారు కచ్చితంగా తమ వెంట గుర్తింపుకార్డు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇవాంక ఇంకెక్కడికి వెళ్లరా? బుధవారం వరకు హైదరాబాద్‌లోనే ఉండనున్న ఇవాంక షెడ్యూల్‌పై పూర్తి స్పష్టత కొరవడింది. బస, హెచ్ఐసీసీ, తాజ్ ఫలక్‌నుమా ఈ మూడు కార్యక్రమాలు మంగళవారమే జరుగుతున్నాయి. అయితే బుధవారం సాయంత్రం వరకు ఇక్కడే ఉంటారు. ఈ నేపథ్యంలో ఆ రోజు ఎక్కడైనా పర్యటించే అవకాశం ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు దీనిపై అమెరికన్ సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ల నుంచి పోలీసులకు ఎలాంటి అధికారిక సమాచారం లేదు. పోలీసు అధికారులు మాత్రం ఈ అన్ షెడ్యూల్డ్ ప్రోగ్రామ్స్ ఏవైనా ఉంటే కనీసం మూడు, నాలుగు గంటల ముందు తమకు సమాచారం ఇవ్వాలని అమెరికా అధికారుల్ని కోరారు. ఇవాంక వెళ్ళే మార్గం క్లియర్ చెయ్యడంతో పాటు ఆయా ప్రాంతాల్లో భద్రతా ఏర్పాట్లకు ఈ సమయం పడుతుందని వారు స్పష్టం చేశారు. కాగా ఇవాంక పర్యటన నేపథ్యంలో సోమవారం శంషాబాద్ ఎయిర్‌పోర్టులో సీఐఎస్ఎఫ్ సిబ్బంది తనిఖీలు చేపట్టింది. ఇంజన్‌బౌలి–చాంద్రాయణగుట్ట మధ్య రోడ్డు క్లోజ్ తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో మంగళవారం రాత్రి విందు నేపథ్యంలో సాయంత్రం 5 నుంచి రాత్రి 11 గంటల మధ్య ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నాం. వీటిలో భాగంగా ఇంజన్‌బౌలి–చంద్రాయణగుట్ట చౌరస్తా మధ్య మార్గాన్ని సాధారణ వాహనాలకు పూర్తిగా మూసేస్తున్నాం. ఐఎస్ సదన్, డీఎంఆర్ఎల్ వైపు నుంచి చాంద్రాయణగుట్ట వైపు వచ్చే వాహనాలను మిదానీ జంక్షన్ నుంచి బాలాపూర్ వైపు మళ్ళిస్తాం. శ్రీశైలం హైవే మీదుగా వచ్చే వాహనాలను కేశవగిరి పోస్టాఫీస్ నుంచి బాలాపూర్ వైపు పంపిస్తాం. హిమ్మత్‌పుర నుంచి ఫలక్‌నుమా వైపు వచ్చే ట్రాఫిక్‌ను నాగుల్చింత టి జంక్షన్ వద్ద లాల్‌దర్వాజా వైపు మళ్ళిస్తాం. కాలాపత్తర్/జహనుమ వైపుల నుంచి షంషీర్గంజ్ టి జంక్షన్ వైపు వచ్చే వాహనాలను గోశాల జహనుమ వైపు పంపిస్తాం. జహనుమ, బీబీకా చష్మా వైపు నుంచి ఫలక్‌నుమా వైపు వచ్చే వాహనాలను షంషీర్గంజ్ వైపు పంపిస్తారు. – వీవీ శ్రీనివాసరావు, ఇన్చార్జ్ సీపీ ఎస్పీజీ ఆధీనంలోనే ప్యాలెస్ తాజ్ ఫలక్‌నుమా ప్యాలస్ మొత్తం ప్రధాని భద్రతను పర్యవేక్షించే స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్పీజీ) ఆధీనంలో ఉంటుంది. ప్యాలెస్‌లోకి ఇవాంక కాన్వాయ్‌లో ఐదు వాహనాలు, ప్రధాని కాన్వాయ్‌లో మూడు వాహనాలు అనుమతిస్తున్నారు. అయితే ఒక్కో వాహనం మాత్రమే పైన ఉండి మిగిలినవి కింద ఏర్పాటు చేసిన పార్కింగ్‌లోకి వచ్చేస్తాయి. ఈ పర్యటన నేపథ్యంలో పాతబస్తీలో వ్యాపారులపై ఎలాంటి ఆంక్షలు విధించట్లేదు. కేవలం రహదారికి అడ్డంగా ఉన్న కొందరు చిరు వ్యాపారులను మాత్రమే తాత్కాలికంగా వేరే ప్రాంతానికి తరలిస్తున్నాం. ఆరాంఘర్ నుంచి ఫలక్‌నుమా ప్యాలెస్ మధ్య మార్గంలో మొత్తం 30 ఫంక్షన్ హాల్స్ ఉన్నాయి. వాటికి ఇప్పటికే నోటీసులు జారీ చేశాం. మంగళవారం సాయంత్రం 6 నుంచి రాత్రి 10.30 గంటల వరకు ప్రధాన రహదారిపైకి ఎలాంటి వాహనాలు అనుమతించవద్దని వాటిలో స్పష్టం చేశాం. దీనికి అవసరమైన బందోబస్తు ఏర్పాట్లు సైతం చేస్తున్నాం. – వి.సత్యనారాయణ, సౌత్‌జోన్ డీసీపీ -
నెట్టింట్లో ఇవాంకా హల్చల్
సాక్షి, హైదరాబాద్: ఇవాంకా ట్రంప్.. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారారు. హైదరాబాద్‌లో మంగళవారం ప్రారంభంకానున్న ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు (జీఈఎస్)లో ఆమె పాల్గొంటున్న నేపథ్యంలో ఫేస్బుక్, ట్వీటర్, వాట్సాప్, ఇన్‌స్ట్రాగామ్‌లలో ఆమె ఫొటోలు, విశేషాలతో పాటు సెటైర్లు వంటివి చక్కర్లు కొడుతున్నాయి. పత్రికలు, మీడియా కూడా ఆమె పర్యటన విశేషాలను, వార్తలను ప్రముఖంగా ప్రచురిస్తుండడంతో.. ఇంటర్నెట్, సామా జిక మాధ్యమాల్లో చర్చలు జరుగు తున్నాయి. ‘రావమ్మా ఇవాంకా..’అంటూ ఆహ్వానిస్తున్న వారితోపాటు.. ఆమె పర్యటనపై సెటైర్లూ వస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇవాంకా రాకపోకలు సాగించే మార్గా లను సుందరీకరిస్తుండ డం, రోడ్లు బాగుచేయి స్తుండడం, కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లపై ఎవరికి తోచిన విధంగా వారు కామెంట్లు చేస్తున్నారు. రాజధానిలో బిచ్చగాళ్లకు పునరావాసం కల్పించే కార్యక్రమం, వీధి కుక్కలను నియంత్రించే ప్రయత్నాల గురించి అయితే చలోక్తులు, విమర్శలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఇవాంకా విందు చేసే ఫలక్‌నుమా ప్యాలెస్‌లోని భారీ టేబుల్ గురించి, ఆమె తినే వంటకాలు, ప్రయాణించే వాహనాల గురించి చిత్ర విచిత్ర చర్చలు జరుగుతున్నాయి. ‘శతాబ్దాల రాతియుగపు సమాధుల నుంచి..’అంటూ ఫేస్బుక్లో వచ్చిన ఓ కవిత అయితే బాగా వైరల్ అయింది. ఈ వంక రావమ్మా... ఇవాంకా! ఇకఇవాంకా తమ ఊరికి రావాలంటూ కొందరు పోస్టు చేస్తున్న ఆన్లైన్ ఆహ్వానాలు ఆసక్తికరంగా ఉంటున్నాయి. వరంగల్‌కు వస్తే ఓరుగల్లు కోట చూపెడతామని, కల్లు తాగిస్తామని ఫేస్బుక్లో పెట్టిన పోస్టింగ్‌కు భారీగా లైకులు, కామెంట్లు రావడం గమనార్హం. హైదరాబాద్‌లోని మణికొండకు రావాలంటూ ఇవాంకాతో వాట్సాప్‌లో డిస్కస్ చేసినట్టు.. ఆమె అంగీకరించినట్టు వచ్చిన మరో వీడియో అంతే వైరల్ అయింది. ఇలా మరెన్నో పోస్టులు వైరల్ అవుతున్నాయి. -
పెట్టుబడుల కోసం కాదు
సాక్షి, హైదరాబాద్: ‘‘ఇది పెట్టుబడిదారుల సమావేశం కాదు. మేం పెట్టుబడులను ఆశించడం లేదు. కొత్త పరిశ్రమల స్థాపన, నూతన ఆవిష్కరణలు, స్టార్టప్‌లకు అత్యుత్తమైన వాతావరణం సృష్టించేందుకు, వేర్వేరు దేశాల ప్రతినిధులు పరస్పరం ఆలోచనలు పంచుకునేందుకు ఈ సదస్సు నిర్వహిస్తున్నాం. అమెరికా నుంచి 400 మంది, మనదేశం నుంచి 500 మంది, మిగతా దేశాల నుంచి మరో 400 మంది ప్రతిభావంతులైన యువ పారిశ్రామికవేత్తలు రానున్నారు. ప్రతిభను ప్రదర్శించి తమకు కావాల్సిన పెట్టుబడులను రాబట్టుకోవడానికి ఈ సదస్సు యువ పారిశ్రామికవేత్తలకు ఉపయోగపడనుంది..’’అని నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ స్పష్టం చేశారు. అంతర్జాతీయ పెట్టుబడిదారుల సదస్సు నిర్వహణ ఏర్పాట్లపై అమెరికా దౌత్యవేత్త కెన్నెత్ జస్టర్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్‌తో కలసి సోమవారమిక్కడ ఆయన విలేకరులతో మాట్లాడారు. జీఈఎస్ నిర్వహణ అవకాశాన్ని రాష్ట్రం పూర్తిగా ప్రతిభ ఆధారంగా దక్కించుకుందని చెప్పారు. సదస్సు నిర్వహణ అవకాశం దక్కించుకోవడానికి 5 రాష్ట్రాలు పోటీపడగా, రెండు రాష్ట్రాలతో ఏర్పాటు చేసిన షార్ట్‌లిస్ట్‌లో తెలంగాణ స్థానం సంపాదించిందన్నారు. చివరకు ప్రతిభ ఆధారంగా సదస్సు నిర్వహణ అవకాశాన్ని దక్కించుకుందని వివరించారు. దేశంలో స్టార్టప్‌లను ప్రోత్సహించేందుకు నిధుల కొరత లేదని అమితాబ్ పేర్కొన్నారు. రెండున్నరేళ్ల కింద స్టార్టప్ ఇండియా ఉద్యమాన్ని ప్రారంభించి రూ.10 వేల కోట్ల నిధి ఏర్పాటు చేశామన్నారు. సరళీకృత వ్యాపారం (ఈవోడీబీ) ర్యాంకింగ్స్‌లో తెలంగాణ అగ్రస్థానాన్ని నిలుపుకుంటోందని కొనియాడారు. హైదరాబాద్ అత్యంత వేగంగా వృద్ధి చెందుతోందని ప్రశంసించారు. ఆయన వెల్లడించిన ఇతర అంశాలివీ.. తొలిరోజు ముగ్గురి ప్రసంగం మంగళవారం సాయంత్రం 4.30 గంటలకు నిర్వహించే జీఈఎస్ ప్రారంభ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం కేసీఆర్, ఇవాంక ప్రసంగిస్తారు. దీంతోపాటు ఇవాంక మరో రెండు చర్చాగోష్ఠుల్లో మాట్లాడతారు. తర్వాత ‘మహిళా పారిశ్రామికవేత్తలకు అవకాశాలు’అంశంపై చర్చాగోష్ఠి ఉంటుంది. ఇందులో ఇవాంక, కేంద్ర రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, ఎస్ఆర్ఎస్ ఏవియేషన్స్ అండ్ పెట్రోలియం ఎండీ సిబోంగైల్ సింబో, ఎస్ఈబీ చైర్మన్ మార్కస్ వాలెన్‌బర్గ్ మాట్లాడతారు. సిస్కో చైర్మన్ జాన్ చాంబర్ దీనికి సమన్వయకర్తగా వ్యవహరిస్తారు. రెండోరోజు షెడ్యూల్ ఇదీ.. ‘మానవ వనరుల వృద్ధిలో మహిళలకు సరైన ప్రాతినిధ్యం’అంశంపై 29న ఉదయం 9 గంటలకు ప్లీనరీ సెషన్ ఉంటుంది. మంత్రి కె.తారకరామారావు సమన్వయకర్తగా వ్యవహరిస్తారు. ఇందులో ఇవాంకతోపాటు బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ భార్య, సామాజిక కార్యకర్త చెర్రీ బ్లెయిర్, ఐసీఐసీఐ బ్యాంక్ ఎండీ, సీఈవో చందా కొచర్, డెల్ ఈఎంసీ చీఫ్ కస్టమర్ ఆఫీసర్ కరేన్ క్వింటోస్‌లు మాట్లాడతారు. మూడోరోజు ఇలా.. ‘మహిళలు విజయం సాధిస్తే అందరూ విజయం సాధించినట్లే..’అంశంపై 30న సాయంత్రం 4 గంటలకు నిర్వహించే చర్చాగోష్ఠికి కేంద్రమంత్రి సురేశ్ ప్రభు సమన్వయకర్తగా వ్యహరిస్తారు. ఇందులో విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ పాల్గొంటారు. ఇతర రాష్ట్రాలకు తెలంగాణ ఓ మోడల్: కెన్నెత్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : నూతన ఆవిష్కరణలకు, ఉపాధి కల్పనకు జీఈఎస్ ఊతమిస్తుందని భారత్‌లో అమెరికా రాయబారి కెన్నెత్ జస్టర్ చెప్పారు. అమెరికాలోని సుమారు 38 రాష్ట్రాల నుంచి ప్రతినిధులు ఇందులో పాల్గొంటున్నారని, ఇంత భారీ స్థాయిలో తమ దేశ బృందం భారత్‌కు రావటం ఇదే ప్రథమం అని వివరించారు. సులభతరంగా వ్యాపారాల నిర్వహణకు అనువైన పరిస్థితులు కల్పిస్తున్న తెలంగాణ ఇతర రాష్ట్రాలకు మోడల్‌గా నిలుస్తోందని వ్యాఖ్యానించారు. హెచ్1బీ వీసాల వివాదంపై మాట్లాడుతూ... ఇవి నిపుణులను, నవకల్పనలను ఆకర్షించేందుకు ఉద్దేశించినవి మాత్రమే తప్ప ప్రత్యేకంగా ఏ ఒక్క దేశాన్నో దృష్టిలో పెట్టుకుని విధానాలు ఉండవన్నారు. సమగ్రమైన వీసా విధానంపై తమ ప్రభుత్వం కసరత్తు చేస్తోందని చెప్పారు. -
జీవితంలో తొలిసారి మోడరేటర్‌గా విధులు
హైదరాబాద్: జీవితంలో తొలిసారి మోడరేటర్‌గా విధులు నిర్వర్తించబోతు న్నానని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు పేర్కొన్నారు. ప్రధానంగా అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతిగాంచిన మహిళా దిగ్గజాలు పాల్గొనే కార్యక్రమంలో మోడరేటర్ విధులను నిర్వహించేందుకు ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. గచ్చిబౌలిలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ)లో నీతి ఆయోగ్, ఫేస్బుక్, ఐఎస్బీ సంయుక్తంగా నిర్వహించిన ‘రోడ్ టూ జీఈఎస్’లో భాగంగా ‘గెట్ ఇన్ ద రింగ్’ కార్యక్రమాన్ని ఆయన సోమవారం రాత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. సొంతంగా ఉన్న ఆలోచనలతోనే పలు కార్యక్రమాల్లో పాల్గొని ప్రసంగాలు చేయడం తనకు అలవాటని, కానీ.. జీఈఎస్ సదస్సులో రెండవ రోజు మోడరేటర్‌గా వ్యవహరించడం కొత్త అనుభూతి ఇస్తుందని ఆయన అన్నారు. ఈ సమ్మిట్‌లో మహిళలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామని, వినూత్న ఆలోచనలతో వ్యాపారాలు ప్రారంభించడానికి మహిళలు ముందుకొస్తే ఉపయుక్తంగా ఉంటుందన్నారు. అనంతరం పలువురు విద్యార్థులు, ఇతరులు రూపొందించిన స్టార్టప్‌లపై తమ ఆలోచనలను గెట్ ఇన్ ద రింగ్ కార్యక్రమంలో పాల్గొని పంచుకున్నారు. తాము ఏర్పాటు చేసిన స్టార్టప్ లక్ష్యాలు, అవి ప్రజలకు ఎంతవరకు ఉపయుక్తంగా ఉంటాయో వివరించారు. కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ శాఖ కార్యదర్శి జయేశ్ రంజన్, కార్యక్రమం జ్యూరీ సభ్యులు వీ వర్క్ ఇండియా కో–జీఎం రియాన్ బెన్నెట్, ఫేస్బుక్ స్ట్రాటజిక్ పార్టనర్ సత్యజిత్ సింగ్, యునైటెడ్ టెక్నాలజీ ఉపాధ్యక్షుడు ప్రకాశ్ బొడ్ల, శ్రీకాంత్ సుందర్రాజన్ తదితరులు పాల్గొన్నారు. -
జీఎస్టీ ప్యానెల్లో మహిళలేరి?
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వస్తు సేవల పన్ను (జీఎస్టీ) అమలు అనేది దేశీయ పన్ను సంస్కరణలల్లో అత్యంత కీలక మలుపుగా పదేపదే చెబుతున్న కేంద్ర ప్రభుత్వం... 31 మంది పాలసీ సభ్యుల్లో కనీసం ఒక్క మహిళకు కూడా చోటు కల్పించలేదని ఇంటెల్ ఇండియా కంట్రీ హెడ్ నివృతి రాయ్ వ్యాఖ్యానించారు. జీఎస్టీ పాలసీ ఎంపిక, వస్తువుల జాబితా, రేట్ల ఖరారు వంటి కీలకాంశాల్లో మహిళలకు ప్రాధాన్యం ఇవ్వలేదన్నారు. ‘‘అందుకే! మహిళలు వాడే శానిటరీ న్యాప్కిన్స్కు 12% జీఎస్టీ శ్లాబును నిర్ణయించి.. పురుషుల షేవింగ్ కిట్స్‌కు మినహాయింపు ఇచ్చారు’’ అని ఘాటుగా వ్యాఖ్యానించారు. యూఎస్–ఇండియా బిజినెస్ కౌన్సిల్ (యూఎస్ఐబీసీ) ఆధ్వర్యంలో ‘ది ఫౌండేషన్ ఆఫ్ ఇన్నోవేషన్స్’ అనే అంశంపై సోమవారమిక్కడ చర్చాగోష్టి జరిగింది. ఇందులో కలారీ క్యాపిటల్ ఎండీ వాణి కోలా, ఇంటెల్ ఇండియా కంట్రీ హెడ్ నివృతి రాయ్, ఐబీఎం ఇండియా చైర్పర్సన్ వనితా నారాయణన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నివృతి రాయ్ మాట్లాడుతూ.. ‘‘మన దేశంలో రాత్రి 8 తర్వాత మహిళలు ఉద్యోగం చేయలేని పరిస్థితి దాపురించింది. స్త్రీకి రక్షణ, భద్రత కరువయ్యాయి. ఎవరి గురించో ఎందుకు!! నన్నే తీసుకోండి. రాత్రి ఆఫీసులో మీటింగ్ లేదా వర్క్ ఉంటే... నాతో పాటు మా ఆయన కూడా ఉదయం మూడు నాలుగింటి వరకూ ఆఫీసు లాబీలో ఎదురు చూస్తుంటారు’’ అని వివరించారు. మహిళలకు రక్షణ కల్పించే దిశగా ప్రభుత్వాలు నడుం బిగించాలని సూచించారు. జీడీపీ వృద్ధిలో మహిళ ప్రాధాన్యత అత్యంత దయనీయంగా ఉందంటూ... ఆవిష్కరణ, ఎంట్రప్రెన్యూర్షిప్, పాలసీ.. ఈ మూడే జాతి స్థితిగతుల్ని మారుస్తాయన్నారు. ప్రస్తుతం దేశీ ఐటీ రంగంలో మహిళా ఉద్యోగుల వాటా 30% వరకూ ఉందని.. అన్ని రంగాల్లోనూ ఇదే జోరును కొనసాగించాలని సూచించారు. విద్యా రంగంలో మహిళల పాత్ర నిల్.. దేశీయ విద్యా రంగంలో మహిళలకు చోటు లేదని ఐబీఎం ఇండియా చైర్పర్సన్ వనితా నారాయణన్ వ్యాఖ్యానించారు. దేశంలోని ఏ ఒక్క ఇంజనీరింగ్ కళాశాల బోర్డులోనూ మహిళా డైరెక్టర్లు లేరన్నారు. అందుకే మహిళలకు విద్యలో ప్రాధాన్యం తగ్గుతోందని.. ఈ రంగంలోనూ మహిళలకు చోటు కల్పించాలని సూచించారు. కలారీ క్యాపిటల్ ఎండీ వాణి కోలా మాట్లాడుతూ.. ఎంచుకున్న రంగంలో లక్ష్యం నిర్దేశించుకొని చేరుకునే దిశగా ఆలోచనలు చేయాలని.. మధ్యలో ఎదురొచ్చే సవాళ్లు, సమస్యలను పట్టించుకోకూడదని పిలుపునిచ్చారు. ‘‘నేను పుట్టి పెరిగింది హైదరాబాద్‌లో. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఇంజనీరింగ్ పూర్తి చేసి.. సిలికాన్ వ్యాలీకి వెళ్లాను. 2006లో తిరిగి ఇండియాకి వచ్చా. 2012లో 150 మిలియన్ డాలర్ల నిధులతో కలారీ క్యాపిటల్‌ను ప్రారంభించా. సాంకేతికత, ఆవిష్కరణకు పెద్ద పీట వేసే స్టార్టప్స్‌లో పెట్టుబడులు పెడుతుంటాం. ఇప్పటివరకు స్నాప్‌డీల్, మింత్ర, అర్బన్ ల్యాడర్, జివామీ వంటి కంపెనీల్లో పెట్టుబడి పెట్టాం’’ అని తెలిపారు. కార్యక్రమంలో గర్ల్ రైజింగ్ ప్రొడ్యూసర్ అమితా వ్యాస్, యూఎస్ఐబీసీ ప్రెసిడెంట్ నిషా బిస్వాల్ పాల్గొన్నారు. -
చంద్రబాబు విశ్వప్రయత్నాలు విఫలం!
సాక్షి, అమరావతి : అమెరికా అధ్యక్ష తనయ, సలహాదారు ఇవాంకా ట్రంప్‌ను ఆంధ్రప్రదేశ్(ఏపీ)కు రప్పించేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన విశ్వప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. హైదరాబాద్‌లో గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూయర్ షిప్ సమ్మిట్ (జీఈఎస్)కు హాజరవుతున్న ఇవాంకాను ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించేలా చేసేందుకు ప్రభుత్వం యత్నించినట్లు ఓ ప్రభుత్వ అధికారి తెలిపారు. ఇందుకోసం ఆంధ్రప్రదేశ్ ఎకానమిక్ డెవలప్మెంట్ బోర్డు(ఈడీబీ) ముఖ్య కార్యదర్శి జే కృష్ణ కిషోర్ అమెరికా ప్రభుత్వంతో చర్చలు జరిపారు. ఇవాంకా ఆంధ్రప్రదేశ్‌లో పర్యటిస్తే అమరావతి లేదా విశాఖపట్నంలో ప్రత్యేక ఈవెంట్‌ను కూడా నిర్వహిస్తామని అమెరికా కాన్సులేట్‌కు చెప్పారు. అయితే, ఇందుకు అమెరికా ప్రభుత్వం ససేమీరా అంది. జీఈఎస్ మినహా ఇవాంకా మరెక్కడా పర్యటించబోరని తేల్చి చెప్పింది. దీంతో 'బ్రాండ్' బిల్డింగ్ చేసుకోవాలనుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి భంగపాటు ఎదురైంది. అమెరికా అధ్యక్షుడి కుమార్తె ఏపీలో పర్యటిస్తే అమెరికన్ కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తాయని రాష్ట్ర ప్రభుత్వం ఆశించింది. కాగా, గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూయర్ షిప్ సమ్మిట్ - 2017 మంగళవారం హైదరాబాద్‌లో ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. -
సుడిగాలి పర్యటనకు కౌంట్‌డౌన్ స్టార్ట్
సాక్షి, హైదరాబాద్ : గ్లోబల్ ఎంటర్‌ప్రిన్యూయర్ షిప్(జీఈఎస్) సదస్సుకు కౌంట్‌డౌన్ స్టార్ట్ అయింది. మరికొద్ది గంటల్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె, సలహాదారు ఇవాంకా ట్రంప్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా పలువురు కేంద్ర మంత్రులు, వివిధ దేశాల ప్రతినిధులు భాగ్యనగరానికి చేరుకోనున్నారు. ప్రముఖుల సుడిగాలి పర్యటనకు సంబంధించిన ఫ్యాక్ట్ పాయింట్స్ మీ కోసం.. సుడిగాలి పర్యటన ఇలా.. మంగళవారం మధ్యాహ్నం 01.10 నిమిషాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్‌లోని బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో మియాపూర్ మెట్రో స్టేషన్‌కు వెళ్తారు. మధ్యాహ్నం 02.15 నిమిషాలకు మెట్రో రైల్‌ను ప్రారంభిస్తారు. మియాపూర్ నుంచి కూకట్పల్లి వరకూ మెట్రోలో ప్రధాని మోదీ ప్రయాణిస్తారు. మధ్యాహ్నం 02.45 నిమిషాలకు అక్కడి నుంచి హెలికాప్టర్లో హెచ్ఐసీసీకి బయల్దేరుతారు. మధ్యాహ్నం 03.35 నిమిషాలకు ఇవాంకా ట్రంప్‌తో 20 నిమిషాల పాటు భేటీ అవుతారు. సాయంత్రం నాలుగు గంటలకు ఇండియన్ ఎడ్జ్ ఎగ్జిబిషన్‌ను ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. సాయంత్రం 04.40 నిమిషాలకు తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ప్రసంగిస్తారు. సాయంత్రం 04.43 నిమిషాలకు జీఈఎస్ సదస్సును మోదీ ఆరంభిస్తారు. సాయంత్రం 04.45 నిమిషాలకు ఇవాంకా ట్రంప్ ప్రసంగం ఉంటుంది. సాయంత్రం 04.50 నిమిషాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగిస్తారు. సాయంత్రం 05.10 నిమిషాలకు విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ముగింపు ప్రసంగం చేస్తారు. సాయంత్రం 05.30 గంటలకు హెచ్ఐసీసీలో మహిళా పారిశ్రామికవేత్తలతో ప్రధానమంత్రి భేటీ అవుతారు. సాయంత్రం 06.00 గంటల నుంచి దేశ, విదేశాలకు సంబంధించిన ప్రముఖ పారిశ్రామికవేత్తలతో ప్రధాని ముఖాముఖి మాట్లాడతారు. రాత్రి 07.00 గంటలకు ప్రధానమంత్రి రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొంటారు. రాత్రి 07.30 గంటలకు హెచ్ఐసీసీ నుంచి ప్రధానమంత్రి ఫలక్‌నూమా ప్యాలెస్‌కు వెళ్తారు. రాత్రి 08.00 గంటలకు ప్యాలెస్‌లో ఇవాంకా, ప్రధానమంత్రి మోదీ, జీఈఎస్ ప్రతినిధులతో కలసి విందు చేస్తారు. -
'ఆవిష్కరణలు, ఉపాధి కల్పనలపై చర్చ'
న్యూఢిల్లీ : మహిళలు ఆర్థిక సాధికారత సాధించాలనేది గ్లోబల్ ఎంటర్‌ప్రిన్యూయర్ షిప్(జీఈఎస్) సదస్సు ముఖ్య ఉద్దేశం అని నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ అన్నారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. హైదరాబాద్‌లో ఈ నెల 28 నుంచి 30 వరకు సదస్సు జరుగుతుందన్నారు. అమెరికా, భారత్ సంయుక్తంగా జీఈఎస్‌ను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. సదస్సులో ఇవాంకా ట్రంప్ పాల్గొంటున్నారని తెలిపారు. ఆవిష్కరణలు, ఉపాధి కల్పన కఠిన సవాళ్లపై జీఈఎస్‌లో చర్చ జరుగుతుందన్నారు. తొలి రోజు సదస్సులో గవర్నర్ నరసింహన్, కేంద్రమంత్రులు సుష్మాస్వరాజ్, నిర్మలా సీతారామన్ పాల్గొంటారని వెల్లడించారు. 150కి పైగా దేశాల నుంచి 1500 మంది పారిశ్రామికవేత్తలు హాజరవుతారన్నారు. మహిళలు పారిశ్రామిక రంగంలో పురోగాభివృద్ధి సాధించేందుకు కృషి చేయనున్నట్లు తెలిపారు. -
దోమలు.. కనిపిస్తే కాల్చివేత..!
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు(జీఈఎస్)కు హాజరయ్యే అతిథులు, ప్రముఖులు, పారిశ్రామికవేత్తలకు రాష్ట్ర ప్రభుత్వం అధికారిక విందు ఇవ్వనున్న గోల్కొండ కోట సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. విందు నాటికి గోల్కొండ కోటలో ఒక్క దోమ కూడా లేకుండా జీహెచ్ఎంసీ ఎంటమాలజీ విభాగం దోమల నిర్మూలన చర్యల్ని ముమ్మరం చేసింది. దోమల నిర్మూలనలో భాగంగా ఇప్పటి వరకూ ఫాగింగ్, స్ప్రేయింగ్‌లకు శక్తిమంతమైన అల్ఫా సైపర్ మెథ్రిన్, సిఫనోథ్రిన్‌తోపాటు పొగ రాకుండా పైరిథ్రమ్‌ను వాడుతున్న సిబ్బంది.. తాజాగా పరిమళాలు వెదజల్లే సిట్రనెల్లా ఆయిల్, డెల్టా మిథిలీన్ లిక్విడ్లను స్ప్రే చేస్తున్నారు. వీటివల్ల దోమల నిర్మూలనే కాకుండా పరిసరాల్లో సువాసనలు వెదజల్లుతాయి. మస్కిటో రెపెల్లెంట్స్ గానూ పనిచేస్తుండంతో వీటిని వినియోగిస్తున్నారు. ఈ పనులకుగానూ 4 డ్యూరోటెక్ మెషీన్లు, 8 పవర్ స్ప్రేయర్లు, 8 మొబైల్ మెషీన్లను వాడుతున్నారు. పరీక్షలతో దోమల లెక్క.. దోమల నిర్మూలనకు చేపట్టిన చర్యలతో పాటు ఏరోజుకారోజు ప్రత్యేకంగా మస్కిటో డెన్సిటీ అధ్యయనం చేస్తున్నారు. ఇందుకు గానూ గోడలపై సక్షన్ ట్యూబ్‌లను ఉంచి గాలి గుంజుతారు. దీంతో పరిసరాల్లోని దోమలు ట్యూబ్‌లోకి వస్తాయి. వాటిని టెస్ట్‌ట్యూబ్‌లోకి పంపి లెక్కిస్తారు. బుధవారం విందు సమయానికి ఒక్క దోమా లేకుండా చేసేందుకు ఈ పరీక్షలు నిర్వహిస్తూ అందుకు అనుగుణంగా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. సాయంత్రం.. చీకటి పడ్డ తర్వాత ఇలా రోజుకు రెండు పర్యాయాలు ఈ పరీక్షలు చేస్తున్నారు. గోల్కొండ కోటలో పరీక్షల్లో ఐదు రోజుల క్రితం గంటకు 200 దోమలు ఉండగా.. శనివారం నాటికి 40కి తగ్గాయి. సోమవారం వరకు వీటిని జీరో చేసే లక్ష్యంతో అధికారులు పనిచేస్తున్నారు. సాధారణంగా చీకటి పడిన తర్వాత గోల్కొండ కోటలోకి దోమలు ఎక్కువగా వస్తాయని, అయితే తాము చేపట్టిన చర్యలతో శని, ఆదివారాల్లో దోమలు చాలా వరకు తగ్గిపోయాయని జీహెచ్ఎంసీ చీఫ్ ఎంటమాలజిస్ట్ వి.వెంకటేశ్ ‘సాక్షి’కి తెలిపారు. గోల్కొండ కోట పరిసరాల్లో దోమల లార్వా వ్యాప్తికి కారణమవుతున్న గుర్రపుడెక్కను తొలగించారు. శాతం చెరువు, హుడా తలాబ్, టిప్పుఖాన్ బ్రిడ్జి తదితర ప్రాంతాల్లోనూ గుర్రపుడెక్క తొలగించినట్లు సీనియర్ ఎంటమాలజిస్ట్ లచ్చిరెడ్డి తెలిపారు. విందురోజు ప్రత్యేక అగర్బత్తీలు.. ఇప్పటికే పరిమళాలు వెదజల్లే లిక్విడ్స్‌తో స్ప్రేయింగ్ పనులు చేస్తుండగా విందురోజు ప్రత్యేక పరిమళాలతోపాటు దోమలను దరి చేరకుండా చేసే లెమన్‌గ్రాస్‌తో తయారు చేసిన ప్రత్యేక అగర్బత్తీలను గోల్కొండ కోటలో వినియోగించనున్నారు. లెమన్ గ్రాస్.. దోమల రెపెల్లెంటే కాక సుగంధం వెదజల్లడంతో సదరు అగర్బత్తీలను నాందేడ్ నుంచి తెప్పిస్తున్నారు. -
రెండు చోట్లే ఇవాంకా పర్యటన
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు(జీఈఎస్)కు విశిష్ట అతిథిగా వస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె, సలహాదారు ఇవాంకా ట్రంప్ హైదరాబాద్‌లో హెచ్ఐసీసీ, ఫలక్‌నుమా రెండు చోట్ల మాత్రమే పర్యటించే అవకాశం ఉందని డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి వెల్లడించారు. అమెరికా అధికారుల నుంచి వచ్చిన అధికారిక సమాచారం ప్రకారం ఆమె షెడ్యూల్లో మరో ప్రాంతం లేదన్నారు. ప్రధాని మోదీ, ఇవాంకా రాక, జీఈఎస్ సదస్సు, అధికారిక విందుల నేపథ్యంలో అందుకు అవసరమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని డీజీపీ ఆదివారం విలేకరుల సమావేశంలో తెలిపారు. ఆయన తెలిపిన వివరాలివీ.. ఆ ఇద్దరి పర్యటనలూ ఇలా.. ఇవాంకా మంగళవారం ఉదయం శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి వెస్టిన్ హోటల్‌కు వెళ్లడంతో పాటు హెచ్ఐసీసీలో జరిగే జీఈఎస్‌లో పాల్గొంటారు. అనంతరం తాజ్ ఫలక్‌నుమాలో విందుకు హాజరవుతారు. ప్రధాని మోదీ మంగళవారం మధ్యాహ్నం బేగంపేట విమానాశ్రయంలో దిగుతారు. అక్కడ బీజేపీ నేతలకు సంబంధించిన కార్యక్రమంలో పాల్గొని మియాపూర్ వెళ్లి మెట్రో రైలును ప్రారంభిస్తారు. అక్కడి నుంచి జీఈఎస్‌కు.. ఆపై ఫలక్‌నుమాకు వెళ్తారు. విందు ముగిసిన తర్వాత అదే రోజు రాత్రి శంషాబాద్ నుంచి తిరిగి వెళ్తారు. ఇవాంకా మాత్రం బుధవారం సాయంత్రం వరకు నగరంలోనే ఉంటారు. ఈ కార్యక్రమాలకు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. వివిధ విభాగాల నుంచి 10,400 మంది పోలీసుల్ని కేటాయించారు. ఎక్కడికక్కడ కంట్రోల్ రూమ్స్.. జీఈఎస్‌కు సంబంధించిన ప్రధాన కంట్రోల్ రూమ్‌ను హెచ్ఐసీసీలో సైబరాబాద్ పోలీసుల అధీనంలో ఏర్పాటు చేస్తున్నారు. శంషాబాద్, బేగంపేట విమానాశ్రయాలు, ఫలక్‌నుమాల్లోనూ కంట్రోల్ రూమ్స్ ఉండనున్నాయి. వీటన్నింటినీ అనుసంధానిస్తూ డీజీపీ కార్యాలయంలో కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ పనిచేస్తుంది. మరోవైపు సామాన్యులకు ఇబ్బందులు లేకుండా ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకూడదనే ఉద్దేశంతో పీవీ ఎక్స్‌ప్రెస్‌వే, ఓఆర్‌ఆర్‌లను ఎక్కువగా వినియోగించనున్నారు. ప్రధానికి సంబంధించి ఫలక్‌నుమా, శంషాబాద్ విమానాశ్రయం తప్ప మిగతా టూర్ అంతా హెలికాప్ట్టర్‌లో జరుగుతుంది. ఆయా చోట్లకు రోడ్డు మార్గంలో వెళ్లే ప్రముఖులూ ఉండటంతో ట్రాఫిక్‌కు సంబంధించి నోటిఫికేషన్లు జారీ చేయనున్నారు.