హైదరాబాద్‌పై అమెరికన్‌ శాటిలైట్‌ నిఘా | amid Ivanka tour, American satellite intelligence on Hyderabad | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌పై అమెరికన్‌ శాటిలైట్‌ నిఘా

Published Wed, Nov 22 2017 10:52 PM | Last Updated on Tue, Sep 4 2018 5:32 PM

amid Ivanka tour, American satellite intelligence on Hyderabad - Sakshi - Sakshi - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : అమెరికాకు చెందిన ప్రత్యేక నిఘా ఉపగ్రహం హైదరాబాద్‌ నగరాన్ని ప్రతీక్షణం పర్యవేక్షిస్తోంది. ఆ దేశాధ్యక్షుడి కుమార్తె, సలహాదారు ఇవాంక ట్రంప్‌ పర్యటన ముగిసే వరకు దీని నిఘా కొనసాగనుంది. యూఎస్‌ సీక్రెట్‌ సర్వీస్‌ (ఎస్‌ఎస్‌) ఏజెంట్లు ఆ శాటిలైట్‌ అందించే చిత్రాలను విశ్లేషించడానికి వెస్టిన్‌ హోటల్‌లో ప్రత్యేకంగా కమాండ్‌ పోస్ట్‌ ఏర్పాటు చేస్తున్నారు. హెచ్‌ఐసీసీలో జరగనున్న అంతర్జాతీయ పారిశ్రామికవేత్తల సదస్సుకు ఇవాంక, ప్రధాన నరేంద్రమోదీ రానున్న నేపథ్యంలో అమెరికన్‌ సీక్రెట్‌ సర్వీస్‌తో పాటు ప్రధాని భద్రతను పర్యవేక్షించే స్పెషల్‌ ప్రొటెక్షన్‌ గ్రూప్‌ (ఎస్పీజీ) కనీవినీ ఎరుగని స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నాయి. గురు–శుక్రవారాల్లో ఉమ్మడి అడ్వాన్డŠస్‌ సెక్యూరిటీ లైజన్‌ (ఏఎస్‌ఎల్‌) నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నాయి.

ప్రత్యేక శాటిలైట్‌...
అమెరికాకు చెందిన అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’ ఆ దేశ భద్రతావసరాల కోసం ప్రత్యేకంగా ఓ శాటిలైట్‌ను ప్రయోగించింది. అక్కడి హోంల్యాండ్‌ సెక్యూరిటీ ఆధీనంలో ఈ ఉపగ్రహం పని చేస్తుంటుంది. ఇవాంక పర్యటన నేపథ్యంలో ప్రస్తుతం ఈ ఉపగ్రహాన్ని హైదరాబాద్‌ వైపు మళ్ళిం చారు. ప్రధానంగా ఇవాంక బస చేసే వెస్టిన్‌ హోటల్, హెచ్‌ఐసీసీ ఉన్న మాదాపూర్, అధికారిక విందు జరిగే ఫలక్‌నుమా ప్యాలెస్‌లతో పాటు ఆ చుట్ట పక్కల పది కిలోమీటర్ల పరిధిలో ఈ ఉపగ్రహం ప్రత్యేక నిఘా వేసి ఉంచుతుంది. హై రిజల్యూషన్‌ కెమెరాలతో ఫొటోలు తీయడం దీని ప్రత్యేకత. వీటిని ఎప్పటికప్పుడు విశ్లేషించేందుకు ఇవాంకకు భద్రత కల్పించే యూఎస్‌ సీక్రెట్‌ సర్వీస్‌ ఏజెంట్లు వెస్టిన్‌ హోటల్‌లో ప్రత్యేకంగా కమాండ్‌ పోస్ట్‌ ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఛాయాచిత్రాలను అమెరికాలోని హోంల్యాండ్‌ సెక్యూరిటీ ప్రధాన కేంద్రం నుంచీ విశ్లేషించనున్నారు.  

నగరానికి చేరుకున్న ఇవాంకా  కాన్వాయ్‌...
ఇవాంక ట్రంప్‌ కాన్వాయ్‌లో వినియోగిం చడానికి ప్రత్యేకంగా నాలుగు వాహనాలను సీక్రెట్‌ సర్వీస్‌ ఏజెంట్లు హైదరాబాద్‌ తీసుకువచ్చారు. ఇవాంక ప్రయాణించే ప్రత్యేక కారు, కమ్యూనికేషన్, నిఘా తదితర ఎలక్ట్రానిక్‌ ఉపకరణాలతో కూడా మరో వాహనం సిటీకి చేరుకున్నాయి. ఇవాంక వాహనం వెనుక ఉండే ఫస్ట్‌ ఎస్కార్ట్, సెకండ్‌ ఎస్కార్ట్‌ వాహనాలను ఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం నుంచి తీసుకువచ్చారు. ప్రస్తుతం ఈ నాలుగు వాహనాలు ఎస్‌ఎస్‌ ఏజెంట్ల పర్యవేక్షణలో ఓ రహస్య ప్రాంతం లో దాచి ఉంచారని తెలిసింది. ఇవాంక వినియోగించే కారు మైన్‌ప్రూఫ్‌ మాత్రమే కాదని.. అనుధార్మికత ఉన్న ఆయుధాల దాడుల్నీ తట్టుకుంటుందని అధికారులు చెప్తున్నారు. ఈ వాహనంతో ఓ చిన్నస్థాయి యుద్ధం పూర్తి చేయవచ్చని అభిప్రాయపడ్డారు.

11 రకాలైన ఆయుధాలకు వెపన్స్‌ పర్మిట్‌...
అమెరికన్‌ సీక్రెట్‌ సర్వీస్‌ ఏజెంట్లు భద్రతలో భాగంగా వినియోగించే ఆయుధాలను కూడా తమ వెంట తెచ్చుకుంటున్నారు. ఇప్పటికే 11 రకాలైన ఆయుధాలను తీసుకు రావడానికి అవసరమైన వెపన్స్‌ పర్మిట్‌ను కేంద్రం వారికి జారీ చేసింది. వీటిలో పిస్ట ల్స్, సబ్‌–మెషీన్‌గన్స్‌తో పాటు స్నైపర్‌ రైఫిల్స్‌ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఇవాంక బస చేయనున్న వెస్టిన్‌ హోటల్‌లో మూడు అంతస్తులు ఎస్‌ఎస్‌ ఏజెంట్ల ఆధీనంలో ఉండనున్నాయి. ఇవాంక బస చేసిన అంత స్తుతో పాటు పైన, కింద ఉన్న రెండింటినీ, ఓ లిఫ్ట్, మెట్లదారుల్ని పూర్తిగా ఎస్‌ఎస్‌ ఏజెంట్లు తమ ఆధీనంలోకి తీసుకుంటు న్నారు. ఇవాంక హెచ్‌ఐసీసీలో జరిగే సద స్సుకు, తాజ్‌ ఫలక్‌నుమలో జరిగే విందుకు హాజరయ్యే కార్యక్రమాలు ఇప్పటికే ఖరారయ్యాయి. ఆమె చార్మినార్, గోల్కొండ పర్యటనలపై హోంల్యాండ్‌ సెక్యూరిటీ డిపార్ట్‌మెంట్‌ నుంచి క్లియరెన్స్‌ రాలేదని తెలిసింది. ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో పర్యటించిన సీక్రెట్‌ సర్వీస్‌ ఏజెంట్లు, కాన్సులేట్‌ అధికారులు హోంల్యాండ్‌ సెక్యూరిటీని నివేదిక అందించారు.

వేగంగా సాగుతున్న సెక్యూరిటీ  వెట్టింగ్‌...
ఇవాంకతో పాటు ఇతర ప్రముఖులు బస చేసే హోటల్, సదస్సు జరిగే హెచ్‌ఐసీసీ, విందు జరుగనున్న తాజ్‌ ఫలక్‌నుమాల వద్ద సెక్యూరిటీ వెట్టింగ్‌ ప్రక్రియ వేగంగా సాగు తోంది. ఆయా ప్రాంతాల్లో పని చేసే ఉద్యో గులు, బస చేస్తున్న, చేయనున్న వారు, చుట్టు పక్కల నివసించే, కార్యాలయాల్లో పని చేసే ఉద్యోగుల పూర్తి వివరాలను ఎస్‌ఎస్‌ ఏజెంట్లు సేకరించారు. వీటిని కేంద్ర నిఘా వర్గాలతో కలసి విశ్లేషిస్తున్నారు. అను మానాస్పద, అభ్యంతరకర నేపథ్యం, గతం ఉన్న వారిని గుర్తించడం కోసం చేపట్టే ఈ ప్రక్రియను సెక్యూరిటీ వెట్టింగ్‌గా పిలుస్తా రు. ఇది పూర్తయిన తర్వాతే ఆయా ప్రాంతా ల్లో ఏఏ ఉద్యోగులు విధులు నిర్వర్తించాలో ఖరారు చేసి వారికీ గుర్తింపుకార్డులు జారీ చేయనున్నారు. ఇవాంకను కలిసే అతిథు లతో పాటు ఆమెకు అందించే బహుమతల పైనా కొన్ని ఆంక్షలు ఉన్నాయి.

పోలీసులకూ ఐడీ కార్డులు...
ఇవాంక పర్యటనకు ఎస్‌ఎస్‌ అధికారులు, ఎస్పీజీ బలగాలు మొత్తం ఐదంచెల భద్రతను ఏర్పాటు చేస్తున్నాయి. తొలి రెండు అంచెల్లో ఎస్‌ఎస్‌ ఏజెంట్లు, ఎఫ్‌బీఐ అధికారులు ఉంటారని తెలిసింది. మూడు, నాలుగు అంచెలు ఎస్పీజీ, కేంద్ర నిఘా వర్గాల ఆధీనంలో ఉండనున్నాయి. స్థానిక పోలీసులు ఐదో అంచెలో ఉండే అవకాశం ఉందని సమాచారం. ఇలా విధులు నిర్వర్తించే అధికారులకూ అమెరికన్‌ ఎస్‌ఎస్‌ ఏజెంట్ల ప్రత్యేక గుర్తింపుకార్డులు జారీ చేయనున్నారు. వీటి కేటగిరీని బట్టి నిర్ణీత ప్రాంతాలకే అనుమతిస్తారని ఓ అధికారి వ్యాఖ్యానించారు.

చిరు వ్యాపారిపై ‘ఇవాంకా’ పిడుగు!
ఇవాంకా పర్యటన ‘ఎఫెక్ట్‌’చిరు వ్యాపారులపైనా పడింది. భద్రతా ఏర్పాట్లలో భాగంగా ఆమె పర్యటించే ప్రాంతాల్లోని చిరు వ్యాపారాలను అధికారులు మూసివేయిస్తున్నారు. సదస్సు జరిగే మాదాపూర్‌ ప్రాంతంతోపాటు ఇవాంకా బస చేసే వెస్టిన్‌ హోటల్, విందుకు హాజరయ్యే ఫలక్‌నుమా ప్యాలెస్‌ల వద్ద పోలీసులు ఆంక్షలు పెడుతున్నారు. వెస్టిన్‌ హోటల్‌ సమీపంలో చిరు వ్యాపారాలను ఇప్పటికే మూసేయించారు. ఆ చుట్టుపక్కల ప్రాంతాలైన ఖానామెట్, ఇజ్జత్‌నగర్‌లోని చిరు వ్యాపారాలను కూడా సదస్సు జరిగే మూడు రోజుల పాటు మూసేయాలని ఆదేశించారు. అక్కడి స్థానికులు కూడా బయటకు వెళ్లాలన్నా, ఇంటికి రావాలన్నా కచ్చితంగా గుర్తింపు కార్డు చూపాలనే షరతు వి«ధించారు.

హెచ్‌ఐసీసీలోకి ప్రవేశించే న్యాక్‌ ప్రధాన ద్వారం ముందు రోడ్డుకు ఇరువైపులా వ్యాపార సముదాయాలను సదస్సు జరిగే మూడు రోజుల పాటు మూసివేయాలని మాదాపూర్‌ పోలీసులు ఆదేశించారు. హైటెక్స్‌ కమాన్‌ నుంచి న్యాక్‌ గేట్‌ వరకు రెండు వైపులా, సైబర్‌టవర్స్‌ నుంచి కొత్తగూడ జంక్షన్‌ వరకు రెండు వైపులా, కొత్తగూడ నుంచి గచ్చిబౌలి ఔటర్‌ జంక్షన్‌ వరకు రెండు వైపులా చిన్న హోటళ్లు, పాన్‌ షాపులు, పండ్ల దుకాణాలు, మెకానిక్‌ షాపులను పూర్తిగా తొలగించారు. ఇక పలు చోట్ల రహదారులను కూడా మూసివేయనున్నారు. ఇజ్జత్‌నగర్, ఖానామెట్, ఇజ్జత్‌నగర్‌ వీకర్‌ సెక్షన్‌లలో ఉండే వాహనదారులకు పోలీసులు పాసులు జారీ చేయనున్నారు. ఆ పాసులున్న వాహనాలను మాత్రమే హైటెక్స్‌ కమాన్‌ నుంచి లోపలికి అనుమతిస్తారు.

ఇవాంక మార్వెల్‌ సెక్యూరిటీ..
అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన ప్రతి వ్యక్తి, తన కుటుంబ సభ్యులు ఏర్పాటు చేసుకునే భద్రతా బలగానికి ప్రత్యేకమైన పేర్లు పెట్టుకుంటారు. ట్రంప్‌ తన సెక్యూరిటీ యూనిట్‌కు మొగల్‌గా నామకరణం చేసుకున్నాడు. అలాగే ఇవాం క మార్వెల్‌గా తన సీక్రెట్‌ సర్వీసెస్‌ బృందా నికి పేరు పెట్టుకుంది. మెలానియా ట్రంప్‌ ముసెగా, ఎరిక్‌ ట్రంప్‌ మార్క్స్‌మ్యాన్‌గా పేర్లు పెట్టుకున్నారు. ఇవాంక ట్రంప్‌ సెక్యూరిటీలో హైదరాబాద్‌కు మొత్తం 36 మంది భద్రతాధికా రులు వస్తున్నారు. వీరిలో బయట విధుల్లో 18 మంది సీక్రెట్‌ సర్వీసెస్‌ భద్రతాధికారులు ఉండ గా, డెలిగేట్ల రూపంలో మరో 18 మంది సదస్సులో వివిధ ప్రాంతాల్లో నిమగ్నం కానున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement