
నీతిఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్(ఫైల్ ఫొటో)
న్యూఢిల్లీ : మహిళలు ఆర్థిక సాధికారత సాధించాలనేది గ్లోబల్ ఎంటర్‌ప్రిన్యూయర్ షిప్(జీఈఎస్) సదస్సు ముఖ్య ఉద్దేశం అని నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ అన్నారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. హైదరాబాద్‌లో ఈ నెల 28 నుంచి 30 వరకు సదస్సు జరుగుతుందన్నారు. అమెరికా, భారత్ సంయుక్తంగా జీఈఎస్‌ను నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
సదస్సులో ఇవాంకా ట్రంప్ పాల్గొంటున్నారని తెలిపారు. ఆవిష్కరణలు, ఉపాధి కల్పన కఠిన సవాళ్లపై జీఈఎస్‌లో చర్చ జరుగుతుందన్నారు. తొలి రోజు సదస్సులో గవర్నర్ నరసింహన్, కేంద్రమంత్రులు సుష్మాస్వరాజ్, నిర్మలా సీతారామన్ పాల్గొంటారని వెల్లడించారు. 150కి పైగా దేశాల నుంచి 1500 మంది పారిశ్రామికవేత్తలు హాజరవుతారన్నారు. మహిళలు పారిశ్రామిక రంగంలో పురోగాభివృద్ధి సాధించేందుకు కృషి చేయనున్నట్లు తెలిపారు.