Amitabh Kant
-
రానున్న దశాబ్దంలో భారత్‌దే హవా!
న్యూఢిల్లీ: భారతదేశం ప్రపంచవ్యాప్తంగా మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవించనున్న నేపథ్యంలో వచ్చే దశాబ్దంలో ప్రపంచ ఆర్థిక వృద్ధిలో 20 శాతం వాటను కలిగి ఉంటుందని జీ20 షెర్పా అమితాబ్ కాంత్ పేర్కొన్నారు. ఇక్కడ జరిగిన ఏఐఎంఏ సదస్సులో ఆయన మాట్లాడుతూ, భారతదేశం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న పెద్ద ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతోందని, ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉందని పేర్కొన్నారు. రాబోయే మూడు సంవత్సరాలలో భారత్ ఎకానమీ జపాన్, జర్మనీలను అధిగమించి ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందన్న భరోసాను ఇచ్చారు. ప్రపంచ ఎకానమీకి భారత్ ఛోదక శక్తిగా ఆవిర్భవిస్తోందని పేర్కొన్నారు. ‘‘ఈ రోజు మనం చూస్తున్నది ఆర్థిక వ్యవస్థకు సంబంధించి ఒక తరానికి ఒకసారి జరిగే మార్పు. కొన్ని సంవత్సరాల క్రితం భారత్ బలహీనమైన ఐదు దేశాల్లో ఉంది. బలహీనమైన ఐదు నుంచి ఒక దశాబ్దంలో మొదటి ఐదు స్థానాలకు చేరుకున్నాము’’అని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. గ్రామీణుల జీవన ప్రమాణాలు పెరగాలి.. మూడు దశాబ్దాల్లో 9–10 శాతం వృద్ధి సాధించి, 2047 నాటికి దేశం అభివృద్ధి చెందిన దేశంగా మారడానికి గ్రామీణ ప్రాంతాల్లో నివసించే ప్రజల జీవితాలను మార్చాలని, ఆరోగ్య రంగం మెరుగుపడాలని, పోషకాహార ప్రమాణాలు పెరగాలని అమితాబ్ కాంత్ ఉద్ఘాటించారు. భవిష్యత్ వృద్ధిని సాధించడానికి భారత్‌లో రాష్ట్రాల పాత్ర కీలకమని అన్నారు. ‘‘అంటే దేశ జనాభాలో దాదాపు 50 శాతం ఉన్న బీహార్, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ వంటి అనేక రాష్ట్రాలు పరివర్తన చెందాల్సిన అవసరం ఉంది’’ అని ఈ వివరించారు. ‘‘మనం వాటిని మార్చడం చాలా క్లిష్టమైనది. ఎన్ని అవరోధాలు ఎదురయినప్పటికీ, ఆయా రాష్ట్రాలు మానవ అభివృద్ధి సూచికలో మెరుగుదలకు కీలకమైన ఛోదక శక్తిగా మారడం చాలా ముఖ్యం’’ అని కాంత్ అన్నారు. భారతదేశ జనాభాలో 50 శాతం మంది వృద్ధిని సృష్టిలో కీలకపాత్ర పోషిస్తున్నారని అన్నారు. అయితే దిగువ 50 శాతం మంది ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో జీవిస్తున్నారని పేర్కొన్నారు. ప్రాథమిక జీవన ప్రమాణాలను సాధించడానికి వ్యవసాయ కూలీ లేదా ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ఆధారపడుతున్నారని ఆయన తెలిపారు.ఈ ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడం చాలా ముఖ్యమని ఆయన ఉద్ఘాటించారు. అభివృద్ధి చెందిన దేశమంటే... ప్రస్తుతం భారత్ తలసరి ఆదాయం దాదాపు 2,300 డాలర్లు. 2031 ఆర్థిక సంవత్సరం భారత్ తలసరి ఆదాయం 4,500 డాలర్లకు పెరగాలన్నది లక్ష్యం. ఇదే జరిగితే దేశం ఎగువ మధ్య–ఆదాయ దేశాల క్లబ్లో ప్రవేశిస్తుంది. ప్రస్తుతం అనుసరిస్తున్న ఆర్థిక సూత్రాల ప్రకారం... తలసరి ఆదాయం 1,036 డాలర్ల నుంచి 4,045 డాలర్ల మధ్య ఉన్న దేశాన్ని దిగువ మధ్య తరగతి ఆదాయ దేశంగా పరిగణిస్తారు. 4046 డాలర్ల నుంచి 12,535 డాలర్ల మధ్య ఆదాయ దేశాలను ఎగువ మధ్య తరగతి ఆదాయ దేశాలుగా పేర్కొంటారు. ఆ స్థాయి ఆదాయం దాటితే అది అభివృద్ధి చెందిన దేశంగా మారుతుంది. -
ఏఐ విప్లవంలో పాల్గొనడం కాదు.. నేతృత్వం వహించాలి
న్యూఢిల్లీ: కృత్రిమ మేధ (ఏఐ) విప్లవంలో భారత్ కేవలం పాల్గొనడం మాత్రమే కాదని, దీనికి నేతృత్వం వహించాలని దేశ జీ20 షెర్పా అమితాబ్ కాంత్ పిలుపునిచ్చారు. ఈ విషయంలో దేశాన్ని ప్రపంచ వేదికపైకి తీసుకురావడానికి తన సాంకేతిక శక్తి సామర్థ్యాలను సమీకరించాలని ఇక్కడ జరిగిన గ్లోబల్ ఇండియాఏఐ సదస్సులో ఆయన అన్నారు. ఇండస్ట్రీ ప్రాతినిధ్య సంస్థ– నాస్కామ్‌ను ఉటంకిస్తూ, 70 శాతం భారతీయ స్టార్టప్‌లు తమ వృద్ధిని పెంచుకోవడానికి ఏఐకి ప్రాధాన్యత ఇస్తున్న విషయాన్ని కాంత్ ప్రస్తావిస్తూ, తద్వారా స్టార్టప్ ఎకోసిస్టమ్‌లో ఏఐ కీలక పాత్ర పోషిస్తోందన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఏఐ ప్రాజెక్ట్‌లలో 19 శాతం వాటాతో అత్యధిక సంఖ్యలో గిట్‌హబ్‌ఏఐ ప్రాజెక్ట్‌లను కలిగి ఉన్న రెండవ దేశంగా భారత్ ఉండడం గర్వకారణమని అన్నారు. అంతర్జాతీయ స్థాయిలో ఏఐ అభివృద్ధికి సంబంధించి భారత్ శక్తిసామర్థ్యాలను ఈ విషయం స్పష్టంచేస్తోందన్నారు. ఈ స్ఫూర్తితో ఈ రంగంలో భారత్ మరింత పురోగమించాల్సిన అవసరం ఉందన్నారు. ఏఐ విశ్వసనీయంగా, నైతికంగా ఉండే భవిష్యత్తును రూపొందించడానికి చురుకైన విధానం అవసరమని కూడా కాంత్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. -
లండన్‌లో మరో భారతీయ విద్యార్థిని దుర్మరణం
లండన్‌లో జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో భారతీయ విద్యార్థిని చేసితా కొచర్ దుర్మరణం పాలయ్యారు. లండన్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో పీహెచ్డీ చేస్తున్నకొచర్ వర్శిటీ నుంచి తిరిగి వెళుతూండగా ప్రమాదానికి గురయ్యారు. సైకిల్‌పై వెళుతూండగా ట్రక్ ఒకటి ఆమెను బలంగా ఢీకొంది. దీంతో కోచర్ అక్కడికక్కడే మరణించారు. కోచర్ భర్త ప్రశాంత్ ఆమెను రక్షించే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. చేసితా ఆకస్మిక మరణంపై ఆమె తండ్రి, విశ్రాంత లెఫ్టినెంట్ జనరల్ ఎస్పీ కోచర్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. చేసితా మరణం కుటుంబంతోపాటు స్నేహితులను కూడా విషాదంలోకి నెట్టేసిందని ఆయన వ్యాఖ్యానించారు. అత్యంత ప్రతిభావంతురాలైన చేసితా మరణంపై సన్నిహితులు, సహవిద్యార్థులు కూడా సంతాపం వ్యక్తం చేశారు. Cheistha Kochar worked with me on the #LIFE programme in @NITIAayog She was in the #Nudge unit and had gone to do her Ph.D in behavioural science at #LSE Passed away in a terrible traffic incident while cycling in London. She was bright, brilliant & brave and always full of… pic.twitter.com/7WyyklhsTA — Amitabh Kant (@amitabhk87) March 23, 2024 నీతీ ఆయోగ్ మాజీ సీఈవో అమితాబ్ కూడా కొచర్‌తో తన అనుబంధాన్ని ఎక్స్ (ట్విట్టర్)లో పంచుకున్నారు. కొచర్ అకాల మరణంపై సంతాపం ప్రకటించిన ఆయన ఆమె నీతి ఆయోగ్‌లో తనతో కలిసి పనిచేశారని, ధైర్యవంతురాలని గుర్తు చేసుకున్నారు. ఢిల్లీ యూనివర్సిటీ, అశోకా యూనివర్సిటీ, పెన్సిల్వేనియా, చికాగో యూనివర్సిటీల్లో పలు కోర్సులు చేసిన చేసితా కోచర్ 2021-23 మధ్య కాలంలో నీతి ఆయోగ్‌లోని నేషనల్ బిహేవియరల్ ఇన్సైట్స్ యూనిట్ ఆఫ్ ఇండియాలో సీనియర్ అడ్వైజర్‌గా పనిచేశారు. అంతేకాదు ఆధార్ ప్రాజెక్టు వ్యవస్థాపక బృందంలో ఒకరు కూడా సెంటర్ ఫర్ సోషల్ అండ్ బిహేవియర్ చేంజ్‌లో పని చేస్తూండగా బిల్ అండ్ మిలిండా గేట్స్ ఫౌండేషన్‌తో కూడా కలిసి పనిచేశారు. ఆర్గనైజేషనల్బిహేవియర్ మేనేజ్మెంట్లో పీహెచ్‌డీకోసం గత ఏడాది సెప్టెంబరులోనే లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్‌లో చేరారు. నాలుగేళ్ల ఈ పీహెచ్డీ కోర్సుకు పూర్తిస్థాయి స్కాలర్షిప్ లభించడం గమనార్హం. ఫీడ్ ఇండియా బిజినెస్ చదువులో కొచర్ ఎపుడూ టాపర్. గణితం, ఎకానమిక్స్ అంటే చాలా ఇష్టం. ఢిల్లీ యూనివర్సిటీలో చదువుకునే సమయంలో తొలి బిజినెస్ ‘ఫీడ్ ఇండియా’ను ప్రారంభించింది. విశ్వవిద్యాలయ క్యాంటీన్లలో మిగిలిపోయిన ఆహారాన్ని సేకరించి నామమాత్రపు ధరకు విక్రయించేది. తద్వారా క్యాంటీన్లలో వృథా అవుతున్న ఆహారాన్ని సద్వినియోగం చేయడంతోపాటు... పేద మహిళలు వంట చేసుకునే శ్రమను తగ్గించి ఎక్కువ సమయం పనిచేసి మరింత సంపాదించుకునేలా చేసింది. ఈ వ్యాపారాన్ని కొనసాగించాలని చేసితా అనుకున్నా.. కుటుంబ సభ్యుల సూచనల మేరకు చదువులు పూర్తి చేయాలన్న దిశగా అడుగులు వేసింది. కానీ ఆమె కలలు, ఆశయాలు నెరవేరకుండానే ఈ లోకాన్ని వీడడం విషాదం. -
Ashwini Vaishnav: వచ్చే పదేళ్లలో 6 నుంచి 8 శాతం వృద్ధి
న్యూఢిల్లీ: భారత్ వచ్చే 10 సంవత్సరాలలో 6 నుంచి 8 శాతం స్థిరమైన వృద్ధి రేటును కొనసాగిస్తుందన్న విశ్వాసాన్ని కేంద్ర రైల్వే, కమ్యూనికేషన్స్, ఐటీ మంత్రి మంత్రి అశ్విని వైష్ణవ్ వ్యక్తం చేశారు. దేశీయ, అంతర్జాతీయ మార్కెట్ల అవసరాలను తీర్చడానికి భారత్ తగిన స్థానంలో ఉందని, ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన పెట్టుబడిదారులకు విజ్ఞప్తి చేశారు. రైసినా డైలాగ్ 2024లో ఆయన ఈ మేరకు మాట్లాడుతూ, 2047 నాటికి భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా ఎదగడానికి వచ్చే ఐదేళ్లలో కేంద్రం మరింత పటిష్ట పునాదులు వేస్తుందని అన్నారు. గ్రీన్ ఎనర్జీ ఎగుమతిదారుగా భారత్ ఆవిర్భవించాలి: జీ20 షెర్పా అమితాబ్ కాంత్ పెట్టుబడులకు సంబంధించి కీలక మూలధనాన్ని ఆకర్షించడానికి 2047 నాటికి భారతదేశం గ్రీన్ ఎనర్జీ ఎగుమతిదారుగా మారాల్సిన అవసరం ఉందని జీ 20 షెర్పా అమితాబ్ కాంత్ ఇదే కార్యక్రమంలో అన్నారు. ‘రైసినా డైలాగ్ 2024’లో కాంత్ ప్రసంగిస్తూ, నేటి ప్రధాన సవాలు వాతావరణ మార్పు అని పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేస్తూ, ప్రపంచ బ్యాంక్ ‘వాతావరణ బ్యాంకుగా’ మారాల్సిన అవసరం ఉందని అన్నారు. భవిష్యత్తులో, అన్ని పెట్టుబడులు పునరుత్పాదక రంగంలోకి ప్రవహిస్తాయని అంచనావేశారు. పర్యావరణానికి పెద్దపీట వేసిన దేశాతే మూలధనాన్ని ఆకర్షించగలవని ఆయన అన్నారు. -
2030 నాటికి 2.5 కోట్ల ఉద్యోగాలు! - అమితాబ్ కాంత్
న్యూఢిల్లీ: పరిశ్రమ, మౌలిక రంగ హోదా కల్పించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్న ఆతిథ్య, పర్యాటక రంగ సంస్థలకు భారతదేశ జీ20 షెర్పా అమితాబ్ కాంత్ కీలక సూచన చేశారు. పరిశ్రమ, మౌలిక సదుపాయాల హోదా కల్పన కోసం సహాయం చేయాలని రాజకీయ నాయకులను ఒకపక్క కోరడంతోపాటే, మరోవైపు 2030 నాటికి 2.5 కోట్ల ఉద్యోగాల కల్పన గురించి కూడా వారికి భరోసా ఇవ్వాలని ఆయన సూచించారు. హోటల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (హెచ్ఏఐ) నిర్వహించిన 6వ హోటల్స్ కాంక్లేవ్‌లో కాంత్ మాట్లాడుతూ, పరిశ్రమ హోదా కోసం ఆతిథ్య, పర్యాటక రంగ డిమాండ్ సరైనదేనన్నారు. అయితే ఈ రంగం భారీ ఉపాధి అవకాశాలను అందిస్తుందని రాజకీయ నాయకులకు తెలియజేయడంలో విఫలమైందని పేర్కొన్నారు. ‘‘మీరు టూరిజం వైపు చూస్తే, రాజకీయ దృక్కోణం నుండి నేను ఆలోచిస్తాను. రాజకీయ నాయకులు ఒక విషయం మాత్రమే అర్థం చేసుకుంటారు. పర్యాటక రంగం ఎన్ని ఉద్యోగాలను సృష్టిస్తోంది అని మాత్రమే వారు ఆలోచిస్తారు. ఇక్కడ వారికి భరోసా లభిస్తే.. ఈ రంగం కోసం ఎటువంటి పెద్ద నిర్ణయమైనా ప్రభుత్వం నుంచి వెలువడుతుంది’’ అని ఆయన అన్నారు. ఇంకా ఆయన ఏమన్నారంటే.. పర్యాటక రంగం సృష్టించే ప్రతి ప్రత్యక్ష ఉద్యోగానికి భారీ సానుకూల స్పందన ఉంటుంది. అయితే ఉద్యోగాల సృష్టికర్తలమని రాజకీయ నాయకులకు చెప్పడంలో పర్యాటక రంగం విఫలమైందని నేను భావిస్తున్నాను. ఉపాధి పరంగా, థాయ్‌లాండ్ దాదాపు 2 కోట్ల ఉద్యోగాలు, మలేషియా 1.5 కోట్ల ఉద్యోగాలు సృష్టిస్తే... భారతదేశం పర్యాటక రంగం మాత్రమే 78 లక్షల ఉద్యోగాలు సృష్టిస్తోంది. ఎంఐసీఎస్ (మీటింగ్, ఇన్సెంటివ్, కాన్ఫరెన్స్, ఎగ్జిబిషన్) విభాగంలో అవకాశాన్ని అందిపుచ్చుకోడానికి ఆతిథ్య, పర్యాటక రంగం కృషి చేయాలి. యశోభూమి, భారత్ మండపం ఆవిష్కరణతో భారతదేశం ఇప్పుడు ప్రపంచంలోనే అత్యుత్తమ కన్వెన్షన్ అలాగే ఎక్స్పో సెంటర్లను కలిగి ఉంది. ప్రపంచ మార్కెట్లో 500 బిలియన్ డాలర్లకు పైగా ఉన్న ఎంఐసీఈ విభాగంలో భారత్ వాటా 1 శాతం కంటే తక్కువగా ఉంది. ఇది విచారకరమైన అంశం. ఏడేళ్లలో ఐదుకోట్ల ఉద్యోగాలు: హెచ్ఏఐ కాగా, రాబోయే ఐదేళ్ల నుంచి ఏడేళ్లలో 5 కోట్ల ప్రత్యక్ష –పరోక్ష ఉద్యోగాలను సృష్టించాలని పర్యాటక, ఆతిథ్య రంగం భావిస్తోంది. అయితే పూర్తి పరిశ్రమ, మౌలిక సదుపాయాల హోదా పొందేందుకు ప్రభుత్వ మద్దతు అవసరమని హోటల్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (హెచ్ఏఐ) తెలిపింది. తాము కోరుకుంటున్న ప్రత్యేక హోదా కేవలం వసతులను సృష్టించడానికి మాత్రమే కాకుండా, ఈ రంగం ఆదాయం పరంగా, ఉపాధి కల్పనా పరంగా పురోగమించడానికి దోహదపడుతుందని హెచ్ఏఐ ప్రెసిడెంట్ పునీత్ ఛత్వాల్ 6వ హెచ్ఏఐ హోటల్స్ కాంక్లేవ్‌లో పేర్కొన్నారు. -
చైనాను అందుకోవాలంటే.. 10% వృద్ధి అవసరం
న్యూఢిల్లీ: చైనా ఆర్థిక వ్యవస్థ పరిమాణం ప్రస్తుతం భారతదేశం కంటే ఐదు రెట్లు ఉందని, చైనా స్థాయి ని మన దేశం చేరుకోవాలంటే 10 శాతం వృద్ధి సాధన అవసరమని భారత్ జీ20 షెర్పా అమితాబ్ కాంత్ పేర్కొన్నారు. భారత్ 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారేందుకు సిద్ధంగా ఉందని పేర్కొన్న ఆయన, రాబోయే మూడు దశా బ్దాల్లో 8–9 శాతం వృద్ధిరేటు సాధన దేశానికి సవాలుగా మారుతుందని పేర్కొన్నారు. పబ్లిక్ అఫైర్స్ ఫోర మ్ ఆఫ్ ఇండియా (పీఏఎఫ్ఐ) ఇక్కడ ఏర్పా టు చేసిన ఒక కార్యక్రమంలో కాంత్ మాట్లాడుతూ, ప్రైవేట్ రంగం మద్దతు లేకుండా భారతదేశ ఆర్థిక వ్యవస్థ అధిక రేటు వృద్ధి సాధన అసాధ్యమని అన్నారు. భారత్ ప్రస్తుతం ప్రపంచంలో ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. 25.5 ట్రిలియన్ డాలర్లతో అమెరికా ప్రస్తు తం ప్రపంచంలో అతిపెద్ద ఎకనామగా కొనసాగుతోంది. ప్రపంచం మొత్తం జీడీపీలో పావుశాతం వాటాను కలిగి ఉంది. ఇక 17.9 శాతం ప్రపంచ జీడీపీ వాటాతో 18 ట్రిలియన్ డాలర్ల ఎకాన మీగా చైనా రెండవ స్థానంలో ఉంది. తరువాతి స్థానాల్లో జపాన్ (4.2 ట్రిలియన్ డాలర్లు), జర్మనీ (4 ట్రిలియన్ డాలర్లు)లు ఉన్నాయి. 3.5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీతో భారత్ ఐదవ స్థానంలో నిలుస్తోంది. 2022 నాటికి భారత్ ఎకానమీ బ్రిటన్, ఫ్రాన్స్‌లను అధిగమించగా, 2023 నాటికి జర్మనీని అధిగమించే అవకాశం ఉందన్న అంచనాలు ఇప్పటికే ఉన్నాయి. 2030 నాటికి జపా న్ ఎకానమీని సైతం భారత్ అధిగమించగలదని ఎస్అండ్పీ గ్లోబల్ వంటి సంస్థలు కొన్ని విశ్లేషిస్తున్నాయి. విమానయానంలో యూరప్‌ను మించి... మౌలిక రంగానికి ప్రభుత్వం పటిష్ట మద్దతునిస్తోందన్నారు. యూరప్‌లోని విమానాశ్రయాల కంటే భారతీయ విమానాశ్రయాల నాణ్యత మెరుగ్గా ఉందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. అంతర్జాతీయ విమానయాన సంస్థల కంటే మన దేశీయ విమానయాన సంస్థలు కూడా మెరుగ్గా ఉన్నాయని ఆయన అన్నారు. ఏఐ కీలక పాత్ర భారతదేశ వృద్ధి పటిష్టత చెక్కుచెదర కుండా ఉంటుందని భరోసా ఇచి్చన అమితాబ్ కాంత్, స్థిరమైన వృద్ధిని తీసుకురావడానికి ఆర్టిఫిíÙయల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)ని ఉపయోగించాల్సిన అవసరాన్ని ఉద్ఘాటించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగించకుండా, సాంకేతిక రంగలో పురోగతి అసాధ్యమని సైతం ఈ సందర్బంగా పేర్కొన్నారు. -
G20 Summit: జీ20 సదస్సు విజయం వారి కృషే..
న్యూఢిల్లీ: దేశరాజధానిలో రెండు రోజులపాటు జరిగిన జీ20 సమావేశాలు విజయవంతమైన నేపథ్యంలో సమావేశాలు విజయవంతం కావడంలో కీలక పాత్ర పోషించిన జీ20 నిర్వహణాధికారి అమితాబ్ కాంత్ అతని బృందంపైనా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సందర్బంగా మాజీ కేంద్ర మంత్రి శశి థరూర్ అమితాబ్ కాంత్ నేతృత్వంలోని జీ20 షెర్పాల కృషిని కొనియాడారు. కేరళకు చెందిన ఐఏఎస్ అధికారి అమితాబ్ కాంత్‌పై శశి థరూర్ ప్రశంసలు కురిపించారు. థరూర్ తన ఎక్స్(ట్విట్టర్) వేదికగా రాస్తూ.. శభాష్ అమితాబ్.. మీరు ఐఏఎస్ ఎంచుకోవడం వలన ఐఎఫ్ఎస్ ఓ గొప్ప అధికారిని కోల్పోయిందని మాత్రం చెప్పగలను. ఢిల్లీ డిక్లరేషన్ విషయంలో మీ పాత్ర అనిర్వచనీయం. ఢిల్లీ డిక్లరేషన్ డ్రాఫ్ట్ పూర్తి చేయడానికి ఒక్కరోజు ముందే రష్యా చైనాలతో చర్చించి ఏకాభిప్రాయం సాధించడం సాధారణ విషయం కాదని.. ఇది భారత దేశానికే గర్వకారణమని అన్నారు. Well done @amitabhk87! Looks lile the IFS lost an ace diplomat when you opted for the IAS! "Negotiated with Russia, China, only last night got final draft," says India's G20 Sherpa on 'Delhi Declaration' consensus. A proud moment for India at G20! https://t.co/9M0ki7appY — Shashi Tharoor (@ShashiTharoor) September 9, 2023 ఢిల్లీ డిక్లరేషన్‌లో అత్యంత కీలక ఘట్టమైన రష్యా-ఉక్రెయిన్ యుద్ధం అంశాన్ని చాలా నేర్పుగా పొందుపరచిన జీ20 షెర్పాలపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో జీ20 సదస్సు నిర్వహణలో ప్రధానాధికారి అమితాబ్ కాంత్ కూడా షెర్పాల బృందాన్ని అభినందించారు. అమితాబ్ కాంత్ రాస్తూ.. జీ20 సదస్సు మొత్తంలో అత్యంత కఠినమైన అంశం రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించిన అంశంపై ఏకాభిప్రాయం సాధించడమే. దీనికోసం కనీసం 200 గంటల పాటు చర్చలు నిర్వహించాం, 300 ద్వైపాక్షిక సమావేశాలను నిర్వహించాము. మొత్తంగా 15 డ్రాఫ్టులను తయారుచేశాము. ఈ విషయంలో ఎంతగానో సహాయపడిన ఈనమ్ గంభీర్, నాగరాజ్ నాయుడు కాకనూర్ లకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నానని రాశారు. The most complex part of the entire #G20 was to bring consensus on the geopolitical paras (Russia-Ukraine). This was done over 200 hours of non -stop negotiations, 300 bilateral meetings, 15 drafts. In this, I was greatly assisted by two brilliant officers - @NagNaidu08 & @eenamg pic.twitter.com/l8bOEFPP37 — Amitabh Kant (@amitabhk87) September 10, 2023 రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించిన అంశంపై గతంలో భేదాభిప్రాయాలు వ్యక్తమైనా కూడా దానిపై కర సాధన చేసి షెర్పాలు సభ్యదేశాల ఏకాభిప్రాయం సాధించారు. ఏ ప్రకటన చేసినప్పుడే భారత్ ప్రధాని కూడా షెర్పాల బృందాన్ని అభినందించిన విషయం తెలిసిందే. #WATCH | G-20 in India: PM Narendra Modi says, " I have received good news. Due to the hard work of our team, consensus has been built on New Delhi G20 Leaders' Summit Declaration. My proposal is to adopt this leadership declaration. I announce to adopt this declaration. On this… pic.twitter.com/7mfuzP0qz9 — ANI (@ANI) September 9, 2023 ఇది కూడా చదవండి: G20 Summit: జీ20 సమావేశాలు విజయవంతం -
గ్రేట్ ఇండియన్ బ్రాండ్ అరకు కాఫీ..
సాక్షి, అమరావతి: అరకు కాఫీ ఘుమఘుమలు మరోసారి అంతర్జాతీయంగా ఖ్యాతికెక్కింది. ప్రపంచంలోనే తొలి గిరిజన సంప్రదాయ కాఫీ అయిన అరకు కాఫీ ఇండియన్ గ్రేట్ బ్రాండ్లలో ఒకటి అంటూ నీతి ఆయోగ్ మాజీ సీఈవో అమితాబ్ కాంత్ ట్వీట్ చేయగా.. దానిని స్వాగతిస్తూ మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా రీట్వీట్ చేశారు. దీంతో, మరోసారి అంతర్జాతీయంగా అరకు కాఫీపై ట్విట్టర్ వేదికగా పెద్ద చర్చ జరుగుతోంది. ఇండియాలో జరుగుతున్న జీ–20 సమావేశాల్లో విదేశీ ప్రతినిధులకు అందంగా ప్యాక్ చేసిన అరకు కాఫీని అందిస్తున్నామని, ఇది ప్రపంచంలోనే తొలి గిరిజన కాఫీగా గుర్తింపు పొందిందంటూ అమితాబ్ కాంత్ కీర్తించారు. సేంద్రియ విధానంలో సాగు చేస్తున్న కాఫీ సాగు ప్రాంతంగా అరకుకు గుర్తింపు లభించందన్నారు. ప్రతిసారి సేంద్రియ సాగు పరీక్షలో స్థిరంగా 90 కంటే ఎక్కువ మార్కులు సాధిస్తూ తొలి ఇండియన్ కాఫీగా నిలవడమే కాకుండా.. గ్రేట్ ఇండియన్ బ్రాండ్‌గా ఎదిగిందన్నారు. ఈ ట్వీట్‌పై ఆనంద్ మహీంద్రా స్పందిస్తూ.. దేశ విజయాన్ని అద్దంపట్టే విధంగా అరకు కాఫీని ఎంచుకోవడం అద్భుతమైన నిర్ణయమంటూ పొగిడారు. A perfect epicurean choice, @amitabhk87 whixh showcases an incredible Indian success story. The creation of a global brand while simultaneously transforming the lives of the tribal population of Araku. https://t.co/oFHWz0EIzy — anand mahindra (@anandmahindra) July 16, 2023 ఇది కూడా చదవండి: కొల్లేరు పర్యాటకం.. కొత్త అందాల నిలయం -
స్టార్టప్ వ్యవస్థ బలోపేతానికి కృషి,నిధుల కొరత లేదు: అమితాబ్ కాంత్
గురుగ్రామ్: అంకుర సంస్థలను బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. స్టార్టప్‌ల వ్యవస్థను ప్రోత్సహించేందుకే తప్ప నియంత్రించేందుకు ప్రభుత్వం ప్రయత్నించబోదని ఆయన స్పష్టం చేశారు. ఆ వ్యవస్థలో భాగమైన వర్గాలే స్వీయ నియంత్రణ పాటించాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. స్టార్టప్20 సదస్సులో పాల్గొన్న సందర్భంగా మంత్రి ఈ విషయాలు చెప్పారు. (హార్లే డేవిడ్సన్ ఎక్స్440 బుకింగ్స్ షురూ ) అంకుర సంస్థల పురోగతికి అవరోధాలు కల్పించాలనేది ప్రభుత్వల ఉద్దేశం కాదనే స్పష్టమైన సందేశం స్టార్టప్‌లకు చేరాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. భారత్‌లో అవకాశాలను అందిపుచ్చుకోవాలని అంకుర సంస్థలను ఆహ్వానించారు. 2030 నాటికి అంకుర సంస్థల వ్యవస్థలోకి జీ20 దేశాలన్నీ కలిసి ఏటా 1 లక్ష కోట్ల డాలర్లు పెట్టుబడులు పెట్టేలా చూసేందుకు స్టార్టప్20 గ్రూప్ చేస్తున్న ప్రయత్నాలు సాకారమైతే స్టార్టప్‌లకు మరిన్ని ప్రయోజనాలు చేకూరగలవని గోయల్ చెప్పారు. (Virat Kohli First Car: స్టార్ క్రికెటర్ కోహ్లీ, ఫస్ట్ కారు ఏదో తెలుసా? దుమ్మురేపే లగ్జరీ కార్ల కలెక్షన్) స్టార్టప్‌లకు నిధుల కొరత లేదు: అమితాబ్ కాంత్ సరైన అంకుర సంస్థలకు పెట్టుబడుల కొరతేమీ లేదని జీ20 షెర్పా అమితాబ్ కాంత్ స్పష్టం చేశారు. పటిష్టమైన వ్యాపార విధానాలున్న మంచి స్టార్టప్‌లకు నిధుల లభ్యత బాగానే ఉందని ఆయన చెప్పారు. ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లకు పరిష్కార మార్గాలను కనుగొనేందుకు స్టార్టప్ వ్యవస్థ చురుగ్గా పని చేస్తోందని స్టార్టప్20 శిఖర్ సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆయన పేర్కొన్నారు. భారత్‌లో 1,00,000 పైచిలుకు స్టార్టప్‌లు, 108 యూనికార్న్‌లు (బిలియన్ డాలర్లకు పైగా విలువ చేసే అంకురాలు) ఉన్నాయని అమితాబ్ కాంత్ తెలిపారు. (జియో మరో సంచలనం: రూ. 999కే ఫోన్, సరికొత్త ప్లాన్ కూడా) -
విక్రయాల కోసం ప్రభుత్వంపై ఆధారపడకండి
న్యూఢిల్లీ: అంకుర సంస్థలు తమ ఉత్పత్తుల అమ్మకాల కోసం ప్రభుత్వ ప్రొక్యూర్మెంట్ (కొనుగోళ్ల)పై ఆధారపడొద్దని జీ20 షెర్పా అమితాబ్ కాంత్ సూచించారు. దానికి బదులుగా దేశీ మార్కెట్, ఎగుమతులపై దృష్టి పెట్టాలని పేర్కొన్నారు. ఐఎంసీ చాంబర్ ఆఫ్ కామర్స్ నిర్వహించిన యూత్ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న సందర్భంగా కాంత్ ఈ విషయాలు తెలిపారు. కేంద్రంతో పాటు పలు రాష్ట్రాల ప్రభుత్వాలు కొనుగోళ్ల ద్వారా స్టార్టప్‌లకు తోడ్పాటు అందించేందుకు సానుకూలంగా కృషి చేస్తున్నాయని, అనేక సందర్భాల్లో పలు మినహాయింపులు కూడా ఇస్తున్నాయని ఆయన చెప్పారు. అంకుర సంస్థలు తమ ఉత్పత్తులను ప్రదర్శించేందుకు గవర్నమెంట్ ఈ–మార్కెట్‌ప్లేస్ చక్కని రన్‌వేలాంటిదని కాంత్ వివరించారు. ‘అయితే, అంకుర సంస్థల విషయంలో ప్రభుత్వాలు మరీ ఎక్కువగా జోక్యం చేసుకోవడానికి నేను వ్యక్తిగతంగా వ్యతిరేకం. చురుకైన స్టార్టప్‌లు మార్కెట్‌ప్లేస్‌లో అవకాశాలను అందిపుచ్చుకోవాలి. ప్రభుత్వ కొనుగోళ్లపై మరీ ఎక్కువగా ఆధారపడిపోకూడదు‘ అని ఆయన చెప్పారు. ఫండ్ ఆఫ్ ఫండ్స్ వంటి స్కీముల ద్వారా స్టార్టప్‌లకు పెట్టుబడులు లభించేలా తోడ్పాటు అందించడానికి మాత్రమే ప్రభుత్వ పాత్ర పరిమితం కావాలని కాంత్ అభిప్రాయపడ్డారు. మరోవైపు, లింగ అసమానతలను రూపుమాపేందుకు, మహిళల జీవన ప్రమా ణాలు మరింత మెరుగుపడేందుకు పురుషుల దృష్టికోణం మారాలని ఆయన చెప్పారు. సాధారణంగా భారత్, దక్షిణాసియాలో ఆస్తిని కుమార్తెలకు కాకుండా కుమారులకే మార్పిడి చేసే సంస్కృతి ఉందని.. అలా కాకుండా కుమార్తెల పేరిట బదిలీ చేసే సంస్కృతి వస్తే దశాబ్ద కాలంలోనే మహిళలు మరింతగా రాణించడాన్ని చూడగలమని కాంత్ చెప్పారు. -
ఏఐతో కొత్త అవకాశాలు.. ప్రైవసీకి సవాళ్లు
పాంజిమ్: కృత్రిమ మేథ (ఏఐ)తో మానవాళి అభివృద్ధికి కొత్త అవకాశాలు లభించగలవని జీ20 షెర్పా అమితాబ్ కాంత్ తెలిపారు. పనితీరు, పరివర్తనలో సాంకేతికత కీలకపాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు. సమాచార సేకరణ, ప్రాసెసింగ్, వితరణ ప్రక్రియ అంతా వేగంగా, సమర్థమంతంగా నిర్వహించేందుకు తోడ్పడుతోందని రెండో జీ20–ఎస్ఏఐ (సుప్రీం ఆడిట్ ఇన్స్టిట్యూషన్) సదస్సులో పాల్గొన్న సందర్భంగా తెలిపారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల వ్యక్తిగత గోప్యత (ప్రైవసీ), నకిలీ వార్తలపరమైన సవాళ్లు తలెత్తవచ్చని ఆయన చెప్పారు. -
వర్ధమాన దేశాలకు ‘అభివృద్ధి లక్ష్యాల’ నిధులు కావాలి
న్యూఢిల్లీ: సుస్థిర అభివృద్ధి సాధన లక్ష్యాల సాధన కోసం వర్ధమాన దేశాలకు దీర్ఘకాలికంగా నిధులు అవసరమని నీతి ఆయోగ్ మాజీ సీఈవో, జీ20 షెర్పా అమితాబ్ కాంత్ తెలిపారు. ఇందుకోసం కోపెన్హాగన్ ఒప్పందం ప్రకారం సంపన్న దేశాల నుంచి వర్ధమాన దేశాలకు నిధుల ప్రవాహం పెరగాలని పేర్కొన్నారు. జీ20 అధ్యక్ష హోదాలో కూటమిని మరింత సమ్మిళితంగా ఎలా చేయవచ్చు, ప్రపంచ ఎకానమీ వృద్ధికి ఎలా దోహదపడవచ్చు అనే అంశాలకు భారత్ ప్రాధాన్యత నిస్తోందని కాంత్ తెలిపారు. ఇదీ చదవండి: ఈ పిక్స్ చూశారా? గుండెలు బాదుకుంటున్న కృతి సనన్ ఫ్యాన్స్ అనేక సవాళ్లు నెలకొన్నప్పటికీ డిజిటల్ చెల్లింపులు, డేటా ఎకానమీ తదితర విషయాల్లో భారత్ వేగంగా పురోగమి స్తోందని.. ఇతర దేశాలకూ ఈ మోడల్ ఉపయోగకరమైనదని ఆయన పేర్కొన్నారు. వాతావరణ వేడిమిని తగ్గించే లక్ష్యాలను సాధించే దిశగా ప్రపంచ దేశాలు చర్యలు వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని కాంత్ చెప్పారు. పారిశ్రామికీకరణ క్రమంలో పాశ్చాత్య దేశాలే వాతావరణాన్ని భారీగా కలుషితం చేశాయని, ప్రస్తుత వాతావరణ సంక్షోభంలో వర్ధమాన దేశాల వాటా చాలా స్వల్పమేనని ఆయన తెలిపారు. కర్బన ఉద్గారాలతో ప్రపంచాన్ని ముంచెత్తకుండా పారిశ్రామిక బాటలో ముందుకు సాగే తొలి దేశాల జాబితాలో భారత్ కూడా ఉంటుందని కాంత్ చెప్పారు. (Dr.Vandana Lal Success Story: రూ. 3వేల కోట్ల నికర విలువతో రిచెస్ట్ విమెన్: ఆసక్తికర విషయాలు) మరిన్ని వార్తలు, అప్డేట్ కోసం చదవండి: సాక్షి బిజినెస్ -
జీ20తో డిజిటల్ కృషిని ప్రపంచానికి చాటి చెప్తాం
న్యూఢిల్లీ: డిజిటల్ పరివర్తనలో భారత్ చేస్తున్న కృషిని జీ20 కార్యక్రమాల ద్వారా ప్రపంచానికి చాటి చెప్పనున్నట్లు నీతి ఆయోగ్ మాజీ సీఈవో, జీ20 షెర్పా అమితాబ్ కాంత్ తెలిపారు. తద్వారా గ్లోబల్ సౌత్ (లాటిన్ అమెరికా, ఆసియా, ఆఫ్రికా, ఓషియానియా దేశాలు) ప్రజల జీవితాల్లో మార్పు తెచ్చేందుకు తోడ్పాటు అందించనున్నట్లు పేర్కొన్నారు. ఆలిండియా మేనేజ్మెంట్ అసోసియేషన్ (ఏఐఎంఏ) 8వ జాతీయ నాయకత్వ సదస్సులో పాల్గొన్న సందర్భంగా కాంత్ ఈ విషయాలు తెలిపారు. అంతర్జాతీయంగా 400 కోట్ల మందికి డిజిటల్ గుర్తింపు లేదని, 250 కోట్ల మంది కనీసం బ్యాంకు ఖాతా కూడా లేదని కాంత్ చెప్పారు. 133 దేశాల్లో వేగవంతమైన డిజిటల్ చెల్లింపుల విధానాలు లేవని పేర్కొన్నారు. అలాంటిది, డిజిటైజేషన్ ద్వారా భారత్ ప్రజల జీవితాల్లో మార్పులు తేగలిగిందని, ఉత్పాదకత పెంచుకుని సమర్థమంతమైన ఆర్థిక వ్యవస్థగా ముందుకెడుతోందని కాంత్ చెప్పారు. డిజిటైజేషన్ డిజిటల్ చెల్లింపులు తదితర విభాగాల్లో భారత్ సాధిస్తున్న పురోగతిని వివరించారు. ‘భారత్ పాటిస్తున్న ఈ మోడల్‌ను మిగతా ప్రపంచం ముందుకు ఎలా తీసుకెళ్లాలన్నది ఒక సవాలు. భారత డిజిటల్ పరివర్తన గాధను ప్రపంచానికి పరిచయం చేసేందుకు జీ20 వేదికను ఉపయోగించు కుందాం. ఆ విధంగా గ్లోబల్ సౌత్ దేశాల పౌరుల జీవితాల్లో మార్పు తెచ్చేందుకు ఈ అవకాశాన్ని వినియోగించుకుందాం‘ అని కాంత్ పేర్కొన్నారు. -
వృద్ధి కోసం ఫైనాన్షియల్ రెగ్యులేటర్లు మారాలి
ముంబై: దేశంలో ఆర్థిక రంగానికి సంబంధించి పనిచేస్తున్న నియంత్రణ సంస్థలు (రెగ్యులేటర్లు) సోషలిస్ట్ యుగంలో రూపొందించినవని, వృద్ధి కోసం అవి మారాల్సిన అవసరం ఉందని జీ–20లో భారత్ షెర్పా (ప్రతినిధి), నీతి ఆయోగ్ మాజీ సీఈవో అమితాబ్ కాంత్ అన్నారు. ఎస్బీఐ కాంక్లేవ్‌లో భాగంగా కాంత్ మాట్లాడారు. ఆర్బీఐ, సెబీ, కాంపిటీషన్ కమిషన్ (సీసీఐ) దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలని సూచించారు. మార్పు, అభివృద్ధి ఏజెంట్లుగా పనిచేయాలని సూచించారు. ఎప్పుడో సామ్యవాదం రోజుల్లో నియంత్రణ సంస్థలు ఏర్పాడ్డాయని, నేటి కాలానికి అనుగుణంగా వాటి ఆలోచనా విధానంలో మార్పు రావాలన్నది తన అభిప్రాయంగా పేర్కొన్నారు. దేశ అభివృద్ధి ఆవశ్యకత గురించి కాంపిటిషన్ కమిషన్ (సీసీఐ) ఉపోద్ఘాతంలో ప్రస్తావించారని చెబుతూ, ఇతర నియంత్రణ సంస్థలకు సైతం ఇదే విధమైన లక్ష్యం ఉండాలన్నారు. ఎలక్ట్రిక్ మొబిలిటీ, రెన్యువబుల్ ఎనర్జీలో రానున్న అవకాశాలను భారత్ సొంతం చేసుకోలేకపోతే 7 శాతం వృద్ధి రేటును కూడా ఆశించలేమన్నారు. ఉచిత విద్యుత్ తదితర ఉచిత తాయిలాలతో కొంత మంది రాజకీయ నాయకులు దేశాన్ని నాశనం చేస్తున్నారని, ప్రత్యేకంగా ఎవరి పేరును ప్రస్తావించకుండా విమర్శించారు. ఈ ఏడాది జీ–20కి భారత్ నాయకత్వం వహిస్తుండడం తెలిసిందే. సర్క్యులర్ ఎకానమీపై దృష్టి అవశ్యం క్లైమేట్ చేంజ్ సమస్య పరిష్కారం కోసం (వాతావరణ సమతౌల్య పరిరక్షణ) సర్క్యులర్ ఎకానమీపై దృష్టి సారించాల్సిన తక్షణ అవసరం ఉందని ఒక వెర్చువల్ కార్యక్రమంలో భారత్ తరఫున జీ20 షెర్పా అమితాబ్ కాంత్ పేర్కొన్నారు. సర్క్యులర్ ఆర్థిక వ్యవస్థ అనేది ఉత్పత్తి– వినియోగానికి సంబంధించిన ఒక నమూనా. వినియోగ ఉత్పత్తుల రీసైక్లింగ్ ఇందులో ప్రధాన భాగం. డిసెంబర్ 1 నుంచి జీ–20 ప్రెసిడెన్సీ బాధ్యతలు స్వీకరిస్తున్న భారత్, సర్క్యులర్ ఎకానమీ పురోగతికి తన వంతు ప్రయత్నం చేస్తుందన్నారు. -
8జీ–20 షెర్పాగా అమితాబ్ కాంత్!
న్యూఢిల్లీ: నీతి ఆయోగ్ మాజీ సీఈవో అమితాబ్ కాంత్ జీ–20కు భారత కొత్త షెర్పాగా సేవలు అందించనున్నారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఇప్పటి వరకు ఈ బాధ్యతలు చూశారు. ‘‘జీ–20 అధ్యక్ష బాధ్యతలు ఈ ఏడాది భారత్‌కు రానున్నాయి. దీంతో షెర్పా బాధ్యతల్లో ఉన్న వారు దేశవ్యాప్తంగా వివిధ సమావేశాలు నిర్వహించాల్సి ఉంటుంది. మరింత సమయం కేటాయించాల్సి ఉంటుంది. కేంద్ర మంత్రి గోయల్ నరేంద్ర మోదీ కేబినెట్లో ఎన్నో శాఖల బాధ్యతలు చూస్తున్నారు. వీటికే ఎక్కువ సమయం కావాల్సి ఉంటుంది. పైగా రాజ్యసభ నేతగానూ గోయల్ పనిచేస్తున్నారు’’అని ఈ వ్యవహారం తెలిసిన వర్గాలు తెలిపాయి. కేరళ కేడర్ ఐఏఎస్ అధికారి అయిన అమితాబ్ కాంత్ గతంలో పారిశ్రామిక విధానం, ప్రోత్సాహక విభాగం సెక్రటరీగానూ పనిచేశారు. -
భారత్ స్టార్టప్‌ల విప్లవం
న్యూఢిల్లీ: ప్రపంచాన్ని భారత స్టార్టప్‌లు శాసిస్తున్నాయని నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ అన్నారు. ముఖ్యంగా హెల్త్, నూట్రిషన్, వ్యవసాయ రంగాల్లో ఇవి తమదైన ప్రత్యేకతను చాటుతున్నాయని పేర్కొన్నారు. మహిళల ఆధ్వర్యంలోని సంస్థలు సమ సమాజ సాకారంలో కీలక వాహకాలుగా పనిచేస్తున్నట్టు చెప్పారు. ఫిక్కీ మహిళా ఆర్గనైజేషన్ (ఎఫ్ఎల్వో) నిర్వహించిన కార్యక్రమాన్ని ఉద్దేశించి కాంత్ మాట్లాడుతూ.. ప్రస్తుతం భారత్‌లో 61,000 స్టార్టప్‌లు, 81 యూనికార్న్‌లు ఉన్నట్టు చెప్పారు. మహిళల నిర్వహణలోని వ్యాపార సంస్థలు సమాజంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని, భారత స్టార్టప్ ఎకోసిస్టమ్‌లో మహిళలే తదుపరి విప్లవానికి దారి చూపిస్తారని అంచనా వేశారు. ప్రస్తుతం వెంచర్ క్యాపిటల్ (వీసీ) సంస్థలు, ప్రైవేటు ఈక్విటీ సంస్థలు మహిళా స్టార్టప్‌లకు మద్దతుగా నిలుస్తున్నట్టు తెలిపారు. ‘‘ఇది వ్యూహాలు రూపొందించుకునేందుకు, స్టార్టప్‌లు చక్కగా వృద్ధి చెందేందుకు తగిన చర్యలను సూచించేందుకు, మహిళా వ్యాపారవేత్తలను ప్రోత్సహించేందుకు దారితీస్తుంది’’అని కాంత్ చెప్పారు. నేడు భారత్ విప్లవాత్మకమైన వినియోగం, పట్టణీకరణ, డిజిటైజేషన్, పెరుగుతున్న ఆదాయాలతో గొప్ప వృద్ధిని చూడనుందన్నారు. -
ప్రైవేటు రైళ్లా ? మాకొద్దు బాబోయ్ !
న్యూఢిల్లీ: రైల్వే విభాగంలో ప్రైవేట్ సంస్థలను అనుమతించడం తదితర చర్యలతో రైల్వే అసెట్స్‌ను మానిటైజ్ చేయాలన్న ప్రతిపాదనకు ఇన్వెస్టర్ల నుంచి పెద్దగా స్పందన రాలేదని నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ చెప్పారు. మానిటైజేషన్ ప్రక్రియను సరిగ్గా రూపొందించకపోవడం ఇందుకు కారణం కావచ్చని .. ఈ నేపథ్యంలో సదరు ప్రణాళికలను రైల్వే శాఖ పునఃసమీక్షిస్తోందని ఆయన తెలిపారు. కచ్చితంగా రాబడులు వస్తాయంటేనే పెట్టుబడులు పెట్టేందుకు ప్రైవేట్ ముందుకు వస్తుందని ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన పేర్కొన్నారు. అసెట్ మానిటైజేషన్ ప్రణాళికలో పేర్కొన్న రూ. 6 లక్షల కోట్ల అసెట్స్ నుంచి కచ్చితంగా ఆదాయాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని కాంత్ వివరించారు. చదవండి: ఎల్ఐసీ ఐపీవో వాయిదా! -
సంస్కరణలు పెద్ద ఎత్తున చేపట్టాలి
న్యూఢిల్లీ: భారత్‌కు మరిన్ని సంస్కరణలు అవసరమని, అన్ని రంగాల్లోనూ పెద్ద ఎత్తున సంస్కరణలను చేపట్టాలని నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ అన్నారు. సీఐఐ పార్ట్నర్షిప్ సదస్సు 2021ను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఎగుమతులు గణనీయంగా పెరిగిన సందర్భాల్లోనే భారత్ వృద్ధి సాధించినట్టు గుర్తు చేశారు. భారత్ పోటీనిచ్చేలా ఉండాలని ఇది తెలియజేస్తున్నట్టు పేర్కొన్నారు. మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయడం.. తదుపరి మరిన్ని సంస్కరణలు చేపట్టే విషయంలో ప్రభుత్వం తీరుపై ప్రభావం చూపిస్తుందా? అన్న ప్రశ్నకు ఆయన స్పందించారు. ‘‘సంపద సృష్టి ప్రైవేటు రంగం ద్వారానే సాధ్యపడుతుందన్నది ప్రభుత్వ ఉద్దేశ్యం. వారికి (పారిశ్రామికవేత్తలకు) పరిస్థితులు అనుకూలంగా ఉండేలా చూడడమే ప్రభుత్వం చేయాల్సిన పని. ఉత్ప్రేరకంగా, సదుపాయ కల్పనదారుగానే ప్రభుత్వం వ్యవహరించాలి. సంస్కరణలను ఈ దిశగానే ముందుకు నడిపించాలి’’ అని కాంత్ చెప్పారు. -
టెస్లా ఎంట్రీపై భారత ప్రభుత్వం కీలక నిర్ణయం..!
భారత ఆటోమొబైల్ ఇండస్ట్రీలోకి వచ్చేందుకు టెస్లా సిద్దమైన విషయం తెలిసిందే. దిగుమతి సుంకాలు అధిక ఉండడంతో టెస్లా రాక కాస్త ఆలస్యమవుతోంది. అధిక దిగుమతి సుంకాలపై ఇప్పటికే టెస్లా ప్రతినిధులు భారత ప్రభుత్వంతో చర్చలు జరిపినట్లు కూడా వార్తలు వచ్చాయి. తాజాగా భారత్‌లోకి టెస్లా ఎంట్రీ పై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ అభిప్రాయపడ్డారు. డ్యూటీ కోత తగ్గించే అవకాశం..! ఎలక్ట్రిక్ వాహనాలపై దిగుమతి సుంకాలను తగ్గించాలనే టెస్లా ప్రతిపాదనపై భారత ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకోనుంది. దిగుమతి సుంకాలపై ఎంతమేర కోత పెట్టవచ్చుననే అంశంపై కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తోందని నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ చెప్పారు. టెస్లా ప్రతిపాదనలపై ఆర్థిక శాఖ రెవెన్యూ విభాగం తుది నిర్ణయం తీసుకుంటుందని పేర్కొన్నారు. ప్రస్తుతం తాత్కాలికంగా మూడు సంవత్సరాల పాటు దిగుమతి సుంకాలను తాత్కాలికంగా తగ్గించే అవకాశాలపై కేంద్రం చర్చలు జరుపుతున్నట్లు ఆయన అన్నారు. చదవండి: లక్ష కోట్లకుపైగా నష్టం.. అయినా ‘అయ్యగారే’ నెంబర్ 1 ప్రభుత్వంతో చర్చలు..! ఎలక్ట్రిక్ వాహనాలపై దిగుమతి సుంకాలను తగ్గించాలని టెస్లా కోరిన విషయం తెలిసిందే. టెస్లాతో పాటుగా ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్ధ బీఎండబ్ల్యూ కూడా దిగుమతి సుంకాలపై ప్రభుత్వం మరొకసారి ఆలోచించాలని కోరింది. దిగుమతి సుంకాలను 40 శాతానికి తగ్గించడంతో భారత్‌లో ఎలక్ట్రిక్ వాహన అమ్మకాలు మరింత ఊపందుకునే అవకాశం ఉందని టెస్లా వాదించింది. అదనంగా 10 శాతం సోషల్ వెల్ఫేర్ సర్చార్జిని కూడా మాఫీ చేసే అంశంపై కూడా కంపెనీ ప్రభుత్వాన్ని కోరినట్లు తెలిసింది. విదేశీ కార్లపై దిగుమతి సుంకాలు భారత్‌లో ఇలా..! విదేశాల్లో తయారైన కార్లపై కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం 60-100 శాతం దిగుమతి సుంకాలను విధిస్తుంది. ఇంజిన్ పరిమాణంతో పాటు ధర, బీమా, రవాణా కలుకొని 40,000 డాలర్లు దాటితే ఈ సుంకం వర్తించనుంది. చదవండి: లక్షకోట్లకు పైగా నష్టం, రాజకీయాల్లోని ఆ వృద్దులపై నిషేదం విధించాలి..! ఎలన్ పిలుపు -
ఆర్బీకేలకు జాతీయస్థాయి ప్రశంసలు
ఆర్బీకేల కోసం చాన్నాళ్లుగా వింటున్నాం. చాలా మంచి ఆలోచన. వీటిద్వారా సంక్షేమ పథకాల అమలుతోపాటు సాగు ఉత్పాదకాలను రైతుల ముంగిటకు తీసుకెళ్తున్న తీరు చాలా బాగుంది. వీటిని జాతీయస్థాయిలో అమలు చేసేందుకు లోతైన చర్చ, అధ్యయనం జరగాల్సిన అవసరం ఉంది. –అమితాబ్‌కాంత్, సీఈవో, నీతి ఆయోగ్ వైఎస్సార్ రైతుభరోసా కేంద్రాల ఆలోచన వినూత్నంగా ఉంది. ప్రపంచంలో మరెక్కడా లేని విధంగా గ్రామస్థాయిలో ఏర్పాటు చేసిన వీటిద్వారా రైతులకు నాణ్యమైన సేవలందిస్తున్న తీరు అద్భుతం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అభినందనలు. – తోమియో షిచిరీ, భారత ప్రతినిధి, కంట్రీ డైరెక్టర్, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఏవో) సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన వైఎస్సార్ రైతుభరోసా కేంద్రాలు (ఆర్బీకేల) జాతీయస్థాయిలో ప్రశంసలందుకుంటున్నాయి. ఆర్బీకేల ఏర్పాటు, వాటి పనితీరుపై అధ్యయనం చేసేందుకు ఐక్యరాజ్యసమితికి అనుబంధంగా పనిచేస్తున్న ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఏవో)తో పాటు నీతి ఆయోగ్ ఆహ్వానం మేరకు వ్యవసాయశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ పూనం మాలకొండయ్య జాతీయస్థాయిలో పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. న్యూఢిల్లీలో తొలుత ఎఫ్‌ఏవోలోను, తర్వాత నీతి ఆయోగ్‌లోను ఆమె ఇచ్చిన ప్రజంటేషన్ పట్ల వారు అమితాసక్తిని ప్రదర్శించారు. ఆర్బీకేలు ఎప్పుడు ప్రారంభించారు. వాటిద్వారా ఏయే సేవలు అందిస్తున్నారో అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆలోచనల నుంచి.. ఈ సందర్భంగా పూనం మాలకొండయ్య మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆలోచనల నుంచి పుట్టిందే ఆర్బీకే వ్యవస్థ అని చెప్పారు. ఇవి ఆయన మానస పుత్రికలని తెలిపారు. ఆమె ఇంకా ఏమన్నారంటే.. ‘పాలనను ప్రజల ముంగిటకు తీసుకెళ్లాలన్న సంకల్పంతో దేశంలో ఎక్కడా లేనివిధంగా ప్రతి 2 వేల జనాభాకు ఓ గ్రామ సచివాలయం ఏర్పాటు చేసిన మా ప్రభుత్వం వాటికి అనుబంధంగా ఆర్బీకేల వ్యవస్థను తీసుకొచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా 10,778 ఆర్బీకేలను ఏర్పాటు చేశాం. వాటిలో స్మార్ట్‌టీవీ, డిజిటల్ లైబ్రరీ, కియోస్క్, భూసార, విత్తన పరీక్షలు చేసే మినీ టెస్టింగ్ కిట్లు, ఇంటర్నెట్ సదుపాయం కల్పించాం. అనుభవం, నైపుణ్యతగల 14 వేలమందికి పైగా వ్యవసాయ అనుబంధ శాఖల సిబ్బంది ద్వారా ఆర్బీకేలు కేంద్రంగా గ్రామస్థాయిలో విత్తు నుంచి విపణి వరకు రైతులకు నాణ్యమైన సేవలందిస్తున్నాం. సీజన్‌కు ముందుగానే ధ్రువీకరించిన విత్తనాలు, ఎరువులు, పురుగుమందులను అందుబాటులో ఉంచుతున్నాం. కియోస్క్‌లో బుక్ చేసుకున్న గంటల్లోనే వాటిని డోర్ డెలివరీ చేస్తున్నాం. ఆర్బీకేలనే పంట కొనుగోలు కేంద్రాలుగా తీర్చిదిద్దాం. వీటికి అనుబంధంగా వైఎస్సార్ యంత్ర సేవాకేంద్రాలు (కమ్యూనిటీ హైరింగ్ సెంటర్లు), గోదాములతో కూడిన మల్టీపర్పస్ ఫెసిలిటీ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నాం. రైతులకు క్షేత్రస్థాయిలో శిక్షణ ఇస్తున్నాం. పంటల నమోదు, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం’ అని ఆమె వివరించారు. సేంద్రియ పాలసీకి టెక్నికల్ పార్టనర్‌గా ఉంటాం రాష్ట్రంలో సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు త్వరలో ప్రత్యేక పాలసీని తీసుకొస్తున్నామని పూనం మాలకొండయ్య చెప్పారు. ఆర్గానిక్ సర్టిఫికేషన్ తీసుకొస్తున్నామని, ఇందుకోసం సాంకేతిక సహకారం అందించాలని కోరారు. ఎఫ్ఏవో కంట్రీ డైరెక్టర్ షిచిరీ మాట్లాడుతూ తప్పకుండా సాంకేతిక సహకారం అందిస్తామని చెప్పారు. టెక్నికల్ పార్టనర్‌గా కూడా ఉంటామని తెలిపారు. ఆర్థికంగా కూడా చేయూత ఇస్తామన్నారు. ఆర్బీకేల ఏర్పాటు, పనితీరు కోసం ఐక్యరాజ్యసమితికి కూడా నివేదిస్తామని చెప్పారు. నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్‌కాంత్ మాట్లాడుతూ ఆర్బీకేల ప్రయోగం మంచిదేనన్నారు. ఇతర రాష్ట్రాల్లో కూడా అమలు చేస్తే బాగుంటుందని పేర్కొన్నారు. దీనిపై జాతీయస్థాయిలో అధ్యయనం జరగాల్సిన అవసరం ఉందన్నారు. ఈ విషయమై కేంద్రానికి నివేదిక ఇస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏపీ సీడ్స్ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ గెడ్డం శేఖర్‌బాబు, పశుసంవర్ధకశాఖ డైరెక్టర్ ఆర్.అమరేంద్రకుమార్ తదితరులు పాల్గొన్నారు. -
గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో నీతిఆయోగ్ సీఈవో
సాక్షి, న్యూఢిల్లీ: నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ ఢిల్లీ మోతీబాగ్‌లోని తన నివాస ప్రాంగణంలో మూడు మొక్కలు నాటారు. టీఆర్ఎస్ ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా అమితాబ్‌కాంత్ ఆదివారం మొక్కలు నాటారు. అనంతరం నీతిఆయోగ్ సీఈవోకు వృక్ష వేదం పుస్తకాన్ని సంతోష్ బహూకరించారు. పుస్తక వివరాలతో పాటు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం గురించి ఆయన అడిగి తెలుసుకున్నారు. త్వరలోనే మరో ముగ్గురిని ఈ గ్రీన్ ఇండియా చాలెంజ్‌కి నామినేట్ చేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేత పాల్గొన్నారు. వైశ్య ఫెడరేషన్ ఆధ్వర్యంలో.. సాక్షి, హైదరాబాద్: గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో భాగంగా ‘ఊరిఊరికో జమ్మిచెట్టు.. గుడిగుడికో జమ్మిచెట్టు’ నినాదంతో ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు, రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీనివాస్ గుప్తా ఆదివారమిక్కడ జమ్మి మొక్కలను పంపిణీ చేశారు. -
అర్బన్ ప్లానింగ్ బలోపేతం కావాలి: నీతిఆయోగ్
సాక్షి, న్యూఢిల్లీ: అర్బన్ ప్లానింగ్ సామర్థ్యం పెంపునకు కీలక సంస్కరణలు అవసరమని నీతిఆయోగ్ నివేదిక స్పష్టం చేసింది. ‘అర్బన్ ప్లానింగ్ సామర్థ్యంలో సంస్కరణలు’ పేరుతో రూపొందించిన నివేదికను నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ డాక్టర్ రాజీవ్‌కుమార్, సీఈవో అమితాబ్ కాంత్, ప్రత్యేక కార్యదర్శి డాక్టర్ కె.రాజేశ్వర్ రావు గురువారం ఇక్కడ విడుదల చేశారు. 9 నెలల పాటు సంబంధిత మంత్రిత్వ శాఖలు, పట్టణ ప్రణాళిక, ప్రాంతీయ ప్రణాళికల నిపుణులతో చర్చించి నీతి ఆయోగ్ ఈ నివేదికను రూపొందించింది. ‘రానున్న కాలంలో పట్టణ భారతదేశం దేశ ఆర్థిక వృద్ధికి శక్తిని ఇస్తుంది. పట్టణ ప్రణాళిక సహా పట్టణ సవాళ్లు అధిగమించేందుకు అత్యున్నత విధానాలపై శ్రద్ధ అవసరం. పట్టణ ప్రణాళిక సామర్థ్యంలో ఉన్న అంతరాలను పూడ్చాల్సిన అవసరం ఉంది. లేదంటే వేగవంతమైన, సుస్థిరమైన, సమానమైన వృద్ధికి గల భారీ అవకాశాలను కోల్పోవాల్సి వస్తుంది..’ అని డాక్టర్ రాజీవ్ కుమార్ పేర్కొన్నారు. ‘ప్రభుత్వ, ప్రైవేటు రంగాల ఉమ్మడి కృషితో దేశంలోని నగరాలు మరింత నివాసయోగ్యంగా, సుస్థిర నగరాలుగా మారుతాయి..’ అని సీఈవో అమితాబ్ కాంత్ పేర్కొన్నారు. దేశంలోని 52 శాతం నగరాలకు మాస్టర్ ప్లాన్ లేదని నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది. దేశవ్యాప్తంగా 3,945 టౌన్ ప్లానర్ పోస్టులకు గాను 42 శాతం ఖాళీగా ఉన్నాయని పేర్కొంది. దేశంలో 12 వేలకు పైగా టౌన్ ప్లానర్ పోస్టులు అవసరమని సూచించింది. ప్రస్తుతం రాష్ట్రాల టౌన్ అండ్ కంట్రీ ప్లాన్ విభాగాల్లో సగటున నగరానికి ఒక ప్లానర్ కూడా లేరని నివేదిక పేర్కొంది. నివేదిక సిఫారసులు ► ఆరోగ్యకరమైన 500 నగరాలు: 2030 నాటికి ప్రతి నగరం అందరికీ ఆరోగ్యవంతమైన నగరం కావాలని ఆకాంక్షించాలి. ఈ దిశగా 500 హెల్తీ సిటీస్ ప్రోగ్రామ్‌ను ఐదేళ్ల పాటు అమలు చేసేలా కేంద్ర ప్రాయోజిత పథకాన్ని అమలు చేయాలి. ప్రాధాన్యత గల నగరాలు, పట్టణాలను రాష్ట్రాలు, స్థానిక సంస్థలు గుర్తించాలి. ► ప్రతిపాదిత హెల్తీ సిటీస్ ప్రోగ్రామ్ ద్వారా అన్ని నగరాలు, పట్టణాల్లో భూమి లేదా ప్రణాళిక ప్రాంత సామర్థ్యాన్ని పెంచేందుకు శాస్త్రీయ ఆధారాల ప్రాతిపదికన అభివృద్ధి నియంత్రణ నిబంధనలు బలోపేతం చేయాలి. ► ప్రభుత్వ రంగంలో అర్బన్ ప్లానర్ల కొరత తీర్చేందుకు రాష్ట్రాలు టౌన్ ప్లానర్ల ఖాళీలను భర్తీ చేయాలి. అలాగే మరో 8,268 పోస్టులను లాటరల్ ఎంట్రీ పొజిషన్స్గా కనీసం మూడేళ్లు, గరిష్టంగా ఐదేళ్లు ఉండేలా మంజూరు చేయడం ద్వారా కొరతను తీర్చాలి. ► పట్టణం, దేశ ప్రణాళిక విభాగాలు టౌన్ ప్లానర్ల కొరత ఎదుర్కొంటున్నందున రాష్ట్రాలు నియామక నిబంధనల్లో సవరణలు చేసి టౌన్ ప్లానింగ్ ఉద్యోగాల్లో అర్హులైన అభ్యర్థులు వచ్చేలా చర్యలు తీసుకోవాలి. ► పట్టణాలు ఎదుర్కొంటున్న సవాళ్లు పరిష్కరించేందుకు ప్రస్తుత పట్టణ ప్రణాళికా పాలనా నిర్మాణాన్ని రీ–ఇంజినీరింగ్ చేయాలి. ఇందుకు ఉన్నత స్థాయి కమిటీ రూపొందించాలి. ► పట్టణ, దేశ ప్రణాళిక చట్టాలను సమీక్షించి నవీకరించాలి. ఇందుకోసం రాష్ట్ర స్థాయిలో అపెక్స్ కమిటీ ఏర్పాటు చేయాలి. ► మాస్టర్ ప్లాన్ రూపకల్పనలో వివిధ దశల్లో పౌరులను భాగస్వాములను చేయాలి. ► సాంకేతిక కన్సల్టెన్సీ సేవలు సహా పలు అంశాల్లో ప్రయివేటు రంగం పాత్రను బలోపేతం చేయాలి. ► కేంద్రీయ విశ్వ విద్యాలయాలు, సాంకేతిక విద్యా సంస్థలు దశల వారీగా ప్లానింగ్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ కోర్సులు అందించాలి. ► కేంద్ర ప్రభుత్వ చట్టబద్ధమైన సంస్థగా ‘నేషనల్ కౌన్సిల్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానర్స్’ను నెలకొల్పాలి. ‘నేషనల్ డిజిటల్ ప్లాట్‌ఫామ్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానర్స్’ పోర్టల్‌ను ఏర్పాటు చేయడం ద్వారా టౌన్ ప్లానర్స్ రిజి్రస్టేషన్ చేసుకునే వెసులుబాటు కలి్పంచాలి. -
మహిళలకు ఆర్థిక సేవలు మరింతగా విస్తరించాలి
న్యూఢిల్లీ: ఆర్థిక సేవల రంగం పరిధిలోకి పెద్ద సంఖ్యలో మహిళలను తీసుకురావడానికి మరింత సమ్మిళిత వ్యవస్థ అవసరమమని నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ పేర్కొన్నారు. మహిళలు సులభతరంగా ఆర్థిక సేవలు పొందేందుకు డిజిటల్ సాధనాలు, వినూత్న పథకాలు వంటివి తోడ్పడగలవని ఆయన తెలిపారు. భారత్‌లోని మహిళలకు ఆర్థిక తోడ్పాటులో జన్ ధన్ పథకం ప్రాధాన్యం అంశంపై రూపొందిన నివేదిక ఆవిష్కరణ కార్యక్రమంలో వర్చువల్‌గా పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయం తెలిపారు. ఉమెన్స్ వరల్డ్ బ్యాంకింగ్, ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం బ్యాంక్ ఆఫ్ బరోడా కలిసి దీన్ని రూపొందించాయి. మహిళా కరెస్పాండెంట్స్ నియామకం వంటి వినూత్న విధానాలతో బ్యాంకింగ్, ఆర్థిక సర్వీసుల రంగం పరిధిలోకి మరింత మంది మహిళా కస్టమర్లను తీసుకువచ్చేందుకు ప్రభుత్వ రంగ బ్యాంకులకు అవకాశాలు ఉన్నాయని కాంత్ చెప్పారు. మహిళలు ఆర్థికంగా స్వతంత్ర ప్రతిపత్తి సాధించడానికి జన్ ధన్, ఆధార్, మొబైల్ (జేఏఎం) ఊతంతో, 40 కోట్ల మంది ప్రజలు అధికారికంగా ఆర్థిక సేవల పరిధిలోకి వచ్చారని పేర్కొన్నారు. మరోవైపు, మహిళలకు ఆర్థిక సేవలను మరింత చేరువ చేసేందుకు జన్ ధన్ ప్లస్ విధానాన్ని పాటించవచ్చని నివేదిక సూచించింది. దీని ప్రకారం నాలుగు నెలల పాటు జన్ ధన్ ఖాతాలో రూ. 500 డిపాజిట్ చేస్తే.. ప్రోత్సాహకంగా రూ. 10,000 మేర రుణం/ఓవర్‌డ్రాఫ్ట్ ఇవ్వొచ్చని పేర్కొంది. 2020 ఫిబ్రవరి–2020 ఆగస్టు మధ్యకాలంలో 101 బీవోబీ శాఖల్లో దీన్ని ప్రయోగాత్మకంగా అమలు చేయగా 50,000 మంది పురుషులు, మహిళ కస్టమర్లు జన్ ధన్ ప్లస్ ఖాతాలు తీసుకున్నట్లు వివరించింది. -
నీతి ఆయోగ్ సీఈఓకు నిరసన సెగ
సాక్షి,విశాఖపట్నం: విశాఖ స్టీల్‌ప్లాంట్ ఉద్యమం మరింత ఉధృతమవుతోంది. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికులు ఆందోళనకు దిగారు. గురువారం నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ బస చేసిన హిల్‌టాప్ గెస్ట్‌హౌస్ వద్ద కార్మికులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్యర్యంలో ఈ పోరాటాన్ని చేపట్టారు. ‘సేవ్ వైజాగ్ స్టీల్’ అంటూ నినదించారు. నీతి ఆయోగ్ సీఈఓ గో బ్యాక్ అనే నినాదాలతో హోరెత్తించారు. సీఈఓ అమితాబ్ కాంత్ గురువారం మెడ్‌టెక్ జోన్లో పర్యటించనున్నారు. చదవండి: Afghanistan: ఆమె భయపడినంతా అయింది! -
ఎలక్ట్రిక్ వాహన ప్రియులకు కేంద్రం శుభవార్త!
ఎలక్ట్రిక్ వాహన ప్రియులకు కేంద్రం శుభవార్త అందించింది. ప్రస్తుతం వేగంగా విస్తరిస్తున్న ఎలక్ట్రిక్ వాహన రంగం కోసం అంతే వేగంగా మౌలిక సదుపాయాలను కల్పించడానికి కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థలతో కలిసి పనిచేయనున్నట్లు తెలిపింది. ఇందుకోసం విధి విధానాలు గల ఒక హ్యాండ్ బుక్ ను నీతి ఆయోగ్ విడుదల చేసింది. ఈ హ్యాండ్ బుక్ ను నీతి ఆయోగ్, విద్యుత్ మంత్రిత్వ శాఖ, సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం, బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ, వరల్డ్ రిసోర్సెస్ ఇనిస్టిట్యూట్ ఇండియా కలిసి సంయుక్తంగా అభివృద్ధి చేసింది. ఈ కార్యక్రమంలో నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్ మాట్లాడుతూ.. "భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహన రంగం వేగంగా అభివృద్ధి చెందుతోంది. అనేక మంది పోటీదారులు ఛార్జింగ్ మౌలిక సదుపాయాల మార్కెట్లోకి ప్రవేశిస్తున్నారు. ఈ హ్యాండ్ బుక్ ప్రభుత్వ & ప్రైవేట్ భాగస్వాములతో కలిసి ఈవి ఛార్జింగ్ నెట్ వర్క్ లను ఏర్పాటు చేయడంలో కలిసి పనిచేయడానికి సహకరిస్తుంది. ఈవి ఛార్జింగ్ నెట్ వర్క్ లను అమలు చేయడంలో వివిధ స్థానిక అధికారులు ఎదుర్కొంటున్న సవాళ్లను ఈ హ్యాండ్ బుక్ పరిష్కరిస్తుంది" అని అన్నారు. ఈవి ఛార్జింగ్ సౌకర్యాలను సులభతరం చేయడానికి ప్రతి 25 కిలోమీటర్లకు ఒక ఛార్జింగ్ స్టేషన్ ఏర్పాటు చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా చేసుకుంది. ఈవిలకు ఛార్జింగ్ అందించడం వల్ల డిస్కమ్‌లపై కొత్త రకం పవర్ డిమాండ్ ఏర్పడుతుంది. ఛార్జింగ్ మౌలిక సదుపాయాల కొరకు అంతరాయం లేని పవర్ సప్లైని అందించడానికి ఎలక్ట్రికల్ డిస్ట్రిబ్యూషన్ నెట్ వర్క్ ల సామర్ధ్యం పెంచేలా ఈ పుస్తకంలో మార్గానిర్దేశం చేసినట్లు కేంద్రం పేర్కొంది.