
పాంజిమ్: కృత్రిమ మేథ (ఏఐ)తో మానవాళి అభివృద్ధికి కొత్త అవకాశాలు లభించగలవని జీ20 షెర్పా అమితాబ్ కాంత్ తెలిపారు. పనితీరు, పరివర్తనలో సాంకేతికత కీలకపాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు. సమాచార సేకరణ, ప్రాసెసింగ్, వితరణ ప్రక్రియ అంతా వేగంగా, సమర్థమంతంగా నిర్వహించేందుకు తోడ్పడుతోందని రెండో జీ20–ఎస్‌ఏఐ (సుప్రీం ఆడిట్ ఇన్‌స్టిట్యూషన్) సదస్సులో పాల్గొన్న సందర్భంగా తెలిపారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల వ్యక్తిగత గోప్యత (ప్రైవసీ), నకిలీ వార్తలపరమైన సవాళ్లు తలెత్తవచ్చని ఆయన చెప్పారు.