New Opportunities
-
ఏఐతో కొత్త అవకాశాలు
ముంబై: ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాంకేతికత భారత్‌లో కొత్త అవకాశాలను తెచి్చపెడుతుందని అంతర్జాతీయ జాబ్ సైట్ ఇండీడ్ నివేదిక తెలిపింది. వచ్చే అయిదేళ్లలో ఏఐ నూతన ఉద్యోగాలను సృష్టిస్తుందని సర్వేలో పాలుపంచుకున్న 85 శాతం కంపెనీలు అభిప్రాయపడ్డాయని వెల్లడించింది. ‘ఏఐ రాకతో ఉద్యోగుల పనుల స్వభావాన్ని మెరుగుపరుస్తుందని 85 శాతం సంస్థలు ఆశిస్తున్నాయి. ఉద్యోగ భద్రత, ఉద్యోగులకు కెరీర్ అభివృద్ధికి అవకాశాలను మెరుగుపరుస్తుందని 77 శాతం కంపెనీలు విశ్వసిస్తున్నాయి. 63 శాతం మంది ఉద్యోగార్ధులు ఏఐ ప్రభావం గురించి తాము సంతోషిస్తున్నామని చెప్పారు. ఈ నూతన సాంకేతికత మరిన్ని ఉద్యోగాలను సృష్టించే అవకాశం ఉందని 53 శాతం మంది అంగీకరించారు’ అని సర్వే తెలిపింది. అంతర్జాతీయంగా ఏడు మార్కెట్లలో ఇండీడ్ తరఫున సెన్సస్‌వైడ్ నిర్వహించిన ఈ సర్వేలో 7,275 కంపెనీలు, ఉద్యోగులు పాలుపంచుకున్నారు. ఇందులో భారత్ నుంచి 1,142 కంపెనీలు, అభ్యర్థులు ఉన్నారు. భారత్‌లో ఇలా.. భారతీయ ఉద్యోగార్ధులు ఏఐ సిస్టమ్స్, టూల్స్ సంభావ్య ప్రయోజనాలను స్వీకరిస్తున్నప్పటికీ వారికి కూడా ఆందోళనలు ఉన్నాయని నివేదిక వెల్లడించింది. రీస్కిల్లింగ్, అప్‌స్కిల్లింగ్ అవసరమని 43 శాతం, వారు పనిచేస్తున్న రంగం లేదా వృత్తిలో సంభావ్య ఉద్యోగ నష్టాలు ఉండొచ్చని 29 శాతం మంది అభిప్రాయపడ్డారు. హెచ్ఆర్/టాలెంట్ అక్విజిషన్ లీడర్లలో ఏఐ సిస్టమ్స్, టూల్స్ తమ పనిని సులభతరం చేస్తాయని 90 శాతం, నియామకం, అభ్యర్థుల అనుభవాన్ని మెరుగుపరుస్తుందని 86 శాతం మంది నమ్ముతున్నారని వివరించింది. ఏఐ సిస్టమ్స్, టూల్స్ తమ ఉద్యోగానికి సంబంధించిన మరింత మానవ అంశాలపై దృష్టి పెట్టేందుకు వీలు కలి్పస్తాయని దాదాపు 81 శాతం కంపెనీలు ఆశాభావం వ్యక్తం చేశాయి. కంపెనీలు, ఉద్యోగులు ఏఐపై అత్యంత ఆశాభావంగా ఉన్నారని తెలిపింది. 98 శాతం హెచ్ఆర్ నిపుణులు, 91 శాతం ఉద్యోగార్ధులు ప్రస్తుతం పని కోసం ఏఐ సాధనాలను ఉపయోగిస్తున్నారని నివేదిక వివరించింది. -
ఏఐతో కొత్త అవకాశాలు.. ప్రైవసీకి సవాళ్లు
పాంజిమ్: కృత్రిమ మేథ (ఏఐ)తో మానవాళి అభివృద్ధికి కొత్త అవకాశాలు లభించగలవని జీ20 షెర్పా అమితాబ్ కాంత్ తెలిపారు. పనితీరు, పరివర్తనలో సాంకేతికత కీలకపాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు. సమాచార సేకరణ, ప్రాసెసింగ్, వితరణ ప్రక్రియ అంతా వేగంగా, సమర్థమంతంగా నిర్వహించేందుకు తోడ్పడుతోందని రెండో జీ20–ఎస్ఏఐ (సుప్రీం ఆడిట్ ఇన్స్టిట్యూషన్) సదస్సులో పాల్గొన్న సందర్భంగా తెలిపారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల వ్యక్తిగత గోప్యత (ప్రైవసీ), నకిలీ వార్తలపరమైన సవాళ్లు తలెత్తవచ్చని ఆయన చెప్పారు. -
యువశక్తే చోదక శక్తి: ప్రధాని నరేంద్ర మోదీ
కొచ్చి: దేశ అభివృద్ధి ప్రయాణానికి యువ శక్తే చోదక శక్తి అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ప్రపంచంలో అత్యంత వేగంగా ఎదుగుతున్న ఆర్థిక శక్తిగా భారత్ మారడం వెనుక యువత భాగస్వామ్యం ఉందని ప్రశంసించారు. భారత్ ఒకప్పుడు అభివృద్ధిలో వెనుకబడి ఉండేదని గుర్తుచేశారు. ఇప్పుడు మన దేశం వేగంగా అభివృద్ధి చెందుతోందని, బలమైన ఆర్థిక శక్తిగా ఆవిర్భవిస్తోందని హర్షం వ్యక్తం చేశారు. ఇదంతా యువత కృషి వల్ల సాధ్యమవుతోందని పేర్కొన్నారు. వారిపై తనకు ఎంతో విశ్వాసం ఉందన్నారు. కేరళలోని కొచ్చిలో సోమవారం ‘యువం–2023’ సదస్సులో ప్రధాని మోదీ ప్రసంగించారు. 21వ శతాబ్దం భారతదేశ శతాబ్దమని ప్రపంచమంతటా అందరూ చెబుతున్నారని, యువ శక్తి మన దేశానికి ఒక పెన్నిధి అని వివరించారు. తాము సంస్కరణలు తీసుకొస్తున్నామని, యువత వాటి ఫలితాలను తీసుకొస్తోందని పేర్కొన్నారు. గత ప్రభుత్వాలు అవినీతిగా మారుపేరుగా ఉండేవని, బీజేపీ ప్రభుత్వం యువత కోసం నూతన అవకాశాలను సృష్టిస్తోందని నరేంద్ర మోదీ చెప్పారు. స్వయం సమృద్ధ సమాజాన్ని సృష్టించాలన్నదే తమ లక్ష్యమని వెల్లడించారు. యువత ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని పని చేస్తున్నామని తెలిపారు. కేంద్ర సాయుధ పోలీసు దళాల్లో కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి 13 ప్రాంతీయ భాషల్లోనూ పరీక్ష నిర్వహించాలని కేంద్రం ఇటీవల నిర్ణయం తీసుకుందని గుర్తుచేశారు. భారత్ ఎప్పటికీ మారబోదని గతంలో ప్రజలు భావించేవారని, ఇప్పుడు ప్రపంచాన్ని మార్చగలిగే శక్తి భారత్‌కు ఉందని మోదీ వ్యాఖ్యానించారు. నేటి ఆత్మనిర్భర్ భారత్ డిజిటల్ ఇండియా గురించి మాట్లాడుతోందని అన్నారు. మోదీకి ఘన స్వాగతం మోదీకి సోమవారం సాయంత్రం కేరళలోని కొచ్చిలో ఘన స్వాగతం లభించింది. ఐఎన్ఎస్ గరుడ నావల్ ఎయిర్ స్టేషన్ నుంచి యువం సదస్సు వేదిక దాకా రెండు కిలోమీటర్ల మేర రోడ్డు షోలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేరళ సంప్రదాయ దుస్తులను ధరించారు. కాసేపు నడిచి, తర్వాత వాహనం నుంచి అభివాదం చేశారు. కాంగ్రెస్ పాలనలో పల్లెలపై సవతి తల్లి ప్రేమ రేవా: గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు పల్లెలపై సవతి తల్లి ప్రేమ చూపాయని ప్రధాని మోదీ దుయ్యబట్టారు. బీజేపీ ప్రభుత్వం ఆ పరిస్థితిని పూర్తిగా మార్చివేసిందని, గ్రామ సీమల అభివృద్ధికి భారీగా నిధులు కేటాయించిందని జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా సోమవారం మధ్యప్రదేశ్‌లోని రేవాలో బహిరంగ సభలో ఆయన అన్నారు. పంచాయతీరాజ్ సంస్థలకు నిధుల్లో కోత పెట్టి, ఎన్నికలను వాయిదా వేస్తోంది బీజేపీ ప్రభుత్వమేనంటూ కాంగ్రెస్ ఘాటుగా స్పందించింది. -
Work From Home: అమ్మాయిలూ.. అవకాశాలివిగో!
మహమ్మారి పుణ్యమాని మహిళలను కొత్త అవకాశాలు ఊరిస్తున్నాయి. పెట్టుబడి లేకుండా ఇంటి పట్టున ఉంటూనే సంపాదించే మార్గాలూ పుట్టుకొచ్చాయి. విదేశీ గడ్డపైనే ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదు.. అదే విదేశీ సంస్థకు ఇంటి నుంచే పని చేసే పరిస్థితులొచ్చాయి. కావాల్సిందల్లా నైపుణ్యం పెంచుకుని, అవకాశాన్ని అందిపుచ్చువడమే. మార్కెట్‌కు అనుగుణంగా తమను తాము తీర్చిదిద్దుకున్న మహిళల కోసం కంపెనీలు క్యూ కడు తున్నాయి. అడిగినంత వేతనం.. ఇచ్చేందుకూ దిగ్గజ సంస్థలు వెనుకాడడం లేదు. వ్యాపార, ఉద్యోగ, ఉపాధి అవకాశాలపై నిపుణుల అభిప్రాయాలతో సాక్షి బిజినెస్ బ్యూరో ప్రత్యేక కథనం.. వ్యాపారం ఆకర్షణీయం.. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు పనిచేసే రోజులు పోయాయి. మహిళలకు వ్యాపారం అనుకూల, ఆకర్షణీయ కెరీర్‌గా మారిపోయింది. వ్యాపారంలో వైఫల్యాలనూ అంగీకరిస్తున్నారు. టెక్నాలజీ సాయంతో చిన్నగా ప్రారంభించి అంతర్జాతీయ స్థాయికి ఎదగొచ్చు అని నిరూపిస్తున్నారు. డబ్బులు సంపాదించడమేగాక వందలాది మందికి ఉపాధి అవకాశాలనూ సృష్టిస్తున్నారు. బిజినెస్‌లోకి రావాలంటే డబ్బు ఒక్కటే ప్రధానం కాదు. అంకిత భావం, సరైన మార్గదర్శి ఉండాలి. వ్యాపారం పేరుతో గతంలో ఇబ్బడిముబ్బడిగా రుణాలు తీసుకునేవారు. ఇప్పుడు అలా కాకుండా అవసరం మేరకే లోన్ తీసుకుంటున్నారు. దీంతో బ్యాంకులూ రుణాలిచ్చి ప్రోత్సహిస్తున్నాయి. –దీప్తి రావుల, సీఈవో, వీ–హబ్ ప్రత్యేక నైపుణ్యంతో.. కోవిడ్ రాకతో ఆటోమేషన్, డిజిటల్ పరివర్తన దిశగా కంపెనీలు సాగుతున్నాయి. ఇదే మహిళలకు కొత్త అవకాశాలను అందిస్తోంది. విదేశాలకు వెళ్లకుండానే ఎంఎన్సీల్లో జాబ్ సంపాదించి ఇంటి నుంచే విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రత్యేక నైపుణ్యం ఉన్న మహిళల కోసం కంపెనీలు ప్రపంచం నలుమూలలా వెతుకుతున్నాయి. ఐటీతోపాటు ఫార్మా, బయాలాజిక్స్లోనూ ఇదే పరిస్థితి. అన్ని రంగాల్లోనూ కంపెనీలు సామర్థ్యం పెంచుకునే దిశగా అడుగులేస్తున్నాయి. ఒక రోల్లో కొరత ఉందంటే చాలు అభ్యర్థులకు కాసులు కురిపిస్తోంది. ప్రస్తుతం పనిచేస్తున్న కంపెనీలో రూ.5 లక్షల వేతనం ఉంటే.. కొత్త సంస్థ రూ.50 లక్షలు చెల్లించేందుకూ వెనుకాడడం లేదు. అమ్మాయిలకు స్థిరత్వం, నిబద్ధత ఉంటుందన్న భావన కంపెనీల్లో పెరిగింది. వీరికి అత్యంత కీలక విభాగాలనూ అప్పగిస్తున్నారు. – జయశ్రీ పవని, హెడ్, స్ట్రాటజిక్ రిక్రూట్మెంట్, స్ట్రయిక్ ఇట్–రైట్ మేనేజ్మెంట్ కన్సల్టింగ్ పెట్టుబడి లేకుండానే.. టెక్నాలజీని ఊతంగా చేసుకుని ఉపాధికి కొత్త మార్గాలను వెతుక్కుని మహిళలు సక్సెస్ అవుతున్నారు. పెట్టుబడి లేకుండానే ఇంటి నుంచే సంపాదిస్తున్నారు. వ్యాపారం చేయాలన్న తపన పల్లెల్లోని మహిళలకూ విస్తరించింది. సోషల్ మీడియాలో ఎంత చురుకుగా ఉంటే అంతలా ఆదాయం గడిస్తున్నారు. రాష్ట్రాలే కాదు విదేశీ గడ్డపైనా వ్యాపారాలను విస్తరిస్తున్నారు. ఆన్‌లైన్‌ను వేదికగా చేసుకుని డిజిటల్ మార్కెటింగ్, ఈవెంట్స్, యూట్యూబ్ బ్లాగ్స్, ట్యూషన్స్, డ్యాన్స్, మ్యూజిక్, న్యాయ సలహాలు, క్రాఫ్టŠస్, స్ట్రెస్ మేనేజ్మెంట్, మోటివేషనల్ క్లాసెస్ వంటివి ఉపాధిగా ఎంచుకుంటున్నారు. బ్యూటీ, ఫ్యాషన్ స్టైలిస్ట్‌గా, ఫిట్నెస్ శిక్షకులుగా కెరీర్ మలుచుకుంటున్నారు. ఇంటి వంటకాలను స్విగ్గీ, జొమాటో ద్వారా విక్రయిస్తున్నారు. ఉద్యోగం చేస్తూనే అదనపు సంపాదనపై దృష్టిపెడుతున్నారు. – లత చౌదరి బొట్ల, ఫౌండర్, నారీసేన. ఉద్యోగం మానేసినా.. అప్లికేషన్, ప్రాజెక్ట్ రూపకల్పన, అమలుకు ఐటీ కంపెనీలు విభిన్న సాంకేతికలను (టెక్ స్టాక్) ఉపయోగిస్తాయి. అభ్యర్థిలో టెక్నికల్ స్కిల్స్ ఏ మేరకు ఉన్నాయన్నదే ప్రధానం. కమ్యూనికేషన్ స్కిల్స్ అదనపు అర్హత మాత్రమే. కొత్త కోర్సులను నేర్చుకుని నూతన వర్షన్స్‌కు తగ్గట్టుగా అభ్యర్థులు అప్‌గ్రేడ్ అవ్వాలి. ఇలాంటి ఉద్యోగులకు ఒక్కొక్కరి చేతుల్లో మూడుకుపైగా ఆఫర్ లెటర్లు ఉంటున్నాయి. ఎక్కడ అధిక వేతనం ఆఫర్ చేస్తే అక్కడే చేరుతున్నారు. ఈ నేపథ్యంలో కంపెనీలు తమ ఉద్యోగులు చేజారకుండా ప్రమోషన్‌తో వేతనం పెంచుతున్నాయి. మధ్యలో ఉద్యోగం మానేసినా నైపుణ్యం ఉన్న అభ్యర్థులను మళ్లీ చేర్చుకుంటున్నాయి. – రేచల్ స్టెల్లా రాజ్, టాలెంట్ అక్విజిషన్ అనలిస్ట్ -
కరోనా సంక్షోభం తర్వాతే కొత్త అవకాశాలు
సాక్షి, హైదరాబాద్: కరోనా సంక్షోభం ముగిసిన తర్వాతే కొత్త అవకాశాలు వస్తాయని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు. తెలంగాణ రాష్ట్రం పెట్టుబడులకు కేంద్రంగా మారిందని, ప్రస్తుత సంక్షోభం తర్వాత వివిధ రంగాల్లో రానున్న మార్పులకు అనుగుణంగా మరిన్ని పెట్టుబడులు తెచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని తెలిపారు. గురువారం సీఐఐ నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఇన్వెస్ట్ ఇన్ తెలంగాణ అపర్చునిటీస్ ఇన్ పోస్ట్ కోవిడ్ వరల్డ్ పేరుతో రెండ్రోజుల పాటు జరిగే ఈ వర్చువల్ కాన్ఫరెన్సులో పలువురు వ్యాపారవేత్తలు, వివిధ రంగాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఐఐ రూపొందించిన నిజామాబాద్ డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ ప్లాన్‌ను మంత్రి విడుదల చేశారు. ప్రస్తుత కరోనా సంక్షోభంతో ప్రపంచం డిజిటలీకరణ వైపు వెళ్తుందని, తెలంగాణ సైతం ఈ మార్గాన్ని అందిపుచ్చుకోవడానికి సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. (జనరల్ పర్పసెస్ కమిటీ సభ్యుడిగా కేకే) ఇప్పటికే తెలంగాణ ఫైబర్ గ్రిడ్ ద్వారా ఇంటింటికీ ఇంటర్నెట్ అందించే పనులు చురుగ్గా సాగుతున్నాయని తెలిపారు. పల్లెలకు ఇంటర్నెట్ వెళ్లిన తర్వాత ఎడ్యుకేషన్, హెల్త్ కేర్ వంటి రంగాల్లో విప్లవాత్మక మార్పులు వస్తాయని, ఇది డిజిటల్ విప్లవం వైపు తెలంగాణను తీసుకెళ్తుందన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరికీ ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చిన తర్వాత కొత్త అవకాశాలు వస్తాయని, ఆ దిశగా తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ ద్వారా వివిధ కార్యక్రమాలు చేపట్టనున్నట్లు మంత్రి వెల్లడించారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం 14 ప్రాధాన్యత రంగాలను ఎంచుకుందని, ఆయా రంగాల్లో పెట్టుబడులు పెట్టే వారికి ప్రాధాన్యత ఇస్తామని స్పష్టం చేశారు. హైదరాబాద్‌ను స్టార్టప్ క్యాపిటల్‌గా తయారు చేసే ఉద్దేశంతో ప్రభుత్వం గత ఐదేళ్లుగా అనేక కార్యక్రమాలు చేపట్టిందని, ఇందులో భాగంగా టీ హబ్ ఏర్పాటు ఇండియన్ స్టార్టప్ ఈకో సిస్టంలో ఒక గొప్ప మార్పుకి కారణమైందన్నారు. దీంతో పాటు మహిళల కోసం ప్రత్యేకంగా వి–హబ్‌ను కూడా ఏర్పాటు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. ప్రపంచస్థాయి పారిశ్రామిక పార్కులు... రాష్ట్రంలో భారీ స్థాయిలో పారిశ్రామిక పార్కులు ఉండాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతుందని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఇందులో భాగంగా హైదరాబాద్ ఫార్మా సిటీ ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మా క్లస్టర్ అని, దేశంలోనే అతి పెద్దదైన కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్, మెడికల్ డివైజెస్ లాంటి వివిధ పారిశ్రామిక పార్కుల అభివృద్ధి చేపడుతున్నామని పేర్కొన్నారు. అన్ని రంగాలకు 24 గంటలూ విద్యుత్‌ను సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని పేర్కొన్నారు. పారిశ్రామిక రంగానికే కాకుండా వ్యవసాయ రంగానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రాధాన్యత ఇచ్చిందన్నారు. సాగునీటి ప్రాజెక్టులు, రైతుబంధు, రైతు బీమా తదితర సంక్షేమ కార్యక్రమాలు రైతుల కోసం చేపట్టామన్నారు. ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్లే దేశంలోనే అత్యధికంగా రాష్ట్రంలో సాగు నమోదైందన్నారు. రాష్ట్రంలోని రైతుల సంక్షేమానికి ప్రభుత్వం ఎప్పుడు అండగా ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు. -
డిజిటల్‌తో అవకాశాల వెల్లువ
జోహన్నెస్‌బర్గ్: డిజిటల్ విప్లవంతో బ్రిక్స్, ఇతర వర్థమాన దేశాలకు కొత్త అవకాశాలు వెల్లువెత్తాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. కృత్రిమ మేథ, బిగ్‌డేటా అనలిటిక్స్ వల్ల వచ్చే మార్పుకు ఈ దేశాలు సంసిద్ధం కావాలని పిలుపునిచ్చారు. జోహన్నెస్‌బర్గ్‌లో జరుగుతున్న బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు చివరి రోజు శుక్రవారం నిర్వహించిన ‘ఔట్రీచ్ సెషన్’లో మోదీ ప్రసంగించారు. డిజిటల్ మౌలిక వసతులు, నైపుణ్యాభివృద్ధికి అధిక మొత్తంలో పెట్టుబడులు పెట్టాలని సభ్య దేశాలకు పిలుపునిచ్చారు. ఆఫ్రికా దేశాలతో భారత్‌కున్న చారిత్రక, లోతైన సంబంధాలను ప్రస్తావించారు. ‘డిజిటల్ విప్లవం వల్ల ఈ రోజు మనం మరో చారిత్రక సందర్భానికి చేరువలో ఉన్నాం. కొత్త అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. కృత్రిమ మేథ, బిగ్‌డేటా అనలిటిక్స్ తీసుకొచ్చే మార్పుకు పూర్తిగా సంసిద్ధం కావాలి. ఆఫ్రికాలో అభివృద్ధి, శాంతి స్థాపనకు భారత్ అధిక ప్రాధాన్యం ఇస్తుంది. భారత్–ఆఫ్రికా దేశాల మధ్య ఆర్థిక, అభివృద్ధి సహకారం కొత్త శిఖరాలను తాకింది. గత నాలుగేళ్లలో ఇరు వర్గాల మధ్య దేశాధినేతలు, ఉన్నతాధికారుల స్థాయిలో 100కు పైగా ద్వైపాక్షిక చర్చలు, పర్యటనలు జరిగాయి. 40 ఆఫ్రికా దేశాలకు సుమారు రూ.75 వేల కోట్లకు పైగా రుణ సాయం కల్పించాం. ఆఫ్రికా ప్రాంతీయ ఆర్థిక కూటమికి జరుగుతున్న ప్రయత్నాలను భారత్ స్వాగతిస్తోంది. స్వేచ్ఛా వాణిజ్యం వల్ల గత మూడు దశాబ్దాల్లో లక్షలాది మంది ప్రజలు పేదరికం నుంచి బయటపడ్డారు. ప్రపంచీకరణ ఫలాలను వారికి చేరువచేయడం చాలా ముఖ్యం. 2008 నాటి ఆర్థిక సంక్షోభం తరువాత ప్రపంచీకరణకు రక్షణాత్మక వాణిజ్య విధానాలు సవాలుగా మారాయి’ అని మోదీ అన్నారు. ఆఫ్రికా దేశాలతో సంబంధాల బలోపేతానికి ఉగాండా పార్లమెంట్లో ప్రతిపాదించిన 10 మార్గదర్శక సూత్రాలను మరోసారి ప్రస్తావించారు. మూడు ఆఫ్రికా దేశాల పర్యటన, బ్రిక్స్ సదస్సు ముగించుకుని మోదీ శుక్రవారం సాయంత్రం భారత్ తిరుగు పయనమయ్యారు. పుతిన్‌తో మోదీ భేటీ.. జోహన్నెస్‌బర్గ్‌లో ప్రధాని మోదీ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో సమావేశమై ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ‘పుతిన్‌తో చర్చలు ఫలప్రదంగా జరిగాయి. రష్యా–భారత్‌ల స్నేహం దృఢమైనది. భిన్న రంగాల్లో సహకారం, కలసిపనిచేయడాన్ని రెండు దేశాలు కొనసాగిస్తాయి’ అని మోదీ ట్వీట్ చేశారు. వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధనం, రక్షణ, పర్యాటకం తదితరాలపై ఇరువురు నేతలు విస్తృతంగా చర్చించారని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీశ్ కుమార్ వెల్లడించారు. మరోవైపు, టర్కీ, అంగోలా, అర్జెంటీనా అధ్యక్షులతోనూ మోదీ వేర్వేరుగా సమావేశమై చర్చలు జరిపారు. గోల్డ్ మైనింగ్‌కు ‘బ్రిక్స్’ ప్రశంస.. రష్యాలోని సైబీరియాలో భారత్ నేతృత్వంలో ప్రారంభంకానున్న బంగారం తవ్వకాల ప్రాజెక్టును బ్రిక్స్ కూటమి ప్రశంసించింది. çక్లుచెవెస్కోయె గోల్డ్ మైనింగ్ పేరిట నిర్వహిస్తున్న ఈ ప్రాజెక్టులో భారత్‌కు చెందిన సన్ గోల్డ్ లిమిటెడ్‌దే కీలక పాత్ర. చైనా నేషనల్ గోల్డ్ గ్రూప్ కార్పొరేషన్, రష్యా సావెరిన్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్, ఫార్ ఈస్ట్ అండ్ బైకాల్ రీజియన్ డెవలప్మెంట్ ఫండ్లతో పాటు బ్రెజిల్, దక్షిణాఫ్రికా ప్రైవేట్ పెట్టుబడిదారులకు ఇందులో భాగస్వామ్యం కల్పించారు. ఈ గనుల నుంచి ఏటా 6.5 టన్నుల బంగారాన్ని వెలికితీసేలా ప్రణాళికలు రచించారు. ఉత్పాదకత ప్రారంభించడానికి ముందు సుమారు రూ.34 వేల కోట్ల పెట్టుబడి పెట్టనున్నారు. అతిపెద్ద పెట్టుబడి, సాంకేతిక భాగస్వామి చైనా కంపెనీ కాగా, రష్యాలో ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్న సన్ గోల్డ్ లిమిటెడ్ అనుభవం ఈ ప్రాజెక్టుకు కీలకం కానుంది. -
ఎలా ఉంటున్నారో అలాగే ఉండండి...
జనవరి 30 నుంచి ఫిబ్రవరి 5 వరకు టారో బాణి ఏరిస్ (మార్చి 21- ఏప్రిల్ 20) కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. ఎవరైనా మిమ్మల్కి ఎక్కువగా ప్రశంసిస్తుంటే దాని వెనుక ఏదో స్వార్థం ఉందన్న విషయాన్ని గుర్తించండి. కొన్ని విషయాల్లో మిమ్మల్ని కొందరు వ్యతిరేకించవచ్చు. నిరుత్సాహపడవద్దు. ఒత్తిడికి లోను కావద్దు. ఈ పరిస్థితి ఎక్కువ కాలం కొనసాగదు. కలసివచ్చే రంగు: వంకాయ రంగు టారస్ (ఏప్రిల్ 21-మే 20) ఈ వారం అన్నింట్లోనూ తటస్థంగా ఉండటం మంచిది. పనులతో ఉక్కిరి బిక్కిరై ఊపిరి సలపని పరిస్థితి వస్తుంది. మిమ్మల్ని మీరు అందుకు సిద్ధం చేసుకుని, సకాలంలో పనులు పూర్తి చేయడానికి ప్రయత్నించండి. వృత్తిగత జీవితానికీ వ్యక్తిగత జీవితానికీ మధ్య సమన్వయం ఏర్పరచుకోవడానికి ప్రయత్నించండి. బంధాలను నిర్లక్ష్యం చేయకండి. కలసివచ్చే రంగు: బ్రౌన్ జెమిని (మే 21-జూన్ 21) మీలో మీరు కొన్ని మార్పులు చేసుకోవాల్సిన తరుణం. కొన్ని అనవసరమైన విషయాలకై డబ్బు ఖర్చు చేస్తున్న విషయాన్ని గుర్తించండి. ఓ పెద్ద అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. అయితే నిర్ణయం తీసుకోవడంలో మీరు కాస్త కష్టపడాల్సి రావచ్చు. ఎప్పుడో విడిపోయిన ఓ పాత నేస్తం మళ్లీ మీ జీవితంలోకి వస్తారు. కలసివచ్చే రంగు: పీచ్ క్యాన్సర్ (జూన్22-జూలై 23) కాస్త నిరుత్సాహకరమైన వారం. కానీ మీరు కాస్త ప్రయత్నిస్తే అన్నింట్లోనూ విజయం సాధించగలరు. మిమ్మల్ని ఎవరూ ఆపలేరు. ఆ దిశగా అడుగులు వేయండి. ఆర్థికంగా అద్భుతంగా ఉంటుంది. ఓ కొత్త ప్రాజెక్టును ప్రారంభించే అవకాశం కూడా ఉంది. ప్లానింగ్‌తో సాగితే అందులోనూ మీరు విజయం సాధిస్తారు. కలసివచ్చే రంగు: ముదురు నారింజ లియో(జూలై 24-ఆగస్టు 23) ప్రేమ వ్యవహారాల్లో ఒక నిర్ణయానికి రావడానికి తగిన సమయం. కాస్త కష్టపడితే మీరు కోరుకున్న సంతోషాలన్నీ మీ దగ్గరకు వస్తాయి. అయితే కొన్ని అభద్రతాభావాలు మిమ్మల్ని ఆవరించుకునే అవకాశం ఉంది. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ఫిట్‌నెస్‌పై తగు దృష్టి పెట్టండి. కలసివచ్చే రంగు: తెలుపు వర్గో (ఆగస్టు24-సెప్టెంబర్ 23) మీ ఇంటిలో మార్పులు చేయడానికి మంచి సమయం. ఎప్పటి నుంచో పెండింగ్‌లో ఉన్న ఓ ప్రాజెక్టు పూర్తయిపోతుంది. ఇప్పటివరకూ విసిగించిన కొన్ని సమస్యలు పరిష్కారమవుతాయి. వచ్చిన ప్రతి అవకాశాన్నీ అందిపుచ్చుకుంటూ సాగిపోండి. ధనలాభం, వస్త్రలాభం చేకూరుతాయి. కలసివచ్చే రంగు: వంకాయ రంగు లిబ్రా (సెప్టెంబర్ 24- అక్టోబర్ 23) బాధ్యతలతో ఉక్కిరిబిక్కిరవుతారు. ఓ నిజం మీలో అలజడి సృష్టిస్తుంది. కొన్ని ముగిసిపోవడం అనేది మరికొన్నిటి ప్రారంభానికే దారి తీస్తాయన్న నిజాన్ని గ్రహించండి. ఓసారి పడినా మళ్లీ తిరిగి లేవగలం అన్న సత్యాన్ని అవగతం చేసుకోండి. నిరంతరాయంగా పని చేస్తూ, ఆర్థికంగా ఎదగడానికి ట్రై చేస్తూ మిమ్మల్ని మీరు బిజీగా ఉంచుకోండి. కాలమే అన్ని గాయాలనూ మాన్పుతుందని అర్థం చేసుకోండి. కలసివచ్చే రంగు: ఆకుపచ్చ స్కార్పియో (అక్టోబర్ 24-నవంబర్ 22) కష్టం తర్వాతే సుఖం వస్తుందన్న వాస్తవాన్ని తెలుసుకుంటారు. ఓ పరాజయాన్ని కూడా విజయంగా మార్చుకుంటారు. పనిలో ఆనందాన్ని వెతుక్కునేవాళ్లకి బాధతో సమయం వెళ్లదీసేంత తీరిక ఉండదు. కొత్త ప్రాజెక్టులు మీకు తీరిక లేకుండా చేస్తాయి. ప్రయాణాలు కూడా చేయాల్సి వస్తుంది. కలసివచ్చే రంగు: పసుపు శాజిటేరియస్ (నవంబర్23-డిసెంబర్ 21) మీ తెలివితేటలతో డబ్బు సంపాదిస్తారు. అయితే నియమాలను మాత్రం తప్పకుండా పాటించండి. గత జీవితపు చీకట్లు పూర్తిగా తొలగిపోతాయి. ఓ చిరకాల సమస్య పరిష్కారమై మీ జీవితంలో కొత్త వెలుగు నిండుతుంది. మీ కోసం, మీ వాళ్లకోసం కాస్త సమయాన్ని కేటాయించడం కూడా అవసరం అని గుర్తించండి. కలసివచ్చే రంగు: సిల్వర్ క్యాప్రికార్న్ (డిసెంబర్ 22-జనవరి 20) బాధ్యతలు, బంధాలను కొత్త దృష్టితో చూడటం వల్ల మీలో ధైర్యం పెరుగుతుంది. జీవితంలో కొత్త మార్పులు వస్తాయి. కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడానికి, కొత్త బాధ్యతలు స్వీకరించడానికి మీకిది తగిన సమయం. పాత పద్ధతులకు స్వస్తి చెప్పాల్సిన సమయం కూడా. తల్లిదండ్రుల నుంచి కొన్ని బహుమతులను అందుకుంటారు. పాతబాకీలు తీరుస్తారు. కలసివచ్చే రంగు: యాపిల్ గ్రీన్ అక్వేరియస్ (జనవరి 21-ఫిబ్రవరి 19) ఈ వారమంతా ఉత్సాహవంతంగా సాగిపోతుంది. మీరు క్లయింట్స్‌ని డీల్ చేసే పద్ధతి మీకు విజయాలను చేకూరుస్తుంది. పెద్ద పెద్ద అవకాశాలను ఈ వారం మీ దగ్గరకు తీసుకుని వస్తుంది. మీ తెలివితేటలు, ప్రతిభా పాటవాలు వెలుగులోకి వస్తాయి. భావోద్వేగాలకు గురయ్యే పరిస్థితులు కొన్ని ఏర్పడవచ్చు. కలసివచ్చే రంగు: ఆకుపచ్చ పైసిస్ (ఫిబ్రవరి 20-మార్చి 20) కొత్త సవాళ్లను స్వీకరించడానికి, కొత్త బాధ్యతలను చేపట్టడానికి ఇది తగిన సమయం. ఆరోగ్యం ఇనుమడిస్తుంది. దేనినైనా సమర్థంగా ఎదుర్కోగల ఉత్సాహం కలుగుతుంది. పనుల్లో పడి కొట్టుకుపోకుండా జీవితాన్ని కాస్త ఎంజాయ్ చేయడానికి ప్రయత్నించండి. ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. విదేశాలకు వెళ్లే అవకాశం ఒకటి మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. కలసివచ్చే రంగు: లేత పసుపు టారో ఇన్సియా టారో అనలిస్ట్, రేకీ గ్రాండ్ మాస్టర్ సౌర వాణి ఏరిస్ (మార్చి 21- ఏప్రిల్ 20) చేయగలిగిందేదో దాన్ని చేసి చూపించండి తప్ప ఎలా చేయగలరో దాన్ని వాగ్దాన రూపంగా కాగితం ముఖంగా చెప్పనూ వద్దు - రాసి చూపనూ వద్దు. దశాధినాథుడు సక్రమంగా లేని కారణంగా చెప్పిన మాటని ఫలించనీయకపోవచ్చు. ముఖ్యంగా రియల్ ఎస్టేట్, చిట్‌ఫండ్స్ వ్యాపారాల వారు మరింతగా గమనించుకోగలగాలి. టారస్ (ఏప్రిల్ 21-మే 20) స్థిరమైన ఆస్తుల కొనుగోళ్లకి ఆతురత పడకండి. సంతానం కోసం చేయవలసిన రుణాలు సిద్ధంగా ఎదురుచూస్తూ ఉన్నాయి. అధికారుల తప్పుల్ని గమనించుకుంటూ ‘ఎప్పుడవకాశం వస్తుందా?’ అని ఎదురుచూడండి. మంచి చోటుకి బదిలీకి వారి అవసరం బాగా ఉంది. పూర్తి పరిష్కారం అయ్యే అవకాశం లేదు కాబట్టి ఇతరుల మాటలని నమ్మి మీకున్న ఆస్తుల్ని అమ్మివేద్దామనే నిర్ణయానికి రాకండి. జెమిని (మే 21-జూన్ 21) మీకు పని ఒత్తిడి తగ్గే మంచిరోజులు దాదాపు వచ్చినట్లే. మరో గూటికి రెక్కలు విప్పుకుని ఎగిరిపోబోయే క్షణాలు దాదాపు వచ్చేసినట్లే. ‘నిదానమే ప్రధాన’మనే తీరులో మీరు జాగ్రత్తగా అడుగువేస్తుంటే ఇతరులు మాత్రం మిమ్మల్ని పిరికివారుగా, అసమర్థులుగా లెక్కించుకుంటూ మిమ్మల్ని అంచనా వేయడంలో వాళ్లు తమ ఓటమిని గుర్తించుకోలేకపోతున్నారు. మీరు మీ మార్గంలోనే వెళ్లండి. క్యాన్సర్ (జూన్22-జూలై 23) ఒక చెరువునో నదినో కేవలం నడుస్తూ దాటుతున్న వేళ మీరు ఆ జలాశయం మధ్యలోకి వచ్చిన కాలం ఇది. మెల్లగా అడుగులు వేసుకుంటూ ఒడ్డు దిశగా వెళ్లబోతున్నారు కాబట్టి ఇప్పుడే ధైర్యం అవసరం. ప్రమాదం... పిరికితనం... ఇలాంటి మాటల్ని పక్కనపెట్టి సాగిపోండి. మీకు పరిస్థితి అనుకూలంగా ఉంది. లియో (జూలై 24-ఆగస్టు 23) నడుస్తున్న మార్గం సరైనదే అయినా మధ్యమధ్యలో ఎదుగుదలలో భాగంగా తగిన జాగ్రత్తల కోసం అనుభవజ్ఞుల్ని సంప్రదిస్తూ ఉంటారు. అది మంచిదే. మీరు లోగడ చేసిన రుణాలకి సంబంధించి గానీ, అమ్మిన ఆస్తులకి సంబంధించిగానీ లావాదేవీలు న్యాయస్థానం దాకా వెళ్తే భయపడకండి. తీర్పు మీకు అనుకూలంగానే ఉంటుంది. ధైర్యంగా ముందుకు సాగండి. వర్గో(ఆగస్టు24-సెప్టెంబర్ 23) కుటుంబంలోని వ్యక్తులందరూ మీరు చేస్తున్న పనుల పట్ల సంతోషాన్ని వ్యక్తీకరిస్తూ మీ పక్షానే నిలబడతారు. మీకు సంబంధించని వ్యవహారాల్లో తప్పనిసరిగా తలదూర్చవలసి వస్తే కూడ వీలు కాదనే విషయాన్ని ఎదుటివారు నొచ్చుకోకుండా ఉండేలా చెప్పండి. మొగమాటం వద్దు. మీ కుటుంబంలోని మరొకరి ద్వారా చెప్పే ప్రయత్నాన్ని చేయద్దు. మీరే చెప్పండి. అది మీకూ మీ కుటుంబానికీ శ్రేయస్కరం. లిబ్రా(సెప్టెంబర్ 24- అక్టోబర్ 23) కొత్త వృత్తిని చేపట్టడం గాని, కొత్త ఉద్యోగంలో చేరడానికి గానీ ప్రయత్నిస్తారు. అయితే ఆ కొత్తదనం మీకు సంపూర్ణ అనుకూలతని ఇవ్వదు. ఇవ్వబోదు. ‘కులవృత్తికి సాటి రా’దన్న చందంగా ‘మీరు ఇప్పటివరకూ చేసిన పనే మీ కులవృత్తి’ అనుకుంటూ అదే వ్యాపారంలో మళ్లీ కొనసాగండి. తప్పక విజయాన్ని సాధిస్తారు. కొత్త ప్రణాళిక గురించిన ఆలోచనలతో ఉన్నప్పుడు పాత అపజయాలని గురించి చింతా వృథా గుర్తుకి రానే రావు - బాధించవు. స్కార్పియో(అక్టోబర్ 24-నవంబర్ 22) మీకు అనుకూలంగా ఉంటున్నట్లుగా నటిస్తూ మీ ఆస్తులని అమ్మించే ఆలోచనతో కొందరు తారసపడచ్చు. పొరపాటున కూడా విక్రయించద్దు. మీ శ్రేయస్సుని కోరుతున్నట్లుగా చెప్తూ దేన్నో కొనవలసిందిగా సూచిస్తూ దరిజేరవచ్చు. పొరపాటున కూడ అంగీకరించవద్దు. ఎలా ఉన్నారో అలాగే ఉండండి ఈ వారమంతా. పనులు తాత్కాలికంగా వాయిదా పడినా అధైర్యపడద్దు. అది కూడ మీ మంచికే. శాజిటేరియస్ (నవంబర్23-డిసెంబర్ 21) కొత్తదైన ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూనో లేదా కొత్త ఆదాయ మార్గాన్ని చేపట్టిన కారణంగానో కొంత శారీరక శ్రమని పొందుతారు. అయినా రాబోయే అభివృద్ధి కారణంగా మానసికంగా ఉత్సాహంగానే ఉంటారు. గుర్రానికి పచ్చిగడ్డి పెట్టేది దూరపు ప్రయాణంలో పరిగెత్తించేందుకేనని గ్రహించి శ్రమకి సిద్ధంగా ఉండండి తప్ప నిరుత్సాహం ఒత్తిడి బద్ధకం... వంటి వాటికి దూరంగా ఉండండి. క్యాప్రికార్న్ (డిసెంబర్ 22-జనవరి 20) ఇంతకుముందున్న వివాదాల్లో ఒకరి తీరు అనుకూలంగా కన్పించిన కారణంగా సమస్యల్ని సృష్టించుకోవడం సరికాదనే మంచి దృక్పథం మీకు వస్తుంది ఈ వారంలో. కోపాన్ని నియంత్రించుకోవడం ఎంత అవసరమో ఆ విషయాన్ని మీకు మీరే ఉపదేశించుకుంటారు. పట్టుదల వల్ల సాధించగలిగింది తీవ్ర మనోవ్యధ మాత్రమేనని గ్రహించుకోగలుగుతారు. మంచి వారం ఇది మీకు. అక్వేరియస్(జనవరి 21-ఫిబ్రవరి 19) మీరు చేసే అన్ని ప్రయత్నాలూ సఫలమయ్యే వారం ఇది. ధనం సరైన తీరులో వ్యయం చేసుకుని సత్ఫలితాలని పొందుతారు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకోవడం మంచిదే అయినా వర్తమానమూ ముఖ్యమే అనుకుంటూ కొంత డబ్బు వినోదం, విహారం కోసం వ్యయం చేసుకోవడమూ అవసరమే. దీనివల్ల కుటుంబంలో కొంత అశాంతి తగ్గే అవకాశముంది. ప్రయత్నించండి! పైసిస్ (ఫిబ్రవరి 20-మార్చి 20) ఆర్థికంగా ఎన్నెన్నో ఖర్చులు కన్పిస్తూ ఉండచ్చు. ఆదాయాలు కూడా బాగానే ఉండొచ్చు. ప్రయాణాలు తప్పనిసరి అయినప్పుడు కూడా ‘అవసరమా?’ అని ఓసారి ఆలోచించుకుని మాత్రమే ప్రయాణం చేయండి. ప్రయాణ కాలాల్లో జాగ్రత్త తప్పనిసరి. శారీరకంగా సత్తువ తక్కువగా ఉండొచ్చు కాబట్టి - అతిథి మర్యాదలని చేయలేననే విషయాన్ని స్పష్టంగా సరైన భాషలో శైలిలో చెప్పి మానసికంగా సుఖంగా ఉండండి. డా॥మైలవరపు శ్రీనివాసరావు సంస్కృత పండితులు గమనిక: టారోబాణి, సౌరవాణి శీర్షికలను ఇంతటితో ఆపేస్తున్నాం. -
సౌర వాణి
మీకిది శుభ సమయం! మేషం (మార్చి 21-ఏప్రిల్ 20) (రాశ్యాధిపతి-కుజుడు)... వృత్తి, ఉద్యోగాల పరంగా నూతన అవకాశాలు కలసి వస్తాయి. దూరప్రాంత ప్రయాణాలు, విదేశీయానం. మీ ద్వారా సహాయం పొంది ఉన్నతస్థానాల్లో ఉన్నవారు కీలక సమయంలో నిరాశకు గురిచేస్తారు. కోర్టు వ్యవహారాలు, వివాదంలో ఉన్న భూమి సంబంధమైన వ్యవహారాలు మీకు సత్ఫలితాలు ఇస్తాయి. అనుకూల తేది: 4; ప్రతికూల తేది: 8; ప్రతిరోజూ హనుమాన్ చాలీసా పఠించడం శుభం. వృషభం ( ఏప్రిల్ 21-మే 20) (రాశ్యాధిపతి-శుక్రుడు)... దీర్ఘకాలిక వివాదాస్పద వ్యవహారాలను అతి కష్టం మీద పరిష్కరించుకోగలుగుతారు. కొనుగోలు, అమ్మకాలకు సంబంధించిన విషయాల్లో మధ్యవర్తుల వల్ల మోసపోయే ప్రమాదం ఉంది. జాగ్రత్త వహించండి. అనుకూల తేది: 5; ప్రతికూల తేది: 7; దుర్గాదేవి ఆరాధన శుభం. మిథునం (మే 21-జూన్ 21) (రాశ్యాధిపతి-బుధుడు)... మీకు మీరుగా కొన్ని కఠినమైన బాధ్యతల నుంచి తప్పుకుంటారు. అందువల్ల భవిష్యత్తులో మంచి జరుగుతుంది. నష్టాల దిశగా పయనిస్తున్న వ్యవహారాలు మీ కృషి, పలుకుబడి వల్ల లాభాల బాటలో పయనిస్తాయి. అనుకూలం: 5; ప్రతికూలం: 8; ప్రతిరోజు గణపతి ఆరాధన శుభం. కర్కాటకం (జూన్ 22 - జూలై 23) (రాశ్యాధిపతి - చంద్రుడు)... ఉద్యోగంలో మీ స్థాయి పెరుగుతుంది. ప్రమోషన్ లభిస్తుంది. వ్యాపారస్తులకు రొటేషన్ లాభాలు బాగుంటాయి. ఎగుమతి, దిగుమతి వ్యాపారాలు లాభిస్తాయి. అనుకూలం 4, ప్రతికూలం 6; ప్రతిరోజు గణపతి ఆరాధన శుభం. సింహం (జూలై 24 - ఆగస్టు 23) (రాశ్యాధిపతి - రవి)... వృత్తి ఉద్యోగాల పరంగా శ్రమ అధికం అవుతుంది. రావలసిన బిల్లులు సకాలంలో అందుతాయి. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోండి. ఉద్యోగపరంగా ప్రమోషన్ లభిస్తుంది. అనుకూలం 6, ప్రతికూలం 8; ప్రతి రోజు గణపతి ఆరాధన శుభం కన్య (ఆగస్టు 24 - సెప్టెంబరు 23) (రాశ్యాధిపతి - బుధుడు)... దూర ప్రాంతాలకు సంబంధించిన విషయ వ్యవహారాలు అనుకూలిస్తాయి. విద్యను అభ్యసించడానికి తగిన మంచి అవకాశాలు కలిసివస్తాయి. మీ కృషికి తగిన కీర్తి లభిస్తుంది. అనుకూలం, 5, ప్రతి కూలం 9; ప్రతిరోజు హనుమాన్ చాలీసా పారాయణం శుభం. తుల (సెప్టెంబరు 24 - అక్టోబరు 23) (రాశ్యాధిపతి - శుక్రుడు)... విదేశాలకు వెళ్లడానికి వీసా లభిస్తుంది. సమాజంలోని కీలక వ్యక్తులతో మంచి సంబంధాలు ఏర్పడతాయి. క్రమంగా అవి వ్యాపార సంబంధాలుగా మారతాయి. నిరుద్యోగులకు శుభ సమయం; అనుకూలం 3, 6, ప్రతికూలం 8; ప్రతి రోజు గణపతి ఆరాధన శుభం. వృశ్చికం (అక్టోబరు 24 - నవంబరు 22) (రాశ్యాధిపతి - కుజుడు)... కుటుంబ వ్యవహారాలలో బంధువుల సలహాలు, జోక్యం అధికమవుతాయి. అభిమానించే వారికోసం ఏదయినా చేయాలని ఎంతగానో శ్రమిస్తారు. అనుకూలం 6, ప్రతికూలం 8; ప్రతి రోజు గణపతి ఆరాధన శుభం. ధనుస్సు (నవంబరు 23 - డిసెంబరు 21) (రాశ్యాధిపతి - గురువు)... వ్యాపారంలో లాభాలు గతంలో కంటే మెరుగ్గా ఉంటాయి. వ్యక్తిగత స్థాయి ఉద్యోగంలోనూ, వ్యాపారంలోనూ కొద్దిగా పెరుగుతుంది. అనుకూలం 6, ప్రతికూలం 8; ప్రతిరోజూ గణపతి ఆరాధన శుభం. మకరం (డిసెంబరు 22 - జనవరి 20) (రాశ్యాధిపతి - శని)... వ్యాపారంలో లభించే ఆర్డర్లు సంతోషం కలిగిస్తాయి. ఉద్యోగంలో ప్రమోషన్ లభిస్తుంది. అనుకూలం 6 ప్రతికూలం 8; ప్రతిరోజూ గణపతి ఆరాధన, హనుమాన్‌చాలీసా పారాయణ శుభం. కుంభం (జనవరి 21 - ఫిబ్రవరి 19) (రాశ్యాధిపతి - శని)... వివాహాది శుభకార్యాల విషయాలు సానుకూలమవుతాయి. నూతన గృహయోగ్యత ఏర్పడుతుంది. విద్యారంగంలో మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అనుకూలం 4, ప్రతి కూలం 8; ప్రతిరోజు గణపతి ఆరాధన శుభం. మీనం (ఫిబ్రవరి 20 - మార్చి 20) (రాశ్యాధిపతి - గురువు) శుభకార్యాల విషయంలో మనోభీష్టం నెరవేరుతుంది. ఉన్నత విద్యా యోగం కలుగుతుంది. వ్యాపార అంశాలు అనుకూలంగా ఉంటాయి. అనుకూలం 6, ప్రతి కూలం 8; ప్రతిరోజు గణపతి ఆరాధన శుభం. డా॥జి.వి., పంచాంగకర్త, శ్రీ జ్ఞానసరస్వతి జ్యోతిషాలయం, సికింద్రాబాద్