ఎలా ఉంటున్నారో అలాగే ఉండండి... | Be well as how to live ... | Sakshi
Sakshi News home page

ఎలా ఉంటున్నారో అలాగే ఉండండి...

Published Sat, Jan 30 2016 12:23 AM | Last Updated on Sun, Sep 3 2017 4:34 PM

ఎలా ఉంటున్నారో అలాగే ఉండండి...

ఎలా ఉంటున్నారో అలాగే ఉండండి...

జనవరి 30 నుంచి ఫిబ్రవరి 5 వరకు
 

టారో బాణి
 
ఏరిస్ (మార్చి 21- ఏప్రిల్ 20)

కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. ఎవరైనా మిమ్మల్కి ఎక్కువగా ప్రశంసిస్తుంటే దాని వెనుక ఏదో స్వార్థం ఉందన్న విషయాన్ని గుర్తించండి. కొన్ని విషయాల్లో మిమ్మల్ని కొందరు వ్యతిరేకించవచ్చు. నిరుత్సాహపడవద్దు. ఒత్తిడికి లోను కావద్దు. ఈ పరిస్థితి ఎక్కువ కాలం కొనసాగదు.
 కలసివచ్చే రంగు: వంకాయ రంగు
 
టారస్ (ఏప్రిల్ 21-మే 20)

ఈ వారం అన్నింట్లోనూ తటస్థంగా ఉండటం మంచిది. పనులతో ఉక్కిరి బిక్కిరై ఊపిరి సలపని పరిస్థితి వస్తుంది. మిమ్మల్ని మీరు అందుకు సిద్ధం చేసుకుని, సకాలంలో పనులు పూర్తి చేయడానికి ప్రయత్నించండి. వృత్తిగత జీవితానికీ వ్యక్తిగత జీవితానికీ మధ్య సమన్వయం ఏర్పరచుకోవడానికి ప్రయత్నించండి. బంధాలను నిర్లక్ష్యం చేయకండి.
 కలసివచ్చే రంగు: బ్రౌన్
 
జెమిని (మే 21-జూన్ 21)
మీలో మీరు కొన్ని మార్పులు చేసుకోవాల్సిన తరుణం. కొన్ని అనవసరమైన విషయాలకై డబ్బు ఖర్చు చేస్తున్న విషయాన్ని గుర్తించండి. ఓ పెద్ద అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. అయితే నిర్ణయం తీసుకోవడంలో మీరు కాస్త కష్టపడాల్సి రావచ్చు. ఎప్పుడో విడిపోయిన ఓ పాత నేస్తం మళ్లీ మీ జీవితంలోకి వస్తారు.
 కలసివచ్చే రంగు: పీచ్
 
క్యాన్సర్ (జూన్22-జూలై 23)
కాస్త నిరుత్సాహకరమైన వారం. కానీ మీరు కాస్త ప్రయత్నిస్తే అన్నింట్లోనూ విజయం సాధించగలరు. మిమ్మల్ని ఎవరూ ఆపలేరు. ఆ దిశగా అడుగులు వేయండి. ఆర్థికంగా అద్భుతంగా ఉంటుంది. ఓ కొత్త ప్రాజెక్టును ప్రారంభించే అవకాశం కూడా ఉంది. ప్లానింగ్‌తో సాగితే అందులోనూ మీరు విజయం సాధిస్తారు.
 కలసివచ్చే రంగు: ముదురు నారింజ
 
లియో(జూలై 24-ఆగస్టు 23)
ప్రేమ వ్యవహారాల్లో ఒక నిర్ణయానికి రావడానికి తగిన సమయం. కాస్త కష్టపడితే మీరు కోరుకున్న సంతోషాలన్నీ మీ దగ్గరకు వస్తాయి. అయితే కొన్ని అభద్రతాభావాలు మిమ్మల్ని ఆవరించుకునే అవకాశం ఉంది. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ఫిట్‌నెస్‌పై తగు దృష్టి పెట్టండి.
 కలసివచ్చే రంగు: తెలుపు    
 
వర్గో (ఆగస్టు24-సెప్టెంబర్ 23)
మీ ఇంటిలో మార్పులు చేయడానికి మంచి సమయం. ఎప్పటి నుంచో పెండింగ్‌లో ఉన్న ఓ ప్రాజెక్టు పూర్తయిపోతుంది. ఇప్పటివరకూ విసిగించిన కొన్ని సమస్యలు పరిష్కారమవుతాయి. వచ్చిన ప్రతి అవకాశాన్నీ అందిపుచ్చుకుంటూ సాగిపోండి. ధనలాభం, వస్త్రలాభం చేకూరుతాయి.  కలసివచ్చే రంగు: వంకాయ రంగు
 
లిబ్రా (సెప్టెంబర్ 24- అక్టోబర్ 23)
బాధ్యతలతో ఉక్కిరిబిక్కిరవుతారు. ఓ నిజం మీలో అలజడి సృష్టిస్తుంది. కొన్ని ముగిసిపోవడం అనేది మరికొన్నిటి ప్రారంభానికే దారి తీస్తాయన్న నిజాన్ని గ్రహించండి. ఓసారి పడినా మళ్లీ తిరిగి లేవగలం అన్న సత్యాన్ని అవగతం చేసుకోండి. నిరంతరాయంగా పని చేస్తూ, ఆర్థికంగా ఎదగడానికి ట్రై చేస్తూ మిమ్మల్ని మీరు బిజీగా ఉంచుకోండి. కాలమే అన్ని గాయాలనూ మాన్పుతుందని అర్థం చేసుకోండి. కలసివచ్చే రంగు: ఆకుపచ్చ
 
స్కార్పియో (అక్టోబర్ 24-నవంబర్ 22)
కష్టం తర్వాతే సుఖం వస్తుందన్న వాస్తవాన్ని తెలుసుకుంటారు. ఓ పరాజయాన్ని కూడా విజయంగా మార్చుకుంటారు. పనిలో ఆనందాన్ని వెతుక్కునేవాళ్లకి బాధతో సమయం వెళ్లదీసేంత తీరిక ఉండదు. కొత్త ప్రాజెక్టులు మీకు తీరిక లేకుండా చేస్తాయి. ప్రయాణాలు కూడా చేయాల్సి వస్తుంది. కలసివచ్చే రంగు: పసుపు
 
శాజిటేరియస్ (నవంబర్23-డిసెంబర్ 21)
మీ తెలివితేటలతో డబ్బు సంపాదిస్తారు. అయితే నియమాలను మాత్రం తప్పకుండా పాటించండి. గత జీవితపు చీకట్లు పూర్తిగా తొలగిపోతాయి. ఓ చిరకాల సమస్య పరిష్కారమై మీ జీవితంలో కొత్త వెలుగు నిండుతుంది. మీ కోసం, మీ వాళ్లకోసం కాస్త సమయాన్ని కేటాయించడం కూడా అవసరం అని గుర్తించండి.
 కలసివచ్చే రంగు: సిల్వర్
 
క్యాప్రికార్న్ (డిసెంబర్ 22-జనవరి 20)

బాధ్యతలు, బంధాలను కొత్త దృష్టితో చూడటం వల్ల మీలో ధైర్యం పెరుగుతుంది. జీవితంలో కొత్త మార్పులు వస్తాయి. కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడానికి, కొత్త బాధ్యతలు స్వీకరించడానికి మీకిది తగిన సమయం. పాత పద్ధతులకు స్వస్తి చెప్పాల్సిన సమయం కూడా. తల్లిదండ్రుల నుంచి కొన్ని బహుమతులను అందుకుంటారు. పాతబాకీలు తీరుస్తారు. కలసివచ్చే రంగు: యాపిల్ గ్రీన్
 
అక్వేరియస్ (జనవరి 21-ఫిబ్రవరి 19)
ఈ వారమంతా ఉత్సాహవంతంగా సాగిపోతుంది. మీరు క్లయింట్స్‌ని డీల్ చేసే పద్ధతి మీకు విజయాలను చేకూరుస్తుంది. పెద్ద పెద్ద అవకాశాలను ఈ వారం మీ దగ్గరకు తీసుకుని వస్తుంది. మీ తెలివితేటలు, ప్రతిభా పాటవాలు వెలుగులోకి వస్తాయి. భావోద్వేగాలకు గురయ్యే పరిస్థితులు కొన్ని ఏర్పడవచ్చు. కలసివచ్చే రంగు: ఆకుపచ్చ
 
పైసిస్ (ఫిబ్రవరి 20-మార్చి 20)
కొత్త సవాళ్లను స్వీకరించడానికి, కొత్త బాధ్యతలను చేపట్టడానికి ఇది తగిన సమయం. ఆరోగ్యం ఇనుమడిస్తుంది. దేనినైనా సమర్థంగా ఎదుర్కోగల ఉత్సాహం కలుగుతుంది. పనుల్లో పడి కొట్టుకుపోకుండా జీవితాన్ని కాస్త ఎంజాయ్ చేయడానికి ప్రయత్నించండి. ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. విదేశాలకు వెళ్లే అవకాశం ఒకటి మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. కలసివచ్చే రంగు: లేత పసుపు
 
టారో ఇన్సియా
టారో అనలిస్ట్, రేకీ గ్రాండ్ మాస్టర్
 
సౌర వాణి
 
ఏరిస్ (మార్చి 21- ఏప్రిల్ 20)
చేయగలిగిందేదో దాన్ని చేసి చూపించండి తప్ప ఎలా చేయగలరో దాన్ని వాగ్దాన రూపంగా కాగితం ముఖంగా చెప్పనూ వద్దు - రాసి చూపనూ వద్దు. దశాధినాథుడు సక్రమంగా లేని కారణంగా చెప్పిన మాటని ఫలించనీయకపోవచ్చు. ముఖ్యంగా రియల్ ఎస్టేట్, చిట్‌ఫండ్స్ వ్యాపారాల వారు మరింతగా గమనించుకోగలగాలి.
 
టారస్ (ఏప్రిల్ 21-మే 20)
స్థిరమైన ఆస్తుల కొనుగోళ్లకి ఆతురత పడకండి. సంతానం కోసం చేయవలసిన రుణాలు సిద్ధంగా ఎదురుచూస్తూ ఉన్నాయి. అధికారుల తప్పుల్ని గమనించుకుంటూ ‘ఎప్పుడవకాశం వస్తుందా?’ అని ఎదురుచూడండి. మంచి చోటుకి బదిలీకి వారి అవసరం బాగా ఉంది. పూర్తి పరిష్కారం అయ్యే అవకాశం లేదు కాబట్టి ఇతరుల మాటలని నమ్మి మీకున్న ఆస్తుల్ని అమ్మివేద్దామనే నిర్ణయానికి రాకండి.  
 
జెమిని (మే 21-జూన్ 21)
మీకు పని ఒత్తిడి తగ్గే మంచిరోజులు దాదాపు వచ్చినట్లే. మరో గూటికి రెక్కలు విప్పుకుని ఎగిరిపోబోయే క్షణాలు దాదాపు వచ్చేసినట్లే. ‘నిదానమే ప్రధాన’మనే తీరులో మీరు జాగ్రత్తగా అడుగువేస్తుంటే ఇతరులు మాత్రం మిమ్మల్ని పిరికివారుగా, అసమర్థులుగా లెక్కించుకుంటూ మిమ్మల్ని అంచనా వేయడంలో వాళ్లు తమ ఓటమిని గుర్తించుకోలేకపోతున్నారు. మీరు మీ మార్గంలోనే వెళ్లండి.
 
క్యాన్సర్ (జూన్22-జూలై 23)
ఒక చెరువునో నదినో కేవలం నడుస్తూ దాటుతున్న వేళ మీరు ఆ జలాశయం మధ్యలోకి వచ్చిన కాలం ఇది. మెల్లగా అడుగులు వేసుకుంటూ ఒడ్డు దిశగా వెళ్లబోతున్నారు కాబట్టి ఇప్పుడే ధైర్యం అవసరం. ప్రమాదం... పిరికితనం... ఇలాంటి మాటల్ని పక్కనపెట్టి సాగిపోండి. మీకు పరిస్థితి అనుకూలంగా ఉంది.
 
లియో (జూలై 24-ఆగస్టు 23)
నడుస్తున్న మార్గం సరైనదే అయినా మధ్యమధ్యలో ఎదుగుదలలో భాగంగా తగిన జాగ్రత్తల కోసం అనుభవజ్ఞుల్ని సంప్రదిస్తూ ఉంటారు. అది మంచిదే. మీరు లోగడ చేసిన రుణాలకి సంబంధించి గానీ, అమ్మిన ఆస్తులకి సంబంధించిగానీ లావాదేవీలు న్యాయస్థానం దాకా వెళ్తే భయపడకండి. తీర్పు మీకు అనుకూలంగానే ఉంటుంది. ధైర్యంగా ముందుకు సాగండి.
 
వర్గో(ఆగస్టు24-సెప్టెంబర్ 23)
కుటుంబంలోని వ్యక్తులందరూ మీరు చేస్తున్న పనుల పట్ల సంతోషాన్ని వ్యక్తీకరిస్తూ మీ పక్షానే నిలబడతారు. మీకు సంబంధించని వ్యవహారాల్లో తప్పనిసరిగా తలదూర్చవలసి వస్తే కూడ వీలు కాదనే విషయాన్ని ఎదుటివారు నొచ్చుకోకుండా ఉండేలా చెప్పండి. మొగమాటం వద్దు. మీ కుటుంబంలోని మరొకరి ద్వారా చెప్పే ప్రయత్నాన్ని చేయద్దు. మీరే చెప్పండి. అది మీకూ మీ కుటుంబానికీ శ్రేయస్కరం.
 
లిబ్రా(సెప్టెంబర్ 24- అక్టోబర్ 23)
కొత్త వృత్తిని చేపట్టడం గాని, కొత్త ఉద్యోగంలో చేరడానికి గానీ ప్రయత్నిస్తారు. అయితే ఆ కొత్తదనం మీకు సంపూర్ణ అనుకూలతని ఇవ్వదు. ఇవ్వబోదు. ‘కులవృత్తికి సాటి రా’దన్న చందంగా ‘మీరు ఇప్పటివరకూ చేసిన పనే మీ కులవృత్తి’ అనుకుంటూ అదే వ్యాపారంలో మళ్లీ కొనసాగండి. తప్పక విజయాన్ని సాధిస్తారు. కొత్త ప్రణాళిక గురించిన ఆలోచనలతో ఉన్నప్పుడు పాత అపజయాలని గురించి చింతా వృథా గుర్తుకి రానే రావు - బాధించవు.
 

స్కార్పియో(అక్టోబర్ 24-నవంబర్ 22)
మీకు అనుకూలంగా ఉంటున్నట్లుగా నటిస్తూ మీ ఆస్తులని అమ్మించే ఆలోచనతో కొందరు తారసపడచ్చు. పొరపాటున కూడా విక్రయించద్దు. మీ శ్రేయస్సుని కోరుతున్నట్లుగా చెప్తూ దేన్నో కొనవలసిందిగా సూచిస్తూ దరిజేరవచ్చు. పొరపాటున కూడ అంగీకరించవద్దు. ఎలా ఉన్నారో అలాగే ఉండండి ఈ వారమంతా. పనులు తాత్కాలికంగా వాయిదా పడినా అధైర్యపడద్దు. అది కూడ మీ మంచికే.
 
శాజిటేరియస్ (నవంబర్23-డిసెంబర్ 21)

కొత్తదైన ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూనో లేదా  కొత్త ఆదాయ మార్గాన్ని చేపట్టిన కారణంగానో కొంత శారీరక శ్రమని పొందుతారు. అయినా రాబోయే అభివృద్ధి కారణంగా మానసికంగా ఉత్సాహంగానే ఉంటారు. గుర్రానికి పచ్చిగడ్డి పెట్టేది దూరపు ప్రయాణంలో పరిగెత్తించేందుకేనని గ్రహించి శ్రమకి సిద్ధంగా ఉండండి తప్ప నిరుత్సాహం ఒత్తిడి బద్ధకం... వంటి వాటికి దూరంగా ఉండండి.
 
క్యాప్రికార్న్ (డిసెంబర్ 22-జనవరి 20)
ఇంతకుముందున్న వివాదాల్లో ఒకరి తీరు అనుకూలంగా కన్పించిన కారణంగా సమస్యల్ని సృష్టించుకోవడం సరికాదనే మంచి దృక్పథం మీకు వస్తుంది ఈ వారంలో. కోపాన్ని నియంత్రించుకోవడం ఎంత అవసరమో ఆ విషయాన్ని మీకు మీరే ఉపదేశించుకుంటారు. పట్టుదల వల్ల సాధించగలిగింది తీవ్ర మనోవ్యధ మాత్రమేనని గ్రహించుకోగలుగుతారు. మంచి వారం ఇది మీకు.
 
అక్వేరియస్(జనవరి 21-ఫిబ్రవరి 19)

మీరు చేసే అన్ని ప్రయత్నాలూ సఫలమయ్యే వారం ఇది. ధనం సరైన తీరులో వ్యయం చేసుకుని సత్ఫలితాలని పొందుతారు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకోవడం మంచిదే అయినా వర్తమానమూ ముఖ్యమే అనుకుంటూ కొంత డబ్బు వినోదం, విహారం కోసం వ్యయం చేసుకోవడమూ అవసరమే. దీనివల్ల కుటుంబంలో కొంత అశాంతి తగ్గే అవకాశముంది. ప్రయత్నించండి!
 
పైసిస్ (ఫిబ్రవరి 20-మార్చి 20)

 ఆర్థికంగా ఎన్నెన్నో ఖర్చులు కన్పిస్తూ ఉండచ్చు. ఆదాయాలు కూడా బాగానే ఉండొచ్చు. ప్రయాణాలు తప్పనిసరి అయినప్పుడు కూడా ‘అవసరమా?’ అని ఓసారి ఆలోచించుకుని మాత్రమే ప్రయాణం చేయండి. ప్రయాణ కాలాల్లో జాగ్రత్త తప్పనిసరి. శారీరకంగా సత్తువ తక్కువగా ఉండొచ్చు కాబట్టి - అతిథి మర్యాదలని చేయలేననే విషయాన్ని స్పష్టంగా సరైన భాషలో శైలిలో చెప్పి మానసికంగా సుఖంగా ఉండండి.
 
డా॥మైలవరపు శ్రీనివాసరావు
సంస్కృత పండితులు
 
 గమనిక: టారోబాణి, సౌరవాణి శీర్షికలను ఇంతటితో ఆపేస్తున్నాం.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement