Selfishness
-
స్వార్థం- దైవ చింతన
మానవుడు ప్రధానంగా స్వప్రయోజనా దృష్టి గల జీవి. అది అతన్ని జీవితాంతం వెన్నంటే ఉంటుంది. దీనికి తోడు ఇతర ప్రాణులకు లేని బుద్ధి బలం కూడా మనిషికి ఉంది. మనిషి లోని సహజ లక్షణమైన ఈ స్వార్థ గుణాన్ని గురించి ఉపనిషత్తులు కూడా వివరించాయి. యాజ్ఞ వల్క్య మహర్షి తన భార్య మైత్రేయితో... ‘భార్య భర్తను ప్రేమిస్తున్న దంటే అది తన ఆనందం కోసమే. భర్త భార్యను ప్రేమిస్తున్నాడన్నా అతని ఆనందం కోసమే. ఇంకా పుత్రుల మీద, దేశం మీద, మానవులకున్న ప్రేమ వారి ఆనందం కోసం కాదు తన ఆనందం కోసమే’ అని చెపుతాడు. తన స్వార్థం కోసం ఉపయోగ పడేంతవరకు మానవుడు సమాజంతో సంబంధం పెట్టుకుంటాడు. మనిషిలో సహజంగా ఉండే ఈ స్వార్థాన్ని నియంత్రణ లేకుండా వదిలిపెడితే భూమిపై సుఖ శాంతులు పూర్తిగా కరువైపోతాయి. తన స్వార్థ ప్రయోజనాలకు బలహీనులను పట్టి పీడిస్తాడు. పెద్ద చేప చిన్న చేపను మింగినట్లు ప్రవర్తిస్తాడు. కొన్నాళ్ళకు తనూ తన కంటె బలవంతుని చేతిలో బలవుతాడు. లోక నాశనానికి దారి తీసే ఈ స్వార్థ గుణాన్ని అణిచి వేసి, మనిషి మనసులో గొప్ప మార్పు దైవ చింతన తీసుకు రాగలదు. మానవులకు శాంతి మయ జీవితాన్ని ఇవ్వటానికి భగవంతుడు వివిధ రూపాలలో అవత రిస్తుంటాడు.ఇహ లోకంలో ప్రశాంత జీవితం గడపటానికి, పరంలో శాశ్వతా నందాన్ని పొందటానికి తగిన ఉపదేశాన్ని మానవాళికి అందజేసిన గ్రంథ రాజం భగవద్గీత. రోజుకొక శ్లోకం చదివినా, నేర్చుకున్నా ఆలోచనలు భగవంతునిపై నిలుస్తాయంటారు పెద్దలు. ‘భక్తుడు ఏ దేవతా రూపాన్ని శ్రద్ధగా పూజిస్తాడో అతనికి ఆ రూపంపై శ్రద్ధ నిలిచేటట్లు చేస్తాను’ అంటాడు భగవంతుడు. అలా పూజించినందుకు తగిన ఫలాన్ని అందజేస్తాడు. భగవంతుని చింతనలో మనసు పునీతమై, మనిషి నిస్వార్థ జీవిగా మారి, విశాల దృక్పథాన్ని అలవరచుకుంటాడు. – డా. చెంగల్వ రామలక్ష్మి -
గురువాణి – 3: ఆ.. నలుగురి కోసం కూడా...
వ్యక్తి ఒక్కడుగా చేయవలసిన త్యాగం ఉంటుంది. ఒక్కడుగా పదిమందికి చేయవలసిన ఉపకారం ఉంటుంది. పదిమందీ కలిసి వ్యవస్థకు చేయవలసిన ఉపకారం ఉంటుంది. తను ఉంటున్న ఇంటిలోని బావిలో మంచినీటి ఊట ఉంది. చుట్టుపక్కల ఎవరి బావిలోనూ లేదు. తాను పట్టుకోవడంతోపాటూ ఇరుగుపొరుగుకూ మంచినీటిని పట్టుకోవడానికి అనుమతించగలగాలి. ఒక ధనవంతుడున్నాడు. ఊరిలో మంచి నీటి ఎద్దడి ఉంది. పదిమందికి పనికొచ్చేలో అందరికీ అందుబాటులో ఒక బావి, ఒక చెరువు తన తాహతుకు తగ్గట్టు తవ్వించగలగాలి. ఒక గుడి కట్టించగలగాలి. గుడి తానొక్కడే కట్టించినది కావచ్చు. కానీ దేవుడి బట్టలు ఉతకడానికి ఒక వ్యక్తి కావాలి. పల్లకి పట్టుకోవడానికి పదిమంది కావాలి. మంగళవాయిద్యాలు మోగించడానికి ఓ నలుగురు కావాలి. వేదం వచ్చినాయన వేదం చదువుతాడు. నాట్యం వచ్చినామె నాట్యం చేస్తుంది. పాటపాడగలిగినవాడు మంచి కీర్తనలు పాడతాడు. గుడిని శుభ్రపరిచేవాళ్ళు శుభ్రపరచాలి. కాగడా పట్టుకోగలిగిన వాడు అది పట్టుకుంటాడు. ఎవరికి ఏది చేయగలిగిన శక్తి ఉంటే గుడి ద్వారా సమాజానికి చేస్తారు. పదిమంది కలిసి ద్రవ్యం కానుకగా ఇస్తారు. భగవంతుడికి నివేదన చేసిన ప్రసాదాన్ని అరమరికలు లేకుండా అందరికీ పెట్టి పంపిస్తారు. అందరూ కలిసి అందరికీ ఉపయోగపడడం అంటే ఇదే. ఇది నేర్పడానికే మనకు దేవాలయ వ్యవస్థ వచ్చింది. అందరూ కలిసి విడివిడిగా ఒక వ్యవస్థ ద్వారా అందరికీ సేవ చేస్తున్నారు. నువ్వు పట్టుకుపోయేదేమీ లేదు. ఇక్కడ నువ్వు ఏది చేసావో అది పుణ్యంగా మారుతోంది. నిజానికి నువ్వే అభ్యున్నతిని పొందుతున్నట్టు. నాకు సంగీతం వచ్చు. నేనెంతో కష్టపడి నేర్చుకున్నా. ప్రతిఫలం లేకుండా నేనిది అందరికీ ఎందుకు నేర్పాలి... అని నేను ఆలోచించాననుకోండి. విద్య ఏమయిపోతుంది ? చిన్నగుంటలో నిలిచిన నీళ్ళు కొద్దిరోజులకు ఆవిరయిపోయి ఎండిపోయినట్లు అది ఎవరికీ పనికి రాదు. కానీ నిస్వార్థంగా సంతోషంగా నలుగురికీ పంచిపెట్టేదేదో అది పుణ్యంగా మారిపోతుంది. పదిమందికి అన్నం పెట్టవచ్చు. పేదవారికోసం ఓ కళ్యాణ మంటపం కట్టి ఉచితంగానో తక్కువ డబ్బుకో దానిని ఇవ్వవచ్చు. ఇక్కడ ఉండి శరీరం వదిలిన తరువాత నీ శరీరం ఇక్కడే ఉండిపోతుంది. కానీ ఒకరికి పెట్టిందేదో అది పుణ్యంగా మారి నీతో వస్తుంది. నువ్వు అనుభవించక, ఒకరికి పెట్టక, నువ్వు సాధించేముంది? ‘‘లక్షాధికారైన లవణమన్నమెగాని మెరుగు బంగారంబు మింగబోడు...’’ ఎంత డబ్బుంటే మాత్రం ఆకలేసినప్పుడు బంగారంతో పొట్టనింపుకోలేవు గదా... అందరిలాగే ఉప్పు, పప్పుతోనే నింపుకోవాలి. అందుకే స్వార్థం మానుకొని నలుగురిని గురించి కూడా ఆలోచిస్తూ ఉండాలి. మీరు సంపాదించిన దానిలో శాస్త్రం అంగీకరించిన మేర అంత దాచుకోండి. ఎంత అనుభవించాలో అంత అనుభవించండి. ఉండీ దరిద్రంగా బతకమని ఏ శాస్త్రమూ చెప్పలేదు. జీవుడికి పునర్జన్మ ఉందని జ్ఞాపకం పెట్టుకొని పదిమందిని ఆదుకోండి. లేకపోతే జన్మకు అర్థం లేదు. వేమనగారు చెబుతున్నది కూడా అదే... ‘‘ధనము కూడబెట్టి దానంబు చేయక/తాను దినక లెస్స దాచుకొనగ/ తేనెటీగ గూర్చి తెరువరికియ్యదా/ విశ్వదాభిరామ వినుర వేమ.... ’’ దేశోద్ధారక కాశీనాథుని నాగేశ్వర రావు పంతులుగారు అమృతాంజన్ వ్యాపారం పెట్టి... చాలా సంపాదించారు. అంతా తానే ఉంచేసుకోలేదు. కుటుంబం కోసమే దాచిపోలేదు. ఎన్నెన్ని దానధర్మాలు చేసారో, స్వాతంత్య్ర సంగ్రామం కోసం ఎంతెంత ఖర్చు చేసారో, ఎంతెంత మంది పేదవారికి ఉపాధి కల్పించారో తెలిస్తే ఆశ్చర్యపోతాం. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
ప్రతిరోజు లక్షలు సంపాదిస్తున్నాడు.. మళ్లీ రెండు సార్లు రైతుబంధు
హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యాపారి రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం కనకమామిడిలో భూమి కొని అందులో రిసార్ట్ నిర్వహిస్తున్నారు. పెళ్లిళ్లు, రిసెప్షన్లు, పుట్టినరోజు వేడుకల వంటి కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రతిరోజు లక్షలు ఆర్జిస్తున్నాడు. అయితే రెవెన్యూ రికార్డుల్లో ఆ భూమి వ్యవసాయ భూమిగా నమోదై ఉండటంతో ప్రభుత్వం అందించే పంట పెట్టుబడి సాయం ‘రైతుబంధు’ఏడాదికి రెండుసార్లు అతని ఖాతాలో జమవుతోంది. మొయినాబాద్ మండలానికి చెందిన ఓ మాజీ ప్రజాప్రతినిధి తన వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చకుండానే మూడేళ్ల క్రితం క్రీడా మైదానం ఏర్పాటుచేసి రోజూ అద్దెకు ఇస్తున్నారు. సాధారణ సమయాల్లో రోజుకు రూ 2,000–4,000, వారాంతాల్లో రూ.8,000– 10,000 అద్దె వసూలు చేస్తున్నారు. ఇలా సంవత్సరం మొత్తం అద్దెకిచ్చే క్రీడా మైదానానికీ రైతుబంధు డబ్బులు అందుతున్నాయి. ఇదే తరహాలో జిల్లాలో వ్యవసాయేతర కార్యకలాపాలు నిర్వహించే చాలా భూముల యజమానులకు రైతుబంధు డబ్బు తేరగా వస్తోంది. మొయినాబాద్: రైతులకు ఆర్థికంగా చేయూతనందించడానికి ప్రభుత్వం 2018 మే 10న రైతుబంధు పథకాన్ని ప్రారంభించింది. పంట పెట్టుబడి సహాయం పేరుతో వ్యవసాయంచేసే ప్రతి రైతుకు ఎకరాకు ఏడాదికి రూ.8 వేల చొప్పున అందిస్తా మని అప్పట్లో ప్రభుత్వం ప్రకటించి మొదటి విడతలో రైతుల పేరుతో చెక్కులు పంపిణీ చేసింది. ఆపై రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేస్తోంది. 2019 నుంచి ఈ సహాయాన్ని వానాకాలం, యాసంగి పంటలకు ఎకరాకు రూ.5వేల చొప్పున ఎకరాకు సాలీనా రూ.10 వేలకు పెంచింది. తాజాగా యాసంగి సీజన్‌కు సంబంధించిన రైతుబంధు డబ్బులను ప్రభుత్వం జమ చేస్తోంది. రికార్డుల్లో వ్యవసాయం.. క్షేత్రంలో వాణిజ్యం రైతులను ఆదుకునేందుకు ఇస్తున్న రైతుబంధు కొందరి స్వార్థం కారణంగా పక్కదారి పడుతోంది. పంటలు సాగుచేసే వ్యవసాయ భూములకు మాత్రమే ఈ సాయం అందాలనేది ప్రభుత్వ ఉద్దేశం. కానీ వ్యవసాయేతర కార్యకలాపాలు నిర్వహిస్తున్న భూములకూ రైతుబంధు డబ్బులు జమ అవుతున్నాయి. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ఇటీవల క్రీడా మైదానాలు, ఫాంహౌస్‌లు, రిసార్ట్స్, ఫంక్షన్‌హాళ్లు, కన్వెన్షన్ సెంటర్లు ఎక్కువయ్యాయి. ఇవి వెలసిన భూములన్నీ రెవెన్యూ రికార్డుల్లో వ్యవసాయ భూములుగానే కొనసాగుతున్నాయి. నిబంధనల ప్రకారం పట్టా భూములకు రైతుబంధు ఇవ్వాలనే మార్గదర్శకాలకు అనుగుణంగా వీరికి యథావిధిగా సాయం అందుతోంది. దీంతో బడా వ్యాపారులు, సంపన్నవర్గాలు, సెలబ్రిటీలు, ఆ భూములను వాణిజ్య అవసరాలకు వినియోగిస్తూ రైతుబంధును తీసుకుంటున్నారు. ఇలా రాజధాని శివార్లలోని రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో వ్యాపార కార్యకలాపాలు కొనసాగించే భూములు వేల ఎకరాల్లో ఉన్నాయి. వాటన్నింటికీ రైతుబంధు ఇస్తుండటంతో ఏటా కోట్ల రూపాయలు ‘పెద్ద’ రైతుల ఖాతాల్లోకి వెళుతున్నాయి. గుర్తించని అధికారులు రంగారెడ్డి జిల్లాలో వ్యవసాయేతర కార్యకలాపాలు జరిగే పంట భూములను గుర్తించడంలో యంత్రాం గం విఫలమవుతోందనే విమర్శలున్నాయి. వ్యవసాయానికి కాకుండా ఇతర అవసరాలకు వాడే భూములను నాలా కింద మార్చాల్సి ఉంటుంది. కానీ చాలామంది నాలా మార్పిడి చేయకుండానే వ్యవసాయ భూములను వ్యాపార కార్యకలాపాలకు వాడుతున్నారు. ఇదిలావుండగా, 111 జీవో పరిధిలో వ్యవసాయేతర కార్యకలాపాలపై ప్రభు త్వం ఆంక్షలున్నాయి. మొత్తం విస్తీర్ణంలో కేవలం పదిశాతమే వ్యవసాయేతర అవసరాలకు విని యోగించుకోవాలనే నిబంధనలున్నాయి. దీంతో వ్యవసాయేతర భూముల మార్పిడి కష్టతరంగా మారింది. ఈ నేపథ్యంలో కొందరు బడాబాబులు, రియల్టర్లు తమ భూములను వ్యవసాయేతర అవసరాలకు మళ్లిస్తూ.. ప్రభుత్వం కళ్లుగప్పుతున్నారు. నిజమైన రైతులకు అందాలి ప్రభుత్వం ఇచ్చే రైతుబంధు నిజమైన రైతులకు అందట్లేదు. వాణి జ్య భూములకు రైతుబంధు ఇస్తున్న ప్రభు త్వం అసైన్డ్ భూములు సాగుచేసుకునే పేదరైతులకు ఇవ్వట్లేదు. వాణిస్య భూములకు రైతుబంధును నిలిపివేయాలి. పేదలకు అసైన్డ్ చేసిన భూములపై వారికే హక్కులు కల్పించి రైతుబంధు ఇవ్వాలి. – ఉప్పరి శ్రీనివాస్, అసైన్డ్ భూమి సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు, మొయినాబాద్ 111 జీవో పరిధిలో నాలా కన్వర్షన్ లేదు వ్యాపార కార్యకలాపాలు నిర్వహించే భూములను వ్యవసాయేతర భూములుగా మార్చుకోవాలి. కానీ 111 జీవో పరిధిలో నాలా కన్వర్షన్ లేదు. దీంతో ఈ ప్రాంతంలోని వ్యవసాయేతర భూములు కూడా రికార్డుల్లో వ్యవసాయ భూములుగానే ఉన్నాయి. దీనిపై ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకోవాలి. – అనితారెడ్డి, తహసీల్దార్, మొయినాబాద్ -
స్వార్థం లేనిదే స్నేహం
ఇశ్రాయేలీయులను, యూదులను పరిపాలించిన సౌలు కుమారుడు యోనాతాను, సౌలు వద్ద ఉన్న దావీదుతో స్నేహం చేశాడు. ఒక రాజ కుమారుడు సాధారణమైన వ్యక్తితో స్నేహం చేయడం వెనుక అతని హృదయ స్వచ్ఛత కనిపిస్తుంది. స్నేహం అంటే కలిసి తిరగడం, అల్లరి చేయడం అనే ఈ తరం వారికి తెలుసు, కానీ స్నేహం అంటే త్యాగం అనే విషయం ఇప్పటి తరానికి నేర్పాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. వీరుడైన దావీదు తన రాజ్యాన్ని ఎక్కడ ఆక్రమిస్తాడో అని అనుకున్న సౌలు దావీదును చంపడానికి ఆలోచిస్తున్నాడు. అయితే తన కుమారుడైన యోనాతానుతో దావీదుకున్న స్నేహం గురించి అతనికి తెలియదు కనుక ఆ విషయాన్ని యోనాతానుతోనే చెప్పాడు. దావీదును చంపాలన్న ఆలోచన తన తండ్రి చేస్తున్నాడని తెలిసిన యోనాతాను, ఎలాగైనా తన స్నేహితుడిని రక్షించాలనుకున్నాడు. ఆ విషయాన్ని దావీదుకు తెలియజేసి ‘‘నీవు రహస్యస్థలంలో దాగి ఉండు’’ అని అతనిని తన తండ్రి యొద్దనుండి రక్షించిన గొప్ప స్నేహితుడు యోనాతాను. దావీదును యోనాతాను రక్షించడం వెనుక ఎలాంటి స్వార్థం లేదు, కేవలం దావీదు తన స్నేహితుడు అంతే, దావీదును సౌలు చంపితే ఆ రాజ్యానికి రాజు యోనాతాను కావచ్చు. అయినా ఆ రాజ్యం కంటే కూడా తన స్నేహితుడే తనకు ముఖ్యమని దావీదును కాపాడుకోవడానికి తన ప్రాణాన్ని సైతం లెక్క చేయని గొప్ప స్నేహితుడు యోనాతాను, తన కుమారుడే తన శత్రువైన దావీదును రక్షిస్తున్నాడని తెలిసికొన్న సౌలు ‘నీవే దావీదును నా వద్దకు రప్పించమని’ యోనాతానుతో చెప్పినపుడు తన స్నేహితుని కోసం తండ్రినే ఎదిరించి దావీదు వద్దకు పోయి కౌగిలించుకుని బిగ్గరగా ఏడ్చి తన తండ్రి ఉద్దేశ్యం అంతా అతడికి వివరించి దావీదు ప్రాణాన్ని కాపాడి అతడిని అక్కడినుండి తప్పించాడు, ఆ విడిపోతున్న సందర్భంలో ఇద్దరూ ఒకరినొకరు కౌగిలించుకుని బిగ్గరగా ఏడ్చిన సందర్భంలో యోనాతాను దావీదుతో చేసుకున్న నిబంధన ఎంతో గొప్పది, ఇలాంటి స్నేహం మనం ఇప్పుడు చూడగలమా? ఇలాంటి స్నేహితులు ఇప్పుడు మనకు కనిపిస్తున్నారా? అసలు స్నేహం అనే పదానికి అర్థం కూడా మార్చివేసిన ఒక భయంకరమైన సందర్భంలో మనం ఉన్నాం. రాజ్యాలను విడిచి, ప్రాణాలను సైతం లెక్కచేయకుండా తమ స్నేహానికి వారిచ్చిన విలువ ఎంత గొప్పదో కదా! తరువాత రోజుల్లో యోనాతాను మరణించాక దావీదు తన పరిపాలన కాలంలో దివ్యాంగుడైన యోనాతాను కుమారుడైన మెఫీబోషెతును వెదికించి అతడికి రావలసినదంతా ఇప్పించి అతడు ఇక ఎప్పటికి తనతో కలిసి తన బల్లపైనే భోజనం చేయాలని కోరుకున్నాడు. ఇదంతా తన స్నేహితుడైన యోనాతానును బట్టే. యోనాతాను మరణించినా అతడి స్నేహాన్ని మరచిపోకుండా అతని కుమారుడికి మేలు చేసిన దావీదుది ఎంత గొప్ప హృదయమో కదా! ఇలాంటి స్నేహితులు మనకుంటే ఎంత బావుంటుంది! మనకు మంచి స్నేహితుడు దొరకాలంటే ముందు మనం మంచి స్నేహితులమై ఉండాలి. అప్పుడే మనకు యోనాతాను, దావీదులాంటి స్నేహితులు దొరుకుతారు. – రవికాంత్ బెల్లంకొండ -
మనిషిని ప్రేమించాలి... డబ్బును కాదు!
ఎందుకోగాని సమాజంలో ఎన్ని మార్పులొస్తున్నా స్వార్ధప్రియత్వం తగ్గడం లేదు. పక్కవాడు బాగుంటే ఓర్వలేని పరిస్థితే ఎక్కువగా కనిపిస్తోంది. అంటే, ఇలాంటి పరిస్థితి గతంలో ఎప్పుడూ లేదని కాదు... మరీ ఈ స్థాయిలో ఉండేది కాదు. ఇప్పుడు వ్యాపార దృష్టి మరీ పెరిగిపోయింది. దాని ఫలితమే మానవ సంబంధాలను కూడా ఆ దృష్టితోనే చూడడం. మంచి, మర్యాద, ప్రేమ, ఆప్యాయతలు కనీస స్థాయిలోనే కనిపిస్తున్నాయి తప్ప, కావలసినంత స్థాయిలో కనబడడం లేదు. ‘నోటితో పలకరిస్తూ... నొసటితో వెక్కిరించే ధోరణిలో పైకి చిరునవ్వులు చిందిస్తారు కానీ, పక్కకెళ్లి చెవులు కొరుక్కోవడమే ఇంచుమించు అందరిలోనూ. కడుపులో కల్మషం తప్ప నికార్సయిన ప్రేమ కానరాదు... అంతా కృత్రిమం. దీనంతటికీ ప్రధాన కారణం ప్రాపంచిక సుఖాల మీద విపరీతంగా వ్యామోహం పెరిగిపోవడం... సుఖం కోసం పాకులాట. సంతోషం కోసం వెంపర్లాట. బంధుమిత్రులు, పేదసాదలు, సమాజం, ప్రేమ, అభిమానం, దానధర్మాలు అంటూ ఆ వైపు మొగ్గుచూపితే తమ సంపద ఎక్కడ తరిగిపోతుందోనని, తమ సుఖభోగాలకు ఎక్కడ అంతరాయం ఏర్పడుతుందోనని భయం. ఈ నేపథ్యం లోంచే స్వార్థం పుట్టుకొస్తోంది. మనసులో స్వార్థం గూడుకట్టుకున్న వారు పరులకేమీ చేయకపోగా, వారి ఎదుగుదలను కూడా సహించలేరు. లోభత్వం, పిసినారితనంతోపాటు, అసూయ, అహంకారం కూడా అలుముకుంటాయి. త్యాగం, సహనం, ప్రేమ, పరోపకారం, దయ. జాలి, కరుణ లాంటి పదాలకు చోటుండదు. ఈ దుస్థితి దూరం కావాలంటే, కొన్ని విశ్వాసాలకు బద్ధుడు కావాలి. ఈ ప్రపంచమే సర్వస్వమని, ఇక్కడి సుఖాలు, ప్రయోజనాలే ముఖ్యమన్న భ్రమల్లోంచి బయట పడాలి. ఈ ప్రపంచం అశాశ్వతమని, అందులో తమ జీవితం కూడా మూణ్నాళ్ళ ముచ్చటేనని గ్రహించాలి. స్వార్థం వీడితేనే జీవితానికి సార్ధకత చేకూరుతుంది. అది పోవాలంటే, ప్రాపంచిక వ్యామోహాన్ని కనీస స్థాయికి తగ్గించుకోవాలి. ఇతరులను ప్రేమించడం అలవరచుకోవాలి. వారి అవసరాలు తీర్చాలి. కష్టసుఖాల్లో పాలుపంచుకోవాలి. సమాజం పట్ల బాధ్యతను గుర్తెరగాలి. ఎంత పోగేసినా అది తమ వెంట రాదని, ఏదో ఒకనాడు అదంతా వదిలేసి వెళ్ళిపోవలసిందేనన్న స్పృహను ప్రదర్శించాలి. ఎదుటి వారి ప్రగతిని, అభివృద్ధిని కాంక్షించాలి. వారి ఎదుగుదలను ప్రోత్సహించాలి. మనసులో స్వార్ధం, కల్మషం లేనప్పుడే ఇది సాధ్యం. -
మంట కలుస్తున్న బాంధవ్యాలు
► మనిషిలో పెరుగుతున్న స్వార్థం ► చిన్న వివాదాలతోనే గొడవలు ► హత్యలు, అత్యాచారాలకు పాల్పడుతున్న వైనం ► కౌన్సెలింగ్ అవసరమంటున్న నిపుణులు రోజులు మారుతున్నాయి.. మనుషులు మారుతున్నారు.. వారి ప్రవర్తనలో మార్పు వస్తోంది.. అనుకున్న వస్తువు, లేదా మరేదైనా దక్కకపోతే దానవులుగా మారిపోతున్నారు. మమతలు, అనురాగాలు, ప్రేమాభిమానాలు మరిచిపోయి కట్టుకున్న పెళ్లాన్ని, కడుపున పుట్టిన బిడ్డను సైతం హత్య చేస్తున్నారు. వ్యక్తిలో పెరుగుతున్న స్వార్థ చింతనే దీనికంతటికీ ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుత సమాజంలో ఇది సంక్లిష్ట పరిస్థితిగా మారిపోయింది. ఇక రాబోయే రోజుల్లో మరింత ప్రమాదకర పరిస్థితులకు దారితీసే అవకాశాలు ఉన్నాయని మానసిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. తిరుపతి క్రైం : కారణాలు ఏవైనా జిల్లాలో హత్యలు పెరిగిపోతున్నాయి. వివాహేతర సంబంధాలు, వ్యాపార లావా దేవీలు, ఆస్తి గొడవలతో మనుషులన్న విచక్షణను కోల్పోయి హత్యలకు పాల్పడుతున్నారు. ప్రవర్తనలో మార్పును గమనించిన వెంటనే మానసిక నిపుణుల వద్దకు తీసుకెళ్లి కౌన్సెలింగ్ ఇప్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంతేగాక తల్లిదండ్రులు తమ పిల్లలకు చిన్నప్పటి నుంచి నైతిక విలువలు, బంధాలు, బంధుత్వాల గురించి తెలియజేయాల్సి ఉంది. అప్పుడే సమసమాజ నిర్మాణం జరిగి ప్రపంచం నందన వనంగా మారుతుంది. ► రెండు రోజుల క్రితం నలుగురు వ్యక్తులు తమిళనాడు నుంచి వచ్చి గది అద్దె కు తీసుకున్నారు. పూటుగా మద్యం సేవించారు. వారి మధ్య జరిగిందో కాని ముగ్గురు వ్యక్తులు కలిసి ఒకరిని హతమార్చి పరారయ్యారు. ► తనకు తెలియకుండా వ్యవహారం నడుపుతున్నాడనే నెపంతో యువకుడిని కలికిరి మండలంలో అతిక్రూరంగా హింసించి హత్య చేశారు. ► ఐదు రోజుల క్రితం రేణిగుంట ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లో బాబు అనే వ్యక్తిని ఇనుప రాడ్డుతో కొట్టి హత్య చేశారు. ► ఈ నెల మొదటి వారంలో ఇద్దరు స్నేహితుల మధ్య డబ్బు వివాదం చోటు చేసుకుంది. దీంతో కలిసి చదువుకున్న స్నేహితుడని కూడా చూడకుండా కిరాతకంగా స్నేహితుడే హత్య చేశాడు. ► మదనపల్లిలో మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వలేదని భార్యను కొడుతుండగా అడ్డు వచ్చిన అత్తను అల్లుడు దారుణంగా హత్య చేశాడు. కొరవడిన నిఘా వ్యవస్థ జిల్లాలో ప్రతిరోజూ ఎక్కడో ఒక హత్యలు జరుగుతూనే ఉన్నాయి. ఎక్కువగా భార్యాభర్తల మధ్య జరిగిన గొడవలతోనే హత్యలకు పాల్పడుతున్నారు. వీటిపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన పోలీసులు ప్రకటనలకే పరిమితమవుతున్నారు. పేరుకు మాత్రమే ఫ్యామిలీ కౌన్సెలింగ్‌లు నిర్వహిస్తున్నామని, భార్యాభర్తల మధ్య అనుమానాలు తొలగిస్తున్నామని చెబుతున్నారు. జరిగినా సంఘటన గురించి ప్రజల్లోకి తీసుకెళ్లి వివరించడంలో విఫలమవుతున్నారు. ఇప్పటికైనా ప్రకటనలు వదలివేసి జరుగుతున్న హత్యలకు కారణాలు తెలుసుకుని ప్రజల్లో పూర్తిస్థాయి అవగాహన పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అన్ని చోట్ల మార్పులు రావాలి వ్యక్తుల్లో నేను, నాది అన్న భావన రానురాను బలంగా వేళ్లూనుకుంటోంది. కూర్చుని చర్చించుకుంటే పరిష్కారమయ్యే చిన్న చిన్న సమస్యలపై హత్యలు చేసే స్థాయికి వస్తుండడం వ్యక్తిలో వస్తున్న మార్పులకు అద్దం పడుతోంది. పిల్లలకు చిన్నప్పటి నుంచే మంచీ చెడ్డ చెప్పాల్సిన తల్లిదండ్రులే సహనం కోల్పోతున్నారు. మనిషి అన్న ఆలోచనలు మరచిపోతున్నారు. చిన్న పిల్లలకు మనిషి ప్రాణాలు, విలువలు తెలియజేయాల్సిన వయస్సులో వారే దారితప్పుతున్నారు. క్షణికావేశానికి లోనై ఆలోచించకలిగే శక్తి ఉన్నా అనాలోచిత నిర్ణయాలతో ప్రాణాలు తీస్తున్నారు. కౌన్సెలింగ్ అవసరం రక్త సంబంధం ఉన్నవారినే హత్య చేస్తున్న వారి ప్రవర్తనను ఒక కోణంలో విశ్లేషించలేం. అన్ని కోణాల్లోనూ పరిశీలించాలి. పాఠశాల వయస్సు నుంచే యుక్త వయస్సు వచ్చే వరకు పెరిగిన విధానాన్ని తెలుసుకోవాలి. ఏదో చిన్న సమస్యకే హత్యలు చేస్తున్నారంటే బంధాలు, బంధుత్వాల గురించి తెలియదు. చిన్నతనం నుం చి తల్లిదండ్రులకు దూరంగా పెరి గిన వారిలో ఈ తరహా భావా లు ఎక్కువగా ఉంటాయి. క్షణికావే శం పడుతున్న వారికి కౌన్సెలింగ్ అవసరం. అప్పుడే ఉద్వేగాలను ని యంత్రించగలం. – డాక్టర్ ఎన్ఎన్ రాజు, మానసిక నిపుణులు -
స్వప్రయోజనాలకు హోదా తాకట్టు
– వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో పోస్టల్ కార్యాలయం ఎదుట ధర్నా కర్నూలు సిటీ: సీఎం చంద్రబాబు నాయుడు స్వప్రయోజనాల కోసం ప్రత్యేక హోదాను ఢిల్లీలో తాకట్టుపెట్టారని వామ పక్ష పార్టీలు, విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపించారు. గురువారం స్థానిక పోస్టల్ కార్యాలయం ఎదుట వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ఈ సందర్భంగా సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు టి.షడ్రక్, సీపీఐ నగర కార్యదర్శి రసూల్, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రంగన్న శ్రీనివాసులు, రైతు సంఘం జిల్లా కార్యదర్శి జగన్నాథం, ఏఐటీయుసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మనోహర్ మాణిక్యం, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థి సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీనరసింహ మాట్లాడారు. విభజన సమయంలో ఏపీకి ప్రత్యేక హోదా కావాని అడిగిన నేతలే ఈ రోజు హోదా ఇవ్వలేమని ప్రకటించడం దారుణమన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు.. తన అసమర్థ నాయకత్వంతో రాష్ట్ర ప్రజలకు తీవ్ర అన్యాయం చేశారన్నారు. హోదాపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికి నిరసనగా శనివారం తలపెట్టిన బంద్‌కు అందరూ సహకరించాలని కోరారు. కార్యక్రమంలో సీపీఎం నగర కార్యదర్శి గౌస్‌దేశాయ్, సీఐటీయు నాయకులు రాధాకష్ణ, అంజిబాబు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కె.వి నారాయణ, రైతు సంఘం నాయకులు నాగేశ్వరరావు, ఐద్వా, ఇతర ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాల నాయకులు ాల్గొన్నారు. -
ఎలా ఉంటున్నారో అలాగే ఉండండి...
జనవరి 30 నుంచి ఫిబ్రవరి 5 వరకు టారో బాణి ఏరిస్ (మార్చి 21- ఏప్రిల్ 20) కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. ఎవరైనా మిమ్మల్కి ఎక్కువగా ప్రశంసిస్తుంటే దాని వెనుక ఏదో స్వార్థం ఉందన్న విషయాన్ని గుర్తించండి. కొన్ని విషయాల్లో మిమ్మల్ని కొందరు వ్యతిరేకించవచ్చు. నిరుత్సాహపడవద్దు. ఒత్తిడికి లోను కావద్దు. ఈ పరిస్థితి ఎక్కువ కాలం కొనసాగదు. కలసివచ్చే రంగు: వంకాయ రంగు టారస్ (ఏప్రిల్ 21-మే 20) ఈ వారం అన్నింట్లోనూ తటస్థంగా ఉండటం మంచిది. పనులతో ఉక్కిరి బిక్కిరై ఊపిరి సలపని పరిస్థితి వస్తుంది. మిమ్మల్ని మీరు అందుకు సిద్ధం చేసుకుని, సకాలంలో పనులు పూర్తి చేయడానికి ప్రయత్నించండి. వృత్తిగత జీవితానికీ వ్యక్తిగత జీవితానికీ మధ్య సమన్వయం ఏర్పరచుకోవడానికి ప్రయత్నించండి. బంధాలను నిర్లక్ష్యం చేయకండి. కలసివచ్చే రంగు: బ్రౌన్ జెమిని (మే 21-జూన్ 21) మీలో మీరు కొన్ని మార్పులు చేసుకోవాల్సిన తరుణం. కొన్ని అనవసరమైన విషయాలకై డబ్బు ఖర్చు చేస్తున్న విషయాన్ని గుర్తించండి. ఓ పెద్ద అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. అయితే నిర్ణయం తీసుకోవడంలో మీరు కాస్త కష్టపడాల్సి రావచ్చు. ఎప్పుడో విడిపోయిన ఓ పాత నేస్తం మళ్లీ మీ జీవితంలోకి వస్తారు. కలసివచ్చే రంగు: పీచ్ క్యాన్సర్ (జూన్22-జూలై 23) కాస్త నిరుత్సాహకరమైన వారం. కానీ మీరు కాస్త ప్రయత్నిస్తే అన్నింట్లోనూ విజయం సాధించగలరు. మిమ్మల్ని ఎవరూ ఆపలేరు. ఆ దిశగా అడుగులు వేయండి. ఆర్థికంగా అద్భుతంగా ఉంటుంది. ఓ కొత్త ప్రాజెక్టును ప్రారంభించే అవకాశం కూడా ఉంది. ప్లానింగ్‌తో సాగితే అందులోనూ మీరు విజయం సాధిస్తారు. కలసివచ్చే రంగు: ముదురు నారింజ లియో(జూలై 24-ఆగస్టు 23) ప్రేమ వ్యవహారాల్లో ఒక నిర్ణయానికి రావడానికి తగిన సమయం. కాస్త కష్టపడితే మీరు కోరుకున్న సంతోషాలన్నీ మీ దగ్గరకు వస్తాయి. అయితే కొన్ని అభద్రతాభావాలు మిమ్మల్ని ఆవరించుకునే అవకాశం ఉంది. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ఫిట్‌నెస్‌పై తగు దృష్టి పెట్టండి. కలసివచ్చే రంగు: తెలుపు వర్గో (ఆగస్టు24-సెప్టెంబర్ 23) మీ ఇంటిలో మార్పులు చేయడానికి మంచి సమయం. ఎప్పటి నుంచో పెండింగ్‌లో ఉన్న ఓ ప్రాజెక్టు పూర్తయిపోతుంది. ఇప్పటివరకూ విసిగించిన కొన్ని సమస్యలు పరిష్కారమవుతాయి. వచ్చిన ప్రతి అవకాశాన్నీ అందిపుచ్చుకుంటూ సాగిపోండి. ధనలాభం, వస్త్రలాభం చేకూరుతాయి. కలసివచ్చే రంగు: వంకాయ రంగు లిబ్రా (సెప్టెంబర్ 24- అక్టోబర్ 23) బాధ్యతలతో ఉక్కిరిబిక్కిరవుతారు. ఓ నిజం మీలో అలజడి సృష్టిస్తుంది. కొన్ని ముగిసిపోవడం అనేది మరికొన్నిటి ప్రారంభానికే దారి తీస్తాయన్న నిజాన్ని గ్రహించండి. ఓసారి పడినా మళ్లీ తిరిగి లేవగలం అన్న సత్యాన్ని అవగతం చేసుకోండి. నిరంతరాయంగా పని చేస్తూ, ఆర్థికంగా ఎదగడానికి ట్రై చేస్తూ మిమ్మల్ని మీరు బిజీగా ఉంచుకోండి. కాలమే అన్ని గాయాలనూ మాన్పుతుందని అర్థం చేసుకోండి. కలసివచ్చే రంగు: ఆకుపచ్చ స్కార్పియో (అక్టోబర్ 24-నవంబర్ 22) కష్టం తర్వాతే సుఖం వస్తుందన్న వాస్తవాన్ని తెలుసుకుంటారు. ఓ పరాజయాన్ని కూడా విజయంగా మార్చుకుంటారు. పనిలో ఆనందాన్ని వెతుక్కునేవాళ్లకి బాధతో సమయం వెళ్లదీసేంత తీరిక ఉండదు. కొత్త ప్రాజెక్టులు మీకు తీరిక లేకుండా చేస్తాయి. ప్రయాణాలు కూడా చేయాల్సి వస్తుంది. కలసివచ్చే రంగు: పసుపు శాజిటేరియస్ (నవంబర్23-డిసెంబర్ 21) మీ తెలివితేటలతో డబ్బు సంపాదిస్తారు. అయితే నియమాలను మాత్రం తప్పకుండా పాటించండి. గత జీవితపు చీకట్లు పూర్తిగా తొలగిపోతాయి. ఓ చిరకాల సమస్య పరిష్కారమై మీ జీవితంలో కొత్త వెలుగు నిండుతుంది. మీ కోసం, మీ వాళ్లకోసం కాస్త సమయాన్ని కేటాయించడం కూడా అవసరం అని గుర్తించండి. కలసివచ్చే రంగు: సిల్వర్ క్యాప్రికార్న్ (డిసెంబర్ 22-జనవరి 20) బాధ్యతలు, బంధాలను కొత్త దృష్టితో చూడటం వల్ల మీలో ధైర్యం పెరుగుతుంది. జీవితంలో కొత్త మార్పులు వస్తాయి. కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడానికి, కొత్త బాధ్యతలు స్వీకరించడానికి మీకిది తగిన సమయం. పాత పద్ధతులకు స్వస్తి చెప్పాల్సిన సమయం కూడా. తల్లిదండ్రుల నుంచి కొన్ని బహుమతులను అందుకుంటారు. పాతబాకీలు తీరుస్తారు. కలసివచ్చే రంగు: యాపిల్ గ్రీన్ అక్వేరియస్ (జనవరి 21-ఫిబ్రవరి 19) ఈ వారమంతా ఉత్సాహవంతంగా సాగిపోతుంది. మీరు క్లయింట్స్‌ని డీల్ చేసే పద్ధతి మీకు విజయాలను చేకూరుస్తుంది. పెద్ద పెద్ద అవకాశాలను ఈ వారం మీ దగ్గరకు తీసుకుని వస్తుంది. మీ తెలివితేటలు, ప్రతిభా పాటవాలు వెలుగులోకి వస్తాయి. భావోద్వేగాలకు గురయ్యే పరిస్థితులు కొన్ని ఏర్పడవచ్చు. కలసివచ్చే రంగు: ఆకుపచ్చ పైసిస్ (ఫిబ్రవరి 20-మార్చి 20) కొత్త సవాళ్లను స్వీకరించడానికి, కొత్త బాధ్యతలను చేపట్టడానికి ఇది తగిన సమయం. ఆరోగ్యం ఇనుమడిస్తుంది. దేనినైనా సమర్థంగా ఎదుర్కోగల ఉత్సాహం కలుగుతుంది. పనుల్లో పడి కొట్టుకుపోకుండా జీవితాన్ని కాస్త ఎంజాయ్ చేయడానికి ప్రయత్నించండి. ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. విదేశాలకు వెళ్లే అవకాశం ఒకటి మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. కలసివచ్చే రంగు: లేత పసుపు టారో ఇన్సియా టారో అనలిస్ట్, రేకీ గ్రాండ్ మాస్టర్ సౌర వాణి ఏరిస్ (మార్చి 21- ఏప్రిల్ 20) చేయగలిగిందేదో దాన్ని చేసి చూపించండి తప్ప ఎలా చేయగలరో దాన్ని వాగ్దాన రూపంగా కాగితం ముఖంగా చెప్పనూ వద్దు - రాసి చూపనూ వద్దు. దశాధినాథుడు సక్రమంగా లేని కారణంగా చెప్పిన మాటని ఫలించనీయకపోవచ్చు. ముఖ్యంగా రియల్ ఎస్టేట్, చిట్‌ఫండ్స్ వ్యాపారాల వారు మరింతగా గమనించుకోగలగాలి. టారస్ (ఏప్రిల్ 21-మే 20) స్థిరమైన ఆస్తుల కొనుగోళ్లకి ఆతురత పడకండి. సంతానం కోసం చేయవలసిన రుణాలు సిద్ధంగా ఎదురుచూస్తూ ఉన్నాయి. అధికారుల తప్పుల్ని గమనించుకుంటూ ‘ఎప్పుడవకాశం వస్తుందా?’ అని ఎదురుచూడండి. మంచి చోటుకి బదిలీకి వారి అవసరం బాగా ఉంది. పూర్తి పరిష్కారం అయ్యే అవకాశం లేదు కాబట్టి ఇతరుల మాటలని నమ్మి మీకున్న ఆస్తుల్ని అమ్మివేద్దామనే నిర్ణయానికి రాకండి. జెమిని (మే 21-జూన్ 21) మీకు పని ఒత్తిడి తగ్గే మంచిరోజులు దాదాపు వచ్చినట్లే. మరో గూటికి రెక్కలు విప్పుకుని ఎగిరిపోబోయే క్షణాలు దాదాపు వచ్చేసినట్లే. ‘నిదానమే ప్రధాన’మనే తీరులో మీరు జాగ్రత్తగా అడుగువేస్తుంటే ఇతరులు మాత్రం మిమ్మల్ని పిరికివారుగా, అసమర్థులుగా లెక్కించుకుంటూ మిమ్మల్ని అంచనా వేయడంలో వాళ్లు తమ ఓటమిని గుర్తించుకోలేకపోతున్నారు. మీరు మీ మార్గంలోనే వెళ్లండి. క్యాన్సర్ (జూన్22-జూలై 23) ఒక చెరువునో నదినో కేవలం నడుస్తూ దాటుతున్న వేళ మీరు ఆ జలాశయం మధ్యలోకి వచ్చిన కాలం ఇది. మెల్లగా అడుగులు వేసుకుంటూ ఒడ్డు దిశగా వెళ్లబోతున్నారు కాబట్టి ఇప్పుడే ధైర్యం అవసరం. ప్రమాదం... పిరికితనం... ఇలాంటి మాటల్ని పక్కనపెట్టి సాగిపోండి. మీకు పరిస్థితి అనుకూలంగా ఉంది. లియో (జూలై 24-ఆగస్టు 23) నడుస్తున్న మార్గం సరైనదే అయినా మధ్యమధ్యలో ఎదుగుదలలో భాగంగా తగిన జాగ్రత్తల కోసం అనుభవజ్ఞుల్ని సంప్రదిస్తూ ఉంటారు. అది మంచిదే. మీరు లోగడ చేసిన రుణాలకి సంబంధించి గానీ, అమ్మిన ఆస్తులకి సంబంధించిగానీ లావాదేవీలు న్యాయస్థానం దాకా వెళ్తే భయపడకండి. తీర్పు మీకు అనుకూలంగానే ఉంటుంది. ధైర్యంగా ముందుకు సాగండి. వర్గో(ఆగస్టు24-సెప్టెంబర్ 23) కుటుంబంలోని వ్యక్తులందరూ మీరు చేస్తున్న పనుల పట్ల సంతోషాన్ని వ్యక్తీకరిస్తూ మీ పక్షానే నిలబడతారు. మీకు సంబంధించని వ్యవహారాల్లో తప్పనిసరిగా తలదూర్చవలసి వస్తే కూడ వీలు కాదనే విషయాన్ని ఎదుటివారు నొచ్చుకోకుండా ఉండేలా చెప్పండి. మొగమాటం వద్దు. మీ కుటుంబంలోని మరొకరి ద్వారా చెప్పే ప్రయత్నాన్ని చేయద్దు. మీరే చెప్పండి. అది మీకూ మీ కుటుంబానికీ శ్రేయస్కరం. లిబ్రా(సెప్టెంబర్ 24- అక్టోబర్ 23) కొత్త వృత్తిని చేపట్టడం గాని, కొత్త ఉద్యోగంలో చేరడానికి గానీ ప్రయత్నిస్తారు. అయితే ఆ కొత్తదనం మీకు సంపూర్ణ అనుకూలతని ఇవ్వదు. ఇవ్వబోదు. ‘కులవృత్తికి సాటి రా’దన్న చందంగా ‘మీరు ఇప్పటివరకూ చేసిన పనే మీ కులవృత్తి’ అనుకుంటూ అదే వ్యాపారంలో మళ్లీ కొనసాగండి. తప్పక విజయాన్ని సాధిస్తారు. కొత్త ప్రణాళిక గురించిన ఆలోచనలతో ఉన్నప్పుడు పాత అపజయాలని గురించి చింతా వృథా గుర్తుకి రానే రావు - బాధించవు. స్కార్పియో(అక్టోబర్ 24-నవంబర్ 22) మీకు అనుకూలంగా ఉంటున్నట్లుగా నటిస్తూ మీ ఆస్తులని అమ్మించే ఆలోచనతో కొందరు తారసపడచ్చు. పొరపాటున కూడా విక్రయించద్దు. మీ శ్రేయస్సుని కోరుతున్నట్లుగా చెప్తూ దేన్నో కొనవలసిందిగా సూచిస్తూ దరిజేరవచ్చు. పొరపాటున కూడ అంగీకరించవద్దు. ఎలా ఉన్నారో అలాగే ఉండండి ఈ వారమంతా. పనులు తాత్కాలికంగా వాయిదా పడినా అధైర్యపడద్దు. అది కూడ మీ మంచికే. శాజిటేరియస్ (నవంబర్23-డిసెంబర్ 21) కొత్తదైన ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూనో లేదా కొత్త ఆదాయ మార్గాన్ని చేపట్టిన కారణంగానో కొంత శారీరక శ్రమని పొందుతారు. అయినా రాబోయే అభివృద్ధి కారణంగా మానసికంగా ఉత్సాహంగానే ఉంటారు. గుర్రానికి పచ్చిగడ్డి పెట్టేది దూరపు ప్రయాణంలో పరిగెత్తించేందుకేనని గ్రహించి శ్రమకి సిద్ధంగా ఉండండి తప్ప నిరుత్సాహం ఒత్తిడి బద్ధకం... వంటి వాటికి దూరంగా ఉండండి. క్యాప్రికార్న్ (డిసెంబర్ 22-జనవరి 20) ఇంతకుముందున్న వివాదాల్లో ఒకరి తీరు అనుకూలంగా కన్పించిన కారణంగా సమస్యల్ని సృష్టించుకోవడం సరికాదనే మంచి దృక్పథం మీకు వస్తుంది ఈ వారంలో. కోపాన్ని నియంత్రించుకోవడం ఎంత అవసరమో ఆ విషయాన్ని మీకు మీరే ఉపదేశించుకుంటారు. పట్టుదల వల్ల సాధించగలిగింది తీవ్ర మనోవ్యధ మాత్రమేనని గ్రహించుకోగలుగుతారు. మంచి వారం ఇది మీకు. అక్వేరియస్(జనవరి 21-ఫిబ్రవరి 19) మీరు చేసే అన్ని ప్రయత్నాలూ సఫలమయ్యే వారం ఇది. ధనం సరైన తీరులో వ్యయం చేసుకుని సత్ఫలితాలని పొందుతారు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకోవడం మంచిదే అయినా వర్తమానమూ ముఖ్యమే అనుకుంటూ కొంత డబ్బు వినోదం, విహారం కోసం వ్యయం చేసుకోవడమూ అవసరమే. దీనివల్ల కుటుంబంలో కొంత అశాంతి తగ్గే అవకాశముంది. ప్రయత్నించండి! పైసిస్ (ఫిబ్రవరి 20-మార్చి 20) ఆర్థికంగా ఎన్నెన్నో ఖర్చులు కన్పిస్తూ ఉండచ్చు. ఆదాయాలు కూడా బాగానే ఉండొచ్చు. ప్రయాణాలు తప్పనిసరి అయినప్పుడు కూడా ‘అవసరమా?’ అని ఓసారి ఆలోచించుకుని మాత్రమే ప్రయాణం చేయండి. ప్రయాణ కాలాల్లో జాగ్రత్త తప్పనిసరి. శారీరకంగా సత్తువ తక్కువగా ఉండొచ్చు కాబట్టి - అతిథి మర్యాదలని చేయలేననే విషయాన్ని స్పష్టంగా సరైన భాషలో శైలిలో చెప్పి మానసికంగా సుఖంగా ఉండండి. డా॥మైలవరపు శ్రీనివాసరావు సంస్కృత పండితులు గమనిక: టారోబాణి, సౌరవాణి శీర్షికలను ఇంతటితో ఆపేస్తున్నాం. -
ఈ డబ్బున్నోళ్లున్నారే...
ఈ డబ్బున్నోళ్లున్నారే... ప్రపంచంలో వీళ్ల కంటే అబద్ధాలకోర్లు, దగాకోర్లు ఇంకెవరూ ఉండరంటున్నారు అమెరికన్ శాస్త్రవేత్తలు. కాలిఫోర్నియా వర్సిటీ మానసిక శాస్త్రవేత్తలు ఇటీవల టొరంటో వర్సిటీ, బర్కిలీ వర్సిటీ పరిశోధకులతో కలసి డబ్బున్నోళ్ల మనస్తత్వాలపై కూలంకషంగా పరిశోధనలు జరిపారు. సామాన్యులతో పోలిస్తే డబ్బున్నోళ్లు తమ ప్రయోజనాల కోసం అలవోకగా ఎంతటి అబద్ధాలైనా ఆడేస్తారని, సొంత లాభం కోసం ఇతరులను తేలికగా మోసగిస్తారని ఈ పరిశోధనలో తేలింది. డబ్బున్నోళ్లకు స్వార్థం, దురాశ కూడా కాస్త ఎక్కువేనని తమ పరిశోధనలో తేలినట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. -
స్వార్ధం వీడితేనే సంతృప్తి
ఈనాడు ప్రపంచాన్ని పీడిస్తున్న సమస్యల్లో అవినీతిది అగ్రస్థానం. స్వార్ధం, స్వలాభం-తద్వారా పుట్టుకొ చ్చిన ధనాశ దీనికి మూలం. ఎలాగైనా సంపాదించాలి. కోటీశ్వరులైతేనే కోరుకున్నది పొందవచ్చు. సంపదే సమస్త అవసరాలూ తీర్చగల సాధనం. కాబట్టి వీలై నంత ఎక్కువగా సంపాదించి స్విస్ బ్యాంకుల్లోనూ దాచుకోవాలి. ఏదైనా చేయాలి, కాని సంపాదించాలి. అర్ధబలంతోనే అంగబలం, అధికారం, అందలం అన్నీ వస్తాయి. అవినీతికి అసలు మూలం ఇదే. మాన వుడి ధనాశ ఎన్నటికీ తీరేదికాదు. తాను మాత్రమే కాదు, తన కొడుకులు, కూతుళ్లు, మనవలు, మునిమ నవలు సైతం కోటీశ్వరులై పోవాలని కోరుకుంటాడు. కోట్లకు పడగెత్తిన తరవాత, దాని సంరక్షణకు గూండా లను పోషిస్తాడు. అధికారులకు లంచాలిస్తాడు. తర వాత ఎన్నికల బరిలో నిలిచి, రాజకీయ రక్షణ కవచం సంపాదిస్తాడు. అయినప్పటికీ మానవుడి ధనపిపాస తీరదు. ఈ విషయాన్ని ముహమ్మద్ ప్రవక్త(స) ఎంత సోదాహరణంగా వివరించారో చూడండి- మానవుడికి బంగారంతో (సిరిసంపదలతో) నిం డిన ఒక పెద్ద లోయ లభిస్తే అతను మరొకటి కావాలని కోరుకుంటాడు. రెండవది కూడా లభిస్తే; మూడవది కావాలని అభిలషిస్తాడు. మానవ ఉదరం మట్టితో మాత్రమే నిండు తుంది (అంటే, సమాధికి చేరిన తరవాతనే ధనాశ అంతమవుతుందని అర్ధం). అయితే ప్రాపంచిక వ్యా మోహాన్ని వదిలిపెట్టి, పశ్చాత్తాప హృదయంతో అల్లా హ్ వైపునకు మరలితే, ఆయన వారిని మన్నిస్తాడు. పశ్చాత్తాపాన్ని స్వీకరించి వారిని అనుగ్రహిస్తాడు. (అలాంటి వారికి ఆత్మసంతృప్తి ప్రాప్తమవుతుంది.) ముహమ్మద్ ప్రవక్త ఇలా చెప్పారు- అత్యధిక సిరిసంపదలతో కలిమి రాదు, అసలైన కలిమి ఆత్మసంతృప్తి ద్వారానే ప్రాప్తమవుతుంది. అందుకని మనిషి వక్రమార్గాలు విడిచి, అవినీతి, అధర్మాలకు పాల్పడకుండా ధర్మబద్ధమైన జీవన విధా నాన్ని అవలంబించాలి. ఆశ ఉన్నా, అది దురాశగా మారకుండా జాగ్రత్త పడాలి. ఎప్పుడూ మధ్యే మార్గాన్ని అవలంబించాలి. సర్వకాల సర్వావస్ధల్లో ధర్మాధర్మా లను దృష్టిలో ఉంచుకోవాలి. కొంతమేరకైనా స్వార్ధా న్ని వీడి సమాజం కోసం ఆలోచిస్తే అవినీతికి అణువం తైనా ఆస్కారం ఉండదు. దీని కోసం సర్వసంగ పరి త్యాగం చెయ్యవలసిన అవసరంలేదు. మంచీ చెడు, ధర్మం అధర్మం, సత్యం అసత్యం, న్యాయం అన్యా యం లాంటి విషయాల పట్ల విచక్షణ తెలుసుకొని, ఆచరించగలిగితేచాలు. ముహమ్మద్ ప్రవక్త(స) ప్రవ చించినట్లు, ‘మనిషి తన స్వయానికి ఏ స్ధితిని కోరు కుంటాడో, పరుల విషయంలో కూడా అదేస్ధితిని అభి లషించే వాడై ఉండాలి.’ ప్రతి ఒక్కరూ ఈ విధంగా ఆలోచిస్తే ఈనాడు సమాజాన్ని పట్టిపీడిస్త్తున్న సకల సమస్యలూ వాటంతట అవే పరిష్కారమైపోతాయి. - యండి.ఉస్మాన్ ఖాన్ -
తను నన్ను క్షమించదు... క్షమించలేదు!
షీ అలర్ట్ ! మహిళలూ జాగ్రత్త! సమాజంలో పలు రకాలుగా అన్యాయానికి, మోసాలకు గురవుతున్న మహిళల ఆవేదనకు అక్షర రూపం ఈ శీర్షిక. వారి అనుభవాలను ఉదాహరణగా చూపిస్తూ, మిమ్మల్ని అప్రమత్తం చేసేందుకు సాక్షి అందిస్తోన్న వాస్తవ సంఘటనలివి... మిట్టమధ్యాహ్నం అయినా కారుమేఘాల కారణంగా చీకట్లు అలుముకుంటున్నాయి. ఆకాశం చిన్నగా ఉరుముతోంది. అప్పుడప్పుడూ ఒక్కో మెరుపు తళుక్కుమంటోంది. కాసేపటికి టప్‌టప్‌మంటూ చిన్న చిన్న చినుకులు రాలడం మొదలయ్యింది. ఇంకాసేపటి జల్లు వేగం పుంజుకుంది. బెడ్రూమ్ కిటికీ దగ్గర నిలబడి చూస్తోన్న నన్ను తడపసాగింది. దాంతో కిటికీ మూసేసి వచ్చి మంచమ్మీద వాలాను. వాతావరణం చల్లబడిందేమో... కాస్త మగత కమ్ముకున్నట్టుగా అనిపిస్తోంది. కాసేపు కునుకు తీస్తే బాగుణ్ననిపిస్తోంది. దాంతో మెల్లగా కనురెప్పలు మూశాను. కాసేపుంటే నిదురలోయల్లోకి జారిపోయేదాన్నే. కానీ ఎవరో పట్టి కుదపడంతో మత్తు చెదిరి ఈ లోకంలోకి వచ్చిపడ్డాను. చూస్తే ఎదురుగా ఆయన. ‘ఏమిటండీ... ఏం జరిగింది?’ అన్నాను లేచి కూర్చుంటూ. ‘ఏం జరిగిందని నేనే నిన్ను అడగబోతున్నా. ఎప్పుడూ లేనిది ఈ సమయంలో పడుకున్నావేంటి? లే. వాళ్లు వచ్చే టైమయ్యింది’ అన్నారాయన ఎంతో హుషారుగా. నాకేమీ అర్థం కాలేదు. ఎవరు వస్తున్నారు? ఎందుకు వస్తున్నారు? అదే అడిగాను. ఆయన తల కొట్టుకున్నారు. ‘నువ్వు మరీ ఇలా తయారవుతున్నావేంటి సుమిత్రా? పొద్దున్న చెప్పాను కదా నీకు... మన గీతని చూసుకోవడానికి పెళ్లివారు వస్తున్నారని. ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయా?’ నాకు కోపం, విసుగు ముంచుకొచ్చాయి. ‘నేనూ మీకు చెప్పాను కదా... అది అప్పుడే పెళ్లి చేసుకోనంటోందని. మరి ఎందుకీ హడావుడి?’... కరకుగా అనిపించకుండా గొంతుకు కాస్త మృదుత్వాన్ని పులిమాను. అయినా ఆయన ముఖంలో రంగులు మారాయి. ‘నీకిదే ఆఖరిసారి చెప్పడం సుమిత్రా... ఇంకోసారి నేను చెప్పింది కాదన్నావంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. వెళ్లి అమ్మాయిని రెడీ చేసివుంచు. వాళ్లు ఏ సమయంలోనైనా రావొచ్చు’... ఆయన గొంతు మాత్రం కరకుగానే పలికింది. ఈసారి నేనూ తగ్గలేదు. ‘మీరేమైనా చేయండి. గీతకి ఇప్పుడే పెళ్లి చేయడం మాత్రం కుదర’... నా మాట పూర్తి కానేలేదు. ఆయన చేయి వేగంగా వచ్చి నా చెంపను ఛెళ్లున తాకింది. ‘ఊరుకునేకొద్దీ మీ తల్లీకూతుళ్ల ఆగడాలు ఎక్కువై పోతున్నాయి. నా మాటంటే లెక్కే ఉండటం లేదు మీకు. మీరు అవునన్నా కాదన్నా నేను అనుకున్నదే జరిగి తీరుతుంది. నోరు మూసుకుని చెప్పింది చేస్తే మీకే మంచిది’ అనేసి వెళ్లిపోతోన్న ఆయనవైపు నీళ్లు నిండిన కళ్లతో చూస్తూండిపోయాను. పెళ్లి.. పెళ్లి.. పెళ్లి. మాట్లాడితే గీతకి పెళ్లి చేయాలి అంటారు. ఎలా చేస్తారు? చేయలేరు. ఎప్పటికీ తను అనుకున్నది చేయలేరు. ఆ విషయం ఎలా చెబితే అర్థమవుతుంది ఆయనకి! అర్థం కాదు. అర్థం చేసుకునే పరిస్థితుల్లో ఆయన లేరు. అందుకే అబద్ధాలను మూటగడుతున్నాను. గీతకు పెళ్లి ఇష్టం లేదంటున్నాను. దాని ఇష్టాన్ని నేను కాదనలేనని దబాయిస్తున్నాను. ఆయన కోపంతో అరిస్తే సహిస్తున్నాను. చేయి చేసుకున్నా భరిస్తున్నాను. అబద్ధాల భారాన్ని మోయలేక చిత్రవధ అనుభవిస్తున్నాను. ‘ఇదిగో వస్తున్నావా’... హాల్లోంచి మళ్లీ ఆయన అరుపు. ‘వస్తున్నానండీ’... నా బదులు. డ్రాయర్ సొరుగు తెరిచాను. ఓ ట్యాబ్లెట్ చేతిలోకి తీసుకుని హాల్లోకి నడిచాను. ఏవో మాటల్లో పెట్టి ఆయనతో మింగించాను. నిదురలోకి జారు కున్న ఆయన్ని చూసి నిట్టూర్చి వచ్చేశాను. అంతకంటే ఏం చేయగలను! గతం గీసిన గీత దాటి ఆయన బయటకు రావడం లేదు. లేని భవితకు రూపమివ్వాలన్న తపనతో నన్ను ప్రశాంతంగా బతకనివ్వడం లేదు. తండ్రిగా తన బాధ్యతను నెరవేర్చుతా నంటున్నారు. కూతురిని ఓ అయ్య చేతుల్లో పెట్టి అక్షింతలు వేస్తానంటున్నారు. అది సాధ్యం కాదన్న విషయం చలించిన ఆయన మతికి ఎక్కడం లేదు. ఏ కూతురి గురించి మాట్లాడుతున్నారో ఆ కూతురు లేదని, ఇక ఎప్పటికీ రాదని, అది ఆయన కాఠిన్యానికే ఎప్పుడో కాలి బూడిదైపోయిందన్న వాస్తవం ఆయనకు ఎంతకూ గుర్తు రావడం లేదు. ఇక నేనేం చేయను? గీత... గొడ్రాలు అంటూ ఈ సమాజం నా మీద వేసిన ముద్రను తన రాకతో తొలగించివేసింది. ఇక నా కడుపు పండదేమోనని కుమిలిపోయి పన్నెండేళ్లపాటు నేను కార్చిన కన్నీటి చారికలను తన చిట్టి చేతు లతో తుడిచేసింది. నన్ను అమ్మను చేసింది. అమ్మా అంటూ అమ్మతనం లోని మాధుర్యాన్ని చవిచూపింది. అమ్మే లోకంగా పెరిగింది. అమ్మకోసం ఎన్నో తట్టుకుంది. తాగి తందనాలాడే భర్త అఘాయిత్యాలను నేను మౌనంగా ఎలా భరించానో... ఏనాడూ తనను ఆప్యాయంగా దగ్గరకు తీసుకోని తండ్రి నిర్లక్ష్యాన్ని తనూ అలానే భరించింది. మగపిల్లాడికి బదులుగా పుట్టిన తనను చీదరించుకుంటున్నా, తను కనబడితేనే దరిద్రం చుట్టుకుంటుందంటూ దూషిస్తున్నా... నేనెక్కడ బాధ పడతానో అని తన బాధను లోలోపలే దాచుకుని, పైకి నవ్వుతూ తిరిగేది. బాగా చదువుకోవాలనుకుంది. ఉన్నత శిఖరాలు అందుకోవాలనుకుంది. బోలెడు డబ్బు సంపాదించి, ఈ అమ్మకు ఏ లోటూ లేకుండా చేయాలని కలలు కంది. కానీ ఆ కలల మీద కరుణ లేని కన్నతండ్రి కన్ను పడింది. ఆడపిల్లకు చదువెందుకు పెళ్లి చేస్తానన్నాడు. తన స్నేహితుడి కొడుకు మనసుపడ్డాడు కాబట్టి అతణ్ని మనువాడమంటూ దాన్ని వేధించాడు. కాదంటే చస్తానన్నాడు. నన్ను చంపిన పాపం నీదే అవుతుంది అంటూ ఆ లేత మనసులో లేనిపోని భయాల్ని సృష్టించాడు. పాపం తను నలిగిపోయింది. కంటికి ధారగా కుమిలిపోయింది. దాన్నలా చూసి కూడా నేనేం చేయలేకపోయాను. పసుపుకుంకాలను నిలుపుకోవాలన్న స్వార్థంతో దాని పసిమనసు పడే వేదనను పట్టించుకోనట్టు ఉండిపోయాను. నా మౌనాన్ని భరించలేక, తన తండ్రి దౌర్జన్యాన్ని సహించలేక ఘోరమైన నిర్ణయం తీసుకుంది. ఊయల కట్టి ఊగినచోటే ఉరితాడుకు వేలాడింది. తన పక్షాన నోరు తెరవకుండా నేను చేసిన తప్పుకి నాకు తిరుగు లేని శిక్ష వేసింది. ‘నువ్వే నన్ను కాపాడలేనప్పుడు ఇక నేను ఏ ధైర్యంతో బతకనమ్మా’ అంటూ అది ఆఖరుగా రాసిన అక్షరాలు నేటికీ నన్ను ముల్లులా పొడుస్తూనే ఉన్నాయి. నా కన్నపేగును కసకసా కోస్తూనే ఉన్నాయి. అయినా సిగ్గు లేకుండా నేనింకా బతికేవున్నాను. అల్జీమర్స వ్యాధి వచ్చి అన్నీ మర్చిపోయిన భర్తను ఒంటరిగా వదిలేయలేక సేవలు చేస్తున్నాను. నాకు కడుపుకోత మిగిల్చిన అతణ్ని శిక్షించాలన్నంత కోపమున్నా, గతం గుర్తులేక పదే పదే ఆ గాయాన్ని అతడు రేపుతున్నా.. ఎప్పటిలానే అర్ధాంగి పాత్రను సమర్థవంతంగా పోషిస్తున్నాను. కానీ నాకు తెలుసు. భార్యగా గెలిచే ప్రయ త్నంలో తల్లిగా నేను ఓడిపోయాను. తాళి కట్టినవాడికి విలువిచ్చి తల్లిగా నా బిడ్డకు చేయరాని ద్రోహం చేశాను. ఈ పాపానికి ప్రాయశ్చిత్తం లేదు. నా బంగారుతల్లి నన్ను క్షమించదు... క్షమించలేదు!! - సుమిత్ర (గోప్యత కోసం పేరు మార్చాం) ప్రెజెంటేషన్: సమీర నేలపూడి సుమిత్రగారిది చాలా బాధాకరమైన పరిస్థితి. నిజానికి ఈ పరిస్థితిని మన సమా జమే ఏర్పరచిందని చెప్పాలి. భర్త ఎంత బాధపెట్టినా భరించే భార్యలను గొప్ప వాళ్లుగా ఎంచుతుంది సమాజం. అందుకే చాలామంది భార్యలు యేళ్ల తరబడి హింసను భరిస్తుంటారు. బహుశా సుమిత్ర కూడా అదే చేసుంటారు. బహుశా ఆర్థికంగా భర్తమీద ఆధారపడటం, వేరే ఆధారం లేకపోవడం కూడా కారణమై ఉండొచ్చు. చాలాకాలం పాటు ఇలా హింసను సహించినవాళ్లకు ఎదురుతిరిగే లక్షణం పూర్తిగా పోతుంది. దాంతో నిస్సహాయంగా ఉండిపోతారు. దీన్నే ‘లెర్న్డ్ హెల్ప్లెస్నెస్’ అంటారు. ఆ స్థితికి చేరుకోవడం వల్లే సుమిత్ర తన కూతురికి అన్యాయం జరుగుతున్నా మాట్లాడలేకపోయి ఉంటారు. అది తప్పు అని అనలేం. తన పరిస్థితి అలాంటిది. కాబట్టి ఆమె ఆ అపరాధభావంలోంచి బయటకు రావాలి. దానికి అయినవాళ్ల సాయమో, కౌన్సెలర్ సాయమో తీసుకుంటే మంచిది. డా॥పద్మ పాల్వాయి చైల్డ్ అండ్ అడల్ట్ సైకియాట్రిస్టు రెయిన్బో హాస్పిటల్ హైదరాబాద్ -
హిజ్రాలకు రిజర్వేషన్లు!
న్యూఢిల్లీ: దేశంలో హిజ్రాలకు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందటం కోసం ప్రత్యేక జాతీయ విధానాన్ని తీసుకురావాలని కేంద్రం ఆలోచిస్తోంది. పాఠశాలల్లో, ఉద్యోగాల్లో రిజర్వేషన్లతో పాటు, లైంగిక వేధింపుల నుంచి రక్షణ కల్పించటానికి త్వరలోనే ఒక విధానాన్ని తీసుకురానున్నట్లు కేంద్ర సామాజిక న్యాయశాఖ సహాయ మంత్రి థావర్ చంద్ గెహ్లాట్ శుక్రవారం రాజ్యసభలో ఓ ప్రైవేటు సభ్యుడి బిల్లుకు సమాధానంగా చెప్పారు. ప్రభుత్వ పథకాలను వారికి చేరువ చేయటం కోసం ట్రాన్స్‌జెండర్స్(హిజ్రా) నిర్వచనంపై ఓ స్పష్టత రావలసి ఉందన్నారు. ట్రాన్స్‌జెండర్స్, హోమో సెక్సువల్స్, బై సెక్సువల్స్ పదాలను నిర్వచించాల్సిందిగా ప్రభుత్వం సుప్రీం కోర్టును కోరిందని మంత్రి తెలిపారు. -
కవ్వించి.. కారెక్కి
బంజారాహిల్స్: జీన్స్‌ప్యాంటు.. టీషర్ట్.. ఖరీదైన చెప్పులు.. హై టెక్ స్టైల్..జూబ్లీహిల్స్ రోడ్ నంబర్-45లో శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో ఓ యువతి సన్నగా నవ్వుతూ లిఫ్ట్ అడిగింది. మాదాపూర్ నుంచి బెంట్లీ కారు లో వస్తున్న యువకుడు కారు ఆపి లిఫ్ట్ ఇచ్చా డు. కానీ కారు ఎక్కింది అందమైన యువతి కాదని హిజ్రా అని తేలింది. వివరాలు.. ముం బయికి చెందిన సీమ అందమైన లేడీ గెటప్‌లో జూబ్లీహిల్స్ ప్రాంతంలో రాత్రి సమయాల్లో తిరుగుతూ ఖరీదైన కార్లలో వచ్చే వారిని లిఫ్ట్ అడిగి అందిన కాడికి దోచుకుంటుంది. శుక్రవారం రాత్రి మాదాపూర్ వైపు నుంచి వస్తున్న యువకుడ్ని లిఫ్ట్ అడగడంతో కారులో ఎక్కించుకున్నాడు. మాటల్లోపెట్టి ఆ యువకుడి బంగారు గొలుసును, జేబులోని పర్సు ను తన బ్యాగ్‌లో వేసుకుంది. కొద్ది దూరం వెళ్లగానే డ్రంక్ అండ్ డ్రైవ్ జరుగుతున్న ప్రాం తంలో పోలీసులను చూసి సీమ కారు దూకి పారిపోయేందుకు యత్నించింది. అప్పటికే మెడలో గొలుసు లేదని చూసుకున్న ఆ యువకుడు దొంగ దొంగ అంటూ అరిచాడు. పోలీసులు అప్రమత్తమై పారిపోతున్న యువతిని వెంబడించారు. నేరుగా వెళ్లి జూబ్లీహిల్స్ గుట్టలో దాక్కుంది. టార్చ్‌లైట్లతో పోలీసులు గంట పాటు గాలించగా రాళ్లల్లో ఓ మూలన నక్కి కూర్చొంది. ఆమెను ఎవరంటూ ప్రశ్నించగా ముసుగు తొలగించి పేరుచెప్పగానే అంతా అవాక్కయ్యారు. ఆమె కాదని హిజ్రా అని తెలుసుకొని నోళ్లు వెల్లబెట్టారు. వెంటనే జూబ్లీహిల్స్ పోలీసులకు అప్పగించగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
ఉన్మాది పనేనా
సంచలనం రేకెత్తించిన చేబ్రోలుజంట హత్యలు చేబ్రోలు (ఉంగుటూరు) : చేబ్రోలులో సోమవారం తెల్లవారుఝామున జరిగిన జంట హత్యలు సంచలనాన్ని రేకెత్తించాయి. గ్రామంలో జాతీయ రహదారి పక్కన గుడి ఆవరణలో ఆదమరిచి నిద్రిస్తున్న ఓ యాచకురాలు, చిరుద్యోగిని బండరాతితో మోది ఓ ఉన్మాది కిరాతక చర్యకు ఒడిగట్టాడు. అయితే ఎప్పటినుంచో ఇక్కడే తిరుగాడే ప్రేమ అనే హిజ్రా ఈ ఘాతుకానికి ఒడిగట్టి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. రాత్రి 12 గంటల సమయంలో ఇక్కడ తచ్చాడుతూ ‘నలుగురు రౌడీలు తిరుగుతున్నారు.. జాగ్రత్తగా ఉండండి’ అంటూ స్థానికులతో చెప్పిన హిజ్రా ఈ ఘటన తరువాత అదృశ్యం కావడంతో పోలీసులు పలు చోట్ల గాలిస్తున్నారు. సోమవారం ఉదయం జంట హత్యల సమాచారాన్ని అందుకున్న ఎస్పీ రఘురామ్‌రెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను, గుడి ఆవరణను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన పోలీసు అధికారులకు పలు సూచనలు చేశారు. యాచకురాలు పార్వతిని బండతో మోది చంపి, మృతదేహాన్ని గుడి వెనుకకు ఈడ్చుకెళుతుండగా అలికిడికి లేచిన చిరుద్యోగి ఏసుబాబు తమను ఎక్కడ గుర్తు పడతాడోననే భయంతోనే అతనిని కూడా బండరాతితో దాడి చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. హిజ్రా కాకపోతే గ్రామానికి తరచుగా వచ్చి పోయేవారి పనే అయి ఉంటుందని స్థానికులు అంటున్నారు. ఐదేళ్లుగా ఇదే ప్రాంతంలో యాచిస్తున్న దామాల పార్వతిది విజయనగరం జిల్లా. తన కుమార్తెకు పెళ్లి చేయాలని తరచూ గ్రామస్తులతో అంటూ ఉండేదని, కూడబెట్టిన డబ్బును నెలకోసారి వెళ్లి కుమార్తెకు ఇస్తుండేదని గ్రామస్తులు చెబుతున్నారు. మొదటి నెల జీతం ఇచ్చాడు నెలన్నర క్రితమే హైవే పెట్రోలింగ్ వాహనం సహాయకుడిగా చేరిన ఏసుబాబు రెండు రోజుల క్రితమే తన మొదటి నెల జీతాన్ని తల్లికి ఇచ్చాడు. కుటుంబానికి ఆసరాగా ఎదిగిన కొడుకు అంతలోనే దూరం కావడంతో ముసలి తల్లిదండ్రులు బొబ్బిలి వెంకటేశ్వరరావు, మంగతాయారు ఆవేదన అంతా ఇంతా కాదు. అతను నివాసం ఉంటున్న సాయిరామ్పేటలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఏసుబాబు అన్న త్రిమూర్తులు, వారి మేనకోడలు ఇంటి వద్ద కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తుండటం చూపరులను కంటతడిపెట్టించింది. ఇంటికి వెళ్లినా.. హోటల్ లో నిద్రించినా బతికేవాడేమో.. ఆదివారం రాత్రి ఏసుబాబు విధులకు ఆలస్యంగా రాగా అప్పటికే హైవే పెట్రోలింగ్ వాహనం మిగిలిన సిబ్బందితో వెళ్లిపోయింది. అనంతరం రాత్రి 12గంటలకు వాహనం తణుకు నుంచి తిరిగొచ్చింది. అక్కడే ఉన్న ఏసుబాబును ఇంటికి వెళ్లి ఉదయమే రావాలని పెట్రోలింగ్ డ్రైవర్ మారిశెట్టి రవి కోరాడు. దీనికి నిరాకరించగా, వాహనం తాళాలు ఇచ్చి డ్రైవర్ రవి, మిగిలిన సిబ్బంది కొంత దూరంలో ఉన్న హోటల్లో నిద్రించేందుకు వెళ్లిపోయారు. వాహనంలో సీటును తెచ్చుకొని ఆలయం అరుగుపై యాచకురాలు పార్వతికి సమీపంలో ఏసుబాబు నిద్రించాడు. అర్ధరాత్రి ఇంటికి వెళ్లి నా, లేక తమతో పాటు హోటల్లో నిద్రించేందుకు వచ్చినా బతికేవాడంటూ డ్రైవర్ రవి, ఇతర సిబ్బంది వాపోయారు. అర్ధరాత్రి వరకు తమతో ఉన్న ఏసుబాబు హత్యకు గురికావడంతో కన్నీటి పర్యంతమయ్యారు.