హిజ్రాలకు రిజర్వేషన్లు!
న్యూఢిల్లీ: దేశంలో హిజ్రాలకు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందటం కోసం ప్రత్యేక జాతీయ విధానాన్ని తీసుకురావాలని కేంద్రం ఆలోచిస్తోంది. పాఠశాలల్లో, ఉద్యోగాల్లో రిజర్వేషన్లతో పాటు, లైంగిక వేధింపుల నుంచి రక్షణ కల్పించటానికి త్వరలోనే ఒక విధానాన్ని తీసుకురానున్నట్లు కేంద్ర సామాజిక న్యాయశాఖ సహాయ మంత్రి థావర్ చంద్ గెహ్లాట్ శుక్రవారం రాజ్యసభలో ఓ ప్రైవేటు సభ్యుడి బిల్లుకు సమాధానంగా చెప్పారు. ప్రభుత్వ పథకాలను వారికి చేరువ చేయటం కోసం ట్రాన్స్‌జెండర్స్(హిజ్రా) నిర్వచనంపై ఓ స్పష్టత రావలసి ఉందన్నారు. ట్రాన్స్‌జెండర్స్, హోమో సెక్సువల్స్, బై సెక్సువల్స్ పదాలను నిర్వచించాల్సిందిగా ప్రభుత్వం సుప్రీం కోర్టును కోరిందని మంత్రి తెలిపారు.