thavar Chand Gehlot
-
‘తూర్పుకాపులను ఓబీసీలో కలపండి’
సాక్షి, ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుకాపు సామాజికవర్గాన్ని ఓబీసీ జాబితాలలో చేర్చాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ సందర్భంగా బుధవారం ఎంపీలు బెల్లాన చంద్రశేఖర్, రఘురామకృష్ణంరాజు, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాష్లు కేంద్ర సామాజిక న్యాయశాఖ మంత్రి తావర్ చంద్ గెహ్లాత్‌తో భేటీ అయ్యారు. తూర్పు కాపులను కేంద్ర ప్రభుత్వ ఓబీసీలో చేర్చాలని ఈ నేతలు ఆయనకు విజ్ఞప్తి చేశారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాష్ మీడియాతో మాట్లాడుతూ.. గతంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చొరవతో ఆంధ్రప్రదేశ్‌లో తూర్పు కాపులను రాష్ట్రమంతటా బీసీలుగా గుర్తించారని గుర్తుచేశారు. అయితే కేంద్ర ప్రభుత్వం ఇంకా మూడు జిల్లాలోని తూర్పు కాపులను మాత్రమే ఓబీసీలుగా గుర్తిస్తోందని పేర్కొన్నారు. దీనివల్ల మిగిలిన జిల్లాల్లోని తూర్పుకాపులకు అన్యాయం జరుగుతుందని ఆయన తెలిపారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లోని తూర్పు కాపులను కేంద్ర ప్రభుత్వ ఓబీసీ జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశామన్నారు. ఈ అంశంపై కేంద్ర మంత్రి తావర్ చంద్ గెహ్లాత్‌ను కలిసి వినతిపత్రం అందజేశామని ఆయన పేర్కొన్నారు. ‘మంత్రి తూర్పు కాపుల సమస్య తెలుసని ఈ విషయాన్ని బీసీ కమిషన్‌కు బదిలీ చేస్తున్నాను. బీసీ కమిషన్ నివేదిక రాగానే దానిపై తదుపరి చర్యలు తీసుకుంటామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు’ అని మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాష్ వెల్లడించారు. -
రాజ్యసభకు ఈబీసీ బిల్లు.. విపక్షాల ఆందోళన
సాక్షి, న్యూఢిల్లీ: ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణలకు విద్యా, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించేందుకు వీలుగా ఎన్డీయే ప్రభుత్వం తీసుకువచ్చిన ఈబీసీ బిల్లును రాజ్యసభ ముందుకు తీసుకువచ్చారు. మంగళవారం లోక్‌సభలో ఆమోదం పొందిన ఈబీసీ బిల్లును కేంద్ర సామాజిక న్యాయశాఖ మంత్రి థావర్ చంద్ గెహ్లట్ ఎగువ సభలో ప్రవేశపెట్టారు. లోక్‌సభలో సునాయాసంగా ఆమోదం పొందిన బిల్లు రాజ్యసభలో మాత్రం కఠిన పరీక్షను ఎదుర్కొంటోంది. బిల్లును పూర్తిగా పరిశీలించాల్సిన అవసరం ఉందని, బిల్లును పార్లమెంట్ సెలెక్ట్ కమిటీకి పంపాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. కీలకమైన బిల్లుపై చర్చించేందుకు తగిన సమయం లేదని, ఇంత హడావిడిగా ప్రవేశపెట్టాల్సిన అవసరం ఏంటని సభ్యులు ప్రశ్నిస్తున్నారు. రాజకీయ లబ్ధికోసమే బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు బిల్లును తీసుకువచ్చిందని విపక్ష సభ్యులు పోడియం ముందు ఆందోళనకు దిగారు. బిల్లుపై చర్చించిన డీఎంకే సభ్యురాలు కనిమొళి పలు సవరణలు కోరారు. ఈబీసీ బిల్లుపై గెహ్లట్ మాట్లాడుతూ.. సామాజిక సమనత్వం కోసమే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని అన్నారు. సభ్యుల ఆందోళనతో సభను రెండు గంటల వరకు వాయిదా వేస్తున్నట్లు ఛైర్మన్ ప్రకటించారు. సభ ప్రారంభమైన అనంతరం కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ బిల్లుపై ప్రసంగించనున్నారు. కాగా 124వ రాజ్యాంగ సవరణకు లోక్‌సభ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. రాజ్యసభ కూడా 2/3 వంతు మెజార్టీతో ఆమోదం తెలిపితే బిల్లు చట్టరూపం దాల్చనుంది. -
లోక్‌సభలో రిజర్వేషన్ల బిల్లు.. టీఆర్ఎస్ ఎంపీలకు కేసీఆర్..
సాక్షి, న్యూఢిల్లీ: అగ్ర కులాల్లోని పేదలకు విద్య, ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తోంది. రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లును కేంద్ర సామాజిక న్యాయశాఖ మంత్రి థావర్ చంద్ గెహ్లట్ లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఈ మేరకు 124వ రాజ్యాంగ సవరణ బిల్లును కేంద్ర ప్రభుత్వం లోక్‌సభ ముందుకు తీసుకువచ్చింది. బిల్లుపై చర్చించిన అనంతరం ఉభయ సభలు 2/3 వంతు మెజార్టీతో ఆమోదం తెలపాల్సి ఉంటుంది. లోక్‌సభలో బీజేపీ స్పష్టమైన మెనార్టీ ఉన్నందున బిల్లు సునాయాసంగా ఆమోదం పొందవచ్చు. అసలు పరీక్ష రాజ్యసభలో ఎదురుకానుంది. ఎగువ సభలో అధికార పక్షానికి సరిపడ బలం లేనందున విపక్షాలు పలు సవరణలు డిమాండ్ అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పట్టిన బిల్లుపై టీఆర్ఎస్ ఎంపీలు ఏవిధంగా వ్యవహరించాలో తెలంగాణ సీఎం కేసీఆర్ వారికి దిశానిర్ధేశం చేశారు. తెలంగాణ శాసనసభ ఆమోదించిన ముస్లిం, మైనార్టీ రిజర్వేషన్ల బిల్లును కూడా పార్లమెంట్లో ప్రవేశపెట్టే విధంగా మోదీని కోరాలని సూచించారు. దీంతో ముస్లింలకు 12శాతం, ఎస్టీలకు 10శాతం రిజర్వేషన్ల కొరకు టీఆర్ఎస్ ఎంపీలు డిమాండ్ చేస్తున్నారు. -
ఎస్సీ, ఎస్టీ బిల్లుకు లోక్‌సభ ఆమోదం
న్యూఢిల్లీ: ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని తిరిగి పునరుద్ధరించేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లును లోక్‌సభ సోమవారం ఏకగ్రీవంగా ఆమోదించింది. షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల(అత్యాచారాల నిరోధక) సవరణ బిల్లు–2018ను సామాజిక న్యాయం, సాధికారిత శాఖ మంత్రి థావర్ చంద్ గెహ్లాట్ సభలో ప్రవేశపెట్టారు. ఎస్సీ, ఎస్టీ చట్టం దుర్వినియోగం అవుతోందంటూ సుప్రీంకోర్టు విధించిన నియంత్రణల కారణంగా ఆర్టికల్–18 ప్రాముఖ్యత కోల్పోయిందని మంత్రి గెహ్లాట్ తెలిపారు. దీనిపై ప్రభుత్వం వేసిన రివ్యూ పిటిషన్ సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉందని తెలిపారు. ఈ ఆలస్యం దళితుల్లో అసహనం పెరిగిపోతున్న దృష్ట్యా ప్రభుత్వం ఆర్టికల్–18కి సవరణలు చేపట్టిందన్నారు. ఎస్సీ, ఎస్టీ చట్టం దుర్వినియోగం అవుతోందనే సాకుతో 88శాతం మంది దళితులను ఇబ్బందులు పడనివ్వబోమన్నారు. ఎస్సీ, ఎస్టీలకు కల్పించిన చట్టపరమైన రక్షణలను మరింత బలోపేతం చేసేందుకు ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి స్పష్టం చేశారు.ఎస్సీ, ఎస్టీలపై దాడుల కేసుల్లో నిందితులకు ముందస్తు బెయిల్‌ను ఏ కోర్టూ ఇవ్వరాదనే నిబంధనను బిల్లులో చేర్చారు. క్రిమినల్ కేసు నమోదు చేయకున్నా, ఎవరి అనుమతి తీసుకోకుండానే అరెస్టులు చేసేందుకు కూడా ఇది వీలు కల్పిస్తుంది. -
అభివృద్ధే మోదీ ఎజెండా
కేంద్రమంత్రులు వెంకయ్య, మహేష్‌శర్మ, థావర్ చంద్ గెహ్లాట్ సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ప్రధానమంత్రి నరేంద్రమోదీ అభివృద్ధే ఎజెండాగా పనిచేస్తున్నారని కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, మహేష్‌శర్మ, థావర్ చంద్ గెహ్లాట్ అన్నారు. ప్రపంచమంతా మోదీ వైపు చూస్తోందని.. భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు అనేక మంది పారిశ్రామిక వేత్తలు ఆసక్తి చూపుతున్నారని వారు వివరించారు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలోని సరస్వతినగర్‌లో ఆదివారం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మెంటల్లీ హ్యాండీ క్యాప్డ్ రీసోర్స్ సెంటర్‌కు వెంకయ్య శంకుస్థాపన చేశారు. అనంతరం గొలగమూడిలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం ట్రావెల్ మేనేజ్మెంట్ భవనాన్ని ప్రారంభించారు. నెల్లూరు నగరంలోని వీఆర్ కళాశాల మైదానంలో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకయ్య, గెహ్లాట్, మహేష్‌శర్మ మాట్లాడారు. జీఎస్టీ బిల్లు ఆమోదం పొందితే దేశం అదనంగా 1.5 నుంచి 2 శాతం అభివృద్ధి చెందుతుందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా విశాఖపట్టణంలో 100 ఎకరాల్లో నేషనల్ స్పోర్ట్స్ డిజేబుల్ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. కాకినాడ రాజమండ్రి మధ్యలో పెట్రో కెమికల్ ఇండస్ట్రీని ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఏపీలో నెల్లూరు, మచిలీపట్నం ప్రాంతాల్లో అణుకేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. -
హిజ్రాలకు రిజర్వేషన్లు!
న్యూఢిల్లీ: దేశంలో హిజ్రాలకు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందటం కోసం ప్రత్యేక జాతీయ విధానాన్ని తీసుకురావాలని కేంద్రం ఆలోచిస్తోంది. పాఠశాలల్లో, ఉద్యోగాల్లో రిజర్వేషన్లతో పాటు, లైంగిక వేధింపుల నుంచి రక్షణ కల్పించటానికి త్వరలోనే ఒక విధానాన్ని తీసుకురానున్నట్లు కేంద్ర సామాజిక న్యాయశాఖ సహాయ మంత్రి థావర్ చంద్ గెహ్లాట్ శుక్రవారం రాజ్యసభలో ఓ ప్రైవేటు సభ్యుడి బిల్లుకు సమాధానంగా చెప్పారు. ప్రభుత్వ పథకాలను వారికి చేరువ చేయటం కోసం ట్రాన్స్‌జెండర్స్(హిజ్రా) నిర్వచనంపై ఓ స్పష్టత రావలసి ఉందన్నారు. ట్రాన్స్‌జెండర్స్, హోమో సెక్సువల్స్, బై సెక్సువల్స్ పదాలను నిర్వచించాల్సిందిగా ప్రభుత్వం సుప్రీం కోర్టును కోరిందని మంత్రి తెలిపారు.