స్వార్ధం వీడితేనే సంతృప్తి
ఈనాడు ప్రపంచాన్ని పీడిస్తున్న సమస్యల్లో అవినీతిది అగ్రస్థానం. స్వార్ధం, స్వలాభం-తద్వారా పుట్టుకొ చ్చిన ధనాశ దీనికి మూలం. ఎలాగైనా సంపాదించాలి. కోటీశ్వరులైతేనే కోరుకున్నది పొందవచ్చు. సంపదే సమస్త అవసరాలూ తీర్చగల సాధనం. కాబట్టి వీలై నంత ఎక్కువగా సంపాదించి స్విస్ బ్యాంకుల్లోనూ దాచుకోవాలి. ఏదైనా చేయాలి, కాని సంపాదించాలి. అర్ధబలంతోనే అంగబలం, అధికారం, అందలం అన్నీ వస్తాయి. అవినీతికి అసలు మూలం ఇదే. మాన వుడి ధనాశ ఎన్నటికీ తీరేదికాదు. తాను మాత్రమే కాదు, తన కొడుకులు, కూతుళ్లు, మనవలు, మునిమ నవలు సైతం కోటీశ్వరులై పోవాలని కోరుకుంటాడు. కోట్లకు పడగెత్తిన తరవాత, దాని సంరక్షణకు గూండా లను పోషిస్తాడు. అధికారులకు లంచాలిస్తాడు. తర వాత ఎన్నికల బరిలో నిలిచి, రాజకీయ రక్షణ కవచం సంపాదిస్తాడు.
అయినప్పటికీ మానవుడి ధనపిపాస తీరదు. ఈ విషయాన్ని ముహమ్మద్ ప్రవక్త(స) ఎంత సోదాహరణంగా వివరించారో చూడండి- మానవుడికి బంగారంతో (సిరిసంపదలతో) నిం డిన ఒక పెద్ద లోయ లభిస్తే అతను మరొకటి కావాలని కోరుకుంటాడు. రెండవది కూడా లభిస్తే; మూడవది కావాలని అభిలషిస్తాడు. మానవ ఉదరం మట్టితో మాత్రమే నిండు తుంది (అంటే, సమాధికి చేరిన తరవాతనే ధనాశ అంతమవుతుందని అర్ధం). అయితే ప్రాపంచిక వ్యా మోహాన్ని వదిలిపెట్టి, పశ్చాత్తాప హృదయంతో అల్లా హ్ వైపునకు మరలితే, ఆయన వారిని మన్నిస్తాడు. పశ్చాత్తాపాన్ని స్వీకరించి వారిని అనుగ్రహిస్తాడు. (అలాంటి వారికి ఆత్మసంతృప్తి ప్రాప్తమవుతుంది.)
ముహమ్మద్ ప్రవక్త ఇలా చెప్పారు-
అత్యధిక సిరిసంపదలతో కలిమి రాదు, అసలైన కలిమి ఆత్మసంతృప్తి ద్వారానే ప్రాప్తమవుతుంది.
అందుకని మనిషి వక్రమార్గాలు విడిచి, అవినీతి, అధర్మాలకు పాల్పడకుండా ధర్మబద్ధమైన జీవన విధా నాన్ని అవలంబించాలి. ఆశ ఉన్నా, అది దురాశగా మారకుండా జాగ్రత్త పడాలి. ఎప్పుడూ మధ్యే మార్గాన్ని అవలంబించాలి. సర్వకాల సర్వావస్ధల్లో ధర్మాధర్మా లను దృష్టిలో ఉంచుకోవాలి. కొంతమేరకైనా స్వార్ధా న్ని వీడి సమాజం కోసం ఆలోచిస్తే అవినీతికి అణువం తైనా ఆస్కారం ఉండదు. దీని కోసం సర్వసంగ పరి త్యాగం చెయ్యవలసిన అవసరంలేదు. మంచీ చెడు, ధర్మం అధర్మం, సత్యం అసత్యం, న్యాయం అన్యా యం లాంటి విషయాల పట్ల విచక్షణ తెలుసుకొని, ఆచరించగలిగితేచాలు. ముహమ్మద్ ప్రవక్త(స) ప్రవ చించినట్లు, ‘మనిషి తన స్వయానికి ఏ స్ధితిని కోరు కుంటాడో, పరుల విషయంలో కూడా అదేస్ధితిని అభి లషించే వాడై ఉండాలి.’ ప్రతి ఒక్కరూ ఈ విధంగా ఆలోచిస్తే ఈనాడు సమాజాన్ని పట్టిపీడిస్త్తున్న సకల సమస్యలూ వాటంతట అవే పరిష్కారమైపోతాయి.
- యండి.ఉస్మాన్ ఖాన్