సౌర వాణి | Good time is up to you | Sakshi
Sakshi News home page

సౌర వాణి

Published Sat, May 2 2015 12:34 AM | Last Updated on Sun, Sep 3 2017 1:14 AM

సౌర వాణి

సౌర వాణి

మీకిది శుభ సమయం!

 మేషం (మార్చి 21-ఏప్రిల్ 20) (రాశ్యాధిపతి-కుజుడు)... వృత్తి, ఉద్యోగాల పరంగా నూతన అవకాశాలు కలసి వస్తాయి. దూరప్రాంత ప్రయాణాలు, విదేశీయానం. మీ ద్వారా సహాయం పొంది ఉన్నతస్థానాల్లో ఉన్నవారు కీలక సమయంలో నిరాశకు గురిచేస్తారు. కోర్టు వ్యవహారాలు, వివాదంలో ఉన్న భూమి సంబంధమైన వ్యవహారాలు మీకు సత్ఫలితాలు ఇస్తాయి. అనుకూల తేది: 4; ప్రతికూల తేది: 8; ప్రతిరోజూ హనుమాన్ చాలీసా పఠించడం శుభం.
 
వృషభం ( ఏప్రిల్ 21-మే 20) (రాశ్యాధిపతి-శుక్రుడు)... దీర్ఘకాలిక వివాదాస్పద వ్యవహారాలను అతి కష్టం మీద పరిష్కరించుకోగలుగుతారు. కొనుగోలు, అమ్మకాలకు సంబంధించిన విషయాల్లో మధ్యవర్తుల వల్ల మోసపోయే ప్రమాదం ఉంది. జాగ్రత్త వహించండి.  అనుకూల తేది: 5; ప్రతికూల తేది: 7; దుర్గాదేవి ఆరాధన శుభం.
 
మిథునం (మే 21-జూన్ 21) (రాశ్యాధిపతి-బుధుడు)... మీకు మీరుగా కొన్ని కఠినమైన బాధ్యతల నుంచి తప్పుకుంటారు. అందువల్ల భవిష్యత్తులో మంచి జరుగుతుంది. నష్టాల దిశగా పయనిస్తున్న వ్యవహారాలు మీ కృషి, పలుకుబడి వల్ల లాభాల బాటలో పయనిస్తాయి. అనుకూలం: 5; ప్రతికూలం: 8; ప్రతిరోజు గణపతి ఆరాధన శుభం.
 
కర్కాటకం (జూన్ 22 - జూలై 23) (రాశ్యాధిపతి  - చంద్రుడు)... ఉద్యోగంలో మీ స్థాయి పెరుగుతుంది. ప్రమోషన్ లభిస్తుంది. వ్యాపారస్తులకు రొటేషన్ లాభాలు బాగుంటాయి. ఎగుమతి, దిగుమతి వ్యాపారాలు లాభిస్తాయి.  అనుకూలం 4, ప్రతికూలం 6; ప్రతిరోజు గణపతి ఆరాధన శుభం.
 
సింహం (జూలై 24 - ఆగస్టు 23) (రాశ్యాధిపతి - రవి)... వృత్తి ఉద్యోగాల పరంగా శ్రమ అధికం అవుతుంది. రావలసిన బిల్లులు సకాలంలో అందుతాయి.  ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోండి. ఉద్యోగపరంగా ప్రమోషన్ లభిస్తుంది.  అనుకూలం 6, ప్రతికూలం 8; ప్రతి రోజు గణపతి ఆరాధన శుభం
 
కన్య (ఆగస్టు 24 - సెప్టెంబరు 23) (రాశ్యాధిపతి  - బుధుడు)...  దూర ప్రాంతాలకు సంబంధించిన విషయ వ్యవహారాలు అనుకూలిస్తాయి. విద్యను అభ్యసించడానికి తగిన మంచి అవకాశాలు కలిసివస్తాయి. మీ కృషికి తగిన కీర్తి లభిస్తుంది. అనుకూలం, 5, ప్రతి కూలం 9; ప్రతిరోజు హనుమాన్ చాలీసా పారాయణం శుభం.
 
తుల (సెప్టెంబరు 24 - అక్టోబరు 23) (రాశ్యాధిపతి  - శుక్రుడు)... విదేశాలకు వెళ్లడానికి వీసా లభిస్తుంది.  సమాజంలోని కీలక వ్యక్తులతో మంచి సంబంధాలు ఏర్పడతాయి. క్రమంగా అవి వ్యాపార సంబంధాలుగా మారతాయి.  నిరుద్యోగులకు శుభ సమయం; అనుకూలం 3, 6, ప్రతికూలం 8; ప్రతి రోజు గణపతి ఆరాధన శుభం.
 
వృశ్చికం (అక్టోబరు 24 - నవంబరు 22) (రాశ్యాధిపతి  - కుజుడు)...  కుటుంబ వ్యవహారాలలో బంధువుల సలహాలు, జోక్యం అధికమవుతాయి. అభిమానించే వారికోసం ఏదయినా చేయాలని ఎంతగానో శ్రమిస్తారు. అనుకూలం 6, ప్రతికూలం 8; ప్రతి రోజు గణపతి ఆరాధన శుభం.
 
ధనుస్సు (నవంబరు 23  - డిసెంబరు 21) (రాశ్యాధిపతి  - గురువు)... వ్యాపారంలో లాభాలు గతంలో కంటే మెరుగ్గా ఉంటాయి.  వ్యక్తిగత స్థాయి ఉద్యోగంలోనూ, వ్యాపారంలోనూ కొద్దిగా పెరుగుతుంది.  అనుకూలం 6, ప్రతికూలం 8; ప్రతిరోజూ గణపతి ఆరాధన శుభం.
 
మకరం (డిసెంబరు 22 - జనవరి 20) (రాశ్యాధిపతి - శని)...  వ్యాపారంలో లభించే ఆర్డర్లు సంతోషం కలిగిస్తాయి. ఉద్యోగంలో ప్రమోషన్ లభిస్తుంది. అనుకూలం 6 ప్రతికూలం 8; ప్రతిరోజూ గణపతి ఆరాధన, హనుమాన్‌చాలీసా పారాయణ శుభం.
 
కుంభం (జనవరి 21 - ఫిబ్రవరి 19) (రాశ్యాధిపతి - శని)... వివాహాది శుభకార్యాల విషయాలు సానుకూలమవుతాయి. నూతన గృహయోగ్యత ఏర్పడుతుంది. విద్యారంగంలో మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అనుకూలం 4, ప్రతి కూలం 8; ప్రతిరోజు గణపతి ఆరాధన శుభం.
 
మీనం (ఫిబ్రవరి 20  - మార్చి 20) (రాశ్యాధిపతి  - గురువు)
 శుభకార్యాల విషయంలో మనోభీష్టం నెరవేరుతుంది.  ఉన్నత విద్యా యోగం కలుగుతుంది. వ్యాపార అంశాలు అనుకూలంగా ఉంటాయి. అనుకూలం 6, ప్రతి కూలం 8; ప్రతిరోజు గణపతి ఆరాధన శుభం.
 
డా॥జి.వి., పంచాంగకర్త,
శ్రీ జ్ఞానసరస్వతి జ్యోతిషాలయం,
సికింద్రాబాద్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement