
పాతికేళ్ళు దాటినా.. ఇప్పటికీ జీవితంలో ఎలాంటి సొంత నిర్ణయం తీసుకోవాలో చాలామందికి తెలియదు. కానీ 16ఏళ్ల అమ్మాయి ఏకంగా రూ. 100 కోట్లు సామ్రాజ్యాన్ని స్థాపించి అందరి చేత ఔరా అనిపించుకుంటోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
'ప్రాంజలి అవస్థి' (Pranjali Awasthi) అనే 16 ఏళ్ల భారతీయ అమ్మాయి Delv.AI అనే స్టార్టప్ ప్రారంభించి ఏఐ ప్రపంచంలో తనదైన ముద్ర వేస్తోంది. ఈమెకు ఇప్పటికే 10 మందితో కూడిన ఒక టీమ్ కూడా ఉండటం గమనార్హం. ప్రాంజలి వ్యాపారం అభివృద్ధి కావడానికి ఆమె తండ్రి సహకరిస్తున్నట్లు తెలుస్తోంది.
ఏడు సంవత్సరాల వయసులోనే కోడింగ్ ప్రారంభించింది. అయితే ప్రాంజలి 11ఏళ్ల వయసులోనే వారి కుటుంబం ఇండియా నుంచి ఫ్లోరిడాకు మారింది. ఆ తరువాత 13ఏళ్ల వయసులో ఇంటర్న్‌షిప్ ప్రారంభించింది. చాట్‌జీపీటీ ప్రారంభమైన మొదట్లోనే డెల్వ్.ఏఐ స్టార్ట్ చేసింది. ఆ తరువాత తన వ్యాపార ప్రయాణం ప్రారంభించింది.
ఇదీ చదవండి: రొమాంటిక్ ఫోటో క్లిక్ చేసిన ఏఐ కెమెరా.. వావ్ అంటున్న నెటిజన్లు!
ప్రాంజలి అవస్థి వ్యాపారానికి మద్దతుగా ఆన్ డెక్, విలేజ్ గ్లోబల్ వంటి కంపెనీలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చాయి. దీంతో ఈమె కంపెనీ 450000 డాలర్ల నిధులను (రూ.3.7 కోట్లు) సేకరించగలిగింది. కాగా మొత్తం కంపెనీ విలువ ప్రస్తుతం రూ. 100 కోట్లు ఉంటుందని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment