
ఇష్టానికి కష్టం తోడైతే చిన్న వయసులోనే పెద్ద విజయం సాధించవచ్చు... అని చెప్పడానికి ఉదాహరణ కేరళలోని ఎర్నాకుళంకు చెందిన ఉదయ్ శంకర్. పదిహేనేళ్ల వయసులోనే ఏఐ స్టార్టప్ మొదలు పెట్టి ఔరా అనుకునేలా చేశాడు. ఇప్పటి వరకు 10 ఏఐ యాప్‌లు, 9 కంప్యూటర్ ప్రోగ్రామ్స్, 15 రకాల గేమ్స్ డిజైన్ చేశాడు..
బహిరంగ ప్రదేశాలలో వృద్ధులకు ఉపకరించే ‘థర్డ్ ఏఐ’ యాప్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ఉదయ్.‘ యస్, మా వాడు సాధించగలడు’ అనే నమ్మకం తల్లిదండ్రులకు కలిగింది. ఏఐ స్టార్టప్ ‘ఉరవ్’తో మరో అడుగు ముందు వేశాడు.
కోచిలో జరిగిన అంతర్జాతీయ జెన్‌ఏఐ సదస్సులో ఉదయ్‌శంకర్ స్టార్టప్ ‘ఉరవ్’కు సంబంధించి ఎగ్జిబిషన్ ప్రత్యేక ఆకర్షణగా మారింది. చిన్న వయసులోనే రోబోటిక్స్‌పై ఆసక్తి పెంచుకున్నాడు ఉదయ్. అది పాషన్‌గా మారడానికి ఎంతోకాలం పట్టలేదు. కోవిడ్ కల్లోల సమయంలో ఇంటికే పరిమితం కావాల్సి వచ్చింది. సమయాన్ని వృథా చేయకుండా ఆన్‌లైన్‌లో పైథాన్‌ప్రోగామింగ్ నేర్చుకున్నాడు. యాప్ డెవలప్‌మెంట్‌పై ఆసక్తి పెంచుకున్నాడు. పట్టు సాధించాడు.
ఒకరోజు తన బామ్మకు కాల్ చేశాడు ఉదయ్. ‘కొద్దిసేపటి తరువాత నీకు ఫోన్ చేస్తాను’ అని ఫోన్ పెట్టేసింది బామ్మ. అంతవరకు వేచి చూసే ఓపిక లేని ఉదయ్ బుర్రలో ‘బామ్మ డిజిటల్ అవతార్’ను సృష్టించాలని, ఆ అవతార్‌తో ఏఐ ఉపయోగించి మాట్లాడాలనే ఐడియా తట్టింది. ఆ ఐడియాను సాకారం చేసుకున్నాడు. బహిరంగ ప్రదేశాలలో వృద్ధులకు ఉపకరించే ‘థర్డ్ ఏఐ’ యాప్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ఉదయ్.‘యస్, మా వాడు సాధించగలడు’ అనే నమ్మకం తల్లిదండ్రులకు కలిగింది.
ఏఐ స్టార్టప్ ‘ఉరవ్’ మరో అడుగు ముందు వేశాడు. ఏఐ రిమోట్ టీచర్ మిస్ వాణి, ఏఐ పర్సనలైజ్‌డ్ మెడికల్ అండ్ క్లినికల్ అసిస్టెంట్ మెడ్‌ఆల్కా, ఏఐని ఉపయోగించి ఫొటో నుంచి 3డీ ఇమేజెస్ సృష్టించే మల్టీటాక్ అవతార్ ఏఐ సూట్... మొదలైనవి కంపెనీ ్రపాడక్ట్స్. తండ్రి డా.రవి కుమార్, ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ అయిన తల్లి శ్రీకుమారి ఉదయ్‌కు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. తల్లిదండ్రులు ఇచ్చిన స్వేచ్ఛను సద్వినియోగం చేసుకొని మంచి పేరు తెచ్చుకున్నాడు ఉదయ్ శంకర్.