
బెంగళూరు: పారిశ్రామిక ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ) ఉత్పాదనల స్టార్టప్ సంస్థ లైన్‌క్రాఫ్ట్‌డాట్‌ఏఐ కొనుగోలు కోసం ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఇండస్ట్రియల్ ఆటోమేషన్ రంగ సంస్థ విప్రో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇంజినీరింగ్ వెల్లడించింది. అయితే, ఇందుకోసం ఎంత వెచ్చిస్తున్నదీ వెల్లడించలేదు.
తమ డిజిటల్ సర్వీసులను మరింత మెరుగుపర్చుకునేందుకు ఈ డీల్ తోడ్పడగలదని విప్రో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇంజినీరింగ్ సీఈవో ప్రతీక్ కుమార్ తెలిపారు. కృత్రిమ మేథ (ఏఐ), మెషిన్ లెర్నింగ్ (ఎంఎల్), ఆటోమేషన్‌లో అపార అనుభవం గల లైన్‌క్రాఫ్ట్.. తయారీ సంస్థలు నిర్వహణ సామర్థ్యాలను మెరుగుపర్చుకునేందుకు కావల్సిన తోడ్పాటును అందిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment