న్యూఢిల్లీ: Wipro launches AI platform ai360 : దేశీ ఐటీ దిగ్గజం విప్రో తమ యావత్ సిబ్బందికి కృత్రిమ మేథ (ఏఐ)లో శిక్షణ కల్పించడంపై దృష్టి పెడుతోంది. ఇందుకోసం వచ్చే మూడేళ్లలో విప్రో ఏఐ360 ప్రోగ్రాం ద్వారా బిలియన్ డాలర్లు (దాదాపు రూ. 8,200 కోట్లు) వెచ్చించనుంది. సంస్థలో మొత్తం 2.5 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు.
‘వచ్చే 12 నెలల్లో మొత్తం 2,50,000 మంది ఉద్యోగులకు ఏఐ ఫండమెంటల్స్, బాధ్యతాయుతంగా ఏఐ వినియోగంపై శిక్షణ అందిస్తాం‘ అని విప్రో ఒక ప్రకటనలో తెలిపింది. వివిధ స్థాయిల్లో ఏఐ వినియోగానికి సంబంధించి కంపెనీ బోధనాంశాలను రూపొందించనుంది. అలాగే హ్యాకథాన్స్ మొదలైనవి కూడా నిర్వహించనుంది.
అటు విప్రో వెంచర్స్ ద్వారా ఆధునిక స్టార్టప్‌లలో ఇన్వెస్ట్ కూడా చేయడంతో పాటు జెన్‌ఏఐ సీడ్ యాక్సిలరేటర్ ప్రోగ్రామ్ ద్వారా జనరేటివ్‌ఏఐ ఆధారిత స్టార్టప్‌లకు శిక్షణ కల్పించనుంది.
Comments
Please login to add a commentAdd a comment