అరుదైన ప్రతిభ.. అక్షత! | Akshata Kishore Moharir Success Story In Artificial Intelligence | Sakshi
Sakshi News home page

Akshata Kishore Moharir: అరుదైన ప్రతిభ.. అక్షత!

Published Fri, May 24 2024 12:41 PM | Last Updated on Fri, May 24 2024 12:41 PM

Akshata Kishore Moharir Success Story In Artificial Intelligence

చిన్న వయసులోనే కృత్రిమ మేధా(ఏఐ) రంగంలో పెద్ద పేరు తెచ్చుకుంది అక్షతా కిశోర్‌ మొహరిర్‌. అభిరుచితో మొదలైన ప్రయాణం...అధ్యయనం, పట్టుదలతో మెషిన్‌ లెర్నింగ్‌ రంగంలో అక్షతను అగ్రగామిగా నిలిపింది.

కర్నాటకలోని విశ్వేశ్వరయ్య టెక్నాలజికల్‌ యూనివర్శిటీ(విటీయు–బెళగావీ)లో కంప్యూటర్‌ సైన్స్‌లో అండర్‌ గ్రాడ్యుయేట్‌ డిగ్రీ పూర్తి చేసింది. ఆ తరువాత డేటా సైన్స్, మెషిన్‌ లెర్నింగ్‌లకు సంబంధించిన ఆసక్తి మరింత పెరిగింది. యూనివర్శిటీ ఆఫ్‌ మేరీల్యాండ్‌ కాలేజ్‌పార్క్‌(యూఎంసీపీ)లో మెషిన్‌ లెర్నింగ్‌లో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసింది.

ఇంటర్‌ప్రెటబుల్‌ అండ్‌ ఇంటరాక్టివ్‌ మెషిన్‌ లెర్నింగ్, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ రంగంలో అక్షతకు ఏడు యూఎస్‌ పేటెంట్లు లభించాయి. యూజర్‌ ఫ్రెండ్లీ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ సోల్యూషన్‌లను రూ΄÷ందించడంపై అక్షత దృష్టి పెట్టింది.

ఇవి చదవండి: డెనిమ్‌ న్యూ లుక్‌ డిజైన్‌..!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement