డిజిటల్ దివా జరా శతవరి
‘కృత్రిమ నవ్వు’ అని వెక్కిరిస్తాం. ‘వారి మాటల్లో అంతా కృత్రిమత్వమే’ అని విమర్శిస్తాం. ‘కృత్రిమత్వం’ ‘సహజత్వం’ భిన్న ధ్రువాలు అనే వాస్తవాన్ని కృత్రిమ మేధస్సు (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) తిరగ రాసింది. కృత్రిమ మేధస్సు నుంచి పుట్టిన అందాల యువతులు నవ్వితే ఆ నవ్వులో ఎక్కడా కృత్రిమత్వం కనిపించదు. మాట్లాడితే... మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుందేగానీ ఎక్కడా కృత్రిమ ఛాయ కనిపించదు.
మానవులతో పోటీ పడుతూ ‘ఎక్కడా తగ్గేదేలే’ అంటున్న డిజిటల్ సొగసరులకు ఏఐ సబ్‌స్క్రిప్షన్ ప్లాట్‌ఫామ్ ‘ఫ్యాన్ వ్యూ’ అందాల పోటీ నిర్వహించింది. ‘మిస్ ఏఐ’ పోటీ జరగడం చరిత్రలో ఇదే తొలిసారి. ‘మిస్ ఏఐ’ పోటీలో ప్రపంచవ్యాప్తంగా పదిహేను వందల ఏఐ మోడల్స్, డిజిటల్ ఇన్‌ఫ్లుయెన్సర్‌లు పోటీ పడ్డారు. ‘టాప్ –10’ ఫైనలిస్ట్ జాబితాలో మన దేశం నుంచి డిజిటల్ దివా జరా శతవరి చోటు సాధించింది.
బ్యూటీ, టెక్ స్కిల్స్, సోషల్ మీడియాలో వీరి ప్రభావం ఎంత... మొదలైన అంశాలు ‘మిస్ ఏఐ’ ఎంపిక ప్రక్రియలో ఉంటాయి. న్యాయ నిర్ణేతలలో ఇద్దరు ఏఐ ఇన్‌ఫ్లుయెన్సర్‌లు ఉండడం విశేషం. ‘మిస్ ఏఐ విజేత’ ఎవరవుతారో అనే ఆసక్తికంటే ‘ఎవరీ జరా శతవరి?’ అనే ఆరా ఎక్కువ అయింది. అందానికి అక్షరాలా నిర్వచనంలా ఉన్న ఈ శతవరి ఎవరో తెలుసుకుందాం..
ఒక మొబైల్ కంపెనీ యాడ్ ఏజెన్సీకి కో–ఫౌండర్ అయిన రాహుల్ చౌదరి శతవరి సృష్టికర్త. శతవరిని ‘డిజిటల్ మీడియా మేధావి’గా అభివర్ణించాడు రాహుల్. ‘మిస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్’లో శతవరికి ‘టాప్–10’ చోటు దక్కిన సందర్భంగా తన లింక్‌డ్ ఇన్ పోస్ట్‌లో సంతోషాన్ని వ్యక్తం చేశాడు రాహుల్.
‘ఈ గుర్తింపు ఏఐ ఇన్‌ఫ్లుయెన్సర్ కమ్యూనిటీకి జరా శతవరి చేసిన విశేష కృషిని తెలియజేస్తుంది. ప్రపంచ వేదికపై భారత్, ఆసియాకుప్రాతినిధ్యం వహించడం గొప్ప గౌరవంగా భావిస్తాను. శతవరి భారత్ నుంచి ఏకైక ఫైనలిస్ట్, ఆసియా నుంచి ఇద్దరిలో ఒకరు’ అని పోస్ట్‌లో స్పందించాడు రాహుల్.
కృత్రిమ మేధస్సు మంచి చెడుల గురించి చర్చ జరుగుతున్న సమయంలో ‘శతవరి’ని ఎలా చూడాలి?’ అనే ప్రశ్నకు ‘వందశాతం పాజిటివ్’గానే అనే సమాధానం వినిపిస్తోంది. అందం, సోషల్ మీడియాలోని అభిమాన గణం మాత్రమే శతవరి విలువకుప్రాతిపదిక కాదు. హార్మోన్ సమస్యల నుంచి కుంగుబాటు వరకు ఎన్నో అంశాలపై మహిళలకు అవగాహన కలిగిస్తుంది. కృత్రిమ మేధస్సులోని సానుకూల కోణానికి సంపూర్ణంగా అద్దం పడుతుంది.
‘ఏ.ఐ. సామర్థ్యం గురించి ప్రజలకు అవగాహన కలిగించడం ఆమె లక్ష్యం’ అంటున్నాడు జరా శతవరి సృష్టికర్త రాహుల్. కృత్రిమ మేధస్సు మంచి చెడుల గురించి చర్చ జరుగుతున్న సమయంలో ‘శతవరి’ పనితీరును ఎలా చూడాలి? ’ అనే ప్రశ్నకు ‘వందశాతం పాజిటివ్’గానే అనే సమాధానం వినిపిస్తుంది
శతవరి శక్తి ఇది...
– ఆన్‌లైన్ లెర్నింగ్ ప్లాట్‌ఫామ్స్‌లో ఏఐ–పవర్డ్ సోషల్ మీడియా స్ట్రాటజీ, ఎనాలటిక్స్ నేర్చుకుంది.
– 2023 నుంచి పీఎంహెచ్ బయోకేర్‌కు ‘బ్రాండ్ అంబాసిడర్’గా ఉంది.
– ‘ఇన్‌ఫ్లూయెన్సర్ మార్కెటింగ్ టాలెంట్ మేనేజర్’గా తన టాలెంట్‌ను చూపించింది.
– సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌గా ‘వావ్’ అనిపించింది. ఇన్‌స్టాగ్రామ్‌లో సుమారు 8000 మంది ఫాలోవర్‌లు ఉన్నారు.
– స్ట్రాటిజిక్ ప్లానింగ్, కంటెంట్ డెవలప్‌మెంట్, డేటా ఎనాలసిస్, బ్రాండ్ ఎవేర్‌నెస్, బ్రాండ్ అడ్వకసీ, ఇన్‌ఫ్లూయెన్సర్ మార్కెటింగ్, క్రియేటివ్ ఐడియేషన్, ట్రెండ్–సావి, హెల్త్ అండ్ వెల్‌నెస్ కన్సల్టింగ్, సోషల్ మీడియా మార్కెటింగ్, కంటెంట్ క్రియేషన్, ఫ్యాషన్ స్టైలింగ్, కెరీర్ డెవలప్‌మెంట్ లాంటి విభాగాలలో ప్రతిభ చాటుతోంది.
Comments
Please login to add a commentAdd a comment