
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వల్ల ఉద్యోగాలు పోతాయని గత కొంతకాలంగా చాలా మంది భయపడుతున్న సంగతి తెలిసిందే. అయితే కొంతమంది ఎప్పటికి ఉద్యోగులను ఏఐ రీప్లేస్ చేయలేదని, వృత్తుల్లో, వివిధ రంగాల్లో తప్పకుండా మనుషులు అవసరముందని చెబుతున్నారు.
గతంలో ఏఐతో ఉద్యోగులకు ముప్పు వాటిల్లుతుందని టెక్ దిగ్గజాలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశాయి. కానీ నిపుణులు మాత్రం ఏఐ ఉద్యోగుల పనితీరుని మెరుగుపరచడంలో ఉపయోగపడుతుందని చెబుతున్నారు. చాట్‌జీపీటీ టెక్నాలజీని ఉపయోగించి ఇప్పటికే కొన్ని సంస్థలు అభివృద్ధి బాటలో పయనిస్తున్నాయని, దీనికి కూడా తప్పకుండా ఉద్యోగుల అవసరం ఉందని తెలియజేస్తున్నారు.
ఇదీ చదవండి: రిలయన్స్ కొత్త ఆవిష్కరణ - కంపెనీల వెన్నులో వణుకు..
న్యూ టెక్నాలజీ మానవాభివృద్ధికి వినియోగించుకోవడం చాలా అవసరం, అయితే మనుషులే లేకుండా టెక్నాలజీని ఉపయోగించుకోవడం చాలా కష్టతరమనే చెప్పాలి. కావున కంపెనీలు ఏఐ నైపుణ్యాలను అందిపుచ్చుకునేలా చొరవ చూపుతున్నాయి. ఇందులో భాగంగానే ఉద్యోగుల నైపుణ్యాలను మెరుగుపరచాలి. కావున ఏఐ వల్ల ఉద్యోగాలు పోయే అవకాశం లేదని స్పష్టమవుతోంది.