ఉద్యోగులకు గుడ్ న్యూస్.. 'ఏఐ'పై ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ కీలక ప్రకటన | AI Will Not Replace Jobs: International Labour Organization Report - Sakshi
Sakshi News home page

ఉద్యోగులకు గుడ్ న్యూస్.. 'ఏఐ'పై ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ కీలక ప్రకటన

Published Mon, Aug 28 2023 10:46 AM | Last Updated on Mon, Aug 28 2023 11:07 AM

AI will not replace jobs International Labour Organization report - Sakshi

రాబోయే రోజుల్లో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI) వల్ల ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోయే అవకాశం ఉందని గత కొంతకాలంగా భయపడుతున్నారు. చాలా మంది నిపుణులు కూడా కృత్రిమ మేధ అనేక సమస్యలను తీసుకువస్తుందని అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇవన్నీ కేవలం అపోహ మాత్రమే అని ఐక్యరాజ్య సమితికి చెందిన 'ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్' (ILO) కొంత ఉపశమనం కలిగించింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

నిజానికి ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ చాలా రోజులు ముందు నుంచి ఉన్నప్పటికీ 'చాట్‌జీపీటీ' ఎంట్రీతో సంచలనంగా మారింది. అనతి కాలంలో చాలా కంపెనీలు దీని సాయంతోనే అభివృద్ధి పనులు వేగవంతం చేసుకున్నాయి. దీంతో తప్పకుండా ఉద్యోగాలు పోతాయని చాలామంది భయపడ్డారు. రానున్న రోజుల్లో లక్షల ఉద్యోగాలు కనుమరుగయ్యే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.

ఇప్పటికే చాలా కంపెనీలు ఏఐకి సంబంధించి ఉద్యోగులకు శిక్షణ కూడా ఇస్తుండంతో ఇది మరింత భయాన్ని కల్పించింది. అయితే ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ (ILO) ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఉద్యోగాలకు ఎలాంటి డోకా లేదని తేల్చి చెప్పింది.

ఇదీ చదవండి: కోట్లు సంపాదించేలా చేసిన భారత పర్యటన - ఇండియాలో అమెరికన్ హవా!

ఈ టెక్నాలజీ ఎప్పటికీ ఉద్యోగులను రీప్లేస్ చేసే అవకాశం లేదని వెళ్ళదీస్తూనే.. ఏఐ వల్ల భవిష్యత్ టెక్నాలజీ మరింత అద్భుతంగా ఉంటుందని చెప్పుకొచ్చింది. కావున ఉద్యోగుల తమ ఉద్యోగాలను కోల్పోతామనే అపోహ విడిచిపెట్టాలని తెలిపింది. ఎంత గొప్ప టెక్నాలజీ వచ్చిన అవన్నీ కొన్ని అంశాలకు మాత్రమే పరిమితమని స్పష్టం చేసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement