న్యూఢిల్లీ: కృత్రిమ మేథ (ఏఐ), కొత్త టెక్నాలజీలపై కలిసి పని చేసే దిశగా డిజిటల్ ఇండియా కార్పొరేషన్‌లో భాగమైన ఇండియా ఏఐ, మెటా ఇండియా ఒప్పందం కుదుర్చుకున్నాయి.
మెటా ఓపెన్–సోర్స్ ఏఐ మోడల్స్‌ను భారత్‌లో అందుబాటులోకి తెచ్చేందుకు కూడా ఇది తోడ్పడనుంది. ఏఐ స్టార్టప్‌లు, అధునాతన టెక్నాలజీలను ప్రోత్సహించేందుకు ఇరు సంస్థలు కలిసి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను ఏర్పాటు చేసే అవకాశాన్ని కూడా పరిశీలించనున్నాయి.
వ్యాపార సంస్థలు, స్టార్టప్‌లు, పరిశోధకులకు సాంకేతికతలను అందుబాటులోకి తేవడం వల్ల సామాజిక, ఆర్థిక వృద్ధికి అవకాశాలు లభించగలవని మెటా ప్రెసిడెంట్ నిక్ క్లెగ్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment