collaborate
-
మూడు దశాబ్దాల తర్వాత..?
హీరో రజనీకాంత్, దర్శకుడు మణిరత్నం కాంబినేషన్లో రూపొందిన ‘దళపతి’ (1991) బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన విషయం తెలిసిందే (మమ్ముట్టి, అరవింద్ స్వామి ఇతర లీడ్ రోల్స్‌లో నటించారు). ఆ చిత్రం తర్వాత రజనీకాంత్–మణిరత్నం మరో సినిమా చేయలేదు. అయితే ఇప్పుడు 33 ఏళ్ల తర్వాత రజనీకాంత్‌తో సినిమా చేయాలని మణిరత్నం ఓ కథ రెడీ చేశారని, మణిరత్నంతో సినిమా చేసేందుకు రజనీ కూడా ఆసక్తి చూపిస్తున్నారని టాక్. రజనీకాంత్ బర్త్ డే (డిసెంబరు 12) సందర్భంగా ఈ సినిమా గురించిన అధికారిక ప్రకటన వచ్చే చాన్స్ ఉందని కోలీవుడ్ భోగట్టా. మరి మూడు దశాబ్దాల తర్వాత రజనీకాంత్ – మణిరత్నం కాంబినేషన్లో సినిమా సెట్ అవుతుందా? వేచి చూడాల్సిందే. -
కొత్త టెక్నాలజీ దిశగా ఏఐ.. మెటాతో జట్టు
న్యూఢిల్లీ: కృత్రిమ మేథ (ఏఐ), కొత్త టెక్నాలజీలపై కలిసి పని చేసే దిశగా డిజిటల్ ఇండియా కార్పొరేషన్లో భాగమైన ఇండియా ఏఐ, మెటా ఇండియా ఒప్పందం కుదుర్చుకున్నాయి. మెటా ఓపెన్–సోర్స్ ఏఐ మోడల్స్‌ను భారత్‌లో అందుబాటులోకి తెచ్చేందుకు కూడా ఇది తోడ్పడనుంది. ఏఐ స్టార్టప్‌లు, అధునాతన టెక్నాలజీలను ప్రోత్సహించేందుకు ఇరు సంస్థలు కలిసి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను ఏర్పాటు చేసే అవకాశాన్ని కూడా పరిశీలించనున్నాయి. వ్యాపార సంస్థలు, స్టార్టప్‌లు, పరిశోధకులకు సాంకేతికతలను అందుబాటులోకి తేవడం వల్ల సామాజిక, ఆర్థిక వృద్ధికి అవకాశాలు లభించగలవని మెటా ప్రెసిడెంట్ నిక్ క్లెగ్ పేర్కొన్నారు. -
హైడ్రోజన్ ఆధారిత వాణిజ్య వాహనాల కోసం..టాటా మోటార్స్, కమిన్స్ జోడీ
ముంబై: ఇంజన్ల తయారీలో ఉన్న కమిన్స్, వాహన రంగ దిగ్గజం టాటా మోటార్స్ చేతులు కలిపాయి. హైడ్రోజన్ ఆధారిత వాణిజ్య వాహనాలకు కావాల్సిన ఇంటర్నల్ కంబషన్ ఇంజన్స్, ఫ్యూయల్ సెల్స్, బ్యాటరీ ఎలక్ట్రిక్ వెహికిల్ సిస్టమ్స్‌తో సహా ఉద్గార రహిత ప్రొపల్షన్ టెక్నాలజీ సొల్యూషన్స్‌ను ఇరు సంస్థలు కలిసి రూపకల్పన, అభివృద్ధి చేస్తాయి. టాటా మోటార్స్, కమిన్స్‌ల సంయుక్త భాగస్వామ్య కంపెనీ 1993 నుంచి ఇంజన్ల తయారీలో ఉంది. చదవండి: ఫోన్‌పే యూజర్లకు అలర్ట్: అందుబాటులోకి వచ్చిన ఈ సరికొత్త సేవలు తెలుసా! -
రాజధాని నిర్మాణానికి సహకరించండి
విజయవాడలో జరిగిన ఉగాది వేడుకల్లో కలెక్టర్ బాబు.ఎ విజయవాడ : నూతన రాజధాని అభివృద్ధికి ప్రజలు సహకరించాలని కలెక్టర్ బాబు.ఎ కోరారు. ఆంధ్రప్రదేశ్ భాషా సాంస్కృతిక శాఖ, కృష్ణాజిల్లా సాంస్కృతిక మండలి ఆధ్వర్యంలో విజయవాడలోని ఘంటసాల సంగీత కళాశాలలో శనివారం ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో కలెక్టర్ ప్రసంగించారు. స్వర్ణాంధ్రప్రదేశ్ కోసం సమష్టిగా కృషి చేస్తామని జాయింట్ కలెక్టర్ గంధం చంద్రుడు సభికులతో ప్రతిజ్ఞ చేయించారు. మునిసిపల్ కమిషనర్ వీరపాండియన్ మాట్లాడుతూ కృష్ణాజిల్లాను స్మార్ట్‌సిటీగా మార్చటానికి ప్రజలు కృషి చేయాలన్నారు. జెడ్పీ చైర్పర్సన్ గద్దె అనూరాధ, ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, కార్పొరేటర్ కొండపల్లి అనసూయ, కాకు మల్లికార్జున యాదవ్, సీనియర్ పాత్రికేయుడు తుర్లపాటి కుటుంబరావు తదితరులు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ముగింపు సభలో ఎంపీ కేశినేని నాని పాల్గొని ప్రసంగించారు. అనంతరం పలు సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. నాదస్వరం, వేదపఠనం, పంచాంగ శ్రవణం, కవి సమ్మేళనం జరిగాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కవులు వలివేటి శివరామకృష్ణ, ఆచార్య తమ్మారెడ్డి నిర్మల, సీహెచ్ బృందావనరావు, వి.ఉమామహేశ్వరి, పింగళి వెంకట కృష్ణారావు, పాణిగ్రాహి రాజశేఖర్, అవనిగడ్డ సూర్యప్రకాష్, మేరీ కృపాబాయి, ఎరుకలపూడి గోపీనాథరావు, కాటూరి రవీంద్ర త్రివిక్రమ్, కవయిత్రి శైలజ తదితరులు తమ కవిత్వంతో ఆకట్టుకున్నారు. పలువురు విద్యార్థులు తమ నృత్య ప్రదర్శనలతో అలరించారు. అనంతరం అతిథులకు ఉగాది పచ్చడి అందజేశారు. ఈ కార్యక్రమానికి న్యాయవాది వేముల హజరత్తయ్య గుప్తా వ్యాఖ్యాతగా వ్యవహరించగా, జిల్లా పౌరసంబంధాల అధికారి కె.సదారావు పర్యవేక్షించారు. నగర పరిధిలో వ్యక్తిగత మరుగుదొడ్లు కట్టించుకున్న వారికి, ఈ-పోస్ విధానం అమలుచేస్తున్న డీలర్లకు ప్రభుత్వం పురస్కారాలు అందజేసింది. రాజధాని నిర్మాణాం, కలెక్టర్ బాబు.ఎ, సహకరించండి,