మూడు దశాబ్దాల తర్వాత..? | Rajinikanth and Mani Ratnam to collaborate after 33 years | Sakshi
Sakshi News home page

మూడు దశాబ్దాల తర్వాత..?

Published Mon, Oct 7 2024 6:00 AM | Last Updated on Mon, Oct 7 2024 6:01 AM

Rajinikanth and Mani Ratnam to collaborate after 33 years

హీరో రజనీకాంత్, దర్శకుడు మణిరత్నం కాంబినేషన్‌లో రూపొందిన ‘దళపతి’ (1991) బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన విషయం తెలిసిందే (మమ్ముట్టి, అరవింద్‌ స్వామి ఇతర లీడ్‌ రోల్స్‌లో నటించారు). ఆ చిత్రం తర్వాత రజనీకాంత్‌–మణిరత్నం మరో సినిమా చేయలేదు. అయితే ఇప్పుడు 33 ఏళ్ల తర్వాత రజనీకాంత్‌తో సినిమా చేయాలని మణిరత్నం ఓ కథ రెడీ చేశారని, మణిరత్నంతో సినిమా చేసేందుకు రజనీ కూడా ఆసక్తి చూపిస్తున్నారని టాక్‌. 

రజనీకాంత్‌ బర్త్‌ డే (డిసెంబరు 12) సందర్భంగా ఈ సినిమా గురించిన అధికారిక ప్రకటన వచ్చే చాన్స్‌ ఉందని కోలీవుడ్‌ భోగట్టా. మరి మూడు దశాబ్దాల తర్వాత రజనీకాంత్‌ – మణిరత్నం కాంబినేషన్‌లో సినిమా సెట్‌ అవుతుందా? వేచి చూడాల్సిందే.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement